September 17, 2013

Warm welcome to Our Visionary Leader - Mr. Nara Chandrababu Naidu @ncbn on Twitter....

Everybody of You can follow him on www.twitter.com/ncbn


Everybody of You can follow him on www.twitter.com/ncbn

జగన్‌కు ప్రధాని అండ


కేసు విచారణను అడ్డుకుంటున్నది ఆయనే
కాంగ్రెస్, వైసీపీ మధ్య బెయిల్ డీల్
టీడీపీ ఎంపీల ఆరోపణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : ఆర్థిక అత్యాచారం చేసి రూ.లక్ష కోట్లు దోచుకున్న వైఎస్ జగన్ బయటకు వచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. జగన్ కేసు విచారణను స్వయంగా ప్రధానే అడ్డుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సమాచారం ఇవ్వకుండా విచారణను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్, వైసీపీ మధ్య డీల్ కుదిరిందని, ఈ కారణంగా ఆలస్యమవుతున్న కేసు విచారణను వేగిరపరచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, రమేశ్ రాథోడ్, గుండు సుధారాణి, సీఎం రమేశ్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్, ఈడీ డైరెక్టర్, సీబీఐ డైరెక్టర్‌లను కలిసి ఫిర్యాదుచేశారు. అనంతరం ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మ్యాచ్ ఫిక్సింగ్‌వల్లే జగన్‌పై విచారణ ఆలస్యమవుతోందని నామా ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నాయన్నారు.
జగన్ కేసులో నిందితులైన ఐఏఎస్‌లను విచారించేందుకు అనుమతించాలని సీబీఐ 21 నెలలకిందట కోరినా ఇంత వరకూ కేంద్రం స్పందించలేదని, ప్రధాని ఆధ్వర్యంలో ఉన్న శాఖే సీబీఐకి అనుమతి ఇవ్వటం లేదని, ప్రధాన మంత్రే రక్షిస్తున్నారని ఆరోపించారు. కనీస విచారణ కూడా జరపకుండా తొక్కి పెట్టారనడానికి సాక్ష్యాలున్నాయన్నారు. ఆరు దేశాలనుంచి అక్ర మ సొమ్ము వచ్చిందని సీబీఐ చెప్పినా విచారణే జరగటం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు రాజీనామా చేసి తమ స్వచ్ఛతను నిరూపించుకోవాల్సి ఉందన్నారు. కానీ, సీబీఐ అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని, ఈ మేరకు సీబీఐ కోర్టులో కూడా చెప్పిందని గుర్తుచేశా రు. రూ.43 వేల కోట్ల మేరకు అవినీతి జరిగిందని సీబీఐ చెప్పిందని, తొలి 3 చార్జిషీట్లలోనే రూ.2000 కోట్లకుపైగా అక్రమ పెట్టుబడులున్నాయని ఈడీ చెప్పిందని.. కానీ, ఇంతవరకూ జరిగిన జప్తు కేవలం రూ.234 కోట్లు మాత్రమేనని తప్పుబట్టారు. ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న జగన్ అవినీతి కళ్లెదుటే ఆధారాల తో కనిపిస్తున్నా ఆ సొమ్మును వెనక్కు తీసుకుని ప్రజలకు తిరిగి ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రులను కూడా కలిసి జగన్ కేసు దర్యాప్తుపై ఫిర్యాదు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. వైసీపీ నాయకులు అడిగినప్పుడు ప్రధాని వెంటనే సమయం ఇస్తున్నారని, తాము అడిగితే ముఖం చాటేస్తూ సమయం ఇవ్వటం లేదని ఆరోపించారు. తమ నాయకుడు చంద్రబాబు మూడేళ్లుగా తన ఆస్తులను ప్రకటిస్తున్నారని, వైసీపీ, కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే వారి ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్భయ కేసును ఎనిమిది నెలల్లో విచారించి శిక్షలు వేశారని, ఆర్థిక అత్యాచారం చేసినవారి విషయంలోనూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి అంతే వేగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ బెయిల్ కోసం కాంగ్రెస్, వైసీపీ మధ్య డీల్ కుదిరిందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసుపట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కొనకళ్ల నారాయణ ఆరోపించారు.
ఆర్థిక నేరాలు చేసిన జగన్‌కు ప్రభుత్వం సహకరించటం సిగ్గు చేటన్నారు. ఓట్లు, సీట్లు, బెయిల్ కోసమే కాంగ్రెస్, వైసీపీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని, ప్రజలు దీనిని గుర్తించాలని కోరారు. ఆర్థిక భూకంపాన్ని సృష్టించిన జగన్ లక్ష కోట్లు దోచుకున్న దొంగ అని, జైల్లో ఉన్న ఖైదీ అని, అలాంటి వ్యక్తిని చూసి తాము భయపడుతున్నామనటం హాస్యాస్పదమని రమేశ్ రాథోడ్ మండిపడ్డారు. అవినీతిపై పోరా టం చేసే తాము ఒక ఖైదీని చూసి భయపడాల్సిన పని లేదన్నారు. జగన్ అవినీతితో పోలిస్తే గాలి జనార్దన రెడ్డి, మధుకోడాల అవినీతి పది శాతం కూడా లేదన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ ఏ పని అయినా చేస్తుందనటానికి జగన్ బెయిల్ డీలే తాజా ఉదాహరణ అన్నారు. తమ పోరాటం అవినీతిపైన అని, ఈ పోరాటంలో భాగంగా ఎవరినైనా కలిసి ఫిర్యాదు చేస్తామని సీఎం రమేశ్ చెప్పారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కూడా తాను బయటకు వస్తే ఫలానా పార్టీకి నష్టమని అనొచ్చని.. అంతమాత్రాన ఆయన్ను వదిలేస్తామా? తాను బయటకు వస్తే టీడీపీకి నష్టం అని జగన్ అన్నంత మాత్రాన ఆయన్ను వదిలేస్తామా? అని ప్రశ్నించారు. దొంగను దొంగ అని నిరూపించేందుకు ఏమైనా చేస్తామన్నారు.

courtesy : andhrajyothi

జగన్‌ కేసు విచారణను అడ్డుకుంటున్నది ఆయనే....!

జగన్ అక్రమాస్తుల కేసులో
మరో రెండు చార్జీషీట్లు దాఖలు
ఏ-9గా మంత్రి గీతారెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జీషీట్లును మంగళవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ సంస్థపై చార్జీషీట్లు దాఖలు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ చార్జీషీట్‌లో మొత్తం 14 మందిని నిందుతులుగా పేర్కొంది. మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన పేర్లను అధికారులు చేర్చారు. 2004-09లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి గీతారెడ్డిని ఏ-9గా, దర్మాన ప్రసాదరావు ఏ-11గా సీబీఐ పేర్కొంది. జగన్ ఏ-1, విజయసాయి ఏ-2, శ్యామ్ ప్రసాద్ ఏ-3, బీపీ ఆచార్య ఏ-4, ప్రభాకర్‌రెడ్డి ఏ-5, ఇంకా జగతి పబ్లికేషన్‌కు సంబంధించిన వారిని నిందితులుగా సీబీఐ పేర్కొంది.
జగన్ కంపెనీల్లో ఇందూ గ్రూప్ రూ. 70 కోట్లును పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ విచారణలో తేల్చింది. ఇందుకు ప్రతిఫలంగా 8848 ఎకరాల భూమిని అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. అలాగే శంషాబాద్‌లో ఇందూ టెక్ జోన్‌కు 250 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రాజెక్టులు నిర్మించి యువతకు వేల ఉద్యోగాలను కల్పిస్తామని ఈ సంస్థ పేర్కొంది. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న కోట్ల రూపాయలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సిబీఐ చార్జీషీట్‌లో పేర్కొంది. ఇందూ ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ మంత్రి సబితా రెడ్డిని ఏ-8గా సీబీఐ చార్జీషీట్‌లో పేర్కొంది.

లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ చార్జ్‌షీట్‌లో...
14 మందిని నిందితులుగా చేర్చిన సీబీఐ
ఏ-1 జగన్‌, ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ3 శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి...
ఏ-6 లేపాక్షి చైర్మన్‌ బాలాజి, ఏ-7 బీపీ ఆచార్య...
ఏ-8 శ్యామ్‌సన్‌రాజు, ఏ-9 గీతారెడ్డి, ఏ-10 శ్యామ్యూల్‌...
ఏ11 ధర్మాన, ఏ-12 మురళీధర్‌రెడ్డి
ఏ13 ప్రభాకర్‌రెడ్డి, ఏ14 జగతి పబ్లికేషన్స్‌

ఇందూ ప్రాజెక్ట్‌ వ్యవహారంలో...
10 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ
ఏ-1 జగన్‌, ఏ2, విజయసాయి, ఏ3 శ్యామ్‌ ప్రసాద్‌..
ఏ4 ఇందూ ప్రాజెక్ట్, ఏ5 ఇందూటెక్‌, ఏ6 ఎస్పీఆర్‌ ప్రాజెక్ట్‌..
ఏ-7 రత్నప్రభ, ఏ8 సబిత, ఏ-9 బీపీ ఆచార్య

ఏ-9గా మంత్రి గీతారెడ్డి.......!!!

తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినం సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాబు జాతీయ జెండాను ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను స్వర్గీయ నందమూరి తారక రామారావే తొలగించారన్నారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపిం తమ పార్టీయేనని చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదే అన్నారు.

 హైదరాబాద్ కు కృష్ణా నది జలాలు తీసుకువచ్చిన ఘనత తమకే చెందుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. భాగ్యనరం చుట్టుపక్కల భూముల అమ్మకాన్ని వ్యతిరేకించామన్నారు. తన కృషి ఫలితంగానే హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటయిందని తెలిపారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు.
హైదరాబాదు చుట్టుపక్కల భూముల అమ్మకాన్ని టిడిపి మొదటి నుండి వ్యతిరేకిస్తోందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భూములు అమ్ముతుంటే తెలంగాణపై ఇప్పుడు మాట్లాడే నేతలు అప్పుడు ఏమయ్యారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
కాంగ్రెస్ కుటిల రాజకీయాలు చూస్తే బాధ కలుగుతోందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను ఎన్టీఆర్ పేరు పెడితే దాన్ని మార్చేసి కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పేరుపెట్టిందని అన్నారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తమ పార్టీకి మాత్రమే ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విమానాశ్రయానికి తాను ఎన్టీఆర్ పేరు పెడితే దాన్ని మార్చేసి కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పేరుపెట్టింది

జగన్ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సెజ్‌ల పేరుతో పేదల భూములను లాక్కుని కార్పోరేట్ సంస్థలకు వైఎస్ కట్టుబెట్టారని, జగన్ ఖాతాల్లోకి విదేశీ నిధులు వచ్చాయని ఆరోపించారు. జగన్ కేసును కంటితుడుపుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు.


ఈ కేసులో వైఎస్ ఆత్మ కేవీపిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని ప్రశ్నించారు. జగన్ ఆస్తులపై మలి విడత పోరాటానికి టీడీపీ సిద్ధంగా ఉందని, మరోసారి కోర్టు తలుపు తట్టనున్నట్లు రేవంత్ తెలిపారు. జైళ్లో ఉన్నవారు కూడా నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను తిట్టడానికి ఏ పదం వాడాలో తెలియడంలేదన్నారు.

గతంలో సీబీఐపై ఉన్న అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీబీఐను అడ్డంపెట్టుకుని జగన్‌తో కాంగ్రెస్ ఒప్పందాలు చేసుకుంటోందని ఆరోపించారు. నిజాయితీ గల అధికారిని ఎందుకు బదిలీ చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

సెజ్‌ల పేరుతో పేదల భూములను లాక్కుని కార్పోరేట్ సంస్థలకు వైఎస్ కట్టుబెట్టారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయజెండాను ఆవిష్కరించారు. పార్టీ ఎంపీలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ విమోచన దినం

కాంగ్రెస్, వైసీపీ కుమ్మక్కై జగన్ అక్రమాస్తుల కేసును నీరుగారుస్తున్నాయని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. మంగళవారం ఉదయం జగన్ అక్రమాస్తుల కేసును వేగవంతం చేయాలని కోరుతూ సీవీసీతో టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొణకళ్ల, రమేష్‌రాథోడ్, సీఎం రమేష్ భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆరు దేశాల్లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు రుజువైందని, అయినా ఈడీ సరిగా దర్యాప్తు జరపడం లేదని మండిపడ్డారు. రూ.45 కోట్లు అవనీతి జరిగినట్లు నిర్థారణ అయితే రూ.270 కోట్ల ఆస్తులను మాత్రమే జప్తు చేశారని టీడీపీ ఎంపీలు విమర్శించారు.

కాంగ్రెస్, వైసీపీ కుమ్మక్కై జగన్ అక్రమాస్తుల కేసును నీరుగారుస్తున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులతో టీడీపీ ఎంపీల బృందం మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ కేసు విచారణను వేగవంతం చేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

ఈడీ అధికారులతో టీడీపీ ఎంపీలు భేటీ