June 9, 2013

అక్రమాల్లో కూరుకుపోయిన ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కవిూషన్ వ్యవహారాల్లో అక్రమాలపై చర్చించేందుకు అనుమతినివ్వాలని టిడిపి ప్రయత్నంచేయగా సిఎంకార్యాలయం నిరాకరించడంతో ఈరోజు పెద్దఎత్తున ముట్ట డించాలని నిర్ణయించారు. దీంతో ప్రశాంతంగానే టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యాంప్ కార్యాల యంకు చేరుకున్నారు. సిఎంఅపాయింట్ మెంట్ లేకపోవడంతో గేటుబయటే నిలువరించారు పోలీసులు. ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గేటు వద్ద భైఠాయించారు. అక్రమాలకు పాల్పడుతున్న సభ్యులు ప్రధానంగా సీతారామరాజుపై క్రిమినల్ కేసులు నమోదుచేసి సభ్యత్వాన్ని రద్దుచేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తోపులాటలు జరిగాయి. అరెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలుతీసుకోకుండా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వంతపాడుతోందని టిడిపి ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈరోజు అనుమతివ్వకుండా తప్పించుకున్నా అసెంబ్లీలో ప్రబుత్వ దమననీతిని ఎండగడుతామని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. ఈసందర్బంగా అనంతపూర్‌కు చెందిన పరిటాల సునీత విూడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేలేక ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా దౌర్బాగ్యంగా వ్యవహరిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే అడిగినా కూడా టక్కున అపాయింట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని, ఇది ప్రజాస్వామ్యంలో అసలైన నిర్వచనమన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కనీస జ్ఞానం లేని వారు చేసేదే ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమన్నారు. ఎపిపిఎస్సీ సమస్యతోపాటు అనంతపూర్ జిల్లాలోని పలు సమస్యలపై చర్చిద్దామనుకున్నా కూడా సిఎం లోపలికి కూడా రానీయకుండా గేటు బయటే నిలిపివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేక నియంతృత్వ పాలనలో కొనసాగుతున్నామా అని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.

టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన


అసెంబ్లీలో పట్టుబడతామని నేతల ప్రకటన ఎమ్మెల్యేల భేటీలో చంద్రబాబు సమీక్ష
ఆరోపణలున్న మంత్రులందరి బర్తరఫ్ కోసం సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ మలి విడత బడ్జెట్ సమావేశాలలో పట్టుబడతామని టీడీపీ ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. జీవోల అంశంలో సుప్రీంకోర్టు కేసులో ఉన్న ముగ్గురు మంత్రులతో పాటు శైలజానాథ్, రఘువీరారెడ్డి, పార్థసారథి, శ్రీధర్‌బాబుల బర్తరఫ్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే విత్తనాలు, కరెంట్ కోతల వంటి సమస్యలపై 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి జవాబు కోరతామన్నారు.

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం మోత్కుపల్లి, కేశవ్ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రితో పాటు శాసనసభా వ్యవహారాల మంత్రి, సభాపతిని కోరుతున్నట్టు చెప్పారు. ఏపీపీఎస్సీ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని, అక్రమార్కులకు సీఎం అండగా ఉంటున్నారని ఆరోపించారు. సభ రెండో రోజు బయ్యారం గనుల అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలని, కరెంట్ సమస్యపై పార్టీ సేకరించిన సంతకాల వివరాలను మూడవ రోజు సభలోనే ప్రభుత్వానికి సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యేల అరెస్టు

ఏపీపీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, సభ్యులను తొలగించి బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద బైఠాయించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. ఎర్రబెల్లి దయాకరరావు, పయ్యావుల కేశవ్, మోత్కుపల్లి నర్సింహులు, పరిటాల సునీత అసెంబ్లీలోని టీడీఎల్పీ నుంచి ర్యాలీగా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు సిద్ధపడగానే వారిని పోలీసులు అరెస్టు చేశారు. గోషామహల్ పోలీసుస్టేషన్‌కు తరలించి కాసేపటికి వదిలేశారు.

నేడు గన్‌పార్కు వద్ద ధర్నా: మలి విడత బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం చంద్రబాబు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గన్‌పార్కు వద్ద ధర్నా చేయనున్నారు.

టీడీపీ ‘టార్గెట్ మంత్రులు’! ఆరోపణలున్న వారి బర్తరఫ్ కోసం పట్టు


‘నీకు మానవత్వం ఉంటే ఆత్మవిమర్శ చేసుకుని టీడీపీ మద్దతుగా రా.. కలసి తెలంగాణ తెద్దాం’అంటూ టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత మోత్కుపల్లి నర్శింహులు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును కోరారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో కలసి ఆయన ఆదివారం ఎన్టీఆర్‌భవన్ లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులు, వ్యాపారుల నుంచి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఎంతెంత వసూళ్లు చేశారో,ఆలిస్టు తన దగ్గర ఉందని మోత్కుపల్లి చెప్పారు. ఏదో ఒకరోజు దానిని బయటపెడతానన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలసి కేసీఆర్ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఇద్దరూ తోడుదొంగలని ఆరోపించారు. డబ్బుల కోసం కొంతమందిని పార్టీలో చేర్చుకుంటున్నారని, ఆదివారం పార్టీలో చేరిన విశ్వేశ్వరరెడ్డి నుంచి, టీడీపీ నుంచి ఆ పార్టీలో చేరిన మర్రి జనార్దన్‌రెడ్డి నుంచి కేసీఆర్ ఎన్నికోట్లు తీసుకున్నారో..నంటూ అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఆనాడు నిజాంను తరమినట్టే వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ను తరుముతారని చెప్పారు. వందసీట్లు వస్తాయని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు వచ్చేఎన్నికలో పది,ఇరవై సీట్లు కూడా రావని మోత్కుపల్లి అన్నారు.

కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకో: మోత్కుపల్లి

హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ వార్డులో సేవలు అందిచడం లేదంటూ నన్నపనేని పేర్కొన్నారు. మెదడు సంబంధిత వ్యాధితో కోమాలోకి వెళ్లిన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు మాత్రం పట్టించుకోవడం లేదని నన్నపనేని ఆరోపించారు.

నిమ్స్‌లో నన్నపనేని రాజకుమారి ఆందోళన

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై గన్‌పార్క్ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొంది. కళంకిత మంత్రులను తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు

గన్‌పార్క్ వద్ద టీడీపీ ఆందోళన


హైదరాబాద్ : ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసిందని టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. శాసనసభలో సరైన చర్చ జరపకుండా ప్రభుత్వం పారిపోతుందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. స్పీకర్ అధికార పక్షానికి వంత పాడుతూ వాయిదా మంత్రాన్ని ఎంచుకున్నారని గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు.

ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు: ఎమ్మెల్యే గాలి


మన బాలయ్యకు హృ దయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ...

రెండు దశాబ్దాలుగా ఏంచేశావ్‌
తెరాస పార్టీకి కన్వీనర్‌లా
వ్యవహరిస్తున్నావ్‌
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు
వ్యతిరేకం కానేకాదు: ఎర్రబెల్లి
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరాం తొత్తుగా మారి, ఆయన చెప్పిందే వేదంగా నడుచుకుంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర ఆరోపణ చేశారు. ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి కాంగ్రెస్‌, టీడీపీ, వైకాపాకు చెందిన తెలంగాణ నేతలను పిలవమని కోదండరాం చెప్పారని, తమను పిలువనప్పుడు తమ గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. కోదండరాం జేఏసీ కన్వీనర్‌గా కాకుండా తెరాస కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తమ నిర్ధిష్ట విధానాన్ని ప్రకటించలేదని, కాంగ్రెస్‌ అధినాయకత్వంపై ఒత్తిడి తేలేకపోయిందని, అయితే టీడీపీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్త పరుస్తూ లేఖ రాసిందని, మహానాడులో తీర్మానం కూడా ప్రవేశపెట్టామని తెలంగాణ కోసం తమ పార్టీ పక్షాన చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న కేసీఆర్‌తో కోదండరాం ఎందుకు అంటకాగుతున్నారని విమర్శించారు. ఈయన చర్యలవల్ల గద్దర్‌, విమల, కృష్ణమాదిగ లాంటి వారు జెెఏసీ నుండి వైదొలిగారని తెలిపారు. బిజేపి కూడా విధిలేని స్థితిలో జెెఏసీతో కలిసి ఉందన్నారు. కేసీఆర్‌ కొమ్ముకాసే విధానాన్ని కోదండరాం మానుకోవాలని హితవుపలికారు.

కేసీఆర్‌ తొత్తు కోదండరాం

ఏపీపీఎస్సీనీ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు ఆదివారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎపిపిఎస్సీ అక్రమాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు తాము వస్తే అడ్డుకోవడం దారుణమని టిడిపి నేతలు అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కలవడానికి వస్తే ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి టీడీపీ నేతలు తప్పుబడుతూ, అక్కడే బైఠాయించారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎపిపిఎస్సీ ప్రక్షాళనపై హామీ ఇచ్చేదాకా పోరాడుతామన్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. తాము అసెంబ్లీలో దీనిని లేవనెత్తుతామన్నారు. ఈ ఆందోళనలో మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద టీడీపీ ఆందోళన, అరెస్టు

హైదరాబాద్‌ : సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశఋ౎ల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ చీఫ్‌ చంద్రబాబు భేటీ అయ్యారు. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికి దక్కాలని మంగళవారం అసెంబ్లీ వాయిదా తీర్మానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. విద్యుత్‌ సంక్షోభానికి వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను అసెంబ్లీలో పెట్టాలని పార్టీ చీఫ్‌ బాబు నేతలకు సూచించారు. కళంకిత మంత్రులు, రైతు సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా పోరాడాలని పార్టీ నేతలకు బాబు పిలుపునిచ్చారు.

నేతలతో బాబు భేటీ


హైదరాబాద్: కేసీఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధిలేదని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణవాదాన్ని అడ్డుపెట్టుకుని అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్‌ అన్యాయం చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్త నాగరాజు మరణించినా కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం తెలంగాణవాదాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు చిత్తశుద్ధిలేదు: ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అమరవీరుల కుటుంబాలను ఎప్పుడూ పట్టించుకోలేదని టీటీడీపీ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌చారీతో పాటు అనేక మందిని తన రాజకీయాల కోసం కేసీఆర్‌ వాడుకున్నారని ఆయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాల గురించి కేసీఆర్‌ ఏనాడు దిగాలు పడలేదన్నారు. కేవలం తన స్వార్థ రాజకీయాలతో ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు.

అమరవీరుల కుటుంబాలను కేసీఆర్‌ పట్టించుకోలేదు:ఎర్రబెల్లి

హైదరాబాద్: ఏపీపీఎస్ సీలోని దొంగలను సీఎం కిరణ్ కాపాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆదివారం హైదరాబాద్ లో ఆరోపించారు. ఏపీపీఎస్ సీ కార్యాలయం దొంగలు, బ్రోకర్లకు నిలయంగా మారిందని ఆయన అభివర్ణించారు. బోర్డు సభ్యులను వెంటనే తొలగించాలని కేశవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏపీపీఎస్ సీని ప్రక్షాళన చేయాలంటూ ఆ పార్టీ నేతల నేతృత్వంలో కార్యకర్తల బృందం ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయానికి నిరసన ర్యాలీ చేపట్టింది. అయితే సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రవేశించేందుకు భద్రత సిబ్బంది వారికి అనుమతిని నిరాకరించారు. దాంతో సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఏపీపీఎస్ సీలో దొంగలను సీఎం కాపాడుతున్నారు: పయ్యావుల