June 1, 2013


  : 'విలీనం'పై టీఆర్ఎస్ సవాల్‌కు తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో
స్పందించింది. మూడు షరతులకు ఒప్పుకొంటే టీఆర్ఎస్‌ను టీడీపీలో విలీనం చేస్తామంటూ టీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీశ్‌రావు చేసిన ప్రతిపాదనను స్వీకరిస్తున్నట్టు టీడీపీ ప్రతినిధి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హరీశ్ అభిప్రాయమే ఆయన పార్టీకీ ఉంటే..పొలిట్‌బ్యూరోలో తీర్మానించి.. కేసీఆర్‌తో ప్రకటన చేయించాలని రేవంత్ కోరారు. అప్పుడు తాము సానుకూలంగా స్పందిస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమా వేశంలో స్పష్టం చేశారు.
తాను ఈ ప్రతిపాదనను టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో, అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాలమేరకే చేస్తున్నానని చెప్పారు. "పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు, తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి వంటి షరతులకు అంగీకరిస్తే టీఆర్ఎస్‌ను మా పార్టీలో విలీనం చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. ఆయన ప్రతిపాదనలపై మాకు కొన్ని అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయాలి. ఆ తర్వాతే విలీనం ఆలోచన'' అని పేర్కొన్నారు. ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి 2008లో తామిచ్చిన లేఖను కేంద్రానికి మరోమారు ఇస్తే టీడీపీ కార్యాలయంలో చప్రాసీ పనిచేస్తానని హరీశ్‌రావు గతంలో చెప్పినా..మాట నిలుపుకోలేదని గుర్తు చేశారు.
' అసలు విలీన ప్రతిపాదన హరీశ్ వ్యక్తిగతమా ? లేక టీఆర్ఎస్ అభిప్రా యమా ? ఒకవేళ ఆ పార్టీ అభిప్రాయమే అయితే తక్షణమే పొలిట్‌బ్యూరో తీర్మానం చేసి, కేసీఆర్‌తో ప్రకటన చేయించండి. అప్పుడు మేం సానుకూలంగా స్పందిస్తాం' అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో ఇటీవలి పరిణామాలను గమనిస్తే హరీశ్ రావుకు పార్టీతో పూర్తిస్థాయిలో సంబంధాలున్నట్టు అనిపించడంలేదని వ్యాఖ్యానించారు. రఘునందన్‌రావు బయటకు వెళుతూ హరీశ్‌రావుపై చేసిన ఆరోపణలను కేసీఆర్ ఇంతవరకు ఖండించలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో చేస్తున్న ప్రతి ప్రయత్నానికి టీఆర్ఎస్ నేతలు విపరీతార్థాలు తీస్తున్నారని మండిపడ్డారు."తెలంగాణ కోసం ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
అది వదిలేసి ఈ ప్రాంత నేతలతో మాట్లాడిం చలేదు..ఆ ప్రాంత నేతలతో మాట్లాడించలేదంటూ ఆరోపిం చడం హాస్యాస్పదం' అని ధ్వజమెత్తారు. హరీశ్ ప్రతిపాదనలను తాము విమర్శించడం, ఆయనతో ప్రత్యారోపణలు చేయించుకోడానికి తాము సిద్ధంగా లేమని, ఉద్యమ సందర్భంగా సంయమనం పాటించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. "మీ ప్రతిపాదనలపైనే హరీశ్‌రావు స్పందించారు కదా' అన్న మీడియా ప్రశ్నకు.."అవును. ప్రధాని తోనో కేంద్ర హోం మంత్రితోనో లేఖను డ్రాఫ్ట్ చేయించి కేసీఆర్ తీసుకొచ్చినపక్షంలో ఒక్క అక్షరం కూడా మార్చకుండా మా అధినేతతో సంతకం పెట్టిస్తామని చెప్పాం. ఆ మరుక్షణమే టీఆర్ఎస్‌ను తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాల్సి ఉంటుందని కూడా చెప్పాం. కేసీఆర్ మహా త్యాగ పురుషుడు కదా.
తెలంగాణ కోసం ఈ చిన్న త్యాగం చేయలేరా?''అని ప్రశ్నించారు. విలీనప్రక్రియ ఎలాగో తెలియకపోతే, కేంద్ర మంత్రి చిరంజీవి సలహా తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. వంద సీట్ల కోసం వెయ్యి మందిని బలిపెట్టడమెందుకని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. టీడీపీలో విలీనం చేస్తే 294 శాసనసభా నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రభావముంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ప్రాణాలిస్తామన్న వారు ఈ చిన్నపాటి త్యాగానికి వెనుకడుగు వేస్తారని అనుకోవడంలేదని పేర్కొన్నారు.

కేసీఆర్‌తో చెప్పిస్తేనే.......... రేవంత్ రెడ్డి

శ్రీకాకుళం: ప్రభుత్వ వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూల్చివేసిందని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఆరో పించారు. గురువారం స్థానిక పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ లేఅవుట్లపై పత్రికలు, ప్రతిప క్షాలు ఎలుగెత్తి చాటుతున్నా అధికారు లు, అనధికారులు పట్టించుకోలేదన్నా రు.

ఈ లేఅవుట్లలో చాలా మంది సొం త సొమ్ముతోనే కాకుండా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు ని ర్మిం చుకున్నారన్నారు. ఇది చాలా సున్నిత మైన అంశమని చర్యలు తీసుకొనే ముం దు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే విధంగా రాజకీయ అండతో లేఅవుట్‌ల ను, రిజర్వ్ స్థలాలను ఆక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు వెంకటేష్, నాగభూషణం, పా పారావు, రాజేష్‌కుమార్ పాల్గొన్నారు.
 

ప్రభుత్వ వ్యవస్థలను కుప్పకూల్చిన కాంగ్రెస్

భీమ్‌గల్: వైఎస్ హయాంలో ఆ యన తనయుడు జగన్ అవినీతిలో భాగం పంచుకున్న ఆరుగురు కళంకిత మంత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణ మ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. గురువారం భీమ్‌గల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరుగురు మంత్రుల్లో ఇ ద్దరిని మాత్రమే తొలగించి, మిగితా న లుగురిని ఎందుకు వెనకేసుకొని వస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అవినీతిపై టీడీపీ అధినేత చంద్రబాబు మొదటినుంచి పోరాడుతూనే ఉన్నార ని ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ గు ర్తు చేశారు. అక్రమాలకు పాల్పడుతు న్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం సహా య పడడం ఎంతవరకు సబబన్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ స్పష్టత ఇచ్చినప్పటికీ.. టీఆర్ఎస్ పదే పదే ఆ రోపణలు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పా టు చేసే విషయంలో మొదటినుంచి మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారరు. రుణాల చెల్లిం పు విషయంలో ప్రభుత్వం, రైతులకు ఒత్తిడి పెంచొద్దని ఆమె ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు రామాగౌడ్, మండల కన్వీనర్ గంగాధర్‌గౌడ్, మహిపాల్ పాల్గొన్నారు.

కళంకిత మంత్రులపై చర్యలేవి?

(విజయనగరం టౌన్) :జిల్లాలో తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు నడుం బిగించారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసి, షెడ్యూల్ ప్రకారం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రా జకీయ పరిణామాలు టీడీపీకి అనుకూలంగా వున్నాయని, రానున్న ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నేతలు కృషిచేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అన్ని నియోజవర్గాల ఇన్‌చార్జిలు పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వ నిర్వాకాన్ని జనం ముం దుకు తీసుకువెళ్లాలని నిశ్చయించారు. పాలకపక్ష నేతల అవినీతి కుంభకోణాలను కూడా ప్రజా క్షేత్ర ంలోకి తీసుకుని వెళ్లి వారిని ప్రజల ముందు దోషులుగా నిలిపే కార్యచరణను సిద్దం చేశారు. ఈ నెల పది నుంచి ఆగస్టు నెలఖరు వరకూ జిల్లాలో విస్తృతంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్ని గ్రామాలు, వార్డులతో పాటు శివారు ప్రాంతాలను కూడా ఈ సందర్భంగా చుట్టిరావాలని నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. నాయకులంతా ఈ కార్యక్రమంలో సమన్వయంతో వ్యవహారించేలా జిల్లా నేతలు ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ విస్తృతస్తాయి సమావేశాలు నిర్వహిస్తారు. వెసులుబాటును బట్టి గ్రామస్థాయిలో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం వుంది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని గ్రామ, గ్రామాన విన్పిస్తారు. అలాగే ఇప్పటి పాలకులు జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళతారు. జనాకర్షక పథకాల ద్వారా ప్రజలను ఎలా మోసం చేస్తున్నది వివరిస్తారు. ఇదిలా వుండగా, తెలుగుమహిళా కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో తనవంతు బాధ్యతను నిర్వర్తించేందుకు సిద్ధమౌతుంది. ఇందులో భాగంగానే ఈ నెల 6 నుంచి జిల్లాలో బస్సుయాత్ర నిర్వహిస్తారు. కురుపాం నియోజకవర్గంతో ప్రారంభించి ఎస్‌కోటతో ముగించి ఆ తర్వాత విశాఖ జిల్లాలో ప్రవేశిస్తారు. రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు శోభా హైమావతీ దీనికి నేతృత్వం వహిస్తారు. జిల్లాలోని తెలుగుమహిళా విభాగం నేతలు, సభ్యులందరినీ ఈ యాత్రలో భాగస్వాములను చేస్తారు.
టీడీపీ హయాంలో మహిళలకు కలిగిన ప్రయోజనాన్ని వివరించడమే కాకుండా, ఈ ప్రభుత్వం మహిళలను ఏ విధంగా అణిచివేస్తున్నదీ? ప్రజల్లోకి తీసుకుని వెళతారు. ప్రధానంగా ఈ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విషయాన్ని ఉదాహరణలతో సహా జనంలోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారు. కాగా, పార్టీ అనుబంధ విభాగాలన్నింటిని కూడా ఈ రెండు నెలల కాలంలోనే మరింత క్రీయాశీలం చేసి బాధ్యతలను వికేంద్రీకరించనున్నారు. దీని వలన ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాగలవని విశ్వసిస్తున్నారు. విశేషం ఏమంటే, పాదయాత్ర జరగని జిల్లాల్లో బస్సుయాత్ర చేపడతామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఆ యాత్ర విజయవంతం అవ్వడానికి ఇప్పటి కార్యచరణ ప్రణా
ళిక మరింత దాహోదపడుతుందని భావిస్తున్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే బస్సుయాత్ర కూడా వుండడం వలన మంచి ఫలితాలు రాగలవని ఆశాభావంతో వున్నారు. మొత్తమ్మీద ఎన్నికల సమీపిస్తున్న వేళ.. టీడీపీ నాయకులు పకడ్భందీ వ్యూహాంతో ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేయడం క్యాడర్‌లో కొత్త ఉత్సాహన్ని నెలకొల్పుతుంది.
4న చీపురుపల్లిలో ధర్నా : ఆర్టీసీలో ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్‌లో కుంభకోణాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఈ నెల 4న మంత్రి బొత్స నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కుంభకోణం చీపురుపల్లి కేంద్రంగా జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు రవాణా మంత్రి బొత్స సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఇంటింటికీ టీడీపీతెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని ఉద్యమం పేరుతో కేసీఆర్ రాజకీయ డ్రామా ఆడుతున్నారని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కోరినట్టుగానే మహానాడులో రాజకీయ తీర్మానం ద్వారా తెలంగాణపై మరోసారి స్పష్టత ఇచ్చినప్పటికీ పయ్యావుల కేశవ్‌తో మాట్లాడించాలని కేసీఆర్, హరీశ్‌రావు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. తీర్మానం ప్రతిపాదించింది నామా నాగేశ్వర్‌రావు, బలపరిచింది ఆశోక గజపతిరాజు అయినా వారు ఇలా మాట్లాడడం చూస్తుంటే అసలు వారికి విజ్ఞత ఉందా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం ఎర్రబెల్లి వరంగల్ జిల్లా హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఇతర పార్టీలపై బురద చల్లడంద్వారా ఓట్లు, సీట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ తర్వాత వాటిని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టడం ఖాయమన్నారు. టీఆర్ఎస్్‌కు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను అభ్యర్ధులుగా నిలబెట్టాలని సవాల్ చేశారు. అలా చేస్తే తమ పార్టీ అభ్యర్థులను పోటీ పెట్టకుండా వారి గెలుపునకు పని చేస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడుఎడబోయిన బస్వారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమం పేరుతో డ్రామా ..కేసీఆర్ కు విజ్ఞత లేదు :ఎర్రబెల్లి

 తాను టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు కేటీఆర్‌ను కలిసినట్లు బైబిల్‌ ప్రమాణం చేసి చెప్పాలని, లేనిపక్షంలో ఆధారాలుంటే బయటపెట్టాలని తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయగౌడ్‌ డిమాండ్‌ చేశారు. గత పదేళ్లలో తానెప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌ను కలువలేదన్నారు. ఇదే విషయాన్ని తాను భగవద్గీత, బైబిల్‌ ప్రమాణం చేస్తానని, భారతికి ఏమాత్రం నిజాయితీ ఉన్న తాను కేటీఆర్‌ను కలిశానని బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో ఈడిగ ఆంజనేయగౌడ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసత్య కథనాలతో తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని చూసిన సాక్షి పత్రిక యజమాన్యానికి త్వరలోనే లీగల్‌ నోటిసులు పంపుతానన్నారు. సాక్షి పత్రికను ఎవరు చదవవొద్దని, ఆ ఛానెల్‌ ఎవరు చూడవద్దని ఆయన రాష్ర్ట ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జగన్‌ భజనతో ప్రతినిత్యం తరించే పత్రికను చదివిన, ఛానెల్‌ చూసిన మీ పిల్లలు కూడా తప్పుదారి పట్టే ప్రమాదముందన్నా రు. డబ్బు సంపాదనే లక్ష్యంగా మీ పిల్లలు సైతం వక్రమార్గాన్ని అనుసరించే అవకాశ ముందంటూ హెచ్చరించారు. సాక్షి పత్రికకు విషపు రాతలు రాయడం ఇదేమి కొత్త కాద న్నారు. గతంలో హైకోర్టు న్యాయమూర్తులపైన అసత్య కథనాలు రాసిందని గుర్తు చేశారు. బీసీ విద్యార్థి నాయకుడినైన నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేందుకు సాక్షి యజ మాన్యం కుట్ర చేసిందని మండిపడ్డారు. గత కొంతకాలంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిం చడం జరిగిందని, ఇది వారికి ఎంతమాత్రం నచ్చలేదన్నారు. ఇటువంటి కథనాలెన్ని రాసిన బెదిరేది లేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.

జులై, ఆగస్టు మాసాల్లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆంజనేయగౌడ్‌ వివరించారు. రాష్ట్రావ్యాప్తాంగా జగన్‌ అవినీతి, సోనియా, కేసీఆర్‌ కుమ్మక్కు రాజకీయాల గురించి వివరిస్తామన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ ఆడుతున్న రాజకీయ నాటకాలకు తెరదించేవిధంగా విద్యార్థి, యువకులను చైతన్యవంతులను చేసి, సెప్టెంబర్‌ మాసంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

బైబిల్‌పై ప్రమాణం చేస్తారా?


హైదరాబాద్‌ : రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌ టీడీపీను టార్గెట్‌ చేశారని టీటీడీపీ కన్వీనర్‌ ఎర్రెబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఉద్యమాన్ని పక్కనబెట్టి కేసీఆర్‌రాజకీయ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ రాజకీయ దోపిడీని అరికట్టేందుకు మేధావులు టీడీపీతో కలిసి రావాలన్నారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకి కాంగ్రెస్‌ పార్టీయేనని తెలిపారు. ఆ పార్టీ అధినేత్రి సోనియాను విమర్శించకుండా టీడీపీపై విమర్శలుచేస్తే తెలంగాణ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జేఏసీ తరపున అమరవీరుల వారసులను ఎన్నికల్లో నిలబెట్టాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు


కేసీఆర్‌పై మరోసారి టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. సైలైన్స్ ఎక్కించుకొని దొంగ దీక్ష చేసి , తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుతున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉందని , దానికి టీఆర్‌ఎస్ అందుకే సిద్ధమేనా అని ప్రశ్నించారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ నెలరోజుల్లో తెలంగాణ అని ఓట్లు దండుకొని, ఇప్పుడేమంటారని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

కేసీఆర్ దొంగ దీక్ష: ఎర్రబెల్లిహైదరాబాద్: తెలంగాణపై టిడిపికి స్పష్టత ఉందని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన రఘునందర్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఎందుకు ఖండించలేదని అడిగారు. టిడిపిలో పార్టీని విలీనం చేస్తామన్నది హరీష్ రావు వ్యక్తిగత అభిప్రాయమా? అని ప్రశ్నించారు. పార్టీ విలీనంపై హరీష్ రావు షరతులను కెసిఆర్ ఒప్పుకుంటే అప్పుడు తమ అభిప్రాయం చెబుతామన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా తమ పార్టీ అధ్యుక్షుని అనుమతిమేరకే తాను మాట్లాడుతున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

తెలంగాణపై టిడిపికి స్పష్టత ఉంది:రేవంత్


తిరుపతి : రాష్ట్రానికి కాబోయే సీఎం చంద్రబాబే అని నందమూరి తారకరత్న పేర్కొన్నారు. తిరుపతిలోని తుమ్మలకుంట వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తారకరత్న మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత బాలకృష్ణ కీలక బాధ్యతలు చేపడుతారని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన తెలిపారు.

కాబోయే సీఎం చంద్రబాబే : తారకరత్న