November 27, 2013


 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులపంట రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంతో పాటు వివిధ చోట్ల హెలెన్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుపాన్‌ వస్తే ప్రభుత్వం కనీసం సహాయ చర్యలు కూడా చేపట్ట లేదని ఆవేదన వ్యక్తం చేవారు. డెల్టా ఆధునీకరణ పనుల్లో రూ. కోట్ల దోపడీ జరిగిందని, అందుకే రైతులు పంటలను నష్టపోతున్నారని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బాధితుల గోడు పట్టదని విమర్శించారు. ఏ పనిచేసినా రాజకీయ కోణంలో చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తుపాన్‌ను కూడా పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ నేతలు అంతఃకలహాలతోనే మునిగి తేలు తున్నారని ఆరోపించారు.

రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇంచార్జిలు ప్రజలతో మమేకం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్టీ విధానాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అం దించాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చె ందిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల కడగండ్లు తీరుస్తానని నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అంతర్వేదిలో లక్ష్మిననసింహ స్వామి వారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు చిక్కాల రామచంద్రరావు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గొల్లపల్లి సూర్యారావు, నిమ్మకాయల చినరాజప్ప, యర్రా నారాయణ స్వామితో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీల ఇం చార్జిలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అధికారంలోి రాగానే పంట రుణాలు మాఫీ చేస్తాం

తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపలేమని భావించి, ఆ భయంతోనే విభజన పేరుతో ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ కొత్త వాదం ప్రవేశపెట్టారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.ఆమె అతి తెలివి ఫలించదని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో సోనియాకు ముఖం చెల్లడంలేదు. అందుకే ఇక్కడకు రావడంలేదు. జగన్ ముసుగులో వస్తున్నది. ఈ ముసుగు తీసి చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లేనని ఆయన హెచ్చరించారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లే...........

November 18, 2013

ఎన్టీఆర్ పరిచయం అవసరం లేని పేరు. రాముడు,కృష్ణుడు లాంటి దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇలాగే ఉంటారేమో నని ఆయన రూపం తెలిపింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతను ఓ సంచలనం. భారత చలన చిత్ర చరిత్రలో సంచలనం. ఆ నటుడు వేయని పాత్ర లేదు. అజరామరమైన చిత్ర రాజాలను ఎన్నింటినో అందించారు. స్టూడియో అధినేతగా, నిర్మాతగా ,దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సంచలనాలను సృష్టించాడు ఎన్టీఆర్. రాష్ట్రంలో వేళ్ళూనుకు పోయిన కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ తీసాడు. తెలుగుదేశం పార్టీ ని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు ల్లోకి ఎక్కాడు. దట్ ఈస్ ఎన్టీఆర్. అంతేకాదు లోక్ సభ లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా టి డి పి ని నిలబెట్టారు ఎన్టీఆర్. భారత దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది ఒక్క ఎన్టీఆర్ వల్లే సాధ్య మైంది. రాష్ట్రంలో పెను మార్పులు రాజకీయ రంగంలో వచ్చాయంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు దగ్గరయ్యారు. జాతీయ స్థాయిలో పలు పార్టీ లను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసారు. తెలుగు వాడి సత్తా ఏంటో ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్. అనితర సాధ్యమైన విజయాలెన్నింటినో అలవోకగా అందుకున్న కారణజన్ముడు ఎన్టీఆర్. సినిమా రంగంలో, రాజకీయ రంగం లో సంచలనాలను సృష్టించిన ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డ్ ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. రాజకీయ కారణాల వల్లే ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వలేదు. భారత రత్నకు నూటికి నూరు పాల్లు అర్హుడు ఎన్టీఆర్. ఇకనైనా ఆ మహనీయుడిని గౌరవించుకుందాం.

ఎన్టీఆర్ కు భారత రత్న ఎప్పుడు..?

November 17, 2013

తెలుగుదేశం పార్టీ కూడా హైదరాబాద్ లో బహిరంగ సభ జరుపుతోంది. ఆత్మగౌరవ యాత్ర ను ప్రారంబిద్దామని ఆలోచించిన టిడిపి ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుని బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల ఇరవైఆరున హైదరాబాద్ లో కూడా సభ ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈనెల 21న తిరుపతి, 22న నెల్లూరు, 23న ఒంగోలు, 24న గుంటూరు, 25న కృష్ణా జిల్లా, 26న హైదరాబాద్‌లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే గాలిముద్దుకృష్ణమనాయుడు తెలియచేశారు.

హైదరాబాద్ లో టిడిపి బహిరంగ సభ!

విభజనకు కారకులైన కాంగ్రెస్ పార్టీ, దాంతో ఒప్పందం చేసుకున్న వైసిపిలను సీమాంధ్ర నుంచి తరిమికొట్టాలని టిడిపి ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. వైసిపి అండతోనే రాష్ట్రవిభజన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని ఆరోపించారు. వైసిపికి ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లేనని ఆయనవ్యాక్యానించారు.

వైసిపికి ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే