June 30, 2013
మహానటుడు నందమూరి తారకరామారావు కడుపున జన్మించడం తన అదృష్టమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తన తండ్రి జీవితమే తనకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బాలయ్య ఫిలడెల్ఫియాలో డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి హీరోను లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ తో పురస్కరించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆదరణతోనే తాను ఇంతటి వాణ్ణయ్యానని వినమ్రంగా చెప్పారు. వారికోసం ఇకపైనా సినిమాల్లో కొనసాగుతానని, ఫ్యాన్స్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. ఇక రాజకీయాలపై వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, అవినీతిని అంతమొందించేందుకు ప్రవాసాంధ్రులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

ఈ సభలో సినీతారలు హంసనందిని, రజిత, సంగీత దర్శకుడు మణిశర్మ, గాయని సునీత, రచయిత వడ్డేపల్లి కృష్ణ, నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు పలు తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ కడుపున పుట్టడం పూర్వ జన్మ సుకృతం

సీఎం కిరణ్‌ ఔరంగజేబు తరహా పాలన చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఎన్నికల ఎజెండాలో దశల వారీగా మద్యం నిషేధిస్తున్నామన్న హామీని కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని ఆయన చెప్పారు. నూతన మద్యం విధానం చెత్త విధానమని ఆయన అన్నారు. నూతన మద్యం విధానాన్నినిరసిస్తూ రేపు అన్ని ఆబ్కారీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీఎం కిరణ్‌ది ఔరంగజేబు తరహా పాలనవిజయవాడ: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో విజయవాడ లోకసభ స్థానం రగడ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. 2014 ఎన్నికలలో విజయవాడ పార్లమెంటు టిక్కెట్‌ను టిడిపి తరఫున గద్దె రామ్మోహన్ రావు, కేశినేని నానిలు ఆశించిన విషయం తెలిసిందే. అప్పటికే కేశినేనిని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంఛార్జిగా ప్రకటించారు. ఇంఛార్జి ప్రకటన తర్వాత కూడా గద్దె అధినేతను కలిసి విజయవాడ టిక్కెట్‌‍ను కోరారు.

ఈ రగడ ఇటీవల బెజవాడలో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఇద్దరు నేతలు రాజీకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో విజయవాడ పార్లమెంటు టిక్కెట్ కేశినేని నానికి, విజయవాడ తూర్పు టిక్కెట్ గద్దె రామ్మోహన రావుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో భాగంగా ఇరువురు నేతలు రాజీకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ అధినేత ఏది చెబితే అది చేయడమే తమ విధి అన్నారు. టిడిపి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, దానికి అనుగుణంగానే తాము నడుచుకుంటున్నామని కేశినేని నాని చెప్పారు.

గద్దె రామ్మోహన రావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం చాలా సమస్యల్లో ఉందని, వాటిని తీర్చడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆయన ఆదేశాలను తాము పాటిస్తామని చెప్పారు. విజయవాడ ఇంఛార్జిగా నానిని నియమించానని, తూర్పు నియోజకవర్గం చూసుకోవాలని తనకు అధినేత సూచించారన్నారు.

బెజవాడ'పై రాజీ: తూర్పుకు గద్దె, ఎంపీ టిక్కెట్‌కు నాని

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. గవర్నర్ అత్త మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.

గవర్నర్ దంపతులను పరామర్శించిన బాబు