June 6, 2013

దగాకోరు మాటలతో ఇంకా తెలంగాణ ప్రజ లను మోసం చేయవద్దని, నీ మోసపూరిత మాటలు విని, వినిఈ ప్రాంత ప్రజ లు విసిగిపోయారని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. అమరుల కుటుం బాల ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నది నీవు కాదా? అంటూ ప్రశ్నించారు. వెయ్యి మంది విద్యార్థి, యువకుల చావులకు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కారణం కాదా? అని నిల దీశారు. అబద్దాలు, మోసపూరిత మాటలతో ఇంకా తెలం గాణ ప్రజలనుమోసగించాలను కుంటే ఉరికించి కొడుతారంటూ హెచ్చరిం చారు. గురువారం ఎన్టీఆర్‌ భవన్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్ది రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డితో కలిసి ఎర్రబెల్లి దయాకర్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాటకు ముందు దళితున్ని సీఎం చేస్తానని చెప్పు కునే కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ముందు పార్టీ అధ్యక్ష పదవి దళిత నేతకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

అప్పుడే తానేదో అధికా రంలోకి వచ్చి నట్లు దళితున్ని ముఖ్యమంత్రి, మైనార్టీని ఉప ముఖ్య మంత్రిని చేస్తా నంటూ ప్రగాల్భాలు పలుకుతున్నారని మండి పడ్డా రు. ఇంకా ఎన్నాళ్లూ ఈ మాయ మాటలు చెప్పి దళిత, మైనార్టీలను మోసం చేస్తావంటూ నిలదీశా రు. నీ కుటుంబ సభ్యులకు, కులస్థులకు, డబ్బిచ్చి ఆర్ధికంగా ఆదుకున్న వారికే టికెట్లు ఇచ్చావన్నారు. అమరుల కుటుంబాలకుగానీ, ఉద్యమంలో పాల్గొన్న వారికీ ఏనాడైన టికెట్లు ఇచ్చా వా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సాధన పట్ల చిత్తశుద్ధి ఉంటే నీ కుటుంబ సభ్యులు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని డిమాండ్‌ చేశారు. 100 అసెంబ్లీ, 15 పార్లమెంట్‌ సీట్లు తెలంగాణ ఎలా సాధి స్తారో చెప్పాలని ప్రశ్నించారు. 100 అసెంబ్లీ, 15 పార్ల మెంట్‌ స్థానాలు ఏ జాతీయ పార్టీకి అమ్ముకునేందుకు బేరం కుదుర్చుకున్నారో చెప్పాల న్నారు. గతంలో వైఎస్‌కు సీట్లు అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌దన్నారు. తెలంగాణ పట్ల తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉందని ఎర్రబెల్లి మరోసారి పునరు ద్ఘాటించారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే మద్దతునిస్తామన్నారు. చంద్రబాబు అధికా రంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు.

తెలంగాణ ఇస్తామంటేనే థర్డ్‌ ఫ్రంట్‌లో చేరుతామని స్పష్టం చేశారు. తెలంగాణపై తెలుగు దేశం పార్టీ ఇచ్చిన లేఖ స్పష్టంగానే ఉందని కాంగ్రెస్‌ పార్టీ, కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెబుతుంటే, కేసీఆర్‌ మాత్రం తన రాజకీయ లబ్ధి కోసం టీడీపీపై విమర్శలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. టీడీపీని, నాయకు లను విమర్శించే ముందు తెలం గాణ సాధన కోసం సోనియా గాంధీ చేత లేఖ తీసు కువస్తే దానిపై తమ అధినేత చంద్ర బాబు చేత గుడ్డిగా సంతకం చేయిస్తామన్నారు.
టీఆర్‌ఎస్‌ను టీడీపీలో విలీనం చేసేందుకు ఆ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత హరీష్‌రావు చేసిన ప్రతిపా దనలపై తమ పార్టీ సానుకూలంగా స్పందించిన, ఆ పార్టీ నేతల నుండి ఇంత వరకు ఎటువంటి ప్రతి స్పందన లేదని ఎద్దేవా చేశారు.

టీడీపీ నాయకుడు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బలంగా ఉం ది కాబట్టే టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ కేవలం రెండు జిల్లాల పార్టీ అంటూ ఆయన అపహాస్యం చేశారు. గత సాధారణ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ వరంగల్‌ జిల్లాలో ఐదు స్థానాల్లో పోటీ చేస్తే నాలుగింటిలో విజయం సాధిస్తే, కడియం శ్రీహరి ఒక్కరే ఓడిపోయా రన్నారు. కేసీఆర్‌ రాసిచ్చిన స్క్రిప్టును చదువుతున్న యాంకర్‌ కడియం అంటూ ఎద్దేవా చేశారు. కడియంది నోరా... తాటిమట్టా, ఆయన ఓ అబద్దాల కోరని శివాలెత్తారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుం టున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు తెలంగాణ రావడం ఇష్టం లేదన్నారు. తెలంగాణ రావద్దని ఆయన పూజలు చేస్తున్నా రంటూ ఎద్దేవా చేశారు.

దగాకోరు మాటలొద్దు...దళితుణ్ణి అద్యక్షుణ్ణి చేయ్యోద్దు   తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ప్రతినిధులతో అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్లమెంటు కోఆర్డినేటర్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు దశ, దిశ నిర్దేశించారు. గ్రామాలవారీగా బలాబలాలు విశ్లేషించుకుని, కార్యకర్తల ప్రోత్సాహంతో ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టి తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాల గురించి ప్రజలకు వివరించవలసిందిగా ఆదేశించారు. వివిధ కారణాల వల్ల దూరమైన నాయకులను, ఓటర్లను కలుసుకుని తెలుగుదేశం వైపు వారిని ఆకర్షించే ప్రయత్నం చేయాలని సూచించారు. కోస్తా జిల్లాలలో చేపల చెరువులకు అనుమతులు సకాలంలో లభించడం లేదని, చెరువులను రెగ్యులరైజ్‌ చేయడానికి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిని వెంటనే ఆపించవలసిందిగా కొంతమంది ప్రతినిధులు కోరారు. ఎస్టీలకు జనాభా ప్రాతిపతికన రాజకీయాల్లోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించవలసిందిగా కొందరు కోరారు. ఎస్సీ, ఎస్టీలకు జిల్లావారిగా జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించినట్లయితే సమస్య పరిష్కారమవుతుందని భావించినట్లు ఆ పార్టీ మీడియా కమిటీ చైర్మన్‌ ఎల్వీఎస్‌ఆర్కె ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికలకు సిద్ధంకండి!


హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ సొంత ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడానికి కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదని... కేసీఆర్ కు తెలంగాణ తెచ్చే ఆకాంక్ష లేదని ఎర్రబెల్లి విమర్శించారు.

15 ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణ ఎలా తెస్తారో కేసీఆర్ చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కేసీఆర్ దగాకోరు మాటలు తగవని, ఎలక్షన్.... కలెక్షన్లతో ముగినిపోయిన ఆయన తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ఇదిగో తెలంగాణ...అదిగో తెలంగాణ అంటూ మోసం చేస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆయన కుటుంబ సభ్యులెవరూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిమాండ్ చేశారు.

కేసీఆర్ వి దగాకోరు మాటలు: ఎర్రబెల్లి