August 26, 2013

చంచల్ గూడ జైలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిందని టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు.తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ఈ డ్రామా ఆడుతున్నారని అన్నారు. జైలు అధికారులు ఆయనను ఎందుకు అనుమతించారని రామయ్య ప్రశ్నించారు.మిగిలిన రిమాండ్ ఖైదీలకు కూడా ఇలాంటి అవకాశం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

అవినీతి కప్పిపుచ్చుకునేందుకే జగన్ దీక్ష : వర్ల

సీమాంధ్రకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరవధిక నీరాహార దీక్షకు దిగిన టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మల కిష్టప్పల దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఢిల్లీలో ఎండ ఎక్కువ ఉండడంతో ఎంపీలు నిరసించిపోయారని, ఇంకా ఎక్కువ సేపు ఉంటే వారు సొమ్మసిల్లిపడిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా నిమ్మల కిష్టప్ప మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు తమ దీక్ష కొనసాగుతుందని, విరమించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు కూడా వదులుకోడానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు చేపట్ట దలచిన నిరవధిక నిరాహార దీక్షకు స్పీకర్ మీరాకుమార్ అనుమతి నిరాకరించారు. కాగా ఎంపీలు తమ పట్టువీడలేదు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు ఎంపీలు సిద్ధమయ్యారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

ఢిల్లీలో టీడీపీ ఎంపీల దీక్ష భగ్నానికి యత్నం

సీమాంద్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ టిడిపి ఎమ్.పిలు సుజనా చౌదరి, సి.ఎమ్.రమేష్ లు రాజ్యసభలో ఆందోళనకు దిగడం తో వారిని సభ నుంచి డిప్యూటి ఛైర్మన్ కురియన్ సస్పెండ్ చేశారు. లోక్ సభలో టిడిపి ఎమ్.పిలు సస్పెండ్ కావడంతో వీరిద్దరూ కూడా రాజ్యసభలో సస్పెండ్ అయ్యారు. వీరు కూడా దీక్షలో పాల్గొనే అవకాశం ఉంది.

టిడిపి రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న తెలుగుదేశం ఎమ్.పిలను కేంద్ర మంత్రి చిరంజీవి,కాంగ్రెస్ ఎమ్.పిలు కెవిపి రామచంద్రరావు,లగడపాటి రాజగోపాల్,అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు పరామర్శించారు సీమాంధ్రకు న్యాయం చేయాలని అంటూ వారు దీక్ష చేస్తున్నారు.కొనకళ్ల నారాయణ,మోదుగుల వేణుగోపాలరెడ్డి, నిమ్మల కిష్టప్పలు మండుటెండలో దీక్ష చేశారు.అయితే వారు కొంచెం వయసు మీరినవారు కనుక ఆరోగ్య రీత్యా ఇబ్బంది వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఎందుకైనా మంచిదని అంబులెన్స్ కూడా సిద్దం చేశారు.

టిడిపి ఎమ్.పిలకు పరామర్శ

అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రగిలి పరిస్ధితులు సున్నితంగా మారిన తరుణంలో కొన్ని పార్టీలు ప్రజలను మరింత రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ కాంగ్రెస్, టిఆర్ఎస్, వైసీపీ పార్టీలు ఈ వికృత క్రీడలో భాగస్వాములు కావడం దురదృష్టకరమని, వాటి వ్యవహారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. 'రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుత నిరసన హక్కు కల్పించింది. కాని గత కొన్ని రోజులుగా సచివాలయం, విద్యుత్ సౌధ, జల సౌధ, ఇతర ప్రధాన కార్యాలయాల్లో జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రెచ్చగొట్టే వికృత క్రీడలకు ఇదేనా సమయం?: చంద్రబాబు

సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర టీడీపీ ఎంపీలు చేపట్ట దలచిన నిరవధిక నిరాహార దీక్షకు స్పీకర్ మీరాకుమార్ అనుమతి నిరాకరించారు. కాగా ఎంపీలు తమ పట్టువీడలేదు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టేందుకు ఎంపీలు సన్నద్దమవుతున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

సీమాంధ్ర టీడీపీ ఎంపీల దీక్షకు అనుమతి నిరాకరణ