May 31, 2013అహ్లూవాలియా రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశంసించడం వెనుక కిరణ్ తప్పుడు సమాచారం ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రం అవినీతిలో కొట్టిమిట్టాడుతుంటే అభివృద్ధి పథంలో నడుస్తుందనడం హాస్యాస్పదమని యనమల అన్నారు. బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత పథకాలకు కోత విధించి, కొత్త పథకాలు పెడతారా లేక ప్రజలపై మరోసారి పన్నుల భారం విధిస్తారా సిఎం స్పష్టం చేయాలని కోరారు. అహ్లూవాలియా మాటవరుసకు అన్న మాటలను ఏదో ప్రశంసించినట్లు సిఎం పేర్కోవడం గర్హనీయమని యనమల వ్యాఖ్యానించారు.

సిఎంపై యనమల విమర్శలు


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో నేతల ఇళ్ల చుట్టు తిరుగుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి శుక్రవారం విమర్శించారు. తెలంగాణపై తీర్మానం తెచ్చే శక్తి కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. కెసిఆర్ ఉద్యమాన్ని వదిలి పెట్టి నేతల ఇళ్ల చుట్టు తిరుగుతూ.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్లుగా టిక్కెట్ల పేరుతో గాలం వేస్తున్నారన్నరు.

ఒకప్పుడు తెలంగాణకు చెన్నారెడ్డి, వెంకట స్వామిలు మోసం చేస్తే, ఇప్పుడు కెసిఆర్, కాకా తనయులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస నేత కెసిఆర్ ప్రాంతీయ వాదానికంటే వలసలకే ప్రాధాన్యం ఇస్తున్నార్ననారు. ఉద్యమానికి ప్రజలు కావాలి, టిక్కెట్లకు ఇతర పార్టీల నేతలు కావాలా... ఇదేనా ఉద్యమ స్ఫూర్తి అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ నిజంగా తెలంగాణను కోరుకుంటే టిడిపితో కలిసి రావాలన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తే ఊరూరా విగ్రహాలు పెడతామని, జేబులో ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతామని పెద్దిరెడ్డి అన్నారు. తెరాసలోకి వెళ్లేవారంతా పదవుల కోసమే వెళ్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే జెఏసి కింద స్వతంత్ర ఉద్యమానికి కెసిఆర్ సిద్ధం కావాలన్నారు.

వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో నేతల ఇళ్ల చుట్టు కెసిఆర్: పెద్దిరెడ్డి

హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి యస్ అన్నాకే అవినీతి జరిగిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును సిబిఐ క్షుణ్ణంగా విచారించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కోరారు. జగన్‌కు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన డైరెక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే అన్నారు. జగన్ అవినీతిలో వైయస్ పాత్ర ఎంత వరకు ఉందో వెలికితీయాలన్నారు. ఆయన మృతి చెందాడన్న సానుభూతి అవినీతిని నిగ్గుతేల్చే విషయంలో పనికి రాదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

May 30, 2013

బడుగు, బలహీనవర్గాలకు వేదిక తెలుగుదేశం అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతే రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా గుర్తింపు లభించిందని గుర్తు చేశారు. ఈ సారి ఎన్నికల్లో బీసీలకు ఖచ్చితంగా100 సీట్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. బీసీలకు 100 సీట్లు ఇస్తామని ముందే ప్రకటించిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనన్నారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ బీసీ మహాసభ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బీసీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చేయడానికి నిర్ధిష్ట ప్రతిపాదనతో తాము బీసీ డిక్లరేషన్‌ ప్రకటించామని గుర్తు చేశారు.

బీసీ డిక్లరేషన్‌ను తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చుతామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, ఈసారి కూడా అదే పద్దతిలో అన్ని సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు లభించాలన్నది తమ పార్టీ అభిప్రాయమని, అందుకే చట్టసభల్లో మూడవ వంతు టికెట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలయితే బీసీల రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. అంతకంటే ముందే ఆచరణలో చేసి చూపించాలని టీడీపీ భావిస్తోందన్నారు. బీసీ కులాలను ఆర్ధికంగా రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. అందుకే వారికి 100 టికెట్లు, 10 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. బీసీలకు టీడీపీ మొదటి నుండి ప్రాధాన్యతనిస్తోందని, అలాగే బీసీలు సైతం టీడీపీకి దన్నుగా నిలిచారన్నారు. ఈ సారి టీడీపీ గెలుపు కోసం బీసీలు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. టీడీపీ ప్రవేశపెట్టిన మండలిక వ్యవస్థ ద్వారా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిందని మహాసభ ప్రతినిధులతో ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేయాలని, మరిన్ని టికెట్లు బడుగులకు ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు.

బడుగుల ‘దేశం’

'తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకు రాజకీయంగా గుర్తింపు వచ్చింది. బీసీలకు ఈసారి ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ టిడిపి' అని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ బీసీ మహాసభ ప్రతినిధి బృందం ఆయనను కలిసి తమ సమస్యలపై మాట్లాడింది. మహాసభ అధ్యక్షుడు అవ్వారు మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో ఈ బృందం వచ్చింది.

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు చొరవ తీసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వాలని ఈ బృందం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసింది. బీసీలను సామాజికంగా, రాజకీయంగా ఆర్ధికంగా పైకి తేవడానికి నిర్దిష్ట ప్రతిపాదనలతో తాము ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశామని, బీసీలకు వంద సీట్లు...పది వేల కోట్ల నిధులతో ఈ డిక్లరేషన్ రూపొందిందని చంద్రబాబు వారికి చెప్పారు. ఈ డిక్లరేషన్‌ను తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేరుస్తామని ఆయన వారికి చెప్పారు. 'తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఈసారి ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాల వారికి టిక్కెట్లు ఇవ్వడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం.

బీసీలకు వారి జనాభా దామాషాలో టిక్కెట్లు లభించాలన్నది టిడిపి కోరిక. చట్టసభల్లో రిజర్వేషన్లు లభిస్తే బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది. అవి వచ్చేలోపే మా పార్టీ తరపున మొత్తం సీట్లలో మూడో వంతు టిక్కెట్లు బీసీలకు ఇవ్వాలని మేం నిర్ణయించుకొన్నాం. గెలిచే అభ్యర్ధులు ఎవరైనా ఉంటే మీరు కూడా మాకు సూచించండి. మేం తప్పక పరిశీలిస్తాం' అని ఆయన వారితో అన్నారు. ఆర్దికంగా బీసీ కులాల వారిని పైకి తేవాల్సిన అవసరం ఉందని, అందు కోసమే రూ. పది వేల కోట్లతో ప్రత్యేకంగా బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నది తమ పార్టీ ఆలోచన అని ఆయన వారితో చెప్పారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీలకు బాగా ప్రాధాన్యం ఇస్తోందని, మండల వ్యవస్ధను టిడిపి తేవడంతో కింది స్ధాయి నుంచి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగిందని బీసీ మహాసభ ప్రతినిధులు ఆయనతో అన్నారు.

టీడీపీ బీసీల పార్టీ : చంద్రబాబు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాలేదని ఆ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని తపబట్టారు. దేశాన్ని దోచుకున్న దొంగలందరూ కలిసి సంఘంగా ఏర్పడి ధర్నాలు చేస్తే దేశ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిపలు చెరిగారు. సీఎం కిరణ్‌కు పాలన అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. బుధవారం కాకినాడకు చెందిన పోతుల విశ్వం టీడీపీ అధినేత నివాసంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన కార్యకర్తల నుద్దేశించి బాబు ప్రసంగించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ఆఖరికి జైళ్లనూ వదల్లేదని ఆరోపించారు. అక్రమార్కులు జైలులో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా రని, తాగుడు, నీలి చిత్రాలు చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి, ప్రజల సొత్తును దోచుకొని జైలుపాలైన జగన్‌కు బెయిల్ రాలేదని వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేయడం దారుణమన్నారు. అక్రమార్కులు, అవినీతిపరులు, దొంగలు రోడ్లపై ధర్నాలు చేస్తూ దేశాన్ని ఎటు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దొంగలందరూ కలిసి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. వీరిని చూసి హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా? నిజాయితీగా పని చేస్తున్న సీబీఐకి వ్యతిరేకంగానా? వైఎస్సార్‌సీపీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. బెయిల్ ఇవ్వకపోతే పిల్ల కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్లలాగా తాము దోచుకొని పత్రికలు, చానెళ్లు సంపాదించలేదని చంద్రబాబు అన్నారు. టీడీపీకి పత్రికలు, చానెళ్లు లేవని.. కార్యకర్తలే పత్రికలు, చానెళ్లలాగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తాను వారిలాగా అవినీతికి పాల్పడలేదని.. నిపలా బతికానని, అందుకే తనపై ఎన్ని కేసులు వేసినా నిలబడలేదన్నారు. అవినీతిపై వైఎస్ ఉన్నపడు పోరాడానని, ఇపడు పోరాడుతున్నానని చెప్పారు. సీఎం కిరణ్‌పైనా బాబు నిపలు చెరిగారు. పరిపాలన చేతగాని సీఎం వసూళ్లకు తెరలేపరాని ఆరోపిం చారు. ఆయన సోదరులను రాజ్యాంగేతర శక్తిగా మార్చారన్నారు. అభివృద్ధి పనుల నిధుల నుంచి కవిూషన్లు తీసుకుంటున్నారని, కాం ట్రాక్టర్ల నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. వాళ్లు ఫైళ్లు తీసుకొని వస్తే.. ముఖ్యమంత్రి సంతకాలు చేస్తున్నారన్నారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ముందుంది మంచి కాలం అని ప్రభుత్వం అంటోందని.. అలా అంటే ఇపడు ఉన్నది చెడ్డకాలమనేగా? అని ప్రశ్నించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు విరుచుకుపడ్డారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పడవేయా లని ఇప్పటిదాకా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నిన మూడు ప్రధాన పార్టీలను మహానాడులో తెలంగాణ ప్రస్తావనకు అనుమతించటం ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమర్థంగా తిప్పికొట్టగలిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణపై మాట్లాడే హక్కు తమకే ఉందని ఢంకా బజాయించి చెప్పే టీఆర్‌ఎస్‌, తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ తామే అని, స్పష్టమైన అవగాహన ఉన్నదని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటా మంటూనే ఇప్పటిదాకా ఏదీ తేల్చని కాంగ్రెస్‌, తెలంగాణ ఇవ్వాల్సింది కాంగ్రెస్‌ కాబట్టి తమకెలాంటి సంబంధం లేదన్న ధోరణి అనుసరిస్తున్న వైకాపాను తెలుగుదేశం పార్టీ మహానాడు సమర్థంగా ఎదుర్కున్నదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గత మహానాడులకు భిన్నంగా ఈసారి తెలంగాణ ప్రస్తావన తీసుకురావటం, గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పటం, కాంగ్రెస్‌ పార్టీ దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేయటం ద్వారా తెలంగాణ ప్రాంతంలో పార్టీ పుంజుకునేందుకు పునాదులు గట్టిపడ్డాయన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తమవుతోంది.

టీఆర్‌ఎస్‌కు చెక్‌
మహానాడులో తెలంగాణ ప్రస్తావన తీసుకురావటం ద్వారా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటిదాకా చేసిన అన్ని సవాళ్ళనూ టీడీపీ ఎదుర్కున్నట్టయింది. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతి అని ఒకసారి, తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న చంద్రబాబు అనుకూలం అని ఎందుకు చెప్పటం లేదంటూ మరోసారి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తుతూ వచ్చారు. చాలాకాలంగా ఏ సభ జరిగినా కేసీఆర్‌, ఇతర పార్టీ నేతలు ఏ సభ జరిగినా, కార్యక్రమం జరిగినా దీన్నో పెద్ద ఆయుధంగా ఉపయోగించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రెండు ప్రాంతాల నేతలతోనూ చంద్రబాబు చెప్పించారో, అప్పటినుంచి టీఆర్‌ఎస్‌ విమర్శలు మరో కోణం నుంచి ప్రారంభమయ్యాయి.

వ్యతిరేకం కాదని చెప్పటం తప్ప అనుకూలం అనరెందుకని ప్రశ్నించటం మొదలెట్టారు. తెలంగాణకు ప్రథమ శత్రువులలో కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం పార్టీని చేర్చాల్సిందే అని స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ రెండు పార్టీలను బొంద పెడితే తప్ప తెలంగాణ రాదని పదేపదే చెబుతూ వచ్చారు. ఎప్పుడైతే మహానాడు ప్రారంభం కానున్నట్టు ప్రచారం మొదలైందో టీఆర్‌ఎస్‌ స్వరం మారిపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌, ఇటీవల బాన్స్‌వాడలో జరిగిన శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ దమ్ముంటే మహానాడులో తెలంగాణపై తీర్మానం పెట్టాలని సవాల్‌ విసిరారు. టీడీపీ దాన్ని స్వీకరించి తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించటంతో పాటు తమ వైఖరి ఏమాత్రం మారలేదని, కేంద్రానికి ఇచ్చిన లేఖకు, అఖిలపక్షంలో చెప్పిన మాటలకూ కట్టుబడి ఉన్నామ నటం తో టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆత్మ రక్షణలో పడిపోయి నట్టయిం దన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగానే మహానా డు ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్‌ స్వరం మారిపో యింది. తెలంగాణపై టీడీపీ అభిప్రాయం అస్పష్టంగా ఉందని, పార్లమెంటులో టీ బిల్లు పెట్టాలని ఎందుకు డిమాండ్‌ చేయలేదనీ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది.

పుంజుకునేందుకు అవకాశం
టీఆర్‌ఎస్‌ వాదనఎలా ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ బలం తగ్గకుండా వీలైతే మరింత పెంచుకునేందుకు మహానాడు వ్యూహం తోడ్పడుతుందన్న ధీమాతో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో మహాకూటమి ఏర్పాటు చేసి తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌, వామపక్షాలు కలసి పోటీ చేసినప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ కన్న టీడీపీ ఎక్కువ స్థానాలు సాధించింది. మహానాడులో తెలంగాణ ప్రస్తావన తీసుకురావటం ద్వారా తమ బలం ఈసారి అంతకన్న పెరుగుతుందని, టీఆర్‌ఎస్‌ దూకుడుకు చెక్‌ పెట్టేందుకు తోడ్పడుతుందని టీడీపీ తెలంగాణ ప్రాంత నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌, వైకాపాకు
ఇక తెలంగాణపై నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న కాంగ్రెస్‌, తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్న వైకాపాను దెబ్బ కొట్టేందుకు మహానాడు వ్యూహం కచ్చితంగా ఉపయోగపడుతుందని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. తెలంగాణ తెచ్చేదీ, ఇచ్చేదీ తామే అని ఇంతకాలం నుంచి కాంగ్రెస్‌ పార్టీ జనాన్ని మభ్యపెడుతూ వచ్చిందని, ఈ మాటలను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలే అంటున్నారని, అలాంటప్పుడు తమ మహానాడు వ్యూహం విజయవంతమైనట్టే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఏదో ఒకటి తేల్చుకోక తప్పని అనివార్య పరిస్థితిని సృష్టించామని, ఆ రకంగా కాంగ్రెస్‌ను చక్రబంధంలో పడవేసినట్టే అని నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు వైకాపాను సైతం ఇరకాటంలోకి నెట్టేశామంటున్నారు. ఇప్పటిదాకా ఆ పార్టీ నాయకత్వం తెలంగాణ విషయంలో పొడిపొడి మాటలు మాట్లాడటం, కాంగ్రెస్‌ నాయకత్వంపై నెపం నెట్టివేయటం మినహా పార్టీ వైఖరి ఏమిటో వెల్లడించని నేపథ్యంలో వైకాపా ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి సృష్టించామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్‌ నేతలు వ్యాఖ్యానించారు.

ఒకే దెబ్బకు మూడు పిట్టలు

వచ్చే ఎన్నికల్లో జయం మనదేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రేపు జరగబోయే స్థానిక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువతకు ప్రకటించిన 33 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అవసరమైన చోట సీనియ ర్లకు నచ్చ చెప్పి యువతకు సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యువత మేధ సంపత్తికి దేశంలో కొదవ లేదని, అవకాశం ఇస్తే ఆదరగొట్టేస్తా రన్నారు. పార్టీలో అందర్ని పరుగెత్తిస్తారని నవ్వుతూ ఆయన వ్యాఖ్యానించారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకా యల విజయ్‌ చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందిం చారు.విజయ్‌కు అవకాశం ఇవ్వగానే ఆహుతులను కట్టిపడేసే విధంగా మాట్లాడగలిగారని, అలాగే యువతకు ఎవరికీ అవకాశామిచ్చిన ఆకట్టుకోగ లరని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీరామారావు యువతకు అవకాశాలిచ్చి ప్రోత్సాహించా రన్నారు. ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు చిన్న వయస్సులోనే రాజకీయావకాశమిచ్చి ప్రోత్సాహించింది ఎన్టీ రామారావేనని గుర్తు చేశారు. అప్పటికింకా ఆయనకు పెళ్లికూడా కాలేదన్నారు.ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత యువత భుజస్కంధాలపైనే ఉందన్నారు. ఎన్టీఆర్‌ క్రమశిక్షణకు మారుపేరని, ఆయన ఏ పనినైనా చిత్తశుద్ధితో చేసేవారన్నారు. సినీరంగంలో, రాజకీయరంగంలోనూ అదే క్రమశిక్షణతో పనిచేసి ఉన్నతశిఖరాలు అధిరోహించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఒక యుగపురుషుడు, ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చారన్నారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్టీరామారావు హయాంలో వైద్యులు, న్యాయవాదులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

ఈ రోజు నేరస్థులు రాజకీయాల్లోకి అడుగిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫ్లెక్సీల రగడ ఎందుకు వచ్చింది...ఎన్టీఆర్‌ బొమ్మను ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నారని...అది కూడా దోపీడీ దొంగల సరసన మహానుభావుడు ఎన్టీరామారావు బొమ్మ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే బాధేస్తోందన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నవారి పక్కన ఎన్టీఆర్‌ బొమ్మ పెడితే ఎలా సహించామంటారంటూ శ్రేణులను ప్రశ్నించారు. దీనిపైనే మా బాధ, ఆవేదన వ్యక్తం చేశామన్నారు.

యువతకు 33 శాతం సీట్లు

 తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 32వ 'మహానాడు' ముగిసింది. ఊహించని రీతిలో 13వేల మంది ప్రతినిధులుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇంకా నమోదు చేసుకోని వారి సంఖ్య ఇథమిద్దంగా తెలియడం లేదు. వారు కూడా గణనీయ సంఖ్యలో ఉంటారని టీడీపీ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో నిర్వహించే మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తొలి నుంచి అధినేత చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చారు. అదే రీతిలో సమావేశంలో ఏకంగా 14తీర్మానాలు చేశారు. ఎన్నికల సంవత్సరానికి శ్రేణులను సిద్ధం చేసే దిశలో 75శాతం పనిని పూర్తి చేశారు. అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు అంతులేని ఆత్మ విశ్వాసం నూరి పోశారు. గెలుపు లక్ష్యంగా ముందుకు సాగండి. ఎన్ని అవాంతారాలు ఎదురైనా సరే! అన్నింటికి నేనున్నాను. అన్ని విధాలా ఆదుకుంటాను అని వారికి భరోసా ఇచ్చారు. దేవుడిచ్చిన శక్తి ఉడిగిపోయేదాకా పని చేస్తాను అంటూ యువతను ఆకర్షించారు. తొలిసారిగా ఆయన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని చెప్పారు.

గెలుపుపై ధీమా

అధికారానికి దూరమైన ఆ పార్టీ శ్రేణులు ఒకింత నిర్వేదంలోనే ఉన్నాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు సుదీర్ఘ పాద యాత్ర ప్రారంభించారు. ఆయన యాత్ర కొనసాగిన ప్రాంతాల్లో మార్పు స్పష్టంగానే కన్పించింది. ఇక మహానాడుకు వచ్చిన అనూహ్య జన స్పందన అధినేతకు ఆనందాన్ని ఇచ్చింది.

'యువ మంత్రం'

ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్‌ చేరిక రోజే రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు మహానాడు వేదికగా యువత హృదయాలను కొల్లగొట్టేందు చేసిన ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అయిందనేది మరి కొన్ని రోజులు వేచి చూస్తేగానీ తెలియదు. చింతకాయల విజయ్‌, టి. వీరేంద్రగౌడ్‌, కింజరపు రామ్మోహన్‌ రావు లాంటి యువకుల సరసన కుమారుడు లోకేష్‌ను సభికుల్లో కూర్చోపెట్టడం ద్వారా విమర్శలకు బదులు చంద్రబాబు కోరుకునే ప్రచారాన్ని పుష్కలంగా పొందారు.

దేశంలో 'మహా' జోష్‌!

May 29, 2013


   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జైల్లోనే అన్ని జరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత విశ్వం  బుధవారం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు బెయిల్ రాకపోవడంతో ఆందోళనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు.  జగన్ పార్టీ నిరసనలు చేపట్టడం సిగ్గు చేటు అన్నారు. దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా అన్నారు.  తెలుగుదేశం పార్టీకి పత్రికలు, టీవి ఛానళ్లు లేవని, కార్యకర్తలే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని  ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన తెలియని వ్యక్తి అన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి తమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారని, వాళ్లు ఫైళ్లు తీసుకు వస్తే కిరణ్ సంతకాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని కోరారు.  వైయస్ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయన్నారు.

జైల్లో అన్ని జరిగిపోతున్నాయి వైసీపీపై చంద్రబాబు ధ్వజం వసూళ్లకు పాల్పడుతున్న సీఎం : బాబు


'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రకు కొనసాగింపుగా జూలైనుంచి బస్సుయాత్ర చేపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పది నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజలను కలవనున్నట్లు ఆయన తెలిపారు. పాదయాత్ర చేయని చోట్ల బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. గండిపేటలో మహా నాడు రెండోరోజు పార్టీ సంస్థాగత వ ్యవహారాలపై చర్చలో ఆయన మాట్లాడారు. వచ్చే పదినెలలు పార్టీకి కీలకమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బస్సు యాత్రకు సమాంతరంగా పార్టీ యంత్రాంగమంతా ప్రజల్లో ఉండేవిధంగా జూన్ 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. "ఇంటింటి కీ వెళ్లండి. అవినీతి, కుంభకోణాలతో అభివృద్ధి ఎలా దెబ్బతినిపోతోందో.. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎలా నిలిచిపోతున్నాయో వివరించండి. మనం గెలిస్తే ఏంచేస్తామో చెప్పం డి. మన డిక్లరేషన్లలోని అంశాలను వివరించండి. మంచి పాలన కోసం టీడీపీ అధికారంలోకి రావాలని చాటండి. పార్టీ లో ప్రతి ఒక్కరం ఈ పదినెలలు రాత్రింబవళ్లు కష్టపడదాం. పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటాను'' అని హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు.
'పార్టీకి మంచి నాయకులున్నారు. కానీ, విభేదాలు పక్కన పెట్టాలి. భేషజాలు, ఇగోలు వద్దు. మన కుటుంబంలో తేడాలొస్తే బయటపడకుండా దిద్దుకుంటాం. పార్టీ లోనూ అలాగే ఉండాలి. అందరినీ కలుపుకొని పోవాలి. అం దరినీ గౌరవించాలి. మనలో మనం కొట్టుకుంటూ ఓటు వేయాలని కోరితే ప్రజలు హర్షించరు. ఇన్‌చార్జీలుగా ఉన్న నేతలు కూడా మారాలి. బాగా పనిచేయాలి. ఇంట్లో పడుకొని గాలి వస్తే గెలుస్తామనుకుంటే అందరం మునిగిపోతాం. పని చేయని ఇన్‌చార్జీలను మార్చడానికి వెనుకాడను.
ఇటీవలి సహకార ఎన్నికల్లో వాటిని పట్టించుకొన్న వారంతా మంచి ఫలితాలు సాధించారు. వదిలివేసిన వారున్న ప్రాంతాల్లోనే మనకు ఫలితాలు రాలేదు. కార్యకర్తలకు పదవులు వచ్చే ఎన్నికలను పట్టించుకోకుండా.. మన ఎన్నికలకు మాత్రం పనిచేయాలంటే వారికి మాత్రం ఏం అవసరం? మనం పట్టించు కోకపోతే వారు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు?' అని వ్యాఖ్యానించారు. కరెంటు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 1.80 కోట్ల సంతకాలను అసెంబ్లీలో ప్రదర్శిస్తామని, తర్వాత సీఎం లేదా గవర్నర్‌కు సమర్పిస్తామని చంద్రబాబు తెలిపారు. ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని కేడర్‌కు సూచించారు.
'గుర్తు'తోనే స్థానిక ఎన్నికలు
దమ్ముంటే స్థానిక ఎన్నికలను పార్టీ ప్రాతిపదికన నిర్వహించాలని ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. ఆయారాం.. గయారాంల కోసం పార్టీ గుర్తు లేకుండా ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తా రు. పార్టీ గుర్తుపై ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో వెనుకబడినవర్గాలకు 50 శాతం స్థానాలను రిజర్వ్ చేయాలని డిమాండ్ చేశారు. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందని, వైసీపీ వెలవెలబోయిందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నిక ల్లో సైకిల్ జోరు పెంచాలని, అసెంబ్లీ ఎన్నికల విజయానికి ఈ ఫలితాలతోనే నాంది కావాలని పిలుపునిచ్చారు.
దోపిడీ దొంగ పక్కన ఎన్టీఆర్ ఫొటోలా?
"ఎన్టీఆర్ చారిత్రక పురుషుడు. శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నా, శ్రీకృష్ణుడన్నా ఆయనే కళ్లలో మెదులుతారు. భవిష్యత్తులోనూ ఎన్టీఆర్‌ను ఎవరూ అధిగమించలేరు. అలాంటి ఎన్టీఆర్ ఫొటో పక్కన లక్షకోట్లు దోచుకున్న జగన్‌వంటి వ్యక్తు ల ఫొటోలు పెట్టడమా?'' అని చంద్రబాబు ఆగ్రహించారు. ఎన్టీఆర్ ఫొటోను ఎవరు పెట్టుకున్నా ఫర్వాలేదని, అటువం టి దొంగలు పెట్టుకోవడం దారుణమని మండిపడ్డారు. అవినీతిని కడిగేసేందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీని మరింత బలోపేతం చేయడానికి విద్యాధికులంతా ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగించుకుని పార్టీలో ఉత్తేజం నింపడంతోపాటు మేధావులు, విద్యార్థులు, యువతను ఆకర్షిద్దామన్నారు.

ఇక బస్సు యాత్ర జూలైలో ముహూర్తం.. పది నెలలు జనంలోనే


హైదరాబాద్ : జగన్‌కు బెయిల్ రాలేదని వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గు చేటు అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దొంగలందరూ సంఘంగా ఏర్పడి ధర్నాలు చేస్తే దేశ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం కిరణ్‌కు పరిపాలన అంటే ఏమిటో తెలియదని ఎద్దెవా చేశారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలని సీఎం వసూళ్లు ప్రారంభించారని ఆరోపించారు. కార్యకర్తలే పేపర్లు, చానెళ్లుగా మారి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

వైసీపీ నిరసనలు చేపట్టడం సిగ్గుచేటు:బాబు

హైదరాబాద్‌ : కాకినాడకు చెందిన పోతుల విశ్వం బుధవారం టీడీపీలో చేరారు. ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు విశ్వంను సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలో చేరిన పోతుల విశ్వం

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టై ఏడాది పూర్తయినందున దానిని నిరసిస్తూ ఆ పార్టీ చేసిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. బెయిల్ రాలేదని జగన్ పార్టీ నిరసనలు చేపట్టడం సిగ్గు చేటు అన్నారు.

దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలన్నారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా అన్నారు.

బెయిల్ ఇవ్వకపోతే పిల్ల కాంగ్రెస్ ఆందోళనలు విడ్డూరమన్నారు. తెలుగుదేశం పార్టీకి పత్రికలు, టీవి ఛానళ్లు లేవని, కార్యకర్తలే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన తెలియని వ్యక్తి అన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి తమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారన్నారు. వాళ్లు ఫైళ్లు తీసుకు వస్తే కిరణ్ సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని కోరారు. ముందుంది మంచి కాలం అని ప్రభుత్వం అంటోందని, అలా అంటే ఇప్పుడు ఉన్నది చెడ్డకాలం అనేగా అన్నారు. వైయస్ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయన్నారు. జైల్లో తాగుడు, బ్లూ ఫిలిమ్స్ చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా బాబు సమక్షంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత విశ్వం టిడిపిలో చేరారు.

దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే....

May 28, 2013

వచ్చే ఎన్నికల్లో జయం మనదేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రేపు జరగబోయే స్థానిక, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువతకు ప్రకటించిన 33 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. అవసరమైన చోట సీనియ ర్లకు నచ్చ చెప్పి యువతకు సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యువత మేధ సంపత్తికి దేశంలో కొదవ లేదని, అవకాశం ఇస్తే ఆదరగొట్టేస్తా రన్నారు. పార్టీలో అందర్ని పరుగెత్తిస్తారని నవ్వుతూ ఆయన వ్యాఖ్యానించారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకా యల విజయ్‌ చేసిన ప్రసంగాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందిం చారు.విజయ్‌కు అవకాశం ఇవ్వగానే ఆహుతులను కట్టిపడేసే విధంగా మాట్లాడగలిగారని, అలాగే యువతకు ఎవరికీ అవకాశామిచ్చిన ఆకట్టుకోగ లరని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీరామారావు యువతకు అవకాశాలిచ్చి ప్రోత్సాహించా రన్నారు. ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు చిన్న వయస్సులోనే రాజకీయావకాశమిచ్చి ప్రోత్సాహించింది ఎన్టీ రామారావేనని గుర్తు చేశారు. అప్పటికింకా ఆయనకు పెళ్లికూడా కాలేదన్నారు.ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత యువత భుజస్కంధాలపైనే ఉందన్నారు. ఎన్టీఆర్‌ క్రమశిక్షణకు మారుపేరని, ఆయన ఏ పనినైనా చిత్తశుద్ధితో చేసేవారన్నారు. సినీరంగంలో, రాజకీయరంగంలోనూ అదే క్రమశిక్షణతో పనిచేసి ఉన్నతశిఖరాలు అధిరోహించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఒక యుగపురుషుడు, ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చారన్నారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్టీరామారావు హయాంలో వైద్యులు, న్యాయవాదులు, విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చారన్నారు.

ఈ రోజు నేరస్థులు రాజకీయాల్లోకి అడుగిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఫ్లెక్సీల రగడ ఎందుకు వచ్చింది...ఎన్టీఆర్‌ బొమ్మను ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నారని...అది కూడా దోపీడీ దొంగల సరసన మహానుభావుడు ఎన్టీరామారావు బొమ్మ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే బాధేస్తోందన్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నవారి పక్కన ఎన్టీఆర్‌ బొమ్మ పెడితే ఎలా సహించామంటారంటూ శ్రేణులను ప్రశ్నించారు. దీనిపైనే మా బాధ, ఆవేదన వ్యక్తం చేశామన్నారు.

యువతకు 33 శాతం సీట్లు

స్ధానికంలోనూ మనమే!
పార్టీ గుర్తులపై స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
బడుగులకు 50 శాతం రిజర్వేషన్లు
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు


 
స్థానిక సంస్థలకు పార్టీ గుర్తుపై వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జయకేతనం ఎగురవేయాలన్నారు. సైకిల్‌ జోరు పెరగాలని కార్యకర్తలకు హితబోధ చేశారు. మన వద్ద డబ్బులు లేకపోయినా, బలమైన కార్యకర్తల బలగం ఉందన్నారు. జెండాలు మోసి, మోసి ఆలసిపోయారని, అయినా రానున్న ఎన్నికల్లో నేతలు, శ్రేణులు సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మన ముందు కూర్చున్నవారిలో ఎంతో మంది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కానున్నారన్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తోందంటూ చంద్రబాబు మండిపడ్డారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే సాధారణ ఎన్నికల విజయానికి నాంది కావాలన్నారు. మంగళవారం మహానాడు రెండవ రోజు ‘స్థానిక సంస్థలపై నిర్లక్ష్యమన్న’ తీర్మానాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు ప్రవేశపెట్టగా, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌ బలపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10-15 ఏళ్లు హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించలేదని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించామన్నారు. 73,74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేశామని గొప్పలు పోతున్న కాంగ్రెస్‌ నేతలు, రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలో స్థానిక సంస్థలు కునరిల్లుతున్నాయన్నారు. ఒక్కొక్క అధికారికి మూడు, నాలుగు మున్సిపాలిటీలు, మండలాలు అప్పగించడంతో వారు ఎక్కడ పర్యవేక్షించలేని దుస్థితి నెలకొందన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోలేని దుస్థితిలో ప్రత్యేకాధికారులున్నారన్నారు. మంచినీటి కోసం బోర్లు బాగు చేయించమంటే చందాలు వేసుకుని బాగు చేయించుకోండంటూ అధికారులు సమాధానమనిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, స్థానిక సంస్థల పాలకవర్గాలు కూడా ముఖ్యమేనన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర నిధుల విడుదలను ఆపివేసిందన్నారు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతామనే భయంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదని విరుచుపడ్డారు.

టీడీపీ హయాంలో పద్ధతి ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, నిధులు, విధులు అప్పగించామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకే ఇసుకరీచ్‌లను అప్పగించామని గుర్తు చేశారు. గ్రామపంచాయితీ, మండల, జిల్లాకు దామాషా ప్రకారం నిధులు కేటాయించడం జరిగేదన్నారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఇసుకరీచ్‌లను కూడా తమ అనునయులకు కట్టబెట్టే దుష్ట సంప్రదాయానికి కాంగ్రెస్‌ తెరలేపిందన్నారు. టీడీపీ పాలనలో అన్ని గ్రామపంచాయితీల కార్యాలయాలకు సచివాలయమన్న పేరు పెట్టి సొంత భవనాలు నిర్మించి ఇచ్చామన్నారు. రాష్ట్రానికి సచివాలయం ఎంత ముఖ్యమో, గ్రామ సచివాలయాలు అంతే ముఖ్యమని వ్యాఖ్యానిం చారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి పనులు స్థానిక సర్పంచ్‌ల నేతృత్వంలో చేపట్టడం జరిగిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.

స్థానిక సంస్థల్లో బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ముందుకు వచ్చి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ద్వారానే బీసీ నాయకత్వం అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక సంస్థల బలోపేతానికి టీడీపీ అంకితభావంతో ఉందని, అధికారంలోకి రాగానే నిధులు, అవసరమైన విధులు, బాధ్యతలు అప్పగించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బాబు డిమాండ్‌ చేశారు.ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తాచాటుకుందని, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే పరిస్థితి పునారావృతం చేయాలని బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా సింగిల్‌విండో ఎన్నికల్లో విజయం సాధించగలిగామన్నారు. టీడీపీ గెలిచే స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని అడ్డుకున్నారని, అలాగే డబ్బులు వెదజల్లి అనేక స్థానాల్లో గెలుపొందారన్నారు. అయినా టీడీపీ ఆశించినదానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. నాయకులు ఇంకా సమర్ధవంతంగా పనిచేసి ఉంటే మరిన్ని స్థానాలు గెలిచేవారమన్నారు.

టీడీపీ వద్ద డబ్బులు లేవు... బలమైన కార్యకర్తలున్నారు  వచ్చే “మహానాడు’ నాటికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండడం ఖాయమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షునిగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిలో బీహార్‌కన్నా రాష్ట్రం వెనకబడి ఉందన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తానని రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తానని చేసిన ప్రమాణాన్ని ముఖ్యమంత్రి తుంగలో తొక్కారని విమర్శించారు. కళంకిత మంత్రులను కాపాడేందుకు ఎందుకు యత్నిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను ఇష్టానుసారం బదిలీలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి తమ్ముడు డబ్బులు దండుకోని కీలక పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయన మరో సోదరుడు చిత్తూరులో తిష్ట వేసి అడ్డగోలు పనులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. సీఎం తమ్ముని లాలూచీ వ్యవహారాలు దేవాదాయ శాఖ మంత్రిని అడిగితే బాగా చెప్పగలరన్నారు. కాంట్రాక్టర్లతో లాలూచీపడి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తమ పార్టీ ఒత్తిడి మూలంగానే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని, అది పార్టీ సాధించిన పాక్షిక విజయమన్నారు. కళంకిత మంత్రులందరినీ సాగనంపేదాకా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. మొత్తం వివాదాస్పదమైన 26 జీవోలతో సంబంధం ఉన్న మంత్రులు తమను నిర్దోషులుగా తామే నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం వారికి న్యాయ, ఆర్థిక సాయాలు అందించడం దారుణమన్నారు.. “ రాష్ట్రం తీవ్ర ్పన్నమయ్యాయని ప్రశ్నించారు. ఎపీపీఎస్సీలో అవినీతి రాజ్యమేలుతోంది. ఉద్యోగాలను బాహాటంగా అమ్ముకొంటున్నారు. పేదలు వాటిని కొనుక్కోలేక నిరుద్యోగులుగా దుర్భర జీవితం వెల్లబోస్తున్నారని చెప్పారు.

ఉపాధి హామీ పథకంలో అవినీతిదే రాజ్యమని చంద్రబాబు చెప్పారు. దోచుకొన్న సొత్తు మెక్కి కాంగ్రెస్‌ నేతలు పందికొక్కుల్లా బలిశారన్నారు. ఎండవేడికి ప్రజలు పిట్టల్లా రాలిపోతోంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని నిందించారు. ప్రకృతి విపత్తులుగా ప్రకటించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. రైతుల వడ్డీ మాఫీ ఉత్తదేనని తేలిపోయిందన్నారు. ఉద్యోగులకు భద్రతలేదు. అంగన్‌వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందడంలేదు. చాలీచాలని జీతాలతో చిరుద్యోగులు అల్లాడుతున్నారని చెప్పారు. తన హయాంలో తాను ప్రజల ఆస్తులకు ధర్మకర్తలాగా వ్యవహరించానని తెలిపారు. ఎన్నడూ ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడలేదన్నారు. అయినా నాపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. నేను చేసిన తప్పేంటి? అని చంద్రబాబు ఆవేదనతో ప్రశ్నించారు. కొందరికి హైదరాబాద్‌, బెంగుళూరులో రాజభవనాలను తనదన్నే భవంతులున్నాయని చెపితే తప్పా? వారిపై చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అన్నారు. సీబిఐ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా ప్రభావితం చేస్తున్నానని నన్నాడిపోసుకుంటున్నారు. నాకంత స్థాయి లేదు. టీడిపీని భూస్థాపితం చేస్తానని బీరాలు పలికిన గాలి జనార్దనరెడ్డి ఎక్కడున్నాడో అందరికీ తెలుసునన్నారు. తనపై విశ్వాసం, నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ శ్రేణులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన మహానాడులో చర్చలు 28 గంటలు సాగాయి. దాదాపు 15 తీర్మానాలు ఆమోదం పొందాయి. వివిధ తీర్మానాలపై 52 మంది ప్రతినిధులు ప్రసంగించారు.

మళ్లీ.... మహానాడు మన పాలనలోనే

తటస్థ ఓటర్లకు గాలం వేద్దాం
గెలుపు గుర్రాలను మార్చను
పనిచేయని వారిని తప్పిస్తా
ఇక ఇంటింటికి తెలుగుదేశం
కాంగ్రెస్‌ అవినీతిపై ప్రచారం
మహానాడులో చంద్రబాబు
బాబు మంచి పాలకుడు
వైకాపాకు పుట్టగతులుండవ్‌
కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌
రాజకీయ తీర్మానంలో 'దేశం' విసుర్లు


2014 ఎన్నికల విజయమే లక్ష్యంగా సాగిన తెలుగుదేశం పార్టీ రెండు రోజుల మహానాడు మంగళవారం ముగిసింది. చంద్రబాబు నాయుడు వరుసగా తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలిపలుకుల నుంచి తుది పలుకుల దాకా చంద్రబాబు ఇటు అధికార కాంగ్రెస్‌పార్టీపైనా అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైన విమర్శల నిప్పులు కురిపించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుందంటూ గులాబీ దండుపై ముళ్లదాడి చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ లేఖ కు కట్టుబడే ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. మహానాడు ఆమోదించిన రాజకీయ తీర్మాణంలోనూ ఈ అంశాన్ని చేర్చారు. అలాగే వేదిక నుంచి ప్రసంగించిన నేతలు అదే బాణిని కొనసాగించారు. ఇదిలా ఉండగా తొలిసారి మహానాడుకు హాజరైన చంద్రబాబు తనయుడు లోకేష్‌ రెండు రోజుల పసుపు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తనకు ఆహ్వానమే అందలేదని జూనియర్‌ అన్నారు అయితే పార్టీ ఆదేశిస్తే ఎన్నికల ప్రచారం చేస్తానని తాత ఎన్టీఆర్‌ సమాధి సాక్షిగా ముక్తాయింపునిచ్చారు.

  రానున్న 2014 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 32వ మహానాడు వేదికగా తమ శ్రేణులకు కార్యాచరణ ప్రకటించారు. అందులో భాగంగా మంగళవారం గండిపేట “తెలుగువిజయం’ ప్రాంగణంలో మహానాడు రెండవ రోజున ఆయన కీలకాంశాలు వెల్లడించారు. జూన్‌ మొదటి వారంలో “ఇంటింటికీ తెలుగుదేశం’ అన్న కార్యక్రమాన్ని ప్రకటించారు. దుష్ట కాంగ్రెస్‌ అవినీతిని, కుంభకోణాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని తన శ్రేణులకు అధినేత ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తల సమస్యల పట్ల జిల్లా నాయకత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల ఎత్తుగడలను గుర్తించి ధీటుగా ఎదుర్కొనే వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తానని హామీనిచ్చారు. రాజకీయాల్లో కొన్ని చిట్కాలు ఉంటాయని, వాటిని అలవర్చుకోవాలని ఉద్భోధించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలకు గెలుపే అంతిమ లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తటస్థ ఓటర్లను ఆకర్షించాలని నొక్కి చెప్పారు. వారి ఓట్లను సాధిస్తే గెలుపు నల్లేరు బండిపై నడకేనన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అంతర్గత విభేదాలు కొంపలు కూల్చుతాయని గ్రహించిన చంద్రబాబు “విభేదాలు మర్చిపోతాం’ అని ప్రతినిధులందరితో ప్రమాణం చేయించారు. ఎన్నికల సీజన్‌ వచ్చిన నేపథ్యంలో ఏ కార్యక్రమాలు చేపడితే గెలుపు సులువవుతుందో వివిధ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీకి సూచించాలన్నారు. ఏ పార్టీకైనా గెలుపే ముఖ్యం. ఆ విషయంలో ఉదాసీనత పనికిరాదన్నారు. వరుసగా విజయాలు సాధిస్తున్నవారిని మార్చేదిలేదని భరోసా ఇచ్చారు. అనేక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలు ఉన్నారు. వారిలో కొందరు సరిగా పని చేయడంలేదు. ఒకటి రెండుసార్లు చెప్పిచూస్తా, అయినా వారు తీరు మార్చుకోకుంటే నిర్మొహమాటంగా మార్చేస్తానని హెచ్చరించారు. ఇక మొహమాటం పక్కకుపెట్టి ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై మాట్లాడతానని చెప్పారు. పార్టీలో చురుగ్గా వ్యవహరించేవారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తానని చంద్రబాబు వెల్లడించారు. చాలా మందికి ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు లభించదని, అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తానన్నారు. కంభంపాటి రామ్మోహన్‌రావు, పార్టీ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది నిస్వార్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రత్యేకించి వస్తున్నా మీకోసం యాత్రలో 700 మంది అంతే నిస్వార్థంగా పనిచేశారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులతో కరతాళధ్వనుల ద్వారా వారికి కృతజ్ఞతలు చెప్పించారు. అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను పాదయాత్ర చేయలేకపోయానని, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూలై 1 నుండి బస్సు యాత్రను చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గడచిన సింగిల్‌ విండో ఎన్నికల్లో చాలా మంది సరిగా పనిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకముందు అలాంటి వ్యవహార శైలిని సహించనని చెప్పారు. వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం తెప్పిస్తున్నానని వాటిని అధ్యయనం చేస్తానని అనంతరం పది నెలలకు సరిపడా పార్టీ శ్రేణులకు కార్యక్రమాలు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళికను అందిస్తానని చెప్పిన అధినేత అన్ని అనుబంధ సంఘాలు మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. చాలా మంది పార్టీకి ఊపు తెస్తే ఎలాగూ గెలుస్తామని భావిస్తారని అది సరికాదని హితవు చెప్పారు. తనకు కార్యకర్తలు కుటుంబ సభ్యులకన్నా మిన్న అని స్పష్టం చేసిన అధినేత వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

కుక్కమూతి పిందెలు పోయాయి.. సీతాకోక చిలుకలే మిగిలాయి: బాలకృష్ణ


హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ చేపట్టిన మహానాడు సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. టిడిపి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు సోమవారం నుండి రెండు రోజుల పాటు జరగనుంది. మహానాడు మొదటి రోజైన సోమవారం రోజున తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఈ సందర్భంగా ముఖ్య నేతలంతా కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
 
మొదటి రోజు సభలో ప్రసంగించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అసమర్థుల పార్టీ అని, తెలంగాణా రాష్ట్ర సమితి వసూళ్ళ పార్టీ అని పేర్కొన్నారు. మరోవైపు వైకాపాపై నిప్పులు చెరిగారు. అది ఒక జైలు రాజాల పార్టీ అని అభివర్ణించారు. ఈసారి వీరందరికీ ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కేంద్రంలో చక్రం తిప్పేది తెలుగుదేశం పార్టీయేనని ఆయన అన్నారు.
 
మేము అవినీతిపై ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నామని, ముందు ముందు కుడా చేస్తూనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేసారు. మా పోరాటం ఫలితంగానే కాంగ్రెస్ లో రెండు వికెట్లు పడ్డాయని అన్నారు. మిగిలిన అవినీతి మంత్రులను కుడా తొలగించేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. జగన్ జైలుకు వెళ్లి ఏడాది పూర్తయిన రోజును ఆ పార్టీ బ్లాక్ డే గా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. మరి ఆయన కారణంగా జైలుకు వెళ్ళిన ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలకు వారు ఏం సంధానం చెబుతారని ప్రశ్నించారు.  

జైలు రాజాలా, అసమర్థుల, వసూళ్ళ పార్టీలను నమ్మొద్దూ !

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు దేశం పగ్గాలు చేపట్టి ఈ సారి ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేసారు. హైదరాబాద్ నగర శివారులో నిర్వహిస్తున్న మహానాడు క్రయక్రమం రెండో రోజు జోరుగా సాగింది.

మంగళవారం స్థానిక సంస్థలపై మహానాడులో ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని ఆయన వ్యాఖ్యానించారు. తమది నిజాయితీ గల పార్టీ అని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. దోపిడీ దొంగల పక్కన ఎన్టీఆర్ ఫొటో పెట్టడం బాధగా ఉందని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేసారు.

అయితే వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో మిగిలి పోయిన జిల్లాలను బస్సు యాత్ర ద్వారా పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు రెండో రోజైన మంగళవారం మహానాడులో ఆయన ప్రకటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈసారి బస్సు యాత్ర చేయాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. మరోవైపు జూన్‌లో పార్టీ కార్యకర్తలకు హైదరాబాదులో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు

తొమ్మిదోసారి టిడిపి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు !

హైదరాబాద్: రెండో రోజు జరిగిన తెలుగుదేశం మహానాడులో ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ తొమ్మిదేళ్ళ పాలనలో లెక్కలేనంత అవినీతి జరిగిందని నామా ఆరోపించారు. నామా ప్రవేశ పెట్టిన ఈ తీర్మానంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కుంభకోణాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు 75 లక్షల కోట్లపైన దేశాన్ని దాటించేసారని నామా లెక్కలేసారు. నల్లధనం కుబేరుల్లో కాంగ్రెస్ నేతలు ఉండడం వల్లనే ఆ జాబితా బయట పెట్టడం లేదని ధ్వజమెత్తారు. ఇక నల్లధనంపై శ్వేత పత్రం విడుదల చేయాలని పార్లమెంటును స్థంభింపజేశామని ఆయన గుర్తు చేశారు.
2008 లోనే తెలంగాణా మీద స్పష్టత చేసిందని పేర్కొన్న నామా తెలంగాణపై టీడీపీ చిత్త శుద్దితో పనిచేసిందని తెలిపారు. సామాజిక న్యాయం అంటూ వచ్చిన పార్టీ పుట్టుక నాడే భూస్థాపితమైందని చిరంజీవికి చురకలంటించారు. ఇక జగన్ కోసం తీహార్ జైలు తలుపులు తెరిచే ఉన్నాయని, ఆ పార్టీ కూడా కాంగ్రెస్ లో కలిసిపోవడం ఖాయమన్నారు.

రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన నామా


హైదరాబాద్ : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా 9వ సారి పార్టీ అధ్యక్షుడిగా బాబు ఎన్నికయ్యారు. మహానాడులో చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ 24 సెట్ల నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

టీడీపీరాష్ట్ర అధ్యక్షుడిగా బాబు ఏకగ్రీవ ఎన్నిక

మహానాడు సందర్భంగా కొంతమంది తెలుగు తమ్ముళ్ళు కొంతమంది ఇతర పార్టీ నాయకులపై సెటైర్లు వేయబోతుండగా, వారించిన చంద్రబాబు ఇలాంటి భాష కరెక్ట్ కాదన్నారు. ఇటువంటి స్పీచులకు కొంతమంది ఉద్వేగానికి గురై తాత్కాలికంగా ఈలలు వేయొచ్చేమోగానీ, అంతిమంగా పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు. ఇలాగే రాజకీయ నాయకులందరూ భాష విషయంలో కొన్ని విలువలు పాటిస్తే బావుంటుందేమో..?

నాకు తెలిసినంతవరకూ.. కొంతమంది నాయకులు బూతులు తిట్టడం హీరోయిజం అనుకుంటున్నారు గానీ, దాని వల్ల ఒరిగేదేమీ వుండదు. పైగా సభ్యతా సంస్కారమున్న పెద్దలు, మహిళలు అసహ్యించుకుంటారు.

సంస్కారమంటే ఇదే...

అమెరికాలోని డల్లాస్‌లో మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో ఎన్టీ ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు మురళీ మోహన్ కేక్ కట్ చేశారు. టిడిపి రాష్ట్ర
కార్యదర్శి మన్నవ సుబ్బారావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ టిడిపిని స్థాపించిన తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిందని మురళీమోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్టీ ఆర్
నటించిన పలు సినిమాలకు చెందిన పోస్టర్లను మురళీమోహన్ ఆవిష్కరించారు. నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని
వాళులు అర్పించారు. ఈ
సందర్భంగా ఎన్నారైలు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్నారైలు సతీష్ వేమన, ఉప్పుటూరి రామ్ చౌదరి, చెన్నుపాటి రామ్ కిశోర్, నవత కృష్ణ, చెరుకూరి బుల్లయ్య, విశాఖకు చెందిన ఎన్‌టి చౌదరి,
న్యాయవాది మోదుగుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డల్లాస్‌లో ఎన్టీ ఆర్ జయంతి

'ఆలోచనలు పోయేవాడా
అనునిత్యం అన్వేషించేవాడా
చెట్టూ, చెరువూ, గట్టూ, పుట్టా,
ఆకసంలో, సముద్రంలో
అన్వేషించేవాడా
అశాంతుడా, పరాజయం ఎరుగనివాడా
ఊర్ధ్వదృష్టీ, మహామహుడా
మహాప్రయాణికుడా
మానవుడా మానవుడా'
- శ్రీశ్రీ- గోటేటి రామచంద్రరావు
నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు గారి ప్రత్యేక పౌర సంబంధాల అధికారి- గోటేటి రామచంద్రరావు

ఏవినీలాకాశ గర్భమునుండి, ఏ యుగారంభ సంరభమున భారతీయ ప్రేమామృతం ఆవనికి దిగివచ్చేనో... ఎవరు చెప్పగలరు? ఇయ్యది కాలమువలెనే అనంతము. ఆకాశమువలె సర్వవ్యాప్తము అని ఒక సందర్భంలో శ్రీ ముట్నూరి కృష్ణారావు వ్రాసిన వాక్యం శ్రీ రామారావు గారికి ఎంతగానో వర్తిస్తుంది.

విశ్వవిఖ్యాత తెలుగు తేజోరాశి, తెలుగువారికి, పరమపవిత్ర ప్రాత:స్మరణీయుడైన ధీరోదాత్తుడు ఆయన.
మానవ చరిత్రలో శాశ్వతస్థానం ఆర్జించుకున్న మహానుభావుడు, శ్రీ నందమూరి తారకరామారావు ఈ భూమిపై ఉద్భవించిన పవిత్రమైన రోజు ఇది.
మానవ అవగాహనకు నిర్వచనాలకు, వర్ణనకు, విశ్లేషణకు అందని రీతిలో చరిత్ర మహావేగంతో వీస్తూ ఎన్నోమలుపులూ, మెలుపులతో... అత్యంత వేగంగా సాగిపోతూ-- ఒక జాతి జీవన సంధ్యలో, సంఘర్షణలతో సతమతమవుతున్నప్పుడు మహానాయకులకి జన్మనిస్తుంది. ఆ మహానాయకుడే తిరిగి చరిత్రను సృష్టిస్తాడు. ఆ దిశలోనే మహత్తర చరిత్ర సృష్టించిన మహామనిషి శ్రీ ఎన్టీఆర్ జన్మించారు.

చలన చిత్ర రంగంలో హిమవన్నగ శిఖర సదృశుడుగా విరాజిల్లుతున్న ఆయనకి... సమకాలీనంగా.. మన దేశాన్నీ, మన రాష్ట్రాన్నీ అతలాకుతలం చేస్తూ, దినదినం కాదు.. క్షణ క్షణం దిగజారుతున్న రాష్ట్ర ఉనికికే కాక సామాన్య ప్రజాజీవనాన్నీ చిద్రుపలు చేస్తున్న చారిత్రక దురవస్థలో, అప్పటి ప్రజానాయకులు మనరాష్ట్ర వర్తమానాన్ని, భవిష్యత్తుని హస్తినలోని నిరంకుశుల పాదాల వద్ద పరచి ప్రజాస్వామ్య బానిసత్వానికి పునాదులు వేస్తున్న గర్హనీయ దురదృష్ట సమయం అది.

ఆ అప్రజాస్వామిక, ప్రజాద్రోహం, ఆత్మవంచన, అర్థరహిత పరావలంబన, ఆత్మగౌరవ నిర్వీర్యత చూసి, భరించలేక తన అంతరాలలో రగులుతున్న విప్లవాగ్నిని బహిరంగపరచి తెలుగుజాతి ఆత్మగౌరవ పున:స్థాపనకు, తెలుగు వ్యక్తిత్వ నిజస్వభావానికి నిద్రాణమై, నిర్వీర్యమైయున్న తెలుగు ప్రజల వైభవ, ప్రాభవాలు మేల్కొల్పడానికి, ప్రజలను ఉత్తేజితులను చేయడానికి, తెలుగుచరిత్ర, నాగరికత, సంస్కృతుల ప్రత్యేకతలు యావత్ ప్రపంచానికి తిరిగి చాటి చెప్పడానికి -- అనుకున్న మరుక్షణమే నడుంబిగించి.. దీక్షబూనిన కార్యదక్షుడాయన.

ఢిల్లీ పాదుషాల ఆభిజాత్యాన్ని, నిరంకుశత్వాన్ని పటాపంచలు చేయడానికి కార్యక్షేత్రంలోకి ఉద్యమించిన కర్తవ్యవీరుడు, క్రియాశీలి, అకళంక దేశభక్తుడైన శ్రీ రామారావు ఉవ్వెత్తున ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసిపడుతూ తెలుగుదేశం అని తన పార్టీకి నామకరణం చేయడంతోనే తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆయన విప్లవ భావాలకు మన విస్తృత ప్రజాస్వామ్య ఫెడరల్ వ్యవస్థలోనే 'తెలుగుదేశం' అనే పార్టీకి పేరు పెట్టడం. ఒక వీరోచిత స్వాభావిక నిర్ణయం. ఏ ప్రాంతీయ సంకుచితత్వానికి తావులేని, దేశభక్తి పూరక నిర్ణయం అది.

1982 మార్చి 29కి సుమారు 10-15 రోజులకు ముందుగానే పార్టీ నామకరణ నిర్ణయం మీద శ్రీ ఎన్టీఆర్ తనకు తానుగా, వ్యక్తులకుగానీ, సన్నిహితులకుగానీ, పత్రికా ప్రపంచానికిగానీ చెప్పకుండా... తెలియనీయకుండా, నిర్ణయం తీసుకోవడంలో... తీవ్రంగా శ్రమించారు. ఆ పేరు నిర్ణయించడంలో నన్ను.. స్వర్గీయ నా సోదరుడు, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడు స్వర్గీయ గోటేటి రాధాకృష్ణమూర్తినీ, ఆయనకి అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు, సహృదయుడు అయిన స్వర్గీయ శ్రీ డి.వి.ఎస్. రాజుగారినీ, ఆయన మిత్రుడు శ్రీ దువ్వదత్తుడు గారినీ, ఆయన్ని ఎంతో అభిమానించే స్వర్గీయ కొసరాజు రాఘవయ్య గారినీ, మహాకవి పండితుడు 'ఆంధ్ర పురాణకర్త' శ్రీ మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారినీ, ఆయనకి మిత్రుడైన శ్రీ దేవానాధన్ గార్లతో తీవ్ర చర్చలు పరమగోప్యంగా జరిపారు. ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి (వీరే శ్రీ మధునా పంతుల వారిని 2 సార్లు దగ్గరుండి రాజమండ్రి నుంచి పంపించిన సన్నిత్రులు)కి మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు రామారావుగారి సోదరులు శ్రీ ఎన్. త్రివిక్రమరావు వచ్చేవారు.

ఆంధ్రుల చరిత్రని పురాణంగా రాసిన కవిపండితులు శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రామారావుగారికి ప్రాజ్ఞనన్నయ యుగం దగ్గరనుంచి తెలుగు కవిత్వ పరిణామ ప్రక్రియని వివరిస్తూ ఒక మహత్తర విషయాన్ని చెప్పారు.

అది.. ఎప్పుడో 7, 8 శతాబ్దాలలో శంకర భగవత్పాదులు పరమ పవిత్ర శ్రీ చక్ర రూపకల్పనలో 'తెలుగు సంఖ్యలను' ఉపయోగించారనీ, అంతకు మించి తెలుగుకి పవిత్రత ఎవరూ ఇవ్వలేరనీ, ఇవ్వలేదనీ చెప్పి శ్రీ ఎన్టీఆర్‌ని మంత్ర ముగ్ధులని చేశారు. తెలుగు, తెనుంగు, తెలంగాణ అన్నవన్నీ పర్యాయపదాలే అన్నారు. వారు చెప్పిన ఆ విషయం రామారావు గారి మదిలో గాఢంగా నాటుకుని తీవ్రంగా ఆలోచింపజేసింది. రామారావుగారు ఆయనకి పాదనమస్కారంచేసి గౌరవించారు.

అప్పుడే నాకు స్ఫురణకువచ్చి... గొప్పకవి, ఉపాధ్యాయుడు, ఆంధ్రసాహిత్య చరిత్ర రచయిత అయిన స్వర్గీయ పింగళి లక్ష్మీకాంతంగారి 'గౌతమవ్యాసముల'లోని 'ఆంధ్రవాఙ్మయ స్థూలరూపము' ప్రథమవ్యాస భాగాన్ని చదివి వినిపించాను అందులోని అంశాలు :-
'దేశభాషలందు తెలుగులెస్స అని శ్రీనాథుడు మొదలైన పూర్వీకులచేతను... ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్య శబ్దవేత్తల చేతను ముక్త కంఠమున ప్రశంసింపబడిన తెలుగుకు మూడు పర్యాయపదములు కలవు. ఆంధ్రమనియు, తెలుగనియు, తెనుగనియు, కానీ, ఈ మూడు పదములలో 'తెనుగు-తెలుగు' అన్నవి రూపాంతరము లేననియు, ఆ పక్షమున మన భాషకు రెండే పర్యాయ పదములు ఉండెననియు నా ఊహ. ఈ రెండింటిలో ఆంధ్రమనునది మొదట రాజపరముగ, పిమ్మట దేశపరముగ, ఆపై దేశభాషా పరముగ ప్రయోగింపబడగా తెనుగనునది మొదట దేశ పరముగ పిమ్మట ప్రజాపరముగా, ఆపై వారి భాషా పరముగ మారింది'. ఈ విశ్లేషణను శ్రీ రామారావుగారు శ్రద్ధగా విన్నారు. మరొక సుప్రసిద్ధ తెలుగు సాహిత్య చరిత్రకారుడు వేరొక ప్రసిద్ధ పండితుడు శ్రీ నిడదవోలు వెంకట్రావుగారు మొట్టమొదట రాజ భాషగా ప్రకటించినది తంజావూరు నాయకరాజులే అని నిర్ధారించారు.

భారత రాజ్యాంగంపట్ల గౌరవంతో, పూర్తి గణతంత్ర స్ఫూర్తితో, భారత సార్వభౌమత్వానికి విశ్వాసంగా ఉండే రాష్ట్రీయమైన పేరుకోసం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మదిలో మెదిలే పేర్లు నాలుగు ఉండేవి. -తెలుగునాడు, -తెలుగునేల, -తెలుగు భూమి, -తెలుగు కేతనం మొదలైనవి. వీటిపై ఇదమిద్దంగా నిర్ధారణకి రాలేక లోలోనే ఆలోచనలు చేస్తున్న సమయం అది. మధునా పంతులవారి మాటల్లో ప్రమాణాలు, నేను వినిపించిన పింగళివారి వ్యాసంలో తెలుగు పదార్థ విశ్లేషణా సరళి, చారిత్రికత - కొసరాజుగారు గుర్తుచేసిన వేములపల్లి శ్రీకృష్ణగీతం 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా' మరికొన్ని భావస్ఫోరకమైన గీతాలతో సమావేశం నడిచేది. శ్రీ డి.వి.ఎస్ రాజు గారు చర్చలు సాగుతున్నంత సేపూ ఆతిథ్య బాధ్యతలు నిర్వహించేవారు. రామారావుగారు మాత్రం నిశ్శబ్దంగా అందర్నీ చూస్తుండేవారు. తీక్షణంగా... వింటూ.. సునిశితంగా... ఆలోచిస్తూవుండేవారు.

ఆ నేపథ్యంలో ఎన్టీఆర్ పార్టీపేరు నిర్ణయించడంలో వేగంగా ఒక స్థిరమైన నిర్ణయం రావడానికి, నా పరిధిలో, మరో ప్రయత్నంగా 20వ శతాబ్దంలో 'తెలుగుదేశాన్ని' జాగృతం చేసిన మహనీయుడు స్వర్గీయ మట్నూరి కృష్ణారావుగారి 'తల్లిపిలుపు' అనే వ్యాసాన్ని చదివి వినిపించాను. శ్రీ కృష్ణారావుగారు భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో 1937 ఫిబ్రవరి 6వ తేదీ సంచికలో వ్రాసిన భావగాంభీర్య, అర్థగాంభీర్య, ప్రబోధాత్మక వ్యాసం అది. 'ఆ వ్యాస సారాంశం':

'భారతమాత పసుపుపెట్టెరూపు దాల్చినది' తన బిడ్డలు తెచ్చియిచ్చు ఉపాహారములందు కొనుటకు విశ్వరూపిణియైన తల్లి పుత్రసౌలభ్యం కొరకు దాల్చిన మంగళరూపమే పసుపుపెట్టె - పసుపు పెట్టె పేరిట శోభనాకారముతో తల్లి సాక్షాత్కరించి, సేవననుగ్రహించుచున్నది. మన దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న మనలను ద్వేషించే తమిళులు మనకంటె మిన్నగా తల్లిదీవెనలందుకున్నారు. తల్లికెక్కుడు గూర్తుమని సంబరపడుతున్న తెలుగు బిడ్డలు ఈ అల్పసేవా సమయమున సాటి వారికి తీసిపొదురనుటకల్ల - దక్షిణాపథమంతయూ ఏకచ్ఛత్రము క్రింద తెచ్చిన ఆంధ్రప్రజ నేడు సాటివారు గర్భాలయములోకి చనుచుండ, తాము మాతృదేవాలయ ప్రాంగణమున నిలచియుందురనుట కాని మాట. ఇంతకింతలుమాని అన్యబేధములను మరచి, తెలుగులందరూ ఒక్కదారిన నడచి, నాయనుంగు బిడ్డలగుట సమర్థించుకొనుడని మాతృదేవత పిలుచుచున్నది రండు రండు.

ఆ పసుపు పెట్టెలలో మాతృమూర్తిని దర్శించి పూజాపుష్పములు సమర్పించివత్తుము రండు' ఇది విన్న మరుక్షణం శ్రీ ఎన్.టి.ఆర్. గభాలున కుర్చీలోంచి లేచి... 'ఇప్పుడు నా అభిప్రాయానికి ఆలోచనకి అవసరమైన సమాధానం దొరికింది 'ఆహా' ముట్నూరి వారికి జోహార్లు.. అని... మన పార్టీపేరు 'తెలుగుదేశం' తెలుగుతల్లి పిలుస్తోందిరా అని గట్టిగా ఉచ్చరిస్తూ, నేను ప్రజాముఖంగా ప్రకటించే వరకూ ఈ నిర్ణయం మన నలుగురి మధ్యనే ఉండాలి సుమా. ఎవరు ఎవరికి చెప్పకూడదు' అని ఆజ్ఞాపించారు తనదైన శైలిలో.

అలా శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి వ్యాసంతో ప్రేరణపొంది, ప్రభావంతులై తెలుగుదేశం పార్టీ అని నామకరణంతోబాటు తెలుగుదేశం పిలుస్తోందిరా, కదలిరా అనే నినాదం, పసుపుపెట్టెలా పచ్చని పతాకలతో ఆ మహనీయుడు పార్టీని రూపొందించడం జరిగింది. ఆ కృతజ్ఞతా భావంతోనే ట్యాంక్ బండ్‌పై తెలుగు తేజోమూర్తుల వరసలో శ్రీ ముట్నూరి వారి విగ్రహం ఏర్పరచడానికి శ్రీ రామారావు నిర్ణయం తీసుకున్నారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా, సాటిలేని మేటి ప్రజానాయకునిగా, అత్యంత సమర్థుడైన రాజ్యాధినేతగా భాసిల్లి, ఎనలేని ధైర్యంతో ఆయన స్థాపించిన రాజకీయ పార్టీకి తెలుగుదేశం అని పేరుపెట్టి అధికారం చేపట్టిన తర్వాత ఆయన ప్రారంభించిన అనేకానేక ప్రజాసంక్షేమ, విద్యావైజ్ఞానిక, సంస్కృతి, కళాత్మక కార్యక్రమాల నామ నిర్ధారణ 'తెలుగు' అనే పదంతోనే ప్రారంభించిన వైనం ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేనిది, శాశ్వతమైనది.
నాటికీ, నేటికీ, ఎప్పటికీ యావత్ తెలుగుజాతి జాజ్వల్యమానమైన గౌరవానికీ, ఐక్యతకు, ఏకత్వానికీ, ఆత్మగౌరవానికీ, నాగరికతకు, తెలుగుభాషా సాహిత్యాలకు, తెలుగు సంస్కృతికి... ఆయనే శాశ్వత చిహ్నంగా చరిత్ర పుటల్లో నిలచి ఉంటారు.

ఎవరికీ తెలియని ఈ చారిత్రక రహస్యాలన్నీ నేనే వ్రాయాలని గౌరవనీయులు ప్రముఖ నిర్మాత, నందమూరి సోదరులకు ఆత్మీయ మిత్రుడు, శ్రీ డి.వి.ఎస్. రాజుగారు అనేక పర్యాయాలు నాతో అనేవారు. తీవ్ర అనారోగ్యంతో కేర్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేను, మిత్రుడు నాటకప్రయోక్త దీక్షిత్‌తో సహా వెళ్లినప్పుడు అప్పటి ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న శ్రీ సూర్యనారాయణరావుగారు, రచయిత యడవల్లిగారు, డి.వి.ఎస్. రాజు గారి కుమారుడు ఉండగా నాతో తెలుగుదేశం పార్టీ చరిత్ర గురించి, రామారావుగారి గురించి సమర్ధవంతంగా, స్పష్టంగా, స్వచ్ఛంగా, వ్రాయగల సమర్థులు మీరే. మీరే వ్రాయాలి లేకపోతే వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోతాయి. అని నన్ను ఆదేశించారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నామావిర్భావ సమయంలో మాతో ఉన్న డి.వి.ఎస్. రాజుగారిని స్మరించడం నా విధ్యుక్త ధర్మం, కర్తవ్యం. మా అందరికీ అంకితభావం, సామాజిక స్పృహ, దీక్ష, దక్షతలు కలిగించడానికి నిత్యస్ఫూర్తిదాయకుడైన మహానాయకుడు శ్రీ నందమూరి తారకరామారావు. ఆయనకెంతో ప్రీతిపాత్రమై, తన గంభీరగళంతో, శ్రావ్యమైన ప్రసిద్ధ పద్యాన్ని చదవగల్గిన ఆ మహా అధినేతను స్మరిస్తూ:

'తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
ఏను తెలుగు వల్లభుండ తెలుగోకండ
ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స'

..........


'తెలుగుదేశం పార్టీ' నామకరణ - చారిత్రక వాస్తవాలు

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చూపిన ఎన్టీఆర్‌కు పార్లమెంటులో అవమానం జరిగింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ జయంతిని పార్లమెంట్ పట్టించుకోలేదు.
పార్లమెంటులో విగ్రహ ఏర్పాటు చేసిన తర్వాత జయంతి, వర్ధంతి నిర్వహించడం అనావాయితీ, కాగా ఎన్టీఆర్ విషయంతో స్పీకర్ ఆనవాయితీకి తూట్లు పొడిచారు. విగ్రహానికి స్పీకర్ మీరాకుమార్ పూలమాలు
వేయడం విస్మరించారు. టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఎన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలులు వే
సి అంజలి ఘటించారు.

ఎన్టీఆర్ జయంతిని పట్టించుకోని పార్లమెంట్

బస్సు యాత్ర చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఈ మేరకు రెండో రోజైన మంగళవారం మహానాడులో ఆయన ప్రకటించారు. గత
ఏడాది అక్టోబర్ 2న చేపట్టిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర 16 జిల్లాల్లోనే చేశారని, మిగిలిన జిల్లాల్లో
జులై నుంచి బస్సు యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈసారి బస్సు యాత్ర చేయాలని కోరుతున్నారని ఆయన అన్నారు.
కాగా, జూన్‌లో పార్టీ కార్యకర్తలకు హైదరాబాదులో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. శాసనసభా నియోజకవర్గానికి 40 మంది చొప్పున ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తామని
చెప్పారు. విద్యుత్తు సమస్యపై 1.5 కోట్ల మందితో సంతకాలు సేకరించామని, ఆ సంతకాలను అసెంబ్లీలో ప్రదర్శిస్తామని, ఆ తర్వాత గవర్నర్‌కు సమర్పిస్తామని ఆయన చెప్పారు. ప్రజలతో మమేకం
కావడానికి బస్సు యాత్ర చేయనున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ గుర్
తుతో నిర్వహించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థలపై మహానాడులో ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన మంగళవారం ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని ఆయన అన్నారు. తమది నిజాయితీ గల పార్టీ
అని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. దోపిడీ దొంగల పక్కన ఎన్టీఆర్ ఫొటో పెట్టడం బాధగా ఉందని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల తీరుపై వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరో సారి ఎన్నిక కానున్నారు. ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం ప్రకటిస్తారు.

జులై నుంచి మళ్లీ బస్సు యాత్ర మహానాడులో ప్రకటించిన చంద్రబాబు నాయుడు

అవినీతిని కాంగ్రెస్ మ్యానిఫెస్టోగా మార్చిందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతి సుడిగుండంలో చిక్కుకుందని హీరో బాలకృష్ణ దుయ్యబట్టారు. రెండో రోజు మహానాడులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ టీడీపీది అభివృద్ధి వాదం...కాంగ్రెస్‌ది అవినీతి వాదం అని ఆరోపించారు. టీడీపీ మహావృక్షం....దాని కింద వందల పురుగులు పుట్టాయని, అవి ఇప్పుడు వెళ్లిపోతున్నాయని బాలయ్య తెలిపారు.

పార్టీ నేతలు గ్రూపులను ప్రక్కనబెట్టి పనిచేయాలని కోరారు. చంద్రబాబు పాదయాత్ర ఫలితం ప్రజలకు అందజేసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎన్టీఆర్ తెలుగు గడ్డపై పుట్టడం మనందరి అదృష్ణమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 1982 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు

అవినీతిని కాంగ్రెస్ మ్యానిఫెస్టోగా మార్చింది : బాలకృష్ణ


  తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ మహానాడు రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా బాలయ్య ప్రసంగించారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని, అన్ని వర్గాలు, మతాలకు తెలుగుదేశం సమప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఆదర్శప్రాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు.

ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. నాన్నగారి ఆశయాలను సాదించడానికి తెలుదేశం పార్టీ కృషి చేస్తోందన్న బాలయ్య ప్రస్తుతం రాష్ట్రం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాంగ్రెస్ పై మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలవద్దకు పాలన, సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడ్డాయన్నారు.

ఎన్టీఆర్ ఈ గడ్డ మీద పుట్టడం మన అదృష్టమన్న బాలయ్య ప్రజల కోసమే ఆయన స్థాపించిన టిడిపి వెనుకబడిన వర్గాల వారికి టిడిపి అండగా ఉంటందన్నారు. వచ్చే ఎన్నికల్లో 1982 నాటి పరిస్థితులు పునరావృతమయి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వెనుకబడిన వర్గాల వారి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు టిడిపి వల్లే వారికి మేలు జరిగిందన్నారు.

మళ్లీ ఆ రోజులు పునరావృతమవుతాయన్న బాలయ్య!

హైదరాబాద్: మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదనే హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనతో మరో నందమూరి హీరో తారకరత్న విభేదించారు. మహానాడుకు రావడానికి ఆహ్వానం అవసరం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం తాత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ అని, తమ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని, ప్రత్యేకంగా ఆహ్వానం అందాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.

కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. అందరం కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి పనిచేయడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. మహానాడును పండుగలా జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలకృష్ణ అన్నీ చూసుకుంటారని ఆయన అన్నారు. పెద్ద దిక్కుగా వారిద్దరున్నారని, వారు ఏం చేయాలంటే తాము అది చేస్తామని తారకరత్న అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, అవసరమైతే పోటీ చేస్తానని ఆయన అన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు తాము ఏం చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తమ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని ఆయన అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుందని తారకరత్న అన్నారు

అక్కర్లేదు: జూనియర్ ఎన్టీఆర్‌కు తారకరత్న కౌంటర్


కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు, ప్రపంచం లో ఒక జాతి మొత్తాన్ని కదిలించిన బీజాక్షరాలు కూడా!
సనాతన ధర్మంలో ఓం ని ఎలా భగవంతునికి చిహ్నంగా స్వీకరించారో అలాగే తెలుగు వాడి ఆత్మ గౌరవానికి, అకుంఠిత దీక్షకి, స్థిరచిత్తానికి ఒక చిహ్నంగా కాలంతో ప్రమేయం లేకుండా ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచే ఒక శక్తి NTR!
ఆయన జీవితం ఒక లోతైన సముద్రం, అలాంటి మహనీయుడి జన్మదిన సందర్భంగా ఒక జ్ఞాపకాల హారం అల్లాలి అంటే ఒక పెద్ద సాహసం అవుతందని తెలుసు. కానీ ఆయన జీవితంలో ఆయనకి అత్యంత సన్నిహితంగా మసలి, ఆయన స్పూర్తితో జీవితాన్ని గడుపుతున్న కొంత మంది గొప్ప వ్యక్తుల సహాయంతో సాధ్యం అవుతుందని అనిపించి అలాంటి వారిలో కొందరిని సంప్రదించి వారికి ఆయనతో వున్న అనుభవాల సమ్మిళితమే ఈ ఆర్టికల్.
శ్రీ మోత్కుపల్లి నరసింహులు( ఆలేరు శాసన సభ్యులు, మాజీ మంత్రివర్యులు), శ్రీ మల్లెల పద్మనాభరావు(కృష్ణ జిల్లాలో ప్రఖ్యాత కుటుంబం కి చెంది షుమారుగా 60 సంవత్సరాల నుండి ప్రజా సేవలో గడుపుతున్న వ్యక్తీ, విజయవాడలో థర్మల్ స్టేషన్ నిర్మాణానికి దోహదపడిన ముఖ్య వ్యక్తి), శ్రీ వడ్డే శోభనా ద్రీశ్వర రావు ( మాజీ లోకసభ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు), Dr. యలమంచిలి శివాజీ ( మాజీ రాజ్యసభ సభ్యులు, రైతాంగ సమస్యల పైన నిరంతర పోరాట యోధులు, జాన్ దైవీ అవార్డు గ్రహీత) లతో పలుమార్లు మాట్లాడటం జరిగిన తరువాత వారి అందరి అనుభవాలని అక్షరీకరించిన ప్రయత్నమే ఇది.
పూరి గుడిసెలలో జీవితం గడుపుతూ , మెతుకు మెతుకుకీ వెతుక్కుంటూ, సమాజంలో కేవలం వోట్లు వేయటానికి మాత్రమే పనికివస్తున్న బడుగు బలహీన వర్గాల వారికి కులం, ఆర్ధిక స్తోమతతో ప్రమేయం లేకుండా పార్టీ టికెట్స్ ఇచ్చి, గెలిపించిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే చెందుతుంది అని అభిప్రాయ పడిన శ్రీ నరసింహులు తను ఎన్టీఆర్ ని కలిసి పార్టీ తరుపున ఏలేరు శాసనసభ కి పోటీ చేయటానికి అవకాసం ఇమ్మని అడిగిన సందర్భంలో 'నరసింహులు గారూ, రెండు నిముషాలు ఇక్కడ వున్న వారిని ఉద్దేశించి మాట్లాడండి అనటం, అప్పుడు భావోద్వేగంతో కూడిన తన 2,3 నిమిషాల ప్రసంగం విని'ఎస్ యు ఆర్ ది కాండిడేట్ గో ఎహేడ్!' అన్నారు అని చెప్పారు. ఈ రోజుల్లో అది సాధ్యం అయ్యే పనేనా? అన్నారు . ఒక్కమాటలో చెప్పాలి అంటే అధికారం వికేంద్రీకరించి, రాజ్యాధి కారం పల్లెల్లోకి పంపి,ఒక నూత వరవడి, ఉత్తేజం సృష్టించి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. తన వివాహం అయ్యాక ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆశీర్వదించి పంపారు అని గాద్గదికమైన గొంతుతో నరసింహులు గారు చెపుతున్నప్పుడు అనిపించింది ఇన్ని దశాబ్దాలయినా ఎన్టీఆర్ స్మృతులు ఆయన ఆప్యాయత మరువలేదు అని.
చాలా మందికి ఎన్టీఆర్ కి రాజకీయానుభవం లేదు అనుకుంటారు, కానీ ఆయన మనుషుల్ని కొంచెంసేపు పరిశీలించి అన్ని వందల మందికి పార్టీ టికెట్స్ ఇచ్చి నిలబెడితే ఆ తరువాత 30 సంవత్సరాల కాలంలో చాల మంది గొప్ప నాయకులయ్యారు, ఇంత కంటే రాజకీయ చతురత ఏమి వుంటుంది? బహుశా సమాజ సేవ పట్ల కమిట్మెంట్ వున్న నాయకుడే కమిట్మెంట్ వున్న వ్యక్తులను గుర్తిస్తాడేమో !
శ్రీ వడ్డే గారి మాటల్లో చెప్పాలి అంటే చౌదరి చరణ్ సింగ్ భారత రైతాంగ సమస్యల పైన వ్రాసిన Economic Nightmare Of India అనే గొప్ప పుస్తకం లోని రైతుల సమస్యలకి పరిష్కారం చూపటానికి నిబద్దతతో ప్రయత్నం చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్. వ్యవసాయానికి సరైన నీటి సదుపాయం లేని తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలకి చెందిన రైతాంగం, బోరు బావులు, నుయ్యి లాంటి వాటి మీద ఆధారపడి, యూనిట్ కరెంటు కి 18 పైసలు చెల్లించటం అనే ఎంతో భారమై విద్యుత్ బకాయిలు చెల్లించటానికి ఇబ్బంది పడుతున్న సమయంలో 1 H.P. మోటార్ కి కేవలం 50 రూపాయలు మాత్రమే చెల్లిస్తే చాలు అని ప్రవేశ పెట్టిన విధానం ఆయా ప్రాంతాల్లో ఒక నూతన వ్యవసాయ విప్లవాన్ని తెచ్చి వారికి ఆదాయ వనరులు పెంచింది అని చెప్పారు. గాంధి గారి ఆశయం అయ్యిన పేద వారికి కనీసావసారాలు అయిన కూడు, గుడ్డ, నీడ కల్పించాలి అన్న ఆశయంతో పక్కా ఇల్లు, 2 రూపాయలకే కిలో బియ్యం, జనత వస్త్రాలు ఇచ్చిన దేశంలోనే తోలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నరు. ఆ తరువాత ఆయన విధనాలు దేశంలో అందరు ముఖ్యమంత్రులకి మార్గ దర్సకం అయ్యాయి అన్నరు.
ఎన్టీఆర్ పార్టీ టికెట్స్ ఇవ్వటానికి ఎంచుకున్న ఏకైక సూత్రం నిజాయతి, నిబద్దత.
శ్రీ శివాజీ గారు పంచుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టాక చైతన్య రథం పైన ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన సభలకి వస్తున్న అశేష ప్రజానీకం, వారి ఆదరణ ని కేంద్ర గూడచార సంస్థలు, కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందినా ముఖ్య నాయకుల్ని 'ఎందుకు ఎన్టీఆర్ కి ఇంత ఆదరణ లభిస్తున్నది?' అని ప్రశ్నించారు. దానికి ఆ నాయకులు చెప్పిన సమాధానం 'ఆయన పురాణ పాత్రలైన రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలతో ఎన్నో సినిమాల్లో నటించారు మేడం' . దానిపై ఆమె ఆ నాయకులకి ఒక సూచన ఇచ్చారు 'మరి ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన వేసిన పాత్రలకి ప్రతి నాయక పాత్రలు పోషించిన వారు కూడా వుంటారు కదా! వారికి కూడా విశేష ప్రజాదరణ వుంటుంది కదా! వారిని మన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వచ్చి వారితో మన పార్టీ కి అనుకూలంగా ప్రచారం చేయించండి' దానికి ఆమెకి కాంగ్రెస్ నాయకుల నుండి వచ్చిన సమాధానం 'ఆ ఆవకాశం కూడా మనకి లేదు మేడం , ఆ ప్రతినాయక పాత్రలు కూడా ఆయనే పోషించారు, ఆ రకంగా కూడా ఆయనే చెరగని ముద్ర వేసారు' అని. ఆయన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఢిల్లీ దిగ్గజాలు కూడా తికమక పడ్డాయి
కాంగ్రెస్ ని ఎదుర్కోవటానికి లోక్ నాయక్ శ్రీ జయ ప్రకాష్ నారాయణ్ చేసిన జనతా పార్టీ ప్రయోగం అతి తక్కువ కాలంలో విఫలమయ్యాక తిరిగి నేషనల్ ఫ్రంట్ పెట్టి అన్ని రాష్ట్రాల నాయకులని ఎకత్రాటిపై నడిపించి ఢిల్లీ పీఠాధిపతులని గజ గజ లాడించిన ఏకైక ధీశాలి ఎన్టీఆర్!
స్త్రీ కి ఆర్ధిక స్వాతంత్ర్యం లభించనంతవరకూ ఎన్ని రకాలుగా మేలు చేసినా వారి జీవితం లో ఎలాంటి మార్పు ఉండదు, వారికి నిజమైన పురోభివృద్ది ఉండదు అన్న ఆలోచన తో 'స్త్రీలకి ఆస్తి లో సగభాగం ఇవ్వాలి' అన్న చట్టం తెచ్చి మొత్తం స్త్రీ జాతికే మేలు చేసింది NTR. ఎన్నో వేల ఫెమినిస్టు ఉద్యమాలు సాదించలేని ఆ అపూర్వమైన ఆర్ధిక స్వావలంభనని సాధించిపెట్టింది ఎన్టీఆర్!
'పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, రక్షన్తి స్తవిరే పుత్రాన స్త్రీ స్వాతంత్ర్యమర్హతి' అని స్త్రీ ఎప్పుడైనా ఒక మగవాడి మీద ఆధారపడవాల్సిందేఅన్న మనుస్మ్రుతి రోజుల నాటి బూజు పట్టిన భావజాలాన్ని ఒక్క శాసనం తో విదిలించి నిజమైన స్వాతంత్ర్యం మహిళా లోకానికి తెచ్చి పెట్టింది NTR.
ఒక పురుషుడి దగ్గర డబ్బు వుంటే తన కొరకు, తన అలవాట్లకోరకు ఖర్చుపెడతాడు, అదే ఒక స్త్రీ దగ్గర డబ్బు వుంటే అనారోగ్యంతో ఉన్న తన తల్లితండ్రులకి లేదా కష్టాల్లో వుంటే భర్తకి, బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలనే తపనతో తన పిల్లలకి ఖర్చుపెడుతుంది. ఆ రకంగా ఒక స్త్రీ కి మేలు చేస్తే మొత్తం కుటుంబానికి చేసినట్లే,స్త్రీ లు సంతోషంగా వుంటే ఆ సమాజం అంత సంతోషంగా ఉన్నట్లే అన్న వాస్తవమే ఆయన గ్రహించి దేశంలో ఆయన కంటే ముందే పదవుల్లోవున్న మహిళా ప్రధాని, మహిళా ముఖ్యమంత్రులు చేయలేని పనిని దైర్యంగా చెసారు.
ఆయన ఈ రోజు మనతో వుండి వుంటే ఆడవారి పైన జరుగుతున్న అమానుష అత్యాచారాలను ఆపటానికి ఒక కఠినమైన చట్టం కావాలి అనే ఆవేదనతో, ఆక్రోశం తో ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేసే దుర్గతి పట్టేది కాదు ప్రజానీకానికి. నిర్భయ లాంటి చట్టాల్ని ఎప్పుడో తెచ్చేవారు. ఒక దైవం ఇచ్చిన అన్నగా మహిళా లోకానికి ఎంతో మేలు చేసిన ఆయన జన్మదినం రోజున ఆంధ్ర ప్రదేశ్ లోని మహిళలు రాఖీ పండుగని జరుపుకోవాలి అనటం అతిశయోక్తి కాదు,
పాశ్చ్యత్త దేశాల్లో లాగ ప్రేమని ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించే అలవాటు మనకి లేదు, వుంటే ఆయన జన్మదినం మన ఆంధ్రరాష్ట్ర ప్రజానీకానికి ఫాదర్స్ డే, మదర్స్ డే లాగ, ఒక బ్రదర్స్ డే గా మారి వుండేది
అన్నా!
తెలుగువాడి ఆత్మాభిమానానికి ప్రతిరూపం మీ దివ్య తేజో రూపం! తెలుగు వాడి ఔన్నత్యానికి నిదర్శనమ్ మీ జీవితం!
మనిషిని మనిషే నమ్మని ఈ రోజుల్లో ఒక జలపాతం లాగ మీ కంఠం నుండి జాలువారిన ప్రతి మాటనీ పూర్తిగా విశ్వసించి మీ వెనుక ఒక జాతి మొత్తం ఏకమై నడిచింది
మీలాంటి నిజమైన జన హృదయ విజేత ని ఎప్పటికీ చూడలేము, మా జీవితాంతం మరవలేము!
జోహార్ ఎన్టీఆర్!

ఎన్టీఆర్ పార్టీ పెట్టాక చైతన్య రథం పైన ప్రచారం చేస్తున్న రోజుల్లో ఆయన సభలకి వస్తున్న అశేష ప్రజానీకం,మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ద్వారా కొన్ని సంకేతాలను ఇచ్చింది. ఇప్పటికే సీనియర్లు కొంతమంది పార్టీని వీడగా దేశం మాత్రం ఇప్పుడు యూత్ ను కలుపుకొనిపోతుంది. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే సభా వేదిక వద్ద హంగామా చేసేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తముళ్లు మహానాడు పెద్ద సంఖ్యలో పాల్గొంటుండగా గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. ఇక ఈ మహానాడు ప్రాంగణంలో యువనేతలు హంగామా కన్పించింది. గత కొద్దికాలంగా రాజకీయ కార్యకలాపాల్లో ఉత్సాహాంగా పాల్గొంటూ నేతలను సమన్వయపరుస్తున్న చినబాబు లోకేష్ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

ఇక సభావేదిక మీద సీనియర్లకు స్థానం కల్పించి, లోకేష్ యువనేతలతో పాటు వేదిక ముందే కూర్చున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దివంగత నేత ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, పరిటాల రవీంద్ర తనయుడు శ్రీరాం ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించి పార్టీ భవిష్యత్ మీద ఆశలను చూపించారు.

ఇక వీరేకాకుండా కరణం బలరాం కుమారుడు, దేవేందర్ గౌడ్ కుమారుడు అలాగే అయన్నపాత్రుడు, దయాకర్ రెడ్డి, బొజ్జల కుమారులు కూడా మహానాడులో హంగామా చేశారు. ఈ యువరక్తాన్ని చూస్తుంటే వీరిని చూస్తుంటే 1983 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారు. ఈ సంఘటనలు చూస్తుంటే లోకేష్ కు యూత్ లో మాంఛి ఫాలోయింగ్ ఏర్పడే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశంలోకి యువ రక్తం, యూత్తమ్మా ...యూత్!


ఎన్డీయే హయాంలో తెలంగాణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడ్డుకోలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఢిల్లీలో అన్నారు. అయితే చంద్రబాబు బిజెపిపై అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
జూన్ 3వ తేదిన నిజాం కళశాలలో బిజెపి బహిరంగ సభ జరుగుతుందని, అందులో జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు బలహీనపడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి పాజిటివ్ ఓటింగ్ పడుతుందన్నారు.
నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ నగారా సమితి తమ పార్టీలో విలీనమవుతుందన్నారు. రాష్ట్ర పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోందన్నారు.

చంద్రబాబు తెలంగాణను అడ్డుకోలేదు: దత్తాత్రేయ

May 27, 2013


ప్రణబ్‌ కమిటీ లేఖకు కట్టుబడి ఉంటామని స్పష్టీకరణ
ఇటీవలి అఖిలపక్ష బేటీలో ఇచ్చిన లేఖను ప్రస్తావించనున్న టీడీపీ
టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహం
కడియం వ్యాఖ్యలను చూపించే యత్నం
పార్టీ వైఖరిని ప్రశంసించిన టీ కాంగ్రెస్‌ నేతల ప్రస్తావన
గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యలనూ ప్రస్తావించనున్న దయాకర్‌
మళ్లీ తెరపైకి రఘునందన్‌ ఆరోపణలు

తెలంగాణ అంశంలో తనపై టీఆర్‌ఎస్‌ నుంచి ఎదురవుతున్న దాడిని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ మహానాడును వేదిక చేసుకోనుంది. తెలంగాణకు తానే అడ్డంకి అని, టీడీపీ లేఖ ఇస్తే తెలంగాణ వచ్చేస్తుందన్న ట్లుగా ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు చెక్‌ చెప్పడం తోపాటు, తెలంగాణపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా మహానాడు రెండవ రోజున తెలంగాణపై గతంలో చాటిన తన చిత్తశుద్ధి, ఇచ్చిన లేఖలు ప్రస్తావించి, వాటికి కట్టుబడి ఉందని తీర్మానం చేయనుంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు దీనిపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణ అంశంతో దెబ్బతీయాలని ప్రయత్నిస్తోన్న టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి మహానాడు వేదిక కానుంది. ఆ సందర్భంగా గతంలో కేంద్రమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ, అంతకంటే ముందు ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖలను ప్రముఖంగా ప్రస్తావించనుంది.

సమావేశం తర్వాత షిండే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిందని చేసిన వ్యాఖ్యలతో పాటు, సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ప్రతినిధిగా హాజరయిన కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను కూడా మహానాడు వేదిక మీద నుంచే ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఆ తర్వాత కడియం శ్రీహరి వివిధ చానళ్లు, చర్చావేదికలో పాల్గొని చేసిన వ్యాఖ్యలను కూడా తెలంగాణ ప్రజలకు ఎర్రబెల్లి గుర్తు చేయనున్నారు. ఆ సందర్భంగా టీ కాంగ్రెస్‌ ఎంపీలు తెలుగుదేశం పార్టీ విధానాన్ని ప్రశంసించిన వైనాన్ని ప్రస్తావించనున్నారు. దీనితో అటు కడియంను, తమ పార్టీ నేతలపై వల విసరడంతోపాటు, తెలంగాణలో తన పార్టీని దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఒకేసారి చెక్‌ చెప్పాలని భావిస్తున్నారు.

ప్రణబ్‌ కమిటీకి ఇచ్చిన లేఖతోపాటు, షిండే సమక్షంలో జరిగిన సమావేశంలో దానికి మద్దతుగా ఇచ్చిన లేఖకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేయనుంది. అదే సమయంలో గతంలో కేసీఆర్‌ టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను కూడా మరోసారి గుర్తు చేయనున్నారు. ప్రధానంగా 610 జీఓను ప్రస్తావించనున్నారు. 610 జీఓను అమలు చేయాలని ఇప్పుడు గళమెత్తుతున్న కేసీఆర్‌ గతంలో టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, మళ్లీ మధ్యలో తెలంగాణనే వస్తున్నప్పుడు ఇక 610 జీఓ ఎందుకని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కూడా దయాకర్‌ ప్రముఖంగా ప్రస్తావించి ఎదురుదాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కేసీఆర్‌ కుటుంబ వసూళ్లపై టీఆర్‌ఎస్‌ మాజీ నేత రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను గుర్తు చేయనున్నారు. మొత్తానికి తెలంఐగాణపై తమ పార్టీ చిత్తశుద్ధితోపాటు, ఆ అంశాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ చేస్తున్న దాడికి చెక్‌ చెప్పేందుకు మహానాడు సిద్ధమవుతోంది.

టీడీపీ మళ్లీ జై తెలంగాణ నేడు తీర్మానం ప్రవేశపెట్టనున్న దయాకర్‌రాయభారం నడిపిన బాలకృష్ణ
తెలుగుదేశంలో చేరికకు సుముఖం
బందర్‌ నుంచి పోటీకి అవకాశం
తగ్గునున్న జూ ఎన్టీఆర్‌ ప్రాధాన్యం
చిరుకు, పవన్‌కు మధ్య పెరిగిన దూరం
పీఆర్సీ విలీనాన్ని వ్యతిరేకించిన పవన్‌
రాజకీయ, సినీ వర్గాల్లో చర్చలు


సినీ స్టార్‌, కేంద్రమంత్రి చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీలో చేరను న్నారా? ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నారా? ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో జరుగుతున్న హాట్‌ టాపిక్‌ ఇది. దీనిపై ఈ రెండు వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌ తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో సినిమాలకు దూరంగా ఉండి, ఎక్కువ సమయం రాజకీయాలకే కేటా యించిన పవన్‌, అప్పట్లో దూకుడుగా వ్యవహ రించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతలను పంచెలు ఊడదీసి తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌పై చండ్రనిప్పులు కక్కారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. దానిని పవన్‌ తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ముక్కుసూటిగా మాట్లాడటం, కల్మషం లేకుండా మనసులో ఉన్నదే వ్యక్తీకరించడం, వామపక్ష భావజాలంతో పాటు, ఇతర హీరోలకు భిన్నంగా మనుషులకు విలువ-గౌరవం ఇచ్చే మానవీయ విలువలున్న వ్యక్తిగా పవన్‌కల్యాణ్‌ కు సినీ పరిశ్రమలో మంచి పేరుంది. పేదవర్గా లకు ఏదో చేయాలన్న తపన, అవినీతిపై కసి దండిగా ఉన్న పవన్‌ ఖాళీగా ఉన్న సమయాల్లో వామపక్ష భావజాల పుస్తకాలను ఎక్కువగా చదువుతుంటారు. ఇటీవలి కాలంలో చిరంజీవి తో పాటు, ఆ కుటుంబసభ్యుల సినిమా ఫంక్షన్ల కు దూరంగా ఉంటున్న పవన్‌ దృష్టి తాజాగా రాజకీయాలపై మళ్లిందని చెబుతున్నారు.

అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సినీ- రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బాలకృష్ణ ఆ మేరకు రాయబారం నిర్వ హించినట్లు తెలుస్తోంది. స్వయంగా బాలకృష్ణ పవన్‌ను వెంటబెట్టుకుని చంద్ర బాబుతో చర్చలు జరిపారని, ఆ మేరకు టీడీపీలో చేరేందుకు పవన్‌ కల్యాణ్‌ సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడుతున్నాయి. పవన్‌కు మచిలీ పట్నం సీటు ఇస్తే బాగుంటుందని బాలయ్య సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ పవన్‌ కల్యాణ్‌ టీడీపీలో చేరితే ఆయనకు మచిలీపట్నం సీటు ఖాయంగా ఇవ్వవచ్చంటు న్నారు. కాపు సామాజికవర్గం సంఖ్య ఎక్కువగా ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకమేనంటున్నారు. పవన్‌ టీడీపీలో చేరితే పార్టీకి మరో స్టార్‌ అదనపు ప్రయోజనంగా మారతారని, పవన్‌ సినీ గ్లామర్‌తో పాటు, కాపు సామాజికవర్గం కూడా మళ్లీ టీడీపీకి చేరువ య్యే అవకాశం లేకపోలేదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌ పార్టీలో చేరితే అప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద ఆశలు పెట్టు కోవల సిన అవసరం లేదన్న అంచనా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అంతా జూని యర్‌ ఎన్టీఆర్‌ రాక మీదనే చర్చిస్తున్నారని, పవన్‌ కల్యాణ్‌ పార్టీలో చేరితే జూని యర్‌ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడేవారి సంఖ్య తగ్గుతుందని పలువురు నేతలు వ్యాఖ్యా నిస్తున్నారు. ఒకవేళ జూనియర్‌ ఎన్నికల సమయానికి పార్టీలో చేరితే అప్పుడు ముగ్గురూ మూడు ప్రాంతాల్లో ప్రచారం చేస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుంద ని విశ్లేషిస్తున్నారు.

చిరంజీవి కుటుంబానికి చెందిన పవన్‌ టీడీపీలో చేరడంపై విస్మయం చెందా ల్సిన అవసరమేమీలేదని, ఇది కొత్తేమీ కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యా నిస్తు న్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ కూతురు కాంగ్ర ెస్‌లో చేరి కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజ కుమారి కూతురు సుధ వినుకొండ వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధిగా రంగంలో ఉన్నా రు. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ కోడలు మేనకాగాంధీ, ఆమె తన యుడు వరుణ్‌గాంధీ బీజేపీలో ఉండగా, ఆమె తోడికోడలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగాఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌లోఉన్న చాలా మంది సీనియర్ల తనయులు జగన్‌ పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

‘దేశం’ లోకి పవన్‌?నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు


రానున్న ఎన్నికలపై చంద్రబాబురాష్ట్రంలో కాంగ్రెస్‌ది దుష్టపాలన
-కిరణ్‌కుమార్ సీల్డ్ కవర్ సీఎం
-సోనియా చెపితేనేమంత్రులతో రాజీనామా
-అందుకు మా పోరాటమే కారణం
-కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు
-కేంద్రంలో పనికిమాలిన సర్కారు
-ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేదు
-జగన్ అవినీతితోరూ.43వేల కోట్లు నష్టం
-ఈ మాట సీబీఐ చెప్పినదే
-మహానాడులోటీడీపీ అధినేత వ్యాఖ్యలు

:రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అఖండ విజయం ఖాయమని ఆ పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పారు. టీడీపీ గెలుపు చారివూతక అవసరమని అభివర్ణించారు. కేంద్రంలో మూడవ ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీ కీలకపాత్ర నిర్వహించనుందని చెప్పారు. సోమవారం గండిపేటలోని తెలుగు విజయంలో రెండు రోజులు జరిగే పార్టీ మహానాడును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసిన చంద్రబాబు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్షికమాలను వివరించారు. జైల్లో ఉన్నవారు బెయిలు కోసం పని చేస్తుంటే.. తాను లోక కల్యాణం కోసం పని చేస్తున్నానన్నారు. వివిధ అంశాలపై చంద్రబాబు ప్రసంగం క్లుప్తంగా.. ఆయన మాటల్లోనే..

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర
దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ.. 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేసింది. దేశంలో నాలుగు కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తే అందులో మూడు టీడీపీ చొరవతో ఏర్పడినవే. చరిత్ర పునరావృతం అవుతుంది. వచ్చే ఏడాది కేంద్రంలో కింగ్‌మేకర్ టీడీపీయే. మూడో కూటమి ఏర్పాటులో టీడీపీ ప్రధాన పాత్ర పోషించబోతున్నది. దేశానికి ప్రధాని, దేశాధ్యక్షులను, స్పీకర్‌లను నియమించిన ఘనత టీడీపీది. కాంగ్రెస్‌కు కేంద్రంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. పన్నులు పెంచారు. సహజవనరులు దోచుకున్నారు. అవినీతి డబ్బు టెర్రరిస్టుల వరకు వెళుతోంది. కేంద్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో ఆడబిడ్డను బస్సులో రేప్ చేసి చంపేశారు. కేంద్రం బలహీనంగా ఉండటంతో పక్కదేశాలలో కూడా పరపతి పెంచుకోలేక పోయారు. కేంద్రన్యాయ మంత్రి దోషులను కాపాడే ప్రయత్నంలో సీబీఐ నివేదిక తెప్పించుకొని, మార్చిన సంఘటనలో పదవి పోగొట్టుకున్నారు. అల్లుడి వ్యవహారంతో రైల్వే మంత్రి రాజీనామా చేయించాల్సి వచ్చింది. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. కర్ణాటక, తమిళనాడులో అదే జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మాఫియా, రౌడీయిజం ఇష్టానుసారంగా రాజ్యమేలుతున్నాయి.

టీడీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది

రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 2014లో టీడీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. మూడవ ప్రత్యామ్నాయంలో చొరవ చేసేది టీడీపీనే. టీడీపీ గెలుపు చారివూతక అవసరం. టీడీపీ అధికారంలోకి రాగానే వృద్ధులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.1500 పింఛన్లు ఇస్తాం. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు న్యాయం చేస్తాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారు ఉండాలనుకుంటున్న ప్రాంతాల్లో ఇంటిని నిర్మించి ఇస్తాం. మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటాం. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. బ్రహ్మణుల కోసం రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. కాపులకు రూ.5000 కోట్లు కేటాయిస్తాం. బీసీలకు వంద సీట్లు ఇస్తాం. దళిత క్రిస్టియన్‌లను ఎస్సీలుగా గుర్తిస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. 500 మంది ప్రజలున్న తండాలను పంచాయతీలుగా గుర్తిస్తాం. మైనార్టీలకు రూ.2500కోట్ల కేటాయింపుతో పాటు 15 సీట్లు ఇస్తాం.

కిరణ్ పనికిమాలిన సీఎం

కిరణ్‌కుమార్‌డ్డి సీల్డ్ కవర్ సీఎం. 70సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఇంటింటికి తిరుగుతారు. ఏం సాధించారు? తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. సోనియా చెప్పిందే చేస్తారు. పనికిమాలిన సీఎం. మంత్రుల రాజీనామా కూడా సోనియా చెపితేనే చేయించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కు 33 మంది ఎంపీలు, 10 మంది మంత్రులు ఉన్నారు. వీరు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిటి? రాష్ట్రంలో ప్రాణహిత- చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురాలేక పోయారు. ఏపీ అంటే కేంద్రానికి లెక్కలేనితనం. కరువు, వరద ప్రాంతాలకు రూ.56 వేల కోట్ల సహాయం అడిగితే కేవలం రూ.ఆరు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. కరువు పనుల కోసం 54 లక్షల టన్నుల బియ్యాన్ని పనికి అహార పథకం కింద తీసుకువచ్చి కరువు పనులు చేయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే.

కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు

వైఎస్ అధికార దుర్వినియోగం చేసి లక్ష కోట్లుదోచుకున్నారని ఆయన బతికున్నప్పుడే అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టాం. దీనిని సీబీఐ నిర్ధారించింది. రూ.43 వేల కోట్లు అవినీతి వల్ల నష్టపోయామన్న సీబీఐ దీనికి వైఎస్ కొడుకు జగన్‌ను దోషిగా నిలబెట్టింది. మంత్రులతో కలిసి దోపిడీ చేశారు. 26 జీవోలపై మంత్రులు తెలియకుండానే సంతకాలు పెట్టారా? కాంగ్రెస్ పార్టీ దొంగల రైలు. ఆ రైల్లో డ్రైవర్ ఒక్కరే మారారు. అంతా (మంవూతులు) వాళ్లే. ఒకరు ఏ-4, మరొకరు ఏ-5, ఇంకొకరు ఏ-6. ఇంకో మంత్రికి ఫెమా ఉల్లంఘన కేసులో శిక్ష పడింది. అయినా వీరంతా మంత్రి వర్గంలో ఎలా ఉంటారు? ఈ కళంకిత మంత్రులను పూర్తిగా బర్తరఫ్ చేసే వరకు టీడీపీ పోరాడుతుంది. మా పోరాటం ఫలితంగానే ఇద్దరు మంత్రులు పోయారు.

ధనయజ్ఞంగా జలయజ్ఞం
జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి, రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో రూ.35 వేల కోట్లు దోచుకున్నారని విచారణ సంస్థలు తెలిపాయి. వైఎస్ నుంచి కిరణ్ వరకు అంతా దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను వారికి కావాలసినవాళ్లకు సెజ్‌ల పేరుతో ఇచ్చేస్తున్నారు. వాన్‌పిక్‌లో 22 వేల ఎకరాల భూమిని ప్రజల నుంచి లాక్కుని కారుచౌకగా ఇచ్చారు.

నా రాజకీయ చరివూతలో మరపురాని ఘట్టం ‘వస్తున్నా... మీ కోసం’
కాంగ్రెస్ దుష్టపాలన వల్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో నేను హైదరాబాద్‌లో ఉండలేక ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్ర చేశాను. నా రాజకీయ చరివూతలో ఇది మరపురాని ఘట్టం. ప్రజలు, కార్యకర్తలు ఏడు నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ప్రజల స్ఫూర్తే నన్ను నడిపించింది. అడపిల్లలకు రక్షణ లేదని, ఇంటి దగ్గర కూడా స్వేచ్ఛగా ఉండ లేకపోతున్నారని అనేక మంది పాదయావూతలో నాకు చెప్పారు. బానిస బతుకులు బతుకుతున్నామని తూర్పుగోదావరి జిల్లాలో ఒక గీత కార్మికుడు వాపోయాడు. ఎంతపని చేసినా కడుపునిండటం లేదని, దొంగలు నిలువు దోపిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటలు చూస్తే వారి పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. నిజమాబాద్ జిల్లాలో అర్ధరాత్రి మూలుగులు వినిపిస్తుంటే.. మీడియా వాళ్లు చెపితే వెళ్లి చూశాను. తిండి లేక ఓ వృద్ధురాలు దీనావస్థలో కనిపించింది. ఈ పరిస్థితులను చూసి నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ సమస్యలు పరిష్కరించే బాధ్యత టీడీపీకి ఉంది.

కాంగ్రెస్ పాలన వల్లే అంధకారం

కాంగ్రెస్ దుష్ట, అసమర్థ, అవినీతి పాలనవల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లింది. 2004లో మిగులు బడ్జెట్, మిగులు కరెంటుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే నేడు అంధకారంలోకి తోశారు. తొమ్మిదేళ్లలో రూ.25 వేల కోట్ల చార్జీలు పెంచారు. ఇది కాకుండా ఎఫ్‌ఎస్‌ఏ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల పరిక్షిశమలు మూతపడ్డాయి. 20-30 లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ఎరువుల ధరలు పెంచడం వల్ల వ్యవసాయ ఖర్చులు 300% పెరిగితే, పంటకు కేవలం 30% మాత్రమే మద్దతు ధరలు పెరిగాయి. ఈ తొమ్మిదేళ్లలో 22,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆదర్శ రైతులంటూ కాంగ్రెస్ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసింది. టీడీపీ హయాంలో సాగునీటి సంఘాలు పెట్టి నీటి యాజమాన్య పద్ధతులను పాటించాం. ప్రాజెక్టులకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తే, కాంగ్రెస్ జలయజ్ఞం పేరుతో రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయింది.

జయం టీడీపీదే కేంద్రంలో మాదే కీలకపాత్ర