July 8, 2013

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులుకు అదనపు భద్రత పెంచాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. మోత్కుపల్లిపై హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బాబు డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ కోర్టు ఆవరణలో ఏకే 47 అపహరణ కేసుపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు.

మోత్కుపల్లికి భద్రత కల్పించాలి : బాబు

నల్లగొండ: దళితుడిని అయిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనను అంతమొందించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

కెసిఆర్ ప్రోద్బలంతోనే తనను హత్య చేయడానికి మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని ఆయన అన్నారు. మోత్కుపల్లిని అంతం చేయడానికి మావోలు రెక్కీ నిర్వహించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. తనను భౌతికంగా అంతం చేయడానికి కెసిఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. తెరాసలో చేరిన మాజీ నక్సలైట్లు తనను హత్య చేసే కుట్రకు సూత్రధారులని ఆయన అన్నారు.

మావోల రెక్కీ కెసిఆర్ కుట్ర: మోత్కుపల్లి

నల్గొండ: తనను చంపడానికి కుట్ర పన్నింది, రెక్కీ నిర్వహించిందీ కూడా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు అన్నారు. కేసీఆర్ తెలంగాణకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతున్న కారణంగా తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణకు అసలైన ద్రోహి కేసీఆర్‌నని మోత్కుపల్లి విమర్శించారు.

‘నన్ను చంపడానికి కుట్ర పన్నింది కేసీఆరే’

సైద్ధాంతికంగా కోరుకుంటున్నాం
పాదయాత్ర పుస్తకావిష్కరణలో చంద్రబాబు
తమ పార్టీకి అధికార కాంక్ష ఉందని స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దానిని ప్రజా సేవకే వినియోగిస్తాం తప్ప స్వప్రయోజనాల కోసం వినియోగించమన్నారు. ఆయన చేసిన ''వస్తున్నా.. మీ కోసం'' పాదయాత్రను పాత్రికేయుడు తేలప్రోలు శ్రీనివాస రావు అదే పేరుతో అక్షరబద్దం చేసిన పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా ఆయన వచ్చారు. రవీంద్రభారతిలో సోమవారం పుస్తక ఆవి ష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ సైద్ధాంతి కంగా తమ పార్టీ అధికారాన్ని కోరుకుంటుందని స్పష్టం చేశారు. వ్యక్తులు జీవిక కోసం వర్తక, వాణిజ్యాలు చేయాలి తప్ప రాజకీయాలు కాదని చెప్పారు. రాజకీయాల్లో మంచి వారిని ప్రజలే ప్రోత్సహించాలన్నారు. తన 208 రోజుల సుదీర్ఘ పాదయాత్ర జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమని చెప్పారు. శరీరం సహకరించని ఇబ్బంది ఒకవైపుంటే ప్రజల ఆదరాభిమానాలు వాటిని మరిపించేవన్నారు. కేవలం పట్టుదలతోనే యాత్రను పూర్తి చేశానని చంద్రబాబు చెప్పారు. యాత్రలో ఉన్నప్పుడే ఎర్రన్నాయుడు మృతి చెందడం తనకు తట్టుకోలేని బాధను మిగిల్చిందన్నారు. ఇంకా నీలం తుపాను, హైదరాబాద్‌లో పేలుళ్లు, అంబటి బ్రాహ్మణయ్య మృతి లాంటి సంఘటనలన్నీ పాదయాత్ర సాగుతుండగా చోటు చేసుకున్నవేనన్నారు.

స్వాతంత్య్రానంతరం దేశంలో ఏర్పడిన నాలుగు కాంగ్రేసేతర ప్రభుత్వాలలో మూడు ప్రభుత్వాలు టీడీపీ చొరవతోనే ఏర్పడినాయని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ విషయమై తెలుగువాడిగా తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు. అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఎంపికవడం వెనక తన కృషి ఉందని చెప్పారు. భారత్‌కు వచ్చిన నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్‌ రావడమే కాకుండా తనతో చాలా సేపు ఏకాంతంగా మహావీర్‌ ఆస్పత్రిలో ముఖాముఖి సంభాషించినట్లు చెప్పారు. ఆయన సూచనల మేరకు అనంతరం ఆనాటి ఇంగ్లండ్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సైతం హైదరాబాద్‌ వచ్చినట్లు వెల్లడించారు. తన హయాంలో తయారు చేసిన విజన్‌-2020 డాక్యుమెంట్‌ ఒక అద్భుత మార్గదర్శిగా నిలిచిందన్నారు. దాని స్ఫూర్తితోనే నాటి రాష్ట్రపతి కలాం దేశానికి అలాంటిది ఉండాలని తలచారన్నారు. ఒకప్పుడు తన కుప్పం నియోజకవర్గం మొత్తం రెండు మూడు వందల ఫోన్లకు మించి ఉండేవి కావన్నారు. ఇప్పుడు వాటి సంఖ్య 60వేలకు చేరిందన్నారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న వాజ్‌పేయికి తాను నచ్చజెప్పడం మూలంగానే దేశంలో టెలికాం అభివృద్ధికి బీజం పడిందని చెప్పారు. తనపై యాత్రను అక్షరబద్దం చేసిన రచయితకు అభినందనలు తెలిపారు. అంతకు ముందు మాట్లాడిన సీనియర్‌ పాత్రికేయులు కె. రామ చంద్రమూర్తి చంద్రబాబు లాంటి సమర్థునికి దేశ ప్రధాని అయ్యే అర్హత ఉందన్నారు. మరో పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నేతగా చంద్రబాబును విశాలాంధ్ర సంపాదకుడు శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. టీవీ జర్నలిస్టు వెంకట రమణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

'ఒకే ఒక్కడు' నేనే

అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన 'ఒకే ఒక్కడు' సినిమా నిర్మాణానికి తానే ప్రేరణ అని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో చిత్ర దర్శకుడు శంకర్‌ తనను కలిసి అదే విషయం చెప్పారని గుర్తు చేశారు. అప్పట్లో తన పరిపాలన శైలి, వేగం, దూకుడు ప్రేరణగా తీసుకుని ఆ సినిమా నిర్మించినట్లు దర్శకుడు చెప్పారన్నారు.

ప్రజాసేవకే అధికారం............మంచివారినే రాజకీయాల్లో ప్రోత్సహిస్తాం

వస్తున్నా మీకోసం పేరుతో వేపిన పుస్తకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. దేశప్రధాని అయ్యే అవకాశం తనకు రెండు సార్లు వచ్చినా, రాష్ర్ట ప్రయోజనాల కోసమే ఆ పదవిని వదులుకున్నానని చంద్రబాబు అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో నాల్గు సార్లు కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, అందులో మూడు ప్రభుత్వాలు తెలుగుదేశం చొరవతోనే ఏర్పడినందుకు గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. పాలకుల తప్పిదాల వల్లే సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో వనరులకు కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకే అధికారం తప్ప స్వలాభం కోసం కాదని ఆయన హితవు పలికారు.

వస్తున్నా మీకోసం పుస్తకం ఆవిష్కరణ

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టిడిపి పార్టీ వ్యతిరేకం కాదని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాలో టిడిపి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఆదివారం వరంగల్ జిల్లా కాజిపేట కాకతీయ ప్రాంగణంలో 'ఉత్తర తెలంగాణ' ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.

తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం కార్యకర్తలనుద్దేశించి బాబు ప్రసంగించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ కోసం అమరులైన వారిని ఆర్ధికంగా ఆదుకుంటామని హామీనిచ్చారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీలపై బాబు విమర్శలు సంధించారు. ఒక పార్టీ అసమర్థత పార్టీ అని, మరొక పార్టీ జైలు పార్టీ అని, ఇంకొక పార్టీ వసూళ్ల పార్టీ అని ఎద్దేవా చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో విజయం విజయం సాధించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ సదస్సులో వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల నేతలు పాల్గొన్నారు.

తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదు - చంద్రబాబు

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీ నాయకులు ఉద్యమం పేరుతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లతో గెలుస్తుందని, కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని అన్నారు.

పంచాయతీ ఎన్నికలలో పసుపు జెండా ఎగురవేయాలన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ఐదు రోజులు పడిగాపులు కాసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తరాఖండ్ బాధితుల కోసం ఒక్కరోజును కేటాయించలేదన్నారు. తమ మహాలక్ష్మి పథకాన్నే బంగారుతల్లిగా మార్చారన్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. విద్యార్థుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగమిస్తామన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల పైన ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు. రేపు, ఎల్లుండో పిల్ల కాంగ్రెసు తల్లి కాంగ్రెసులో కలువడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీకి సాధారణ ఎన్నికలలో గెలిచే సత్తా లేదన్నారు. తెరాస నాయకులు ఉద్యమం పేరుతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్నారు. టిఆర్ఎస్ నేతల పైన ఎవరైనా ఆరోపణలు చేస్తే వారిపై దాడులు చేస్తారని, ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు.

సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ఐదు రోజులు పడిగాపులు కాసిన కిరణ్ కుమార్ రెడ్డి!

వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లతో గెలుస్తుందని, కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కాజీపేటలోని ఫాతిమానగర్ బిషప్ బరెట్టా స్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన తెలుగు దేశం పార్టీ ప్రాంతీయ సభకు హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలలో పసుపు జెండా ఎగురవేయాలన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ఐదు రోజులు పడిగాపులు కాసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తరాఖండ్ బాధితుల కోసం ఒక్కరోజును కేటాయించలేదన్నారు. తమ మహాలక్ష్మి పథకాన్నే బంగారుతల్లిగా మార్చారన్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యార్థుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగమిస్తామన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల పైన ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు. రేపు, ఎల్లుండో పిల్ల కాంగ్రెసు తల్లి కాంగ్రెసులో కలువడం ఖాయమన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీ నాయకులు ఉద్యమం పేరుతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీకి సాధారణ ఎన్నికలలో గెలిచే సత్తా లేదని చంద్రబాబు అన్నారు. టిఆర్ఎస్ నేతల పైన ఎవరైనా ఆరోపణలు చేస్తే వారిపై దాడులు చేస్తారని, ఇదేం సంస్కృతి అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రానున్న 20వేల మందికిపైగా ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ముందుగా చంద్రబాబు సభా ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని అవిష్కరించారు. అనంతరం వేదికపై ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. చార్‌దాం వరదల్లో చిక్కుకొని మృతి చెందినవారికి కూడా సభలో సంతాపాన్ని ప్రకటించారు.

భవిష్యత్‌లో కేంద్రంలో చక్రం తిప్పనున్న టీడీపీ : బాబు


రైతుల రుణాలు మాఫీ చేస్తాం...


2014 ఎన్నికల్లో తెదేపాకే తిరుగులేని మెజారిటీ

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే రైతులకు సంబంధించిన అన్నిరంగాల రుణాలను మాఫీ చేసేందుకు తొలి సంతకం చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం వరంగల్‌ జిల్లా కాజీపేట కాకతీయ ప్రాంగణంలో నాలుగు జిల్లా ప్రాం తీయ సదస్సులో బాబు పాల్గొని పార్టీశ్రేణులకు గ్రామ పంచాయితీ ఎన్నికలపై దిశా నిర్ధేశం చేశారు. వరంగల్‌ జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎడబోయిన బస్వారెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సుకు వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆది లాబాద్‌ జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎ త్తున హాజరయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు మంచినీళ్ళు సమ కూర్చకుండా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని, తాము అధికారం లోకి రాగానే బెల్టుషాపుల ఎత్తివేతకు రెండవ సంతకం చేస్తానని అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో గ్రామ పంచా యతీలు, స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని చంద్ర బాబు ధ్వజమెత్తారు. పంచాయితీలకు ఎన్నికలు జరపకపో వడంతో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన 4వేల కోట్ల నిధులు వెనక్కిపోయాయని అన్నారు. ప్రజల తో పన్నులు కట్టించుకుంటున్న ప్రభుత్వం ఎక్కడ అభి వృద్ది చేసిందీ లేదన్నారు. ప్రజల సొమ్మంతా కాంగ్రెస్‌ నేత ల జేబుల్లోకి పోతోందని, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోపిడీ చేశాడని, దోచు కున్న సొత్తంతా కాంగ్రెస్‌ నేతలు విదేశాల్లో దాచుకుంటు న్నారని అన్నారు. జైలుకే పరిమితమైన పిల్ల కాంగ్రెస్‌కు ఓ టు వేస్తే జైలుకు వెళ్ళే పరిస్థితే వస్తుందని వైఎస్సార్‌ సీపీని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో కేసీఆర్‌ కుటుంబం వసూళ్ళకు పాల్పడుతున్నదని, భవి ష్యత్తులో పీఆర్పీని చిరంజీవి విలీనం చేసినట్లే కేసీఆర్‌ తెరా సను కాంగ్రెస్‌ విలీనం చేయడం ఖాయమని అన్నారు.

తెలుగుదేశం తెలంగాణకు వ్యతిరేకం కాదని మహానాడు లోనే తీర్మానం చేశామని చంద్రబాబు అన్నారు. అధికారం లోకి వచ్చాక అమరుల కుటుంబాలను ఆదుకుంటామని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని ధరల నియంత్రణ లేకపోవడంతో సామాన్యుల జీవనం కష్టాల పాలైందన్నారు. రైతులకు అన్నివిధాలా అన్యాయం జరి గిందని అన్నారు. పంచాయితీ ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పంచాయితీల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని బాబు పిలుపునిచ్చారు. రా బోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికలపై పంచాయితీ ఎన్నికలు ప్రభావం ఉంటుందని ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే తిరుగులేని శక్తి అని, నేటి కార్యకర్తలే రేపటి నాయకులను బాబు స్పష్టం చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సదస్సులో తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్‌, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయా కర్‌రావు, ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, గుండు సుధా రాణి, రాథోడ్‌ రమేష్‌, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, ధన సరి అనసూయ, సత్యవతి రాథోడ్‌, జగిత్యాల ఎమ్మెల్యే రమణ, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు, మాజీ ఎమ్మె ల్యే ఇనుగాల పెద్దిరెడ్డి, గోడెం నగేష్‌ పాల్గొన్నారు.

తెదేపా అధికారంలోకి వస్తే రుణమాఫీపై తొలి సంతకం

గ్రామ పంచాయతీలపై పసుపు జెండాలు రెపరెపలాడాలి
టీఆర్‌ఎస్‌ వసూల్‌ రాజా పార్టీ
2014 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలుస్తాం
ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు నాయుడు

రానున్న పంచాయతీ ఎన్నికలే అత్యంత కీలకం. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలి. పట్టుదలతో ఉన్నాం. సంకల్పం నెరవేరే వరకు కదం తొక్కుదాం. సైకిలు జోరుకు అడ్డుపడితే తొక్కించి మరీ ముందు కు సాగాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం కాజీపేట బిషప్‌ బెరెట్టా మైదానం లోని కాకతీయ ప్రాంగణంలో జరిగిన వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ఈ యేడాదంతా ఎన్ని కల కాలమని, ఆయుధం మీ వద్దనే ఉందని, ఉత్సాహంతో ముందుకు సాగుతూ తెదేపా బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాల్సిన అవస రం ఉందన్నారు.

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకు ని వసూల్‌ రాజా పార్టీగా టీఆర్‌ఎస్‌ మారిందన్నారు. ఉద్యమం ముసుగులో టిక్కెట్లు అమ్ము కుంటున్నారని అన్నారు. ఇక పిల్ల కాంగ్రెస్‌కు (వైఎస్సార్‌సీపీ) ఓట్లేస్తే బెయిల్‌ కోసం తాకట్టు పెడతారని విమర్శించారు. సామాజిక న్యాయం పేరుతో పుట్టిన పార్టీ కాంగ్రెస్‌లో కలిసి పోయిందని, పిల్ల కాంగ్రెస్‌ కూడా కాంగ్రెస్‌లో కలిసిపోయే పార్టీయేనని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ సార్టీ గ్రామీణ స్థాయి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. 73, 74 అధికరణల ప్రకారం స్థానిక సంస్థలకు సకాలంలోఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలు కాలరాసి స్థానిక సంస్థలను పూర్తిగా విస్మరించి నిర్వీర్యం చేశారని అన్నారు.

ఈ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లేదని, కోర్టు మొట్టికాయలు వేస్తే ఈ ప్రభుత్వాలకు జ్ఞానోదయం కలగదని విమర్శించారు. వీరి నిర్వాకం వల్ల రూ. 4వేల కోట్లు మురిగి పోయాయని అన్నారు. తెదేపా హయంలో స్థానిక సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. 94లో 8వేల కోట్ల బడ్జెట్‌ ఉండగా, 2004లో రూ. 25వేల కోట్లు బడ్జెట్‌తో మంచి పరిపాలన అందించామన్నారు. ప్రస్థుత బడ్జెట్‌ రూ. 1.65 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని, ఆ డబ్బంతా కాంగ్రెస్‌ పందికొక్కుల్లా మెక్కారని ఆరోపించారు. కాంగ్రెస్‌ దొంగాటకం, దోబూచులాట ఆడుతోందన్నారు. 9 ఏళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని అన్నారు. గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు.

రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. ఎరువు లు, విత్తనాల ధరలు పెరిగి పోయాయన్నారు. సబ్సిడీలు పూర్తిగా తగ్గించేశారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. అమ్మహస్తం పథకం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అమ్మహస్తం మొండిహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. ఆహార భద్రత అంటూ ఓట్ల భద్రత కోసం హడావుడిగా చట్టం తీసుకొస్తున్నారని అన్నారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ధరలు తగ్గించపోగా ధరలు పెంచి పేదలు జీవనం సాగించలేని స్థితికి తీసుకొ చ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపం పథకాన్ని ఆర్పేశారని అన్నారు. తెదేపా అధికారంలోకి వస్తేనే మళ్లిd దీపం వెలుగుతుందన్నా రు. బంగారుతల్లి అంటూ గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన బాలిక సంరక్షణ పథకాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. అన్ని పథకాలు తమవేన్నా రు. వాటి పేర్లు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణకు అనుకూలం..

తెలంగాణకు అనుకూలమని అనుకూలమని చంద్రబా బు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలను తాము అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ఆదుకుం టామని అన్నారు. తెెలంగాణ ఉద్య మం లో పాల్గొన్న వారిపై ఉన్న పోలీస్‌ కేసులను ఎత్తివేస్తామ ని తెలిపా రు. అమరుల వీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని బాబు అన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని అన్నారు. గోదావరి జలాలను వరంగల్‌ జిల్లాకు రప్పించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిని నిమ్స్‌ తరహాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చుతామన్నా రు. ఈ ప్రాంతీయ సదస్సులో ఎంపీలు నామ నాగేశ్వరరావు, రమేశ్‌ రాథోడ్‌, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశరెడ్డి, సత్యవతిరాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలే కీలకం

సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్పకూలిన ఘటనాస్థలిని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరుపై విచారణ చేయించాలన్నారు. ప్రమాద స్థలిలో సీఎం రెండు నిమిషాల పాటే ఉండి పోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. సీఎం, మంత్రులు ఘటనాస్థలిలో సహాయక చర్యలను పరిశీలించరా, వారికి ఆ బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు.

ఘటనాస్థలిని సందర్శించిన చంద్రబాబు


పెట్టుబడిపై 50 శాతం లాభం ఉండేలా గిట్టుబాటు ధర
రైతులకు విపత్తు సాయం ఎకరాకు రూ. 10 వేలు
నాణ్యమైన నిరంతర విద్యుత్
సాగునీటికి సమగ్ర ప్రణాళిక - వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం
స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకై కేంద్రంపై ఒత్తిడి

రైతులకు రుణ మాఫీ, వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల పోరుకు నగారా మోగింది. కానీ ఇక్కడ ఓ చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. వైకాపా పార్టీ ప్రస్తుతం ఎటూ తోచని స్థితిలో వుంది. దిశా నిర్దేశం చేయాల్సిన నాయకుడు కరువయ్యాడు. గెలవాలి అని చెప్పడమే కానీ, ఎలా గెలవాలి.. అందుకు ఏం చేయాలి అన్నది పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ చెప్పడం లేదు. ఇక కాంగ్రెస్ లో తెలంగాణా మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ఇరు ప్రాంతాల నేతలు ఢిల్లీలో పార్టీ నాయకులు చెవులు కొరికి పారేయడంలో మహా బిజీగా వున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తన కొడుకు సినిమా ఆడియో ఫంక్షన్ అయిపోగానే మరి పత్తాలేరు. కొనేసి అయినా గెలిచేయండి అంటూ పిసిసి అధ్యక్షుడు హితోపదేశం మినహా చేసిందేమీ లేదు. వామపక్షాలకు ఈ ఎన్నికలు పెద్దగా పట్టినట్లు లేదు. మోడీ వచ్చేసాడు.. ప్రధాని పీఠం మాదే, ఇంతవరకు తాము చేసిందీ లేదు. ఇకపై చేసేదీ లేదు.. అన్నట్లుగా బీజేపీ నేతలున్నారు.

కానీ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు ఒక్కరే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రాంతీయ సమావేశాలు చకచకా పూర్తి చేసి క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా ఇక్కడ బాబు రెండు లక్ష్యాలు పూర్తి చేశారు. ఒకటి పంచాయితీ ఎన్నికలపై సీరియస్ గా పనిచేయడం. రెండవది, నాయకుల దృష్టి తెలంగాణా తలకాయ నొప్పులపైకి వెళ్లకుండా చేయడం. ఇదేదో బాగానే ఉంది. కానీ పోటీ వుంటేనే రంజుగా వుంటుంది. ఎవరూ ఏ హడావుడి చేయకపోవడంతో, బాబు ఒక్కరే చేస్తున్నా, పెద్ద సందడిగా లేదు. రేస్ లో పోటీదారులు ఎవరు లేకుండా, బాబు ఒక్కరే పరుగెడుతున్న చందంగా వుంది.

బాబు ఒంటరి పరుగు

 సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్‌లో ఉన్న సిటీ లైట్ హోటల్ భవనం సోమవారం కుప్పకూలిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. హోటల్ కూలిన విషయం తెలియగానే ఆయన హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ పరిస్థితిని పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన చూస్తుంటే చాలా హృదయవిదారకంగా ఉందని ఆయన ఆదేవన వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా మరో 30 మంది తీవ్రంగా గాయపడగా మరెందరో శిథిలాల కింద చిక్కుకుని సహాయం కోసం రోదనలు చేస్తుంటే గుండె తరుక్కుపోతుందని చంద్రబాబు అన్నారు. ఇది చాలా పురాతనమైన భవనం, దీనికి సంబంధించిన వివరాలు మున్సిపల్ అధికారుల వద్ద ఉంటాయి. వాటిని బట్టి పురాతన భవనాలకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా సిటీ లైట్ హోటల్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

ఈ రోజున చూస్తే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వీటన్నిటికి అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం ఉదాసీనత వల్లే జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపే భవనం కూలింది. మొత్తం కూలితే ఏ వంద మందో మృతి చెందేవారని బాబు పేర్కొన్నారు. అధికారులు స్పందించే తీరుపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఘటనా స్థలంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రెండు నిముషాలు మాత్రమే ఉండి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి సమయంలో సీఎం సంఘటనా ప్రదేశం వద్దే ఉండి సమాయక కార్యక్రమాలు చూడాల్సిన బాధ్యత ఆయనదేనని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదని, ఈ విషయన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

ఇది పరిపాలనా పద్ధతి కాదని, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమని, దీనికి ప్రజల ప్రాణాలు పోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్యం అందించి, నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుంటుంబాలకు ఆయన తన తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జ్యుడీషియల్ విచారణ జరిపించాలి : చంద్రబాబు

 సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్పకూలినఘటనలో మృతిచెందిన వారికి రూ.50 వేలు, గాయపడినవారికి రూ.10 వేలు ఇస్తామని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఈ హోటల్‌ భవనం కూలి 12 మంది చనిపోగా, 18 మంది గాయపడిన విషయం తెలిసిందే. గాయపడినవారిని ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు.

బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన బాబు

 అమెరికాలోని డల్లాస్ నగరంలోని ఓమిని హోటల్‌లో ఆదివారం తెలుగుదేశం పార్టీ సీడీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి నూతన రికార్డు సృష్టించారన్నారు. పాదయాత్రలోని ముఖ్య సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ పాటలు తదితర అంశాలతో కూడుకున్న సీడీని అట్లాంటా నగరానికి చెందిన మల్లిక్ మేదరమెట్ల రూపొందించారని తెలిపారు.

నరసరావుపేట పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు పార్టీ కార్యక్రమాలను, మరోవైపు సేవా కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించడము అభినందనీయమన్నారు. రాష్ట్రాభివృద్ధి, భావితరాల భవిత కొరకు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టబోతున్న బస్సుయాత్ర విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఐటి రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా తమకు ఉద్యోగ ఉపాధి లభించిందని ప్రవాసాం«ద్రులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లిక్ మేదరమెట్ల, శ్రీనివాసరావు కొమ్మినేని, బుల్లియ్య చౌదరి ఉన్నవ, నాగరాజారావు మర్రి, మహేష్ గోగినేని, అమర్ అన్నె, లోకేశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

డల్లాస్‌లో తెలుగుదేశం పార్టీ సీడీ ఆవిష్కరణ