August 7, 2013

రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు నష్టపోతారని, తక్షణమే విభజన ప్రక్రియను ఆపాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముందు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపామని అన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం సభలో తెలుగుదేశం సభ్యులు నిమ్మల కిష్టప్ప, నారాయణరావు, వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్ పోడియం వద్దకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను స్తంభింప చేసిన విషయం తెలిసిందే

విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు నష్టం : ఎంపీ వేణుగోపాల్‌రెడ్డి


ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయించేసి ఇప్పుడు కమిటీలతో మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతున్నదని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కమిటీ వేశారు కాబట్టి రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయిందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు, కాని విభజన నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఇక వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చెబుతోంది అని ఈ రెండు ప్రకటనల మధ్య గల వైరుధ్యాన్ని పయ్యావుల వివరించారు.
రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం అత్యంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితులలో మంత్రులు వెంటనే పదవులను త్యజించాలని, ఇంకా పదవులు పట్టుకుని వేలాడితే చరిత్రలో, వారి పేర్లు ద్రోహులుగా మిగిలిపోతాయని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాలయాపన కమిటీలు కేవలం మోసం చేయడానికే: పయ్యావుల

రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయి అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం, టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడుఅధికారంలోకి వచ్చినా స్వప్రయోజనాల కోసమే పని చేస్తుందని ఆయన ఆరోపించారు. నేతకార్మికుల అభివృద్ధిలో మార్పులేదని, టీడీపీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల జీవితాలు బాగుపడుతాయన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ప్రపంచ చేనేత దినోత్సవంలో చంద్రబాబుపాల్గొన్నారు. ప్రజలను ఎప్పుడూ సమస్యల సుడిగుండంలో నెట్టడం కాంగ్రెస్‌కు అలవాటని, ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని, ప్రజాప్రయోజనాలు పట్టవని ఆయన అన్నారు. వర్షాకాలం రిజర్వాయర్లలో నిండా నీళ్లు ఉండి కూడాగ్రామాల్లో విద్యుత్‌ కోతలు విధించడం విడ్డూరమని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు : చంద్రబాబు

 జిల్లాలోని అవనిగడ్డలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఉప ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినప్పటికీ పోటీ ఏర్పడింది. అన్ని పార్టీలకు చంద్రబాబు లేఖ రాయడంతో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీతో సహ మిగిలిన రాజకీయ పార్టీలు కూడా పోటీ విరమించుకున్నాయి. కొంత మంది ఇతరులు కూడా విరమించుకోగా ఇద్దరు ఇండిపెండెంట్లు పోటీ చేయడంతో అవనిగడ్డలో ఎన్నిక అనివార్యమైంది.

టీడీపీ శాసన సభ్యుడు అంబటి బ్రాహ్మనయ్య మృతి చెందడంతో అవనిగడ్డలో ఉప ఎన్నిక జరగనుంది ఈనెల 21న పోలింగ్ జరగనుంది. టీడీపీ తరఫున శ్రీహరి ప్రసాద్ పోటీ చేయగా మరో ఇద్దరు ఇండిపెండెంట్లు నిలబడ్డారు.

అవనిగడ్డలో ఉప ఎన్నిక అనివార్యం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై నరసరావుపేట టిడిపి ఎమ్.పి మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా తీర్మానాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.తాను ముఖ్యమంత్రి ని అయితే విభజనకు ఒప్పుకోనని ఒక్క నిమిషంలో రాజీనామా చేసేవాడిని అని ఆయన అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు వారికి కనబడడం లేదా అని ఆయన అన్నారు.పిసిసి అధ్యక్షుడు సమైక్యం అంటారు,ఆయన భార్య ప్లకార్డు పట్టుకోరు ..ఏమిటీ డ్రామాలు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

నేనే సి.ఎమ్. అయితే నిమిషంలో రాజీనామా : మోదుగుల

అనంతపురం : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరిలో దీక్ష చేపట్టారు. గుంతకల్లులో రైతులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం పట్టణంలో టవర్‌క్లాక్‌ వద్ద టీడీపీ నేత ప్రభాకర్‌చౌదరి నిరాహార దీక్షకు దిగారు.

పరిటాల సునీత దీక్ష

తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం ముందు నీళ్లు, ఉద్యోగుల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని టీడీపీ ఎంపీలు మోదుగుల, శివప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాము తెలంగాణకు వ్యతిరేకంకాదని ఎంపీలు తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమం రగులుతుంటే, పార్లమెంటులో ప్రధాని బొమ్మలా కూర్చున్నారని ఎంపీలు మోదుగుల, శివప్రసాద్ మండిపడ్డారు.

తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు : మోదుగుల, శివప్రసాద్