June 19, 2013

మేం ప్రసారం చేసిన కథనానికి కట్టుబడి ఉన్నామని, అన్ని ఆధారాలతోనే ప్రసారం చేశామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేర్కొంది. టీఆర్ఎస్ శాసనసభ్యుడు కె. తారక రామారావు చేసిన సవాల్‌పై ఏబీఎన్ స్పందించింది. కేటీఆర్ రేపు (గురువారం) సాయంత్రం వరకు ఆగాల్సిన అవసరం లేదని, ఈరోజే (బుధవారం) పరువు నష్టం దావా వేసుకోవచ్చునని, భయపడేది ఏమీ లేదని దమ్మున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పష్టం చేసింది.

అన్ని ఆధారాలతోనే కథనాలు ప్రసారం : ఏబీఎన్


\\ టీడీపీ అధినేతపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలు అసమంజసమని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆ పార్టీ శాసనసభ్యులు డి.నరేంద్ర చౌదరి, సండ్ర వెంకటవీరయ్యలు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ వై.ఎస్‌. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్ర బాబును లక్ష్యంగా ఎంచుకుని కేసులుబనాయింప జేశారని, ిసీబీఐని ఉసిగొలిపారని అన్నారు. ఐఎంజి భూములకు సంబంధించి వై.ఎస్‌.విజయమ్మ వేసిన పిటిషన్‌ ను కూడా కొట్టివేయడం జరిగిందన్నారు. వై.ఎస్‌ ప్రభుత్వం బాబు కేటాయిం చిన కొన్ని భూములను స్శాధీనం చేసుకోవడం కూడా జరిగిందని, మరికొన్ని కో ర్టు వివాదాలలో వున్నాయన్నారు. తమ నేతపై కక్షసాధింపు చర్యలకు పాల్పడి విజయం సాధించలేక పోయారని, అలాంటిది తాజాగా వైఎస్సార్‌సిిపి నాయ కులు తమ నేతపై నిందలు మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్‌ సిపి, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని,, ఆ రెండు పార్టీలను కలిపేం దుకే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌సింగ్‌ వస్తున్నారని అన్నారు. తమ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

వైఎస్సార్‌పీసీ కాంగ్రెస్‌ కుమ్మక్కు


వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు త్వరలోనే విలీనమవుతాయని దూళిపాళ్ల నరేంద్ర జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీల పనితీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. జంట కాంగ్రెస్‌లు కుమ్మక్కై అసెంబ్లీ లోపల వెలుపల పనిచేస్తున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ అసెంబ్లీ వద్ద విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఐఎంజి భూ కేటాయింపులపై పదేళ్ల తర్వాత డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏమి చేశారని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశ, దశ లేకుండా నడుస్తోందని, ఆ పార్టీ వచ్చే ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో కలవడం తథ్యమని అన్నారు.

వైకాపా, కాంగ్రెస్ విలీనం ఖాయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే.చంద్రశేఖరరావు కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేస్తున్న భూకబ్జాలు, సెటిల్ మెంట్లను నిరసిస్తూ గురువారం నగరంలోని గన్ పార్క్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రసంగిస్తూ... తెలంగాణ ప్రజలను రాజకీయ నేతలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలి


హైదరాబాద్ : టీడీపీ శాసన సభ్యులు ఇవాళ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును కలిసారు. ఉద్దేశపూర్వకంగానే సభను వాయిదా వేస్తున్నారని వారు మంత్రి తెలిపారు. మరోసారి సభను వాయిదా వేస్తే బిల్లులను అడ్డుకుంటామని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

శ్రీధర్‌బాబు ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు


  విచక్షణా రహితంగా పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు గన్‌పార్క్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అడ్డగోలుగా పెంచిన ఇంధన సర్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా వారు సేకరించిన కోటికి పైగా సంతకాలను ప్రదర్శించారు. అనంతరం ఆ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఇప్పటికే 31వేల కోట్ల రూపాయలను ముక్కు పిండి వసూలు చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌ మరో 11వేల కోట్ల భారాన్ని మోపేందుకు పథకాలు సిద్ధం చేసిందన్నారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏలుబడిలో సర్వ రంగాల్లో రాష్ట్రం భ్రష్టు పట్టిందన్నారు. అందుకు సాక్ష్యం రాష్ట్రం ఎదుర్కొంటున్న భయంకర విద్యుత్‌ కొరతేనన్నారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతిపై తమ పార్టీ నిరంతర పోరు సల్పుతుందన్నారు. ఇంకా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవినేని ఉమా మహేశ్వరరావు, ధూళిపాళ నరేంద్ర తదితరులు మాట్లాడారు.

కోటి సంతకాలు స్పీకర్‌కు సమర్పించిన తెదేపా

రాష్ట్రంలో ఏర్పడిన తీవ్రమైన విద్యుత్‌ సమస్యపై వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలతో కూడిన ప్రతులను మంగళవారం శాసనసభలో డిప్యూటి స్పీకర్‌ మల్లు భట్టివిక్రమార్కకు తెదేపా సమర్పించింది. ఈ సంతకాల ప్రతులను గవర్నర్‌కు పంపించాలని విజ్ఞప్తిచేసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం తర్వాత రావుల చంద్రశేఖరరెడ్డి సంతకాల ప్రతుల అందించే విషయం ప్రస్తావించారు. విద్యుత్‌ కోతపై శ్వేతపత్రం ప్రకటించాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశామని, కానీ, ప్రకటించలేదని, అందుకే బ్లాక్‌ పేపర్‌ సమర్పిస్తున్నామని అన్నారు.

ప్రసంగాలు వద్దని సంతకాల ప్రతులను వెంటనే తనకు ఇవ్వాలని రావులను డిప్యూటి స్పీకర్‌ కోరారు. ఈ సందర్భంగా సంతకాల ప్రతుల కట్టలను, డబ్బాలను తెదేపా సభ్యులు మోసుకుని స్పీకర్‌ పోడియంపై పెట్టారు. అందుకు డిప్యూటి స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సరైన పద్దతి కాదని, స్పీకర్‌ స్థానాన్ని అగౌరపర్చవద్దని హెచ్చరించారు. శాసనసభ సిబ్బంది వచ్చి వాటిని తీసుకుని ఒక మూలనపెట్టారు.

గన్‌పార్క్‌ వద్ద దేశం ధర్నా


టిడిపి వ్యాఖ్యలపై కలకలం
వాగ్యుద్ధానికి దిగిన కాంగ్రెస్‌
'నోరుమూసుకు కూర్చోండి' : ముఖ్యమంత్రి
మంత్రులు తప్పు చేయలేదంటూ వెనుకేసుకొచ్చిన కిరణ్‌
కాంగ్రెస్‌ది రెండు నాల్కల ధోరణి : పయ్యావుల

హైదరాబాద్‌ (వి.వి): 'కళంకిత మంత్రులు' అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై మంగళవారం శాసనసభలో దుమారం చెలరేగింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం సభ్యులు తరచుగా కళంకిత మంత్రులంటూ వారిని బర్తరఫ్‌ చేయాలని చేస్తున్న డిమాండ్‌పై అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాన్ని తెలియ జేశారు.ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.మంత్రి కన్నా లక్ష్మినారాయణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివరణ ఇస్తుండ గా దేశం సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్ళి 'కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలి', 'ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం..దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం' అన్న నినాదాలతో సభ హోరెత్తిపోయింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ అంశంపై సభలో గొడవ జరిగింది. దీంతో, సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ మల్లుభట్టి విక్రమార్క సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి జోక్యం చేసుకొని సభాపతి అనుమతిస్తే కళంకిత మంత్రుల అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలే కాదు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభ కోణాలు, కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న అంశం, అప్పుడు తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చిందో అన్నిటిపై చర్చించటానికి సిద్ధంగా ఉన్నామని కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కేసులన్ని కోర్టులో ఉన్నాయని, సభలో వాటి గురించి చర్చిస్తే కోర్టులను ప్రభావితం చేసే విధంగా ఉంటుందన్న కారణంతో వాటి గురించి చర్చించకుండా తాము సహనాన్ని పాటిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఒక కేసులో దర్యాప్తు జరుగు తున్నదని, ఈ దర్యాప్తు కోర్టులో జరిగేటప్పుడు దాని గురించి శాసనసభలో మాట్లాడటం కాదు ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. మంత్రి వర్గంలో మంత్రు లు సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నారని, వారు తీసుకున్న నిర్ణయాలు రూల్స్‌ చట్టం, పద్ధతి, రాజ్యాం గానికి వ్యతిరేకంగా తీసుకున్నారని ఎక్కడా రుజువు కాలేదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. మంత్రులు కొన్ని సమిష్టిగా, మరికొన్ని సొంతంగా తీసుకున్న నిర్ణయాల అంశాల్లో కొన్నిటిపై ఛార్జిషీట్‌ వేయగా కొన్నిట్లో వేయలేదని, ముఖ్యమంత్రి మాట్లాడు తుండగానే దేశం సభ్యులు నినాదాలు చేయడంతో 'మీరు నోరుమూసుకొని కూర్చోండి, ఓపిక ఉండాలని' అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిబిఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న మంత్రు లు కాంగ్రెస్‌ సిద్ధాంతాలను గౌరవిస్తూ కేంద్ర నాయకుల కోరిక మేరకు నైతిక బాధ్యత వహించి మంత్రి పదవులకు రాజీనామాలు చేసినట్లు చెప్పారు. వారు విలువలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేశారంటే పొరపాటు చేసినట్లు భావించటం భావ్యం కాదని కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజీనామా

చేసినవారు పొరపాటు

చేయలేదని, అది కోర్టులో రుజువు అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక మిగతా, ముగ్గురు మంత్రుల గురించి ఛార్జిషీటులో ఎక్కడావారి పేరులేదని, కేవలం వివరాలను సేకరించడానికే వారిని సిబిఐ పిలిపించుకుందని చెప్పారు. కావాలంటే సిబిఐకి వెళ్లి చెప్పుకోండి. ఇతరులపై వేలెత్తి చూపేముందు తెలుగుదేశం హయాంలో ఎన్ని కేసులున్నాయో, ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో, కోర్టుల్లో ఎన్నికేసులు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న మంత్రులపై సిబిఐ ఒక్క ఆరోపణ కూడా చేయలేదని, కోర్టుల్లో రుజువు కానివ్వండి, ఇటువంటి కేసులపై సభలో మాట్లాడడం మంచిది కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడి కూర్చున్న వెంటనే దేశం సభ్యులు పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ సభ ఏ పరిస్థితుల్లో వాయిదా పడింది. తెలుగుదేశంపై అనరాని మాటలంటున్నారు, వాస్తవానికి కళంకితుల పదం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తుందని, పార్లమెంటులో ఇటీవల గుజరాత్‌, కర్నాటకలో కళంకిత మంత్రులను బహిష్కరిస్తామని అక్కడ కాంగ్రెస్‌ పార్టీయే ఈ సాంప్రదాయానికి తెరలేపిందని, ఇక్కడ మాత్రం వారి గురించి అలా మాట్లాడరాదని ద్వంద్వ నీతికి పాల్పడుతోందని ఆరోపించారు.చరిత్రలో కళంకితులంటే మచ్చపడినవారని, అయితే చార్జిషీటులో పేరుందంటే మంత్రులు దోషులని అనడం లేదని, కానీ, సిబిఐ వారిపై '420 కేసులు' పెట్టిందన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ప్రభుత్వం సహకరించటం లేదని కోర్టు ముందు సిబిఐ మొరపెట్టుకుందని, ఈ విషయాన్ని గమనిస్తే ముఖ్యమంత్రి ''దొంగల బండికి'' సారధ్యం వహి స్తున్నారని కేశవ్‌ ఆరోపించారు. ఇదిలాఉండగా, మంత్రి కన్నా లక్ష్మి నారాయణ వివరణ ఇస్తూ సిబిఐ దర్యాప్తులో తన పాత్ర ఏమి లేదని, అసలు తనకు సంబంధమే లేదని అన్నారు. గతంలో చంద్రబాబునాయుడు వందల కోట్లు ముడుపులు తీసుకొని రాంఖీ సంస్థకు రెండువేలపై చిలుకు ఎకరాలను కట్టబెట్టారని, ఆ ఫార్మా సిటీలో గ్రీన్‌బెల్టు తగ్గించారని కొంత మంది స్వార్థపరులు కలిసి తనపై అభియోగం మోపుతున్నారని, 1986 నుంచి కూడా ఈ గాలిపోగు నాపై కొనసాగుతుందని అసలు టిడిపి దొంగల పార్టీ అని చెప్పడానికి చరిత్ర మొత్తం చదువుతా అని మంత్రి కన్నా ఫైల్‌ చూపిస్తూ అన్నారు. అసలు జిఒ ఎంఎస్‌ 12తో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాంఖీ స్థలాన్ని తన కొడుకు చాలా కాలం తర్వాత వ్యాపార భాగస్వామ్యంతో కొనుకున్నారని తెలియజేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ ఈ అంశంపై చర్చించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చకు అనుమతించకపోతే కేశవ్‌ మాటలను రికార్డు ల్లోంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అసలు తాము అవినీతుపరులమని ఎవరు చెప్పారని, సిబిఐ అన్నదా అని ఎదురు ప్రశ్న వేస్తూ కేసుపై వివరణ ఇచ్చారు. వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో ఉండిఉంటే ఈ అంశంపై చర్చకు అంగీకరించే వారు కాదని, ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా విశ్వవిద్యాలయం భూమిని కొన్ని గంటల వ్యవధిలో ఎలా కేటాయించారో, అందుకోసం ఎన్ని ప్రాథమిక తప్పులు చేశారో తెలుస్తుందని అప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్న అశోక్‌ గజపతి రాజు ఎలా వ్యవహ రించారన్నడానికి బాబు చేసిన కేటాయింపులు కూడా సిబిఐ దర్యాప్తులో ఉన్నాయని అన్నారు. ధర్మాన ప్రసాదరావు మాటాలను కూడా దేశం సభ్యులు అడ్డుకుంటూ నినాదాలు చేశారు.ఈ దశలో ఉత్తరఖాండ్‌ బాధితులపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ఉపసభాపతి పలుమార్లు విజ్ఞప్తి చేసిన ప్రతిపక్ష సభ్యులు ఏమాత్రం పట్టించుకోకుండా నినాదాలు చేస్తూనే ఉన్నారు. చివరికి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.దానిపె,ౖ కేవలం సభ దృష్టిని మళ్లించడానికే ఇప్పుడు బాధితులపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తున్నారని, దేశం సభ్యులు గాలి ముద్దు కృష్ణమ నాయుడు విమర్శించారు. గడచిన మూడు రోజులుగా టివిలు, పత్రికల్లో సమాచారం వస్తుందని, ప్రభుత్వం మాత్రం ఇప్పుడు నిద్రలేచిందని గాలి మద్దుకృష్ణమ నాయుడు ఎద్దేవా చేశారు.ఈ దశలో మరోసారి మంత్రి కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ దేశం సభ్యులు 'చదువున్న అజ్ఞా నులని' విమర్శించారు. దేశం సభ్యులు గొడవ సాగిస్తుండగా ఉపసభాపతి సభను సాయంత్రానికి వాయిదా వేశారు. అంతకుముందు ప్రశ్నోత్తరాల అనంతరం 'టి' విరామం తర్వాత సభ తిరిగి సమావేశమైంది. సభ సమావేశమైన వెంటనే సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ను ఉద్దేశించి సభను మీరే బాగా నడిపిస్తున్నారని అంటూ దేశం సభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అభినం దించారు. ఆ వెంటనే మంత్రి కన్నా లక్ష్మినారాయణ లేచి మాట్లాడుతూ అవకాశం దొరికినప్పుడుల్లా దేశం సభ్యులు సభాపతి స్థానాన్ని అగౌరవపరుస్తూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అంటుండగానే మరో పక్క దేశం సభ్యులు నినాదాలు మొదలుపెట్టగా ఆ గొడవ ఇంత చర్చకు దారి తీసింది.

దొంగలబండి కళంకిత మంత్రులపై అసెంబ్లీలో దుమారం


హైదరాబాద్: కాకతీయ ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర సర్కారు తీరని వివక్ష ప్రదర్శించడంపై మంగళవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ఉత్సవాల నిర్వహణ, నిధుల మంజూరులో తీవ్ర వివక్షపై ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లాకు చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట ప్రభుత్వం రూ.25 కోట్లు ఖర్చు చేసింది. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేసిందో కూడా తెలియదు. కానీ, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కాకతీయ ఉత్సవాలకు మాత్రం రూ.కోటి మాత్రమే కేటాయించింది. అందుకే ప్రాంతీయ అసమానతలు తలెత్తుతున్నాయి. ఓ వైపు ప్రజలు విడిపోదాం అంటున్నారు. ముఖ్యమంత్రి సైతం వారిని రెచ్చగొట్టే విధంగా ‘ఒక్క పైసా ఇవ్వను, ఏం చేస్కుంటారో చేసుకోండి’ అంటూ మాట్లాడడం దురదృష్టకరం’ అని గాలి పేర్కొన్నారు.

కాకతీయ ఉత్సవాల నిర్వహణ వివరాలపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్ సభ్యుడు సీ ముత్యండ్డి అడిగిన ప్రశ్నపై జరిగిన చర్చ సందర్భంగా ముద్దుకృష్ణమ మాట్లాడారు. కాకతీయ ఉత్సవాల నిర్వహణ కోసం కనీసం రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అభ్యంతరం చెప్పారు. ‘ఉత్సవాల ప్రారంభ కార్యక్షికమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి చిరంజీవి వరంగల్ వస్తే.. తెలంగాణ ఉద్యమకారులు కనీసం మాట్లాడనీయలేదు. ఆయనను మాట్లాడనిస్తే మరిన్ని నిధులు కేటాయించే వారేమో’ అని చెప్పుకొచ్చారు. పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ స్పందిస్తూ.. కాకతీయ ఉత్సవాల కోసం రూ.9.86 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించామని, ముందుగా రూ.కోటి విడుదల చేశామని చెప్పారు.

ఉత్సవాలపైనా వివక్షేనా? తెలుగు మహాసభలకు రూ.25 కోట్లు.. .. కాకతీయ ఉత్సవాలకు కోటి రూపాయలా?: టీడీపీ

హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను అసెంబ్లీకి తీసుకువచ్చి టీడీపీ హల్‌చల్ చేసింది. మంగళవారం టీడీపీ ఎమ్మెల్యేలు సంతకాలున్న డబ్బాలతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కోటి సంతకాలతో కూడిన వినతిపవూతాన్ని గవర్నర్ పంపించాలని పట్టుబట్టారు. సంతకాల డబ్బాలను సభలోకి తీసుకురావడం సరైంది కాదని, కేవలం వినతిపవూతమే సమర్పించాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్షికమార్క కోరినా వినిపించుకోలేదు. దీంతో స్పెషల్ మెన్షన్ కింద వినతిపవూతాలను సమర్పించేందుకు సభ్యులకు డిప్యూటీ స్పీకర్ అవకాశమిచ్చారు. అంతకుముందు విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు గన్‌పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. కరెంటు కోతలు, ధరల పెంపుదలకు నిరసనగా జిల్లాల వారిగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను ప్రదర్శించారు. అనంతరం వాటిని ఎమ్మెల్యేలు నెత్తిన ఎత్తుకుని తీసుకొచ్చి అసెంబ్లీలో స్పీకర్‌కు అందజేశారు. లోక్‌సత్తా పార్టీ ఎమ్మెల్యే జయవూపకాశ్ టీడీపీ ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలిపారు.

కోటి సంతకాలతో టీడీపీ హల్‌చల్