August 4, 2013

 రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీకి పంపించారు. అనంతరం  ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి దివంగత ఎన్టీఆర్‌కు  నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ష మీడియాతో మాట్లాడుతూ  మనమంతా అన్నతమ్ములుగా కలిస ఉన్నాం, ఒకే భాష మాట్లాడుతున్నాం, అలాంటి తెలుగువారని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. స్వార్థపర రాజకీయ నాయకులు ఆడే నాటకంలో మనమంతా భాగస్వాములం అయిపోతున్నామని హ
రికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే సమైక్యతలో ఉన్న మాధుర్యం దూరం అవుతుందన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షష్ఠిపూర్తి చేసుకునే దశలో విడిపోవడం చాలా బాధాకరమని హరికృష్ణ పేర్కొన్నారు. అసలు రాష్టంలో ఏమి జరగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఏలా అని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. రాష్ట విభజన వల్ల నీళ్లు, కరెంట్, పాలన పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం ఏమిటని హరికృష్ణ నిలదిశారు.

రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా

తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు ఎవరికి కట్టబె ట్టనున్నారన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చంశనీయంశంగా మారింది. తెలంగా ణ ప్రజల చిరకాల ఆకాంక్షను మన్నిస్తూ కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ భాగస్వా మ్య కూటమి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశం లోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని అమోదించి, కేంద్రానికి ప్రతిపాదించిం ది. దీనితో ఆం ధ్రప్రదేశ్‌ని విభజించి రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడానికి అవసరమైన కసర త్తును కేంద్ర ప్రభుత్వం ప్రారంభిం చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనం తరం ఈ ప్రాంత పార్టీ పగ్గాలు ఎవరికీ దక్కుతాయన్నది ప్రస్తుతం టిడిపి వర్గాల్లో చర్చంశనీ యంగా మారింది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ పదవి బాద్యతలు సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ హోంమంత్రి, రాజ్యసభ సభ్యుడు దేవేం దర్‌గౌడ్, టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు, టీఫోరం కన్వీనర్ ఎర్రబె ల్లిదయా కర్‌రావులలో ఒకరికి దక్కవచ్చు నన్న ఊహగహానాలు వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పార్టీ పగ్గాలు బిసిలకు కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం యోచిస్తే దేవేందర్‌గౌడ్‌కు అధ్యక్ష పదవి దేక్క అవకాశా లుంటాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయి తే అధ్యక్ష పదవి వరించేందుకు ఎన్ని అయితే సానుకూలంశాలున్నాయో, అన్నే ప్రతికూల అంశా లు ఉన్నాయంటున్నారు.

ఇటీవల దేవేందర్ గౌడ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాదపడుతు న్నారని పేర్కొంటున్నారు. దీనికితోడు 2009 సాధారణ ఎన్నికలకు ముందు దేవేందర్‌గౌడ్ పార్టీని వీడి సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీని కొనసాగించలేక తన పార్టీని చిరంజీవి స్థాపించిన పిఆర్పీలో విలీనం చేశారని తదానంతర పరిణామాల నేపథ్యంలో ఆయన తిరిగి టిడిపిలో చేరారన్నారు. వెలమ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్ట‘ేట్టాలని భావిస్తే ప్రస్తుతం టీఫోరం కన్వీనర్‌గా కొనసాగు తున్న ఎర్ర‘ేల్లి దయాకర్‌రావుకు పార్టీ పగ్గాలు దేక్క అవకాశాలు లేకపోలేదంటున్నారు. అయితే అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్న వారి జాబితాలో పార్టీ లో ఎర్రబెల్లి దయాకర్‌రావు జూనియర్ కావడమే ఆయనకు ప్రతికూలంశమని పార్టీ వర్గాలు పేర్కొం టు న్నాయి. ఒకవేళ దళిత మాదిగ సామాజిక వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధినేత చంద్రబాబు యోచిస్తే ప్రస్తుతం టీడీఎల్పీ ఉప నాయకునిగా కొనసాగుతున్న మోత్కుపల్లి నర్సిం హులు దేక్క అవకాశాలున్నాయంటున్నారు. టిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న ట్లుగా మాటలయుద్ధంలో తలపడిన మోత్కుపల్లి అధ్యక్ష పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారని వారు విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన కూడా గతంలో పార్టీని వీడినవారేనని గుర్తు చేస్తున్నారు.

ఇకపోతే పార్టీ ఆవిర్భావం నుండి అంకితభావంతో పని చేస్తున్న మాజీమంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మ ల నాగేశ్వరరావుకు అధ్యక్ష పదవి లభించే అవకా శాలు అధికంగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మొదటి నుండి పార్టీ నాయకత్వానికి తుమ్మల నాగేశ్వరరావు నమ్మిన బంటులా వ్యవహ రిస్తూ, తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం అహర్నిషలు శ్రమించారంటున్నారు. కమ్యూనిస్టుల కంచుకోట గా పేరోందిన ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొంటున్నారు. అయితే సీమాంధ్ర అధ్యక్షుడుగా ఎవరికీ పదవి బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపైనే తుమ్మలకు అధ్యక్ష పదవి దేక్కది లేనిది ఆధారపడి ఉంటుం దని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ సీమాంధ్ర పార్టీ బాధ్యతలు కమ్మ సామాజిక వర్గానికే చెందిన నాయకునికి కేటాయిస్తే, తెలంగాణ ప్రాంత అధ్యక్ష పదవి బాధ్యతలు తుమ్మలకు దక్కపోవచ్చునని అంటున్నారు. ఎదీ ఏమైనా తెలంగాణ రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకు నేందుకు తుమ్మల, మోత్కుపల్లి మధ్య తీవ్రస్థాయి లో పోటీ కొనసాగే అవకాశాలు లేకపోలేదంటు న్నారు. అసలు రాష్ట్రం ఏర్పడక ముందే ఇటువంటి చర్చ జరగడం పార్టీకి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్నది మరికొందరి వాదన. రెండు రాష్ఖాలు ఏర్పడితే, రెండు శాఖలకు సమర్థులైన అధ్యక్షులను నియమించే బాధ్యతను అధినేత చంద్రబాబు తీసుకుంటారని పేర్కొంటున్నారు.

టిడిపి పగ్గాలు ఎవరికి?