August 8, 2013

తమ పార్టీ తెలంగాణకు అను కూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం కోసం వైఖరి మార్చుకోలేమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ''సచివాలయ సీమాంధ్రుల ఉద్యోగుల సంఘం'' ప్రతినిధులు బుధవారం చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. తమ పోరాటానికి మద్దతి వ్వాలని కోరారు. వారి కోరికను ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ, ప్రస్తుత దశలో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని వెనుకడుగు వేయలేమన్నారు. కనీసం తమ హక్కుల కోసం అయినా పోరాడాలని కోర గా అందుకు ఆయన సమ్మతించినట్లు ఉద్యోగ సంఘ ప్రతినిధి మురళీకృష్ణ తెలిపారు. తనకు తెలుగు వారి సంక్షేమం ముఖ్యమని చంద్రబాబు చెప్పి నట్లు వివరించారు. ఇరుప్రాంత ఉద్యోగుల్లో ఎవరూ నష్టపోరాదన్నదే తమ విధానమని.. ఆ దిశలో ఎవరి హక్కులకూ భంగం కలగకుండా చూస్తామని చంద్రబాబు నాయుడు హామీనిచ్చినట్లు తెలిపారు.

హక్కులకు ఓకే.. సమైక్యానికి నో

టిడిపి అధికారంలోకి రాగానే చేనేత పరిశ్రమ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమంకోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చేనేత శ్రామికులకు చేయూతనివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రపంచ చేనేత దినోత్సవం పురస్కరించుకుని టిడిపి చేనేత విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన సమావేశంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆప్కోను మరింత బలోపేతం చేస్తామన్నారు.

సాంప్రదాయ వృత్తిని నమ్ముకున్న నేతన్నల బతుకులు దయనీయంగా మారాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్వప్రయోజనాలకోసమే వెంపర్లాడుతుందని విమర్శించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా నేతన్నలకు ఒరిగిందేమి లేదన్నారు. కేంద్ర జౌళి శాఖమంత్రిగా కావూరి సాంబశివరావు ఉన్నా చేనేత కార్మికులకు చేసింది శూన్యమన్నారు. టిడిపి అధికారంలోకొస్తేనే కార్మికుల జీవితాలు బాగుపడుతాయన్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల సుడిగుండంలోకి నెట్టడం కాంగ్రెస్‌కు పరిపాటి అయిందన్నారు. వర్షాల వల్ల రిజర్వాయర్లలో నిండా నీరు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేక రైతాంగం ఇక్కట్లు పడుతున్నదన్నారు. ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

చేనేతకు రూ.5 వేల కోట్లు ;చంద్రబాబు

పార్లమెంటులో సమైక్య రాష్ట్ర నినాదాలు గురువారం కూడా మార్మోగాయి.రాజ్యసభలో సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆందోళన చేయడంతో సభ గంటన్నర సేపు వాయిదా పడింది.దీంతో రాజ్యసభలో అడ్డుతగులుతున్న సభ్యులపై చర్య తీసుకునే అవకాశం కనబడుతోంది.తెలుగుదేశం సభ్యులు సి.ఎమ్.రమేష్,సుజనా చౌదరిలతో సహా ఇరవై మంది సభ్యుల పేర్లను రాజ్యసభ అదికారులు ప్రస్తావిస్తూ నోటీసు జారీ చేశారు.ఇరవైమంది సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని వారు పేర్కొన్నారు.అంటే ఇతర కారణాలతో ఇతర ఎమ్.పిలు అడ్డు తగులుతుంటే టిడిపి ఎమ్.పిలు సమైక్య రాష్ట్ర ఆందోళన చేస్తున్నారు.ఈ నేపధ్యంలో వీరి పేర్లు నోటీసులలో చోటు చేసుకున్నాయి.కాగా లోక్ సభలో టిడిపి సభ్యులు వెల్ లోకి దూసుకు వెళ్లగా, కాంగ్రెస్ ఎమ్.పిలు తమ సీట్లలో నిలబడి నిరసన తెలుపుతున్నారు.

టిడిపి ఎమ్.పి ల సస్పెండ్?

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సభ జరుగుతున్న సమయంలో పడిపోవడం కొంతసేపు కలకలం ఏర్పడింది. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, వి వాంట్‌ జస్టిస్‌ అంటూ గత కొద్ది రోజులుగా రాజ్యసభలో ఆందోళన చేస్తున్న ఆయన ఈరోజు సభ జరుగుతుండగా స్పృహ తప్పిపడిపోయారు. దీనిని గమనించిన రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్‌ సభను 10 నిమిషాలు సేపు వాయిదా వేశారు. సీఎం రమేష్ ను చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు.ఆ తర్వాత కోలుకున్న రమేష్ తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు.

రాజ్యసభ లో పడిపోయిన సి.ఎమ్.రమేష్

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని పలువురు అభినందిస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పలుమార్లు తలాతోకలేని ప్రకటనలు చేయడం.. మళ్లీ వెనక్కు తగ్గడం వంటివి చేస్తుందని ఆ పార్టీకి చెందిన నేతలే అంగీకరిస్తున్నారు. అయితే, చంద్రబాబు అలా కాదని.. విభజన విషయంలో బాబు ఒక స్టాండ్ పై నిల్చున్నారని నేతలు అంటున్నారు. బాబుకు గల స్పష్టతను ఇటు తెలంగాణ నేతలతో పాటుగా, సీమాంధ్ర నేతలు కూడా అభినందిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని బాబు పేర్కొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విభజన జరిగితే పార్టీకి నష్టం వాటిలుతోందని.. తెలంగాణపై స్టాండ్ మార్చుకోవాలని కొందమంది సూచించినప్పటికినీ.. బాబు తిరస్కరించారని తెలుస్తోంది.

తెలంగాణపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని ఇక వెనక్కు వెళ్లే పరిస్థితి లేదని బాబు స్పష్టం చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి అభినందించారు. ప్రత్యేక తెలంగాణపై ప్రకటన చేసిన కాంగ్రెస్ అధిష్టానం మాటనే కాంగ్రెస్ నేతలు వినే పరిస్థితి లేదు.. అంతేకాకుండా కేంద్రం తాను చేసిన ప్రకటనను అమలు చేయడానికే ధైర్యం చేయలేకపోతుంది. ఇలాంటి క్లిష్టమైన సమస్యపై ఓ స్టాండ్ తీసుకోవడమే కాకుండా… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ స్టాండ్ కట్టుబడి వుంటామని బాబు ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాబు బేష్..!