June 23, 2013

శవాల మీద ప్రయోజనం పొందే ఆలోచనతో ఇది రాయటం లేదు. చంద్రబాబుకు బాకా ఊదటానికో ఈ వార్తాంశం రాయటం లేదు. నిజాన్ని నలుగురికి చెప్పటం కోసం.. మనసుకు చేస్తున్న పని న్యాయం అనిపించి మాత్రమే దీన్ని రాస్తున్నా. ఉత్తరాఖండ్ లో జరిగిన ప్రకృతి విలయం మాటల్లో వర్ణించలేనిది. సదూర ప్రాంతం కావటం. రవాణా సదుపాయం సరిగా లేకపోవటం. కమ్యూనికేషన్ వ్యవస్థ పరిమితంగా ఉండటం.. ప్రతికూల వాతావరణం.. ఊహించని ప్రకృతి విపత్తుతో నష్టాన్ని అంచనా వేయటంలో… తీవ్రతను అర్థం చేసుకోవటంలో అటు ప్రభుత్వం నుంచి ఇటు మీడియా వ్యవస్థ సైతం ఘోరంగా విఫలమైంది. ఎంతలా అంటే.. అన్నీ మీడియా హౌస్ లు వార్తల సేకరణ విధానాన్ని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే విషయం ఈ ఉదంతం చాటి చెప్పింది. పేరున్న పెద్ద మీడియా సంస్థలు సైతం మొదట్లో వార్తా ఏజెన్సీలు అందించిన వార్తలతో నెట్టుకొచ్చారే కానీ.. గ్రౌండ్ రియాలిటీని తెలిపే వార్తంశాం అటు దినపత్రికల్లో కానీ.. టీవీల్లో కానీ పెద్దగా రాలేదు. అరకొర వార్తలతో నెట్టుకొచ్చారు. ప్రకృతి ప్రకోపించిన ఎనిమిది, తొమ్మిది రోజుల తర్వాత కానీ తీవ్రత అర్థం కాని పరిస్థితి. సరే.. సీరియస్ నెస్ తెలిసాక.. మన వాళ్ల స్పందన ఏమిటి? ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడి అధికారుల బృందాలను పంపటం. మనవాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకోండని చెప్పటం. చెప్పినంతనే చేస్తే ఇక మన రాష్ట్రం ఎప్పుడో అభివృద్ది పథంలో పయనించేది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి… విద్యాసదస్సుల పేరిట ఊళ్లు.. ఊళ్లు తిరుగుతున్నారు. అంతేకానీ యుద్ధప్రాతిపదికన సహాయకచర్యల కోసం ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టింది లేదు. ఇక.. కేంద్రమంత్రిగా ఉంటూ.. భవిష్యత్తు ఆశాకిరణంగా చెప్పే చిరంజీవి సైతం కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో తలమునకలై ఉన్నారు. ఇక.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి చెప్పాలి. సీమాంధ్రల ప్రయోజనాలు.. వాళ్ల అవసరాలు ఆయనక పట్టవు కాబట్టి వాటని వదిలేద్దాం. మరి.. తెలంగాణ వాళ్ల పరిస్థితి ఏంటి? ఫాంహౌజ్ లో కూర్చోని రాజకీయాలు నడిపే ఆయన.. తర్వలో ఏ ఉద్యమం చేస్తే.. తెలంగాణ వాదం మరింత బలపడుతుంది. సర్వజనుల సమ్మె మళ్లీ చేస్తే ఎలా చేయాలి? అన్న దానిపై చర్చల మీద చర్చలు జరుపుతూ.. వ్యూహాలు పన్నుతున్నారు. మరి.. ఉత్తరాఖండ్ లో తెలంగాణ ప్రాంతీయులు భారీగా చిక్కుకుపోయి ఉన్నారు. మరి వారి సంగతేంటి? తెలంగాణ పౌరుల కోసం ప్రాణమైన ఇచ్చేందుకు సిద్ధమంటూ బహిరంగ సభల్లో ఉదరగొట్టే కేసీఆర్ అండ్ కంపెనీలో ఒక్కరంటే ఒక్కరు కనీసం ఢిల్లీ కూడా పోలేదు. ఇక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి విజయమ్మ తన కూతురు 2500కిలోమీటర్ల నడక పూర్తి చేసి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కూతురుతో పాటు హాజరైంది. అంతే తప్ప.. ఉత్తరాఖండ్ లో తెలుగోళ్ల సంగతే ఆమెకు గుర్తుకు రాలేదు. బీజేపీ కిషన్ రెడ్డి, సీపీఎం రాఘవులు, సీపీఐ నారాయణలు కూడా అంతే వీరెవరికీ పరిస్థితి తీవ్రత అర్థం కాలేదా? లేక అర్థమైనా ఊరుకున్నారా? కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం వీరందరికీ భిన్నంగా వ్యవహరించారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు ఆదివారం సాయంత్రం వచ్చిన ఆయన వెంటనే పార్టీ నేతలతో కలిసి ఈ విషయంపై చర్చించి వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఏపీ భవన్ లో బాధితులతో మాట్లాడారు. అప్పటికి కానీ.. ఏపీ భవన్ అధికారుల అమానుష వైఖరి వెల్లడి కాలేదు. ఈ విషయంలో మీడియాను కూడా తప్పు పట్టాలి. ఢిల్లీలో ఉన్న తెలుగు మీడియా ప్రతినిధులు ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో మన అధికారులు వ్యవహరించిన వైఖరిని వెల్లడి చేయలేదు. బాబు వెళ్లిన తర్వాతే విషయాలు బయటకు వచ్చాయి. కేవలం సాంబారు అన్నం మాత్రమే పెట్టటం.. రూములు ఉన్నా వారికి ఇవ్వకుండా ఉండటం, తిరుగు ట్రైన్ టిక్కెట్లకు డబ్బులు ఇస్తే రిజర్వేషన్ చేసి పెడతామని చెప్పటం లాంటివెన్నో. ఈ విషయాలు తెలుసుకున్న చంద్రబాబు విపరీతమైన ఆవేశానికి గురై.. అక్కడికక్కడ ఏపీ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. సర్వపోగొట్టుకొని కట్టుబట్టలతో ఏపీ భవన్ కు చేరుకున్న వారి విషయంలో ఇలా వ్యవహరించకూడదంటూ నిప్పులు చెరిగారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించాక… అధికారులు దిగి వచ్చి.. క్షమాపణలు చెప్పి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. ఏపీ భవన్ రెసిడెంట్ అధికారి ఉత్తరాదికి చెందిన వారు. ఒక తెలుగువాడికి తెలుగోడి బాధలు అర్థమవుతాయ. కానీ.. పేరుకు ఏపీ భవన్ అయినా పెత్తనం చేసే అధికారం ఒక ఉత్తరాది వ్యక్తి కావటంతో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏపీ భవన్ అంటే.. తెలుగు ప్రజల సొమ్ముతో కట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేయటంతో పాటు.. బాధితులకు ఆర్థిక సాయం, తన వెంటన బసవతారకం ఆసుపత్రి వైద్యులను, మందులను తీసుకెళ్లారు. అమెరికా నుంచి వచ్చి… కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పక్కా ప్లానింగ్ తో వ్యవహరించి… తెలుగువారు పడుతున్న బాధలపై పోరాడిన బాబు కృషిని ఢిల్లీలోని బాధితులు ఎప్పటికీ మర్చిపోలేరు. తెలుగు ప్రజల సమస్యలను తీర్చేందుకే తాము బతికి ఉన్నట్లు మాటలు చెప్పే ఏ నేతా చేయలేని పనిని బాబు చేశారని చెప్పాలి. మరోసారి అసలైన నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు. మరి.. తెలుగు ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకుంటారా?

రుజువైంది.. బాబే అసలైన ప్రజానాయకుడు

చార్‌థామ్‌ యాత్రకు వెళ్లి వదరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ చీఫ్‌చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అమెరికా నుంచి ఆదివారం ఆయన తిరిగొచ్చారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. యాత్రికులను ఢిల్లీ నుంచి స్వస్థలాలకు తరలించేందుకు చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఉన్న వరదబాధితులను ఆయన పరామర్శించనున్నారు. చార్‌థామ్‌యాత్రకు 12 వేల మంది వెళ్లి ఉంటారని అంచనా అని, రాష్ట్ర వాసులు వందల్లో గల్లంతైనట్టు సమాచారం అందుతోందని ఆయనచప్పారు. ఇప్పటివరకు అధికారికంగా ఎంతమంది మృతి చెందారో తెలియడం లేదని చెప్పారు. జాతీయ విపత్తు వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వాసులు 5వేల మంది చిక్కుకున్నారంటే, రెవెన్యూ మంత్రి ఇక్కడి నుంచి కదల్లేదని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్‌లో రక్షించిన వారిని స్వస్థలాలకు విమానాల్లో తరలివచ్చు కదా ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న రాష్ట్ర బాధితుల సమస్యలపై ప్రధానికి లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వండి : బాబు

నటుడు ఆలీని రాజకీయాల్లోకి రమ్మని పిలవలేదని ప్రముఖ నటుడు, టీడీపీ నేత అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ ఆలీని రాజకీయాల్లోకిగానీ, తెలుగుదేశం పార్టీలోకి గాని రమ్మని ఆహ్వానించలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన టిడిపిలో చేరుతున్నారనే వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని చెప్పారు.
చందాలతో తాము రాజమండ్రి వంతెన కూల్చివేతను ఆపుతామని చెప్పారు. కాగా ఇటీవల అలీ తెలుగుదేశం, లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని వారం క్రితం అలీ కొట్టి పారేశారు. అలీ రాజకీయ ఆరంగేట్రంపై ఇటీవల మాట్లాడారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని అలీ స్పష్టం
చేశారు.

ఆలీని రాజకీయాల్లోకి రమ్మని పిలవలేదు : మురళీమోహన్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిజాం నవాబులా, ఆయన తనయుడు, సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఖాసీం రజ్వీలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. తెరాస తెలంగాణ ఉద్యమం అనే తులసి వనంలో ఓ గంజాయి మొక్క అని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడితే, వాటిని టిడిపి దృష్టికి తీసుకు వస్తే తాము బాధితులకు అండగా ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు వ్యాపారంగా మార్చి వేశారని ఆరోపించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తాను మాత్రం ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉద్యమం అంటున్నారని టిడిపి ఎంపీ రమేష్ రాథోడ్ విమర్శించారు.

కెసిఆర్ నిజాం, కెటిఆర్ రజ్వీ: రేవంత్

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి వైద్యబృందం ఒకటి ఆదివారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌కు బయల్దేరింది. చార్‌థామ్‌ యాత్రలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికిసేవలందించడానికి ఈ బృందం వెళుతోంది. టీడీపీ ప్రజా ప్రతినిధులు తమ నెల వేతనాన్ని ఉత్తరాఖండ్‌ సీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తారని ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు ప్రకటించారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి డెహ్రాడూన్‌ బయల్దేరిన వైద్యబృందం


హైదరాబాద్, జూన్ 23 : ఉత్తర కాశీ యాత్రకు వెళ్ళి, అక్కడ కురిసిన భారీ వర్షాలకు చిక్కుకున్న యాత్రికులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉత్తరాంఖండ్ వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్రం ఢిల్లీ బయలుదేరి వెళతారు అక్కడ ఏపీ భవన్‌లో సహాయం పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ బయలుదేరి వెళతారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏపీ రెసిడెంట్ కమిషనర్‌తో చంద్రబాబు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆదివారం ఉదయం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇంత విపత్తు ఎప్పుడు జరగలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. వారం రోజులుగా యాత్రికులు తిండి తిప్పలు లేక, స్వస్థలానికి చేరుకుంటామోలేదోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులకు సరైన సహాయం అందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు..

ఉత్తరాఖండ్‌లో ఆర్మీ సేవలు అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మందులతో సహా డాక్టర్స్‌ను ఉత్తరాఖండ్‌కు పంపిస్తున్నట్లు చెప్పారు. వరదల్లో మృతి చెందినవారికి సంతాపం తెలుపుతూ, వారికి కుటుంబాలకు చంద్రబాబు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

చంద్రబాబు ఉత్తరాఖండ్ పర్యటన