July 10, 201340 ఏళ్ల విధానాన్ని ఇప్పుడెందుకు మార్చారు
తెలుగు విద్యార్థులను నిలువరించేందుకే ఈ కు్ట్ర
మన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే
ముఖ్యమంత్రి, కేంద్ర మంు్తల్రు ఏం చేస్తున్నారు
కేంద్రాన్ని పార్లమెంట్‌లో నిలదీస్తాం
అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు


 
ఐఐటీలలో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ (అడ్వాన్స్‌డ్-2013) ర్యాంకుల ఖరారులో అనుసరించిన టాప్ ట్వంటీ పర్సంటైల్ విధా నాన్ని పూర్తి లోపభూయిష్టంగా రూపొందించారని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిప డ్డారు. నార్మలైజెడ్ పర్సంటైల్ విధానం వల్ల తెలుగు విద్యా ర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్సంటైల్ విధానం వల్ల రాష్ట్రానికి చెందిన ఎస్టీ విద్యార్థుల కంటే ఇతర రాష్ట్రాల్లోని జనరల్ కేటగిరి విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారన్నారు. మంగళవారం చంద్రబాబు తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విధానం వల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. ఈ విధానం వల్ల మహారాష్ట్రంలో 68 శాతం ఇంటర్ మార్కులు సాధించిన విద్యార్థులు, త్రిపురలో 53 శాతం మార్కులు సాధించిన విద్యార్థు లు, రాష్ట్రంలో 91.8శాతం మార్కులు సాధించిన విద్యార్థులతో సమానమవుతున్నారని వివరించారు. ఇంటర్ బోర్డు ప్రకటించిన కటాఫ్ మార్కులకు, ఐఐ టీ (ఢిల్లీ) ప్రకటించిన కటాఫ్ మార్కులకు ఏమాత్రం పొంతన లేదన్నారు. సీబీఎస్ఈ సూచించినట్లుగా కటాఫ్ మార్కులిచ్చామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతుంటే, సీబీఎస్ఈకి, ఐఐటీ(ఢిల్లీ)కే సమన్వయం లేకుండా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీబీఎస్ఈ, ఐఐటీ మధ్య సమన్వయలోపం తెలుగు విద్యా ర్థులకు శాపంగా పరిణమించిందన్నారు.

40 ఏళ్లుగా కొన సాగిస్తున్న విధానాన్ని ఇప్పుడు ఎందుకు మార్చాల్సివచ్చిం దని చంద్రబాబు ప్రశ్నించారు. విద్యార్థులకుగానీ తల్లి దండ్రులకుగానీ ముందుగా తెలియపరచకుండా చివరి నిమిషంలో నార్మలైజ్డ్ పర్సంటైల్ విధానాన్ని అమలులోకి తెచ్చారని ధ్వజమెత్తారు. అఖిల భారత సర్వీసెస్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఐయంలకు జరిగే పోటీ పరీక్షలకు ఎటువంటి పర్సంటైల్ విధానం లేదని ఆయన గుర్తు చేశారు. ఐఐటీలో మాత్రం పర్సంటైల్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక అంతర్యమేమిటనీ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ సీట్లు పొందుతున్నారనే అక్కసుతోనే 40 ఏళ్లుగా సాఫీగా కొనసాగుతున్న విధానా న్ని కాదనీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తీసుకున్న దుందుడుకు విధానాల వల్ల విద్యార్థులందరూ నష్టపోతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ముందుగానే ఈ విధానంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లయితే ఇప్పుడు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఎం దుకు మౌనం వహిస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పా లన్నారు. ఐఐటీ ప్రవేశాలకు అర్హత సాధించడంతో అనేక మంది విద్యార్థులు ఇతర ఇంజనీరింగ్ కాలేజీలలో దర ఖాస్తు చేయలేదన్నారు. కపిల్ సిబాల్ మానవ వనరుల మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాది కోటరి పన్నిన పన్నాగానికి ఈ రోజు తెలుగు విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులకు అన్యాయం జరు గుతుంటే కేంద్రమంత్రులందరూ ఏమీ చేస్తున్నారని నిలదీశారు. మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు గొడ్డలిపె ట్టుగా మారిన పర్సంటైల్ విధానాన్ని కేంద్ర మానవవన రుల శాఖ మంత్రిగా పల్లంరాజు అడ్డుకోకపోవడం శోచ నీయమన్నారు. పర్సంటైల్ విధానంపై కేంద్రాన్ని పార్లమెం ట్‌లో నిలదీస్తామని, అవసరమయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చంద్రబాబు వివరించారు.టీడీపీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే జాతీయస్థాయి పోటీల్లో తెలుగు విద్యార్థులు అత్యధిక సీట్లు పొందుతున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్, ఐఐటీ, లా, మేనేజ్‌మంట్ మొదలైన కాలేజీలు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రా నికి కేంద్రం అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న ముఖ్య మంత్రి, కేంద్రమంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నారని శివాలెత్తారు. రాష్ట్ర విభజనపై అంశంపై స్పందించడానికి చంద్రబాబు నిరాకరించారు.

తెలుగు విద్యార్దులకు అన్యాయం


 తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మా ర్పు వస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కేం ద్రంలో జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం మినహా మిగిలిన కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం ప్రజలకు సుపారిపాలన అందించిందన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌భవన్‌లో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేషనల్ ఫ్రం ట్, యునైటేడ్‌ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటులో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీరామారావు, ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు కీలకపాత్ర పోషించారని తుమ్మల గుర్తు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కీ, ఆ పార్టీలో విలీనమయ్యే వైస్సార్సీపీ, టీఆర్ఎస్‌లకు ఓటు వేయవద్దని కోరారు. మైరుగైన పాలన కోసం టీడీపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

దేశం గెలుపుతోనే రాజకీయాల్లో మార్పు

టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు హత్యకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుట్ర పన్నారనడానికి ఎ న్నో బలమైన కారణాలున్నాయని ఆ పార్టీ శాసన సభ్యుడు కేఎస్ రత్నం అన్నారు. మంగళవారం ఎన్టీ ఆర్‌భవన్‌లో కేఎస్ రత్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనలకు విరుద్దంగా ఎవరు మాట్లాడిన వారిపై దాడులు చేయించిన సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయన్నారు. మంద కృష్ణ మాదిగ, రవీంద్రనాయక్, గద్దర్, తాజాగా చింతస్వామిపై కేసీఆర్ తన అనుచరలతో దాడి చేయించారన్నారు. అలాగే మోత్కుపల్లి హత్యకు కుట్ర చేసి ఉండవచ్చునని ఆరోపించారు. దళిత బడుగు, బలహీనవర్గాల నేతలంటే కేసీఆర్‌కు కంటగింపుగా మారిందని విరుచుపడ్డారు. తెలంగాణవాదం కేసీఆర్ సొత్తు కాదన్నారు.

మోత్కుపల్లి హత్యకు కేసీఆర్ కుట్ర: కేఎస్ రత్నం

ఐఐటి, ఎన్‌ఐటి జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులు, జెఇఇలో ఎక్కువ మార్కులు వచ్చిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు బాగా నష్టపోయారన్నారు. జెఇఇలో తక్కువ మార్కులు వచ్చి, ఇంటర్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన ఇతర రాష్ట్రాల వారికి ప్రయోజనం కలిగిందన్నారు. టాప్ 20 నార్మలైజ్డ్ పర్సెంటైల్ విధానం వల్ల మన రాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారన్నారు.

మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ అసమానతలను తొలగించడం, ప్లస్‌టూ స్ధాయిలో వివిధ విద్యా బోర్డుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి ఏకీకృత విధానం ద్వారా విద్యార్ధులకు న్యాయం చేయాలనే విధానం దెబ్బతిందన్నారు. గతంలో జెఇఇలో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఐఐటి, నిట్‌లలో అడ్మిషన్లు ఇచ్చేవారన్నారు. పర్సంటైల్ విధానం వల్ల ఐఐటిలో వెయ్యి సీట్లు, ఎన్‌ఐటిలో 1500 సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పాతరన్నారు. కాని ఈ సారి ప్లస్ టూ స్థాయిలో మార్కులను పరిగణనలోకి తీసుకోవడం, ఇది లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నష్టపోయారన్నారు.

ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజ్ ఇవ్వాలనే నిర్ణయం వల్ల వివక్షతకు దారితీసినట్లయిందన్నారు. అలాగే కటాఫ్ మార్కులు 20 పర్సంటైల్ విధించడం వల్ల త్రిపురలో 53 శాతం వచ్చిన ప్లస్ టూ విద్యార్థికి సీటు వస్తే, ఆంధ్రాలో 91.89 శాతం వచ్చిన విద్యార్థికి సీటు రాని పరిస్థితి తలెత్తిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు ఐఐటి జెఇఇలో ఎక్కువ మార్కులు వచ్చినా టాప్ 20 పర్సంటైల్ విధానం వల్ల సీట్లుపొందలేకపోతున్నారన్నారు. పర్సంటైల్ విధానం వల్ల రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న అంశంపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. లేని పక్షంలో విద్యార్ధుల అమూల్యమైన జీవితం నాశనమవుతుందన్నారు.

అఖిల భారత ప్రవేశపరీక్షల్లో కూడా రాత పరీక్షల్లో వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారన్నారు. 2009-10లో మన రాష్ట్రానికి చెందిన 1697 మందికి సీట్లు వచ్చాయన్నారు. 2012-13లో 2500 సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్ర విద్యార్ధులకు అన్యాయం జరిగినా కేంద్ర మంత్రులకు, ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల అన్ని వ్యవస్ధలతో పాటు విద్యారంగం కూడా భ్రష్టుపట్టిందన్నారు. కేంద్రం కూడా రాష్ట్ర విద్యార్థుల పట్ల కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందన్నారు. మన విద్యార్థుల ప్రతిభకు కేంద్రం అడ్డుపడుతోందన్నారు. ఈ అంశంపై దృష్టిసారించి, రాష్ట్ర విద్యార్ధులకు అన్యాయం జరగకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న చంద్రబాబు

రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేయండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని దొంగలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హంతకులు, దోపిడీదారులు, నకిలీ నోట్ల ముఠాకు ఓ పార్టీ ఉందని వైసీపీ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

స్నేహితుడిని చంపి వైసీపీ కోసం ఖర్చు పెట్టే స్థాయికి కొందరు దిగజారడం దారుణమన్నారు. జైలు నుంచే జగన్ ఇలాంటి ముఠాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జగన్ ముఠా చేసే అక్రమాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. జగన్, కిరణ్‌కుమార్‌రెడ్డి అవిభక్త కవలలుగా అక్రమాలకు సహకరించుకుంటున్నారని భావించారు.

రాజమండ్రి దోపిడీ కేసును తొక్కిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు. పోలీసుల విచారణ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి వెల్లడించిన వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్లు షర్మిల పాదయాత్ర ఉందని విమర్శించారు. షర్మిల పాదయాత్రకు ఏర్పాట్లు చేసే వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ఆయన కోరారు.

దొంగలకు అడ్డా వైఎస్సార్ కాంగ్రెస్ : రేవంత్‌రెడ్డి