June 21, 2013


మొన్న స్పాట్ ఫిక్సింగ్ లో దుబాయ్ కి పారిపోయిన మంథని ఇంఛార్జ్ షకీల్ , ఇప్పుడు నాలుగు నెలలుగా జైలు లో మగ్గుతున్న జుబ్లీహిల్స్ ఇంఛార్జ్ సతీష్ రెడ్డి ఇంకా ఇప్పటికీ తెరాసలో నాయకులే .. కనీసం సస్పెండ్ కూడా చెయ్యలేదు. దందాలు, సెటిల్ మెంట్లతో సంబంధం లేనప్పుడు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని రేవంత్ ప్రశ్నించారు.

తెరాస తెరచాటు వసూళ్లతో సంబంధం లేదన్నది నిజమైతే.. సీబీఐ విచారణకోరాలి గానీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తుల విచారణకు సిద్దమేనా అని సవాలు విసరడమేంటని.. రేవంత్ ఎద్దవా చేశాడు.

వసూళ్లతో సంబంధం లేదన్నది నిజమైతే.. సీబీఐ విచారణకోరాలి!

శాసనసభను నిర్వహించడంలో సభాపతి నాదెండ్ల మనోహర్‌ తీవ్ర వైఫల్యం చెందారని టీడీపీ సీనియర్‌ శాసనసభ్యుడు మోత్కుపల్లి విమర్శించారు. స్పీకర్‌ అసమర్ధుడు, చేతగాని చేవలేని వాడు.. చచ్చు వెధవ అంటూ మోత్కుపల్లి తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ కండువాను వేసుకుని ఆధికార పార్టీకి కొమ్ముకాసేలా సభాపతి వ్యవహరించారని ధ్వజమెత్తారు. తాము ఎంతో మందిని చూశామని, మరీ ఇంత అసమర్ధుణ్ణి ఇప్పుడే చూస్తున్నామని మోత్కుపల్లి మండిపడ్డారు. శాసనసభ విలువలు గౌరవాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఇలాగేనా వ్యహరించాల్సింది? ప్రతిపక్షాల పట్ల ఇంత నిర్లక్ష్యమా? సభాపతికి తాము లేఖ రాసినా ఆయన స్పందించక పోతే తాము ఇక ఎవరికి చెప్పుకోవాలి? అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను సభాపతి నిరవధికంగా వాయిదా వేసుకువెళ్లారని, ప్రజా సమస్యలను తాము చర్చకు ఎక్కడ పెట్టాలని మోత్కుపల్లి నిలదీశారు.

ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు
రాష్ర్త బడ్జెట్‌ రూ.లక్షా 62 వేల కోట్లతో రూపొందించారని అదంతా ప్రజల సొమ్ము అని అలాంటి ఖర్చుపై ప్రభుత్వం జవాబుదారీతనం లేకుండా వ్యవహరించి ందని జేపీ మండిపడ్డారు. సంఖ్యాబలం ఉంది కదా అని తమకు తామే బిల్లు పాస్‌ చేసుకొని వెళ్లి పోవడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఒక కుటుంబాని కొచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చుచేయాలో కుటుంబ సభ్యులంతా చర్చిస్తారని అలాంటిది ఎనిమిది కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్‌ ఖర్చుపై చర్చ లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంత అసమర్థ స్పీకర్‌ను చూడలేదు

సభలో చర్చకు సహకరిస్తామన్నా సభను సజావుగా జరుగకుండా చేస్తున్నారని, సభలో మంత్రులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోందని యెద్దేవా చేశారు. జలయజ్ఞంలో లోపాలను కాగ్ బయటపెట్టిందని, కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన వైనాన్ని తప్పుబట్టిందని మరో నేత దేవినేని ఉమా అన్నారు. జలయజ్ఞంపై సీఎం కిరణ్, వైఎస్ అవినీతిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో ఎవరి కాళ్లు ఎవరు పట్టుకుంటారో అని, తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ బుద్ది చెబుతుందని దేవినేని ఉమా వెల్లడించారు

ప్రజాసమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోంది : ధూళిపాళ్ల

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీలో ఎందుకు రాద్దాంతం చేయడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. సభ ప్రారంభం కాగానే తెలంగాణ కోసం పట్టుపట్టి తర్వాత పట్టువీడి మౌనంగా కూర్చున్నారని ఆయన విమర్శించారు. దమ్మున్న చానల్ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే. తారక రామారావు సెటిల్‌మెంట్ దందాపై కథనం రావడంతో టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సాధన లక్ష్యంగా కాకుండా కెటిఆర్‌ను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణపై తీర్మానం అంటూ నిన్నటి వరకు రాద్దాంతం చేసి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా కూర్చున్నారని మోత్కుపల్లి ప్రశ్నించారు. కెటిఆర్ కోసం తెలంగాణవాదాన్ని పక్కన పెట్టారన్నారు. సభను ఇప్పుడు అడ్డుకోకపోవడం వెనుక కారణమదేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల్లా కూర్చున్నారన్నారు.

కెసిఆర్ కుటుంబం మరో నిజాంను తలపిస్తోందన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు మరోసారి బయటపడిందన్నారు. ఆంధ్రజ్యోతి కథనం సెగ తగలడం వల్లే మౌనంగా కూర్చున్నారన్నారు. ఉదయం అంతా గొడవ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తీర్మానంపై మాట్లాడటం లేదన్నారు. చరిత్రలో ఏ ఉద్యమకారుడు అయినా ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారని, కెసిఆర్ మాత్రం ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఉద్యమం పేరుతో డబ్బులు దండుకున్న చరిత్ర కెసిఆర్‌కే దక్కిందన్నారు. కెసిఆర్ తన ఆస్తులపై సిబిఐ విచారణ కోసం లేఖ రాయాలన్నారు.

కేటీఆర్ కోసం తెలంగాణ వాదాన్ని పక్కనపెట్టిన టీఆర్ఎస్:మోత్కుపల్లి


హైదరాబాద్ : అసెంబ్లీలోని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయం ఎదుటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. ప్రజా సమస్యలపై చర్చించాలని పట్టుబడితే పారిపోతారా అంటూ అధికారపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేల బైఠాయింపు

తెలంగాణ ఉద్యమం ముసుగులో తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నారని, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ పట్ల కాపలా కుక్కల్లా కాదు..గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల శవాల మీద పునాదులు నిర్మించుకున్నారని ఆరోపించారు. భూవివాదంలో కేటీఆర్ భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వానికి ఎందుకు సహకరించారన్నారు.

ఈ వ్యవహరంలో భువనేశ్వర్ జైల్లో సతీష్‌రెడ్డి ఉన్నమాట నిజం కాదా, కిడ్నాప్‌పై శ్రీనివాస్‌రావు కుమార్తెల ఆరోపణలు నిజం కాదా?, సతీష్‌రెడ్డిని పట్టించుకోవడం లేదని అతని సోదరులు చెప్పిన మాట నిజం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. సెటిల్‌మెంట్ వ్యవహారంలో భాగస్వామ్యం లేకపోతే సతీష్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు. కేటీఆర్‌పై కేసు వస్తుందనే భయంతోనే అసెంబ్లీలో నిన్న టీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

తమ అసలు రంగును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై ఎదురుదాడికి దిగిందని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టే ప్రజలు మిమ్మల్ని భరిస్తున్నారని, లేకపోతే తరిమికొట్టేవారన్నారు. తమ మీడియా సంస్థలో వ్యాపార ప్రకటనలన్నీ సీమాంధ్ర సంస్థలవే అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉద్యమం ముసుగులో దోచుకుంటున్నారు : రేవంత్ రెడ్డి


తెలుగుదేశం, టిఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణల పర్వం ప్రభావం జిల్లాలలో పార్టీ శ్రేణులపై కూడా పడుతోంది.టిఆర్ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలకు నిరసనగా సిరిసిల్లలో టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో వీరికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఆందోళనకు దిగగా,ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవలసి వచ్చింది. పద్నాలుగుమంది టిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టిడిపి, టిఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

పీఏసీ చైర్మన్ కేఈ కృష్ణమూర్తి నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోక్యంతో పీఏసీ చైర్మన్ నియామకంపై టీడీపీలో నెలకొన్న వివాదానికి తెరపడింది. పీఏసీ చైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి నియమిస్తున్నట్లు బాబు ప్రకటించారు. ఈ మేరకు అమెరికా నుంచి స్పీకర్‌కు బాబు లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేఖను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందజేశారు. ఇప్పటి వరకు పీఏసీ చైర్మన్‌గా ఉన్న రేవూరి పదవీకాలం ముగియడంతో కేఈని చైర్మన్‌గా నియమించారు.

పీఏసీ చైర్మన్‌గా కేఈ కృష్ణమూర్తి


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు తెలంగాణకు కాపలు కుక్కలు కాదని, గుంట నక్కలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఐఎంజి కేసులో క్లీన్ చిట్ వచ్చిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. బాబుకు ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే వారు పదేపదే వారు తమ పార్టీ అధినేత పైన అనవసర ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఉద్యమం ముసుగులో తెలంగాణ ప్రజలను తెరాస నాయకులు దోచుకుంటున్నారని, విద్యార్థుల శవాల మీద పునాదులు నిర్మించుకుంటున్నారని, భూవివాదంలో కెటిఆర్ భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టే ప్రజలు వారిని భరిస్తున్నారని లేదంటే తరిమికొట్టేవారన్నారు. తెరాస మీడియా సంస్థలో వ్యాపార ప్రకటనలు అన్నీ సీమాంధ్ర సంస్థలవే అన్నారు.

కుక్కలు కాదు గుంటనక్కలు: రేవంత్