September 2, 2013

ఆత్మగౌరవ యాత్రలో భాగంగా మండలంలోని ధూళిపాళ్ళకు విచ్చేసిన చంద్రబాబుతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రాకకోసం సాయంత్రం 6గంటల నుంచి ధూళిపాళ్ళ గ్రామస్తులు ప్రధాన రహదారిపై అధికసంఖ్యలో చేరి చంద్రబాబుపై పూలవర్షం కురిపించారు. ప్రజలనుద్దేశించి కొద్దిసేపు మాట్లాడాల్సిందిగా నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టారు. అనంతరం భాగ్యనగర్‌కాలనీ, వెన్నాదేవి, వావిలాలనగర్ వద్ద కూడా పార్టీశ్రేణులు, గ్రామస్తులు అధికసంఖ్యలో రోడ్డుపై చేరి చంద్రబాబు కాన్వాయికి అడ్డుపడి కొద్దిసేపు మాట్లాడాలని కోరారు. అనంతరం శాతవాహన స్పిన్నింగ్ మిల్లు కార్మికులు
వావిలాలనగర్ వద్ద చంద్రబాబును కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ 2014లో టిడిపి అధికారంలోకి వస్తుందని, మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానన్నారు. అనంతరం యాత్ర పాకాలపాడు మీదుగా రెంటపాళ్ళ చేరుకుంది. రెంటపాళ్ళలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టిఆర్ విగ్రహాలను చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. రాత్రి బస రెంటపాళ్ళలో జరిగింది. యాత్రలో మండల టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

చంద్రబాబుకు ఘనస్వాగతం

తెలుగుజాతిని కాపాడుకునేందుకే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తెలిపారు. తెలుగు వాడి ఆత్మగౌరవ యాత్ర సోమవారం రాత్రికి సత్తెనపల్లికి చేరింది. పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసేందుకే పుట్టిందన్నారు. ఎన్‌టి రామారావు పార్టీని ప్రారంభించి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండా చేశారన్నారు. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ టీడీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటికి మరలా ప్రజలు ఎన్నికలలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలని విమర్శించారు. టీఆర్ఎస్, వైసీపీలు సోనియాకు చెప్పుల్లా పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజనపై 34 రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోవటం లేదన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ ఒకటేనన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతి పెరిగి పోయిందన్నారు. పెట్రో లు, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. పేదరిక నిర్మూలన కోసం తెలుగుదేశం కృషి చేస్తుందన్నారు. ప్రజలు రోడ్డుమీదకు రావటానికి సోనియాగాంధీనే కారణమన్నారు. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్, వైసీపీలకు ప్రజలు బుద్ధిచెప్పి టీడీపీకి పట్టం కట్టారన్నారు. రాష్ట్ర విభజన వల్ల రాహుల్ ప్రధాని కాలేడన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నాడు చంచలగూడ జైలు కార్యాలయం కాగా, నేడు నిమ్స్ వైద్యశాల కార్యాలయంగా మారిందన్నారు. తాను 7రోజుల పాటు నిరాహారదీక్ష చేస్తే ఏమీ కాలేదని, 4రోజులకే జగన్‌కు అనారోగ్యమంటూ నిమ్స్‌లో చేర్పించి కాంగ్రెస్ డ్రామాలాడుతుందన్నారు. కాంగ్రెస్, వైసీపీలకు ప్రజలు తగినవిధంగా గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. ఎవరితో మాట్లాడకుండా రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వర
రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణ, నాయకులు యెల్లినేడి రామస్వామి, భీమినేని వందనాదేవి, పోతుగంటి రామకోటేశ్వరరావు, ఆర్ రామచంద్రరావు, పూదోట రాజు, పెద్దింటి వెంకటేశ్వర్లు, చౌటా శ్రీనివాసరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, గుజ్జర్లపూడి నాగేశ్వరరావు, మారెళ్ళ మల్లేశ్వరరావు, శ్రీశైలం మాదిగ, దర్శి రవి, బొర్రా వెంకటప్పారావు, సయ్యద్ పెదకరిముల్లా, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఆళ్ళ సాంబయ్య, పోపూరి కృష్ణారావు, మక్కపాటి రామచంద్రరావు, కోయ లక్ష్మయ్య, కొబ్బరి సుబ్బారావు, పాల్గొన్నారు. బాణసంచా పేల్చి చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు.
 

మండుటెండను లెక్కచేయకుండా హారతులతో స్వాగతం

 'నా దేహంలో చివరి రక్తబొట్టు ఉన్నంత కాలం మీకు అండగా ఉంటా' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర సందర్భంగా పల్నాటి ప్రజలకు హామీ ఇచ్చారు. తెలుగుజాతి ఆత్మగౌరవయాత్ర సోమవారం రాజుపాలెం మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన కొండమోడు, నెమలిపురి, శ్రీనివాసనగర్, ఉప్పలపాడు, బలిజేపల్లి, గణపవరం, రెడ్డిగూడెం గ్రామాల్లో యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి సంఘీభావం ప్రకటించేందుకు తాను వచ్చినట్లు వివరించారు. సీట్లు కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన సోనియాగాంధీ కుట్రను తిప్పికొట్టాలన్నారు.
రాహుల్‌గాంధీ పప్పుముద్ద అని, జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక ఉన్మాదిగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు, తెలుగుజాతిని కాపాడేందుకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. సీమాంధ్రలో 34 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. తెలుగుజాతితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదన్నారు. రాష్ట్రాన్ని తాను అభివృద్ధి చేస్తే, తర్వాత అధికారంలోకి వచ్చిన వారు దోచుకున్నారన్నారు. ఆత్మాభిమానం ఉంటే వారికి మద్దతు ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో 189 పైళ్ళను కాపాడలేని ప్రధానమంత్రి ఈ దేశాన్ని ఏమి రక్షిస్తాడని నిలదీశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను, సీమాంధ్రలో వైసీపీని సోనియాగాంధీ చెప్పులుగా వాడుకుంటుందన్నారు. మాట తప్పం.. మడమతిప్పం.. అని అన్నవంశం నేడు బెయిల్ కోసం సోనియాగాంధీ కాళ్లు పట్టుకుంటుందన్నారు. నెమలిపురి బస్టాండ్ సెంటర్లో మాజీ సర్పంచ్ గంగవరపు ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు కుమారుడు రామలక్ష్మణరావుకు పార్టీ అండదండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేసి, పంటను ధ్వంసం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని శ్రీనివాసనగర్‌వాసులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
తెదేపా జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ధూళ్ళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కోడెల శివప్రసాదరావు, జేఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, నాయకులు వర్ల రామయ్య, నిమ్మకాయల రాజనారాయణ, పూజల వెంకటకోటయ్య, కంకణంపాటి శ్రీనివాసరావు, కొండ్రకుంట రంగారావు, గంగవరపు రామలక్ష్మణరావు, నల్లబోతుల వాసు, శనగపూల నరసింహారావు, చావా శ్యామేల్, జీ వెంకట్రావు,నాగౌతు శౌరయ్య, యెలినేడి రామస్వామి పాల్గొన్నారు.

చివరి రక్తపు బొట్టు వరకు అండగా ఉంటా..
  తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర లో సోమవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రెండోరోజునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పలుచోట్ల సభల్లో ఆయన కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో, సీమాంధ్రలో వైసీపీతో పొత్తుపెట్టుకొని గెలవాలని సోనియాగాంధీ భావిస్తున్నారని.. ఆ రెండు పార్టీలనూ ఆమె రెండు చెప్పులుగా వాడుకునేందు కు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. "ఇదెంతో దుర్మార్గపు ఆలోచన. ఇటువం టి కాంగ్రెస్ దొంగలను ఉరితీయాలి. ర్రాష్టాన్ని కాపాడుకోవాలి'' అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లు కూడా రావని భావించే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని, తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని నిప్పులు చెరిగారు. ప్రధాని మన్మోహన్ తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. "ఆడపిల్లలు బయటకు వెళితే తిరిగిరాలేని దుస్థితి ఏర్పడింది. అలాంటి కేసులో మూడేళ్లు జైలు శిక్ష విధించారు. ఏడాదిన్నరగా జగన్ జైల్లో ఉన్నాడు. అయినా ఏమీ మారలేదు. అలాంటి దుర్మార్గులకు మరణశిక్ష వేయాలి... అప్పుడే మిగతావారు భయంతో తప్పు చేయకుండా ఉంటారు'' అని "ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేవు.. అవినీతిని అరికట్టలేవు.. ధరలను తగ్గించలేవు.. ఫైళ్లను కాపాడుకోలేవు.. నీకెందుకయ్యా ప్రధాని పదవి.. సోనియాకు రబ్బర్ స్టాంపుగా వ్యవహరిస్తూ ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేస్తూ వ్యక్తిత్వం లేకుండా వ్యవహరిస్తున్నావ్'' అంటూ మన్మోహన్‌పై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో, కేంద్రంలోనూ పాలించే అవకాశాన్ని ప్రజలు కాంగ్రెస్‌కు కల్పించినా ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా సోనియాగాంధీకి పెంపుడు కుక్క ల్లా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ముద్దపప్పు రాహుల్‌ను ప్రధాని చేసే తపనతోనే తెలుగుజాతి మధ్య సోనియా చిచ్చు పెట్టిందని, ఆ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కుట్ర ఇప్పటిదికాదని, 1999లోనే ప్రారంభమైందని ధ్వజమెత్తారు. దీన్ని తమ నాయకుడు వైఎస్ఆర్ ప్రారంభించారని సోనియా గాంధీ ముగించారని దిగ్విజయ్ సింగే వ్యాఖ్యానించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఉద్యమాలు జరిగాయా, ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమయ్యాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మొదటి ఐదేళ్లు దోపిడీ, చివరి ఐదేళ్లు అనిశ్చిత పరిస్థితితో ర్రాష్టాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "మీకు చేత కాక పోతే నాకు వదిలి పెట్టి రాజీనామాలు చేసి వెళ్లిపోండి. ఏడాదిలోపు ర్రాష్టాన్ని బాగు చేస్తా''నంటూ సవాల్ విసిరారు.
"మాట తప్పను.. మడమ తిప్పను'' అనే నినాదంతో జనం మధ్యకు వచ్చిన జగన్ నేడు బెయిల్ కోసం మాట తప్పి, మడమ తిప్పి సోనియా గాంధీ కాళ్లు పట్టుకొనే స్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని, సోనియా ఆదేశాలను జైలులో ఉన్న జగన్ తూచా తప్ప కుండా పాటిస్తున్నారంటూ ఆరోపించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి నాలుగు రోజులు ముందుగానే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. "సీడబ్ల్యూసీలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నదీ కలగన్నారా?'' అంటూ ఎద్దేవా చేశారు. బెయిల్ కోసం, కేసుల మాఫీ కోసం తెలుగు జాతి పొట్ట కొట్టేందుకు ప్రయత్నించటం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు యాత్ర గుంటూరు జిల్లా నెమలిపురి దాటి నకరికల్లు వెళుతున్నప్పుడు వైసీపీ నేతలు కొందరు కవ్వింపులకు పాల్పడ్డారు. ఆయన రాకను గమనించి వైఎస్ విగ్రహానికి పాలుపోసి నినాదాలు చేశారు. మైక్ చేతబట్టి, తెలంగాణపై వైఖరి చెప్పాలని నిలదీశారు. పోలీసులకు ఈ విష యం ముందుగానే తెలిసినా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. కేవలం వారికి అడ్డుగా మూడు జీపులుపెట్టి చంద్రబాబు కాన్వాయ్‌కి ఆటంకం కలగకుండా చూశారు.
  చంద్రబాబు యాత్రలో ఊరువాడా రోడ్లపైకి వచ్చి జేజేలు పలుకుతున్నారు. మహిళలు హారతులిచ్చి ఆశీర్వదిస్తున్నారు. అడుగడుగునా వాహనానికి అడ్డుపడుతూ ప్రసంగించాలని పట్టుబడుతున్నారు. మండుటెండలోనూ గంటలతరబడి నిరీక్షిస్తున్నారు. ఎన్టీఆర్‌ను ఇందిరాగాంధీ బర్తరఫ్ చేస్తే ప్రజలు ఏడాది తిరగకుండా ఎలా అధికారంలోకి తెచ్చి బుద్ధి చెప్పారో సోనియాకూ అదేగతి పట్టిస్తారన్న హెచ్చరికలకు విశేష స్పందన వస్తోంది

అవి సోనియాకు 2 చెప్పులు రబ్బర్ స్టాంపుగా వ్యవహరిస్తున్న ప్రధాని

చంద్రబాబు రాకతో దాచేపల్లి మండలం పసుపు వర్ణంగా మారింది..పొందుగుల నుంచి దాచే పల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా పసుపు రంగు జెండాల రెపరెపలతో... బ్యానర్లతో నిండిపోయింది. వ్యవ సాయ పనులు ముమ్మరంగా వున్నా చంద్రబాబును చూసేం దుకు..ఆయన ప్రసంగం ఆలకించేందుకు తెలుగు తమ్ముళ్లు, మహిళలు అధిక సంఖ్యలో ఆదివారం తరలిరావడంతో పొందు గల,దాచేపల్లిలో జరిగిన బాబు బహిరంగ సభలు కిక్కిరిసాయి. సమె ౖక్యాంధ్ర వాదులు సభను అడ్డగిస్తారని ముందుగా ప్రచారం జరిగినా ఎలాంటి అడ్డంకులు లేకపోవడం పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపింది. దాచేపల్లి,మాచవరం,పిడుగురాళ్ల,కారంపూడి, నకరికల్లు,రాజుపాలెం, నర్స రావుపేట,చిలకలూరిపేట,వినుకొండ,మాచర్ల, గురజాల, రెంట చింత ల,దుర్గి,వెల్తుర్థి తదితర మండ లాల నుంచి కార్యకర్తలు, అభిమా నులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఎండను లెక్క చెయ్యకుండా బాబు కోసం ఎదురు చూపులు
మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు కురిపిస్తున్నా పట్టు వదలని విక్రమార్కుడి మాదిరి కార్యకర్తలు బాబు రాక కోసం ఎదరుచూశారు. తమ ప్రియతమ నేత ప్రసంగం ఆలకించేందుకు పోటీ పడ్డారు. తొలుత మధ్యాహ్నం 11గంటలకు సభ ప్రారంభ మౌతుందని ఆశించినా, రెండు గంటలకు బాబు ప్రసంగించారు.
అధిక సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాబు ప్
రారంభించిన ఆత్మగౌరవం యాత్ర నియోజక వర్గంలో సూపర్ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేశారు. పొందుగల నుంచి దాచేపల్లి వరకు అభిమానులు తాకిడితో రోడ్లు నిండిపోయాయి.వేల సంఖ్యలో సభకు భారీగా తరలి రావడంతో నాయకులు ఉద్రేకంగా తమ ప్రసంగాలు చేశారు. .ఆయా కార్యక్రమాలలో పార్టీ నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు, తంగెళ్ల శ్రీనివాసరావు,పగడాల భాస్కరరావు, అక్కినపల్లి బాలయ్య, వేముల తిరుమల కుమార్, మామిడి చంద్ర శేఖరరావు,తవ్వా శ్రీనివాస రావు, కుర్రి శంకరరెడ్డి,పురంశెట్టి అంకులు,నెల్లూరి వెంకటేశ్వర్లు, షేక్ సైదా,జంగిలి వెంకటేశ్వర్లు, సాదినేని కోట్వేశర రావు,నర్రా పుల్లయ్య, కోగంటి శివన్నా రాయణ,ఆవుల సైదులు, కోటేశ్వర రావు,వెలిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆరంభం అదిరింది. యాత్రను అడ్డుకోవాలని వైసీపీ పిలుపును పల్నాడు ప్రజానీకం తోసి పుచ్చింది. గురజాల నియోజకవర్గం నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా వేల సంఖ్యలో ప్రజలు ఎదురెళ్లి చంద్రబాబుకు నీరాజనాలు పట్టారు. మండుటెండను లెక్క చేయకుండా ఘనస్వాగతం పలికారు. ప్రజలు ఇచ్చిన ఉత్సాహం చూసి చంద్రబాబు తన ప్రసంగాల్లో వైసీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు ఆదివారం మధ్యా హ్నం రెండు గంటలకు పొందుగల వారధి మీదగా పల్నాడులో అడుగు పెట్టారు. అప్పటికే ఆయన రాక కోసం అక్కడ వేచి చూస్తున్న టీడీపీ జిల్లా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రు లు ఆలపాటి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శనక్కాయల అరుణ, మెట్ల సత్య నారాయణ, లాల్ వజీర్ ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ పొందుగల గ్రామానికి చేరుకొని చంద్రబాబు ఉద్రేకంగా ప్రసంగించారు. దుష్టనాగమ్మ పోలికగా సోనియమ్మను మాటల బాకులతో చంద్రబాబు బాలచంద్రుడిలా దునుమాడారు.తెలుగుజాతి జోలికి వస్తే పిల్ల, తల్లి కాంగ్రెస్‌లను శంకరగిరిమాన్యాలు పట్టిస్తానంటూ ప్రతిజ్ఞబూని బ్రహ్మనాయుడుని మరిపించారు.
1984లో అన్న ఎన్టీఆర్‌తో పెట్టుకొని ఇందిరాగాంధీ అడ్రసు లేకుండా పోయారని, ఇప్పుడు తెలుగుదేశాన్ని సాధించేందుకు కుట్రలు చేస్తు న్న సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని చంద్రబాబు అన్నప్పుడు తెలుగు తమ్ముళ్లు కేరింతలు కొట్టారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తాను ఎంతో కష్టపడితే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అవినీతిలో రికార్డు సృష్టించారన్న బాబు మాటలకు ప్రజల నుండి విపరీతమైన స్పందన లభించింది. ఒక పక్క విభజనవాదం, మరో పక్క సమైక్య నినాదం వినపడుతున్న వేళ చంద్రబాబు ప్రసం గం వివాదాలకు దూరంగా సాగింది. కాంగ్రెస్ పెద్దలు ఏది చేయాలనుకున్నా ఇరుప్రాంతాలకు చెందిన ఉద్యమకారులను (ప్రస్తుతంఉద్యమిస్తున్న ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాల)కూర్చోపెట్టి మాట్లాడి సమస్యలు పరిష్కారించాలని బాబు డిమాండ్ చేయటంతో యువత ఉత్సాహంగా చప్పట్లు చరిచారు.ఉద్యోగం వస్తుందన్న ఆశతో చదువుకుని హైదరాబాదు వెళ్లిన యువతీయువకులను ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆందోళనలో పడవేస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ, టీఆర్ ఎస్ కుట్ర దాగి ఉందని సభికుల కు వివరంగా తెలియజెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అ త్యధిక స్థానాలను గెలుచుకున్న తర్వా త తమ అడ్రసు గల్లంతువుందన్న ఆందోళనతోనే తెలుగుజాతి మధ్య ఇరుపార్టీలు కలిసి చిచ్చుపెట్టాయని అన్నారు.ఈ కుట్రలో ఇరుపార్టీలకు భాగస్వామ్యం లేకపోతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవటానికి కొద్దిరోజుల ముందే సమైక్య నినాదంతో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు.జగన్ పార్టీకి బెయిల్, కేసులు మాఫీ తప్ప ప్రజాప్రయోజనం పట్టదని బాబు అంటున్నప్పుడు అన్నివర్గాల నుండి విశేష స్పందన లభించింది. పొందుగల సభ తర్వాత దాచేపల్లి బయలుదేరిన బాబును మార్గమధ్యలో రోడ్లపైకి పెద్దసంఖ్యలో వచ్చిన మహిళలు, యువకులు నిలువరించి హారతులిచ్చారు. జనాభిమానానికి ముగ్ధుడైన చంద్రబాబు సెక్యూరిటీ ఆంక్షలను ప్రక్కన పెట్టి బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.దాచేపల్లిలో ప్రసంగాన్ని ప్రారంభించిన బాబు ఇది దాచేపల్లి కాదు తెలుగువారి అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దోచేపల్లి అంటూ మొదలుపెట్టడంతో ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.అక్కడి సభలో కూడా తల్లి, పిల్లకాంగ్రెస్‌లపై చంద్రబాబు మాటల బాణాలను సంధించారు.
మారిన చంద్రబాబు ప్రసంగశైలి !
ఆత్మగౌరవయాత్రలో చంద్రబాబు ప్రసంగ శైలిలో పూర్తిమార్పు కన్పించింది.గతంలో చెప్పదలుచుకున్న విషయా న్ని స్పష్టంగా చెబుతూ ముందుకు వెళ్లే బాబు ఇప్పుడు హావభావాలు ప్రదర్శి స్తూ, ప్రజాస్పందనను గమనిస్తూ మా ట్లాడటం కన్పించింది.ఏం తమ్ము ళ్లూ నిజమేనా అంటూ ఆయన పదే పదే ప్ర జలను ప్రశ్నించి స్పందన చవిచూశారు. మాటల్లో కూడా భావోద్వేగాన్ని కల్గించే ఘాటు కన్పించింది.ముఖ్యంగా నాడు ఎన్టీఆర్‌తో పెట్టుకొని ఇందిరాగాంధీ అభాసుపాలైనట్లే .. నేడు సోనియాగాంధీ తెలుగుదేశంతో పెట్టుకొని శంకరగిరిమాన్యాలు పడతారంటూ ఆ యన అన్నమాటలు ఎక్కువగా ఆకర్షించాయి. సోనియాకు డబ్బు పిచ్చి.. దే శంలో ఉన్న డబ్బంతా ఆమె కు కావాలనప్పుడు, వైఎస్ రాష్ట్రంలో అవినీతికి పాల్పడి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టారం టూ ప్రసంగం వాడీవేడిని పెం చారు. మొద్దబ్బాయి కోసం రాష్ట్రాన్ని ఏదో చే యాలని చూస్తున్నారంటూ అన్న మా టలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.మాట్లాడేటప్పుడు అన్నివైపులా తిరిగి అందర్ని గమని స్తూ, అందర్ని ఉత్తేజపరుస్తూ చంద్రబాబు మాట్లాడటం ప్రజలను కట్టిపడేసింది.
మంత్ర ముగ్దుడైన బాబు
అసలు ఆత్మగౌరవయాత్రకు ఇది తగిన సమయంకాదని తెదేపా సీనియర్ నేతలు సైతం హెచ్చరించిన సందర్భంలో పొందుగలలో ప్రారంభమైన యాత్ర చంద్రబాబును మంత్రముగ్దుడ్ని చేసింది.వాళ్లు వీళ్లూ వచ్చి యాత్రకు ఆటంకం కల్గిస్తారని ప్రచారం ముమ్మరంగా జరిగిన పరిస్థితుల్లో ప్రజలు బాబు కోసం పరుగులు తీయ టం తెదేపా అధినేతను ఆశ్చర్యానికి గురిచేసింది.గతంలో పలుమార్లు చంద్రబాబు పల్నాడుకు వచ్చినప్పటికీ రాని స్పందన ఆత్మగౌరవయాత్రలో కన్పించింది.పొందుగల బ్రిడ్జి, గ్రామ పరిసర ప్రాంతాలు అశేషజనవాహినితో నిండిపోవటంతో తెదేపా శ్రేణులు ఆ నందంలో మునిగిపోయాయి.ముఖ్యం గా మహిళలు, యువకులు చంద్రబాబు ఆత్మగౌరవయాత్రకు ఎక్కువగా తరలిరావటం కన్పించింది.ఇటు దారిపొడవునా అదేస్థాయిలో జనం కన్పించటం నాయకుల్లో నూతనోత్సాహానికి కారణమైంది.దాచేపల్లి నాగులేరు సాక్షిగా జరిగిన సభకు ఇసుకేస్తేరాలనంత జనం రావటం చూసి తెదేపా అధినేత కాంగ్రెస్, వై ఎస్ ఆర్ సీపీ అవినీతి అక్రమాలపై మరింత వాడివేడి మాటలతో దాడిచేశారు.ఆత్మగౌరవయాత్ర అనుకున్న అతితక్కువ సమయంలో పల్నాడులో ముఖ్యంగా జగన్ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ స్థా యిలో ఉన్న ఈ ప్రాంతంలో బాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం నూతన రాజకీయ విశ్లేషణలకు తెరతీసింది.
యరపతినేనిదే హవా
ప్రతికూల పరిస్థితుల్లో సైతం పల్నాడులో తెదేపాకు వెన్నుదన్నుగా నిలిచిన
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆత్మగౌరవయాత్రలో ఆద్యంతం తన హవాను చూపించారు.ఉద్యమ వేళ ఆత్మగౌరవయాత్రను తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయమని, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వకుండా తాను చూసుకుంటానని అధినేతకు చెప్పి ఒప్పించి కార్యక్రమాన్ని పెట్టించిన ఆయన ప్రారంభాన్ని విజయవంతంగా నిర్వహించారు.యాత్ర ప్రారంభానికి ముం దు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడిన యరపతినేని పల్నాడులో తెలుగుదేశం శ్రేణులను, కార్యక్రమాలను అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేవని స్పష్టం చేశారు.అంచనాలకు మించి జనాన్ని స మీకరించటంలోనూ యరపతినేని సఫలీకృతులయ్యారు.

బాబుకు పల్నాడు..నీరా'జనం'

తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్‌పై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. గుంటూరు జిల్లాలో తెలుగుజాతి 'ఆత్మగౌరవ యాత్ర'లోఉన్న ఆయన సోమవారం మాట్లాడుతూ ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ భారత్‌లో తిరుగుతుంటే, భారత్ దేశంలో పుట్టిన తెలుగువాడైన శివప్రసాద్‌ను ఢిల్లీలో తిరగనివ్వరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎరిచ్చారు మీకీ అధికారం అంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మీ అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు. సమస్యను పరిష్కరించడం చేతకాకపోతే గద్దె దిగాలని, ఏడాది సమయం టీడీపీకి ఇచ్చి చూడండని, రాష్ట్రం దిశ మార్చి చూపిస్తామని చంద్రబాబు సవాల్ చేశారు.

సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : చంద్రబాబు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగాలను ప్రశ్నిస్తున్న లగడపాటి, అనంత వెంకటరామిరెడ్డి, హరీష్ రావు, పొన్నం,కడియం తదితరులకు ఎన్.టి.ఆర్.ట్రస్టులో ఉచిత చికిత్సలు చేయిస్తామని టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనను, ఆ సమస్యల పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తానని చంద్రబాబు చెబుతున్నారని,అది అర్ధం చేసుకోకపోతే కంటి ఆపరేషన్లు, చెవి ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు.సీమాంధ్రులను రెచ్చగొట్టే విధంగా కెసిఆర్ మాట్లాడినందువల్లే ఈ పరిస్థితులు వచ్చాయని ఆయన అన్నారు.సీమాంధ్రుల సమస్యలపై వివరణ ఇవ్వవలసిన బాధ్యత కెసిఆర్ పై లేదా అని ఆయన ప్రశ్నించారు.

బాబు మాటలు అర్ధం కాకపోతే ..రండి మావద్దకు:రేవంత్

సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ సభలో నోరుపారేసుకున్నారు. టీడీపీ ఎంపీలు ఇందిరాగాంధీ మాస్క్ పెట్టుకుంటే చంపేస్తానని, ఢిల్లీలో లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీ సందీప్ దీక్షిత్‌కు టి.కాంగ్రెస్ ఎంపీలు వత్తాసు పలికారు. దీనిపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సందీప్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఎంపీ సందీప్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

టీడీపీ ఎంపీలపై నోరుపారేసుకున్న ఎంపీ సందీప్

రాజ్యసభ నుంచి సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. సోమవారం ఉదయం సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సభలో సమైక్య నినాదాలు చేశారు. సభలో గందరగోళం సృష్టించారు. దీంతో టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌లను చైర్మన్ హమీద్ అన్సారీ సభ నుంచి సస్పెండ్ చేశారు.

రాజ్యసభ నుంచి సీమాంధ్ర టీడీపీ ఎంపీల సస్పెన్షన్

ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో తన వెనుక ఎవరో ఉన్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని టీడీపీ నేత హరికృష్ణ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో వైసీపీలో చేరుతామన్నవారు అధినేతకు తనపై విమర్శలు చేశారని ఆయన అన్నారు.

గడ్డితిని మాట్లాడాల్సిన అవసరం లేదని, తనది నీతివంతమైన రాజకీయమన్నారు. తన తండ్రి ఆశయం కోసం పోరాడుతానని హరికృష్ణ స్పష్టం చేశారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే రాష్ట్ర విభజన అని, సోనియా స్వార్థానికి రాష్ట్రం బలి అవుతోందని ఆయన ఆరోపించారు. తెలుగువారి కోసం పార్లమెంటులో పోరాడుతున్నందుకే బాలకృష్ణ కుమార్తె వివాహానికి హాజరుకాలేదని వివరించారు.

నా వెనుక ఎవరో ఉన్నారన్నది అవాస్తవం : హరికృష్ణ

రాజ్యసభలో, లోక్‌సభలో టీడీపీ ఎంపీల పోరాటం బాగుందని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు తెలిపారు. రాజ్యసభలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు ఎందుకు ఆందోళన చేయడం లేదని, సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా కొండమోడులో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నవారంతా చంచల్‌గూడ జైలులో కూర్చున్నారని ఆయన తెలిపారు. రాహుల్‌గాంధీ ఓ ముద్దపప్పు అని, ఆయన్ను ప్రధాని చేసేందుకే ఈ కుట్ర అని బాబు ఆరోపించారు.

టీడీపీ ఎంపీల పోరాటం భేష్‌ : చంద్రబాబు

పార్లమెంటులో నిరసన తెలిపే హక్కు అందరికి ఉందని, కాని టిడిపి ఎమ్.పి ఎన్.శివప్రసాద్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, ఎమ్.పి సందీప్ దీక్షిత్ గూండా గిరి చేశారని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు ఆరోపించారు. సభ నుంచి సస్పెండైన శివప్రసాద్ పై కాంగ్రెస్ ఎమ్.పిలు కొట్టడానికి వచ్చారని, తెలుగుజాతి గౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తాము కూడా తెలంగాణ కోసం మాట్లాడామని, కాని అప్పుడు ఇలా జరగలేదని, ఇప్పుడు ఎస్.సి.కమ్యూనిటి కి చెందిన మాజీ మంత్రి శివప్రసాద్ ను సందీప్ దీక్షిత్ అవమానించారని,దానిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.ఈ పరిణామంపై ఖండిస్తున్నానని అన్నారు.

శివప్రసాద్ పై సందీప్ దీక్షిత్ గూండాగిరి : నామా

ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి చిరంజీవి పై విరుచుపడ్డారు. సినిమా డైలాగులు చెప్పిన చిరంజీవి ఏమైపోయాడని ఆయన తన రెండో రోజు ఆత్మగౌరవయాత్ర సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు టిఆర్ఎస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ల పరిస్థితి కూడా అంతేనని ఆయన అన్నారు.తెలుగు జాతిపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆయన ద్వజమెత్తారు. కాగా రాహుల్ గాందీ ముద్దపప్పు అని కూడా ధ్వజమెత్తారు. సోనియాగాంధీ అవగాహన లేకుండా వ్యవహరిస్తూ దేశానికి నష్టం చేస్తున్నారని ఆయన అన్నారు.

చిరంజీవి ఎక్కడ-రాహుల్ ముద్దపప్పు

కాంగ్రెస్‌, వైకాపాలను భూస్థాపితం చేసే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర రెండో రోజు సందర్భంగా సత్తెనపల్లిలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లో కలిసిపోయిందన్నారు. తామ యూ టర్న్‌ తీసుకున్నామంటున్నారని, తనది ప్రజా టర్నే తప్పు వేరే టర్న్‌ కాదని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.

తెలుగుజాతి కోసం ఎంతవరకైనా పోరాటం : బాబు


దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువారికి అవమానం జరిగిందని, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్‌పైన కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ దౌర్జన్యం చేశారని, ఢిల్లీలో ఎలా తిరుగుతావో చూస్తానని బెదిరించారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివప్రసాద్ ఇందిరాగాంధీ మాస్క్ పెట్టుకుంటే చంపేస్తానని సందీప్ దీక్షిత్ బెదిరిస్తున్నారని, ఆయనకు టీ కాంగ్రెస్ ఎంపీలు మద్దుతు పలుకుతున్నారని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్‌కు నామా పిర్యాదు చేశారు.

పార్లమెంటులో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, తెలుగువారిపై దాడి చేయడానికి మీరెవరని సందీప్ దీక్షిత్‌పై నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభ్యులు తమ తమ అభిప్రాయాలకనుగుణంగా నిరసన వ్యక్తం చేసుకోవచ్చునని అన్నారు. అందుకే ఇందిరా గాంధీ మాస్కుతో తమ ఎంపీలు వచ్చారన్నారు. కాంగ్రెస్ నేతల గూండా గిరి చెల్లదని అన్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల తీరు రౌడీల్లా ఉందని నామా విమర్శించారు. సందీప్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఉన్నారన్నారు.

ఢిల్లీలో తెలుగువారికి అవమానం : ఎంపీ నామా


తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు యాత్రను సమర్ధించారు.చంద్రబాబు సీమాంధ్ర ప్రజలను ఓదార్చేందుకే ఆత్మగౌరవయాత్రను చేస్తున్నారని అన్నారు.అంతే తప్ప తెలంగాణను అడ్డుకునేందుకు కాదని దయాకరరావు వ్యాఖ్యానించారు.తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబు యాత్రపై ఎలా స్పందిస్తారా అని అంతా చూస్తున్న తరుణంలో ఆ నేతలు సానుకూలంగా స్పందించడం విశేషం.

చంద్రబాబు యాత్రకు ఎర్రబెల్లి సమర్ధన