October 7, 2013

సీమాంద్ర ప్రజల సమస్యలు, విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మాత్రమే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం డిల్లీ లో ఆయన చేపట్టనున్న దీక్ష సందర్భంగా మొదట హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానం వల్ల ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకుడిగా కలత చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇష్టానుసారం కాక స్వంత నిర్ణయాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర్య విలువలు కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సీమాంద్ర లో ప్రజలు స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నారని, అక్కడి ప్రజల ఆవేదన యావత్ దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య కు పరిష్కారం దొరికే వరకు శక్తి వంచన లేకుండా పోరాడతానని తెలిపారు. మీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ? అన్న ప్రశ్నకు, బ్రిటీషు వారు దిగిరారు అనుకుంటే బాపూజీ దీక్షలు చేసేవారు కాదని, మానవత్వం, ప్రజాస్వామ్య విలువలు ఉన్న ఏ ప్రభుతవమైనా దిగి వస్తుందని అన్నారు.

మీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ?

సీమాంధ్ర ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడం లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీని కేంద్రంగా చేసుకుని దీక్ష చేపడుతున్నారు. ప్రజా ప్రయోజనాలకంటే కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో గెలిచి రాహుల్ ను ప్రధాని చేయాలనే లక్ష్యంతో పని చేస్తోందంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు బాబు. అంతేకాదు స్వయంగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జాతీయ స్థాయిలో నేతల దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బహిర్గతం చేయడానికి చంద్రబాబు పూనుకున్నట్లు కనిపిస్తోంది. దేశ ప్రయోజనాలు, ఇటు తెలంగాణ అటు సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకోకుండా, అంచనాకు రాకుండా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బాబు మండిపడుతున్నారు.అవసరమైతే ఎజెండాలను, జెండాలను పక్కనబెట్టి తిరిగి ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి అన్నివర్గాలను కలుపుకుపోతూ కాంగ్రెస్ ఒంటెద్దు పోకడకు తగిన గుణపాఠం చెప్పడానికి సమీకరణాలు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ నెల 7 నుంచి ప్రకాశం జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర బాబు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలమధ్యకు వెళ్లడంకంటే ఢిల్లీ పీఠంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని బాబు భావిస్తున్నారు. సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్నారు. సీమాంధ్రలో ఇప్పుడు సమైక్య సెగలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లడంకంటే తన లాంటి నేత ఢిల్లీలో దీక్ష చేస్తే ఈ సమస్య జాతీయ స్థాయి నేతల్లో కదలిక తీసుకువస్తుందని బాబు భావిస్తున్నారు.అంతే కాదు జగన్ హైదరాబాద్ లో తన నివాసం లోటస్ పాండ్ వద్దే దీక్ష చేస్తుండగా బాబు మాత్రం నేరుగా సోనియా గాంధీతోనే ఈ అంశంపై పోరాటం చేయడానికి ఢిల్లీని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

ఇక జాతీయ స్థాయిలో బాబు పోరు!


పిసిసి అధ్యక్షుడు బొత్స సత ్యనారాయణ ఆస్తులపై మీకున్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేదా? అని దిగ్విజయ్‌ను... తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమో హన్‌రెడ్డి ప్రశ్నించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బెల్టుషాపులు, మద్యం షాపులు, కబ్జాలు, మాఫియాలు నడుపుతున్న బొత్స, ఆయన కుటుంబీకుల ఆగడాలకు, ఆరాచకాలకు విసిగిన ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. అయితే ఈ దాడులను తాము సమర్థించడం లేదని, కానీ దిగ్విజయ్‌సింగ్‌కు మాత్రం బొత్స ఆస్తులపై ఉన్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేనట్లుగా ఉందన్నారు. 65 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా.. ఒక్క కాంగ్రెస్ నేత కూడా సానుకూలంగా వ్యవహరించలేదన్నారు. దిగ్విజయ్‌కి కూడా ఇక్కడి ప్రజలు గుర్తుకు ఉరాలేదా? అని ప్రశ్నించారు. ఇంతటి తాగ్యాల ఉద్యమం చరిత్రలో మరొకటి లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీక్షపై దిగ్విజయ్ ప్రశ్నించడంపైనా ఆయన స్పందించారు. విభజన ప్రక్రియ అసంబద్ధంగా ఉందనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. అయినా చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారో మీ ముఖ్యమంత్రి(కిరణ్), మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను అడుగు అంటూ.. దిగ్విజయ్‌కు... సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు.

ఆస్తులపై మీకున్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేదా?