September 6, 2013

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో చలపతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సంభాషించారు. నా డు చదువుకొంటే ఉద్యోగం వస్తుందన్న భరోసా ఉండేది. నేడు రాష్ట్ర విభజన జ రిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించా రు. చంద్రబాబు, విద్యార్థుల మధ్య కొ నసాగిన సంభాషణ వారి మాటల్లోనే ఇస్తున్నాం.
లోకేష్: నల్లధనం తరలిపోతోంది. యువతరం చితికిపోతోంది. చదువుకొ న్న విద్యార్థులు వేరే దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. మీరొస్తే మళ్లీ మాకు మంచి రోజులు వస్తాయని న మ్ముతున్నాం. సీడబ్ల్యూసీలో తెలుగువాళ్లు లేకుండా ముసలివాళ్లు కూర్చుని రాష్ట్ర విభజన నిర్ణయం ఎలా తీసుకొంటారు?
చంద్రబాబు: చూడు లోకేష్. మన దే శంలోని సంపదనంతా కాంగ్రెస్ దొంగ లు దోచేశారు. వాళ్ల స్విస్ బ్యాంకు అకౌంట్లలో నుంచి డబ్బు దేశానికి రప్పి స్తే మనపై ఎలాంటి అప్పులు ఉండవు. రాజకీయ లబ్ధి కోసం సీడబ్ల్యూసీ నిర్ణ యం చేసి చిచ్చుపెట్టారు. తెలుగుజాతికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోను. మీకు న్యాయం జరిగేంత వరకు ధర్మ యుద్ధం చేస్తా.
స్రవంతి: హైటెక్ సిటీని హైదరాబాద్‌లోనే ఎందుకు అభివృద్ధి చేశారు. రేపు రాష్ట్ర విభజన జరిగితే మా భవిష్యత్తు ఏమిటి?
చంద్రబాబు: హైదరాబాద్ ఒకప్పు డు చిన్న నగరం. విదేశాల నుంచి ఎవ రు ఇక్కడికి రావాలన్నా ముందు ముం బై వెళ్లి అక్కడి నుంచి వచ్చేవారు. దాం తో తొలుత రాజధానిని అభివృద్ధి చే యాలని నేను ముందుకెళ్ళాను. హైటెక్ సిటీని నిర్మించి ఉపాధి కల్పించాం. వైజాగ్‌లో హెచ్ఎస్‌బీసీ ఏర్పాటు చే యించాం. రాజధాని అందరి కోసం నిర్మించింది. దాని ఆదాయం మొత్తం ర్రాష్టానికి చెందాలి.
ప్రియాంక: ఇదివరకు చదువుకొంటే ఉద్యోగం వస్తుందని ఎంతో ఆత్మవిశ్వాసం ఉండేది. నేడు మా
కు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి?
చంద్రబాబు: ఒక నిర్ణయం చేసే స మయంలో అన్ని ఆలోచన చేసి చేయా లి. కాని సీడబ్ల్యూసీ వాళ్లు అలా చేయలేదు. దేశాన్ని, ఏపీని కాపాడుకొనే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉన్నది. ఎన్నికల్లో గెలవగానే ఆరు నెలల వ్యవధిలో స మస్య పరిష్కరిస్తా.
కళాశాల ప్రిన్సిపాల్ రవికాంత్ మా ట్లాడుతూ తొలి సంతకం రుణమాఫీపై చేసినా రెండో సంతకం మాత్రం సాంకేతిక విద్యపై చేయాలని తాను విద్యార్థుల తరుపున కోరుతున్నానన్నారు.
 

ముసలి వాళ్లు కూర్చుని రాష్ట్రాన్ని విభజిస్తారా?

దిగ్విజయ్ సింగ్, జగన్ డీఎన్ఏ ఒక్కటే. అదే అవినీతి డీఎన్ఏనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. గురువారం రాత్రి బండారుపల్లిలో జరిగిన ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు ప్రసంగిస్తూ అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ తప్పుడు కేసులతో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతోంది. నేను తొమ్మిదేళ్లు ఇదే మాదిరి ఆలోచించి ఉంటే కాంగ్రెస్ నేతలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చే వాళ్లు కాదు. ఖబడ్దార్ జాగ్రత్త... టీడీపీ కార్యకర్తలందరిని కాపాడుకొనే సత్తా నాకుందని పార్టీ కేడర్‌కు భరోసా కల్పించారు. అధికారం ఉంది కదా అని సోనియా తెలుగుజాతితో ఆడుకొంటోంది. ఆమె ఆటలను ఎలా తిప్పికొట్టాలో, తెలుగువారిని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసని చంద్రబాబు అన్నారు.

దిగ్విజయ్, జగన్ డీఎన్ఏ ఒక్కటే: చంద్రబాబు


రాజ్యసభలో టిడిపి డిమాండ్‌
ఆంధ్రాకు వచ్చి
మా బాధలు చూడండి : రమేష్‌

విభజనను వ్యతిరేకిస్తాం : ఎస్‌.పి.


  పార్లమెంట్‌కు తెలంగాణా సెగ వదలటంలేదు. సీమాంధ్రకు చెందిన ఎం.పి.లు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సభలో గందరగోళం సృష్టి స్తూనే వున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలుగు దేశం పార్టీ సభ్యులు ప్రస్తుతం సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితిపై అధ్యయనం చేసి, ఈ అంశాన్ని పరిశీ లించేందుకు అన్ని పార్టీలతో కమిటీని ఏర్పాటు చేయాలని గురువారం రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. సభ జీరో అవర్‌లో టి.డి.పి. సభ్యులు సి.ఎం. రమేష్‌ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటిస్తే అక్కడి ప్రజల బాధలు తెలు స్తాయని, అందుకని సీమాంధ్రలో పర్యటించవల సిందిగా సభ్యులను కోరారు. సీమాంధ్రలో ఆందో ళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటంలేదని, రాష్ట్ర విభజనపై ఒక వైపు కమిటీ వేస్తామని చెప్పి మరో వైపు విభజన ప్రక్రియను వేగం చేస్తామని ప్రకటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

''ఆంధ్రప్రదేశ్‌ మొత్తం మండుతోంది...గడిచిన 35 రోజులుగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ ఆందో ళనలకు ప్రభుత్వం స్పందించటంలేదు. సమస్యను నిర్లక్ష్యం చేస్తోంది'' అని రమేష్‌ అన్నారు. స్వాతంత్య్ర పోరాటం తరహాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయని, కాని ప్రభుత్వం మాత్రం చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహారిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెపుతుండగా, ప్రభుత్వం ఇటీవల తెలంగాణా ఏర్పాటు క్రమం ఊపందుకుందని ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆందోళనను ఆయన పునరుద్ఘాటించారు. ఈ అంశంపై తక్షణం చర్య తీసుకోవాలని రమేష్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ సహచరులు వై.ఎస్‌. చౌదరితో కలిసి ఈ అంశంపై సమావే శాలు ప్రారంభమైన ఆగస్టు 5వ తేదీ నుండి సభలో రమేష్‌ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభలో ఆయన తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనను వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. ఈ అంశాన్ని పరిశీలిం చేందుకు అన్ని పార్టీలతో కమిటీని ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల సభ్యులు డిమాండ్‌ చేశారు.

విభజనపై పరిశీలనకు అఖిలపక్ష కమిటీవైకాపా యాత్రల స్క్రిప్ట్‌ ఏఐసీసీదే
ముఖ్యమంత్రి కిరణ్‌ అసమర్ధుడు

బొత్స ఉత్సవ విగ్రహం
స్విస్‌ బ్యాంకుల సొమ్ము రాబడితే దేశంలో అప్పులు మాయం


 
తెలుగు జాతి ఆత్మ గౌరవ పరి రక్షణకు కంకణం కట్టుకున్న తాను తెలుగుజాతిని కాపాడుకుంటానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలో తెలుగు జాతీ ఆత్మగౌరవ యాత్ర ఐదో రోజున తాడికొండ మండలం మోతడక, నిడుముక్కల, రావెల, పొన్నెకల్లు కంతేరువరకు సాగింది. ఈ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ దొంగల ఆస్తులు, స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న డబ్బును స్వాధీనం చేసుకుంటే భారతదేశం అప్పులన్నీ తీరిపోతాయని, అంత డబ్బు కాంగ్రెస్‌ నాయకుల వద్ద ఉందని డిమాండ్‌ చేశారు. అలాగే వైఎస్‌ పాలనలో తండ్రిని అడ్డంపెట్టుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నాడని అందుకే జైలులో ఉన్నాడని అతని అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో లక్ష కోట్ల దోపిడీకి కారకుడైన దివంగత మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి తన దోపిడీ సొమ్ములో వారానికి వంద కోట్ల రూపాయలు ఢిల్లిdకి ముడుపులు చెల్లించడంతో వైఎస్‌ అవినీతిపై సోనియాగాంధీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విద్యార్థి, యువతే దేశానికి ఆయువు పట్టని టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచామని ఉత్తమ చదువులు అందిస్తే ప్రపంచాన్ని శాసించగల రనే ఉద్దేశంతో అనేక ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే దేశంలోనే ఎవ్వరూ చేయలేని విధంగా ఐటీ రంగాన్ని హైదరాబాద్‌ను అభివృద్ధి పరిచి ప్రపంచ పటంలో స్థానం సంపాదించామ న్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పర్చేం దుకు తాను విజన్‌ 20-20 తయారు చేస్తే కాంగ్రెస్‌ పార్టీ దొంగలు దాన్ని 420గా మార్చా రని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌ నాయకులు కుట్రపన్నితే అందుకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి లోపాయి కారిగా సహకరిస్తున్నారని బాబు ఆరోపించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ యాత్రలకు స్క్రిప్ట్‌ ఏఐసీసీ ఆఫీస్‌ నుంచి అందుతున్నదన్నారు. అలాగే మొద్దాబ్బాయి రాహుల్‌గాంధీ ప్రధానిగా, దొంగబ్బాయి జగన్‌ ముఖ్యమంత్రి కావాలని రాజకీయాలు నడుస్తున్నాయని ఇదే జరిగితే తెలుగు జాతి పిల్లల భవిష్యత్తు ఏమోతుందో ఆలోచించాలని చంద్రబాబు ప్రజలకు కోరారు. అలాగే ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సోనియాగాంధీ చేతిలో తోలుబొమ్మని, కోల్‌గేట్‌ కుంభకోణంలో ఫైళ్లను కాపాడలేని పిఎం దేశాన్ని ఏమి రక్షిస్తాడని బాబు ప్రశ్నించారు.

విజన్‌ 2020ని 420గా మార్చారు


టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ పదేపదే చేసిన రెచ్చగొట్టుడు వ్యాఖ్యల వల్లే సీమాంధ్రలో ప్రస్తుత ఉద్యమం వచ్చిందని, ఆ పుణ్యం ఆయనదేనని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత, తెలంగాణ ప్రాంత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. గురువారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సభలో ఆయన మాట్లాడారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఒక్కటే టిఆర్ఎస్ లక్ష్యమని, తెలంగాణ కోసం మంచి చేసినా ఆ పార్టీకి పట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 'తమ పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ కోసం లేఖ ఇచ్చారు. ఆ లేఖకు టిఆర్ఎస్ ఇచ్చిన గౌరవం ఏమిటి? కనీసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఆ పార్టీకి నోరు రాలేదు. తెలంగాణ ఇస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకొన్న తర్వాత సోనియాను కలిసి ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం కూడా కెసిఆర్ చేయలేదు. తన కుటుంబ లాభం, స్వార్ధం తప్ప ఆయనకు మరేది పట్టదు' అని మోత్కుపల్లి ఆరోపించారు.

సీమాంధ్ర ఉద్యమం కెసిఆర్ పుణ్యమే!: మోత్కుపల్లి

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు."కిరణ్ చేతకాని దద్దమ్మ. ఫోజులు కొడుతుంటారు. ఢిల్లీకి వెళ్లి లీకులు చేశాడు. ఇంకో పక్కన తెలంగాణ ఇచ్చేస్తున్నామని వరంగల్ జిల్లా నేతలను వెంట తీసుకెళ్లి పార్టీలో చేర్పించారు. ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి ఈ నాటకం'అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలే మీ చెవిలో పువ్వులు పెట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆయన హెచ్చరించారు.

కిరణ్! ఎవరి చెవిలో పువ్వు పెడుతున్నావ్ : చంద్రబాబు

తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తే వారి అంతు చూసేవరకు ఊరుకోనని హెచ్చరించారు. ఢిల్లీలో మకాం వేసిన దుష్ట చతుష్టయం దేశాన్ని సర్వనాశనం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

'చిదంబరం నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ అదే గొప్పనుకుంటున్నారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ మొనగాడిలా, హీరోలా ఫోజులు కొడుతున్నాడు. దిగ్విజయ్, అహ్మద్‌పటేల్ ఎంపీలుగా గెలవలేరు. వీళ్లా తెలుగుజాతి తలరాతను రాసేద'ని మండిపడ్డారు.

36 రోజులుగా కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తమ పిల్లలు చదువులు ఏమైపోతాయి. ఉద్యోగాలు ఎలా వస్తాయి? రేపటి రోజున తాగడానికైనా నీళ్లుంటాయా? అన్న భయంతో ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం స్పందించకపోవడం దారుణమని , సమాధానం చెప్పకుండా ముందుకు పోతున్నారని ఆయన విమర్శించారు.

వీళ్లా తెలుగు జాతి తలరాత రాసేది! : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై చెప్పు విసిరిన ఘటనలో నలుగురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నలుగురు వైసీపీ కార్యకర్తలపై క్రిమినల్ కేసుపార్లమెంటులో ప్రజల గోడు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని, పార్లమెంటు అంటే రాతి గోడలేనన్న అబిప్రాయం కలుగుతోందని చిత్తూరు ఎమ్.పి డాక్టర్ ఎన్.శివప్రసాద్ వ్యాఖ్యానించారు. రాతిగోడల మాదిరే పార్లమెంటులో కూర్చున్న పెద్దలు కూడా రాతి మాదిరే వ్యవహరిస్తున్నారని, ప్రజల ఆందోళనలను పట్టించుకోలేదని అన్నారు. పార్లమెంటు కన్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పనిచేయదలిచామని శివప్రసాద్ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరగాంధీల కంటే ఇప్పుడు ఉన్నవారు గొప్పవారు కారని, వీరి మెడలు వంచేలా పనిచేస్తామని అన్నారు. కాగా మరో ఎమ్.పి నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ తాము చేయగలిగిందంతా తాము చేశామని , ఇక ప్రజలలో పనిచేస్తామని అన్నారు.వచ్చే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణ బిల్లు పెడితే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చని నరసరావుపేట ఎమ్.పి మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు.

పార్లమెంటు అంటే రాతిగోడలేనా : ఎన్.శివప్రసాద్

తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరాం ప్రాఫెసర్‌లా మాట్లాడాలని టీడీపీ పార్లమెంట్ సభ్యులు పేర్కొన్నారు. ఆయన ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఏకాభిప్రాయం ద్వారానే జరగాలని కొనకళ్ళ నారాయణ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి స్వార్థ రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని నిమ్మల కిష్టప్ప అన్నారు. సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీస్తోందని ఆయన అన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ సీమాం«ధలో ఉద్యమం ఉధృతంగా జరుగుతోందని, కేంద్రం పట్టించుకోవడంలేదని సుజనా చౌదరి విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

సీమాంధ్ర ఉద్యమంలో చెడును చూపిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో అలా చూపించలేదని మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టకముందే ఇలా ఉంటే, రేపు బిల్లు పెడితే ఎలా ఉంటుందో ప్రజలే ఊహించుకోవాలని మోదుగుల పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించారని సీఎం రమేష్ ఆరోపించారు. శనివారం ఎపీ ఎన్జీవోలు నిర్వహించనున్న సభకు ఆయన మద్దతు తెలిపారు.

కోదండరాం ప్రొఫెసర్‌లా మాట్లాడాలి : టీడీపీ


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని రావణాకాష్టం చేస్తున్నారని, కేవలం ఆయన కుటుంబ లబ్ది కోసమే కుట్రలు చేస్తున్నారని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు.ఆయనకు రెండువేల పద్నాలుగు వరకు తెలంగాణ రావడం ఇష్టం లేదని ఆయన అన్నారు. డిల్లీలో కూర్చుని ఆయన ఏమి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు వెంటనే రాష్ట్రం రావాలని కోరుతున్నారని, టిఆర్ఎస్ విలీనం వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చెప్పాలని అన్నారు. సత్వరమే ఆ ప్రక్రియ పూర్తి చేసి తెలంగాణ వచ్చేలా చేయాలని ఆయన కోరారు.

టిఆర్ఎస్ విలీనం వ్యవహారం ఎంతవరకు వచ్చిందో: మోత్కుపల్లి