June 29, 2013


నెల్లూరు జిల్లాలోనూ వైకాపాలో ధిక్కారస్వరం తారస్థాయికి చేరింది. అక్కడ మేకపాటి సోదరులకు వ్యతిరేకంగా చిరంజీవిరెడ్డి వేరుకుంపటిని పెట్టుకున్నారు. మేకపాటి సోదరుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడటానికే రాజన్నదళం పేరిట ప్రత్యేక సంస్థను ఆయన ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. చిరంజీవిరెడ్డికి ఉదయగిరి నియోజకవర్గంలో గట్టిపట్టుంది. ఆ నియోజకవర్గంలో రాజన్నదళం తరఫునా అన్ని పంచాయితీలలో సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులను పోటీకి పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఆ మేరకు పోస్టర్లు కూడా ఏర్పాటు చేయించారు. మేకపాటి సోదరుల వల్ల పార్టీకి జరుగుతున్న నష్టం గురించి ఎంతగా చెప్పినా అధినాయకత్వం నుంచి కట్టడి చర్యలు లేకపోవడంతో పార్టీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇదివరేక మేకపాటి కార్యకలాపాల తో విభేదించిన కాకాని గోవర్థన్‌రెడ్డి ఆశీస్సులు చిరంజీవిరెడ్డి వర్గానికి అందిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామంతో ఇతర నియోజకవర్గాల్లోనూ మేకపాటికి వ్యతిరేకంగా మరికొందరు నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎల్.ఎం. మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గానికి వైకాపాకు సమన్వయ కర్తగా చాలా కాలంగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పదవులు ఎరచూపినప్పటికీ తలొగ్గకుండా జగన్‌పై, వైఎస్‌పై వున్న అభిమానాన్ని చాటుకున్నారు. తొలి నుంచి వైకాపాకు అంకితభావంతో పనిచేస్తున్నారు. అందుకు గుర్తింపుగానే ఆయనకు ఇన్‌ఛార్జి పదవిని అప్పగించారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇక రాబోయే ఎన్నికలకు తానే అభ్యర్థి అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ కూడా గతంలో ఆ మేరకు హామీ ఇచ్చింది. అయితే ఇటీవల అనూహ్య రీతిలో మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆ నిర్ణయంతో ఖంగుతిన్న మోహన్ రెడ్డి పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అక్కడ జరిగిన పార్టీ సమావే శంలో ఆయన నిరసన వ్యక్తం చేశారు. కొత్త సమన్వయ కర్త అనుయాయులకు, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి వర్గీయులకు మధ్య ముష్టియుద్ధం జరిగింది. పార్టీ నిర్ణయం తెలిసిన వెంటనే మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైకాపాలో నమ్ముకుని పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. డబ్బున్నవారికే పెద్దపీట వేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే గుంటూరు జిల్లాలో అసమ్మతి నేతలు సమావేశ మయ్యారు. డబ్బున్నవారికి, పార్టీఫండ్ బాగా ఇచ్చిన వారికి ఇన్‌ఛార్జి పదవులు కట్టబెడుతూ పాతవారిని మారుస్తూ తీసుకున్న నిర్ణయాలతో పదవులు కోల్పోయిన వారంతా ఇందులో పాల్గొన్నారు. పార్టీ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్ జైలుకు వెళ్ళాక పార్టీలోని కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి విధేయతలతో సంబంధం లేకుండా ఎవర్వు ఎక్కువగా డబ్బులు ముట్టజెబితే వారికి ఇన్‌ఛార్జి పదవులు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే జగన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని వారు నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా స్థానికేతరులను ఇన్‌ఛార్జిలుగా నియమించడం ఏమిటని ఆక్షేపిస్తున్నారు. స్థానికంగా కార్యకర్తలతో, ప్రజలతో సంబంధాలు వున్న నేతలు కాకుండా బయటి వారిని ఇన్‌ఛార్జిలుగా నియమిస్తే ప్రయోజనం ఏమిటని, ఎలా గెలుస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఫండ్, పార్టీ ఫండ్ వస్తే చాలని అనుకుంటున్నారా, లేక ఎన్నికల్లో పార్టీ గట్టెక్కాలని భావిస్తున్నారా, ఎలాగో జగన్ బయటకు వచ్చేది లేదు, గెలిచే అవకాశాలు అంతకన్నా లేవనే ఉద్దేశ్యంతో ఇన్‌ఛార్జిల పోస్టులను అమ్ముకుంటున్నారా అని గుంటూరు జిల్లాకు చెందిన అసంతృప్తి నేతలు పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు తెలుస్తోంది.

వైకాపాలో నమ్ముకుని పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, మద్యం విధానంపై చర్చించేందుకు అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం తన నివాసంలో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. 34 శాతానికి తక్కువగా కాకుండా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మద్యం విధానంపై టీడీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా చూస్తు, ప్రభుత్వం పేదవారి జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబుతో సమావేశమైన అనంతరం టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బుచ్చయ్యచౌదరి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు ఐదు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని చూస్తే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పర్మిట్‌ రూమ్‌లను, బెల్ట్‌షాపులను ఎత్తివేస్తుందని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి పెద్దిరెడ్డి బుచ్చయ్యచౌదరి

ఉత్తరాఖండ్ విలయంలో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం చేపట్టిన సహాయ కార్యక్రమాల వేగం పెంచడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న తమ పార్టీ ఎంపీలు, వైద్య బృందాలతో శనివారం ఆయన నాలుగు గంటలకోసారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్, కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప ప్రస్తుతం ఢిల్లీ, డెహ్రాడూన్‌లలో ఉన్నారు. ఇంకా 150 మంది తెలుగువారి ఆచూకీ దొరకడం లేదని తెలియడంతో.. బదరీనాథ్, జోషీమఠ్ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు జరపాలని ఆయన వారిని కోరారు.

బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పాలని, వైద్య బృందం వారికి అవసరమైన వైద్యం, మందులు ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైతే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని నామా నాగేశ్వరరావును ఆదేశించారు. ఇక.. ఉత్తరాఖండ్ బాధితుల కోసం టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్టు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు మద్దతుగా శనివారం ఆశయ ఫౌండేషన్ తరపున వాసిరెడ్డి ప్రసాదరాజా రూ. 5 లక్షలు అందజేశారు. కూకట్‌పల్లికి చెందిన జాస్తి శ్రీధర్ తమ కుమార్తె అన్విత పేరు మీద రూ. 50 వేలు విరాళం అందచేశారు.

ఖానాపూర్ నియోజకవర్గ పార్టీ నేతలు, సభ్యులు రూ. 1.20 లక్షలు, ఏవీఎం రావు రూ. 50 వేలు, బుక్కా వేణుగోపాల్ రూ.50 వేలు, జి. శివ ప్రసాదరావు రూ.20 వేలు, రామినేని సంయుక్త రూ. 10 వేలు విరాళంగా ఇచ్చారు

టీడీపీ సహాయం ముమ్మరం

స్థానిక ఎన్నికల సమరానికి శ్రేణులను సమాయత్తం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. శనివారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో నిర్వహించిన భేటీలో తీర్మానించినట్లు ముఖ్య నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇ.పెద్దిరెడ్డి విలేకరులకు తెలిపారు. గ్రామ, మండలస్థాయి నేతలను ఈ సదస్సులకు ఆహ్వానించి ఎన్నికలకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తగ్గకుండా చూడాలని, లేకపోతే గట్టిగా పోరాడాలని నేతలకు సూచించినట్లు తెలిపారు

'స్థానికం'పై టీడీపీ సదస్సులు

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగానే అక్కినేని కలిశారని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో చంద్రబాబు చూపిన చొరవ పట్ల అక్కినేని ఆయనను అభినందించారని, చంద్రబాబు ఆయనకు ధన్యవాదాలు చెప్పారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

చంద్రబాబును కలిసిన అక్కినేని

ఉత్తరాఖండ్ చార్‌ధామ్‌లో వరదలు టిడిపి అందించిన సహాయ సహకారాలపై టిడిపి ఏకంగా ఒక వీడియోను రూపొందించిన ప్రచారం చేస్తోంది. ప్రమాదంలో మనుషులు కొట్టుకు పోవడం, ఆలయం వద్ద శవాల గుట్టలు, సైన్యం సహాయం చేయడం, భవనాలు కూలిపోవడం వంటి దృశ్యాలు వివిధ చానల్స్‌లో వచ్చిన వాటిని సేకరించి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అందజేస్తున్న సహాయ కార్యక్రమాలను వీటిలో చేర్చి టిడిపి ఆధ్వర్యంలో వీడియో రూపొందించారు. టిడిపి అధికారిక వెబ్‌సైట్ ద్వారా, ఫేస్‌బుక్‌లో టిడిపి పేజీ ద్వారా దీనిని ప్రచారం చేస్తున్నారు. చార్‌ధామ్‌లో టిడిపి అందజేసిన సేవల వల్ల ప్రజల్లో మంచి సంకేతాలు వెళ్లాయని, కచ్చితంగా ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. కదలిరండి మనుషులైతే అనే పాటను వినిపిస్తూ చార్‌ధామ్ వరద ప్రమాద దృశ్యాలతో వీడియో రూపొందించారు. చంద్రబాబు,లోకేశ్‌తో పాటు పార్టీ నాయకులు అందిస్తున్న సేవలను చూపించారు.

ఉత్తరాఖండ్‌పై టిడిపి వీడియో

ఒకే నెలలో పెట్రోలు రేట్లు రెండు సార్లు విపరీతంగా పెరగడం, రాష్ట్ర మద్యం విధానంలోని వైరుధ్యాలపై తె లుగుదేశం పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు శనివారం నాడు భేటీ అయ్యారు.

త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికలు, పెట్రోల్ ధరల పెంపు, మద్యం పాలసీలపై ఈ భేటీలో వారు చర్చించినట్లు తెలుస్తున్నది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగిస్తున్నారని సీనియర్లు ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.

టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలకు కేంద్రమంత్రి చిరంజీవే కారణమని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ గుండాలపేటలో స్థానికులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అశోక్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనపై విసిగి ప్రజలు టీడీపీకి అధికారాన్ని కోరుకుంటున్న సమయంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి, ఓట్లను చీలిక చేశారని పేర్కొన్నారు.

'పులినిచూసి నక్క వాతలు' పెట్టుకున్నట్టుగా ఎన్టీఆర్‌లా తాను కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుగన్న చిరంజీవి ఎన్నికల్లో పార్టీ బోల్తాపడడంతో దుకాణం మూసేశారని ఎద్దేవా చేశారు. చిరంజీవి తనను నమ్ముకున్నవారిని నట్టేట ముంచి, తాను మాత్రం కేంద్రమంత్రి అయ్యారని అన్నారు. వెండితెరపైగాని, రాజకీయాల్లో గాని రియల్ హీరో ఒక్క ఎన్టీఆరేనని అశోక్ పేర్కొన్నారు.

పేదల కష్టాలకు చిరంజీవే కారణం: అశోక్ గజపతిరాజు

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుకు వృద్దాప్యం పైనబడినా దాదాగిరీ తగ్గలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'ఏదో ఒకటి తగాదా పెట్టుకొని వివాదంలోకి చంద్రబాబును కూడా లాగాలన్న తాపత్రయం విహె చర్యల్లో స్పష్టంగా కనిపించింది. ముందు రోజు ఢిల్లీలోని ఎపి భవన్లో చంద్రబాబును పొగిడాడు. తమ పార్టీవాళ్ళు తిట్టేసరికి డెహ్రాడూన్ విమానాశ్రయంలో చంద్రబాబుతో తగాదా పెట్టుకోవాలని చూశాడు. ఆయన మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా చేశాడు. వయసు పైబడింది. ఓపిక లేకపోయినా దాదాగిరీ చేయాలని తాపత్రయపడుతున్నాడు' అని బోడకుంట్ల విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ పంపిన వైద్య బృందాన్ని ఎపి భవన్ నుంచి రెసిడెంట్ కమిషనర్ బయటకు పంపడం తప్పేనని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని, కాని ఆయనపై చర్యలు మాత్రం ఏవీ తీసుకోవడం లేదని వెంకటేశ్వర్లు అన్నారు. మొత్తం సహాయ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాత్రే కనిపించలేదని, ఏదో కంటి తుడుపుగా బాధితులను పరామర్శించి వచ్చారు తప్ప సహాయ కార్యక్రమాలను పట్టించుకొన్న దాఖలాలు ఏవీ లేవని ఆయన అన్నారు.

విహెచ్‌కు వృద్ధాప్యం పైబడినా దాదాగిరీ తగ్గలేదు: వెంకటేశ్వర్లు

ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆదుకునేందుకు ఎలా చురుకుగా స్పందించాలో ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలకుల కళ్లు తెరిపించేలా ఆచరించి చూపించారు. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లిన తెలుగు వారు ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో చిక్కుకున్నారు. తమను కాపాడి స్వస్థలాలకు తరలించేవారి కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి మొద్దునిద్రలో జోగుతుండడంతో, వరదల్లో చిక్కుకుని ఇబ్బందులెదుర్కొంటున్న యాత్రికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు తరలించేందుకు చంద్రబాబు చూపిన చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్షనేతగా చంద్రబాబు చేసి చూపించారు.

బాధితులను విమానాల్లో సొంత ఖర్చుతో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాలకు తరలించారు. అప్పటి వరకు తాము ఎప్పుడూ ఇళ్లకు చేరుతామో తెలియని యాత్రికులు చంద్రబాబు చూపిన చొరవతో ఒక్కరోజులోనే డెహ్రాడూన్‌ నుండి ఢిల్లీకి చేరుకుని అక్కడి నుండి తమ సొంతూళ్లకు పయనమయ్యారు. విమానాశ్రయాల్లో దిగిన తరువాత వరద బాధిత యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు పార్టీ నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించి చంద్రబాబు తానే అసలు, సిసలైన పాలనాధ్యక్షుడినని మరోసారి నిరూపించుకున్నారు. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లి వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఢిల్లీకి తరలించి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో 167 మందిని నేరుగా హైదరాబాద్‌కు తరలించింది. ప్రభుత్వం చేయలేని పనిని పార్టీపరంగా చంద్రబాబు చేసి చూపించి అందరి మన్నలను పొందారు.

టీడీపీ నాయకత్వం 25వ తేదీన మరో 51 మందిని స్వస్థలాలకు తరలించగా, 26వ తేదీన డెహ్రాడూన్‌ నుండి 140 సీట్ల సామర్ధ్యం కలిగిన స్పెస్‌జెట్‌ విమానాన్ని యాత్రికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసి ప్రభుత్వం విఫలమైన ప్రతి చోటా తామున్నమని యాత్రికులకు భరోసాను కల్పించింది. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లిన వారు భారీ వరదల్లో చిక్కుకున్న తెలిసిన తరువాత మూడు రోజులకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లినా చంద్రబాబు ఆదివారం ఉదయమే నగరానికి చేరుకుని, అదే రోజు సాయంత్రం హుటా, హుటీనా తెలుగు యాత్రికులను పరామర్శించేందుకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో యాత్రికుల కల్పిస్తున్న సౌకర్యాలను చూసి చంద్రబాబు చలించిపోయారు. యాత్రికులకు మైరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ పార్టీ ఎంపీలతో కలిసి ఏపీ భవన్‌ ముందు ధర్నాకు దిగారు.

బాధితులకు కల్పిస్తున్న అరకొర సౌకర్యాలపై ఏపీ భవన్‌ రెసిడెంట్‌ అధికారి శశాంక్‌ గోయల్‌, చంద్రబాబు ఆగ్రహానికి గురికావాల్సివచ్చింది. మైరుగైన సౌకర్యాల కల్పిస్తామని పేర్కొనడంతో బాబు ధర్నా విరమించారు. యాత్రికులను పరామర్శించి వారికీ ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుండి నేరుగా డెహ్రాడూన్‌కు వెళ్లి అక్కడి యాత్రికులను పరామర్శించారు. వారు చెప్పిన బాధలు విని చలించిపోయిన చంద్రబాబు ఎంపీలు రమేష్‌ రాథోడ్‌, కొనకళ్ల నారాయణలను అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. నేరుగా ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌ బహుగుణను కలిసి తెలుగువారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రుషికేష్‌, బద్రీనాథ్‌, హర్షలీ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఆర్మీ క్యాంపుల్లో తలదాచుకున్న తెలుగువారిని ఒక్కచోటకు చేర్చి వారికీ భోజన, వసతి, వైద్య సౌకర్యాలు కల్పించి ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపీలు కృషి చేశారు.

వరదల్లో అన్ని కోల్పోయిన యాత్రికులను ఆదుకునేందుకు చంద్రబాబు ఒక్కొరికీ పది వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. మొత్తం 12 లక్షల రూపాయలను వరద బాధితులకు అందజేసి ప్రభుత్వ సహాయాన్ని వెనక్కి నెట్టారు. ప్రభుత్వ పక్షాన కేవలం రెండు వేల రూపాయల ఆర్ధిక సహాయమందజేయగా, టీడీపీ నాయకత్వం ఐదింతల అధిక సహాయమందజేసి యాత్రికుల మెప్పును పొందింది. దీనితో ప్రభుత్వం మెల్కోని నష్ట నివారణ చర్యల్లో భాగంగా బాధితులకు ఐదేసీ వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ విస్త్రృతస్థాయిలో చేపట్టిన సహాయక చర్యలు ఆ పార్టీ భవిష్యత్తులో రాజకీయంగా ఎంతో మేలు చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 218 రోజులు చేపట్టిన ‘వస్తున్నా...మీకోసం’ పాదయాత్ర ద్వారా కంటే ఛార్‌దామ్‌ యాత్రికులకు చేసిన సహాయక చర్యల ద్వారానే ఎక్కువ ప్రాచూర్యం లభించిందంటున్నారు.

ది లీడర్‌

రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని ఎలా దెబ్బతీయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ర్టంలో ప్రత్యేక తెలంగాణ సమైఖ్యాంధ్ర ఉద్యమాలు బలంగా నడుస్తున్న క్రమంలో రెండు ప్రాంతాల్లో టీడీపీని దెబ్బతీయాలంటే ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలన్న ప్రణాళికతో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. కాగా, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలలో తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో వైకాపాలు బలపడ్డాయన్న ప్రచారం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెట్టినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు స్వతహాగా కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడ్డ వ్యక్తి. అయితే ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకునే ఏ చర్యకు తాము అడ్డుకోబోమని పార్లమెంట్‌లో బిల్లుపెట్టే మద్ధతిస్తామని ప్రకటించడంతో తెలంగాణలో టీడీపీ పట్ల కొంత సానుకూల ధోరణి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలా..లేక సమైక్యంగా ఉంచాలా అన్న అంశాల్లో ఆచితూచి అడుగు వేసేందుకు తర్జన భర్జన పడుతుంది. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ అంశాన్ని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ర్టంలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌లు కాంగ్రెస్‌తో సమానంగా రాజకీయంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌పార్టీ, టీఆర్‌ఎస్ రెండు కూడా తెలుగుదేశం పార్టీతో బద్ధ వైరుధ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌తోకూడా అంతే దూరం ఉన్నా.. టీఆర్‌ఎస్ ఇప్పటికే అనేక సందర్భాలలో ప్రత్యేక తెలంగాణ ఇస్తే.. తమ పార్టీ కాంగ్రెస్‌లో వీలినం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇకపోతే వైసీపీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగానే టీడీపీ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దివంగత నేత రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి కేంద్రంలో కాంగ్రెస్‌లోని అనేక మంది పెద్ద నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వైకాపాలు సీట్లు సంపాదించినా కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలను తమకు అనుకూలంగా మలుచుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం టీడీపీని ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే రాబోయే ఎన్నికలలో టీడీపీనే టార్గెట్‌గా చేసి ఎన్నికల వ్యూహానికి పదునుపెడుతున్నట్లు సమాచారం. తెలుగు దేశం పార్టీ రెండు ప్రాంతాలలో దెబ్బతినేలా ఏ రకమైన వ్యూహంతో ముందుకు పోతే బాగుంటుందో కాంగ్రెస్ కోర్ కమిటీ భావిస్తుంది. అటు సీమాంధ్రలో వైకాపా, తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ రెండు పార్టీలను కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్దగా ఇబ్బంది ఉండదని అందువల్ల ఆ పార్టీ గెలిచినా భవిష్యత్‌లో కాంగ్రెస్‌తోనే జతకట్టే అవకాశాలున్నా యని అందువల్ల టార్గెట్ టీడీపీగా కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని ఎలా దెబ్బతీయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది.

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల అనుభవాలు మాటల్లో చెప్పాలేమని, చార్‌ధామ్‌లో యాత్రికులు నరకం అనుభవించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బాధితులను ఆదుకునేందుకు ఉత్తరాఖండ్ వెళ్ళిన చంద్రబాబు వారిని పరామర్శించారు. వారు అనుభవించిన బాధలను తెలుసుకున్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చాలా భయంకరమైన అనుభవాలు ఎదురైనాయని అన్నారు. బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు..

ఉత్తరాఖండ్‌లో ఒక చోట బాధితులు తిండి నీళ్లు లేక, బాతకాలి కాబట్టి తాము కట్టుకున్న బట్టలతో శవాలు పడిఉన్న నీటిలో తడిపి ఆ నీటినే తాగామని తెలిపారని బాబు అన్నారు. మరో మహిళ తన కళ్లముందే తన కుమార్తె వరదలో కొట్టుకుపోయిందని వాపోయింది. ఆ చలిలో బిక్కుబిక్కుమంటూ ఉందని, కట్టుకోడానికి చీర లేక కేవలం లంగా, జాకెట్టుతో ఉందని, అక్కడ ఒక చోట మంట ఉంటే అటుగగాపోయిన గుర్రం ఆమెను తన్నడంతో మంట పక్కన పడిందని, కనీసం లేవలేని స్థితిలో ఉండగా అటుగా పోయినవాళ్ళు ఆమెను తీసి పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని చంద్రబాబు తెలిపారు. ఆమె ఎవరో తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని చంద్రబాబు తెలిపారు.

మరో పద్మా అనే మహిలా తన కళ్లముందే కుటుంబ సభ్యులు ఐదుగురు వరదలో కొట్టుకుపోతుంటే ఒంటరిగా మిగిలిన ఆమె బాధ వర్ణనాతీతం అని, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఏపీ భవన్‌కు చేరుకున్న బాధితులకు అక్కడి అధికారులు సరైన సదుపాయాలు కల్పించలేదని, కనీసం స్నాన, భోజన వసతులు కూడా కల్పించలేదని చంద్రబాబు నాయుడు ఆదేదన వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్‌లో తెలుగు బాధితుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని, సహాయం అందించడం లేదని తన దృష్టికి రావడంతో ఆ రాష్ట్ర సిఎం విజయ బహుగుణ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయినా ఆయన ఇంటికి వెళ్లి అన్ని విషయాలు వివరించానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తర్వాత టీడీపీ నేతలు రమేష్ రాథోడ్, కొనకళ్ల డెహ్రాడూన్‌లో మకాం వేసి, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి, బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబునాయుడు తెలిపారు.

బాధితుల అనుభవాలు మాటల్లో చెప్పలేం : చంద్రబాబు


హైదరాబాద్ : చార్‌ధామ్ యాత్రికుల అనుభావాలు తనను తీవ్రంగా బాధించాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులు నరకం అనుభవించారని తెలిపారు. వరద బాధితుల విషయంలో ఢిల్లీలో జరిగిన ఘటన తనను చాలా బాధించింది అని చెప్పారు. తెలుగు వారి కోసం ఢిల్లీలో కట్టిందే ఏపీ భవన్ అని గుర్తు చేశారు. వరద బాధితులను ఏపీ భవన్ బయట టెంటు వేసి ఉంచడం దారుణమన్నారు. మానవతా దృక్పథంతోనే వరద బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు పలు బృందాలను ఏర్పాటు చేసి తమ వారిని సురక్షితంగా తీసుకెళ్లాయని తెలిపారు. మన రాష్ట్రం మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాత్రికుల అనుభావాలు బాధించాయి:బాబు

ఛార్‌దామ్‌ యాత్రికులను ఆదుకోవాలన్న ఆలోచన తొలుత కాంగ్రెస్‌ నేతలకు లేదని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించిన తరువాతే వారు మొద్దునిద్ర వీడి హడావుడి చేశారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు అన్నారు. చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. అమెరికా పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న చంద్రబాబు అదే రోజు హుటా, హుటీనా ఢిల్లీకి వెళ్లి బాధితులను పరామర్శించే వరకూ కాంగ్రెస్‌ నేతలు ఏమీ పట్టనట్లు వ్యవహరించారని గుర్తు చేశారు. ఢిల్లీ నుండి నేరుగా డెహ్రాడూన్‌కు వెళ్లి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణను కలిసి తెలుగు యాత్రికులను కాపాడాలని కోరారన్నారు.

సహాయక చర్యలు జరుగుతున్న తీరును ఆయన్ని అడిగి తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తెలుగు యాత్రికుల తరలింపులో జరుగుతున్న వివక్షను విజయ్‌ బహుగుణ దృష్టికి తీసుకువెళ్లి, తెలుగువారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించేందుకు చొరవ చూపించాలని కోరడం జరిగిందన్నారు. ఆర్మీ క్యాంపులలో ఉన్న తెలుగు వారిని ఒక చోటకు చేర్చి వారికీ భోజన, వైద్య, వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని టీడీ జనార్దనరావు తెలిపారు.

మూడు రోజుల పాటు డెహ్రాడూన్‌, రుషికేష్‌లో టీడీపీ ఎంపీలు మకాం వేసి బాధితుల యోగ, క్షేమాలు తెలుసుకుని వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు కృషి చేసిన వారితో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఘర్షణకు దిగడం దారుణమన్నారు. సోనియా మెప్పు కోసమే వీధి పోరాటానికి సిద్ధపడ్డారని విరుచుపడ్డారు. చంద్రబాబు దగ్గరుండి బాధితులను తరలిస్తున్నారని పేర్కొన్న నోటితోనే టీడీపీ నేతలను విమర్శించడం వీహెచ్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు.

బాబు వచ్చే వరకు మీ బుద్ధి ఏమైంది?


నెల్లూరు జిల్లాలో థర్మల్‌ విద్యుత్‌ సంస్థలకు వైఎస్‌, రోశయ్య హయాంలో వేల ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. నవయుగ, మీనాక్షి, కెనాటో, సింహపురి సంస్థలకు ఎకరా భూమి కేవలం 80 వేల రూపాయలు అంతకంటే కారు చౌక ధరకే కేటాయించారన్నారు. అదే సుబ్బారామిరెడ్డికి చెందిన గాయత్రి సంస్థకు మాత్రం ఎకరా భూమి ఎనిమిదిన్నర లక్షల చొప్పున వసూలు చేశారన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ట్రస్టుభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేపీఐఎల్‌కు 4700 ఎకరాల భూమిని వైఎస్‌ హయాంలో నోటి మాటగా కేటాయిస్తే, సాక్షి పత్రిక బుకాయిస్తోందని విమర్శించారు.

రెండు ఎకరాల భూమి కంటే ఎక్కువ కేటాయిం పులకు మంత్రివర్గ అమోదం తప్పనిసరన్నారు. కేపీఐఎల్‌కు కేటా యించిన భూముల్లో నుండి 100 ఎకరాలు తనఖా పెట్టి 800 వందల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారన్నారు. అందులో నుండి 400 కోట్ల రూపాయలు జగన్‌కు ముడు పుల రూపంలో చెల్లించారని ఆరోపించారు. క్విడ్‌ప్రొకో పద్దతి లో హిమూర్జ ప్రాజెక్టు ద్వారా మరో 200 కోట్ల రూపాయల విలువ చేసే వాటాలను వైఎస్‌ భారతికి కేటాయించారన్నారు. లక్ష కోట్ల రూపా యలు దోచుకున్న జగన్‌ కుటుంబం ఉత్తరాఖండ్‌ బాధితులకు ఒక్క రూపాయ సహాయం చేసేందుకు ముందుకు రాలేదని విమర్శించారు.

అప్పనంగా వేల ఎకరాలు కట్టబెట్టారు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చొరవతో డెహ్రాడూన్ నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్‌కు, అక్కడ నుంచి కేశినేని నాని తన ట్రావెల్ బస్సుల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 125 మందిని క్షేమంగా చేర్చారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో బయలు దేరిన బస్సు లో ఎక్కిన యాత్రికులను చంద్రబాబు నాయుడు, కేశినేని నాని అప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరిని పలకరించి, వారికి భోజనాలు ఏర్పాటు చేసి ఆరోగ్యంగా ఉందా అంటూ పలకరించి పంపించడం విశేషం. శుక్రవారం ఉదయం విజయవాడలో దిగిన యాత్రికులు అందరు కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడును, కేశినేని నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.

యాత్రికులకు ఉమా, గద్దె స్వాగతం
విజయవాడకు చెందిన 16 మంది, గుడివాడకు చెందిన 22 మంది, గుంటూరుకు చెందిన ముగ్గురు మొత్తం 41 మంది శుక్రవారం ఉదయం బస్సులో వచ్చారు. వీరికి ఎమ్మెల్యే దేవినేని ఉమా, మాజీ ఎంపీ గద్దె, మాజీ కార్పోరేటర్ ఎరుబోతు రమణ, చెన్నుపాటి గాంధీ, వీరంకి డాంగేకుమార్, రవీంద్ర వర్మ, కొట్టేటి హనుమంతరావు తదితరులు స్వాగతం పలికారు. యాత్రికులు వారి వారి స్వస్థలాలకు చేరేందుకు సహకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రంగమ్మ, సిహెచ్ వెంకటలక్ష్మి, శాఖమూరి రుక్మిణి వచ్చారు. వీరిలో చాలామంది గంగోత్రి వద్ద ఏడురోజులు అన్నపానీయాలు లేకుండా గడిపారు. అక్కడి భయానక సంఘటన మనసును కలిచివేస్తున్నదని చాలా మంది వాపోయారు, శివరావు, సూర్యకుమారి, విజయలక్ష్మి, రత్తమ్మ, మొత్తం విజయవా డకు చెందిన 16 మంది వచ్చారు.

దేవుడల్లే చంద్రబాబు సాయపడ్డారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం మహబూబ్‌నగర్ వెళ్లనున్నారు. జమ్మూ-కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీర జవాన్ యాదయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు.

మహబూబ్‌నగర్ వెళ్లనున్న చంద్రబాబు

 పిల్ల కాంగ్రెస్ నేతలు తమ బ్యానర్లలో ఎన్టీఆర్ ఫోటో పెడితే చెప్పుతో కొట్టండి అని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో 1994 ఫలితాలు పునరావృత్తం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ మరింత జఠిలం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ తన కుమారుడు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు చంచల్‌గూడా జైళ్లో వైఎస్ జగన్ నెంబర్ వన్ గానే ఉన్నారని రేవంత్‌రెడ్డి యెద్దేవా చేశారు.

ఎన్టీఆర్ ఫోటోలు పెడితే చెప్పుతో కొట్టండి : రేవంత్‌రెడ్డి

ఉత్తరాఖండ్‌లో వరద బాధితులకు సహాయసహకారాలు అందజేస్తున్న టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, రమేష్‌రాథోడ్‌తో అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జోష్‌మఠ్‌కు కొనకళ్ల, బద్రీనాథ్‌కు రమేష్‌రాథోడ్ వెళ్లాల్సిందింగా బాబు ఆదేశించారు. అక్కడున్న తెలుగు వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు.

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్