June 3, 2013

మళ్లీ కాంగ్రెస్‌లోకే!: టీడీపీ
ఎన్నికల తర్వాత కేసీఆర్ కలిపేస్తారు..
ఎంపీల చేరిక నాటకం
సోనియాను ఎందుకు తిట్టవు? నీ ములాఖత్ ఏమిటి?
టీఆర్‌ఎస్ అధినేతపై టీ టీడీపీ నేతల ధ్వజం
  ‘‘కాంగ్రెస్ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరడం పెద్ద నాటకం. ఎన్నికల తర్వాత వీరందరినీ కేసీఆర్ కాంగ్రెస్‌లో కలిపేయడం ఖాయం. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులను కేసీఆర్ చప్రాసీలని తిడుతున్నారు. నిజమే. కానీ, ఆ చప్రాసీలను నియమించిన సోనియా గాంధీని ఎందుకు తిట్టవు? సోనియా, రాహుల్‌తో నీ ములాఖత్ ఏమిటి? వాళ్లు వేసే బొక్కలకు ఆశపడి తోకూపుకుంటూ తిరిగే నీతో తెలంగాణ వస్తుందా!?’’ అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకొంటామంటూ ఆజాద్ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్‌ను లోబర్చుకొని ఉద్యమాన్ని చల్లార్చడం.. తర్వాత తెలంగాణ ఊసెత్తకపోవడం ఆ పార్టీకి ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ‘‘మహానాడులో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ తీర్మానం చేస్తుందని టీఆర్‌ఎస్ నేతలు ఊహించలేదు. ఆ తర్వాత మాట్లాడటానికి మరేమీ దొరక్క నోళ్లు మూతపడ్డాయి’’ అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణకు కాపలా కుక్క కాదని, కాంగ్రెస్ పార్టీకి పెంపుడు కుక్క అని ధ్వజమెత్తారు. ‘

‘తొమ్మిదేళ్లపాటు తెలంగాణ వనరులను కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోపిడీ చేస్తున్నా వాళ్లు వేసే బొక్కలకు ఆశపడి నోరు మెదపలేదు. సకల జనుల సమ్మెను అర్ధాంతరంగా ఆపుచేసి వచ్చే తెలంగాణను రాకుండా చేశారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల, పోలవరం, బాబ్లీ, బీడీ  ట్టలపై పుర్రె గుర్తు వంటి వాటిపై దేనిపైనా ఈ కుక్క మొరగలేదు. బొక్కలు నాకుతూ కూర్చుంది’’ అని విరుచుకుపడ్డారు.

హరీశ్.. కేటీఆర్.. వచ్చేయండి: మోత్కుపల్లి
‘‘టీఆర్‌ఎస్‌లో హరీశ్‌రావు అంటే నాకు అభిమానం. కేటీఆర్ చిన్న పిల్లవాడు. మీరిద్దరూ కేసీఆర్ దుర్బుద్ధులు అలవర్చుకోవద్దు. మీరిద్దరూ టీడీపీలోకి రండి. మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. ఓయూ జేఏసీ నేత రాజారాం యాదవ్ టీడీపీలోకి వస్తే ఎలా న్యాయం చేశామో అందరూ చూశారని, అభ్యుదయ వాదులు, విద్యార్థులు టీడీపీలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ తనను తాను తెలంగాణకు కాపలా కుక్కగా అభివర్ణించుకుంటున్నారని, నిజానికి ఆయన పిచ్చి కుక్క అని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో కేవలం మూడో వంతు సీట్లలో పోటీ చేసే టీఆర్‌ఎస్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు. ఎన్ని సీట్లు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీ టీడీపీ ఒక్కటే. అధికారంలోకి వచ్చేది.. తెలంగాణ తెచ్చేది మేమే. కేసీఆర్‌కు నిజంగా తెలంగాణ రావాలని కోరికగా ఉంటే టీడీపీతో కలిసి రావాలి. ఏం కండిషన్లు పెడతావో పెట్టు. నీ పార్టీని టీడీపీలో విలీనం చెయ్యి.

అందరం కలిసి తెలంగాణ సాధించుకొందాం’’ అని అన్నారు. కడియం శ్రీహరి తన కులం వ్యవహారంలో తనపై కేసు వేస్తే సంతోషిస్తానని, తద్వారా, ఆయన కులం ఏమిటో బయటకు వస్తుందని మోత్కుపల్లి అన్నారు. కేసీఆర్‌కు ఫాం హౌస్‌లో నిద్ర పట్టకపోయినా ఆంధ్రావాళ్లదే తప్పా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. ‘‘రాజకీయాల్లోంచి రిటైరైన కేశవరావు, ప్రతి ఎన్నికకూ ఒక పార్టీ మార్చే మంద జగన్నాథం, తాత ముత్తాతల కాలం నాటి వారిని చేర్చుకొని కేసీఆర్ ఎందుకు జబ్బలు చరుచుకొంటున్నారో మాకు అర్థం కావడం లేదు. చేర్చుకొంటే చేర్చుకో. కానీ, ప్రతి దానికీ ఆంధ్రా వాళ్లను తిట్టడం ఎందుకు? నీ అక్రమాలను రఘునందన్ బయట పెడితే ఆంధ్రా వాళ్ల కుట్రేనా!?’’ అని ప్రశ్నించారు.
 

కేసీఆర్ కాపలా కుక్క కాదు.. పిచ్చి కుక్క...........

రానున్న ఎన్నికల్లో గెలుపే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ దిశలో బుధవారం ఒక కీలక సమావేశం నిర్వహణకు సిద్ధపడుతోంది.

గత సార్వత్రిక ఎన్నికలలో పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేసిన అభ్యర్థులతో పాటు సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలతో అధినేత చంద్రబాబు నాయుడు నివాస గృహంలో ఒక సమావేశం నిర్వహించ నున్నారు. ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నందున శ్రేణులను అప్రమత్తం చేసే దిశలో ఇది తొలి అడుగు అని ఆ పార్టీ వర్గాలు వివరించాయి. ఈసారి తూ తూ మంత్రంగా కాకుండా స్పష్టంగా నేతలకు కొన్ని మార్గదర్శకాలను అధినేత జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. తమ తమ ప్రాంతాల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం చేసే కృషిని పార్టీ పరిగణలోకి తీసుకుం టుందన్న విషయాన్ని నేతలకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వివరించ నున్నారు. అనుకూల ఫలితాలను సాధించడంలో విఫలమయ్యే నేతలకు రానున్న అసెంబ్లిd, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌లు నిరాకరించేందుకూ వెనుకాడబోమన్న సందేశాన్ని బలంగానే అందించేందుకు అధినేత నిర్ణయానికి వచ్చారు. వివిధ నియోజకవర్గాల్లో అనుకూల ప్రతికూల అంశాలను నేతల నుంచి చంద్రబాబు రాబట్టనున్నారు. ఇంఛార్జీలు లేని ప్రాంతాల్లో సమీక్షలు పూర్తి చేసి వీలైనంత త్వరగా వారి నియామకాలను చేపడతారు. ఏ క్షణం స్థానిక ఎన్నికలు ముంచుకొచ్చినా వాటిని ఎదుర్కునేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

రేపు టీడీపీ కీలక భేటీహైదరాబాద్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు సకల జనుల సమ్మెను అమ్ముకున్నారని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. సమ్మెను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తే తెలంగాణ వచ్చేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వనరులను కాంగ్రెస్ దోచుకుపోతుంటే కేసీఆర్ ఏం చేశారని ఎర్రబెల్లి సూటిగా ప్రశ్నించారు. టిడిపిని విమర్శిస్తున్న సోనియా, రాహుల్ గాంధీలను ఆయన ఎందుకు విమర్శించటం లేదని సూటిగా అడిగారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉందని ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణపై త్వరలో అన్ని జిల్లాల్లో టీడీపీ తెలంగాణ ఫోరం సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సకల జనుల సమ్మెను అమ్ముకున్న కేసీఆర్


హైదరాబాద్, జూన్ 3 : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వల్ల తెలంగాణ రాదని, ఆయన ఓ పొలిటికల్ బ్రోకరని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండి తెలంగాణ సాధించని నేతలు తోక పార్టీలో చేరి ఎలా సాధిస్తారని టీఆర్‌ఎస్‌లో చేరిన టీ. కాంగ్రెస్ ఎంపీల నుద్దేశించి మోత్కుపల్లి ప్రశ్నించారు.

కేసీఆర్ తెలంగాణ కాపలా కుక్క కాదని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి కాపలా కుక్క అని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి తనపై కోర్టుకు వెళ్తే అక్కడే అతను దళితుడు కాదని చెబుతానని అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు హరీష్ రావు, కెటి రామారావులు కెసిఆర్ దుష్ప్రభావానికి లోనుకాకుండా టిడిపిలో చేరాలని సూచించారు.

తెలంగాణ వస్తే దళితుడిని మఖ్యమంత్రి చేస్తానని చెబుతున్న కెసిఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు దళితుడిని చేస్తారా అని మోత్కుపల్లి సవాల్ చేశారు. ద్రోహులు, సన్నాసులు అన్న వారినే అతను తెరాసలోకి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కెసిఆర్‌కు తెలంగాణ కావాలా లేక రాజకీ పార్టీ కావాలా అని ప్రశ్నించారు. ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ తాపత్రయపడుతున్నారన్నారు.కెసిఆర్‌కు దమ్ముంటే మళ్లీ మహబూబ్ నగర్ నుండే పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.

కేసీఆర్ పొలిటికల్ బ్రోకర్


 ఇటీవల జరిగిన మహానాడులో టిడిపి చేసిన తీర్మానాలపై పిసిసి చీఫ్‌ బొత్సకు సరైన అవగాహన లేదని, ముందుగా తీర్మానాలను చదివి మాట్లాడాలని టిడిపి జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమా మహేశ్వరరావు సూచించారు. మహా నాడు తీర్మానాలపై ఆయన వ్యాఖ్య లను ఖండిస్తున్నానన్నారు. బందరు రోడ్డులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొత్స పిసిసి చీఫ్‌గా కాకుండా పదవి ఊడబోతోన్న పిసిసి అధ్యక్షుడి వలే మాటా ్లడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంట రుణాల రద్దుపై తొలి సంతకం చేస్తుందని ఉమా స్పష్టం చేశారు. బెల్టుషాపుల ఎత్తివేత, బిసిలకు వంద సీట్లు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల డిక్లరేసన్లపై ఇచ్చిన హామీలను తమ పార్టీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

కళంకిత మం త్రిగా ఉన్న సారధిని తక్షణమే భర్తరఫ్‌ చేసి సిఎం తన నిజాయితీని నిరూపించు కోవాలని సూచించారు. మంత్రి సారధి ఢిల్లీకి ముడుపులు పంపుతూ తన పద విని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 10న జరిగే అసెంబ్లీ సమా వేశాల్లో సభా కార్యక్రమాల్లో కళంకిత మంత్రులను మాట్లాడనివ్వకుండా అడ్డు కుంటామని ఉమా స్పష్టం చేశారు. లిక్కర్‌కింగ్‌, డాన్‌గా పేరోందిన బొత్సకు తమ పార్టీ అధినేతను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. సెంట్రల్‌ నియోజక వర్గం ఇన్‌చార్జి బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగ రానికి ఎంపి రాజగోపాల్‌ ఒక విజిటింగ్‌ ప్రొఫెసర్‌లా తయారయ్యారని విమ ర్శించారు. నగరానికి చెందిన ముగ్గురు ఎంఎల్‌ఏలు నగరాన్ని అభివృద్ధి చేయ లేని చేతగానివాళ్లల్లా తయారయ్యారని, వీళ్లా తమ పార్టీని విమర్శించేది అని ఎద్దేవా చేశారు. పదవి ఉన్న నాలుగు రోజులు ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. తమ పార్టీని, నేతలను విమర్శిస్తే కార్యకర్తలు చూస్తూ ఊరు కోరని హెచ్చరించారు.

మహానాడు తీర్మానాలపై బొత్స అవగాహనలేవి వ్యాఖ్యలు:దేవినేని