June 17, 2013

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. ఇవాళ ఉదయం వారు గన్‌పార్కు వద్ద ధర్నా చేపట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంక్షోభంపై జిల్లాల వారీగా చేపట్టిన కోటి సంతకాలను వారు ఈ సందర్భంగా ప్రదర్శించారు.

విద్యుత్ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా

సభాధ్యక్షుడి స్థానాన్ని తాము ఎప్పుడూ అగౌరవ పరచబోమని టీడీపీ సీనియర్ సభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. కళంకిత మంత్రులతో నడుస్తున్న కిరణ్ ప్రభుత్వం స్పీకర్ స్థానాన్ని అడ్డుపెట్టుకొని పారిపోవాలని చూస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు. కుక్క, తోక అంటూ ఆనం మాట్లాడితే స్పీకర్ అడ్డుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశామే తప్ప సభాధ్యక్షుడి స్థానంపై గౌరవం ఉందన్నారు. దోచుకున్న వాళ్లకు సహకరించిన మంత్రులను కళంకితులనకుండా ఇంకేమంటామని ప్రశ్నించారు.
ప్రభుత్వం నుంచి వారిని బయటకు పంపేదాకా వారు పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాబోమని చెప్పారు. తెలుగుదేశం పార్టీపై అనవసరమైన నిందలు వేస్తే అది వారికే చుట్టుకుంటుందని కాంగ్రెస్‌ను తుమ్మల హెచ్చరించారు. వెంటనే మంత్రి ఆనం స్పందిస్తూ తనను ఎదుర్కొనేందుకు తుమ్మలను టీడీపీ ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.
'సభా నాయకుడు సభలో లేరు, ప్రతిపక్షనేత ఎక్కడో ఉన్నారు... దోచుకున్నవాళ్లతో కలిసి మాపై అవిశ్వాసం పెట్టిన టీడీపీవారు మమ్మల్నే తప్పుపడుతున్నారు' అని ఆరోపించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి (సభానాయకుడు) సభలోనే ఉండటంతో 'అటుచూడు ఆనం, సభా నాయకుడెవరో నీకు తెలీలేదు' అంటూ టీడీపీ సభ్యులు సీఎం వైపు చేయి చూపారు

కళంకితులను వదలం: తుమ్మల

ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు డిమాండ్‌ చేస్తూ గన్‌పార్క్‌ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేశారు. తక్షణమే ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరంద్ర డిమాండ్‌ చేశారు.

ఏపీపీఎస్సీ అక్రమాలపై టీడీపీ ధర్నా

కళంకిత మంత్రులను ముందుపెట్టి ప్రభుత్వం శిఖండిలా వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ మంత్రుల సంతకాల వల్లే జగన్‌ లక్ష కోట్లు సంపాదించాడని ఆయన విమర్శించారు. సీఎం కిరణ్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు.

శిఖండిలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం:రేవంత్‌

తెలంగాణ రాష్ట్ర సమితి డ్రామా కంపెనీగా తయారైందని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే ఎర్రెబల్లి దయాకరరావు ధ్వజమెత్తారు.ఆ పార్టీకి తెలంగాణ రావాలని లేదని, నిజంగా ఆ చిత్తశుద్ది ఉంటే ఆ పార్టీ అదినేత కెసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటారా అని ప్రశ్నించారు. కెసిఆర్ వెళ్లి పార్లమెంటులో ఎందుకు ధర్నా చేయరని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ కూడా టిఆర్ఎస్ డ్రామాకు పరోక్షంగా సహకరిస్తున్నదని, తెలంగాణ రాకుండా ఎవరు అడ్డుపడుతున్నది చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణపై స్పష్టంగానే ఉన్నా,లేనిపోని విమర్శలు చేస్తున్నారని,ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ సమస్య పరిష్కారానికి ఎందుకు చొరవ చూపరని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్,టిఆర్ఎస్ కుమ్మక్కైనందువల్లనే సభ జరగడం లేదని ఆయన ఆరోపించారు.

టిఆర్ఎస్ డ్రామా కంపెనీగా మారింది:ఎర్రెబల్లి

కళంకిత మంత్రులను ముందుపెట్టి ప్రభుత్వం శిఖండిలా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ మంత్రుల సంతకాల వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు సంపాదించారన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేసిన ఆరోపణలనే మంత్రి గీతా రెడ్డి చేశారన్నారు. గీతా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలనుకుంటే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. అది తమకు సంబంధించిన విషయం కాదన్నారు. కాంగ్రెసు ఎంపీలు పార్టీలు మారుతుంటే గీతా రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

మంత్రుల వల్లే లక్ష కోట్లు: రేవంత్


ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలని టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవాసులు ప్రమాదంలో చిక్కుకుంటే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు

చిరుపై దేవినేని ఫైర్

తెలంగాణ కోసం లక్షలాది మంది ఉద్యమిస్తూ పోలీసులతో లాఠీదెబ్బలు తింటూ.. రోడ్డెక్కి అరెస్టు అవుతుంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని ప్రకటనలు గుప్పిస్తున్నారని టీడీ పీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి దొమ్మటి సాంబయ్య ఆరోపించారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా పరకాల ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకుని సత్యహరిశ్చంద్రుని వలె నీతివ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌ను నమ్ముతారని, టీడీపీని విశ్వసించరని పేర్కొంటున్నాడని, ఇటీవలె పార్టీ మారిన కడియం శ్రీహరి బలి చక్రవర్తి వలె కేసీఆర్‌ను పొగుడుతూ..చంద్రబాబును తిట్టడం అలవాటు చేసుకున్నాడని విమర్శించారు. ప్రజలు కడియం శ్రీహరిని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆయన ముఖం చూసి గెలిపించలేదని, చంద్రబాబు, ఎన్‌టీఆర్‌ల ముఖం చూసి ఓట్లేశారనే విషయాన్ని కడియం మరిచిపోయారని అన్నారు. లెక్చరర్‌గా డొక్కు స్కూటర్‌పై తిరిగే కడియం శ్రీహరికి అన్నం పెట్టిన టీడీపీని విమర్శిస్తూ పదవీ వ్యామోహంతో పార్టీ మారారని ఆరోపించారు. నిజంగా శ్రీహరికి తెలంగాణ రావాలనే చిత్తశుద్ధి ఉంటే రాబోయే ఎన్నికల్లో ఏ పదవులకు పోటీ చేయనని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

టీడీపీలో ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంతోనే పదవి కోసం పార్టీ మారిన కడియం తనకు పదవులంటే వ్యామోహం లేదని పేర్కొనడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఒంటెద్దు పోకడలతో తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీస్తున్న కేసీఆర్‌కు దిమ్మతిరిగే తీర్పు ప్రజలు ఇవ్వనున్నారని సాంబయ్య పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌ను తరిమికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం: దొమ్మటి సాంబయ్య