May 20, 2014

పాపం చంద్రబాబు...


పాపం చంద్రబాబు...
నిజంగానే ఓ దురదృష్టవంతుడు...
ఎంతంటే గిన్నిస్ బుక్ లో ఎక్కేటంత..
1995లో ఆయన పాలనా పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక స్థితి దివాలా అంచున ఉంది..
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన
మద్యపాన నిషేధం, జనతా వస్త్రాలు, రెండు రూపాయలకే కిలో బియ్యం..
వంటి పథకాలు ఆర్థిక వ్యవస్థను పీల్చిపిప్పి చేస్తున్నాయి.
తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన చంద్రబాబు..
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా వాటిని రద్దు చేశాడు.
...
ఫలితం..
మహానాయకుడు బిరుదు ఎన్టీఆర్ కు పోయి..
నియంత, సీఈఓ, కరుడు కట్టిన నాయకుడు
వంటి బిరుదులు బాబుకు తగులుకున్నాయి..
కానీ అప్పటి పరిస్థితుల్లో అంతుకుమించి మరో దారి లేదు..
ఏది ఏమైనా ఎన్టీఆర్ ను దేవుడ్ని చేసి..
తాను మాత్రం రాక్షసుడి ఇమేజ్ తెచ్చుకున్నాడు..
ఆర్థిక స్థితి గాడిన పడే నాటికి పదవి కోల్పోవాల్సి వచ్చింది..
ఆ ఫలాలతో తర్వాతి నాయకులు మహానేతలయ్యారు..
మళ్లీ పదేళ్ల తర్వాత... పదవి దక్కించి..
కానీ ఏం లాభం..
మళ్లీ 1995 నాటి పరిస్థితులే..
మళ్లీ గాడిన పెట్టాలి..
అంటే మళ్లీ కఠినంగా ఉండాలి..
మళ్లీ నియంతగా మారాలి..
ఇంతలో.. ఆయనుంటే ఇలా జరిగేదా అని..
కుక్క బిస్కెట్ల పార్టీలు కన్నీళ్లు కారుస్తాయి..
జనం ఆ కన్నీళ్లకు కరిగిపోయి..
కుక్కమూతి పిందెలకు పట్టం కడతారు..
వాళ్లు, వాళ్ల బంధువులు, భట్రాజులు, తాబేదార్లు, ఫత్తేదార్లు..
కడుపార రాష్ట్రాన్ని భోంచేశాక....
మళ్లీ కరువు..
మళ్లీ చంద్రబాబు..
అయినా ఆయన మళ్లీ వస్తాడు..
అభివృద్ధి చేస్తాడు..
తిట్టినా, రాళ్లేసినా...ఆఖరికి సమాధి చేసినా...
ఎందుకంటే...
ఒక సగటు నాయకుడు వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తాడు...
కానీ ఓ దార్శనికుడు వచ్చే తరాన్ని గురించి ఆలోచిస్తుడు..
చంద్రబాబు ఓ నిజమైన దార్శనికుడు..
జై చంద్రబాబు.. జై తెలుగుదేశం... జోహార్ ఎన్టీఆర్..