October 2, 2013

చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ దేశానికి రోల్ మోడల్సని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అభివృద్దికి వారిద్దరూ ప్రతీకలని, తమ హయాంలో తమ రాష్ట్రాలను వారు అభివృద్దిలో అగ్రగామిగా నిలిపారని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాజకీయం జడ పదార్ధం కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు మారాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

గతంలో బిజెపిపైనా...మోడీపైనా టిడిపి చేసిన విమర్శలను ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన దేశాన్ని నాశనం చేసిందని, ఆ పార్టీని దించడం కోసం ప్రత్యర్ధులైనా చేతులు కలపక తప్పదని ఆయన అన్నారు. అమెరికాను షట్ డౌన్ చేసినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని షట్ డౌన్ చేస్తేనే విభజన నిర్ణయం ఆగుతుందని, లేకపోతే వారి భవిష్యత్తు షట్ డౌన్ అవుతుందని కేశవ్ వ్యాఖ్యానించారు.

బాబు, మోడీ దేశానికి రోల్ మోడల్స్......................

ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మరోసారి జాతీయ రాజకీయాలలో ప్రధాన భూమిక ను పోషించే రోజులు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చక్రం తిప్పబోయేది ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక ప్రాంతంలో తెరాస, మరో ప్రాంతంలో వైసీపీలతో అవగాహన కుదుర్చుకుని కాంగ్రెస్ తన మ్యాజిక్ ఫిగర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు అమలుచేస్తుండగా... దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి నాందీ పలుకుతోంది. గత నెలలో న్యూఢిల్లీ పర్యటనలోనే ఎన్డీయేలో చేరికపై బాబు సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలుస్తున్నది.

మంగళవారం హైదరాబాద్‌లో ముస్లింనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమై భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిక అంశంపై అభిప్రాయాలు తెలుసుకున్న పరిణామం కీలకమైన ముందడుగుగా పేర్కొన వచ్చు. చంద్రబాబు బుధవారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా భాజపాతో ముందుకెళ్ళే అంశంపై చర్చ నడుస్తోంది. గతంలో ఎన్డీయేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు కలిసొచ్చిన సెంటిమెంట్, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువతరం, విద్యావంతుల్లో పెరిగిన ఆదరణ, యూపీయేకి పరిస్థితులు రోజురోజకు దిగజారిపోతుండటం ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై ఎన్డీయేలో చేరడం ఒక్కటే రాజకీయంగా ఉత్తమమైన మార్గమని, అది రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిది ఖాయమని దాదాపు తేలిపోయింది. అందులో చంద్రబాబు నిర్వహించాల్సిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్వీనర్ బాధ్యతలను అప్పగించే విషయంలో భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సుముఖంగానే వున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. అయితే ఏపీలో పార్టీ బలాబలాలు, సమీకరణలు ఎప్పుడు ఎలా మారిపోతాయో, టిడిపి, వైసీపీలలో ఏ పార్టీ ముందుంటుందో, ఎక్కువ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్న మోడీ ఒకవైపు బాబు పాత్రకు ఒకే చెబుతూనే మరోవైపు వైసీపీ అంశానికి కూడా తలుపులు మూసివేయడం లేదని తెలుస్తోంది. గతంలో యుఎఫ్ కన్వీనర్‌గా దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్ సర్కార్ల హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు అనుభవాల దృష్ట్యా ఎన్డీయే కన్వీనర్ పదవిని అప్పగించేందుకు ముందుకొస్తోంది. 

తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం టిడిపి అధినేత గతంలోలాగ కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, గతంలో ఎన్టీఆర్ తరహాలో యూపీయేను గద్దెదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ మరోసారి జాతీయ రాజకీయాలలో ప్రధాన భూమిక ను పోషించే రోజులు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చక్రం తిప్పబోయేది ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక ప్రాంతంలో తెరాస, మరో ప్రాంతంలో వైసీపీలతో అవగాహన కుదుర్చుకుని కాంగ్రెస్ తన మ్యాజిక్ ఫిగర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు అమలుచేస్తుండగా... దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి నాందీ పలుకుతోంది. గత నెలలో న్యూఢిల్లీ పర్యటనలోనే ఎన్డీయేలో చేరికపై బాబు సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలుస్తున్నది.

మంగళవారం హైదరాబాద్‌లో ముస్లింనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమై భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిక అంశంపై అభిప్రాయాలు తెలుసుకున్న పరిణామం కీలకమైన ముందడుగుగా పేర్కొన వచ్చు. చంద్రబాబు బుధవారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా భాజపాతో ముందుకెళ్ళే అంశంపై చర్చ నడుస్తోంది. గతంలో ఎన్డీయేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు కలిసొచ్చిన సెంటిమెంట్, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువతరం, విద్యావంతుల్లో పెరిగిన ఆదరణ, యూపీయేకి పరిస్థితులు రోజురోజకు దిగజారిపోతుండటం ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై ఎన్డీయేలో చేరడం ఒక్కటే రాజకీయంగా ఉత్తమమైన మార్గమని, అది రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిది ఖాయమని దాదాపు తేలిపోయింది. అందులో చంద్రబాబు నిర్వహించాల్సిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్వీనర్ బాధ్యతలను అప్పగించే విషయంలో భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సుముఖంగానే వున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. అయితే ఏపీలో పార్టీ బలాబలాలు, సమీకరణలు ఎప్పుడు ఎలా మారిపోతాయో, టిడిపి, వైసీపీలలో ఏ పార్టీ ముందుంటుందో, ఎక్కువ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్న మోడీ ఒకవైపు బాబు పాత్రకు ఒకే చెబుతూనే మరోవైపు వైసీపీ అంశానికి కూడా తలుపులు మూసివేయడం లేదని తెలుస్తోంది. గతంలో యుఎఫ్ కన్వీనర్‌గా దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్ సర్కార్ల హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు అనుభవాల దృష్ట్యా ఎన్డీయే కన్వీనర్ పదవిని అప్పగించేందుకు ముందుకొస్తోంది.

తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం టిడిపి అధినేత గతంలోలాగ కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, గతంలో ఎన్టీఆర్ తరహాలో యూపీయేను గద్దెదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?

ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్’ సదస్సులో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం సూపర్ పవర్ గా అవతరించే రోజు దగ్గర్లోనే ఉందని బాబు అన్నారు. అయితే, ఈ సదస్సులో చంద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో వేదిక పంచుకోవడం విశేషం.

గుజరాత్ ను అభివృద్ధి పథంలో ముందుంచి, ఇటీవలే భాజపా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీపై ప్రసంశల వర్షం కురిపించారు. మోడీ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. గాంధీ, మోడీ ఇద్దరూ గుజరాత్ కు చెందినవారు కావడం కాకతాళీయం అని ఆయన అన్నారు. ఎన్డీఏ హయాంలోనే సంస్కరణలు ఊపందుకున్నాయని… దేశం అభివృద్ధి దిశగా పయనించిందని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు సంస్కరణలను యూపీఏ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

గతంలో అందరూ హైదరాబాద్ గురించి మాట్లాడేవారన్న బాబు… ఇప్పుడు అందరూ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారని మోడీకి కితాబిచ్చారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఉత్పాదనలో రాష్ట్రం అగ్రశ్రేణిలో నిలిచేందుకు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. దేశంలోనే అగ్రశ్రేణి విమానాశ్రయం, కన్వెన్షన్ సెంటర్ ను తాము నిర్మించామని చంద్రబాబు తెలిపారు. దీంతో పాటు… ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, న్యాయ విశ్వవిద్యాలయం, బిజినెస్ స్కూలు ఏర్పాటుచేశామని అన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని బాబు పిలుపునిచ్చారు. నేడు రాజకీయాల పట్ల 71 శాతం యువత ఆకర్షితులవుతున్నారని… ఇది 100 శాతానికి పెరగాలని అభిప్రాయపడ్డారు.

మోడీ విజన్ ఉన్న నాయకుడు

ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధ వారం ఉదయం ఢిల్లీలో జరిగిన సిటిజన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్రమే కారణమని విమర్శించారు.

ఉత్తరాఖండ్ బాధితులకు సాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే తానే ముందున్నానన్నారు. గాంధీ, మోదీ ఇద్దరూ గుజరాత్‌లో పుట్టడం కాకతాళీయమే అని ఆయన అన్నారు. ప్రధానిగా పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు పరస్పరం పలకరించుకున్నారు.

ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోంది : చంద్రబాబు

జగన్ వ్యవహరణ తీరు, జరుగుతున్న పరిణామాలు, వస్తున్న పుకార్లు దీనికి ఆధారాలు అని విశ్లేషకులు అంటున్నారు. నిప్పులేనిదే పొగ రాదు..అన్నట్టుగా భూమా ఫ్యామిలీలో అసంతృప్తి లేనిదే ఈ పుకార్లు మొదలవ్వవు.
ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంతో.. ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న భూమానాగిరెడ్డి ఆశలకు అడ్డుకట్ట పడింది. గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యమున్న నాగిరెడ్డి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచే అయితే సులభంగా గెలవొచ్చని ఆశించాడు. అయితే ఇప్పుడు ఆయనను నంద్యాల అసెంబ్లీకి ఇన్ చార్జ్ గా ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ! మరి ఎంపీగా పోటీ చేయాలనుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేయడం కచ్చితంగా ఆయనలో అసంతృప్తిని రగిల్చే విషయమే!
అదిగాక.. వైకాపాలో ఉన్నందున మొత్తం కర్నూలు జిల్లాపైనే ఆధిపత్యాన్ని కోరుకొంది భూమా ఫ్యామిలీ. దీనికి జగన్ సమ్మతించడు. ఎవరికీ సోలోగా ఒక జిల్లా బాధ్యతలను అప్పజెప్పడానికి జగన్ సిద్ధంగా లేడు. దీంతో భూమా ఫ్యామిలీకి అన్ని విధాలుగానే నిరాశే కలుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో.. ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. జరిగిన పరిణామాలు.. ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. దీంతో భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు వైకాపాకు విడ్కోలు చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయం కలుగుతోంది.

TDP గూటికి భూమా దంపతులు ?