September 10, 2013

జస్టిస్ చౌదరిలా మారండి!


 "రాష్ట్రంలో కాంగ్రెస్ దిక్కులేని పరిస్థితిలో ఉంది. ఉప ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, వైసీపీలను అడ్డుపెట్టుకుని గెలవాలనుకోవటం సిగ్గుమాలిన చర్య. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందని నేను ముందే చెప్పాను. అయినా వినకుండా మీరు ఓట్లు వేశారు. చివరికి కాంగ్రెస్‌లో కలిసిపోయింది. తమ్ముళ్లూ..! వైసీపీ కూడా అంతే! పిల్ల కాంగ్రెస్ కూడా తల్లి కాంగ్రెస్ గూటికే వెళ్లిపోతుంది. మీరు కనక వైసీపీకి సీట్లు ఇస్తే వాటిని అమ్ముకుంటుంది. ఇప్పటికైనా కళ్లు తెరవండి! దొంగలకు రాజ్యాధికారం ఇవ్వవద్దు. వాళ్లకు సిగ్గు లేకపోయినా మనకు సిగ్గులేదా? మంచివాళ్లనే గెలిపించండి. ధర్మం, సుపరిపాలన కోసం జస్టిస్ చౌదరిలా మారండి'' అని రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

ప్రజల భవిష్యత్తును నాశనం చేసే వారి గుండెల్లో గునపాలతో గుచ్చాలని, వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని చెప్పారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ఐదో రోజుకు చేరుకుంది. మంగళవారం ఆయన తిరువూరు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌లను ప్రజలు ఇంటికి సాగనంపుతారని చెప్పారు. తెలుగు జాతికి సమష్టిగా పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. అవినీతిపరులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

"సోనియా స్క్రిప్టు రాసిస్తే.. టీఆర్ఎస్, వైసీపీ దానిని వల్లె వేస్తున్నాయి. అవినీతి కాంగ్రెస్, వసూళ్ల టీఆర్ఎస్, దొంగల పార్టీ వైసీపీలకు తెలుగు వారి దెబ్బ ఏమిటో రుచి చూపిద్దాం. తెలుగు వాడి దెబ్బ ఏమిటో పంచాయతీ ఎన్నికల్లోనే చూపించారు. కాంగ్రెస్ గెలవలేదని తెలిసి.. ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు వైసీపీలతో లబ్ధి పొందాలని చూస్తోంది. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు శృంగభంగం తప్పదు'' అని చంద్రబాబు చెప్పారు. వైఎస్ హైదరాబాద్‌ను అమ్ముకున్నాడని ఆరోపించారు. వైఎస్ అవినీతి తర్వాత ఇప్పుడు తల్లి, కూతురు, కొడుకు కలిసి దోచుకోవాలని చూస్తున్నారని చెప్పారు. వైఎస్ దోపిడీ విధానాల వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.25 వేల కోట్ల కరెంటు భారం పడిందని దుయ్యబట్టారు.

వైఎస్ లక్ష కోట్లు దోచి కొడుక్కి దోచిపెట్టాడని, అందుకే వైఎస్ చనిపోయిన తర్వాత సీబీఐ జగన్‌ను ప్రధాన ముద్దాయిగా పెట్టిందని చెప్పారు. "సీబీఐ ప్రధాని ఆధీనంలో ఉంది. విజయలక్ష్మి వెళ్లి మన్మోహన్‌ను కలిశారు. వైఎస్ లేకపోవడంతోనే ఈరోజు మాకీ సమస్య అని ఆయన అన్నారు. వైఎస్ అప్పట్లో ప్రధానికి కప్పం కట్టేవారు. ఇప్పుడు ఆ కప్పం నిలిచి పోయిందన్న బాధలో ప్రధాని ఉన్నాడు. నోరు లేకపోయినా, దేశం నాశనమవుతున్నా ప్రధాన మంత్రి కుర్చీని వదలడం లేదు'' అని దుయ్యబట్టారు.


హైదరాబాద్, విజయవాడ: తెలుగు వారి ఆత్మ గౌరవ యాత్ర పేరుతో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్రకు ఐదు రోజులపాటు తాత్కాలికంగా విరామం ఇస్తున్నారు. అనారోగ్య కారణాలతో మూడు నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయన భావించారు. బుధవారం తిరువూరు నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని, గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. మొదటి విడత యాత్ర వారం రోజులు ఉంటుందని అనుకొన్నా ఈ రెండు జిల్లాల్లో కలిపి 11 రోజులు సాగింది.

ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకూ యాత్ర కొనసాగించాలని ఒక దశలో అనుకొన్నా పార్టీ నేతల సలహాతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా రాయలసీమలో జరపాలని యోచిస్తున్నారు. కాగా.. వస్తున్నా మీ కోసం పేరిట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో చర్చకు వచ్చిన అంశాలను రాబోయే ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోకు ప్రాతిపదికగా తీసుకోవాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.

వైసీపీ కూడా తల్లి కాంగ్రెస్ గూటికే దొంగలకు రాజ్యాధికారం ఇవ్వొద్దు...

నీలయపాలెం విజయ్ కుమార్
 తెలుగు దేశం పార్టీ, వ్యవసాయ విభాగం, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 


 

 

హోం వర్క్ చేయని కాంగ్రెస్ పార్టీ..!!

 స్కూల్ కి హోమ వర్క్ చేయకుండా వస్తే టీచర్ తిడుతుంది. అదే టీచర్ తను చెప్పబోయే పాటము సరిగ్గా ప్రిపేర్ కాకుండా వస్తే విద్యార్ధులు నవ్వుతారు. అందుకని టీచర్లు, విద్యార్ధులు తమ  భాద్యతలను నిర్వర్తిస్తారు. ముప్పయి అయిదు రోజులకు పైగా రాష్ట్రంలో, విభజన నిర్ణయం వలన రాయలసీమ, ఆంద్ర ప్రాంతాల్లో రగులుతున్న ఆవేశాలను చూస్తుంటే, ప్రశ్పుటంగా తెలిసేది ఒక్కటే. కేంద్ర ప్రభుత్వం తగిన హోమ వర్క్ చేయకుండానే పాటము చెప్పెసిందని! అసలు రాష్ట్రానికి ఏమి కావాలో తెలుసుకోకుండా, పక్క పార్టీల సంగతి సరే, కనీసం తన పార్టీ మనోభావాలు కూడా పూర్తిగా  తెలుసుకోకుండా, ఏదో ఒక పాటము చెప్పేస్తే ఈ వేళ గడచి  పోతుందనే ఉద్దేశం తప్ప, తాను ఇచ్చే పాటము అందరికీ ఉపయోగ పడాలనే కాంక్ష ఎక్కడా కనపడలేదు.
ఇన్నాళ్ళ నుంచి రావణ కాష్టంలా రాగుకుతున్న సమస్యకి పరిష్కారం చూపాల్సిందే! ఎవ్వరూ కాదనరు. ఏ పరిష్కారం కూడా రెండు వర్గాలకు పూర్తి సంతృప్తి ఇవ్వదు. ఇవ్వలేదు కూడా. ఎందుకంటే ఒక వర్గం సంపూర్ణంగా సంతృప్తి చెందింది అంటే, ఇంకొక బాగం పూర్తి అసంతృప్తి చెందడమే. ప్రజాస్వామ్యంలో అందరినీ కలుపుకొని, వున్నంతలో సర్దుకొనిపోయి, ఒక ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోనడమే ముఖ్యం. అదే ప్రజాస్వామ్యం ఎసెన్స్ కూడా. ఇందుకోసం ముఖ్యంగా కావాల్సింది, ఆ సమస్యకు చెందిన, లేదా ఆ సమస్య మీద తీసుకొనే నిర్ణయం వలన ప్రభావం పడే వ్యక్తులను, సంస్థలను ముందుగా ఒక చోట చేర్చి వారి వాదనలను విని, దానికి తాననుకొన్న పరిష్కారాలను చూపి, ఆ పరిష్కారాలకు వారు చెప్పే అభ్యంతరాలు, సవరణలను మళ్ళీ చర్చించి , అంతిమంగా ఒక నిర్ణయానికి రావాలి. ఇది ఒక రోజు, రెండు రోజులో జరిగే ప్రక్రియ కాదు. కొన్ని నెలల పాటు జరగాల్సిన ప్రక్రియ. దురదృష్టవశాత్తు, అలాంటి ప్రయత్నాలేమీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర  విభజన నిర్ణయాన్ని ప్రకటించేటప్పుడు పాటించలేదు.
నిజానికి, శ్రీ కృష్ణ కమిటీ వేసింది ఈ సంప్రదింపుల కోసమే. ఒక విధంగా చూస్తే శ్రీ కృష్ణ కమిటీ శ్లాఘనీయమైన పని చేసిందనే చెప్పాలి. రాష్ట్రంలో ఇరువైపులా, సమాజంలోని పలు వర్గాలతో, పలుమార్లు చర్చించి, సామాజిక, రాజకీయ, జీవనోపాధుల విషయాల మొదలుకొని, విభజన అనంతర పరిస్తిత్ని కూడా విశ్లేషిస్తూ ఆరు పరిష్కారాలను సూచించింది.  సమస్య పరిష్కారార్ధం, తనిచ్చిన ఆరు పరిష్కారాలలో ఏదేనీ చెప్పట్టదలచిన, ముందుగా తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఇరు ప్రాంతాలకు ఇవ్వాల్సిన, రాజకీయ , ఆర్ధిక సౌకర్యాలు మొదలుగునవి కూడా స్పష్టంగా వివరించింది. కానీ కమిటీ నిర్ణయం ప్రకటించి మూడు సంవత్సరాలు దాటినా తర్వాత కూడా కేంద్రం, నివేదికను రాష్ట్ర అసెంబ్లీలో కానీ , పార్లమెంటులో కానీ ప్రవేశపెట్టలేదు. ఎక్కడా చర్చించలేదు. ప్రజలతో ఆ కమిటీ సూచించిన పరిష్కారాల గురించి చర్చలను కేంద్రం జరుపలేదు. కమిటీ నివేదికను ఒక మూలన పడేసింది. ప్రజలను కూడా ఆ నివేదికను సమర్పించి  మూడు సంవత్సరాలు గడుస్తున్న నేపధ్యంలో పూర్తిగా మరచిపోయారు.
ఇప్పుడు, కేంద్రం, ఏదో గుర్తుకోచ్చినట్లుగా, తెలంగాణాని ప్రత్యేక రాష్ట్రం చేసేస్తున్నాం అంటూ ముక్తసరిగా ఒక ప్రకటన చేసి అటు ఆంధ్రా రాయలసీమ వాదులను, ఇటు తెలంగాణా వాదులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
పైగా అటు పిమ్మట ఒక పది రోజులకు రాజ్య సభలో ఆర్ధిక మంత్రి చిదంబరం ఒక ప్రకటన చేస్తూ విభజనకు ప్రాతిపదిక ఏమిటి అనే ప్రశ్నకు జవాభిస్తూ శ్రీ కృష్ణ కమిటీ అని జవాభు చెప్పారు. ఇది నిజంగా విచిత్రం. ఎందుకంటే ఒక శ్రీ కృష్ణ కమిటీని నిజంగా ప్రజలకు చూపించకుండా తాము మాత్రమే చూసేసి, దాన్ని ప్రాతిపదికగా వారిచ్చిన రిపోర్ట్ లోని ఒక ఆప్షన్ ను తీసుకొని  విభజన నిర్ణయం తీసుకొంది కేంద్రం అనుకొన్నా కూడా, కమిటీ రిపోర్ట్ లో ఒక వేళ తెలంగాణా రాష్ట్రం ఇస్తే దానికి ముందు వెనుకల తీసుకోవాల్సిన చర్య గురించి చాలా చెప్పింది. అవేమీ కేంద్రం పాటించలేదు. పైగా ఆంధ్ర, రాయలసీమ వాళ్లకు, కొన్ని రోజులు వేచి వుంటే బిల్లు తయారు చేస్తాము , ఆ బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తే మీ ప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పచ్చు అనే ఒక ఉచిత సలహా కూడా పడేసింది. అంటే కాంగ్రెస్ ప్ర్రభుత్వానికి, ప్రజలతో, సమాజంలోని వివిధ వర్గాలతో విభజన గురించి చర్చించే ఉద్దేశం అసలు లేనే లేదు.
ఒక్కసారిగా ఆంధ్ర దేశం బగ్గుమనడంలో విచిత్రమేమీ కనిపించటం లేదు ఈ విభజన ప్రకటన తీరుతెన్నులు చూసిన తర్వాత. తమ గురించి కేంద్రం అసలు పట్టించుకోలేదు, తమ వాదనలు వినలేదు, తమ భవిష్యత్తు, తమ పిల్లల జీవనోపాధుల గురించి పట్టించుకోలేదు కేంద్రం అనే భాద సీమాంద్ర ప్రజల ఆందోళనల్లో స్పష్టంగా ద్యోతకమౌతోంది.

ఇన్ని రోజులనించీ రాయలసీమ , ఆంద్ర ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నా కేంద్రం పట్టించుకొన్న పాపాన పోలేదు. పోనీ నిర్ణయం తీసుకోన్నదేవరయ్యా అంటే యుపీఏ అంటున్నారు. ఆ యుపీఏ లో ప్రస్తుతం ఉంటున్నది ఎవరు? ఫరూక్ అబ్దుల్లా  - ఈయన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటు వాదంతో సతమౌతున్నారు. లడక్ ప్రాతం వారు మాకు వేరే రాష్ట్రం డిమాండ్ ను తీర్చలేకున్నారు. ఇక శరద్ పవార్. – విదర్భ ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళన తీర్చే శక్తి లేదు గానీ, ఆంద్ర ప్రదేశ్ మాత్రం ఒక విభజిస్తాము అని చెప్పేస్తున్నారు. ఇక ఒకే సభుడు గల కేరళ కాంగ్రెస్ ఈ.అహమద్. తన రాష్ట్రంలోని ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను సరిచేయ్యలేరు. ఇక చివరిగా నలుగురు సభ్యులు గల లోక్ దళ పార్టీ . ఉత్తర ప్రదేశ్ ని నాలుగు ముక్కలు చెయ్యాలన్న డిమాండ్ కి ఆందోళన చెయ్యరు గానీ ఆంద్రని విడదీయాలని చెప్పేస్తారు. ఇలాంటి యుపీఏ కేవలం ఒక నలభయి నిముషాల పాటు చర్చించి విభజన నిర్ణయం తీసేసుకొన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీ జే పీ. వీళ్ళు అందరికంటే విచిత్రం. తాము బలంగా వుండే ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్రాన్ని అస్సలు ముక్కలు  చెయ్య కూడదట. ఇక్కడ మాత్రం ముక్కలు చేసెయ్యండి, మేము మద్దతు ఇచ్చేస్తాము అంటున్నారు. తమ గుజాత్ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల గురించి మాట్లాడరు కానీ , ఇక్కడ మాత్రం విభజన చెయ్యాలట. ఆంద్ర ప్రాంతంలో ఒక్క సీట్ కూడా గెలుచుకొనే శక్తి లేని ఈ పార్టీ కేంద్రంలో ఎక్కడో వేరే రాష్ట్రాల్లో గెలుచుకొన్న సీట్ల సంఖ్యతో మన రాష్ట్ర ప్రజల అదృష్టాలను తిరగ రాయాలని ఆత్రుత పడిపోతోంది. ఇక కాంగ్రెస్. విభజనకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తున్నారుగా అంటే, అది మాములేలే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్. అంత గౌరవం ఇస్తున్నాయి, తెలుగు ప్రజలకు ఈ పార్టీలన్నీ. ఇలాంటి పార్టీలు మన రాష్ట్ర భవిష్యత్తుని తిరగ రాయ ప్రయత్నిస్తుంటే ప్రజలు వారి మీద తిరగబడ్డరీతి  ఆశ్చర్యమేముంది?  కేంద్రం పరిస్థితి చూస్తే, తాను ఒక నిర్ణయం చెప్పాను. అది పాటించి తీరవలసిందే అనే అహం తప్ప వేరేమీ కనిపించటంలేదు.
     
ఒక్కొక్క వర్గం యొక్క ప్రతిస్పందన చూస్తే, మొదటగా స్పందించింది హైదరాబాదు ఉద్యోగులు. కేంద్రం, తన నిర్ణయానికి ముందు వీళ్ళతో చర్చించిండా అంటే, సమాధానం లేదనే వస్తుంది. హైదరాబాదులో గత కొన్ని దశాబ్దాలుగా నివాసముండిపోయిన ఉద్యోగులు ఇప్పుడు ఒక్కసారిగా వెళ్ళాలంటే కష్టమన్ వారరి భావన. దీని గురించి వాళ్ళతో అసలు చర్చించనే లేదు కేంద్రం. చర్చించాల్సిన అంశాల్లో వాళ్ళు ఒకరిగా అసలు కేంద్రం గుర్తించలేదు.
ఇక విద్యార్ధులు. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సం చదువులు పూర్తి చేయబోతున్న వాళ్ళు , తమ ఉద్యోగ బవిష్యత్తు ఏమిటి అని తీవ్ర ఆందోళన చేస్తున్నారు. విధ్యార్ధులతో, విద్యార్ధి సంఘాలతో, విభజన అనంతరం వారి విద్యా ఉద్యోగ అవకాశాలను గురించి చర్చించారా అంటే మళ్ళీ లేదనే సమాధానమే వస్తుంది. హైదరాబాదు లోనే అన్నీ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, సర్వీస్ సెక్టార్ వుండే నేపధ్యంలో, ఒక వేళ విభజిస్తే వారి ప్రయోజనాలను కాపాడే చర్యలు తీసుకొంటాము, అవి పలానా విధంగా వుంటాయి అని ఎప్పుడన్నా భాద్యత కలిగి అధికారం లో వున్న వ్యక్తులు గానీ కేంద్రం కానీ చెప్పిందా? ఇప్పుడు ఒక్కసారిగా విభజిస్తే ఉద్యోగాలు దొరుకవన్న నేపధ్యంలో విద్యార్ధులు, రేపటి ఉద్యోగార్ధులు ఆందోళనలో పాల్గొనటంలో తప్పేమీ కనిపించటంలేదు.
రైతులు. మాదీ రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్, నీరు గురించి, నీటి పంపిణీ గురించి, ప్రాజెక్టు ఏరియాల గురించి, ఏనాడైనా, రైతులతో, రైతు సంఘాలతో సమావేశం అయిందా? భూమినే నమ్ముకొన్న జీవిస్తున్న రైతులు రేపటి తమ గతి ఏమిటి అని ఆందోళన పడడంలో అర్ధం ఎందుకు కాంగ్రెస్ కనిపించదో ఈ రాష్ట్ర రైతులకు అర్ధంకాక బిక్క మొహం వేస్తున్నారు. అసలే నీటి లేమి, పైగా ఇప్పటికే పక్క రాష్ట్రాలతో నీటి కోసం ప్రతి సంవత్సరం కొట్లాటలే. ఈ నేపధ్యంలో, రాష్ట్రం విభజింపబడి,  రేపు మన రాష్ట్ర లోనే ఇంకొక సరిహద్దు వచ్చి చేరిన పక్షంలో రాష్ట్రం లోని నీటి సంగతి ఏమిటి అని రైతులు ఆందోళన పాడడంలో ఎంతో బాధ్యత వుంది. ముందు రాష్ట్రం విభజిద్దాం. అటు పిమ్మట కమిటీలు వేసి నీటి వాటాలు నిర్ణయిద్దాం అంటున్న కేంద్ర నిర్ణయాన్ని, మరో పక్క మన కళ్ళ ముందరే పక్క రాష్ట్రాల నీటి వివాదాల్ని  పరిష్కరించేందుకు వేసిన కమిటీల క్రియాశూన్యతను చూస్తుంటే, రైతు దిక్కు తోచని స్థితిలో ఆందోళనకు సిద్ధపడ్డారు. ఇలాగే రాష్ట్రంలో ఈ విభజన నిర్ణయం వలన ప్రభావితం అయ్యే వర్గాలు చాలానే వున్నాయి. మహిళలు, పరిశ్రమలు , కుల సంఘాలు, వృత్తి దారులు, ఇలా ఎంతో మంది వున్నారు. ఎవ్వరితోనూ మాటమాత్రమైనా చర్చించ లేదు కేంద్రం.
ఇక ఆర్ధిక పరిస్థితి కి వస్తే, 2013-14 కు ఇచ్చిన ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్  మొత్తం రూ. 1,61,000 కోట్లు. దీన్ని జనాభా దామాషా ప్రకారం విభజిస్తే, ఆంద్ర రాష్ట్రం, ఒక వేళ ఏర్పడితే కనీసం రూ. 93000 కోట్ల బడ్జెట్ కలిగి వుండాలి. అంత ఆర్ధిక పరిపుష్టి కొత్తగా ఏర్పరచాలని భావించే ఆంధ్ర రాయలసీమలకు వుందా అంటే, ఆర్ధిక నిపుణుల ప్రకారం రూ.  60000 కోట్ల రూపాయలకంటే దాటే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వాణిజ్య వులువలు వున్నా ఏ వ్యాప్రామైనా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమయి వుంది. మరి అలాంటప్పుడు, కేంద్ర విభాజిస్తాను అంటే, ఆంద్ర రాయలసీమ ప్రజలకు, ఆర్ధిక సౌలభ్యం ఏ విధంగా ఇస్తామో, ఇప్పుడు జరుగుతున్న పౌర సేవలకు అంతరాయం కలుగకుండా ఏ విధంగా చేస్తామో చెప్పాల్సిన నైతిక కేంద్రం పైన వున్నది కదా. అన్నీ తర్వాతా చర్చిస్తాము అంటే , దానికి అర్ధమే లేదు.       
                   
కాంగ్రెస్స్, కేవలం పార్టీలతో చర్చించాం. అన్ని పార్టీలు ఒప్పుకోన్నాయి అనే కారణం వెనుక దాక్కొన ప్రయత్నిస్తోంది. పార్టీకంటూ ప్రత్యేక అస్తిత్వం ఏదీ ఉండదు. కొంత మంది వ్యక్తులు ఒక కారణం కోసం, ఒక ఆలోచనతో కలిస్తే అది ఒక పార్టీ అవుతుంది. ఆ పార్టీని కొంత మంది ఎన్నికల్లో సపోర్టు చేస్తే అది రాజకీయ పార్టీ అవుతుంది. కానీ నేడు ఆంద్ర ప్రదేశ్ లో, రెండు వైపులా రెండు విభిన్న అభిప్రాయాలు వెలువరిస్తున్న సందర్భంలో పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా పోతున్నామి అనుకోవడం అర్ధరహితం. రెండు ప్రాంతాల్లో పార్టీలను కాపాడుకోవాలి అనే భావన ప్రతి పార్టీలో వుంటుంది. కానీ ప్రజల కోసం ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా, ప్రజా ప్రతినిధులు తమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రవర్తించాలి. అంత కంటే వేరే దారి ప్రజా ప్రతినిధులకు ఉండకూడదు. పార్టీలు ఇలాంటి ప్రజా ప్రతినిధుల కలయికతో ఏర్పడినవే. అలాంటప్పుడు ఒక వైపు అభిప్రాయానికి సరే అని లేఖ ఇచ్చినా, వేణు వెంటనే ఇంకొక వైపు ప్రజలు అసమ్మతి చూపినప్పుడు వారి వైపు కూడా చూడాలి. వారి మాట కూడా వినాలి. ఒక వైపు లేఖ ఇచ్చాము కాబట్టి ఇంకొక వైపు వారి మాట వినము అని అనడం అర్ధ రహితం. వారు కూడా ప్రజలే, వారి భావాలకీ విలువ ఇవ్వాలి కదా.

రాజకీయ నాయకులకి ఇది ఒక సంధి కాలం. వ్యక్తిగా వారు తమ ప్రజల మాట వినాలి. తప్పదు. అది ధర్మం కూడా. కానీ ఒక పార్టీలో వున్నా వ్యక్తిగా పార్టీ మాటను మన్నించాలి. ఈ సందిగ్ధ పరిస్థితిలో రాజకీయ నాయకులు వున్నారు.  ఇక పార్టీలు కూడా అదే పరిస్థితి. రెండు ప్రాంతాల వైపు వారూ ప్రజా ప్రతినిధులే. వారి వారి ప్రాంతాలలోని ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు ఉద్యమిస్తున్నారు. ఒక సారి ఒక వైపు వారి అభిప్రాయాలకు సరే అన్నాము కాబట్టి ఇంకా చచ్చినా, తర్వాత వెలిబుచ్చిన ఇంకొక వైపు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోము అని ఏ పార్టీ కూడా చెప్పలేదు. చెప్పకూడదు కూడా.
మరి దీనికి పరిష్కారం? భారత్ బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం సమపార్జిన్చినప్పుడు, మన రాజ్యాంగం లో మన దేశం ‘ఫెడరల్ రిపబ్లిక్’ గా వుండాలని రాసుకోన్నాము, అలాగే ఉంటున్నాము. దానికి అనుగుణంగానే రాష్ట్రాల కంటే కేంద్రానికి హక్కులు ఇచ్చాము. మెజారిటీ నిధులు, విదేశీ, రక్షణ మొదలుకొని రాష్ట్రాలను విభజించే పని వరకూ అన్నింటికీ కేంద్రానికే అధికారం ఇచ్చాము. అలాంటి కేంద్రం లో అధికారం లో వుండే నాయకులు , పార్టీలు, సమస్య వచ్చినప్పుడు సమన్యాయంతో సర్దుబాటు చేయాలి. సమన్యాయం అంటే ఏమిటి అని కొందరు హేళనగా మాట్లాడుతున్నారు. రెండు ప్రాంతాలు, కొంత సర్దుబాటు చేసుకొని సంతృప్తి చెందితే అది సమన్యాయమే! కానీ అది సాధించడం ఎలా అన్న విషయం లోనే కేంద్రం విఫలమవుతున్నది. మన అరవై ఏడేళ్ళ స్వతంత్ర్యరాజ్యంలో లోగడ ఇంతకంటే పెద్ద సమస్యలు వచ్చాయి. అన్నింటినీ పరిష్కరించాము. ఎలా? పలు ప్రాంతాల వారితో ప్రజాస్వామ్యం లో వున్న సంభాషణ అనే ప్రక్రియ ద్వారా!
కేంద్రం వెంటనే రంగంలోకి దూకాలి. విభజన నిర్ణయం చెప్పిన మూడో రోజుకే కాంగ్రెస్ ఆంటోనీ కమిటీ అంటూ ఒక అంతర్గత కమిటీ వేసిందంటే కారణం తమ పార్టీలో చెలరేగిన అసంతృప్తే. వాళ్ళ పార్టీ వారినే కన్విన్స్ చెయ్యలేని కేంద్రం కాంగ్రెస్ మరి రాష్ట్రం లోని ప్రజలందరినీ ఎలా కన్విన్స్ చేస్తుంది. అంటే, తీసుకొన్న విభజన తీరు తెన్నులు తప్పు అని రూడీ గా తెలిసిపోయింది. ఇంకా బేషజాలు పెట్టుకోకుండా, ముంకు పట్టు వీడి, సుప్రీం కోర్ట్ ఇప్పటి జస్టిస్ మొదలుకొని వివిధ రంగాల్లో వున్న ప్రముఖులతో రాష్ట్రంలోని పార్టీలు కూడా కలిసి వున్న ఒక హై లెవల్ కమిటీ ని ఒక నెల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలతో సమావేశం చెయ్యాలి.  వారు అందరితో మాట్లాడాలి. ఒకసారి, కాకపోతే రెండుసార్లు, కాకపోతే వందసార్లు మాట్లాడాలి. ఇదంతా పారదర్శకంగా వుండాలి. వాళ్ళేదో నిర్ణయం కోసం కాదు వచ్చేది. రెండు రాష్ట్రాల ప్రజలకు వున్నా  ఆప్షన్స్ ని వివరించాలి. ఇదంతా స్వల్పకాలంలో జరగాలి. ఒక మధ్యే మార్గం రూపొందాలి.


ఇదంతా ఏమీ లేకుండా ఎక్కడ వార్ రూమ్ అని, సిడబ్ల్యుసి అని చెప్పి రహస్య నిర్ణయాలు తీసుకొంటే భరించే ఓపిక, శక్తి ప్రజలకు ఇక లేదు. గత ముప్పై అయిదు రోజుల భీకర ఉద్యమంతో అది స్పష్టం అయింది. ఇక బంతి కాంగ్రెస్ కోర్టులోనే వుంది!!  
courtesy : www.nvijaykumar.com

హోం వర్క్ చేయని కాంగ్రెస్ పార్టీ..!!

 చంద్రబాబు యాత్రను అడ్డుకోజూస్తే మీకు శృంగ భంగం తప్పదని వైఎస్ఆర్ సీపీ నాయకులకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వర్ల రామయ్య హెచ్చరించారు. మంగళవారం విజయవాడలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లాలోని కంభంపాడులో చంద్రబాబు నాయుడు అత్మగౌరవ యాత్రను అడ్డుకోవడానికి వైఎస్ఆర్‌సీపీ వారు ప్రయత్నించారన్నారు.
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చూసి వైఎస్ఆర్‌సీపీకి నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయన్నారు. ఆ పార్టీకి తెలంగాణాలో స్థానం లేదని, ఇక సీమాంధ్రలో కూడా రెండు జిల్లాలకే ఆ పార్టీ పరిమితమైందని అన్నారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లోను అధికారంలోకి వస్తామో లేదో అన్న అనుమానం కూడా వారిలో ఉందన్నారు. వారి నాయకుడు జగన్ బయటకు వస్తారో రారో అన్న దిగులు కూడా పట్టుకుందన్నారు. ఇప్పటికే ఐదు ఛార్జి షీట్లు వేసిన సీబీఐ తాజాగా మంగళవారం రెండు ఛార్జి షీట్లు వేసిందని, మరో మూడు ఛార్జి షీట్లు వేయనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు యాత్రలను అడ్డుకోవాలని విజయలక్ష్మి, జగన్, షర్మిలలు ఆదేశాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇలా దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వాస్తవంగా టీడీపీ కన్నెర్ర చేస్తే 2004లో వైఎస్ పాదయాత్ర, జగన్ ఓదార్పు యాత్ర, ఆ తరువాత షర్మిల యాత్ర, ఇప్పుడు షర్మిల యాత్రలు జరిగేవి కావని అన్నారు. షర్మిల ఇప్పుడు చేస్తున్న యాత్ర కాంగ్రెస్ విలీన యాత్ర అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ యాత్ర చేస్తున్నదన్నారు. చంద్రబాబును, టీడీపీని దెబ్బ తీయడానికి తెలంగాణాలో టీఆర్ఎస్‌తో పొత్తు, సీమాంధ్రంలో వైఎస్ఆర్ సీపీతో విలీనం నాటకమాడి కాంగ్రెస్ ఇప్పుడు విభజన తీసుకువచ్చిందన్నారు.
16 నెలలుగా జగన్ ఎందుకు జైలులో ఉన్నారని ప్రశ్నించారు. 43 వేల కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లుగా సీబీఐ ఆరోపించి, దానిని నిరూపించి ఛార్జిషీట్ల మీద ఛార్జిషీట్లు వేస్తున్నందుకే అతను జైలులో ఉన్న విషయం జనానికి బాగా తెలుసునన్నారు.

చంద్రబాబు యాత్రను అడ్డుకుంటే ఖబడ్దార్ : వర్ల

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చేపట్టిన మొదటి విడత ఆత్మగౌరవ యాత్ర బుధవారం రాత్రితో ముగియనుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గుంటూరు జిల్లాలో ప్రారంభిన ఆత్మగౌరవ యాత్ర కృష్ణా జిల్లా తిరువూరులో రాత్రి ముగుస్తుంది. రేపు యాత్ర ముగియగానే చంద్రబాబు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.
నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండో విడత ఆత్మగౌరవ యాత్ర షెడ్యూల్‌ను చంద్రబాబు ప్రకటిస్తారు. ఈ లోపల ఒకసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లివస్తారు. పశ్చిమగోదావ
రి జిల్లా ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఎన్ని రోజులు జరుగుతుంది. విధి విధానాలను త్వరలో ప్రకటిస్తారని తెలియవచ్చింది. ఆత్మగౌరవ యాత్రంలో చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది,

రేపు ముగియనున్న తొలి విడత బాబు ఆత్మగౌరవ యాత్ర

వైసీపీపై మండిపడ్డ నర్సిరెడ్డి

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క నెలలోనే మూడు నిర్ణయాలను ప్రకటించిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నర్సి రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయడం మాని బ్రదర్ అనిల్ కుమార్‌కు లేఖలు రాస్తే మంచిదన్నారు. సువార్త సభల్లో కురిసేన వర్షాన్ని కూడా ఆపానని చెప్పుకొంటున్న అనిల్ రాష్ట్ర విభజనను ఆపలేరా అని ఆయన ప్రశ్నించారు.

ఒక నెలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు నిర్ణయాలు ప్రకటించిందని నర్సిరెడ్డి అన్నారు. ఆర్టికల్ బి ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని ఒకసారి, రెండు ప్రాంతాలకు సమన్యాయం అని మరోసారి, సమైక్యాంధ్ర అంటూ ఇంకోసారి ఇలా మూడు రకాలుగా మాట్లాడారన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని శ్రీకృష్ణ కమిటీ గుర్తిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) గుర్తించిందని నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పైన అనవసర విమర్శలు మానుకోవాలని హితవు ఆయన పలికారు.

సువార్త సభల్లో కురిసేన వర్షాన్ని కూడా ఆపానని చెప్పుకొంటున్న అనిల్ రాష్ట్ర విభజనను ఆపలేరా

నలభై రెండు రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.మనం బిచ్చగాళ్లమా అని ఆయన ప్రశ్నించారు.ఖబడ్దార్ తెలుగుజాతి తో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నానని ఆయన అన్నారు.ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య ను రాజివ్ గాందీ అవమానించారని,తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్..టి.రామారావు పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని స్థాపించారని చంద్రబాబు అన్నారు.ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూల్చితే నెల రోజుల పాటు ఉద్యమం చేసి ఇందిరగాందీ తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.ఇప్పుడు తెలుగు జాతిని విచ్చిన్నం చేశారని కాంగ్రెస్ పై ఆయన ధ్వజమెత్తారు.ప్రధాని మన్మోహన్ సింగ్ కీలుబొమ్మ,తోలుబొమ్మ మాదిరిగా ఉన్నారని అన్నారు.కృష్ణా జిల్లాలో ఆయన బస్ యాత్ర చేస్తున్నారు.కాంగ్రెస్ హయాంలో ధరల పెరుగుదల,అవినీతి ప్రజలను అతలాకుతలం చేశారని అన్నారు.తాను పెట్టిన దీపం స్కీమును కాంగ్రెస్ దొంగలు ఆర్పేశారని ఆయన అన్నారు.

42రోజుల సమ్మెను పట్టించుకోరా!: చంద్రబాబు

తెలుగు వారి ఆత్మగౌరవానికి పత్రీక ఎన్టీఆర్ అని, వైఎస్ విగ్రహాలు చూస్తే లక్ష కోట్లు గుర్తుకువస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం ఉదయం కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ దోచుకున్న లక్ష కోట్లలో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలేదని మండిపడ్డారు. దోపిడీదారులు, దొంగనోట్లు ముద్రించేవారు, రౌడీలు వైసీపీలో ఉన్నారని ఆరోపించారు.
మొదట తెలంగాణ, ఇప్పుడు సమైక్యం, ఆ తర్వాత విలీనం ఇదే వైసీపీ విధానమని ఎద్దేవా చేశారు. బెయిల్, కేసు మాఫీకి అంగీకారం కుదిరిందన్నారు. పీఆర్పీ కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని అప్పుడే చెప్పానని, ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే అని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కొత్త సమస్యను సృష్టించిన ఘనత కాంగ్రెస్‌దే అని బాబు తెలిపారు.
తెలంగాణ ఇచ్చింది తామే అని అక్కడి నేతలు అంటున్నారు....టీడీపీ వల్లే ఇక్కడి నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంపై రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల వర్గాల ప్రజలకు ఒప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ : చంద్రబాబు

విజయవాడ, సెప్టెంబర్ 10 : తెలుగు వారి ఆత్మగౌరవానికి పత్రీక ఎన్టీఆర్ అని, వైఎస్ విగ్రహాలు చూస్తే లక్ష కోట్లు గుర్తుకువస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం ఉదయం కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ దోచుకున్న లక్ష కోట్లలో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయాలేదని మండిపడ్డారు. దోపిడీదారులు, దొంగనోట్లు ముద్రించేవారు, రౌడీలు వైసీపీలో ఉన్నారని ఆరోపించారు.

మొదట తెలంగాణ, ఇప్పుడు సమైక్యం, ఆ తర్వాత విలీనం ఇదే వైసీపీ విధానమని ఎద్దేవా చేశారు. బెయిల్, కేసు మాఫీకి అంగీకారం కుదిరిందన్నారు. పీఆర్పీ కూడా కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని అప్పుడే చెప్పానని, ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే అని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కొత్త సమస్యను సృష్టించిన ఘనత కాంగ్రెస్‌దే అని బాబు తెలిపారు.

తెలంగాణ ఇచ్చింది తామే అని అక్కడి నేతలు అంటున్నారు....టీడీపీ వల్లే ఇక్కడి నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంపై రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల వర్గాల ప్రజలకు ఒప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

తెలుగు వారి ఆత్మగౌరవానికి పత్రీక ఎన్టీఆర్