September 23, 2013

దేశవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి జాతీయ సమగ్రత ఎలా సాధిస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ఆ యన మాట్లాడారు. తొలుత అజెండా ప్రకారం మత సామరస్యం, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఉద్యమాలను ఎందుకు అజెండాలో పేర్కొనలేదని ప్రశ్నించారు.

"2009 నుంచి తెలంగాణలో వరుస ఉద్యమాలు జరిగాయి. వందలాది యువత ఆత్మహత్యలు చేసుకున్నా రు. తెలంగాణ ఉద్యోగుల పిలుపుతో ప్రజలంతా 42 రోజులపాటు సకల జనుల సమ్మె నిర్వహించారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు 55 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆ ప్రాంతంలో యంత్రాంగం స్తంభించింది. ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. సచివాలయంలోను, ఇతర కేంద్ర కార్యాలయాల్లోను ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యోగుల మ« ద్య సామరస్యం దెబ్బతింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి రెండు లేఖలు రాశాను.

కానీ, కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. రాష్ట్ర ప్రజలంతా మనో వేదనతో ఆందోళనలు చేస్తోంటే కేంద్రానికి పట్టదా?'' అని బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎంతో తీవ్రంగా ఉంటే ఉన్నతస్థాయి వేదిక అయిన ఎన్ఐసీలో దానిని ఒక అంశంగా చేర్చి చర్చించరా? అని నిలదీశారు. దీంతో, వేదికపై ఉన్న సోనియా గాంధీ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు ఆ విషయాలన్నీ మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారని ఆమె సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం తదితరులను ప్రశ్నించారు. దీంతో, తొలుత షిండే జోక్యం చేసుకుని..
'రాష్ట్ర విభజనకు మీరు కూడా లేఖ ఇచ్చారు కదా!?' అని ప్రశ్నించారు. "అవును ఇచ్చాను. అయితే, ఇప్పుడు తలెత్తిన పరిస్థితులను పరిష్కరించరా? ఆందోళన చెందుతున్న ప్రజలకు సామరస్యపూర్వక పరిష్కారం చూపించరా?'' అని బాబు ప్రశ్నించారు.

దీంతో 'అసలు ఆ విషయం అజెండాలో లేదు. కాబట్టి మీరు మాట్లాడటం కుదరదు' అని చిదంబరం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతుంటే కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. 'అయితే మీరు చెప్పాల్సింది చెప్పారు కదా! ఇంకేంటి?' అని చిదంబరం ప్రశ్నించారు. మైక్ కట్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. 'కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేను వాకౌట్ చేస్తున్నాను' అని ప్రకటించి బయటకు వచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్రం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని అవమానించాయని విమర్శించారు. తెలంగాణ అంశంపై మాట్లాడేందుకు అసోం సీఎంకి అవకాశం ఇచ్చిన వాళ్లు తాను మాట్లాడుతుంటే మాత్రం ఎందుకు మైక్ కట్ చేశారని ప్రశ్నించారు.

కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుపై ప్రకటన చేసిన వెంటనే తమ రాష్ట్రంలో మూడు ప్రత్యేక రాష్ట్రాల కోసం నిరసనలు మొదలయ్యాయని, వాటిని సమర్థంగా పరిష్కరించామని అసోం సీఎం తరుణ్ గొగోయ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఎన్ఐసీ భేటీలో వివరిస్తూ.. మధ్యలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

'రాష్ట్ర విభజనకు మీరు కూడా లేఖ ఇచ్చారు కదా!?'

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని తాను ముందే చెప్పానని, జగన్‌కు బెయిల్ రావడం ఇందులో భాగమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రపతికి ఇచ్చిన వినతిపత్రంలోనే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్, టిఆర్ఎస్‌లతో కాంగ్రెస్ కుమ్మక్కయిందని తాను వివరించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అవినీతి రాజకీయాలపై ఇక ఉధృతంగా పోరాడతామని, జగన్‌కు బెయిల్ ఇవ్వడంపై న్యాయస్థానాల్లోనేగాక, ప్రజాకోర్టుల్లోనూ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను దోషులుగా నిలబెడతామని చంద్రబాబు చెప్పారు. సోనియాగాంధీని దయ్యంగా అభివర్ణించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు... జగన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె దేవతగా మారిందని ఆయన అన్నారు.

ప్రజలు ఈ రాజకీయాలను ఏవగించుకుని తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక కుంభకోణాలకు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న కాంగ్రెస్... దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచిందని, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోయిందని, దేశం ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారిందని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్‌తో కుమ్మక్కయిందని, ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ లేవదీస్తామని చెప్పారు. అవినీతి కుంభకోణాలపై పోరాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, గతంలో బోఫోర్స్ కుంభకోణంపై, రాజశేఖర్‌రెడ్డి అవినీతిపై పోరాడామని ఆయన గుర్తు చేశారు. ఒక కుటుంబాన్ని ఆ«ధికారంలోకి తేవడం కోసం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిందన్న చంద్రబాబు... సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ప్రకటించిన రోజే టిఆర్ఎస్ విలీనం అవుతుందని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారని, జగన్ డీఎన్ఏ కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటేనని ఆయనే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారన్న విషయం వారం రోజుల క్రితమే జగన్ పార్టీకి తెలుసునని, అందుకే వారి ఎమ్మెల్యేలు ముందే రాజీనామా చేశారని చంద్రబాబు అన్నారు. తాజాగా వైఎస్సార్‌కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల నేతల భార్యలు రాష్ట్రపతికి ఒకే వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సీబీఐ పది ఛార్జిషీటుల్లో 73 మందిపై కేసులు మోపిందని, వీటన్నింటిలోనూ జగన్ ఏ-1 నిందితుడుగా ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. ఏ-2, ఏ-3, ఏ-4, ఏ-5 నిందితులకు బెయిల్ రాకుండా జగన్‌కు బెయిల్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేయకుమందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు పెట్టుకున్నారని, ఆ తర్వాత ఈ ఛార్జిషీట్లు దాఖలు చేశారని చంద్రబాబు అన్నారు. నిజానికి ఛార్జిషీట్లు అన్నీ దాఖలు చేసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. మధుకోడా నాలుగున్నరేళ్లుగా జైలులో ఉన్నారని, ఆయన ఆస్తులను అటాచ్ చేశారని, గాలి జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా జైలులో ఉన్నారని చెప్పారు. సత్యం రామలింగరాజు వ్యక్తిగత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వీరిపై ఉన్న కేసుల కంటే జగన్ పై ఉన్న కేసుల తీవ్రత ఎంతో ఎక్కువని చంద్రబాబు అన్నారు. గాలిపై ఒక్క ఇనుపఖనిజం కేసు ఉంటే... జగన్‌పై మనీలాండరింగ్, వాన్‌పిక్, అక్రమ కేటాయింపుల వంటి అనేక కేసులున్నాయన్నారు. ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారం అంతా కూడబలుక్కున్నట్లే జరిగిందని ఆయన అన్నారు.

ఏడు కేసుల్లో క్విడ్ ప్రో కో లేదని తేలిందని, తమ విచారణ పూర్తయిందని, ఇతర అంశాలపై ఐటీ, ఈడీలకు లేఖ రాశామని సీబీఐ కోర్టుకు చెప్పడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం చేశారు. ఇదే సీబీఐ జగన్‌పై విచారణ సాగుతున్నదని, విదేశాలకు కూడా లేఖలు రాశామని వివరించి, బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించిందని చంద్రబాబు తెలిపారు. ఈ రీత్యా జగన్‌కు బెయిల్ ఇవ్వాలనడం సాంకేతికంగానే చెల్లదని ఆయన అన్నారు. ఇంకా విచారణ జరగాల్సి ఉన్నదని కోర్టుకు సీబీఐ చెప్పలేకపోయిందని అయన అన్నారు. కొద్దినెలల ముందు సీబీఐ జేడీని, డీఐజీని బదిలీ చేశారని, కోర్టు ముందు ఇంతకుముందున్న అడ్వకేట్‌ను పెట్టుకోలేదని ఆయన అన్నారు. సీబీఐ... కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా వ్యవహరిస్తున్నదని, కాంగ్రెస్‌కు, జగన్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని దీనితో ధ్రువపడుతున్నదని, ఇది చాలా దారుణమని చంద్రబాబు అన్నారు.

ఇటీవల ములాయం సింగ్‌పై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును మూసివేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. సీమాంధ్రలో విద్వేషాలు పెంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు వీలు కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. ఈడీకి కేసులను నివేదించామని సీబీఐ చెబుతోందని, 16 నెలల నుంచి అసలు ఇంతవరకూ ఈడీ ఏ చర్య తీసుకున్నదని ఆయన ప్రశ్నించారు. కోల్‌కటాకు చెందిన ఒక సూట్‌కేస్ కంపెనీ, గౌహతికి చెందిన ఒక సూట్‌కేస్ కంపెనీల ద్వారా జరిగిన మనీ లాండరింగ్‌పై ఏం చేశారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత బరితెగించి అడ్డగోలుగా ఏం చేసినా మనను అడిగేవారేలేరన్నట్లు ప్రవర్తించడం దారుణమని అన్నారు.

సోనియాగాంధీని దయ్యంగా అభివర్ణించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు... జగన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె దేవతగా మారింది

  కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడంవల్లే అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌గా మారిందని విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటన రోజే జగన్ కాంగ్రెస్ డీఎన్ఏగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

జగన్ ఆస్తుల కేసును నీరు గార్చేందుకు కాంగ్రెసు ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఓట్లు సీట్లు కావాలి, ఎవరు ఏమైనా ఫర్వాలేదనే పద్ధతిలో కాంగ్రెసు వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైయస్ జగన్‌కు సంబంధించి కొన్ని కేసుల్లో క్విడ్ ప్రోకో లేదని సిబిఐ హడావిడిగా చెప్పిందని, వైయస్ జగన్ కేసులో ఇప్పటి వరకు ఈడి విచారణ జరగకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కేసులో సాధారణ స్థాయిలో పెట్టాల్సిన న్యాయవాదులను కూడా సిబిఐ పెట్టలేదని ఆయన అన్నారు. చార్జీషీట్లు మొత్తం దాఖలు చేసిన తర్వాతే జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. చార్జిషీట్లు దాఖలు చేయకముందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జదగన్ బరి తెగించి, అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
ఓఎంసీ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి రెండేళ్లుగా జైలులో ఉన్నారని, సత్యం రామలింగరాజు ఆస్తులను జప్తు చేశారని, రామలింగ రాజు నాలుగేళ్ల పాటు జైలులో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కోల్‌కతా కంపెనీలు జగన్ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెడితే ఈడి ఏం చేస్తోందని ఆయన అడిగారు. 16 నెలల పాటు ఈడి ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని, ఈడి, సిబిఐల ఉదాసీనతలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎన్ఐసీ సమావేశంలో చెప్పాలని తాను భావిస్తే తనకు మైక్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసు పార్టీ పురమాయించి పరిస్థితులను దిగజారుస్తోందని ఆయన విమర్శించారు. సిడబ్ల్యుసి తీర్మానం చేయడానికి ముందే సమాచారం ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులతో కాంగ్రెసు రాజీనామాలు చేయించిందని ఆయన ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీవీసీని కలిసామని చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి నుంచి అవినీతిపై టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్-వైసీపీ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

జగన్ ఆస్తుల కేసును నీరు గార్చేందుకు కాంగ్రెసు.......

  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్ బెయిల్ ఉహించిందేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి వ్యాఖ్యానించారు. సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఆమె మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్ పిల్లకాంగ్రెస్ నేత జగన్‌కు బెయిల్ ఇప్పస్తుందని తమకు ముందే తెలుసన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను బాధ్యతలనుంచి ఇందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారన్నారు.

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితితోను, సీమంధ్రలో జగన్ పార్టీతోను పొత్తు పెటుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ఇందులో భాగంగానే జగన్‌కు కోర్టులో బెయిల్ వచ్చేవిదంగా సిీబీఐని పావులా వాడుకున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర 53రోజులుగా రగిలిపోతుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చోద్యం చుస్త్తున్నారన్నారు. జగన్‌కు బెయిల్ ఇప్పించడంలో వున్న శ్రద్ధ తెలుగు వారిని ఐక్యంగా ఉంచడంలో చూపించడం లేదన్నారు.

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితితోను, సీమంధ్రలో జగన్ పార్టీతోను పొత్తు పెటుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావాలన్న ఉద్దేశం

కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడంవల్లే అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌గా మారిందని విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటన రోజే జగన్ కాంగ్రెస్ డీఎన్ఏగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

జగన్ ఆస్తుల కేసును నీరు గార్చేందుకు కాంగ్రెసు ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఓట్లు సీట్లు కావాలి, ఎవరు ఏమైనా ఫర్వాలేదనే పద్ధతిలో కాంగ్రెసు వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైయస్ జగన్‌కు సంబంధించి కొన్ని కేసుల్లో క్విడ్ ప్రోకో లేదని సిబిఐ హడావిడిగా చెప్పిందని, వైయస్ జగన్ కేసులో ఇప్పటి వరకు ఈడి విచారణ జరగకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.  జగన్ కేసులో సాధారణ స్థాయిలో పెట్టాల్సిన న్యాయవాదులను కూడా సిబిఐ పెట్టలేదని ఆయన అన్నారు. చార్జీషీట్లు మొత్తం దాఖలు చేసిన తర్వాతే జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. చార్జిషీట్లు దాఖలు చేయకముందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జదగన్ బరి తెగించి, అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
ఓఎంసీ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి రెండేళ్లుగా జైలులో ఉన్నారని, సత్యం రామలింగరాజు ఆస్తులను జప్తు చేశారని, రామలింగ రాజు నాలుగేళ్ల పాటు జైలులో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కోల్‌కతా కంపెనీలు జగన్ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెడితే ఈడి ఏం చేస్తోందని ఆయన అడిగారు. 16 నెలల పాటు ఈడి ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని, ఈడి, సిబిఐల ఉదాసీనతలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
 రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎన్ఐసీ సమావేశంలో చెప్పాలని తాను భావిస్తే  తనకు మైక్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసు పార్టీ పురమాయించి పరిస్థితులను దిగజారుస్తోందని ఆయన విమర్శించారు. సిడబ్ల్యుసి తీర్మానం చేయడానికి ముందే సమాచారం ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులతో కాంగ్రెసు రాజీనామాలు చేయించిందని ఆయన ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీవీసీని కలిసామని చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి నుంచి అవినీతిపై టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్-వైసీపీ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తాడు?

ఎన్ఐసీ నుంచి బాబు వాకౌట్
తెలుగువారికి అవమానం:బాబు  నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ (ఎన్ఐసీ) సమావేశాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిష్కరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రస్తావించవద్దని అడ్డుకున్నారు. అందుకే ఎన్ఐసీ సమావేశాన్ని బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఎన్ఐసీ భేటీ నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవద్దని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం అడ్డుకున్నారని అన్నారు. సమావేశంలో తెలుగువారికి అవమానం జరిగిందని, అందుకే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశామని చంద్రబాబు ఆవేదనగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నలలో నడుస్తున్నారని, ఆయన సీటు కోసం పాకులాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కనీసం తనకు మద్దతు తెలపలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్రం తగలబడుతుంటే ఎన్ఐసీలో చర్చించాల్సిన అవసరం లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు లేనట్లే సీఎం ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తోందని చంద్రబాబు «నాయుడు ధ్వజమెత్తారు. సీమాంధ్రలో 55 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా, సమస్యల గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజనపై దేశంలో ఉన్న మేధావులు అందరూ ఆలోచించాలని ఆయన అన్నారు.

అస్సాం రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఎన్ఐసీలో అవకాశం కల్పించారని అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో ఎలా పోరాటం చేయాలో తెలుసునని, అలాగే ఢిల్లీలో కూడా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారు.. .......

ఎనిమిది కంపెనీలకు సంబంధించి జగన్ కేసులో క్విడ్ ప్రో జరగలేదని సిబిఐ నాంపల్లి కోర్టుకు మెమో ఇవ్వడంపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.సరిగ్గా బెయిల్ వచ్చే రోజున సిబిఐ ఇలాంటి మెమో ఎలా దాఖలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.ఇదే కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ల కుమ్మక్కుకు నిదర్శనమని ఆయన అన్నారు.

సరిగ్గా బెయిల్ వచ్చే రోజున సిబిఐ ఇలాంటి మెమో ఎలా దాఖలు చేస్తుంది