January 31, 2013

పచ్చటి మొక్కలను గానీ, ఆ రంగులో ఉన్న ఏవైనా దృశ్యాలను గానీ చూడాలని అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యులు సూచిస్తారు. పాదయాత్రను పునఃప్రారంభించిన నాకు తొలి అడుగులోనే విద్యార్థులు ఎదురుకావడం అలాంటి 'పచ్చటి' హాయి కలిగించింది. నాలుగు రోజుల తరువాత కూడా ఆరోగ్య సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి

చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు ఇప్పటికీ నియంత్రణలోకి రాలేదు. కాలు మెలిక పడినప్పుడు చీలమండ వద్ద బెణికింది. ఆ నొప్పి ఇంకా సర్దుకోలేదు. మూడు వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. కానీ, జనం మధ్యనే నాకు నిజమైన విశ్రాంతి! వారితో ఉంటేనే మిన్నగా కోలుకుంటాననిపిస్తోంది. పైగా, వాళ్ల సమస్యలపై మనసు పెడితే నా బాధలు కాస్త నెమ్మదిస్తాయనేది ఒక ఆలోచన. దానికోసం 117 రోజుల సుదీర్ఘ పాదయాత్రను..మరింత ముందుకు తీసుకెళుతున్నా!

పేరుకే విశ్రాంతి. నడక లేదనే గానీ, ఈ నాలుగు రోజులూ ప్రజలను కలుసుకుంటూనే ఉన్నాను. కాకపోతే, ఇప్పటిదాకా నేనే వాళ్ల దగ్గరకు పోయేవాడిని. ఇప్పుడు వాళ్లే నా దగ్గరకు వచ్చారు. టీచర్ల నుంచి హోటల్ వర్కర్స్ దాకా బృందాలుగా వచ్చి కలిశారు. వ్యాట్ రద్దు పోరాటంలో తమకు మా పార్టీ ఇచ్చిన మద్దతుకు వస్త్ర వ్యాపారుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఇంత చేసినా వాళ్ల సమస్య మాత్రం అలాగే ఉంది.

వాళ్లనే కాదు, ఉద్యోగుల నుంచి వృత్తిదారుల దాకా ఎవరినీ పట్టించుకొని పరామర్శించే పరిస్థితిలో ఈ పాలకులు లేరు. పన్నులు, సర్‌చార్జీలు మోపేటప్పుడు తప్ప వీళ్లకు ప్రజలనేవారు గుర్తుకు వస్తారా అసలు? "మరి మీరు మాత్రం ఏమి చేస్తారు? ఢిల్లీ గ్యాంప్ రేప్ పునరావృతం కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారు'' అని ఆ విద్యార్థిని దాదాపు నన్ను నిలేసింది. ఆ రేపిస్టులను ఉరి తీయాలన్న ఆవేశం పరిటాలలో కలిసిన విద్యార్థినుల్లో కనిపించింది. చట్టాల్లో మార్పులు రాకుండా వీళ్లకీ చెర వీడదు!

జనం మధ్యే కోలుకుంటా..

రాష్ట్రంలోని పేదలు, రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతే వారిని ఆదుకోడానికి చేతులు రాని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సహకార ఎన్నికల్లో ఓటుకు ఇరవై నుంచి రూ.30 వేలను ఎవడబ్బా సొమ్మని ఖర్చు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. గురువారం జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓటుకు నోటు విధానాన్ని అవలంబించిందని ఆయన విమర్శించారు. డబ్బులను విచ్చల విడిగా ఖర్చు చేసి దొడ్డిదారిన సహకార సంఘాల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నించిందని విమర్శించారు.

ఇక్కడా ఓటుకు నోటు: బాబు

వారి దృష్టిలో అన్యాయమంటే ఏమిటీ?..
అసలు జైలుకెందుకెళ్లాడో..?
జగన్‌పై చంద్రబాబు నిప్పులు
పునఃప్రారంభమైన పాదయాత్ర
కృష్ణాజిల్లా నందిగామలో 7.3 కిలోమీటర్లు నడక

  జైలు పార్టీకి ఓటు వేస్తే జీవితాలు అంధకారమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగని, అసమర్థ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారా.. రాష్ట్రం మరింత అధోగతి పాలుకావడం ఖాయమని హెచ్చరించారు. ఆరోగ్య సమస్యలతో నాలుగు రోజుల విరామం అనంతరం గురువారం చంద్రబాబు పాదయాత్రను పునఃప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం దోనబండ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. సత్యనారాయణపురం, కేతనకొండ, మూలపాడు మీదుగా 7.3 కిలోమీటర్లు నడిచారు.

అంతకుముందు, పరిటాల గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. తొలుత ఎంవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానూ, పాదయాత్రలోనూ, సభల్లోనూ కాంగ్రెస్, వైసీపీలపై నిప్పులుచెరిగారు. ఆవ్యక్తి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందనేది ప్రజలు సీరియస్‌గా తీసుకుని ఆలోచించాలని పరోక్షంగా జగన్ అంశాన్ని ప్రస్తావించారు.

ఎవరి మీదో కోపంతో తాను ఈ విషయాలు చెప్పడం లేదని, అవినీతి వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ ఐదు సంవత్సరాల నాలుగునెలల పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన వారే ఇప్పడు మాయ మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అన్యాయం జరిగిపోయిందంటున్నవారి దృష్టిలో ఆ మాటకు అర్థం ఏమిటని పరోక్షంగా జగన్ పార్టీ నేతలను ప్రశ్నించారు.

దుర్మార్గులపై తాను సాగిస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలని పిలుపు నిచ్చారు. "దుర్మార్గులు తింటే తిన్నారులే అని మీరు ఊరుకోవద్దు. మీరు వాడే ప్రతి వస్తువుపైనా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ. లక్షా 25 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. దాన్నంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తూ ప్రజల నెత్తిన భారాలు మోపింది. ఈ రోజు జిల్లాలో కృష్ణానది ఉన్నా తాగునీటికి దిక్కు లేదు. సాగర్ నుంచి ఇక్కడకు నీరు విడుదల కాదు. ఈ విషయాలన్నీ ఆలోచించండి'' అని ప్రజలను కోరారు.

జైలు పార్టీని గెలిపిస్తే అంధకారమే!

నేటి నుంచి మళ్లీ నడక

టీడీపీ అధినేత చంద్రబాబు కాలు నొప్పి కాస్త ఉపశమించింది. షుగర్ లెవల్స్ మాత్రం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. అయినా, చంద్రబాబు తన పాదయాత్రను గురువారం నుంచి పునఃప్రారంభించనున్నారు. ఇకనుంచి రోజుకు పది కిలోమీటర్లు మించి నడవరాదని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 117 రోజులపాటు నడక సాగించిన చంద్రబాబు సుమారు 1860 కిలోమీటర్లు పర్యటించారు.

ఈనెల 26న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల చేరుకున్నారు. కాలు నొప్పి, కీళ్ల నొప్పులు, షుగర్ లెవల్స్ పెరగడంతో ఎనిమిది నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు చెప్పినా.. ససేమిరా అన్న బాబు.. నాలుగు రోజుల విశ్రాంతి సరిపోతుందని వారికి నచ్చచెప్పారు. బుధవారం సమన్వయ కమిటీ సభ్యులతో బస్సులోనే రెండు గంటలపాటు చర్చించారు. గురువారం ఉదయం 11 గంటలకు తనతోపాటు 117 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సిబ్బంది, స్వచ్ఛంద దళాలు, పోలీసులు తదితరులను ముఖాముఖి కలుస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి రామమోహనరావు తెలిపారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు బస చేసిన ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు ఉన్న మూలపాడు గ్రామం వరకు కాలి నడకన వెళతారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన 9.7 కిలోమీటర్లు నడుస్తారు. రెండో తేదీన వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచనను బట్టి ఎన్ని కిలోమీటర్లు వెళ్లాల్సింది నిర్ణయిస్తారు. వైద్యుల సూచనలను బట్టి పాదయాత్ర దూరాన్ని పెంచడమో లేదా తగ్గించడమో అన్నది ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు కాలునొప్పి కొంత ఫర్వాలేదని గరికపాటి చెప్పారు.

పాదయాత్ర పునఃప్రారంభానికి బాబు రెడీ

కాలివేలి గాయంతో బాధపడుతున్న చంద్రబాబునాలుగు రోజుల విశ్రాంతి అనంతరం గురువారం తిరిగి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. చంద్రబాబు పాదయాత్ర తిరిగి ప్రారంభం కావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం తొణికిసలాడుతోంది. బుధవారం తనను పరామర్శించడానికి వచ్చిన నాయకులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు...

కాలివేలి గాయంతో బాధ పడుతున్న చంద్రబాబు (ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి) 111 గంటల విశ్రాంతి అనంతరం గురువారం తిరిగి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం తొణికిసలాడుతోంది. చంద్రబాబు బుధవారం బిజీ బిజీగా గడిపారు. ఆయనను పరామర్శించటానికి నాయకులు క్యూ కట్టారు. చంద్రబాబును కలిసిన వారిలో యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు, కోడెల శివప్రసాదరావు, నెట్టెం రఘురామ్, దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకరరావు, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్, చిగురుపాటి వరప్రసాద్, చంద్రశేఖర్, వర్ల రామయ్య, తొండపు దశరధ జనార్ధన్‌రావు, కేశినేని నాని, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. వారితో ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాలు, సహకార ఎన్నికలు, ఎమ్మల్సీ ఎన్నికలపై గురించి చర్చించారు. సహకార సంఘాలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవడంతో చంద్రబాబు ఆరోగ్యం మెరుగ్గా ఉందని నాయకులు చెప్పారు. మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నప్పటికీ ఆయన అంగీకరించడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆరోగ్యంను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారన్నారు.

చంద్రబాబును

పరామర్శించిన నారాయణ


సీపీఐ కార్యదర్శి కె.నారాయణ, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సీనియర్ నాయకులు సూర్యదేవర నాగేశ్వరరావు, జరబన నాగేశ్వరరావు, చుండూరు సుబ్బారావు తదితరులు చంద్రబాబును పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యం బాగా లేదంటే బాబును చూడటానికి వచ్చాం తప్ప.. రాజకీయాలు గురించి మాట్లాడలేదని నారాయణ అన్నారు. పాదయాత్ర విజయవంతం కావాలని, చంద్రబాబు లక్ష్యం నేరవేరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై జాతీయ స్థాయిలో ఆందోళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. సమస్యల గురించి వివిధ పార్టీల నాయకులతో చర్చించి జాయింట్ యాక్షన్ ప్లాన్ రూపొందించి ఉద్యమం చేపడతామని నారాయణ అన్నారు.

సమైక్యాంధ్ర కోసం

గంగాధర్ వినతిప్రతం అందజేత

విజయవాడకు చెందిన పార్టీ కార్యకర్తలు చంద్రబాబుకు బైబిల్‌ను అందచేశారు. కొరియా నుంచి తెప్పించిన బైబిల్‌కు బెంగళూరులో చర్చి ఫాదర్లతో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆధ్వర్యంలో చంద్రబాబును కల్సి పరిశుద్ధ గ్రంథాన్ని అందజేశారు. తెలుగు జాతిని దొరల దోపిడీకి, పాలెగాళ్ల దాష్టిీకాలకు, మతోన్మాదుల ఉన్మత్త చర్యలకు బలిచేయవద్దని, సమైక్యాంధ్ర రాష్ట్రమే తెలుగు జాతి ఆకాంక్షని పేర్కొంటూ పీసీసీ డాక్టర్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ జి.గంగాధర్, చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.పట్టాభి రామ్, కార్యదర్శి కె.బిందు మాధవరావు, సభ్యులు చంద్రబాబును కల్సి సమస్యలు వివరించారు. వస్త్రలత అసోసియేషన్, విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వచ్చి వ్యాట్‌ను తప్పించటానికి సమస్యపై పోరాడాల్సిందిగా పిలుపునిచ్చారు. అలాగే స్కూల్స్ ప్రతినిధులు కూడా వచ్చి తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు.

నాలుగు రోజుల వినామానంతరం...వస్తున్నా మీ కోసం

January 29, 2013

పాదయాత్రకు బ్రేక్ ఇవ్వటంతో బహుదూరపు బాటసారి మరో రెండు రోజులు పరిటాల వద్ద బస్సులోనే గడపనున్నారు. హైదరాబాదు నుంచి వైద్య పరీక్షల నివేదికలు సోమవారం సాయంత్రం అందగానే పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. గ్రీన్‌వేలో బస చేసిన చంద్రబాబు శిబిరం లోపలికి పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు అనుమతించటం లేదు. సోమవారం బాబును అతికొద్ది మంది నాయకులు మాత్రమే కలిసి మాట్లాడారు.ఉమా ప్రత్యేక పూజలు చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు పరిటాల ఆంజనేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో టీడీపీ నేతలు, మాగంటి పుల్లారావు, డాక్టర్, వీరాస్వామి, శ్రీనివాస్ ప్రసాద్ , బి. సూర్యప్రకాష్, గుత్తా రమేష్ తదితరులు పొల్గొన్నారు.

స్వామి ప్రసాదాన్ని బాబుకు అందచేశారు. అక్టోబర్ రెండున ప్రారంభించిన పాదయాత్ర ఈనెల 26కు 117 రోజులు పూర్తైంది. ఆరోజున చారిత్రక ప్రసిద్ధిచెందిన పరిటాల గ్రామంలో కేశినేని నాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 117 అడుగుల పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. వైద్య పరీక్షల నివేదికలు హైదరాబాదు నుంచి సోమవారం సాయంత్రానికి అందాయి. మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. వైద్యుల బృందం తప్పనిసరిగా మూడు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ చంద్రబాబు అంగీకరించ లేదు. ప్రజల కోసం పాదయాత్ర కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్న బాబు కేవలం రెండు రోజులు ఈనెల 29, 30 తేదీలలో విశ్రాంతి తీసుకునేందుకు అంగీకరించారని సాయంత్రం శిబిరం వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు మీడియాకు చెప్పారు.

31 మధ్యాహ్నం నుంచి మైలవరం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించనున్నారు. కొద్ది రోజులు పాటు రోజుకు ఏడు నుంచి పది కిలోమీటర్లు మాత్రమే నడిచి విశ్రాంతి తీసుకుంటే మంచిదన్న వైద్యుల సూచనను పార్టీ వర్గాలు ఉటంకిస్తున్నాయి. సోమవారం కూడా బాబు బస్సు నుంచి బయటకు రాలేదు. ఉదయం జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా, స్థానిక శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, పాదయాత్ర విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎంఎల్ఏ పరసా రత్నం, కోగ ంటి బాబు, చంద్రబాబును కల్సి కొద్దిసేపు మాట్లాడారు.

బస్సులోనే బాబు

వైద్యుల సూచనలకు తలొగ్గిన చంద్రబాబు
పది రోజుల విరామానికి మాత్రం ససేమిరా

చంద్రబాబు పాదయాత్రకు మరో రెండు రోజు లు విరామం ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆయన యాత్రను పునఃప్రారంభిస్తారు. కాలినొప్పి తీవ్రంగా బాధిస్తుండటం, నడుంనొప్పి, గొంతు సమస్య వేధిస్తున్న నేపథ్యంలో రెండు రోజులుగా చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. కంచికచర్ల మండలం పరిటాల వద్ద క్యాంపులో ప్రస్తుతం ఆయన బస చేశారు.

బాబు వైద్య పరీక్ష నివేదికలను పరిశీలించిన వైద్యులు, 8 నుంచి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకుంటేనే సాధారణ స్థితికి వస్తారని తేల్చిచెప్పారు. చక్కెర శాతం పెరగడం, ఎడమ కాలు చిటికెన వేలు గా యం ఇంకా నొప్పి కలిగించటం, మడమ నొప్పిగా ఉండటంతో విశ్రాంతి తప్పనిసరి అని తేల్చారు.

దీనిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, చంద్రబాబు కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు. డాక్టర్ల సల హా మేరకు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అయితే, అన్ని రోజుల విశ్రాంతికి చంద్రబాబుకు ఒ ప్పుకోలేదు. 2 రోజులు విశ్రాంతి సరిపోతుందని, గురువారం నుంచి యాత్రను కొనసాగిస్తానని సర్దిచెప్పారు. ఈ విషయాన్ని గరికపాటి విలేకరులకు వెల్లడించారు.

గురువారం నుంచి యాత్ర పునఃప్రారంభం

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబును రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యుల సూచన మేరకు ఈనెల 31 నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 117 రోజుల పాటు పాదాయాత్ర చేసిన చంద్రబాబు కాలి నొప్పితో బాధపడుతున్నారు. బాబుకు వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు 8 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే దీనికి అంగీకరించిన బాబు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.

చంద్రబాబు పాదయాత్రకు రెండు రోజుల విరామం

January 27, 2013

నేడూ విరామమే!
నేడు మరోసారి పరీక్షలు చేయాలని నిర్ణయం
అంగీకరించిన చంద్రబాబు.. ఒక్కరోజు వాయిదా
పరీక్షల తరువాత యాత్రపై
నిర్ణయం తీసుకుంటాం: ఉమా, గరికపాటి

కాలినొప్పితో తీవ్రంగా బాధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో రోజు విశ్రాంతి అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సోమవారం కూడా ఆయనకు పరీక్షలు కొనసాగించాల్సి ఉంటుందని బృందం అభిప్రాయపడటంతో మరోరోజు పాదయాత్రను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఆ తరువాతే పాదయాత్ర కొనసాగింపు గురించి నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారమిక్కడ ప్రకటించారు.

ప్రస్తుతం పరిటాలలోని జాతీయ రహదారి పక్కన గల స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని 'గ్రీన్‌వే'లో ఆయన బస చేశారు. ఆయనకు ప్రత్యేకించిన బస్సులో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాకేశ్, డయాబెటిక్ డాక్టర్ సురేశ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ మధులిక వైద్య పరీక్షలు నిర్వహించారు. నొప్పులతో పాటు షుగర్ లెవల్స్ పెరగటంతో వారం పది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇప్పటికిప్పుడు ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ పాదయాత్ర వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు చెప్పారు.

కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉండడంతో పాదయాత్ర కొనసాగిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వైద్యులు హెచ్చరిస్తున్నారని, విశ్రాంతి తీసుకోవాలని కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారని చెప్పారు. అయినా, పాదయాత్రకు విరామం ప్రకటించేందుకు బాబు అంగీకరించటం లేదని గరికపాటి మోహనరావు, దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజల కోసం శక్తి ఉన్నంత వరకు పాదయాత్ర కొనసాగించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారన్నారు. సోమవారం వరకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్టు పేర్కొన్నారు.

బాబుకు ప్రత్యేక వైద్యబృందం పరీక్షలు


లలా సందడిగా ఉండే చంద్రబాబు పాదయాత్ర శిబిరం ఆదివారం బోసిపోతూ కనిపించింది. శిబిరం వద్దకు ఎవరూ రావద్దని చంద్రబాబు ఆదేశించటంతో నాయకులు గాని, పార్టీ కార్యకర్తలు గాని శిబిరం వైపు తొంగి చూడలేదు. బాబు కూడా రోజంతా బస్సులోనే గడిపారు. శిబిరం బయట పోలీసులు, లోపల మీడియా హడావుడి తప్పితే అంతటా నిశబ్ద వాతావరణం నెలకొన్నది. వస్తున్నా మీకోసం అంటూ అక్టోబర్ రెండు నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 117వ రోజుకు జిల్లాలో కంచికచర్ల మండలం పరిటాల చేరుకున్న సంగతి విదితమే. ఎడమ కాలు చిటికెన వేలు పుండు మానకపోవటం, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, గొంతు నొప్పితో బాధపడుతున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు ఆదివారం పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించి, ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జాతీయ రహదారి పక్కన గ్రీన్‌వేలో శనివారం రాత్రి బస చేశారు.

బోసిపోయిన శిబిరం ఒక యజ్ఞంలా సాగుతున్న పాదయాత్రలో ప్రారంభం నుంచి ఐదు వందల మంది పాల్గొంటున్నారు. మొత్తం 25కు పైగా వాహనాలు ఉంటున్నాయి. సాధారణంగా రాత్రి బస చేసే శిబిరం వద్ద తెల్లారి పాదయాత్ర మొదలు పెట్టే వరకు చంద్రబాబును కలిసేందుకు వచ్చే పార్టీ నాయకులు, చూసేందుకు వచ్చే కార్యకర్తలతో కోలాహలంగా ఉంటుం ది. అలాంటిది గ్రీన్‌వేలో ఏర్పాటు చేసిన శిబిరం ఆదివారం ఉదయం బోసిపోతూ కనిపించింది. ఏ మా త్రం సందడి లేదు. అక్కడి వాతావరణం నిశబ్దంగా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, స్థానిక విలేకరులు, పోలీసులు తప్పితే పార్టీ నాయకులు గాని, ఇతరులు గాని శిబిరంలోకి అడుగుపెట్టలేదు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యక్ష ప్రసారాలకు మాట్లాడేందుకు కూడా ఎవరూ దొరకలేదు.

పార్టీ నాయకులు ఎవరూ రావద్దని చంద్రబాబు ఆదేశించటంతో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాలేదు. ఇక బాబు కూడా బస్సులో నుంచి బయటకు రాలేదు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు. దీనికితోడు చంద్రబాబును చూసేందుకు కంచికచర్ల, పరిటాలకు చెందిన పలువురు కార్యకర్తలు వచ్చినప్పటికీ పోలీసులు శిబిరంలోకి అనుమతించ లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా రత్నం శిబిరం వద్దకు వచ్చినప్పటికీ చంద్రబాబును కలవలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు ఒక్కరే చంద్రబాబును కల్సి మాట్లాడారు.

బస్సులోనే వైద్య పరీక్షలు హైదరాబాదు నుంచి వచ్చిన వైద్యులు డాక్టర్ రాకేష్, డాక్టర్ సురేష్, డాక్టర్ ముధులిక బస్సులోనే చంద్రబాబుకు బీపీ, సుగర్, ఈసీజీ ఇతర వైద్యపరీక్షలు నిర్వహించారు. పాదయాత్ర చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని, వారం పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రజల కోసం పాదయాత్ర చేయాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించేందుకు ససేమిరా అంటున్నారు. కనీసం మూడు రోజులైనా విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

నేడూ విరామం బాబుకు సోమవారం మరి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నందున పాదయాత్రకు మరొక రోజు విరామం ప్రకటించినట్టు గరికపాటి మోహనరావు, దేవినేని ఉమా మీడియాకు వెల్లడించారు. పాదయాత్ర కొనసాగించేది, లేదా విరా మం ఇచ్చేది సోమవారం సాయంత్రం ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీంతో సోమవారం కూడా బాబు గ్రీన్‌వేలోనే బస చేయనున్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు సోమవారం హరికృష్ణ గాని బాలకృష్ణ గాని వస్తారని ప్రచారం సాగుతుండగా, సాయంత్రం వరకు తమకు ఏలాంటి సమాచారం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

బోసిపోయిన శిబిరం

ఈ రెండు రోజులకు ఈ దేశంలో ఒక ప్రత్యేకత ఉంది. కుల మతాలు, జాతి వర్ణాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ పవిత్రంగా భావించే రోజులివి. అందుకే ఈ రెండు రోజులను దృష్టిలో పెట్టుకొని 117 రోజులపాటు ప్రజల్లో మమేకం కావాలని, వాళ్ల కష్టాల్లో పాలుపంచుకోవాలని నేనీ పాదయాత్ర ప్రారంభించాను. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలన చూశాక ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన తరుణం ఇదేనని అడుగు ముందుకేశాను. ఎందరో మహానుభావుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చింది. అయితే, అది రాజకీయ స్వాతంత్య్రమే. పేదలకు ఆర్థిక స్వాతంత్య్రం ఇంకా రాలేదనే విషయం పాదయాత్రలో మరోసారి అర్థమయింది.

ఇప్పటికి కొన్ని వందల గ్రామాలు తిరిగాను. కొన్ని లక్షలమంది గుండెచప్పుళ్లు విన్నాను. ఎవరినీ కదిలించినా కష్టాలూకన్నీళ్లే. ఎవరి జీవితాలు చూసినా అధఃపాతాళాల్లోనే. రాష్ట్రంలో అసలేమి జరుగుతుందో తెలియనివారు కొందరు.. తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయతలో మరికొందరు ఉన్నారనిపించింది. వారంతా చేయూత కోసం కళ్లలో వత్తులు వేసుకొని చూడటం గమనించాను. రైతులు, మహిళల నుంచి యువత, ఉద్యోగుల దాకా, ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ప్రశాంతంగా లేదు. కులవృత్తులు, చేతివృత్తులు చితికిపోయాయి.

ఎవరిని కదిలించినా కన్నీళ్లే తప్ప ముఖంలో కళ లేదు. దీన్నంతా చూసిన తరువాతే 30 ఏళ్లు ప్రజల ఆదరణ పొందిన ఒక సీనియర్ నేతగా వాళ్లకు అండగా నిలవాల్సిన బాధ్యత నాపై ఉందనిపించింది. ఈ క్రమంలో ఎన్ని కష్టనష్టాలొచ్చినా నడక ఆపొద్దని ఆనాడే నిశ్చయించుకున్నాను. కాలి చిటికెనవేలు నుంచి గొంతు సమస్య వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు దగ్గరగా ఉండాలనేదే నా సంకల్పం. ఇన్నాళ్లు తిరిగిన తరువాత ప్రజల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి పల్లెని, పట్టణాన్ని పాఠశాలగా భావించాను. ఇకముందూ ఈ అభ్యాసం, అధ్యయనం కొనసాగుతాయి. అది ఎంతవరకు అనేది కాలమే చెప్పాలి.

అడుగు మునుముందుకే..

January 26, 2013


మండలంలోని నక్కలంపేట, పరిటాలలో శనివారం జరిగిన చంద్రబాబు పాదయాత్రకు విశేష స్పందన లభించింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. బాబును పూలపై నడిపించారు. మహిళలు గుమ్మడి కాయలతో దిష్టి తీసి, పాదయాత్ర విజయవంతం కావాలని హారతులిచ్చి దీవించారు. బాబు వెంట నడిచారు. ముస్లిం మహిళలు సైతం బాబును ఆశీర్వదించారు. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, ఒక బల్బు ఉన్నప్పటికీ వేలల్లో వస్తున్న బిల్లులు చూసి తట్టుకోలేకపోతున్నామని మహిళలు వాపోయారు. స్పందించిన బాబు టీడీపీ అధికారంలోకి వచ్చేవరకు ఓపిక పట్టాలన్నారు. పైలాన్ ఆవిష్కరణకు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తరలివచ్చారు. పైలాన్ వద్దకు బాబును, భువనేశ్వరిని పూలపై డిపించుకుంటూ తీసుకువెళ్లారు. పరిటాలలో జనస్పందన చూసి బాబు సంతోషం వెలిబుచ్చారు. పరిటాలకు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నిజాంపై తిరుగు బాటు చేసి స్వతంత్ర గడ్డగా ఏర్పడిందన్నారు.

టీడీపీలో కూడా పరిటాలకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. 117 అడుగుల పైలాన్ నిర్మాణానికి రూ.20 లక్షలు విలువచేసే స్థలాన్ని వితరణగా అందజేసిన కోగంటి రామారావును, పైలాన్ ఏర్పాటు చేయించిన కేశినేని నాని, ఇంజనీర్ ఎస్.వి. రమణ, చావా రమేష్‌లను చంద్రబాబు సన్మానించారు. సభకు హజరైన అందరితో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధికి, పేదరికం నిర్మూలనకు కృషి చేస్తానని, అవినీతిని సమూలంగా నిర్మూలిస్తానని, దేశ సంపదను ఇతర దేశాలకు తరలించకుండా కాపాడతానని, ఇప్పటికే తరలించుకుపోతున్న లక్షల కోట్ల రూపాయలను దేశానికి రప్పిస్తామని, ప్రజా ఆస్తులను కాపాడతానని, శాంతి సౌభాగ్యాలను పరిరక్షిస్తానని అంటూ త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నానని అంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

పూలబాట

ప్రస్తుతం విద్యార్థుల ఆలోచనా ధోరణి మారాలి... రాజకీయంగా కూడా చైతన్యం రావాలి.. అవినీతిని రూపుమాపేందుకు విద్యార్థులు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కంచికచర్ల కేసీఆర్ అండ్ ఎస్ఎస్ క్లబ్‌లో శనివారం అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు కొనసాగిస్తాం, అగ్రవర్ణాల పేద పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.* ఎన్.తేజస్వీ: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు కొనసాగించాలి చంద్రబాబు: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టింది టీడీపీయే. మా ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలు చేశాం. ఆర్థిక పరిస్థితి వల్ల పలువురు చదువుకోలేక పోతున్నారు. టీడీపీ చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. తప్పనిసరిగా ఫీజు రీయింబర్ ్సమెంట్, ఉపకార వేతనాలు అందిస్తాం.

* లక్ష్మీ: ఇంజనీరింగ్ విద్యార్థులకు మెరిట్ ఉపకారవేతనాలు అందించాలి చంద్రబాబు: ప్రతిభ అవార్డును నాలెడ్జి పెంచటానికే ప్రవేశపెట్టాం. పిల్లలు బాగా చదువుకుని టాపర్స్‌గా రావాలి. నేడు జాతీయ స్థాయిలో అన్ని విభాగాల్లో 20 శాతానికి పైగా సీట్లు మనకే వస్తున్నాయి. విద్యార్థులలో పట్టుదలను పెంచి, గుర్తింపు తెచ్చేందుకు దోహదపడే మెరిట్ ఉపకార వేతనాలను కొనసాగిస్తాం* విభావిని: విద్యా వ్యవస్థ సక్రమంగా లేదు. ఉపాధి దొరకటం లేదు. లెర్నింగ్ సిస్టమ్ మారాలి. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

చంద్రబాబు: లెర్నింగ్ సిస్టమ్ మారాల్సి ఉంది. అమెరికాలో క్షేత్రస్థాయికి ప్రాధాన్యత ఉండగా, ఇక్కడ క్లాస్‌రూమ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. క్లాస్ రూమ్‌లో థియరీ కన్నా క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఉంటేనే విద్యార్థులలో సృజనాత్మకత, పట్టుదల పెరుగుతాయి.

పట్టుదల ఉంటే బిల్‌గేట్స్‌లా ఉన్నత స్థానం చేరుకోవచ్చు. డెవలప్‌మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి. ఈ విషయమై అధ్యయనం జరగాలి * అభిషేక్: నాయకులు సేవ చేస్తున్నామని చెపుతున్నారు. దేశం ఇంకా వెనుకబడి ఉంది. పదవి ఉన్నా లేకున్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలి. చంద్రబాబు: టీడీపీ హయాంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించాం. అభివృద్ధిని చూసేందుకు హైదరాబాదు వచ్చేవారు. ఇప్పుడేమో అవినీతి వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం ఉండదు. విద్యార్థులు రాజకీయంగా చైతన్యంకలిగి ఉండాలి * విద్యార్థిని: మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి

చంద్రబాబు: ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆడ పిల్లల సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టాం. తర్వాత విద్య, ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి, ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకువచ్చి వడ్డీ లేకుండా అందచేశాం. 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. చట్ట సభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మొదట తీర్మానం చేసింది కూడా మేమే

* సౌజన్య: మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయాలి చంద్రబాబు: పోర్టులను అభివృద్ధి చేయాలి. మచిలీపట్నం పోర్టు రావాలి. దాంతో జిల్లా అభివృద్ధి చెందుతుంది * నరేంద్రకుమార్: ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. బడ్జెట్‌లో నిధులు ఎలా సమకూరుస్తారు.

చంద్రబాబు: నేను చేస్తున్న వాగ్దానాలు ఆచరణ సాధ్యమే. నేను 12 వేల కోట్లతో 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాను. వైఎస్ 85 వేల కోట్లు ఖర్చు చేశారు. ఒక ఎకరానికి కూడా సాగునీరు అందటం లేదు. రోజుకు ఐదారుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పేదల సొమ్ము మద్యం, మైనింగ్, ల్యాండ్ మాఫియా దోచుకుంటోంది. దేశంలో సంపదకు కొదవ లేదు. వాగ్దానాలన్నీ అమలు చేస్తాం

* విద్యార్థి: సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తున్నందున ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలిచంద్రబాబు: నా ఆరోగ్యానికేమీ ఢోకా లేదు. కాలు నొప్పి, నడుం నొప్పి, గొంతు నొప్పి వల్ల ఇబ్బంది పడుతున్నాను. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టేందుకు ప్రజల్లో చైతన్యం కోసం సవాల్‌గా తీసుకుని పాదయాత్ర చేస్తున్నాను.చంద్రబాబును కళాశాల కరస్పాండెంట్ కె.రామ్మోహనరావు సన్మానించి జ్ఞాపిక అందచేశారు. కళాశాల ప్రెసిడెంట్ వై.వెంకట్రామయ్య, జాయింట్ సెక్రటరీ కె.ఈశ్వర్‌చందు, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బయ్య పాల్గొన్నారు.
కంచికచర్ల: ప్రస్తుతం విద్యార్థుల ఆలోచనా ధోరణి మారాలి... రాజకీయంగా కూడా చైతన్యం రావాలి.. అవినీతిని రూపుమాపేందుకు విద్యార్థులు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కంచికచర్ల కేసీఆర్ అండ్ ఎస్ఎస్ క్లబ్‌లో శనివారం అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు కొనసాగిస్తాం, అగ్రవర్ణాల పేద పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.* ఎన్.తేజస్వీ: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు కొనసాగించాలి చంద్రబాబు: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టింది టీడీపీయే. మా ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలు చేశాం. ఆర్థిక పరిస్థితి వల్ల పలువురు చదువుకోలేక పోతున్నారు. టీడీపీ చదువుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. తప్పనిసరిగా ఫీజు రీయింబర్ ్సమెంట్, ఉపకార వేతనాలు అందిస్తాం.

* లక్ష్మీ: ఇంజనీరింగ్ విద్యార్థులకు మెరిట్ ఉపకారవేతనాలు అందించాలి చంద్రబాబు: ప్రతిభ అవార్డును నాలెడ్జి పెంచటానికే ప్రవేశపెట్టాం. పిల్లలు బాగా చదువుకుని టాపర్స్‌గా రావాలి. నేడు జాతీయ స్థాయిలో అన్ని విభాగాల్లో 20 శాతానికి పైగా సీట్లు మనకే వస్తున్నాయి. విద్యార్థులలో పట్టుదలను పెంచి, గుర్తింపు తెచ్చేందుకు దోహదపడే మెరిట్ ఉపకార వేతనాలను కొనసాగిస్తాం* విభావిని: విద్యా వ్యవస్థ సక్రమంగా లేదు. ఉపాధి దొరకటం లేదు. లెర్నింగ్ సిస్టమ్ మారాలి. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

చంద్రబాబు: లెర్నింగ్ సిస్టమ్ మారాల్సి ఉంది. అమెరికాలో క్షేత్రస్థాయికి ప్రాధాన్యత ఉండగా, ఇక్కడ క్లాస్‌రూమ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. క్లాస్ రూమ్‌లో థియరీ కన్నా క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఉంటేనే విద్యార్థులలో సృజనాత్మకత, పట్టుదల పెరుగుతాయి.

పట్టుదల ఉంటే బిల్‌గేట్స్‌లా ఉన్నత స్థానం చేరుకోవచ్చు. డెవలప్‌మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి. ఈ విషయమై అధ్యయనం జరగాలి * అభిషేక్: నాయకులు సేవ చేస్తున్నామని చెపుతున్నారు. దేశం ఇంకా వెనుకబడి ఉంది. పదవి ఉన్నా లేకున్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలి. చంద్రబాబు: టీడీపీ హయాంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించాం. అభివృద్ధిని చూసేందుకు హైదరాబాదు వచ్చేవారు. ఇప్పుడేమో అవినీతి వల్ల రాష్ట్రం అధోగతి పాలైంది. ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం ఉండదు. విద్యార్థులు రాజకీయంగా చైతన్యంకలిగి ఉండాలి * విద్యార్థిని: మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి

చంద్రబాబు: ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆడ పిల్లల సంరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టాం. తర్వాత విద్య, ఉద్యోగాలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి, ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకువచ్చి వడ్డీ లేకుండా అందచేశాం. 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. చట్ట సభల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మొదట తీర్మానం చేసింది కూడా మేమే

* సౌజన్య: మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేయాలి చంద్రబాబు: పోర్టులను అభివృద్ధి చేయాలి. మచిలీపట్నం పోర్టు రావాలి. దాంతో జిల్లా అభివృద్ధి చెందుతుంది * నరేంద్రకుమార్: ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. బడ్జెట్‌లో నిధులు ఎలా సమకూరుస్తారు.

చంద్రబాబు: నేను చేస్తున్న వాగ్దానాలు ఆచరణ సాధ్యమే. నేను 12 వేల కోట్లతో 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాను. వైఎస్ 85 వేల కోట్లు ఖర్చు చేశారు. ఒక ఎకరానికి కూడా సాగునీరు అందటం లేదు. రోజుకు ఐదారుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పేదల సొమ్ము మద్యం, మైనింగ్, ల్యాండ్ మాఫియా దోచుకుంటోంది. దేశంలో సంపదకు కొదవ లేదు. వాగ్దానాలన్నీ అమలు చేస్తాం

* విద్యార్థి: సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తున్నందున ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలిచంద్రబాబు: నా ఆరోగ్యానికేమీ ఢోకా లేదు. కాలు నొప్పి, నడుం నొప్పి, గొంతు నొప్పి వల్ల ఇబ్బంది పడుతున్నాను. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టేందుకు ప్రజల్లో చైతన్యం కోసం సవాల్‌గా తీసుకుని పాదయాత్ర చేస్తున్నాను.చంద్రబాబును కళాశాల కరస్పాండెంట్ కె.రామ్మోహనరావు సన్మానించి జ్ఞాపిక అందచేశారు. కళాశాల ప్రెసిడెంట్ వై.వెంకట్రామయ్య, జాయింట్ సెక్రటరీ కె.ఈశ్వర్‌చందు, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బయ్య పాల్గొన్నారు.

మీలో రాజకీయ చైతన్యం రావాలి

'మార్పు' గాలి వీస్తోంది!
అదే ఝంఝామారుతవుతుంది
రాష్ట్ర ప్రభుత్వమూ మారొచ్చు
కృష్ణా జిల్లా పాదయాత్రలో చంద్రబాబు
యాత్ర కొనసాగించాలని నిర్ణయంతొమ్మిదేళ్లుగా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను కారుమబ్బులు కమ్ముకున్నాయని, పారిశ్రామిక ఆర్థిక ప్రగతి నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాల రీత్యా ప్రభుత్వం మార్పు దిశగా గాలులు వీస్తున్నాయని, పాదయాత్రకు లభిస్తున్న విశేష స్పందనే ఇందుకు సాక్ష్యమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ గాలులు ఝంఝా మారుతమై రాష్ట్రాన్ని అవహించిన అవినీతి మబ్బులను పారద్రోలతాయన్న ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పాదయాత్రలో ఉన్న ఆయన, కృష్ణాజిల్లా కంచికచెర్లలో గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభవేళ అవినీతి అంతానికి ప్రతిఒక్కరూ ప్రతిన పూనుదాం అని మీడియాకు పంపిన సందేశ ప్రసంగంలో పిలుపునిచ్చారు. గడిచిన తొమ్మిదేళ్ల రాష్ట్ర పరిపాలనా కాలాన్ని ముందుతరాల చర్రితకారులు అవినీతి స్వర్ణయుగంగా అభివర్ణిస్తారనడంలో ఏ మాత్రం సందేహాం లేదని చెప్పారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనాపగ్గాలు చేపట్టడంతో ఈ యుగం మొదలైందని విమర్శించారు.

అవినీతి మహమ్మారి రాష్ట్రంలోని వ్యవస్థలన్నీంటిని నిర్వీర్యం చేసిందని, ఆర్థిక సామాజిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల మోత, పెట్రోల్ ధరల వడ్డన తదితర చర్యలతో కిరణ్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని, వంట గ్యాస్ ధరను సామాన్యులు భరించలేనిస్థాయికి కిరణ్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మామూలు జ్వరాలకు మందుల్లేని దయనీయస్థితి నెలకొందన్నారు.

ఇలాంటి అధ్వాన్న పరిస్థితులు మారాలని టీడీపీ త్రికరణశుద్ధిగా కోరుకుంటుందన్నారు. అత్యున్నతస్థాయిలో అవినీతిని నిర్మూలిస్తే అట్టడుగున ఉన్న అవినీతి తనంతట తానే మాయమవుతుందని అభిప్రాయపడ్డారు. అవినీతికి పాల్పడితే తమను అడిగేవారెవరని అగ్రస్థానంలో ఉన్న నేతలు విశ్వసిస్తున్నందున ఈ దుస్థితి దాపురించిందని వివరించారు. అధికారంలోకి వస్తే ఈ పరిస్థితి మారుస్తానని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ కోరే అధికారాన్ని ప్రజలకు అందిస్తామని, ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తామని భరోసా ఇచ్చారు. మచ్చలేని వ్యక్తిత్వం, నీతినిజాయితీ కలిగిన న్యాయశాస్త్ర కోవిదులను ఆ కోర్టులకు జడ్జిలుగా పంపుతామని చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు జరిగిన అవినీతిని, ప్రజా ధనం లూటీని వెలికితీసి అక్రమాలకు పాల్పడినవారు ఎంతటివారైనా, ఏ పార్టీకి చెందినవారైనా కఠిన చర్యలు తీసుకుంటామని, అవినీతి నిరోధక చట్టాన్ని అమలులోకి తెస్తామని తెలిపారు. తొలి శాసన సభ సమావేశంలోనే ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామన్నారు. ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రజలంతా తనపైన, తెలుగుదేశం పార్టీపైన చూపుతున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటానని భావోద్వేగంతో పలికారు.

యాత్రకు ఒకరోజు బ్రేక్

పాదయాత్ర 117వ రోజు నేపథ్యంలో, పరిటాల గ్రామంలో ఏర్పాటు చేసిన పైలాన్ ప్రారంభోత్సవం, బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబును ప్రజలు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ముందు ససేమిరా అన్న బాబు చివరకు ప్రజాభీష్టానికి తలొగ్గారు. వైద్య పరీక్షల కోసం ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, ఇది తాత్కాలిక విరామమేనని, పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు.

ఏమి చేతును సారు?
బాబు సమక్షంలో కన్నీరు పెట్టిన రైతు

"వాతావరణం సహకరించట్లేదు. సాగర్ నీరు ఇవ్వట్లేదు. నీలం తుఫాను ముంచేసింది. పొలంలో నాటిన పంట వెక్కిరిస్తోంది. కరెంటు సమస్య పీడిస్తోంది. సర్కారు ధరల మోత కుంగదీస్తోంది. ఇక నేను ఏమి చేతును సారూ'' అంటూ ఓ పత్తి రైతు.. చంద్రబాబు సమక్షంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆత్మహత్యే గతి అంటున్నప్పుడు బాబు సహా అక్కడ ఉన్నవారంతా చలించిపోయారు.

పాదయాత్రలో భాగంగా బాబు శనివారం పరిటాల పత్తి కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఈ ఘటన జరిగింది. పరిటాల నుంచి పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డులో గుట్టలు గుట్టలుగా పోసి ఉన్న పత్తి మూటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. దిగుబడులు బాగా వస్తాయని ఆశించి కొనుగోలు చేసిన మహాజన్ పత్తి విత్తనాలు తమ కొంపలు ముంచాయని రైతులు వాపోయారు. అంతల ఒకరైతు.. ఆశించిన దిగుబడి రాక, నాణ్యత లేని పత్తి విత్తనాల కొనుగోలు వల్ల కోలుకోలేని దెబ్బ తిన్నానని ఇలా కుమిలిపోయాడు.

అవినీతి మబ్బులను పారదోలుతుంది


ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగుదేశం నాయకులు కోగంటి అప్పారావు, గూడూరు జితేంద్ర కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. నల్లగొండ జిల్లా రామాపురం అడ్డరోడ్డు వద్ద ఈ నెల 19న జరిగిన కారు ప్రమాదంలో నక్కలంపేటకు చెందిన అప్పారావు, జితేంద్ర మృతిచెందారు. పాదయాత్ర చేస్తూ శనివారం సాయంత్రం నక్కలంపేట చేరుకున్న చంద్రబాబు, అప్పారావు ఇంటికి వెళ్లారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారులు పవన్‌కుమార్, వెంకటేష్‌ను పరామర్శించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న అప్పారావు మృతి చెందటం పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చెపుతూ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. జితేంద్ర ఇంటికి వెళ్లి అమ్మ మాధురి, భార్య శిరీషను పరామర్శించారు. పిన్న వయస్సులోనే జితేంద్ర మృతిచెందటం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట సీనియర్ నాయకుడు కోగంటి రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, మాజీ ఎంపీపీ పరిటాల భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ మాగంటి బాబు ఉన్నారు.

టీడీపీ నేతల కుటుంబాలకు పరామర్శ

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలు అయినా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు తొలగిపోలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన కేసీఆర్ అండ్ ఎస్ఎస్ క్లబ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని, దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. పేదలకు చెందాల్సిన ఆర్థిక వనరులు కొంత మంది చేతుల్లోకి వెళుతున్నాయన్నారు. ఆడపిల్లలకు రక్షణ కరువైందని, అవినీతి ప్రభావం అన్ని రంగాలపై పడుతున్నదన్నారు. అవినీతిపై పోరాటానికి టీడీపీ సిద్ధంగా ఉందని, అందుకు అందరూ కలిసిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏ పార్టీలో అయిన అవినీతి పరులంటే చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ చీకటి పాలనలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు దెబ్బతిన్నాయని, అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని ఆరోపించారు. అంతకుముందు జాతీయ నాయకులు గాంధీ, అంబేద్కర్, భగత్‌సింగ్, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

కొందరి చేతుల్లోనే ఆర్థిక వనరులు


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 117 రోజులు పాదయాత్ర పూర్తీ చేసిన సందర్భంగా ఈ రోజు కృష్ణా జిల్లా పరిటాలలో స్థానిక పార్టీ నేతలు నిర్మించిన 117 అడుగుల ఎత్తున్న పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన కృష్ణా జిల్లాలో పైలాన్ అవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

చంద్రబాబు ఆరోగ్యం, వయసు ఇతర శారీరిక సమస్యలను దృష్టిలోఉంచుకొని, ముందు నిర్ణయించినట్లుగానే జనవరి 26వ తేదీతో పాదయాత్ర ముగింపు పలుకుతారని అందరూ ఊహించినపటికీ అయన తన పాద యాత్రను కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు అయన వ్యక్తిగత వైద్యులు కూడా పాదయాత్రకు ముగింపు ముగింపు పలికి ఇక విశ్రాంతి తీసుకోమని కోరినపటికీ, ప్రజల పడుతున్న కష్టాలతో పోలిస్తే తన సమస్యలు చాల చిన్నవని, అందువల్ల తన పాదయాత్ర కొనసాగించదలుచుకొన్నానని ఆయన స్పష్టం చేశారు. తన శరీరం ఆరోగ్యం సహకరించినంత కాలం ముందుకు సాగాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.

ప్రజల పడుతున్న కష్టాలతో పోలిస్తే నా సమస్యలు చాల చిన్నవి...

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు. అయితే, ఇప్పటికే కాలి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న ఆయన, ఈ రోజు కాలి చిటికన వ్రేలు మరింత వాచిపోవడంతో వైద్యుల సలహా మేరకు రేపు అనగా ఆదివారం తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఒక రోజు పూర్తీ విశ్రాంతి తీసుకొనేందుకు అంగీకరించారు.

అయితే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ రేపు జిల్లా నాయకులూ, కార్యకర్తలతో సమావేశం అయ్యి, నేతల మద్య నెలకొన్న విబేధాలు తొలగించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ముంచు కోస్తున్న తరుణంలో పార్టీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో నేతల మద్య తలెత్తుతున్న తీవ్ర విబేధాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోవడమే గాకుండా, ఇతర పార్టీలకు తమ కంచుకోటలోకి ప్రవేశం కల్పించినట్లవుతుంది అని భావిస్తున్న చంద్రబాబు రేపు జిల్లా నేతలతో సమావేశం అయి పరిస్థితులను చక్క దిద్దే ప్రయత్నం చేయవచ్చును.

పాదయత్రకి ఒక్కరోజు బ్రేక్

అవినీతిపై పోరాడేందుకు యువత ముందుకు రావాలి
కంచికచర్ల గణతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు

అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పాడే టీడీపీ ధ్యేయం అని, దీనిపై పోరాడేందుకు యువత ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 64వ గణంతత్య్ర దినోత్సవం సందర్భంగా కంచికచర్లలో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి వల్ల పేదలకు స్వాతంత్య్ర ఫలాలు అందడం లేదని ధ్వజమెత్తారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టను వ్యాపింపజేసిన ఘనత టీడీపీదే అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి సంస్కరణల్లో టీడీపీ ముద్ర ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, ఇందుకు కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని ప్రకటించారు.

అసెంబ్లీ తొలి సమావేశంలో ఈ చట్టాన్ని ఆమోదిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవినీతిపరులు ఎందటి వారినైనా వదలమని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక పోరాటం జరిపితేనే అవినీతి అంతమవుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

వేడుకల అనంతరం కంచికచర్లలో 117వ రోజు పాదయాత్రను బాబు ప్రాంభించారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే టీడీపీ ధ్యేయం

దేశంలో తొమ్మిది లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అవినీతి లేని పక్షంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కంచికచర్ల సమీపంలో దేవినేని రమణ ఘాట్ వద్ద శుక్రవారం రాత్రి మిక్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. దేశంలో 2జీ స్ప్రెక్టమ్, కామన్‌వెల్త్ గేమ్స్, మైనింగ్ లీజుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. అవినీతి రహిత దేశం, ఆంధ్రప్రదేశ్‌గా తయారుచేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నల్లధనాన్ని నిరోధించేందుకు చట్టాలు తీసుకురావాల్సి అవసరం ఉందన్నారు. చదువు ప్రాథమిక హక్కుగా ఉండాలన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని, లేదా తల్లిదండ్రులకు భారం కాకుండ ఉపాధి చూపిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరంతరం శ్రమిస్తే నూరుశాతం విజయం సాధించవచ్చునని అన్నారు.

ఎన్‌టీఆర్ నిరంతరం శ్రమించటం వల్ల ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. రమణ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన రమణ చిరస్మరణీయుడుగా నిలిచిపోయారన్నారు. నిన్నటి దాకా నాకు కాలు నొప్పి మాత్రమే ఉంది, నేటి నుంచి గొంతు నొప్పి ప్రారంభమైంది. సుగర్ కూడా వచ్చింది. ఇంతకు ముందు సుగర్ లేదు. రోజూ ఎక్కువ దూరం నడవటం వల్ల ఒత్తిడి పెరగడం వల్ల సుగర్ వచ్చిందన్నారు.

జనసంద్రంగా కంచికచర్ల పట్టణం కంచికచర్ల పట్టణం జన సంద్రంగా మారింది. శుక్రవారం రాత్రి 10.20 గంటలయినా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మర«థం పట్టారు. పెద్దయెత్తున బాణసంచా కాల్చారు. చెరువు కట్ట వద్ద నుంచి బస చేసే ప్రాంతం వరకు ఆయనను పూలపై నడిపించారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం చంద్రబాబు కంచికచర్ల చేరుకోవాల్సి ఉంది. కాలినొప్పి వల్ల మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. అయినా ఓపికతో కదలకుండ ఆయన కోసం ప్రజలు నిరీక్షించారు. పార్టీ కార్యకర్తలు, జనాలు ఊహించని విధంగా రావటంతో బాబు, నాయకులను ప్రత్యేకంగా అభినందించారు.

అవినీతి లేకుంటే అగ్రరాజ్యంగా భారత్

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును కంచికచర్లలో సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, సోదరి హైమావతి, మరదులు ఇందిర, మేనల్లుడు ఉదయ్, ఎన్టీఆర్ కుమార్తెలు, కోడళ్లు, ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రకు విరామం ఇవ్వాలని కోరమాని అయితే చంద్రబాబు అంగీకరించలేదన్నారు. పాదయాత్రను కొనసాగిస్తానని బాబు చెప్పినట్లు ఆమె తెలిపారు. చంద్రాబాబు మానసికంగా బలంగా ఉన్నారని, నడుము, కాలినొప్ప చంద్రబాబుకు తాత్కాలికమే అని ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ తెలిపారు.

చంద్రబాబును పరామర్శించిన కుటుంబసభ్యులు

ఈ సీఎంకు సిగ్గు లేదు!
మాఫియాతో మిలాఖత్.. దొంగలకు దాసోహం
అవినీతి నేతలకు ఆశీస్సులు.. కిరణ్‌పై బాబు ధ్వజం
పిల్లపాములకే విషం ఎక్కువ
రాష్ట్రాన్ని దోచే దొంగలను తరిమికొడదాం..రండి
కృష్ణాజిల్లా పాదయాత్రలో పిలుపు
నేటితో ముగుస్తున్న 'షెడ్యూల్''పాదయాత్ర

  "రాష్ట్రంలో అవినీతి దొంగలు పడ్డారు. కాంగ్రెస్ తల్లిపాము అయితే, వైసీపీ పిల్లపాము. పెద్ద పాములలో కంటే కూడా చిన్న పాముల్లోనే ఎక్కవ విషం ఉంటుంది తమ్ముళ్లూ.. అధికారం కోసం రాష్ట్రంలో దొంగల ంతా విడిపోయారు. ఈ దొంగలకు కిరికిరి సీఎం కిరణ అండగా ఉంటున్నారు. కాంగ్రెసోళ్లంతా దొంగలు. వైసీపీ వాళ్లూ దొంగలే. దొంగలంతా లోపాయికారీగా కలిసికట్టుగా ఉంటున్నారు. మనమంతా మంచివాళ్లం. చేతకానివాళ్లలా మిగిలిపోయాం. మంచివాళ్లంతా ఏకమై ఈ అవినీతి దొంగలను తరిమి కొట్టకపోతే రాష్ట్రం బాగుపడదు.'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. జాతీయరహదారి మీదుగా అంబారుపేట, ఐతవరం గ్రామాలలో 15 కిలోమీటర్లు నడిచారు. అవినీతిపరుడైన జగన్ నీతిమంతుడిలా పోజులు కొడుతున్నాడన్నారు. ఇలాంటి అవినీతిపరులను లోకాయుక్త , లోక్‌పాల్ ఏమీ చేయలేవని ఒక జడ్జి అన్నారని గుర్తుచేశారు. కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి ఒకరు తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించారన్న దానిపై బర్తరఫ్ చేయాలని జస్టిస్ వర్మ సూచించినా ముఖ్యమంత్రి, ఆ మంత్రికి కొమ్ము కాస్తున్నాడని విమర్శించారు. ఐతవరం సభలో నేతల అవినీతిపై విరుచుకుపడ్డారు. అవినీతిపరులకు అండగా ఉండేవారు కూడా అవినీతి పరులేనని చెప్పారు.

రాష్ట్రంలో ఇసుక, మైనింగ్ మాఫియాలన్నింటికీ కిరణ్ సర్కారు అండ దండలందిస్తోందని ఆరోపించారు. పత్తి, వరి, మిర్చి , మొక్కజొన్న పంటలకు సాగర్ నుంచి నీరు రాకపోవటం వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. సాగర్ నుంచి నీళ్లు రావటం లేదని, దేవినేని రమణ వేదాద్రి నుంచి నీళ్లు తెప్పించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభిస్తే.. అది కూడా పనిచేయటం లేదన్నారు. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాల్సి ఉం దని, పరిశ్రమలు రావాలంటే కరెంట్ ఉండాలని, కానీ ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు.

" మీకోసం ప్రాణ త్యాగం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాన''ని కంచికచర్ల మండలం కీసరలో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంతో పలికారు. కాగా, అంబారుపేట మీదుగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో చంద్రబాబు మధ్యలో ఐతవరం దళిత వాడలోకి వెళ్లారు. కరెంటు బిల్లులు పెద్ద ఎత్తున వస్తున్నాయని, వాటిని కట్టలేకపోతున్నామని దళితులు.. బాబు దృష్టికి తీసుకు వచ్చారు. పాదయాత్ర మార్గమధ్యంలో ముస్లింలకు చంద్రబాబు మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలిపారు. వారు అందించిన సున్నుండలను అక్కడే ఉన్న విద్యార్థినులకు తినిపించారు.

నీతిమంతుడిగా జగన్ పోజు..

బాబు పాదయాత్రపై తర్జనభర్జన
నేడు కీలక ప్రకటన

  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర ముగింపు ముహూర్తానికి వచ్చేసింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం.. గత అక్టోబర్ రెండో తేదీన అనంతపురంలో మొదలైన ఆయన యాత్ర షెడ్యూల్ ప్రకారం శనివారంతో పూర్తి కావాలి. అప్పటికి ఆయన 117 రోజులు పూర్తి చేసుకొంటారు. ఆ తర్వాత ఏమిటన్నది ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాలి నొప్పి బాగా బాధిస్తుండటంతో కొంత విరామం ఇవ్వాలని పార్టీ నేతలు బాగా ఒత్తిడి తెస్తున్నారు.

నిజానికి వాస్తవ పరిస్థితి కూడా వారి ఆందోళనకు తగినట్టే ఉంది. అడుగు తీసి అడుగు వేయడమే చంద్రబాబుకు ఇప్పుడు కష్టంగా మారింది. గత రెండు రోజులుగా పదే పదే నడకకు విరామం ప్రకటించాల్సి వస్తోంది. తిరగబెట్టిన కాలి గాయానికి గొంతు సమస్య కూడా జత కలవడంతో ఆయన ఆరోగ్యం విషయమై సీనియర్లు తీవ్రంగా కలవరపడుతున్నారు. అయినా, చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. పాదయాత్ర కొనసాగింపునకే నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో శుక్రవారం తనను కలిసిన పార్టీ అగ్రనేతల నుంచి కుటుంబ సభ్యుల దాకా.. అందరికీ ఆయన ఇదే విషయం స్పష్టం చేసినట్టు సమాచారం.

చంద్రబాబు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, గత రెండు రోజులుగా చంద్రబాబు కాలి నొ ప్పితో బాగా ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల క్రితం ఆయన కాలి చిటికెన వేలు నలిగింది. విశ్రాంతి ఇవ్వకపోవడంతో అది మానడం లేదు. రెండు రోజులుగా నొప్పి ఎ క్కువ కావడంతో మధ్య మధ్యలో ఆయన కాసేపు కూ ర్చుని మళ్ళీ నడుస్తున్నారు. వాతావరణంలో మార్పుతో గొంతు ఇన్‌ఫెక్షన్ వచ్చి స్వరం నీరసపడింది. మధుమే హం హెచ్చు తగ్గులకు లోనవుతుండటంతో మనిషి కూడా నీరసించారు. దీంతో, మూడు నాలుగు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకొంటే మళ్లీ పాదయాత్ర కొనసాగించవచ్చని పార్టీ నేతల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి వస్తోంది.

వైద్యులు కూడా విశ్రాంతి అవసరమని గట్టిగా చెబుతున్నారు. ముందు అనుకొన్న గడువు పూర్తయినందువల్ల యాత్రకు కొంత విరామం ఇచ్చి రెండో విడత పెట్టుకొంటే బాగుంటుందని కొందరు సీనియర్లు..చంద్రబాబును కో రారు. కాని చంద్రబాబు ఆ ఉద్దేశంలో లేరు. శ్రీకాకుళం వ రకూ తన యాత్రను ఇదే ఊపులో కొనసాగించాలని ఆ యన గట్టి పట్టుదలతో ఉన్నారు. "ఎన్ని రోజులు నడవగలమో చూద్దాం. నడవగలిగినంతవరకూ ఆపేది లేదు. న డవలేని పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాం' అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ఆలోచన ప్రకారం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు పూర్తి చేసుకొని ఉత్తరాంధ్రలో అడుగు పెట్టాల్సి ఉంది.

"ఆయన ఇంత మొండి మనిషని మేం ఊహించలేదు. ఆయన పడుతు న్న ఇబ్బంది బయటకు కనిపిస్తున్నదానికంటే చాలా ఎ క్కువగా ఉంది. అయినా మరో రెండు నెలలపాటు యా త్ర కొనసాగింపునకు ఆయన మానసికంగా సిద్ధమై పో యారు'' అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబును పరామర్శించేందుకు ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం విజయవాడకు వచ్చారు. రాత్రి ఏడు గంటల సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కుటుంబ సభ్యులు కలిశారు. పాదయాత్రను వాయిదా వేసే విషయమై బాబు చర్చించినట్లు తెలిసింది.

ముగింపా.. ముందుకా..!

అవినీతిపై నా పోరాటం ఒక స్పష్టమైన ఆకృతి దాల్చడాన్ని ఐతవరంలో చూశాను. ఆ ఊరు నా షెడ్యూల్‌లో లేకపోయినా జాతీయ రహదారి పక్కన ఉండటంతో పలకరించాలనిపించింది. ఊళ్లోకి వెళ్లిన నాకు విద్యార్థులు నవ్వు చిందే మోములతో ఆహ్వానం పలికారు. వారితో కొద్దిసేపు గడిపాను. ఈ సమయంలో ఆ చెల్లెలు ముందుకొచ్చింది. అవినీతిపై ఏదైనా మాట్లాడాలని నేను కోరడమే తరువాయి, తడుముకోకుండా మన అవినీతి నేతలందరికీ తలంటు పోసేసింది తిరుపతమ్మ. ఇంటర్ స్థాయిలోనే ఇంత చైతన్యమా అని ముచ్చటేసింది. నేరుగా పేరు తీసుకోకుండానే 'లక్ష కోట్ల' అవినీతిపై సూదిమొనలాంటి ప్రశ్నలను సంధించింది.

" కుటుంబంతో, మనవళ్లు, మనవరాళ్లతో విలాసంగా బతకడానికి ఒక వ్యక్తికి ఐదు వందల కోట్లు చాలవా? లక్ష కోట్లు పోగేసుకొని ఏమి చేస్తారు? ఆ డబ్బుంతా ప్రజలకు ఖర్చు చేయొచ్చు కదా?. ఈ నాయకులంతా తమ బీరువాలు, బ్యాంకు లాకర్లను దోపిడీ సొమ్ముతో నింపుకోవడంపైనే ఆసక్తి చూపుతున్నారు తప్ప బీదలను పట్టించుకోవడం లేదు'' అని ఆక్రోశం వెళ్లగక్కింది. నా పోరుకు ఇలాంటి తిరుపతమ్మలే తలపాగా!

నడక దారిలో ఎదురైన ప్రతి ఎస్సీ కాలనీని పరామర్శించాను. 65 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలోనూ ఇంత దుర్భర దారిద్య్రం ఉందని నమ్మలేకపోయాను. రాజ్యాంగం ఆస్తి హక్కు ను ఇచ్చినా.. సెంటు జాగా కూడా లేనివారే వీరిలో ఎక్కువ. చదువుకోవాలని అంబేద్కర్ చెప్పినా, వారిని బడికి చేర్చే ఔదార్యం ఈ సర్కారుకు లేకుండాపోయింది.

కూలి చేసుకుంటేనే నోట్లోకి నాలుగు మెతుకులు. లేదంటే పస్తులే. ఉన్న దరిద్రం చాలదని సర్కారి ప్పుడు వీళ్ల కడుపులో 'కరెంటు' చిచ్చుపెట్టింది. ఒక బల్బు, ఫ్యాన్ ఉంటేనే అదిరి పోయే బిల్లులు వస్తున్నాయట. వాటిని కట్టకపోతే ఆ ఇచ్చే కరెంటూ నిలిపివేస్తారట. ఉం డటానికి జాతీయరహదారి పక్కనే ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం ఈ కాలనీలు ఆమడదూరంలో ఉన్నాయనిపించింది. రాజ్యాంగం అమలు కోసమూ రణం చేయాలా

రాజ్యాంగం కోసమూ రణమేనా!


జగన్ అవినీతి సొమ్ము కోసం పార్టీలు మారుతున్న నాయకులది కూడా ఒక బతుకేనా.. ఆటువంటి నీచానికి పాల్పడడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. పాదయాత్ర సందర్భంగా మండలంలోని ఐతవరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించారు. జగన్ వద్ద లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఉందని, అందులో కొంత దండుకోవచ్చని విలువలకు తిలోధకాలిచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారన్నారు. జగన్ ఇంటి వద్ద సూట్‌కేసులు తీసుకుని నేరుగా చెంచల్‌గూడ జైలుకు వెళ్లి కలుస్తున్నారని విమర్శించారు. జగన్ అవినీతి చూసి న్యాయమూర్తులే విస్మయం వ్యక్తంచేస్తుంటే ప్రజాప్రతినిధులయివుండి కనీస జ్ఞానం లేకపోవడం బాధకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో లోక్‌పాల్, లోకాయుక్తలు ఏం చేస్తున్నాయని కోర్టులు ప్రశ్నించాయన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి పరులను ప్రోత్సహిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడన్నారు. వాన్‌పిక్ కేసులో ఐదో ముద్దాయిగా ఉన్న మంత్రి ధర్మానప్రసాధరావును, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఈసీని మోసం చేసి మంత్రి సారథిని సీఎం కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామానికి చెందిన మువ్వా నాగమణి అనే మహిళ మాట్లాడుతూ బెల్ట్ షాపులు ఎత్తి వేయాలని కోరింది. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకుంటే మహిళలంతా మీవెంటా ఉంటారన్నారు. స్పందించిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులు, కాపుసారా అరికడతానని హామీ ఇచ్చారు.

నీరసంగా కనిపించిన బాబు వస్తునా.. మీకోసంలో శుక్రవారం చంద్రబాబు నీరసంగా కనిపించారు.

ఉదయం 11 గంటలకు బస్సు దిగిన చంద్రబాబు ప్రారంభం నుంచి కుంటుతూనే నడుస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ దాటేందుకు కూడా కాలు సహకరించకపోవడంతో వర్షపు నీరు ప్రవహించేందుకు ఏర్పాటు చేసిన డ్రైన్‌లో నుంచి నడచి రోడ్డు దాటారు. ఎక్కడ ప్రజలు కనిపించినా కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడుతూ నడకసాగించారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చేందుకు తోపులాటలో జరగడంతో ఆయన ఎడమ కాలును తొక్కడంతో చిటికెన వేలు కొంత బాధించింది. కొంత వాపు కన్పించింది. శుక్రవారం అంతా చంద్రబాబు అలసటగా కనిపించారు.

పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అన్వర్ కలవగా ముస్లింలందరికీ మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలిపారు. ఐతవరం వద్ద బాబును కలసి ముస్లిం టోపి పెట్టి శాలువాతో సత్కరించారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

వారిదీ ఒక బతుకేనా..

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్న లంచం ఇవ్వాల్సి వస్తున్నదని అంబారుపేట, ఐతవరం ప్రజలు బాబు ఎదుట సమస్యలను ఎకరువు పెట్టారు. తాగునీరు సమస్య, బెల్టుషాపులు, వీధి దీపాలు అంతర్గత రోడ్లు తదితర సమస్యలతో విలవిలాడుతన్నట్టు చెప్పారు. ఇసుక, మద్యం మాఫియా ప్రజాదనాన్ని దండుకుంటూ రాజ్యమేలుతున్నారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం దొంగమయం అయిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. అందుకు యువత ప్రధాన భూమికను పోషించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు పలు ఉద్యోగ సంఘాల నాయకులు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

అడుగడుగునా నీరాజనం అంబారుపేట, ఐతవరం దేశం పార్టీ నాయకులు, కామసాని శ్రీనివాసరావు, ఐలపోగు నాగేశ్వరరావు, చుం డు శేషగిరిరావు, యర్రమాసు అంకురావు, చింతల హుస్సేన్‌లతో పాటు మహిళా కార్యకర్తలు బాబుకు అడుగడుగునా పూలమాలలు, హారతులతో నీరాజనాలు పలికారు. ఐతవరంలో పార్టీ జెండాదిమ్మెను అవిష్కరించారు.

కంచికచర్లరూరల్‌లో.. కీసర చేరుకున్న చంద్రబాబు నాయుడుకు జిల్లా తెలుగు దేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అన్వర్, మండల దేశం పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు, ప్రధాన కార్యదర్శి వేల్పుల రమేష్, జవ్వాజి సైదేశ్వరరావు, సీనియర్ దేశం పార్టీ నాయకుడు కుంటముక్కల శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

ప్రతిపనికీ లంచమే

తాగు,సాగునీటి కల్పనలో వైఫల్యంగునీరు, తాగునీరు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులు కుమ్మక్కై ఇసుకను దోచుకుంటున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. జిల్లా మంత్రి సైతం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామంల్లో మౌలిక వసతులు సాగునీరు, తాగునీరు, డ్రైన్ల ఏర్పాటుకు తాను అధికారంలోకి రాగానే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కీసర వంతెన మీద నుంచి గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే బాబు కాలిగాయం నొప్పిని భరించలేక పదినిమిషాలపాటు కుర్చీలో విశ్రాంతి తీసుకున్నారు.

సీఎంగా చూడాలని వుంది బాబుతో విద్యార్థిని ఆశాభావం కంచికచర్ల: తొమ్మిదో తరగతి విద్యార్థిని సుంకర లిఖితా చౌదరి శుక్రవారం చంద్రబాబును కలిసింది. విజయవాడ నుంచి తండ్రి శ్రీనివాస్‌తో కల్సి పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును నందిగామ మండలం అంబారుపేట వద్ద కలిశారు. ఈ సందర్భంగా లిఖితాను చంద్రబాబు నీ లక్ష్యం ఏమిటంటూ ప్రశ్నించారు. డాక్టర్ కావాలనుకుంటున్నాను. మిమ్మల్ని మరల సీఎంగా చూడాలని, రాష్ట్రం అన్నింటా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అని అన్నారు.

తాగు,సాగునీటి కల్పనలో వైఫల్యం

కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, గిట్టుబాటు ధరలు లభించక రైతులు అల్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి 10.20 గంటలకు చంద్రబాబు కంచికచర్ల చేరుకున్నారు. స్థానిక ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేయగా, నీలం తుపాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఒక్కరికి కూడా సాయమందించలేదన్నారు. పత్తికి గిట్టుబాటు ధర లభించటం లేదని, సీసీఐ వల్ల ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. క్వింటాకు ఐదు వేల తగ్గకుండా ధర ఇవ్వాలన్నారు. సాగునీటి ఎత్తిపోతల పథకాలను సైతం మూలనపడేశారన్నారు. ప్రస్తుతం సాగునీరు అందక పంటలు నిలువునా ఎండుతున్నాయని చెప్పారు. రైతుల పరిస్థితి దుర్లభంగా ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు.

కరెంట్ ఇవ్వకపోయినప్పటికీ బిల్లులు మాత్రం వేలల్లో వేస్తున్నారు. సర్‌చార్జీల పేరుతో పేదలపై పెనుభారం మోపుతున్నారన్నారు. వ్యవసాయానికి కనీసం ఏడు గంటలు కూడా కరెంట్ ఇవ్వటం లేదని, ఇళ్లకు అయితే కరెంట్ ఉండటం లేదని, ఇప్పటికే 29 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఆరోపించారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు ఇవ్వటంతో పాటుగా రైతుల రుణాలను మాఫీ చేయవచ్చునని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన పక్షంలో చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రజల సంపద ఇసుకను అక్రమంగా దోపిడీ చేస్తున్న వారిని విడిచిపెట్టి, పక్షపాతంతో పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టటమేమిటని ప్రశ్నించారు. తనపై కూడా కాంగ్రెస్, వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టులకు వెళ్లారని అన్నారు. వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధించటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు.

వృద్ధులకు ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేయటమే కాకుండా, నెలకు ఆరు వందల రూపాయల వంతున పింఛను ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆరోగ్యం సహకరించక పోయినా పాదయాత్ర కొనసాగించాలని ఉందని ఆయన తెలిపారు. అగ్రవర్ణాలలో పేదలకు ఉచితంగా విద్యతో పాటుగా కొలువు దొరికేంత వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా భృతి చెల్లిస్తామన్నారు. ముఖ్యంగా అవినీతి, ఇతర సమస్యలపై ప్రజలతో ఆయన కొద్దిసేపు ముఖాముఖి చర్చ నిర్వహించారు. అనంతరం రాత్రి 12.10లకు బస చేయడానికి వెళ్ళిపోయారు.

కాంగ్రెస్ పాలనలో రైతు జీవితం దారుణం

జనంతో కరచాలనాలు చేస్తూ.. వృద్ధులను పలకరిస్తూ ... రైతుల వెన్ను తడుతూ .. రైతు కూలీలకు భరోసా నిస్తూ.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు.. ప్రతి ఒక్కరికి.. 'మీకోసం'.. నేనున్నానంటూ.. మీ కష్టాలలో పాలుపంచుకుంటానంటూ.. అందరిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ స్తైర్యాన్ని కల్పిస్తూ సాగుతున్న ఆ బాటసారి ఇప్పటికి 1833.8 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. 3 నెలల 22 రోజుల క్రితం ఇల్లు వదిలిన ఆ పాదచారి యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. అడుగులో అడుగు వేస్తూ.. ఒక్కోసారి కుంటుకుంటూనూ.. మరోసారి హుషారుగాను.. దీర్ఘాలోచనలో నిమగ్నమవుతూ .. మొక్కవోని ఆత్మస్థైర్యంతో మైళ్ళకు మైళ్ళు తిరుగుతున్న ఆ నాయకుడే చంద్రబాబు నాయుడు. వయసును లెక్క చేయకుండా... ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా.. తమతో మమేకమవటానికి, తమ బాధలను తెలుసుకోవటానికి గ్రామ గ్రామానికి వస్తున్న చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

64 ఏళ్ళ వయసులో ఆయన కష్టాన్ని చూడటానికి పిల్లలు, మహిళలు, వృద్ధులు పోటీలు పడి రోడ్ల మీదకు తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటలకు నిద్ర లేచే చంద్రబాబు తిరిగి విశ్రాంతి తీసుకునేది రాత్రి 12 గంటలకే. ఈ మధ్యలో సమయం అంతా పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దటానికి, పాదయాత్రలకే సరిపోతోంది. ఇల్లు వదిలిన తర్వాత ఈ నాలుగు నెలలుగా ఆయన నివాసం అంతా తన వెంట తిరుగుతున్న బస్సుల్లోనే. స్నానపానాదులు అన్నీ అందులోనే. భోజనం చేసినా, టీ తాగినా, మధ్యలో కాళ్ళు నొప్పులు పుట్టి కాసేపు సేద తీరాలన్నా ఆ బస్సే ఆయన నేస్తం. ఉంటే బస్సులో, లేకపోతే రోడ్లమీద. సగటున రోజుకు 15 నుంచి 17 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఆయన పాదయాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో భోజనం కోసం ఆగుతారు.

భోజనం చేసి ఒక గంట మా త్రం విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి 3.30 గంటల సమయంలో బస్సు దిగుతారు. అక్కడి నుంచి మళ్ళీ పాదయా త్ర మొదలు పెడతారు. సాయంత్రం దాదాపుగా 2 - 3 గంటలు నడిచాక టీ కోసం ఆగుతారు. అనంతరం టీ సేవించిన తర్వాత నడక ప్రారంభించే చంద్రబాబు ఆ రాత్రి బస చేసే క్యాంపు వరకు అలానే నడుస్తూనే ముందుకు సాగుతారు. రాత్రి పూట నడిచే సమయంలో ఆయన్ను చూసేవారు పడిపోతారేమో అన్న భావన కలుగుతుంది. అయినా ఆయన ఆలాగే నెమ్మదిగా అగులో అడుగు వేసుకుంటూ తనకు అభివాదం చేసే వారికి ప్రతి నమస్కారాలు చేస్తూ చేతులెత్తి సాగిపోతుంటారు. ఈ 15-16 కిలోమీటర్ల మేర జరిగే పాదయాత్ర సమయంలోనే కనీసం నాలుగు లేదా ఐదు బహిరంగ సభల్లో మాట్లాడతారు.

కొన్ని చోట్ల జనం ఎక్కువుగా ఉంటే గంటకు పైగా ప్రసంగిస్తారు. అన్ని కిలోమీటర్లు నడిచి కూడా మళ్ళీ 15 - 20 మెట్లు ఎక్కి ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆదే వేదికపై గంట సేపు నిలబడి ప్రసంగాలు చేస్తారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఆయన ఓపికను , ఇచ్చాశక్తిని చూసి యువ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం చంద్రబాబు పాదయాత్ర ఇప్పటికే ఆపవలసి ఉంది. అయినప్పటికీ ఆయన పాదయాత్రను కొనసాగిస్తానని అంటున్నారు. షుగ ర్ వ్యాధిని కూడా లెక్క చేయకుండా ప్రజల నుంచి వస్తున్న ఆదరాభిమానాలతో 'మీ రెవరైనా నాలుగైదు కిలోమీటర్లు నడిస్తే వారం రోజులు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, నేను మాత్రం విరామం అన్నది ఎరుగకుండా పాదయాత్ర చేస్తూనే ఉన్నాను. మీరు అనుభవిస్తున్న కష్టాల ముందు .. నా కష్టాలు ఓ లెక్క కాదు. మీకోసం.. మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటానికి నేను ముందుకు వెళుతూనే ఉంటాను' అంటూ పాదయాత్ర ఆపేది లేదని ప్రజలతో మమైకమైన సందర్భాలలో చెబుతున్నారు.

చంద్రబాబు ఎట్‌థరేట్ఆఫ్ 1833.8

తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఏకమై సహకార ఎన్నికలలో నాటకాలు ఆడుతున్నాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జిల్లాలో సహకార ఎన్నికలలో గెలవలేమన్న భయంతో కాంగ్రెస్, వైసీపీలు కలిసి పోటీకి దిగాయన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ గెలవలేమన్న నిర్దారణకు వచ్చిన సంఘాలపై మంత్రి స్టేలు తీసుకువచ్చారన్నారు. న్యాయ పోరాటం చేసైనా ఆ సంఘాలకు ఎన్నికలు జరిపించి విజయభేరి మోగిస్తామన్నారు. తెలుగుదేశాన్ని ఎదుర్కొనేందుకు రెండు పార్టీలూ కలిసినా దమ్ము చాలకే ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఓటమి భయంతో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,వైసీపీ కలిసి పోటీ

పాదయాత్రలో భాగంగా మాగల్లు చేరుకున్న చంద్రబాబుకు కాపుసారా, బెల్ట్‌షాపులు, చీప్ లిక్కర్‌పై మహిళలు మొర పెట్టుకున్నారు. మాగల్లులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు సమస్యలు చెప్పాలంటూ మహిళలకు మైక్ అందజేశారు. మహిళలు మద్యం వ్యాపారంపై మండిపడ్డారు. ఎన్ని ఉద్యమాలు చేసినా బెల్ట్‌షాపులు, కాపు సారా అరికట్టలేక పోతున్నామని, దీని వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, వాటి వల్ల భర్తలను తమను కొట్టి కూలీ డబ్బులు కూడా లాక్కుని మద్యం తాగేస్తున్నారన్నారు. యువకుడు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిందని, ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా లంచం ఇవ్వాల్సి వస్తుందన్నారు.

మరో రైతు మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలంపల్లి వద్ద మునేటిపై డ్యామ్ నిర్మాణానికి ముప్పై కోట్లు కేటాయించాడని, కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకులు కలసి నిధులు గోల్‌మాల్ చేసి నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. ఆయకట్టులోని పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు కూడా మూలన పడే స్థితికి తీసుకువచ్చారన్నారు. సమస్యలపై స్పందించిన చంద్రబాబు రైతుల, మహిళల కష్టాలు తీర్చడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, తంగిరాల ప్రభాకరరావు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, అర్బన్ అధ్యక్షులు వల్లభనేని వంశీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

మద్యంపై మహిళల మొర

January 25, 2013

ఎడమ కాలు ఇబ్బంది పెడుతోంది. పంటి బిగువున అడుగు వేశానేగానీ చాలానొప్పిగా ఉంది. ఆదిలాబాద్ యాత్రలో చిటికెన వేలుకు అయిన గాయం తిరగబెట్టినట్టు వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తలు చెప్పడం వాళ్ల విధి. ప్రతిపక్ష నేతగా నా డ్యూటీ నేను చేయాలి కదా!

నాటుసారా.. నా ఆడపడుచుల పుస్తెలను తెంచుతోంది. మాంగల్యభాగ్యమూ లేకుండా చేస్తోంది. చిన్నవయసులోనే వారిని చింతల్లోకి నెట్టేస్తోంది. కృష్ణా జిల్లాలోనే కాదు.. రాష్ట్రమంతటా అసంఖ్యాకంగా 'మైలవరా'లను విస్తరిస్తోంది. నాకు మంగళ హారతులు పడుతున్న ఆడబిడ్డలకు మంగళ సూత్రాలు లేకపోవడం కుంగదీస్తోంది. నా యాత్రను పసుపుమయం చేస్తున్న వీరిలో చాలామందికి పసుపు తాళ్లే గతవుతున్నాయి. ఎందుకిలా? అనుకుంటూ మాదెళ్లలో అడుగుపెట్టిన నాకు తొలి అడుగులోనే ఆమె జవాబు చెప్పేసింది. 'నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్'' అంటున్న ఒక మహిళ కేక ముందు వినిపించి.. ఆ తరువాత ఆమె రూపం కనిపించింది. పేరు సులోచన అని చెప్పింది.

"నాటుసారా మా కొంపలు కూలుస్తోంది. ఆ మహమ్మారి మా జీవితాలను చిదిమేస్తోంది'' అంటూ మొదలుపెట్టి ఆ మాయదారి ప్రాణాంతక వ్యసనంతో ఇల్లూ ఒళ్లూ గుల్లవుతున్న తీరును గొల్లుమంటూ కళ్లకు కట్టింది. "నా పెనిమిటి పచ్చి తాగుబోతు. తాగొచ్చి నన్నూ పిల్లల్నీ కొడతాడు. తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే ఎంతకైనా బరితెగిస్తాడు. పదిహేను రోజుల క్రితం మెడలో మంగళసూత్రం లాక్కుపోయాడు. ఇప్పుడు మా బాధ ఆయన తాగుతున్నాడని కాదు సార్.. ఎక్కడ ఆ నాటుసారా తాగి చస్తాడోనని. ఇప్పుడు పసుపుతాడు వేసుకొనైనా తిరగుతున్నాను. ఆయనే పోతే ఆ భాగ్యమూ ఉండదు సార్. ఏమి చేసైనా మమ్మల్ని ఆదుకోండి'' అంటూ రెండు చేతులూ జోడించి వేడుకుంటుంటే కళ్లలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను చూడగలిగాను.

కూలి చేస్తే వచ్చే రూ. 150లో రూ.70నుంచి రూ.100 సారాకే పోతే ఇక పిల్లల చదువులు ఎలా? అద్దె ఎలా? కుటుంబ అవసరాలు ఎలా? అని బేలగా చూస్తుంటే, బెల్టుషాపుల రద్దు ఎంత అవసరమో నాకూ ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది.

నా డ్యూటీ నేను చేయాలి కదా!


విజయవాడ, జనవరి 24 : చంద్రబాబు కాలు నొ ప్పితో బాధ పడుతున్నారు. ఆయ న ఎడమ కాలు చిటికెన వేలుకు వాపు రావటంతో గురువారం కుం టుతూనే పాదయాత్ర పూర్తి చేశా రు. నొప్పి ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం భోజన విరామానికి ముందుగానే యాత్రకు స్వల్ప వి రామం ఇచ్చారు.

అనంతరం పల్లగిరి గ్రామంలో తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. నందిగామ పొలిమేర నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి నిలబడటంతో నొప్పిని దిగమింగుతూనే వారితో కరచాలనం చేశారు. నందిగామలో బహిరంగ సభ తర్వాత నొప్పి తీవ్రం కావటంతో వైద్యులు పరీక్షించి వేలు వాచినట్టు గుర్తించారు.

తిరగబెట్టిన కాలు నొప్పి!

జగన్‌తో సీఎం కుమ్మక్కు
అందుకే సీబీఐకి ప్రభుత్వం సహకరించడం లేదు
కిరణ్‌పై చంద్రబాబు నిప్పులు
కృష్ణాజిల్లా పాదయాత్రకు బ్రహ్మరథం

విజయవాడ, జనవరి 24 : వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాలూచీ పడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. "జగన్ కేసులో ప్ర భుత్వం సహకరించలేదని సుప్రీం కోర్టుకు సీబీఐ మొర పెట్టుకు నే పరిస్థితి వచ్చింది. దీన్నిబట్టి కిరణ్ దొంగలను కాపాడటానికి ఎంతగా తంటాలు పడుతున్నాడో అర్థమవుతోంద''ని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ఒక్కటేనని, ఒకటి దోచుకునే పార్టీ అయితే, మరొకటి దాన్నంతా కప్పిపెట్టి కాపాడే పార్టీ అని దుయ్యబట్టారు. కృష్ణాజిల్లా కొండూరు వద్ద ఆయన పాదయాత్రని ప్రారంభించారు.

పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా పాదయాత్రకు బయలు దేరేముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించా రు. నందిగామలోకి ప్రవేశించే సమయంలో చంద్రబాబుకు కనీవినీ ఎరుగని రీతి లో అపూర్వ స్వాగతం లభించింది. దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. పట్టణంలోని ప్రతి మేడ, ప్రహరీ గోడ.. అన్నీ ప్రజలతో నిండిపోయాయి. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆపివేయించి చంద్రబాబును చూసేందుకు బస్సు పైకెక్కారు. దీంతో.. నందిగామలో ఏర్పాటుచేసిన సభాస్థలికి రావడానికి చంద్రబాబుకు దాదాపు 45 నిమిషాలు పట్టింది. గురువారం రాత్రి నందిగామ గాంధీబొమ్మ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

"ఆ రెండు పార్టీలూ ఒక్కటే! ఒకటి తల్లి కాంగ్రెస్, మరొకటి పిల్ల కాంగ్రెస్. ఒకడు దోచుకునే వాడు, మరొకటి ఆ దోపిడీ ముఠాను కాపాడే దొంగల పార్టీ. ఈ దొంగల ను రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలి'' అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ పార్టీలను చిత్తుగా ఓడించాలని కోరారు. "దేశంలో అవినీతి పరులు కలుపు మొక్కల్లా తయారయ్యారు. కలుపు మొక్కలు తీయకపోతే పంట చేతికి రాదు. అంబేద్కర్, ఫూలే, వివేకానందుడు, మహాత్మాగాం«ధీ, ఎన్టీఆర్ వంటి యుగపురుషులు జన్మించిన గడ్డ ఇది. దీన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉంది. రాష్ట్రాన్ని అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది' అని పిలుపునిచ్చారు.

గొర్రెలకు ఉన్న విశ్వాసం కూడా రాజకీయ నేతలలో ఉం డటం లేదన్నారు. 30 ఏళ్లపాటు శ్రమించి నాయకులుగా తీర్చిదిద్ది ఎమ్మెల్యేలను చేస్తే సూట్‌కేసులకు అమ్ముడుపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన కాంగ్రెస్ అన్ని విధాలా భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు, మహిళలు చివరికి వృద్ధులు.. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా జీవితాన్ని గడపలేని దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు.

సంక్షేమం పేరిట ప్రజలకు పప్పు బెల్లాలు పంచి వైఎస్ తన కొడుకు జగన్‌కు మాత్రం లక్ష కోట్లు దోచి పెట్టాడని దుయ్యబట్టారు. ధాన్యం లారీల మాదిరిగా ట్రక్కులలో డబ్బులు దోచుకుని వాటిని గుప్తనిధి లెక్క దాచిపెట్టారని ఆరోపించారు. గాడి తప్పిన పరిపాలనను తిరిగి మంచి మార్గంలోకి తీసుకు రావడం టీడీపీకి మాత్రమే సాధ్యమని చెప్పారు.

జగన్‌తో సీఎం కుమ్మక్కు

January 24, 2013

కిరణ్‌కుమార్‌రెడ్డిది చేతగాని ప్రభుత్వం అని టీడీ పీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రజల సొమ్మును కాంగ్రెస్ దొంగలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలను దోచుకోవడమే తప్ప ఆదుకోవడానికి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం మాగల్లు నుంచి 115వ రోజు పాత్రయాత్రను బాబు ప్రారంభించారు. పల్లగరి మీదుగా నందిగామకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజు మొత్తం 15.6 కి.మీ మేర చంద్రబాబు నడవనున్నారు

కిరణ్‌ది చేతగాని ప్రభుత్వం : చంద్రబాబు

ఈ ఫ్రభుత్వం తీరింతే ! మిమ్మల్ని నిలువునా మోసం చేస్తోంది! అసలు ఇది ఒక ప్రభుత్వమేనా? చేతగాని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మీరంతా అన్నీ కష్టాలే చవిచూస్తున్నారు. ఏ ఒక్కరూ సుఖంగా లేరు ! నేను పదేపదే చెబుతున్నదొకటే! ఒక్కసారి టీడీపీ హయాంలో జరిగిన పాలనకు, ఇప్పటి పాలనకు బేరీజు వేసుకోండి. దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి ! మీ చింతలు తీర్చే పాలన ఇస్తా'' అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. రెండు రోజులుగా పాదయాత్రను కొనసాగిస్తూ బహిరంగ సభల్లో మాట్లాడుతూ, అక్కడికక్కడే ముఖాముఖి నిర్వహిస్తున్నారు. బుధవారం అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, జొన్నలగడ్డ క్రాస్ రోడ్స్, వెల్దుర్తిపాడు గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో ముఖాముఖిలో చంద్రబాబుతో స్థానికులు ప్రస్తావించిన అంశాలపై స్పందన ఈ విధంగా ఉంది.

* అయ్యా.. ఏమని చెప్పుకోను నా బాధ. నీకు ఇంటి స్థలం లేదు పో అని అధికారులు అన్నారు. అవినీతి మా ఊళ్ళో కూడా ఉంది. నేను ఒక్కటే నిర్ణయానికి వచ్చా.. ఈ సారి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నా.:- యాదగిరి, లారీ డ్రైవర్ చంద్రబాబు : తమ్ముడూ.. నీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పింది నిజమే! కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోవటం లేదు. పెద్దలకు దోచి పెడుతున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి అనేకం టీడీపీ హయాంలో నెలకొల్పినవన్నీ ప్రస్తుత ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది * మీరు సీఎంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని సినిమాల్లో చూపించేవారు. ఇప్పుడు జరుగుతున ్న అవినీతి వ్యవహరాలపై సినిమాల్లో చూపిస్తున్నారు. ఈ సారి తప్పకుండా టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. లక్ష కోట్లు పారేస్తే గెలుస్తాం అన్న అభి ప్రా యంలో వైసీపీ నాయకులు ఉన్నారు.

:- ప్రసాద్, స్థానికుడు చంద్రబాబు : తమ్ముడూ నేను ధర్మ పోరాటం చేస్తున్నాను. ఎవరెన్ని అధర్మ మార్గాల్లో వెళ్ళినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే! నేను చేసే పోరాటానికి మీరు సహకరించండి! మీ సెల్‌ఫోన్స్ ద్వారా అవినీతిపై వ్యతిరేకంగా ఒక్కొక్కరూ 10 ఎస్ఎంఎస్‌లు పంపించండి చాలు. ఏం జరుగుతుందో చూడండి.* సార్.. నేనొక్కడినే లోటస్ పాండ్‌కు వెళ్ళాలనుకుంటున్నాను. పాండ్ కింద దాచిన లక్ష కోట్లు మన సొమ్మే కదా! నాతో పాటు ఎవ్వరు వచ్చినా సరే..తవ్వి తీస్తాం .

:- నరేంద్ర, యువకుడు చంద్రబాబు: తమ్ముడు నువ్వు చెప్పింది వాస్తవం. రాజశేఖరరెడ్డి పరిపానలో రాష్ట్రాన్ని దోచేశారు. రౌడీ రాజకీయాలతో అరాచక పాలన సాగించారు. వారు దిగమింగిన లక్ష కోట్లను బయటకు తీస్తే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టవచ్చు.

నేనిప్పుడు చేసే పోరాటం అదే.* అయ్యా.. నా ఇంటి గోడ పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని కాదని నాకు ఎలాంటి సహాయం చేయడంలేదు. అదే వారి పార్టీకి చెందిన వారికైతే.. పనిచేసుకుంటున్నారు.:- అప్పన్న రమాదేవి , మేస్త్రీ చంద్రబాబు : చూడు తల్లీ.. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి రూ. లక్షతో ఇంటిని కట్టిస్తాం. అలాగే ఇళ్ళ స్థలాలు లేని వారికి వాటిని కూడా అందిస్తాం. మీ జీవితాలు బాగు పడటానికి పంట రుణాలను మాఫీ చేస్తాం. ప్రతి ఇంట్లో ఉన్న యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం.

ఈ ప్రభుత్వ తీరింతే..మార్పును కోరుకోండి

  పెనుగంచిప్రోలులో బస చేసిన చంద్రబాబు బుధవారం 10.35 గంటలకు తన పాదయాత్ర ప్రారంభించారు. సత్యసాయి ఫంక్షన్ హాల్ అండ్ గార్డెన్స్ నుంచి బయలు దేరిన ఆయనకు గార్డెన్ యజమానులు పోలేపల్లి పూర్ణచంద్రబాబు, మోహన్ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల ప్రభాకరరావు, ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, కేశినేని నానిలు బాబు బస చేసిన వాహనంలోనే చర్చలు జరిపి పాదయాత్రను ప్రారంభించారు.

దున్నపోతుకు మేత వేసి ఆవును పాలివ్వమంటే ఎలా... పాదయాత్రలో చంద్రబాబు జనంతో సరదాగా మాట్లాడుతూ ముందుకు సాగారు. పెనుగంచిప్రోలు - అనిగండ్లపాడు మధ్యలో యాత్రకు ఎదురైన బస్సులోని ప్రయాణికులు ఆయనకు అభివాదం చేశారు. అందులోని కొందరితో ముచ్చడించారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెరిగాయని, మీరే మమ్ముల్ని కాపాడాలని బాబును కోరారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు. కాదు ఇప్పడే ఏదో ఒకటి చేయండని బతిమాలాడారు. స్పందించిన బాబు, 'దున్నపోతుకు మేత వేసి ఆవును పాలివ్వమని' అడగడం న్యాయమా అంటూ నవ్వారు.

ఈ సారి నాకు ఓట్లు వేసి గెలిపించండి మీ బాధలు తీరుస్తానని చెప్పి ముందుకు సాగారు. విద్యార్థినితో మాటా మంతి అనిగండ్లపాడు సమీపంలో భవ్య అనే ఎంబీఏ విద్యార్థిని బాబును కలసి నమస్కరించింది. ఆమెను కుటుంబ ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కళాశాలలే ప్రస్తుతం మీ అందరికీ ఆసరా అయ్యాయన్నారు. ఎంబీఏ చదువుతున్నా ఉద్యోగ వస్తుందన్న భరోసా కనిపించడంలేదు. తన కన్నా ముందు చదివిన వారికే ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని చంద్రబాబుకు విన్నవిచ్చింది. స్పందించిన ఆయన అధైర్య పడవద్దని తాను అధికారంలోకి రాగానే చదువుకున్న వారందరికీ ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అనిగండ్లపాడు ఎలిమెంటరీ పాఠశాలలోకి వెళ్లి చిన్నారులతో ముచ్చటించి, అవినీతిపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చంద్రబాబు చేశారు.

సమస్యలు వింటూ..హామీలస్తూ..

లక్ష కోట్లు దోచిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచేసింది. రూ. వెయ్యి నోట్లు అయితే ఒక్కో గోనె సంచిలో రూ.కోటి పడుతుంది. మీరు ధాన్యం గోనె సంచులను చూసి ఉంటారు కానీ, డబ్బుల సంచులు చూసి ఉండరు. ఒక్కో లారీకి 100 గోనె సంచులు పడతాయి. అంటే లక్ష కోట్లకు 1000 లారీలు పడతాయన్నమాట ! అంటూ పిట్టకథ రూపంలో ప్రతి గ్రామంలో వల్లెవేస్తున్నారు. రెండు లారీలు ఇస్తే అందరి కష్టాలుతీరతాయి. అనడంతో ప్రజల నుంచి స్పందన లభించింది.బెల్ట్‌షాప్ తీసేస్తే తాగుడు తగ్గుతుంది తమ్ముళ్ళూ... కొంతమంది మిట్ట మధ్యాహ్నం ఫుటుగా తాగేస్తున్నారు. అప్పుల బాధల నుంచి తట్టుకోవటానికి ఒక పెగ్గుతో మొదలై.. క్వార్టర్, ఆ తర్వాత ఫుల్ వరకూ వెళ్ళింది. చీప్ లిక్కర్ రూ.20 ఉండేదానిని ప్రభుత్వం రూ. 100 విక్రయిస్తోంది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ? నేనో సభలో తాగి వచ్చిన ఒకరిని ప్రశ్నించా. తాగావా అని అడిగా? తాగానన్నాడు.

భార్య ను కొడుతున్నావా? తాగినప్పుడే అన్నాడు. తాగకుంటే చక్కగా చూసుకుంటున్నానన్నాడు. మరి తాగడం మానుకోవచ్చు కాదా? అంటే బెల్టు షాపులను కనుక రద్దు చేస్తే మీరు కోరినట్టు మద్యం తాగటం మానివేస్తాను అన్నాడు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత సంతకం చేసే రెండో ఫైల్ బెల్ట్ షాపుల రద్దే..కొంగ జపం.. ఒక చేపల చెరువులో కొంగ తలదించుకుని జపం చేస్తోంది. అందులోని చేపలు కొంగా.. కొంగా.. ఎందుకు జపం చేస్తున్నావు అని అడిగాయి. అందుకు సమాధానం ఇస్తూ నా బాధ అంతా మీ మీదనే అంటూ దీనంగా పలికింది. అయ్యో.. కొంగ గారు మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాయో? అంటూ జాలి పడ్డాయి.

అది గ్రహించిన కొంగ.. ఈ చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి. పక్కనే సమృద్ధిగా ఉన్న చెరువులో మిమ్మల్ని వేస్తాను అంటూ నమ్మబలికి చేపలను తన ముక్కుతో పట్టుకుని పక్కకు తీసుకెళ్లి చంపి తినేది. తమ్ముళ్ళూ.. మీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది. మీకు భ్రమలు కలిగిస్తూ గుది బండలు మోపుతోంది. అది గ్రహించండి అన్నారు. తొమ్మిదేళ్ల తన పాలనలో మిగులు విద్యుత్తు సాధిస్తే.. ఈ ప్రభుత్వం కరెంటు చార్జీల మోత మోగిస్తుంది. త్వరలో మరో రూ. 17 వేల కోట్లకు పెద్ద బాంబు వేయబోతున్నారు. ఇప్పటికైనా భ్రమలను వీడండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయటపడే మార్గం ఉంది. టీడీపీకి అధికారం కట్టబెట్టండి.

చంద్రబాబు విసుర్లు

63 ఏళ్ళ వయసులో విసుగు, విరామం, అలుపు లేకుండా 1800 కిలోమీటర్లు కాలి నడకన తమ చెంతకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు. అభిమానంతోనో, తమ కష్టాలకు ముగింపు పలకగలరన్న ఆశతోనో ఏ వూరు వెళ్ళినా.. ఊరు ఊరంతా ఆయనను చూడటానికి కదలి వస్తోంది. చంద్రబాబు ప్రసంగాలలో కొత్తగా చెప్పే అంశాలు తక్కువుగానే ఉంటున్నప్పటికీ, శ్రద్ధగా వింటున్నారు. పాదయాత్రలో ఆయన మరో 13 కిలోమీటర్లు తనఖాతాలో వేసుకున్నారు. చిల్లకల్లు ఆల్ సెయింట్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో సోమవారం రాత్రి బస చేసిన బాబు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు కొద్దిసేపు పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సందేహాలను తీర్చారు. అనంతరం ఉదయం 11.45 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. తనకు సంఘీభావంగా తరలి వచ్చిన వేలాదిమంది గ్రామీణ ప్రజలతో కలిసి నడిచారు.

మధ్యమధ్యలో ఎండిన పొలాలను పరిశీలించారు. దారేపోయిన వారిని పలకరించారు. మార్గమధ్యంలో చుక్కనీరు లేక ఎండిపోయిన సాగర్ కాల్వను చూశారు. రైతుల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు కథలు విన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పడుతున్న ఇబ్బందుల గురించి ఆలకించారు. నేనున్నానని, అధైర్య పడవద్దని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే... మీ కష్టాలన్నీ తీరతాయని భరోసా ఇచ్చారు. నాలుగు కిలోమీటర్లు నడిచి, సుమారు రెండున్నర గంటలకు మక్కపేట చేరారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు.భోజన విరామం తర్వాత కొద్దిసేపు భోజనానికి ఆగారు. బస్సులోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4.30 గంటలకు మళ్ళీ నడక ప్రారంభించారు. మక్కపేట నుంచి ఐదు కిలోమీటర్లు ఉన్న పెనుగంచిప్రోలుకు పాదయాత్ర సాగింది. దారి పొడువునా ఎండిపోయి కనిపిస్తున్న పత్తి, మిరప చేలను చూసి, తెగుళ్ళు ఆశించి, పంటలు పోయి దిగాలుతో ఉన్న రైతన్నలకు ధైర్యం చెబుతూ, సాయం త్రం 7.30 గంటలకు పెనుగంచిప్రోలుకు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. మేడలు, మిద్దెలు, పిట్టగోడలు ఎక్కి కూర్చున్న ప్రజలతో సంభాషించారు. విద్యుత్ సమస్యను ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ హయాంలో విద్యుత్ పోయిన సమయాన్ని చూసి గడియారాలు మార్చుకునేంత నిక్కచ్చిగా కరెంటు తొమ్మిది గంటలు ఇచ్చేవాళ్ళమని ప్రస్తుత అసమర్థ ప్రభుత్వం రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వటం లేదని విమర్శించారు. భరించలేని విద్యుత్ బిల్లులను ప్రజల చేతిలో పెడుతున్నారని అన్నారు. అవినీతిపై ప్రజల నేరుగా చర్చించారు. బ్యాంకు రుణాలు చెల్లించవద్దని, తమ ప్రభుత్వం రాగానే రుణాలను మాఫీ చేస్తుందని మరోమారు హామీ ఇచ్చారు.

కిరణ్‌పైనా, కాంగ్రెస్‌పైనా నిప్పులు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు. కిరణ్ కిరికిరి ముఖ్యమంత్రి అని, అసమర్ధుడని, చేతకాని దద్దమ్మ అని, దొంగలను కాపాడటానికే ఉన్నాడని ఆయన చేసిన విమర్శలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే జగన్ అవినీతిని, వైఎస్ కాలంలో జరిగిన తప్పులను ఎత్తిచూపారు. నా వెంట వ స్తారా ? చివరగా పెనుగంచిప్రోలు సభలో ఈ వయసులో పాదయాత్రతో తాను పడుతున్న కష్టాలను గురించి చెబుతూ, మీరు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే.. ఇవేమీ నాకు పెద్ద కష్టంగా అనిపించటం లేదని చెప్పి వారిని ఆకట్టుకున్నారు. సభ ముగియగానే.. మీరంతా హాయిగా ఇళ ్ళకు వెళ్ళిపోతారు. నేను మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి.

మీకోసం వచ్చిన నాకు మద్దతుగా, సంఘీభావం తెలుపుతూ మీరంతా నా వెంట వస్తారా? అయితే చేతులు ఎత్తండి.. అంటూ వారిని ఉత్సాహ పరిచారు. వేలాది చేతులు పైకి లేవటంతో ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. అనంతరం పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని, సత్యసాయి ఫంక్షన్ హాల్‌లో రాత్రి బస చేసేందుకు వెళ్ళారు.

మీ కోసం నేనున్నా..

పాదయాత్ర పూర్తిగా రైతు సమస్యలపై దృష్టి సారించారు. చిల్లకల్లు నుంచి మక్కపేట వరకూ మార్గ మ«ధ్యంలో పలు చోట్ల రైతులు బాబును పొలాల్లోకి తీసుకుని వెళ్లి పంటల పరిస్థితిని వివరించారు. చిల్లకల్లు, మక్కపేట గ్రామాల మధ్య చుక్క నీరు లేక ఎండిపోయి ఉన్న ఎన్ఎస్సీ కాల్వను గమనించారు. నాయకులు, కార్యకర్తలతో కలసి కాల్వలోపలికి దిగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్‌లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందుకలు గురిచేస్తుంన్నారు. చేతగాని సీఎం వల్లే రైతులకు కష్టకాలం వచ్చిందని ఆరోపించారు. పక్కనే ఉన్న పత్తి, మిర్చి పంట పొలాలలోకి వెళ్లి పంటలను పరిశీలించారు. పార పట్టుకుని పంట కాల్వలను చెక్కారు. కొందరు మహిళలు చంద్రబాబు చేతులు పట్టుకుని రోదిస్తూ సమస్యలను ఏకరువు పెట్టారు. పాదయాత్ర సమయంలో కళాశాల విద్యార్థినులతో సమస్యలు తెలుసుకుంటూ వారితో కలసి పాదయాత్ర కొనసాగించారు.

అనంతరం మక్కపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సారా తయారి, బెల్టుషాపులు, విద్యుత్ సర్‌చార్జీలు, నిత్యావసర ధరలపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు లొంగిపోకుండా కార్యకర్తలు, అభిమానులు సైనికుల వలే పనిచేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా తాను నిలబడతానని హామీ ఇచ్చారు.

సమస్యలపై రైతులు ఏకరువు మొక్కజొన్న, పత్తి, మిర్చి పరిశీలించారు. సాగు వ్యయం పెరిగిందని, గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని రైతులు వివరించారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో పది వేల రూపాయలు ఉన్న మిర్చి ధర, ప్రస్తుతం నాలుగు వేలకు పడిపోయిందని, పత్తి, మొక్కజొన్న, ధాన్యం ధరలు కూడా దారుణంగా పడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సాగు కష్టమేనని రైలులు నిట్టూర్చారు.

విద్యుత్ సరఫరా కూడా సకాలంలో అధికారులుఅందించలేక పోతున్నారన్నారు. సమస్యలను శ్రద్ధగా విన్న చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులకు ఏరంగంలోనూ సరైన అవగాహన లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే రైతులను కాపాడేందుకు రుణమాఫీపైనే తొలి సంతకం చేస్తా. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తానన్నారు. అన్ని రకాల పంటలకూ గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మక్కపేటలో ఘన స్వాగతం వస్తున్నా- మీకోసం యాత్రలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మక్కపేట చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం లభించింది. మహిళలు, యువకులు పెద్దయెత్తున ఎదురేగి గ్రామంలోని తీసుకువచ్చారు. బాణసంచా, డప్పువాయిద్యాల నడుమ బాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రోడ్లన్నీ జన సంద్రంగా మారాయి. అర కిలోమీటరు దూరం నడిచేందుకు సుమారు అరగంట సమయం పట్టింది. బాబును చూసేందుకు మహిళలు, యువకులు భవనాలు, చెట్లపైకి ఎక్కారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు.

జనాన్ని చూసి బాబు ఒకింత ఆనందంగా కనిపించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుయువత అధ్యక్షులు మల్లెల శివప్రసాద్, నాయకులు మల్లెల గాంధీ, తొండపు జగన్మోహనరావు, మండల పార్టీ అధ్యక్షులు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లమూడి రాంబాబు, నీటి సంఘం అధ్యక్షులు పెద్ది రామారావు, ఆవుల రామారావు, పెంట్యాల శ్రీనివాసరావు, కట్టా కోటయ్య, సత్తి బేతవోలు పాల్గొన్నారు.

మల్లెల గాంధీ, మల్లెల శివలకు కితాబు... చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించడంతో గ్రామ పార్టీ నాయకులు మల్లెల గాంధీ, మల్లెల శివలను ఆయన అభినందించారు. గ్రామాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకుని అభవృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఏడు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైన తెలుగుదేశం నాయకులు మారెళ్ల సీతారామిరెడ్డి భార్య లలిత, కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

తారాజువ్వ పడి వరిగడ్డివాము దగ్థం.. మీ కోసం వస్తున్నా చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా మక్కపేట లో భారీస్థాయిలో బాణసంచా కాల్చా రు. తారాజువ్వా ఒకటి మల్లెబోయిన సత్యనారాయణ వరిగడ్డివాముపై పడి కొంతవరకు దగ్ధమైంది. కార్యకర్తలు వెంటనే మంటలను అదుపు చేశారు.

రైతు సమస్యలు తెలుసుకుంటూ...

స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ... చలోక్తులు విసురుతూ చంద్రబాబు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఆయన ప్రసంగ సరళిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కేవలం రాష్ట్రస్థాయి అంశాలపై మాట్లాడిన బాబు ఇపుడు స్థానిక సమస్యలనుస్పృశిస్తున్నారు. ప్రసంగం చివరలో తాను వెళ్లిన గ్రామాల్లో గుర్తించిన సమస్యలతో పాటు స్థానిక నాయకత్వం ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి సభలో ప్రస్తావించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. సోమవారం రాత్రి జగ్గయ్యపేటలో నిర్వహించిన బహిరంగసభలోను,  మక్కపేట బహిరంగ సభలోను ఆయన స్థానిక సమస్యలను ప్రస్తావించారు. జగ్గయ్యపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ పాస్‌పుస్తకాల పక్కదోవ పట్టిన వ్యవహారాన్ని ప్రస్తావించి అవినీతిని సహించరాదని సూచించారు.

జగ్గయ్యపేటకు నేరుగా కృష్ణా జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ కృష్ణా జిల్లాకు కృష్ణా నదినీటిని ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి గ్రామానికి అందచేస్తానని హామి ఇచ్చారు. మక్కపేటలో జరిగిన సభలో సమస్యల జాబితానే చదివారు. తెలుగుదేశం హయాంలో పూడిక తీసిన గ్రామంలోని చెరువుల పరిస్థితిని, ఇప్పటి పరిస్థితిని గుర్తు చేశారు. గ్రామంలో అంతర్గత రోడ్ల దుస్థితిని ప్రస్తావించారు.

మాస్ మషాలా... బాబు ప్రసంగం అంతా మాస్‌ను టార్గెట్ చేసుకొని సాగుతోంది. వైఎస్ తనయుడికి కట్టబెట్టిన లక్ష కోట్ల సొమ్ము గురించి అర్థమయ్యేరీతిలో వివరిస్తున్నారు. గ్రామంలో కోటి రూపాయలు చూసిన వారుండరని, వంద వందరూపాయల నోట్లు కట్టకడితే పదివేలు అవుతుందని, అలాంటివి పదైతే లక్ష అని, వంద అయితే కోటి అని, వాటిని గోనెసంచుల్లో కుడితే వెయ్యి లారీల అవుతుందంటూ వివరిస్తున్నారు.

ధాన్యం మూటలు తప్పితే డబ్బు సంచులు చూడని ప్రజలకు, జగన్ దోచుకొన్న డబ్బులో 2 లారీలు మీ గ్రామానికి పంపితే ఊరే మారిపోతుందంటూ ఆలోచనలో పడవేస్తున్నారు. కోటి సంతకాల సేకరణను ఎద్దేవా చేస్తూ గ్రామంలో ఎవరో హత్యచేస్తారని, అతను చేయలేదని వందమంది సంతకం చేస్తే నిర్ధోషి అవుతాడా అంటూ ఆకట్టు కొంటున్నారు. ఎవరైన మంచిపని చేయాలంటే ముందు తమకు నచ్చిన ప్రార్థన మందిరానికి వెళ్లి ప్రార్థిస్తారని, జగన్ పార్టీలో చేరేవారు మాత్రం జైలులో కొబ్బరికాయ కొట్టి చేరుతున్నార ంటూ ఎద్దేవా చేశారు. ఇలా ప్రజలకు అర్థమయ్యేలా, ఆకట్టు కొనేలా బాబు ప్రసంగిస్తున్నారు. మక్కపేటలో ప్రసంగం ఆపుతుంటే ఇంకా మాట్లాడాలని కార్యకర్తలు కోరితే, మరోసారి అంటూ వేదిక దిగారు.

సమస్యలు...చటోక్తులు

నాది ధర్మ పోరాటం
వైఎస్‌ను నమ్ముకున్నవారు ఇప్పుడేమయ్యారు?
ఆయన కొడుకూ జైలు పాలయ్యాడు..
అవినీతి పట్ల ఉదాసీనత వద్దు
ఆడిన మాట తప్పను.. హామీలన్నీ అమలు చేస్తా..

"నాది ధర్మ పోరాటం. నీతి కోసం పోరాటం.. అధర్మంపై యుద్ధం చేస్తున్నాను. అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుందని నాకు తెలుసు. కొంతమంది నేను తినను.. మరెవరినీ తిననీయనన్న ఉద్దేశంతోనే అక్రమార్కులకు సహకరించి ఇప్పుడు జైళ్ల పాలయ్యారు. నా కొడుకును వాళ్ల అమ్మ బాగా చదివించింది. నాకెలాంటి స్వార్థం లేదు. నాపై విశ్వాసం ఉంచండి. ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళతాను'' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

'వస్తున్నా.. మీకోసం'లో భాగంగా చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో 114వ రోజు తన పాదయాత్ర కొనసాగించారు. పెనుగంచిప్రోలులోని శ్రీ సత్యసాయి ఫంక్షన్‌హాల్‌లో రాత్రి బస ముగించుకుని బుధవారం పాదయాత్రను బాబు ప్రారంభించారు. అనిగండ్లపాడులో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు రెండు కిలోమీటర్ల దూరం ఎదురొచ్చి మరీ హారతులు ఇచ్చి తమ గ్రామంలోకి ఆహ్వానించారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన బాబు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాకు అండదండలు అందిస్తోందని విమర్శించారు. ప్రపంచ చరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన విధంగా విద్యుత్ భారాన్ని మరెవ్వరూ మోపలేదని మండిపడ్డారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తే.. ఈ బాధలన్నింటిని తీర్చివేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగం - ఉపాధి అజెండాగా కృషి చేస్తానని అన్నారు. రుణమాఫీ అన్నది కష్టమని తెలిసినా.. మనసుంటే అనేక మార్గాలు ఉంటాయని, ఆడిన మాట తప్పేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

అనంతరం గుమ్మడిదుర్రులో జరిగిన మరో బహిరంగ సభలో అవినీతి అంశంపై మాట్లాడారు. తాను రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు పాలన సాగించానని, ఆ సమయంలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి అన్ని వ్యవస్థలను సక్రమంగా పని చేయించానని చెప్పారు. అలాంటి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని చంద్రబాబు ఆరోపించారు. "చంద్రబాబు తినడు.. మిమ్మల్ని తిననీయడు అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి పదే పదే చేసిన విషపు ప్రచారం వల్ల కొంతమంది ఆయనతో కలిసి వెళ్లారు.

ఫలితంగా నేడు అనుభవిస్తున్న పరిస్థితులను తలచుకుని వారు బాధపడుతున్నారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలల హయాంలో జరిగిన వ్యవహారాల వల్ల ఐఏఎస్ అధికారులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా అధికారులు జైలు ఊచలు లెక్కపెట్టిన ఉదంతాలు లేవు. ఆఖరుకు రాజశేఖరరెడ్డి కుమారుడు కూడా జైలుకు పోయాడు'' అని విమర్శించారు. పరిపాలన అంటే ఇష్టానుసారం దోచుకోవటమేనా? అని ప్రశ్నించారు.

వైఎస్ జలయజ్ఞం గురించి ప్రకటించినప్పడు ధనయజ్ఞంగా మార్చవద్దని తాము పదేపదే హెచ్చరించామని, చివరికి అదే జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి అని, ఆయన యుగ పురుషుడని కొనియాడారు. అదే వైఎస్‌ను చూస్తే పిల్లలు అవినీతి తప్ప మరొకటి నేర్చుకోలేరని విమర్శించారు. అవినీతి పట్ల ఉదాసీనంగా ఉంటే భవిష్యత్తు తరాల జీవితాలు నాశనమౌతాయని బాబు హెచ్చరించారు.

అడుగడుగునా జననీరాజనం
చంద్రబాబుకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. పెనుగంచిప్రోలు నుంచి అనిగండ్లపాడు బయలుదేరిన బాబుకు మహిళలు రెండు కిలోమీటర్ల దూరం ఎదురేగి.. హారతులు పట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. గుమ్మడిదుర్రు, రామిరెడ్డిపల్లి, కొండూరుల్లోనూ ప్రతి ఇంటిమీద, పిట్టగోడల మీద, రోడ ్ల కిరువైపులా నిలబడి అశేష జనవాహిని బాబుకు స్వాగతం పలికింది.

అధర్మంపై యద్ధం చేస్తున్నా.. సహకరించండి..