June 22, 2013

పదవి వ్యామోహంతో తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసిన కడియం శ్రీహరి దళిత ద్రోహి అని తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దొమ్మాటి సాంబయ్య ధ్వజమెత్తారు. శనివారం హన్మకొండలోని ఆయన స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంబయ్య మాట్లాడారు. తాను దొంగ బిపామ్‌తో పోటీ చేశానని కడియం శ్రీహరి వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

చంద్రబాబు స్వయంగా జారీ చేసిన బిఫామ్‌తోనే పోటీ చేశానని వివరణ ఇచ్చారు. తనకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కడియం అవకాశాలు కల్పించాడని ప్రకటనలు చేయడం అవాస్తవమని పార్టీలో ఏ ఒక్క దళితుడిని ఆయన ఎదుగనివ్వలేదని ఆరోపించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు దళితుల్లో ఉపకులమైన బైండ్ల కులస్తుడైన కడియంకు పలు అవకాశాలు కల్పిస్తే అధినేత నమ్మకాన్ని వమ్ముచేస్తూ పార్టీని వీడటమేకాకుండా అదే పార్టీపై విమర్శలు చేయడం క్షమించరాని విషయమని దుయ్యబట్టారు. జిల్లా టీడీపీలో ఏ ఒక్క దళితుడికి అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని తనకు 1998 ఎన్నికల్లో పరకాల టికెట్ రాకపోవడానికి కడియమే కారణమని ఆరోపించారు.

కడియం దళిత ద్రోహి: దొమ్మాటి సాంబయ్య

ఇప్పటివరకూ టీడీపీ-కాంగ్రెస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుంటున్నాయంటూ విమర్శిస్తోన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ పార్టీలు ఇప్పుడు కుడితిలో పడ్డాయి. శాసనసభ చివరి రోజు సందర్భంగా టీఆర్‌ఎస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు బహిరంగంగా అందరిముందూ చేసుకున్న స్లిప్పుల మార్పిడి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అవుతోంది. ఇద్దరూ ఒకరినొకరు సహకరించుకున్న వైనాన్ని సద్వినియోగం చేసుకునేం దుకు ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. శాసనసభ లాబీల వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ మార్చుకున్న స్లిప్పుల వ్యవహారం ఆ రెండు పార్టీలనూ ఇరుకున పెట్టేలా మారింది. దీనిని తెలు గుదేశం పార్టీ బ్రహ్మాస్త్రం చేసుకుని, అటు సీమాంధ్ర-ఇటు తెలంగాణలోనూ ఆరెండు పార్టీల మధ్య జరుగుతున్న ఒప్పందాలను బహిర్గం చేసేందుకు సిద్ధమవుతోంది.

టీఆర్‌ఎస్‌ యువనేత, కేసీఆర్‌ తనయుడయిన కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శాసనసభ, బయట అస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. సీమాంధ్ర కాంట్రాక్టర్లు, బిల్డర్లతో కేటీఆర్‌ చేశారని వస్తున్న సెటిల్‌మెంట్‌ ఆరోపణ లను టీడీపీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఆ సందర్భంగా పొట్టచేత పట్టుకుని వచ్చిన బుడ్డిపేట బుల్లొడి కుటుం బానికి ఇన్ని కోట్ల ఆస్తులెక్కడివని, తెలంగాణను అడు ్డపెట్టుకుని, త్యాగధునుల ఆత్మబలిదానాలను అడు ్డపెట్టుకుని రానున్న ఎన్నికల్లో వందసీట్లు-లక్షకోట్ల లక్ష్యంతో కేసీఆర్‌ కుటుంబం ప్రజలను మోసం చేస్తోం దంటూ మోత్కుపల్లి, రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. దీనితో ఇరుకున పడిన టీఆర్‌ఎస్‌ చంద్రబాబు ఆస్తులపై ఎదురుదాడి చేసింది.ఆ సందర్భంగా లాబీల్లో జరిగిన ఒక సంఘటన వైఎస్సార్‌ కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ను ప్రజల ముందు ముద్దా యిలా నిలబెట్టేలా చేసింది. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సిబ్బంది ఒకరు ఆయన చే తికి చంద్రబాబునాయుడుపై ఏమి మాట్లాడాలన్న దానికి సంబంధించి ఒక పేపర్‌ ఇచ్చారు.

ఆ అంశాలపై మీడియా పాయింట్‌లో మాట్లాడా లని దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కేటీఆర్‌ను కూడా కలసి, ఏమి మాట్లాడారో చెప్పారు. తర్వాత మీడియా పాయింట్‌కు వెళ్లిన ఈటెల అదే పేపర్‌లో బాబుకు సంబంధించిన ఆరోపణలన్నీ ఏకరువు పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే టీవీ రామారావు, సుమన్‌రాథోడ్‌ తప్పు చేసినా ఎందుకు సస్పెండ్‌ చేయలేదని, శోభా హైమావతి దొంగ సర్టిఫికెట్‌తో ఎమ్మెల్యే అయినా ఎందుకు చర్యలు తీసు కోలేదని ప్రశ్నించారు. ఇవన్నీ వైఎస్సార్‌ సీపీ శాసనస భాపక్షం నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఆ తర్వాత కేటీఆర్‌ కూడా తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, ఆ ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఐఎంజీకు సంబంధించి బాబుపై ఉన్న ఆరోపణలను ధర్మాన వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఇస్తే, సభలో వైకాపా దానిపైనే మాట్లాడిందంటూ టీడీపీ నేతలు మీడియా సమావేశంలో ఆరోపించారు. తాజా వ్యవహారం అటు టీఆర్‌ఎస్‌, ఇటు వైకాపాకు ఇరకాటంగా మారనుంది.

రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించు కుంటున్న వైనాన్ని రాష్ర్ట వ్యాప్తంగా ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. రెండు పార్టీలు స్లిప్పులు మార్చుకున్న వైనాన్ని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం ద్వారా రెండు పార్టీలను ఆత్మరక్షణలో పడవేయడంతో పాటు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను, సీమాంధ్రలో వైకాపాను ఒకేసారి దెబ్బతీయాలన్న వ్యూహంతో వెళుతున్నాయి. తెలంగాణను వ్యతిరేకిస్తున్న వైకాపాతో టీఆర్‌ఎస్‌ ఎన్నికల పొత్తు పెట్టుకోబోతోందనడానికి ఇదే నిదర్శనమని తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేయనుంది. రాష్ట్రాన్ని విభ జించాలని కోరుతూ, సీమాంధ్రులను బెదిరిస్తోన్న టీఆర్‌ఎస్‌తో వైకాపా ఎన్ని కల పొత్తు పెట్టుకోబోతోందని, అందులో భాగంగానే శాసనసభలో ఒకరికొకరు సహకరించుకున్నారని ప్రచారం చేయనుంది.

ఈ వ్యవహారం రెండు పార్టీలనూ ఆత్మరక్షణలో పడవేశాయని ఆయా పార్టీ నేతల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ నేతలు ఈ పరిణా మాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో తెలివి ఉన్న నాయకులు ఎంతో మంది ఉండగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి మేధోసాయం తీసుకోవలసిన అవస రం ఏమిటని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో ప్రత్యర్ధులు బలపడుతున్న సమయంలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలన్న దానిపై కేసీఆర్‌ సీరియస్‌గా దృష్టి సారిస్తున్న సమయంలో.. తెలంగాణకు బద్ధ వ్యతిరే కిగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌తో సంబం ధాలేమిటని, ఈ విషయం ప్రజల్లోకి వెళితే పార్టీ ఎలా తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్‌ నేతలు మల్లగుల్లాలు పడుతు న్నారు.అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.

పరకాల ఎన్నికల్లో తమ పార్టీని ఓడించి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ ఓట మికి కారణమయిన టీఆర్‌ఎస్‌తో సంబంధాలున్నాయని, రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీచేస్తాయన్న టీడీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మితే.. పార్టీ పరువు, భవిష్యత్తు ఏమి కావాలని వైకాపా సీనియర్లు ఆందోళన చెందు తున్నారు. జగన్‌ రైలుపై రాళ్లు వేసిన టీఆర్‌ఎస్‌తో సంబంధాలున్నాయని సీమాంధ్ర వైకాపా కార్యకర్తలు భావిస్తే, అది పార్టీకే ప్రమాదమని వ్యాఖ్యా నిస్తున్నారు. ‘ఒకవైపు జగన్‌ జైల్లో ఉన్నారు. మరోవైపు పాపం విజయమ్మ నానా కష్టాలు పడి పార్టీ కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతినకుండా శ్రమిస్తున్నారు. ఇంకోవైపు షర్మిలమ్మ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, ఎండా వానా లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తుంటే వీళ్లు సొంత తెలివితేటలతో పార్టీని ఈవిధంగా రోడ్డునపడేస్తున్నారు. ఇక పార్టీని బాగుచేసేదెవరు? అయినా ఇలాంటి విషయాలపై పార్టీలో ముందుగా చర్చించకుండా, సొంత నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఇక పార్టీని కాపాడేదెవర’ని ఓ సీనియర్‌ నేత వాపోయారు.

మీదే రాజకీయ అక్రమ సంబంధం: కోడెల
శాసనసభలో వైఎస్సార్‌ సీపీ- టీఆర్‌ఎస్‌ తమ పార్టీపై ఆరోపణలు చేసేందుకు ఒకరికొకరు స్లిప్పులు పంచుకున్న వైనం రాజకీయ అక్రమ సంబంధానికి పరాకాష్ఠ అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ పైకి ఒకరిపై మరొకరు విమర్శించుకున్న ఈ రెండు పార్టీల నిజస్వరూపం బయటపడిందని, దీనిని ప్రజలు గమనించి నిలదీయాలని పిలుపునిచ్చారు. కొత్తగా కళ్లు తెరిచిన వైఎస్సార్‌ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకునే దుస్థితికి టీఆర్‌ఎస్‌ దిగజారిందంటే ఆ పార్టీ దయనీయం ఆ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చన్నారు.కాంగ్రెస్‌-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుంటున్నాయంటున్న టీఆర్‌ఎస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజకీయ అక్రమ సంబంధాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఆ రెండు పార్టీలకు తమను విమర్శించే నైతిక హక్కు, అర్హత లేదని కోడెల స్పష్టం చేశారు.a

ములాఖత్‌ ముప్పేనా?

వృత్తి విద్యా కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహణ తేదీలను తక్షణమే తేదీలు ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విదార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటించాలి : టీడీపీ

'ధనయఙ్ఞంగా మారిన జలయఙ్ఞంపై తెలుగుదేశం పార్టీ మొదటినుంచీ చెబుతున్నదే కాగ్ కూడా బయటపెట్టింది. టీడీపీ చెప్పేవి నిజాలేనని రుజువైంది. కరప్షన్ కింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిపై మేం వేసిన పుస్తకంలోని అంశాలు వాస్తవాలేనని సీబీఐ విచారణలో రుజువవుతోంది. ఇక ఇప్పటిదాకా సీబీఐని, కోర్టులను నిందించిన సాక్షి మీడియా, వైసీపీ నేతలు ప్రస్తుతం కాగ్‌ను కూడా నిందించడం హేయం' అని టీడీపీ శాసనమండలిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ అవినీతిని బయటపెట్టిన వ్యవస్థల నైతికతనే దెబ్బతీయడంద్వారా ప్రజలో అపోహలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తోందని యనమల ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

'కాగ్'నూ టార్గెట్ చేస్తారా ? : యనమల

చిన్న చిన్న నగరాలు గ్రేటర్‌గా రూపాంతరాలు చెందుతుంటే.. రాష్ట్రంలోనే ఒక వ్యాపార కేంద్రగా గుర్తింపు పొందిన విజయవాడ స్థాయిని పెంచకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతోపాలు పలువురు నాయకులు అడ్డుకుంటున్నారు. గ్రేటర్ ప్రతిపాదనలు పంపకపోతే ప్రజలే మీ సంగతీ చూస్తారంటూ టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

  రాజకీయ మనుగడ కోసమే విజయవాడ గ్రేటర్ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రేటర్ హోదా కోసం తలపెట్టిన మహాధర్నా ఉదయం 10 గంటల నుంచిమధ్యాహ్నం రెండు గంటల వరకూ సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అర్భన్ అధ్యక్షుడు నాగుల్ మీరా అధ్యక్షత వహించారు. కేశినేని నాని మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందన్నారు. స్థానిక ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి నగరాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కన్నా ఈ నేతలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. నగర శ్రేయస్సు కోసం టీడీపీ ప్రజాస్వామ్యయతుంగా ఆందోళనలు చేస్తుంటే కేసులు పెడుతున్నారన్నారు. దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణం కోసంఆందోళన చేస్తుంటే ఎనిమిది బనాయించారు. బెంజ్‌సర్కిల్ వద్ద ప్లైఓవర్ నిర్మాణం చేపట్టాలంటూ కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గు చేటు. అధికారంలో ఉండి పనులు చేయించలేక ధర్నాలు చేయడం చరిత్రలో ఎక్కడా లేదు.

వారు దద్దమ్మలు దేవినేని ఉమా, జిల్లా అధ్యక్షులు
విజయవాడ నగర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్, ముగ్గురు ఎమ్మెల్యేలు కళ్ళు తెరిపించడానికే ధర్నా నిర్వహించామని టీడీపీ జిల్లా అధ్యక్షడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్లైఓవర్ నిర్మాణాలకు, గ్రేటర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తుంది లగడపాటి సమాధానం చెప్పాలన్నారు. 1982లో నగరం 60 స్క్వేర్ కిలో మీటర్ల పరిధిలో ఉందని, 2013లో కూడా అదే పరిధిలోనే ఉంది. గ్రేటర్ ప్రతిపాదనలు పంపకుండా తొక్కిపెట్టిన కార్పొరేషన్ అధికారులను 2014లో వచ్చే తమ ప్రభుత్వ హయాంలో చెంచల్‌గూడా జైలుకు పంపడం ఖాయమన్నారు.

పంచాయతీ స్థాయికి దిగజార్చారు గద్దె రామ్మోహన్, తూర్పు ఇన్‌చార్జి
మాజీ ఎంపీ, తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జి గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చిన్న నగరాలైన రాజమండ్రి, గుంటూరు శరవేగంతో అభివృద్ధిని చెందుతుంటే విజయవాడ మాత్రమే పంచాయతీ స్థాయికి దిగజారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు విసిగిపోయారు బొండా ఉమా, సెంట్రల్ ఇన్‌చార్జి
కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని సెంట్రల్ ఇన్‌చార్జి బొండా ఉమా అన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం.. విజయవాడ గ్రేటర్ కావ డం తథ్యం. ముఖ్యమంత్రిగా తొలిరోజే చంద్రబాబు గ్రేటర్ ఫైల్‌పై సంతకం చేస్తారన్నారు.

ఆరు నెలల తరువాత మాజీగా లగడపాటి నాగుల్‌మీరా, అర్బన్ అధ్యక్షుడు

రెండు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన లగడపాటి రాజగోపాల్ ప్రజలకు చేసింది ఏమి లేదని అర్బన్ అధ్యక్షుడు నాగుల్ మీరా అన్నారు మరో ఆరు నెలల్లో ప్రజలు లగడపాటిని మాజీని చేస్తారన్నారు. ప్రతి ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, ఆ తరువాత ప్రజలను మోసం చేయడం లగడపాటికి అలవాటుగా మారిందన్నారు.

అభివృద్ధి నిరోధకులు కమ్యూనిస్టులు బుద్దా వెంకన్న, పశ్చిమ ఇన్‌చార్జి

నగరాభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కమ్యూనిస్టు నాయకులు విమర్శించడం సిగ్గుచేటని పశ్చిమ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు. అభివృద్ధి జరగలేని ఒక పక్క ఉద్యమాలు చేస్తు న్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా మాట్లాడటం దారుణమన్నారు. వీరి ప్రవర్తన వల్ల ప్రభుత్వ అసమర్థత కప్పి పుచ్చుకునే అవకాశం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా గ్రేటర్, ప్లైఓవర్ల్ నిర్మాణాల కోసం టీడీపీ చేస్తున్న ఉద్యమాలకు కలిసి రావాలన్నారు.

మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, మాజీ ఉడా ఛైర్మన్ తూమాటి ప్రేమ్‌నాథ్, తెలుగుయువత నాయకుడు దేవినేని చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్లు గోగుల రమణ, ఎరుబో తు రమణ, చెన్నుపాటి గాంధీ, వీరంకి డాంగే, నాగేంద్రరెడ్డి తదితరుల పాల్గొన్నారు


విజయవాడ గ్రేటర్‌కు అడ్డుపడితే ఖబడ్దార్

విజయవాడకు గ్రేటర్ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం టీడీపీ నేతలు మహాధర్నా నిర్వహించారు. జిల్లాలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళనకు దిగారు. విజయవాడకు గ్రేటర్ హోదా కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విజయవాడలో టీడీపీ మహాధర్నా

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం పథకం ఓ బూటకమని కాగ్ తేల్చిందని, వైఎస్ పాపాలను బట్టబయలు చేసిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జలయజ్ఞం అవినీతిపై సీఎం కిరణ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

జలయజ్ఞం బూటకమని కాగ్ తేల్చింది : ధూళిపాళ్ల

ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో వచ్చిన సెటిల్‌మెంట్ కథనాలతో టీఆర్ఎస్ నేత కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని, ఏం మాట్లాడాలో తెలియక వైసీపీ రాసిచ్చిన స్లిప్‌లు తీసుకుని మాట్లాడుతున్నారని టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు మగతం ఉంటే తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోరాలని సవాల్ చేశారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జగన్, సీఎం కిరణ్ , కేసీఆర్ రాష్ట్రాన్ని భ్ర ష్టు పట్టించారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి : రాజేంద్రప్రసాద్

నగరాన్ని గ్రేటర్ సిటీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టిడిపి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... విజయవాడను గ్రేటర్ సిటీగా మారుస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకూ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నగర అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గ్రేటర్ సిటీ అయితే.. కేంద్ర ప్రభుత్వ నిధులు అందుతాయని, తద్వారా మురికివాడల అభివృద్ధి, ట్రాఫిక్ వంటి సమస్యల నివారణకు ఆస్కారం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల నిర్లక్ష్యం వల్లే విజయవాడ గ్రేటర్ సిటీ కాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

విజయవాడను గ్రేటర్ సిటీగా ప్రకటించాలి: టిడిపి