June 5, 2013

బ్యాంకులకు బాబు మాఫీ సెగ
బాబు మాఫీపై విశ్వాసంతోనే అగిన చెల్లింపులు?
నమ్మకపోతే రికవరీ శాతం పెరిగేదే
అధికారంలోకి రావాలంటే కోటి ఒట్లు అవసరం
బాబు హామీనే కారణమంటున్న బ్యాంకర్లు
సహకార ఎన్నికల్లో సీరియస్‌గా పనిచేయకున్నా రెండో స్థానంలో టీడీపీ
రుణమాఫీ హామీనే కారణమా?


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన రైతు రుణాల మాఫీ బ్యాంకులకు షాక్‌ నిస్తోంది. తాను అధికారంలోకి వస్తే రుణ మాఫీ, వడ్డీలేని రుణాలు ఇస్తామని బాబు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల రికవరీలు పడకేశాయి. దాదాపు 40 శాతం రికవరీలు నిలిచిపోయాయి. మొత్తం 85 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే, వారిలో 32 లక్షల మంది రైతులు రుణాలు చెల్లించేందుకు సుముఖంగా లేరు. ఎలాగూ చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే, బాబు రుణాలు మాఫీ చేస్తారన్న భరోసాతో రుణాలు చెల్లించడం లేదు.

ఈ ప్రకారం.. వీరంతా రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇప్పుడే నికర ఓటు బ్యాంకుగా మారినట్లు బ్యాంకర్ల వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా కోటి ఓట్లు అవసరం. ప్రస్తుతం ఉన్న త్రిముఖ, చతుర్ముఖ పోటీ వాతావరణంలో అది 70-80 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపడ వలసిన పనిలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన రైతు రుణాల మాఫీ రైతు హృదయాలను తాకినట్లు నిన్న జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో దాని చైర్మన్‌, ఆంధ్రాబ్యాంక్‌ ఎండీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 40 శాతం మంది రైతులు రుణాలు కట్టేందుకు సిద్ధంగా లేరని, కొన్ని పార్టీలు రుణమాఫీ ప్రకటన ఇవ్వడమే దానికి కారణమని వ్యాఖ్యానించారు. అంటే దీన్ని బట్టి.. చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణాల మాఫీ హామీ పల్లెసీమల్లో ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనిపిస్తుండగా, బ్యాంకులకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయన్న సంకేతాలు వెల్లడవుతున్నాయి.

ఈ ప్రకారంగా.. బాబు రైతు రుణమాఫీ హామీ ఇంకాస్త ఎక్కువ స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు చేరితే అది ఆ పార్టీకి మరింత ఉపయోగపడి, అది అధికారానికి ద గ్గర దారిగా మార్చవచ్చన్న అభిప్రాయం, నమ్మకం వ్యక్తమవుతోంది. అంటే.. బ్యాంకర్ల గణాంకాల ప్రకారం మొత్తం 85 లక్షల మంది రైతుల్లో 32 లక్షల మంది రుణాలు చెల్లించేందుకు సిద్ధపడటం లేదు.

ఈ చెల్లింపులకు మరో ఏడాది గడువు ఉంది. అటు బాబు కూడా రుణాలు చెల్లించాల్సిన పనిలేదని, తాను అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణమాఫీ ఫైల్‌ మీదే పెడతానని హామీలిస్తున్నారు. ఈ లెక్కన.. 32 లక్షల మంది రైతులు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఓటు బ్యాంకులుగా మారినట్టేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దానితోపాటు, ఒక్కో రైతు కుటుంబంలో రుణమాఫీ హామీ ఇచ్చిన టీడీపీకి రెండు ఓట్లు వేసినప్పటికీ కనీసం 70 లక్షల ఓట్లు టీడీపీ ఖాతాలో కలిసినట్టేనంటున్నారు. బాబును ఎవరూ నమ్మరని, ఆయనకు విశ్వసనీయత లేదని కాంగ్రెస్‌-జగన్‌ పార్టీలు ఎంత విమర్శిస్తున్నప్పటికీ, రుణ వ్యవహారాలు పర్యవేక్షించే బ్యాంకర్ల మాటలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం ఆసక్తికలిగిస్తోంది. రుణమాఫీ హామీ వల్ల 32 లక్షల మంది రైతులు వాటిని చెల్లించేందుకు సిద్ధంగా లేరని స్వయంగా ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌ ప్రకటించడం బట్టి.. బాబు రుణ మాఫీని రైతులు విశ్వసిస్తున్నారని, అందుకే రుణాలు చెల్లించడం లేదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌-జగన్‌ పార్టీ విమర్శలే నిజమయితే రైతులు బాబును నమ్మకుండా మిగిలిన 60 శాతం మంది మాదిరిగా రుణాలు చెల్లించేవారన్న విశ్లేషణ తెరపైకి వస్తోంది.

ఇటీవల జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోయినా, నేలతంతా బాబు పాదయాత్రపై దృష్టి సారించి, ఎన్నికలను వదిలేసినా రెండు జిల్లాలను కైవసం చేసుకోవడంతోపాటు, రెండవ స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం.. బాబు ఇచ్చిన రైతు రుణాల మాఫీయేనని, అందుకే ఆ స్థాయిలో ఫలితాలు వచ్చాయంటున్నారు.

పల్లెలను తాకుతున్న బాబు రుణమాఫీ హామీ 40 శాతం రుణాలు పెండింగ్‌ రుణాలు చెల్లించని వారు 32 లక్షలు


హైదరాబాద్ : రెండో రోజు పార్లమెంటరీ నియోజకవర్గాల టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో బాబు సమీక్ష జరుపుతున్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ స్థితిగతులపై చర్చిస్తున్నారు.

టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమాన్ని విసృ్తతంగా నిర్వహించా లని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇన్‌ఛార్జ్‌లదేనన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికలతో పాటు 2014 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమయ్యే వ్యూహంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ ట్ట్రస్ భవన్‌లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమావేశాలను ఆయన ప్రారంభించారు. తొలుత ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ స్థానాల నేతలతో సవిూక్ష నిర్వహించారు. భోజన విరామం తర్వాత మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, నల్గొండ, భువనగిరి పార్లమెంటరీ స్థానాల నేతలతో చంద్రబాబు సవిూక్షించారు. ఈ ఎన్నికలు మనకు జీవన్మరణ సమసప్యని అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తెలగుదేశం పట్ల తిరగి అభిమానం పెంచుకుని ఓటేయడానికి సిద్దంగా ఉన్నారని ంటూ వారిని నేరుగా కలవడం వల్ల ప్రయోజనం పొందాల న్నారు. ప్రజలు అవినీతిని, ఆవ్రిత పక్షపాతాన్ని సహించరన్నారు. పాదయాత్రలో ప్రజలనుంచి సానుకూల స్పందన కనిపించిందన్నారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్దిని కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల నేతలు పాల్గొ న్నారు. విభేదాలు మరచి పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బాబు సూచించారు.

గెలుపే లక్ష్యంగా దూసుకుపోండి

వారిని వేర్వేరు జైళ్లలో పెట్టాలి
జగన్‌ వర్గంపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
టీడీపీ నాయకుడు నిప్పులు
  వైఎస్‌ జగన్‌తో కలిసి అక్ర మాలకు పాల్పడిన వారిని ఒకే జైలులో ఎందుకు పెడు తున్నారని, వారిని వేర్వేరు జైలులో పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి అన్నారు. అవిభక్త కవలలు వీణా వాణి మాదిరే.. జగన్‌కు కిరణ్‌ సహకరిస్తు న్నారని పేర్కొన్నారు. జగన్‌ ఎలాచెబితే అలా కిరణ్‌ నడుచు కుంటున్నట్లుగా కనిపిస్తోందని రేవంత్‌ ఆరోపించారు. జగన్‌ సహాయకుడు సునీల్‌ రెడ్డి జైల్లో జగన్‌కు సహాయ కుడిగా పని చేసేందుకే బెయిల్‌ పిటిషన్‌ కూడా వేయడం లేదని అర్థం అవుతోందని, వీరందరికీ సీఎం సహకరిస్తు న్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌ ఉన్న జైలుకే విజయసాయి రెడ్డి, ఐఎఎస్‌ అధికారులు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మీ లాంటి వారందర్నీ జగన్‌ ఉన్న జైలుకే తరలిస్తు న్నారంటే జగన్‌కు సీఎం కిరణ్‌ సహకరిస్తున్నట్లే కదా అని అన్నారు.

వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలపై సీఎం కిరణ్‌ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌కు వ్యతిరే కంగా మాట్లాడుతున్న వారిని పదవుల నుండి దించి వేస్తున్న విషయం వాస్తవం కాదా? అని ఆయప ప్రశ్నిం చారు. జగన్‌కు వ్యతిరేకంగా బొత్స మాట్లాడినప్పు డు ఆయనపై లిక్కర్‌ కేసులు పెట్టలేదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శంకర్‌ రావును మంత్రి పదవి నుండి తొలగించి కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం దామోదర వద్ద ఉన్న వ్యవసాయశాఖను సీఎం తన పరిధిలోకి తెచ్చుకున్నది వాస్తవం కాదా? అని అన్నారు. బుధవారం టీడీఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

టీడీపీ హయాంలో పని చేసిన ఐఎఎస్‌ అధికారులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని, అదే వైఎస్‌ హయాంలో పని చేసిన అధికారులు బీపీ ఆచా ర్య, శ్రీలక్ష్మీ లాంటి వారు జైళ్లలో ఉన్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జైలులో ఉన్న జగన్‌ను విడిపించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీతో వైకాపా కుమ్మక్కయిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు పాలక పక్షాన్ని విమర్శి స్తాయని, కానీ దురదృష్ట వశాత్తూ టీఆర్‌ఎస్‌, వైఎస్‌స్సార్‌ సీపీ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీని వదిలేసి టీడీపీని విమర్శిం చడమే పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీతో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదా? ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం తెరిచి ఉంచిన పుస్తకమ న్నారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కు కావాల్సిన ఖర్మ వైకాపాకు పట్టిందేమో గానీ తమకు పట్టలేదన్నారు. షర్మిళ రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉందన్నారు. జగన్‌ను జైలు నుండి విడిపించుకునేందుకు ఒక తల్లిగా విజయమ్మ పడుతున్న తపన చూస్తుంటే ఏవరికైనా జాలేస్తుందని, నాడు కోట్ల రూపాయలు అక్రమంగా మూటగట్టుకుంటుంటే ఎందుకు మందలించలేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

జగన్‌కు కిరణ్‌ సహకరం ఆయన వ్యతిరేకులపై కిరణ్‌ వేటు

టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు ఫాం హౌస్‌లో నిద్ర పట్టకపోయినా అది ఆంధ్రావాళ్ళదే తప్పా అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘రాజకీయాల్లోంచి రిటైరైన కేశవరావు, ప్రతి ఎన్నికకూ ఒక పార్టీ మార్చే మందా జగన్నాధం, తాత ముత్తాతల కాలం నాటి వారిని చేర్చుకొని కెసిఆర్ ఎందుకు జబ్బలు చరుచుకొంటున్నారో మాకు అర్ధం కావడం లేదు. చేర్చుకొంటే చేర్చుకో...కాని ప్రతిదానికీ ఆంధ్రావాళ్ళను తిట్టడం ఎందుకు? తెలంగాణలో పేదరికం ఉందంటావు.

రాష్ట్ర ఆదాయంలో 75 శాతం తెలంగాణ నుంచే వస్తుందంటావు. అభివద్ది అయితేనే కదా అంత ఆదాయం వచ్చేది. నీ అక్రమాలను రఘునందనరావు బయట పెడితే ఆంధ్రా వాళ్ళ కుట్ర. నీ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా అది ఆంధ్రావారి కుట్రేనా’ అని ఆయన అన్నారు. మందా పోయిన ఎన్నికల సమయంలో నోటుకు...ఇప్పుడు రెండు సీట్లకు అమ్ముడుపోయారని, ఇలాంటి ఫిరాయింపుదారులను చేర్చుకొని వారికి త్యాగమూర్తులని కితాబులు ఇవ్వడం కెసిఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

ఫాం హౌస్‌లో నిద్ర పట్టకపోయినా మాదే తప్పా?: సోమిరెడ్డిహైదరాబాద్: అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

ఆదిలాబాద్ నేతలతో చంద్రబాబు సమీక్ష

ఏపీసీఎస్సీలో విలువలులేనవారిని నియమించారని, అందువల్లే దళారులు ప్రవేశించారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూదరులు, దళారులు ఏపీపీఎస్సీలో సభ్యులుగా ఉంటే అర్హులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సీఎం కిరణ్ ఇప్పటికైనా కళ్లు తెరలవాలని, ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఏపీపీఎస్సీలో విలువలులేనివారిని నియమించారు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర అబద్దపు ప్రచారంతో చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. షర్మిల ఊకదంపుడు ప్రచారానని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని, నమ్మే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు.

జైలులోని జగన్‌ను విడిపించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిందని ఆరోపించారు. వైయస్ జగన్ ములాకత్‌లను వ్యతిరేకించిన అధికారిని ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యతిరేకుల పైన ముఖ్యమంత్రి ప్రతీకారచర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

సునీర్ రెడ్డి ఎందుకు బెయిల్ పిటిషన్ వేయలేదో చెప్పాలన్నారు. జగన్‌ను బయటకు తీసుకు వచ్చేందుకు జైలు గోడలు పగులగొట్టాలని విజయమ్మ, షర్మిల చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతన్న వారిని ముఖ్యమంత్రి పదవుల నుండి తొలగించడం వాస్తవం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

జగన్‌కు వ్యతిరేకంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడితే లిక్కరే కేసులు పెట్టారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు కాంగ్రెసును వదిలేసి ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నాయన్నారు. కాంగ్రెసుతో ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయనేందుకు ఇదే మంచి ఉదాహరణ అన్నారు.

జగన్‌తో కలిసి అక్రమాలకు పాల్పడిన వారిని ఒకే జైలులో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అందర్నీ ఒకే జైలులో పెట్టడమంటే కిరణ్ సహకరిస్తున్నట్లే కదా అన్నారు. జగన్ సహాయకుడు సునీల్ రెడ్డి జైల్లో సహాయకుడిగా ఉన్నందునే ఆయన బెయిల్ పిటిషన్ వేయడం లేదన్నారు. టిడిపి హయాంలో పని చేసిన అధికారులు ఉన్నత పదవుల్లో ఉంటే, వైయస్ హయాంలో పని చేసిన వారు జైళ్లలో ఉన్నారన్నారు.

షర్మిలపై రేవంత్ ఫైర్!

‘టీ’డీపీ దూకుడు
మహానాడులో రాజకీయ తీర్మానాలను తప్పుబట్టడం దుర్మార్గం
రీేకసీఆర్‌ లేఖ ఇస్తే చంద్రబాబుతో సంతకం చేరుుస్తామని టీ-ఫోరం సవాల్‌
టీఆర్‌ఎస్‌ దూకుడుకు కళ్లెం వేసేందుకు టీ-ఫోరం కసరత్తు
టీ-ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో సమావేశాలు
  టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు తెలంగాణ ప్రాంత తెలుగు తమ్ముళ్లు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తెలంగాణవాదాన్ని అ డ్డం పెట్టుకుని తమను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ను అదే అస్త్రంతో దెబ్బకొట్టాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. తెలంగాణవాదంపై గుత్తాధిపత్యాన్ని చలాయించాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ పట్ల దూకుడుగా వ్యవహరించడం ద్వారా ఆ పార్టీని నిలువరించవచ్చని టీ-ఫోరం నేతలు పథక రచన చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఈ మేరకు తెలంగా ణ ప్రాంత తెలుగు తమ్ముళ్లు తమ విమర్శలకు పదునుపెట్టి ఎదురుదాడిని తీవ్రతరం చేశారు. తెలంగాణ అంశంపై ఇప్పటికే పలుమార్లు స్పష్టతనిచ్చిన పదే, పదే తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న టీఆర్‌ఎస్‌ వైఖరిని ఎక్కడిక్కడ ఎండగట్టాలని నిర్ణయించారు.
తెలంగాణను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్‌గాంధీని పలె ్లత్తు మాట అనడానికి సాహసించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, రాజకీయలబ్ధి కోసం తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారంటూ మండిపడుతున్నారు. తెలంగాణ అంశం పట్ల ప్రతిసారి పార్టీ నిర్ణయాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నా టీఆర్‌ఎస్‌ మాత్రం తమ విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉందని నిప్పులు చెరుగుతున్నారు. 2008లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, అదే విషయాన్ని ఇటీవల కేంద్ర హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మరోసారి స్పష్టం చేయడం జరిగిందంటున్నారు. అయినా టీఆర్‌ఎస్‌ తన రాజకీయలబ్ధి కోసం టీడీపీపై విమర్శలు చేస్తూనే ఉందన్నారు. మహానాడు రాజకీయ తీర్మానాల్లో తెలంగాణ అంశాన్ని చేర్చి తమ చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నామ న్నారు. అయినా కూడా టీఆర్‌ఎస్‌ వైఖరిలో ఎటువంటి మార్పులేదని శివాలెత్తుతున్నారు. తెలంగాణ అంశంపై మహానాడులో చేసిన రాజకీయ తీర్మానాన్ని కూడా ఆ పార్టీ నేతలు తప్పుపట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమం టున్నారు.
తెలంగాణ సాధనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెబుతూనే, టీఆర్‌ఎస్‌ వైఖరిని తెలంగా ణ తమ్ముళ్లు తూర్పారబడుతున్నారు. తెలంగాణ పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకే మహానాడులో తీర్మానం చేశామని, మా నిజాయితీని నిరూపించుకునేందుకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకుం టామని చెబుతున్నారు. ఒవైపు తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటూనే, మరోవైపు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తామని ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాక ర్‌రావు చెప్పారు. తెలంగాణ వనరులు కాంగ్రెస్‌ పార్టీ దోచుకుపోతుంటే కేసీఆర్‌ ఏమి చేశారని ప్రశ్నించారు. బాబ్లీ అక్రమ నిర్మాణంపై, బయ్యారం గనుల పరిరక్షణ కోసం టీడీపీ ఉద్యమించినప్పుడు కేసీఆర్‌ ఎక్కడ పడుకున్నారంటూ అపహాస్యం చేశారు. తెలంగాణ సాధన కోసం టీ-ఫోరం ఆధ్వర్యంలో త్వరలోనే అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగా ణ సాధన కోసం తమ వైఖరిని విస్పష్టంగా ప్రకటిస్తూనే, మరోవైపు టీఆర్‌ఎస్‌పై పదునైన విమర్శల దాడిని టీ-ఫోరం నేతలు కొనసాగిస్తున్నారు. గత 12ఏళ్లుగా తెలంగాణ ప్రజలను టీఆర్‌ఎస్‌ మోసం చేస్తోందని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు, నోట్ల చుట్టే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఇదిగో తెలంగాణ.. అదిగో అంటూ 1000మంది దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థి, యువకుల ప్రాణాలు తీశారన్నారు. తెలంగాణకు కాపలా కుక్కనని చెప్పుకునే కేసీఆర్‌, సోనియాగాంధీ ఇంటి కాపలా కుక్క మాదిరిగా వ్యవహరి స్తున్నారని ధ్వజమెత్తారు. అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ఇచ్చిన లేఖ సరిపోదంటే, కేసీఆర్‌ ఓ లేఖ రాసి తీసుకువచ్చి ఇస్తే దానిపై చంద్రబాబు చేత సంతకం చేయిస్తామంటూ టీ-ఫోరం నేతలు సవాల్‌ విసురుతున్నారు. టీడీపీని ఇరకా టంలో పెట్టేందుకు టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు చేసిన విలీన ప్రతిపాదన ఆ పార్టీ మెడకే చుట్టుకుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణపై తీర్మానం చేయాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడితే భేషరతుగా మద్దతు నివ్వాలంటూ, టీ- ఏర్పడగానే దళితున్నే ముఖ్యమంత్రి చేయాలన్న హరీష్‌రావు ప్రతిపాదనలకు టీడీపీ సాను కూలంగా స్పందించింది. పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటుచేసి విలీన ప్రతిపాదనపై చర్చించి, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ చేత ప్రకటన చేయించాలని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి సూచించారు. చంద్రబాబు అనుమతితోనే ఈ అంశంపై తాను స్పందిస్తున్నానని చెప్పి టీఆర్‌ఎస్‌ను ఆత్మరక్షణలో పడేశారు. దీనిపై ఆ పార్టీ నేత లు ఎవరు ముందుకు వచ్చి స్పందించకపోవడంతో, స్వయంగా హరీషే రంగంలోకి దిగి తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సరిగ్గా అర్ధం చేసుకోలేదంటూ వివరణిచ్చే ప్రయత్నం చేశారు.
ఇలా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంగాలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ప్రాంతంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఈ రెండు రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో మాటల యుద్ధాన్నికొనసాగిస్తున్నాయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌లోకి, టీఆర్‌ఎస్‌ నుండి టీడీపీలోకి వలసలు కొనసాగుతుండడంతో ఇరు పార్టీల నాయకత్వం తమ ఉనికిని కాపాడుకునేందుకు ఒకరిపై, ఒకరూ విమర్శలు చేసుకుంటూ పైచేయి సాధించాలని ఎత్తుగడలు వేస్తున్నారన్నారు.

తెలంగాణపై స్పష్టతనిచ్చాం టీడీపీతోనే తెలంగాణ సాధ్యం


  తెలుగుదేశం క్షేత్రస్థాయి స్థితిగతుల పై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టిసారించా రు. మహానాడు ముగిసిన వెంటనే ఆయన హైదరాబాద్‌ జిల్లా పరి ధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్విహ స్తున్నారు. ప్రతిరోజు రెండు, మూడు నియోజకవర్గాల నేతలతో మాట్లాడుతూ పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని, ప్రత్యర్థి పార్టీల బలాన్ని నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. లోటుపాట్లను సరిచేసుకోవాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. అందరు కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశిస్తున్నారు. ప్రజలు పార్టీ వైపే ఉన్నారని, గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని హితబోధ చేస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ముగిసిన వెంటనే, ఈ నెలలో లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.

రాష్ర్టంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షాసమావేశాలు నిర్వహించి పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు రావాలని ఆయన యోచిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను గుర్తించేందుకు ఈ సమావేశాలు దోహదపడుతాయని ఆయన భావిస్తున్నారు. పార్టీలోని సీనియర్లను ఈసారి లోక్‌సభ బరిలో దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అయితే కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రస్తుతం అభ్యర్థుల కొరత పార్టీని వేధిస్తున్న ట్లు తెలుస్తోంది. కొంతమంది సీనియర్లు అసెంబ్లీకి పోటీ చేయ డానికి ఆసక్తి చూపుతూ, లోక్‌సభ బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. సీనియర్లు పోటీ చేయడానికి అశక్తత వ్యక్తం చేస్తున్న స్థానాల్లో, కొత్త అభ్యర్థులను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్‌సభ సమీక్షా సమావేశాల సందర్భంగా పార్టీ అభ్యర్థుల పేర్లను పరిశీలించే అవకాశాలు లేకపోలేదం టున్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించేవారి స్థితిగతులు, పార్టీలో, ప్రజల్లో వారికున్న గుర్తింపును పరిశీలించే అవకాశ ముందన్నారు.

ఈ సమావేశాలకు ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను, లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న నేతలను, పొలిట్‌బ్యూరో సభ్యులను, జిల్లా అధ్యక్షులను, స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ సమీక్షా సమావేశాల అనంతరం ఆరు జిల్లాల్లో చంద్రబాబు బస్సుయాత్ర ప్రారంభమవుతుందన్నా రు. ఇప్పటికే ‘వస్తున్నా..మీకోసం’ పేరిట చంద్రబాబు 208 రోజుల పాటు 2817 కిమీ మేర పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్ర కొనసాగించని శ్రీకా కుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలో జులై మొదటి వారంలో బస్సుయాత్ర చేపట్టనున్నారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులను భర్తీ చేయాలని ఆయన యోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా 70 అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఇన్‌చార్జి నియమించాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

దీనికితోడు కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇన్‌చార్జి లుగా వ్యవహరిస్తున్న వారు పార్టీ కార్యక్రమాల పట్ల అంటిము ట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులతో పాటు పార్టీకి పనిచేయని వారిని తప్పించి కొత్తవారిని నియమిం చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే ఒక్కొక్క నియోజకవర్గం నుండి ముగ్గురు, నలుగురు పోటీపడుతుండడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకరిని కాదని మరొకరికి అవకాశం కల్పిస్తే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని గ్రహించిన అధినేత అచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారన్నారు. అయితే ఎవరికీ ఇన్‌చార్జి పదవి కట్టబెట్టినా మిగతావారందరు కలిసి కట్టుగా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయని గుర్తించాలని నేతలకు హితబోధ చేస్తున్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని ఆయన నేతలకు, శ్రేణుల్లో భరోసానింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పార్టీ నుండి కొంతమంది సీనియర్లు వెళ్లిన స్థానాల్లో యువకులను ప్రోత్సాహించాలని నిర్ణయించారు. దీని ితోడు రానున్న సాధారణ ఎన్నికల్లో యువకులకు 33 శాతం, బడుగులకు వందసీట్లు ఇచ్చి ప్రోత్సాహించాలని నిర్ణయించడం తో ప్రజల్లో పార్టీకి కొత్త ఊపు వచ్చిందని అంచనా వేస్తున్నారు. అ లాగే మహిళలకు, మైనార్టీలకు పెద్దపీట వేయాలని యోచిస్తు న్నారు. పార్టీ ప్రతిష్ట దిగజార్చే పనులకు ఎవరు పాల్పడవద్దని తమ్ముళ్లకు చంద్రబాబు సూచిస్తున్నారు.

పార్టీపై నారా నజర్‌