May 25, 2013

ఇప్పుడు కొన్ని జిల్లాల్లోనే భవిష్యత్తులో అక్కడ కూడా ఉండదు
ఎన్నికలు, సీట్లు, వసూళ్లే వాళ్ల పని
ఒక్క జిల్లాలోనూ దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేయలేదు
కేసీఆర్ కుటుంబంపై బాబు ధ్వజం
టీడీపీలో చేరిన ఓయూ విద్యార్థి నేత
రాజారాంకు టికెట్.. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి: బాబు
దొరల గడీ కంటే బీసీల పార్టీయే బెటర్: రాజారాం

'మీరు ఒకటంటే మేం వంద అంటాం. ఖబడ్దార్' అంటూ కేసీఆర్‌ను చంద్రబాబు హెచ్చరించారు. పార్టీలను తిట్టవచ్చని, సిద్ధాంతాలను విమర్శించవచ్చని, కానీ, వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని హితవు పలికారు. 'మాయ మాటలు, రోజుకో అబద్దం.. ఇవే కేసీఆర్ పని. ఉప ఎన్నికలు వేరే.. సాధారణ ఎన్నికలు వేరే.. టీఆర్ఎస్ కొన్ని జిల్లాల్లోనే ఉంది. రానున్న రోజుల్లో అక్కడ కూడా ఉండదు. మీరే చూస్తారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఉస్మానియా వర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడు రాజారాం యాదవ్ శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌భవన్‌లో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. టీఆర్ఎస్, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'తెలంగాణకు అనుకూలంగా 2005లోనే టీడీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. దీంతో, టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీకి 45 సీట్లు ఇస్తే పది కూడా గెలవలేకపోయారు.

తెలంగాణపై టీడీపీ ఇప్పటికీ స్పష్టంగానే ఉంది. 2008 నాటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతూ లేఖ కూడా ఇచ్చాం. అయినా టీఆర్ఎస్ విమర్శిస్తోంది. వాళ్లకు ఎప్పుడూ ఎన్నికలు, సీట్లు, నోట్లు, వసూళ్ల గొడవలు తప్ప మరేమీ పట్టదు. 27 ఏళ్ల రాజకీయ జీవితం, 12 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో కేసీఆర్ గానీ, ఆ పార్టీ నేతలు కానీ ప్రజలకు ఏం చేశారు?' అని నిలదీశారు. బాబ్లీపై తామే పోరాడామని, వర్గీకరణపై తామే ఉద్యమం చేశామని చెప్పారు. ఉద్యమం ముసుగులో టీఆర్ఎస్ నేతలు డబ్బు దండుకున్నారని, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 'వంద సీట్లు ఎక్కడ గెలుస్తారు? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ పదవికి కూడా పోటీ చేయలేదు. సెంటిమెంటుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు.

దళితుడిని సీఎం చేస్తానన్నాడు. ఒక్క జిల్లాలో కూడా దళితుడిని పార్టీ అధ్యక్షునిగా చేయలేదు. మరి ఎస్సీని సీఎంగా ఎలా చేస్తారు?' అని నిలదీస్తారు. 2014లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసిన, బడుగులకు సామాజిక న్యాయం జరగాలని పోరాడుతున్న రాజారాం యాదవ్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తనపై 180 కేసులున్నా, జైల్లో 105 రోజులు గడిపినా రాజారాం వెరవకుండా పోరాడారని ప్రశంసించారు.

పార్టీలోకి చేరేందుకు రాజారాం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారని, కానీ, కొన్ని పార్టీల్లో చేరాలంటే జైళ్లకో, ఫాం హౌస్‌లకో వెళ్లాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. బీసీలకు తాము ప్రకటించిన వంద సీట్లలో ఒకటి రాజారాంకు ఇచ్చి గెలిపించుకుంటామని, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తామని ప్రకటించారు. రాజారాంను పేదల పెన్నిధిగా తయారు చేసేలా పార్టీ సహకరిస్తుందన్నారు. బీసీలకు వంద సీట్లు అని ధైర్యంగా ప్రకటించింది టీడీపీయేనని, ఆ పార్టీలకు బీసీల ఓట్లు కావాలి తప్ప సామాజిక న్యాయం పట్టదని ఆగ్రహించారు.

సీట్లన్నీ సోనియాకు ధారాదత్తం: రాజారాం

టీడీపీ బీసీలకు అనుకూల పార్టీ అని, అందుకే టీడీపీని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని టీడీపీలో చేరిన రాజారాం యాదవ్ అన్నారు. దొరల గడీలో కంటే బీసీలను అభిమానించే పార్టీలో ఉండడం మంచిదని తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. కేసీఆర్‌ను చాలా దగ్గరిగా గమనించానని, ఆయన ప్రవర్తన అహంకారపూరితమని చెప్పారు. 'విద్యార్థుల ఉద్యమం వల్ల వచ్చిన డిసెంబర్ 9 ప్రకటనను కేసీఆర్ ఎన్నికల దిశగా మళ్లించాడు.

కరీంనగర్‌లో గ్రానైట్ మాఫియా నాయకుడు గంగుల కమలాకర్‌కు టికెట్ ఇస్తారట' అని మండిపడ్డారు. నాడు చెన్నారెడ్డి 14 సీట్లను అమ్ముకుంటే ఇప్పుడు కేసీఆర్ అదే దారిలో పయనిస్తున్నాడని, గెలిస్తే అన్ని సీట్లూ సోనియాకు ధారాదత్తం చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై స్పష్టతను ఇస్తూ లేఖ ఇచ్చిన తర్వాత కూడా టీడీపీని ఎందుకు విమర్శిస్తున్నాడని నిలదీశారు. టీడీపీతో బీసీలకు ప్రాతినిథ్యం దక్కుతుందన్న దుగ్ధతోనే కేసీఆర్ టీడీపీని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. టీఎస్ఎన్వీ రాష్ట్ర కార్యదర్శులు కేశినేని వెంకటేశ్వర్లు, కట్ల నందకిశోర్ ఆధ్వర్యంలో 50 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు బాబు సమక్షంలో పార్టీలో చేరారు.

రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఔట్!: చంద్రబాబు


ఓట్లు మాకు వేసి ఉచ్చ నీకు పోస్తారు..
దానిని పట్టుకుని ఉంచుకో
టీ టీడీపీ నేతలు పోస్తే ఊపిరాడక చస్తావు
కేసీఆర్ తిట్ల పురాణానికి దీటుగా రేవంత్ జవాబు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసన

 
తెలంగాణలో చంద్రబాబుకు ఓట్లు కాదు కదా ఉచ్చ కూడా పడదంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం పార్టీ నేతలు అదే మోతాదులో ప్రతిస్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద టీడీపీ నాయకులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. "ఓట్లు మాకు వేసి ఉచ్చ నీకు పోస్తారు. దానిని పట్టుకొని ఉంచుకొంటే ఫాం హౌస్‌లో మందు కొట్టేటప్పుడు ఎప్పుడైనా సోడా తక్కువైతే కలుపుకోవడానికి పనికొస్తుంది. లేకపోతే ఫాం హౌస్‌లో మొక్కలకు ఎరువుగా వాడు. అవైనా బాగా పెరుగుతాయి'' అని కేసీఆర్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎర్రబెల్లి గురించి కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అదే ఎర్రబెల్లి నాయకత్వంలో తెలంగాణలోని టీడీపీ కార్యకర్తలంతా కలిసి కేసీఆర్ మాట్లాడుతున్న దానిని పోస్తే ఆయన, ఆ పార్టీ నేతలు అందులో కొట్టుకుపోయి ఊపిరాడక చస్తారని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. "మేం కూడా కేసీఆర్‌లాగా మాట్లాడగలం. మాకు అంత కంటే ఎక్కువే వచ్చు. కానీ, సభ్యత అడ్డం వచ్చి మాట్లాడలేకపోతున్నాం. కేసీఆర్ మాటలు చూసి తెలంగాణలో అందరూ ఇలాగే మాట్లాడతారని ఇతర ప్రాంతాల వారు అనుకొనే ప్రమాదం ఉంది.

ఈ మాటలకు.. ఈ సంస్కృతికి తెలంగాణకు సంబంధం లేదు. బుడ్డిపేట నుంచి వలస వచ్చిన కేసీఆర్ తనతోపాటు ఈ అవలక్షణాలను మోసుకొని వచ్చాడు. తెలంగాణ సమాజానికి, సంస్కృతికి మీ అవలక్షణాలను పులమకండి. అవి తెలంగాణ మాటలు కావు'' అని విమర్శించారు. ఎండ దెబ్బకు కేసీఆర్‌కు మతి భ్రమించిందని, అందుకే నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై మహానాడులో టీడీపీ తీర్మానం చేస్తుందా అని ప్రశ్నిస్తున్న కేసీఆర్.. అదే ప్రశ్నను కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. "మొన్ననే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితోపాటు అన్ని జిల్లాల నేతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో తెలంగాణపై తీర్మానం చేయాలని కేసీఆర్ ఎందుకు అడగలేదు? ఒక్క టీడీపీనే ఎందుకు అడుగుతున్నావు? కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని అడగడమేమిటి' అని నిలదీశారు. తె లంగాణ రాష్ట్ర సాధన కోసం వెయ్యి మంది తమ ప్రాణాలు అర్పిస్తే వాటిని వంద అసెంబ్లీ సీట్ల కోసం వాడుకోవడానికి కేసీఆర్ తపిస్తున్నారని విమర్శించారు.

"నీ బొంద మీద వంద అసెంబ్లీ సీట్లు పెట్టినా వాటిని చివరకు సోనియా గాంధీకి అమ్ముకొనే వాడివే. రఘునందన్, చాడా సురేష్ రెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య వంటి వారంతా నీ అసలు రంగు బయట పెడుతున్నారు. ఉస్మానియా జేఏసీలో పని చేసిన విద్యార్థి నేతలకు నీ రంగు తెలిసిపోయి టీడీపీలోకి వస్తుంటే చెమటలు పడుతున్నాయి. టీఆర్ఎస్‌కు వంద సీట్లు వచ్చినా ఒరిగేది శూన్యం. ప్రజలను వంచించి 4 సీట్లు గెలిపించుకోవడానికే కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు'' అని రేవంత్ మండిపడ్డారు. కాగా, కేసీఆర్ భాష మార్చుకోవాలని, లేకపోతే జనం ఉచ్చ చేతుల్లో కాదు.. నోట్లో పోస్తరని వరంగల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బస్వారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ వెంటనే చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బాన్సువాడ టీడీపీ ఇన్‌చార్జీ బద్యానాయక్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే మల మూత్రాలతో ఆయన నోటిని శుభ్రం చేస్తామని నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ వెయ్యి మందిని బలి తీసుకుని వేలాది కోట్లను దోచుకున్నారని ఎంపీ నామా విమర్శించారు. చంద్రబాబు పేరు తలిస్తేనే కేసీఆర్‌కు ఉచ్చ పడుతుందని దయాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేకే మతిభ్రమించినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేలు సీతక్క, సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ అధినేతలా కాకుండా, వెగటు భాషా సంఘం అధ్యక్షుడిలా కేసీఆర్ దిగజారుడు పదజాలం వాడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు.

మందులోకి పనికొస్తుంది!: రేవంత్

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పొత్తులు లేకుంటే టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ గెలవలేదన్నారు. ఓయూ జేఏసీ మాజీ నేత రాజారాంయాదవ్‌ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉపఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలు వేరని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల్లో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకుంటామని హామీయిచ్చారు.

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం: చంద్రబాబుతెలంగాణ ప్రాంతాన్ని వెనుక బడిన ప్రాంతాన్ని
అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలంగాణపై
2008లోనే తమ వైఖరి స్పష్టంగా చెప్పామని,
అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ
కూడా రాశామని తెలుగుదేశం పార్టీ
అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు.
అసలు తెలంగాణ అంశంపై అఖిలపక్ష
సమావేశం నిర్వహించమని డిమాండ్ చేసిందే
తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అఖిలపక్షంలో
గతంలో తీసుకున్న వైఖరికే కట్టుబడుతూ లేఖ
ఇచ్చామన్నారు.
ఎన్నిసార్లు తెలంగాణపై స్పష్టత ఇచ్చినా..
టీఆర్ఎస్ ఉద్దేశ పూర్వకంగా బురద
జల్లుతూ కుట్రలు కుతంత్రాలు చేస్తోందని
దీన్ని ప్రజలే తిప్పి కొడతారని పేర్కొంటున్నారు

కేసిఆర్ కుతంత్రాలు ఇక చెల్లవ్: చంద్రబాబు

  'ఐఏఎస్‌లా?, దొంగలా?... పల్లెలో విద్యుత్ సమస్యల గురించి మాట్లాడదామని వస్తే దొడ్డి దారిన పారిపోతారా?' అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సీపీడీసీఎల్ అధికారులపై ఫైర్ అయ్యారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా సరిగా లేదని పయ్యావుల రెండు నెలల కిందట విద్యుత్ ఈఆర్‌సీ కార్యాలయానికి వెళ్లి బైఠాయించారు. అప్పట్లో ఈఆర్‌సీ స్పందించి ఇక నుంచి గ్రామాల్లో 5 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని సర్క్యులర్ విడుదల చేసింది. ప్రభుత్వం ఆదేశాలు గ్రామాల్లో అమలు కావడం లేదని, ఈ విషయం అధికారుల దష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆయన శనివారం సీపీడీసీఎల్ కార్యాలయానికి వెళ్లారు. ఇంధనశాఖ కార్యదర్శి ఎం సాహు, సీపీడీసీఎల్ సీఎండీ అనీల్‌కుమార్ సమావేశంలో ఉన్నారని అటెండర్ చెప్పడంతో కేశవ్ వారి కోసం కొంత సేపు వేచి చూశారు.

కొద్ది సేపటి తర్వాత అధికారులు సమావేశం ముగించుకుని వెళ్లిపోవడంతో, అటెండర్ వచ్చి అధికారులు అందరూ వెళ్లిపోయారని అనడంతో కేశవ్ ఫైర్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్‌లు ప్రజా ప్రతినిధులొస్తే దొంగల్లా పారిపోతారా? అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై సభాపతికి ఫిర్యాదు చేస్తానన్నారు.

ఛార్జీలు పెంచమని ప్రభుత్వం ఆదేశాలిస్తే అమలు చేసే ఈ అధికారులు ఐదు గంటలు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని ఇచ్చిన సర్క్యులర్‌ను ఎందుకు అమలు చేయరని నిలదీశారు. రెండు రోజుల్లోగా ఆ సర్క్యులర్ అమలు చేయకపోతే ప్రజల నుంచి మిస్‌డ్ కాల్స్ రూపంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆ ఇద్దరు అధికారులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు.

ఐఏఎస్‌లా? దొంగలా? : పయ్యావుల

తెలంగాణపై టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆడుతున్న నాటకాలు అందరికీ తెలుసునని, త్వరలోనే ఈ ప్రాంతవాసులు ఆయన నోట్లో ఉచ్చపోసే రోజులు రాబోతున్నాయని నిజామాబాద్ జిల్లా టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బద్యానాయక్ స్వగహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై శుక్రవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

రాజకీయాల్లో ఉన్నవారు వ్యక్తిగత దూషణాలకు దిగరాదన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచారంటూ టీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తారు. తమకు కూడా పరుష పదజాలంతో దూషించడం వచ్చునన్నారు. కేసీఆర్ వెంటనే చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

కేసీఆర్ నోట్లో ఉచ్చపోసే రోజులు రాబోతున్నాయి: టీడీపీ

అవిశ్వాసం పెడతాం
వామపక్షాలతో పొత్తులూ ఉంటారుు
రీేకంద్రంలోనూ థర్డ్‌ ఫ్రంట్‌ రావడం తథ్యం
రైతులకు పంట రుణాలు మాఫీ చేసి చూపిస్తాం
మహానాడు సందర్భంగా మీడియాతో
ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు వ్యాఖ్యలు
టీఆర్‌ఎస్‌వి దౌర్జన్యాలు, బ్లాక్‌మెరుుల్‌, వసూళ్లే
రాష్ట్రాన్ని భ్రష్టూ పట్టించారని ధ్వజం
తెలంగాణ అమర వీరులకుటుంబీకులకు ఉద్యోగాలు
మహానాడుకు జూ.ఎన్టీఆర్‌, హరికృష్ణ వస్తారని ఆకాంక్ష
  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నామని, దీనిపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని వందకు వందశాతం తామే గెలుస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 27,28న పార్టీ మహానాడును పురస్కరించుకుని ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సుమారు గంట 15 నిమిషాలు సాగిన ఈ సంబాషణ ముఖ్యాంశాలు ఇవీ.పిల్ల కాంగ్రెస్‌ ప్రభావం తగ్గుతోందని, టీఆర్‌ఎస్‌ సాధారణ ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవని, కాంగ్సెస్‌కు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పోటు తప్పదని ఆయన విశ్లేషించారు. ఉప ఎన్నికల్లో అప్పుడో సీటు ఇప్పుడో సీటు ఖాతాలో వేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ వసూళ్ల పార్టీగా మారిందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
దౌర్జన్యాలు, బ్లాక్‌ మెయిల్‌తో రాష్ట్రంలోని పరిస్థితులను గందరగోళం సృష్టించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. పిల్ల కాంగ్రెస్‌ ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయన్నారు. తోక పార్టీలు అవిశ్వాసం పెడితే తాము వాటి వెంట వెళ్లబోమని ఆయన చెప్పారు.క్రిష్టియన్‌ ప్రాపర్టీస్‌ అన్నీ జగన్‌ కుటుంబ సభ్యులే దోచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ మేనల్లుడు పీటర్‌ అధికారం లేకున్నా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన వెనుక జగన్‌, బ్రదర్‌ అనీల్‌ ఉన్నారన్నారు. ‘‘రైతులకు పంట రుణాలను మాఫీ చేసి చూపిప్తామన్నారు. 9 సంవత్సరాల అనుభవం నాది.. రెండు సంవత్సరాల అనుభవం కిరణ్‌కుమార్‌రెడ్డిది. వారికి ఎలా చేయాలన్నది కూడా తెలియదు’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో జరగనున్న మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పని చేసే కార్యకర్తలు ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీగా అవతరించిన తెలగుదేశం పార్టీ దేశ రాజకీయాలను శాసించిందని, కేంద్రంలో మూడు సార్లు కాంగ్రెసేతర పక్షాలు అధికారంలోకి వచ్చాయంటే తెలుగుదేశం పార్టీ చొరవే కారణమన్నారు.
2009లోనే నగదు బదిలీ గురించి తెలుగుదేశం పార్టీ వివరిస్తే దాన్ని కాంగ్రెస్‌ పార్టీ కాపీ కొట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్‌ ఉందన్నారు. టీడీపీలో క్రమ శిక్షణ గల కార్యకర్తలు ఉన్నారన్నారు. తన కుమారుడు నారా లోకేశ్‌ సహా యువతను పార్టీలోకి ఆహ్వానిస్తామని బాబు తెలిపారు. వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. కడియం శ్రీహరిని విశ్వాసం లేని నేతగా దూషించారు. ఆనాడు తెలంగాణపై ఇచ్చిన లేఖ బ్రహ్మాండంగా ఉందన్న కడియం, ఇప్పుడు దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. 2009లో తామిచ్చిన లేఖ ఆధారంగా టీఆర్‌ఎస్‌ తమతో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. ఆ లేఖకు కట్టుబడి ఉన్నామంటే తప్పుబడుతున్నారని మండిపడ్డారు.
ఉట్టికి ఎగరలేనమ్మ...!
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది టీఆర్‌ఎస్‌ వైఖరి అని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు కనీసం కార్పోరేటర్‌ అభ్యర్థులను కూడా పెట్టలేని వారు 100 అసెంబ్లీ సీట్లు ఎలా గెలుస్తారని బాబు ఎద్దేవా చేశారు. పిల్ల కాంగ్రెస్‌ నేతల వల్లే రాష్ట్రం భ్రష్టు పట్టిందని చంద్రబాబు ఆరోపించారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో థర్డ్‌ఫ్రంట్‌కు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చేబుతున్నాయన్నారు. కమ్యూనిస్టులతో పొత్తులకు టీడీపీ సిద్దంగా ఉందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వంపై పోరాటానికి అవిశ్వాస తీర్మానమే సరైందని భావిస్తే తప్పకుండా తామే అవిశ్వాసం పెడతామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తనను తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికే ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్టాపనను పురంధేశ్వరి వివాదాస్పదం చేసిందన్నారు.
అయినా తాను ఓర్పు వహించి విగ్రహం పార్లమెంటులో ఉండాలని కొంత సహనం వహించానన్నారు. ఎన్టీఆర్‌పై గౌరవంతోనే విగ్రహంపై వివాదం రేపినా వెనక్కి తగ్గామన్నారు. శంషాబాద్‌ ఏర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరు తొలగించినపుడు పురంధేశ్వరి ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు నిలదీశారు. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు మహానాడుకు హాజరుకావాలని, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి పని చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కలిసి రాక పోతే ఎలా అన్నారు. వారు వస్తారని తాను విశ్వసనీయంగా ఉన్నానన్నారు. కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌ మాత్రమే కాంగ్రెస్‌కు ప్రత్నామ్నాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఏన్డీయేగానీ, యూపీఏ గానీ పెరగడం లేదని, ప్రాంతీయ పార్టీలే ఎదుగుతున్నాయని ఈ స్థితిలో కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌ బలంగా ముందుకు వస్తుందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు.
కేంద్రంలో మూడు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడానికి తమ పార్టీయే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రక అవసరమని ఆయన అన్నారు. తమ పార్టీకి క్రమశిక్షణతో పని చేసే కార్యకర్తల బలగం దండిగా ఉందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా ఉనికిని చాటుకుందన్నారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరించాయని ఆయన చెప్పారు. 2009లో తాము ప్రకటించిన నగదు బదిలీ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉన్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పార్టీని కార్యకర్తలే కాపాడుతున్నారన్నారు. నేతలు వలస వెళ్లినా కార్యకర్తలే పార్టీకి అండగా ఉన్నారన్నారు. మహిళలకు భద్రత, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించామన్నారు.
తాము నీతివంతమైన సమర్ధవంతమైన పాలన అందించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. తాము గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు వామపక్షాలు ముందుకు వస్తే పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి మాట్లాడుతామని వామపక్షాలు అంటున్నాయని, అందువల్ల తాము తొందరపడ దలుచుకోలేదని అన్నారు. తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలను సాగిస్తున్నామన్నారు. తెలంగాణపై తమ లేఖను చూసిన తర్వాతనే టీఆర్‌ఎస్‌ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుందన్నారు. పశువులకు ఉన్న కృతజ్ఞత కూడా జంప్‌ జిలానీలకు లేదని, తమ ఇంట్లో కష్టాలు ఉంటే గోడ దూకేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని, 2014 సీట్లపై, పొత్తులపై తమకు స్పష్టత ఉందని పేర్కొన్నారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, టీఆర్‌ఎస్‌ విమర్శలను తమ పార్టీ నేతలు రాజకీయ కోణంలోనే చూడాలని చంద్రబాబు అన్నారు.

కేసిఆర్‌ చేసిందేమీ లేదు...
టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ కేంద్ర మంత్రి ఉండి కూడా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తును కూడా వ్యతిరేకించని కేసిఆర్‌కు వసూళ్లు, బ్లాక్‌ మెయిల్‌ తప్ప మరేం తెలియదన్నారు. ఆయన స్థాయికి దిగజారీ మాట్లాడడం తమకు వచ్చని.. అయితే సంస్కారం అడ్డువస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లోకి ఎమ్మెల్యేలు ఎందుకు మారుతున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ అణు ఒప్పందాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తే ఆ బిల్లును ఎలా అయినా సరే పాస్‌ చేయించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్‌ సంతలో పశువులను కొన్నట్లు తమ ఎంపీలను కొనేసిందన్నారు. అలాంటి వారు మళ్లీ ఇప్పుడు ఇంకో పార్టీ మారతామంటున్నారని వీరికి విలువలు ఉన్నాయా? అని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే తెలంగాణ అమర వీరులకుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.
లోకేష్‌కు లైన్‌ క్లీయర్‌...!
రానున్న ఎన్నికల్లో తన తనయుడు నారా లోకేశ్‌ రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు చంద్రబాబు లైన్‌ క్లీయర్‌ చేశారు. యువతకు 30 శాతం సీట్లు ఇస్తామని చెప్పామని, ఉత్సాహం ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చని, పరిశీలించాక పార్టీ తుది నిర్ఱయం తీసుకుంటుందన్నారు. అందులో లోకేశ్‌ కూడా ఉండవచ్చని అన్నారు. లోకేష్‌నేకాదు యువతను అందరినీ ఆహ్వానిస్తానన్నారు.
సాక్షి.. టీ న్యూస్‌ను బహిష్కరిస్తాం
తనపై అసత్య వార్తలను పేజీలకు పేజీలు వండి వారుస్తున్న సాక్షి పత్రికను బహిష్కరించాల నుకుంటున్నా మన్నారు. వ్యక్తిగత కక్షతో వార్తలు రాస్తున్న ఆ పత్రిక, టీవీ ఛానల్‌ పాత్రికేయులు ఇకపై టీడీపీ ప్రెస్‌మీట్‌లకు ఆహ్వానాలు పంపించాల్సిన అవసరం లేదని మీడియా కమిటీ ఛైర్మన్‌ ఎల్‌విఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను ఆదేశించారు. వారిని పిలిపించుకుని తమ పూడికలన్నీ కడిగించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని ఇన్నాళ్లూ ఓపిక వహించామని.. మహానాడులో చర్చించి సాక్షి, టీ ఛానల్‌ నిశేధంపై తుది నిర్ణయాన్ని వెలువరుస్తామన్నారు.

టీడీపీ సెక్యులర్‌ పార్టీ..బీజేపీతో కలవం వచ్చేసారి గెలిచేది టీడీపీనే


తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందాం
తొడగొట్టిన చంద్రబాబు.. కేసీఆర్‌కు సవాల్


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తొడగొట్టారు. తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. "కేసీఆర్.. నువ్వూ కేంద్రంలో, రాష్ట్రంలో రెండు, మూడేళ్లు అధికారంలో ఉన్నావు. తెలంగాణ కోసం ఏం చేశావు? ఒక్క సమస్యనైనా పట్టించుకున్నావా? నువ్వేం చేశావో.. నేనేం చేశానో చర్చిద్దాం...రా'' అని చంద్రబాబు సవాల్ విసిరారు. సోమవారం నుంచి మహానాడు సదస్సు మొదలవుతున్న సందర్భంగా శనివారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాటి ముఖ్యాంశాలు ఇవీ..

ఈసారి ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా? ఉంటే ఎవరితో?
ఇంకా ఏమీ అనుకోలేదు. ముందు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాం. ఉంటే వామపక్షాలతోనే పొత్తుకు అవకాశం ఉంది. బీజేపీతో పొత్తుకు అవకాశం లేదు.

బీజేపీతో పొత్తు పెట్టుకొంటే పట్టణ ప్రాంతాల్లో మోడీపై ఉన్న సానుకూలత మీకు ఉపయోగపడుతుంది కదా?

పట్టణాల్లో ఆ సానుకూలత మాపై ఇంకా ఎక్కువ ఉంది. నేను అమలు చేసిన అభివృద్ధి నమూనానే గుజరాత్‌లో అమలు చేశారు.

రాష్ట్రంలో ఈసారి మీ పార్టీ పరిస్ధితి ఎలా ఉంటుంది?
నూటికి నూరు శాతం గెలుస్తాం. సొంతబలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. జగన్ పార్టీ రోజురోజుకూ క్షీణిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా బలహీనపడుతోంది. కాంగ్రెస్ పరిస్థితి అధ్వానం. హైదరాబాద్‌లో కార్పొరేటర్లను పోటీకి పెట్టలేని పార్టీ వంద సీట్లు వస్తాయని చెప్పుకొంటే ప్రజలు నమ్ముతారనుకోను.

వలసలు మీ పార్టీని బలహీనపర్చడం లేదా?

కేడర్ పటిష్ఠంగా ఉంది. ఎంతమంది వెళ్లినా మాకేం కాదు. వెళ్లినవారే నష్టపోయారు. ఇంటికి కష్టంవస్తే వదిలిపోతామా?కానీ వీళ్లు పిరికితనంతోనో.. ప్రలోభాలతోనే వెళ్లిపోయారు.

మీ చుట్టూ కోటరీ ఉందని వెళ్లిన నాయకులు అంటున్నారు.
పార్టీలో ఉన్నప్పుడు ఆ కోటరీలో వీళ్లు లేరా? ఇంటి దగ్గరా.. పార్టీ కార్యాలయంలో.. బయటా ప్రతిచోటా వీళ్లే ఉండేవారు కదా? ఎమ్మెల్యే సీట్లు వీళ్లకే కావాలి. ఇవ్వకపోతే నేను దుర్మార్గుడిని.

తెలంగాణపై మీకు స్పష్టత లేదని కడియం అంటున్నారు.
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరపున వెళ్లి లేఖ ఇచ్చి పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని మీడియాతో ఆయనే చెప్పారు.

మహానాడులో తెలంగాణపై తీర్మానం చేస్తారా?

టీఆర్ఎస్ అడిగితే చేయాలా? తీర్మానం చేసినా మరొకటి కావాలంటారు. ప్రజల కోణ ంలో ఏం చేయాలో అది చేస్తాం. మాకన్ని విషయాలపైనా స్పష్టత ఉంది. అవసరం అనుకొంటే మహానాడులో చర్చించాలా అన్నది ఆలోచిస్తాం.

ఉద్యమంలో ఆత్మహత్య చేసుకొన్న వారి కుటుంబాలను ఆదుకొంటారా?
మేం అధికారంలోకి వస్తే.. ప్రాంతంతో సంబంధం లేకుండా ఉద్యమంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను ఆదుకొంటాం. వారికి ఉద్యోగాలు ఇవ్వాలా లేక మరో రకంగా ఆదుకోవాలా అన్నది చూస్తాం.

రుణ మాఫీ ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి అడుగుతున్నారు.

ఆయనకు నేనెందుకు చెప్పాలి? చేసి చూపిస్తా. నేను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశా. ఏది ఎలా సాధ్యమో.. ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. కిరణ్‌కు ఉన్నది కేవలం రెండేళ్ల అనుభవం. నేను చేసిన వాటిని కొనసాగించడమే వారికి చేతకావడం లేదు. వారికి నేను చెప్పేదేమిటి?

అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని మీ ప్రత్యర్థులు అంటున్నారు.
అంత ఖర్మ నాకేమిటి? నాకేమైనా బెయిల్ కావాలా? కేసులు ఎత్తివేయించుకోవాలా? తోక పార్టీలు అవిశ్వాసం పెడితే మేం ఎందుకు మద్దతు ఇవ్వాలి? అవిశ్వాసం పెట్టి వాళ్లు బేరసారాలు చేసుకొంటుంటే మేం మద్దతు ఇవ్వాలా? రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలినంత మద్దతు ప్రతిపక్షాలకు లేదు. ప్రజల కోణంలో అవసరమైనప్పుడు అవిశ్వాసం సహా అన్ని అస్త్రాలను మేమే ప్రయోగిస్తాం.

ఎన్టీఆర్ కుటుంబానికి, పార్టీకి మధ్య అగాధం మాటేమిటి?
పార్టీ సుప్రీం. పార్టీ ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యులు పని చేస్తే వారి గౌరవం పెరుగుతుంది. ఈ దిశగా కలిసి వచ్చే వారికి వెల్‌కం. పార్టీకి పునర్‌వైభవ సాధనకు వారందరి సహకారాన్ని కోరుతున్నాను. వైసీపీ ఫ్లెక్సీలపై ఎన్టీఆర్ బొమ్మ పెట్టడం తగదన్నది పార్టీ అభిప్రాయం. ఎవరైనా పెట్టుకోవచ్చునన్నది హరికృష్ణ వ్యక్తిగత అభిప్రాయం. పార్టీలో ఉన్నవారంతా పార్టీ అభిప్రాయాలకు కట్టుబడి ఉంటే బాగుంటుంది. టీడీపీ ఫ్లెక్సీలపై వైఎస్, ఇందిర ఫొటోలను మేం పెట్టడం లే దు. వైసీపీ నేతలను పెట్టవద్దని చెప్పాం. ఐనా సిగ్గు లేకుండా పెట్టుకొంటే వారి ఖర్మ.

లోకేశ్, ఎన్టీఆర్‌ల భవిష్యత్తు ఏమిటి?
పార్టీ కోసం పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉం టుంది. పార్టీ కోసం పని చేస్తే గౌరవం ఇస్తాం. కలుపుకొనిపోతాం. లోకేశ్ అయినా అంతే. నేను నా కొడుకుగా ప్రోత్సహించడం లేదు. పనిచేస్తే బాధ్యతలు వస్తాయి. రాజకీయం వారసత్వంగా రాదు. ఆసక్తి ఉండాలి.

టికెట్లు ముందుగా ప్రకటిస్తారా?
తగిన సమయంలో ప్రకటిస్తాం. ముందు ప్రకటించే ఆలోచన ఉంది. ఇన్‌చార్జులందరికీ టికెట్లు ఇస్తాం. ఎవరైనా బాగా పనిచేయకపోతే మాత్రం మారుస్తాం.

దమ్ముంటే.. చర్చకు రండి!: చంద్రబాబు


హైదరాబాద్: కేంద్రంలో తృతీయ ఫ్రంట్ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్డియే గానీ యుపిఎ గానీ పెరగడ లేదని, ప్రాంతీయ పార్టీలు పెరుగుతున్నాయని, ఈ స్థితిలో కేంద్రంలో తృతీయ ఫ్రంట్ బలంగా ముందుకు వస్తుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని ఆయన అన్నారు. కేంద్రంలో మూడు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడానికి తమ పార్టీయే కారణమని ఆయన అన్నారు. నాలుగో కూటమి అనే మాట లేదని ఆయన అన్నారు.

ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రిక అవసరమని ఆయన అన్నారు. తమ పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తే కార్యకర్తల బలగం దండిగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా తమ పార్టీ ఉనికిని చాటుకుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరించాయని ఆయన చెప్పారు. 2009లో తాము ప్రకటించిన నగదు బదిలీ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పార్టీని కార్యకర్తలే కాపాడుతున్నాయని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఏ అభివృద్ధి జరిగినా తమ పార్టీ ముద్ర ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలుగువారి ప్రతిష్ట మంట కలిసిందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలకు భద్రత, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించామని చెప్పారు.

తాము రాష్ట్రంలో నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందించామని చెప్పారు. ప్రస్తుత స్థితిలో త్వరలో జరుగుతున్న మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ఆయన చెప్పారు. తాము గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు వామపక్షాలు ముందుకు వస్తే పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి మాట్లాడుతామని వామపక్షాలు అంటున్నాయని, అందువల్ల తాము తొందరపడ దలుచుకోలేదని, తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలసు సాగిస్తున్నామని ఆయన చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. తోక పార్టీలు అవిశ్వాసం పెడితే తాము వాటి వెంట వెళ్లబోమని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ లేఖను చూసిన తర్వాతనే తెరాస 2009లో తమతో పొత్తు పెట్టుకుందని ఆయన చెప్పారు. హైదరాబాదులో పోటీ చేయలేని తెరాస వంద సీట్లు ఎలా గెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై గౌరవంతో పార్లమెంటులో విగ్రహావిష్కరణపై సర్దుకుపోయామని ఆయన చెప్పారు. పుశువులకు ఉన్న కృతజ్ఢత కూడా జంప్ జిలానీలకు లేదని, తమ ఇళ్లలో కష్టాలు ఉంటే గోడ దూకేస్తారా అని ఆయన అన్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని, 2014లో సీట్లపై, పొత్తులపై తమకు స్పష్టత ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, తెరాస విమర్సలను తమ పార్టీ నేతలు రాజకీయ కోణంలో చూడాలని ఆయన అన్నారు.

కేంద్రంలో తృతీయ ఫ్రంట్, ప్రత్యామ్నాయం లేదు: బాబు


తెలంగాణపై తమ పార్టీ స్పష్టత ఇవ్వలేదనే విమర్శలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. తెలంగాణపై తాము స్పష్టత ఇచ్చామని, అయినా కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆనయ అయన అన్నారు. మహానాడులో ప్రతిపాదించే రాజకీయ తీర్మానంలో తెలంగాణ ప్రదానాంశంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు జరిగే మహానాడు ప్రాధాన్యం ఉంటుందని ఆయన అన్నారు.

గండిపేటలోని ఎన్టీఆర్ కుటీర్‌లో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను శనివారం 16 కమిటీల నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశంతో పాటు కళంకిత మంత్రుల తొలగింపు, విలువలతో కూడిన రాజకీయాలపై చర్చ ఉంటాయని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీ కోసం పాదయాత్రలో ఇచ్చిన హామీలను తీర్మానాల రూపేణ చర్చించి ఆమోదిస్తామని

మేం క్లియర్: యనమల


హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎండ దెబ్బకు కెసిఆర్‌కు మతిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నీచమైన భాషను కెసిఆర్ విద్యార్థులకు, ప్రజలు నేర్పుతున్నారా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎలా కొట్టాలో తమకు తెలుసునని ఆయన అన్నారు.

కెసిఆర్ కన్నా పరుషంగా తాము మాట్లాడగలమని, ఆయితే తమకు సభ్యత అడ్డు వస్తోందని ఆయన అన్నారు. తల తిక్క మాటలు మాట్లాడి తమ పార్టీని బలహీనపరుద్దామని కెసిఆర్ అనుకుంటే చెల్లదని ఆయన అన్నారు. తెరాస నుంచి వెళ్లిపోతున్నవారి గురించి కెసిఆర్ ఆలోచించాలని ఆయన అన్నారు. కెసిఆర్ వ్యవహారాన్ని రఘునందన రావు బయట పెట్టారని ఆయన అన్నారు.

ఎండ దెబ్బకు మతిపోయింది: కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ తన భాషను మార్చుకోవాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతిలో ఓటర్లు ఉచ్చ కూడా పోయరని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తలసాని తీవ్రంగా ప్రతిస్పందిచారు.

తమ పార్టీ డివిజన్ స్థాయి నాయకులు కూడా కెసిఆర్ కన్నా పరుషంగా మాట్లాడగలరని ఆయన అన్నారు. కెసిఆర్ హుందాగా వ్యవహరిస్తే మంచిదని తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. కెసిఆర్ కన్నా వందరెట్లు తాము బాగా మాట్లాడగలమన్నారు. చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడితే సంహించమని, కెసిఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని తలసాని హెచ్చరించారు.

కెసిఆర్‌పై తలసాని ఫైర్


హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధమని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల పొత్తులు, సీట్ల కేటాయింపులో స్పష్టత ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై టీడీపీ లేఖ చూసే టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందన్నారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని బాబు తెలిపారు. టీఆర్‌ఎస్‌ విమర్శలను మా నేతలు రాజకీయ కోణంలో చూడాలన్నారు. హైదరాబాద్‌లో పోటీ చేయలేని టీఆర్‌ఎస్‌ వంద సీట్లు ఎలా గెలుస్తుందని బాబు ప్రశ్నించారు. పార్టీ నుంచి వెళ్లిన వారంతా డెడ్‌వుడ్‌ వంటి వారని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో పార్లమెంట్‌లో విగ్రహావిష్కరణపై సర్దుకపోయామని ఆయన చెప్పారు. పశువులకు ఉన్న కృతజ్ఞత కూడా జంప్‌ జిలానీలకు లేదన్నారు. వాళ్ల ఇంట్లో కష్టాలు ఉంటే గోడ దూకేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తోక పార్టీలు అవిశ్వాసం పెడితే, వాటి వెనుక తామెళ్లమని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని ఆయన తెలిపారు.

అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం : చంద్రబాబు

' కేసీఆర్.. భాష మార్చుకో... లేకుంటే ఉచ్చ చేతుల్లో కాదు నోట్లో పోస్తరు ' అని టీడీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని హన్మకొండ హంటర్ రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

' కేసీఆర్‌కు భాష రానట్టున్నది. భాష తెలియకపోతే నేర్చుకోవాలి. ఆయనకు సంస్కారవంతమైన భాష నేర్చుకోవడానికి వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉంది. భాషా నిలయాలున్నాయి. తెలంగాణ సంస్క­తి విరుద్ధంగా కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఉచ్చ చేతుల్లో కాదు నోట్లో పోస్తారు' అని హెచ్చరించారు. ' కేసీఆర్ ! లుచ్చా రాజకీయాలను అందరిమీద రుద్దవద్దు. పొగరు తగ్గించుకొని మాట్లాడు. అది నీకే మంచింది అన్నారు.

' కేసీఆర్‌కు అంత నోటి దురద ఉంటే ఆయన ఫామ్‌హౌస్‌కు వెళ్ళి తీర్చుకోవాలి గానీ ప్రజల మధ్య ఇలా నీచంగా మాట్లాడడం తగదు' అని హితోక్తి పలికారు. టీడీపీ తెలంగాణకు కట్టుబడి ఉందని, మహానాడులో ఈ మేరకు తీర్మానం కూడా చేయిస్తామని ప్రకటించారు. కేసీఆర్ తెలంగాణ తేస్తున్నానంటూ కాలాయాపన చేయడం తప్పా అది ఆయన వల్ల కాదని అందరికీ తెలిసిపోయిందన్నారు. కార్యక్రమంలో నాయకుడు దొమ్మటి సాంబయ్య, ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి జన్ను మల్లయ్య పాల్గొన్నారు.

కేసీఆర్.. భాష మార్చుకో..!: బస్వారెడ్డి

తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడును తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నెల్లూరులోని గాంధీబొమ్మ వద్ద టీడీపీ నాయకులు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంలా మార్చారని, ఇక టీఆర్ఎస్ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిందన్నారు. కేసీఆర్‌కు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెడితే కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని బయటకు వెళ్లారని చెప్పారు. తెలంగాణ నినాదం పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్న కేసీఆర్ నీతులు వళ్లించడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్‌ను కుటుంబ పార్టీగా మార్చి పబ్బం గడుపుకుంటున్న ఆయనకు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు.

కేసీఆర్.. నోటిని అదుపులో పెట్టుకో..!: టీడీపీ

తెలంగాణపై టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆడుతున్న నాటకాలు అందరికీ తెలుసునని, త్వరలోనే ఈ ప్రాంతవాసులు ఆయన నోట్లో ఉచ్చపోసే రోజులు రాబోతున్నాయని నిజామాబాద్ జిల్లా టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బద్యానాయక్ స్వగహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై శుక్రవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

రాజకీయాల్లో ఉన్నవారు వ్యక్తిగత దూషణాలకు దిగరాదన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచారంటూ టీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తారు. తమకు కూడా పరుష పదజాలంతో దూషించడం వచ్చునన్నారు. కేసీఆర్ వెంటనే చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

కేసీఆర్ నోట్లో ఉచ్చపోసే రోజులు రాబోతున్నాయి: టీడీపీ


హైదరాబాద్: వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పొత్తులు లేకుంటే టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ గెలవలేదన్నారు. ఓయూ జేఏసీ మాజీ నేత రాజారాంయాదవ్‌ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉపఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలు వేరని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల్లో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకుంటామని హామీయిచ్చారు.

వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోం: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
''..కేసీఆర్ తన భాష మార్చుకోవాలి...రాష్ట్రంలో వడగాడ్పుల వల్ల కేసీఆర్ కి మతితప్పింది...మతిస్థిమితం కోల్పోయారు...తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు 'టీఆర్ఎస్ 100 సీట్ల కోసం కాదు..ప్రత్యేక రాష్ట్రం కోసం. తెలంగాణ ప్రజలు టిడిపికి ఓట్లేస్తారని, మీ చేతుల్లో ఉచ్చ పోస్తారు. అ ఉచ్చని ఫాం హౌస్ లో దాసుకుని మందులో కలుపుకో... తెలంగాణ ప్రజలు తలదించుకునేలా కేసీఆర్ భాష ఉంది...టీడీపీపై పెత్తనం చెస్తే ఓప్పుకోము...కుక్కకాటుకు చెప్పుదెబ్బ ఎలా కొట్టాలో మాకు తెలుసు...కేసీఆర్ బుడ్డిపెట్ట బుల్లోడు...తెలంగాణతో సంబంధంలేదు...వేయి మది తెలంగాణా విద్యార్థులను పొట్టన పెట్టుకుంది 100 ఎమ్మెల్యే సీట్లు, 16 ఎంపీ సీట్ల కోసమా...? .. కేసీఆర్ అసలు రంగు రఘునందన్ బయటపెట్టారు. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగితే తెలంగాణ తీర్మానం ఎందుకు కోరలేద...''ని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు

కేసీఆర్ భాష మార్చుకోవాలి...

హైదరాబాద్ : టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉందని టీడీపీ అ«ధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారని, లోకేష్ సహా యువతను పార్టీలోకి ఆహ్వానిస్తామని బాబు తెలిపారు. వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. కడియం శ్రీహరిని విశ్వాసం లేని నేతగా దూషించారు. ఆనాడు తెలంగాణపై ఇచ్చిన లేఖ బ్రహ్మాండంగా ఉందన్న కడియం, ఇప్పుడు రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని ఆరోపించారు.

2009లో తామచ్చిన లేఖ ఆధరంగానే టీఆర్ఎస్ తమతో పొత్తు పెట్టుకుందని గుర్తుచేశారు. ఆ లేఖకు కట్టుబడి ఉన్నామంటే తప్పుపడతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను కూడా పెట్టలేని వారు 100 సీట్లు ఎలా గెలుస్తారని బాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రం పిల్ల కాంగ్రెస్ నేతల వల్లే భ్రష్టుపట్టిందని ఆరోపించారు. మ్యాచ్‌ఫిక్సింగ్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో థర్డ్ ఫ్రంట్‌కు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయన్నారు.

కమ్యూనిష్టులతో పొత్తులకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వంపై పోరాడటానికి అవిశ్వామే పరిష్కారమైతే కచ్చితంగా పెడతామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. తనను, టీడీపీని దెబ్బతీయడానికే పురంధేశ్వరి విగ్రహ ప్రతిష్టను వివాదాస్పదం చేశారని దుయ్యబట్టారు.

ఎన్టీఆర్‌పై గౌరవంతోనే విగ్రహం విషయంలో వెనక్కి తగ్గామన్నారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు తొలగించిన పుడు పురంధేశ్వరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరుకావాలని, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ : చంద్రబాబు

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరుకావాలని,
పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరుకావాలి...


హైదరాబాద్: మహానాడు సన్నాహాలపై నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తూ, మంత్రులు జైలుకి పోవడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో అవినీతి రహిత పాలన అందించామన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతిపరులు భయపడేవారని, సామాజిక న్యాయం, మహిళలకు భద్రత కల్పించామని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందంటోన్న చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ఎప్పుడు ఇబ్బందులెదురైనా కార్యకర్తేల అండగా నిలిచారని కొనియాడారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ భ్రష్టు పట్టిందని, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని, భవిష్యత్తులో తృతీయకూటమిదే రాజ్యమని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని పేర్కొన్న బాబు ఈ దిశగా మహానాడు సభకు ప్రత్యేక ప్రాధాన్యముందని చెప్పారు.

మా ప్రభుత్వంలో అవినీతి అంటే బయపడే వారు!


  తాను దోచుకొని, తనను నమ్ముకున్న వారికి దోచిపెట్టిన ఘనత దివ ంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని ఇలాంటి దోపిడీదారు సీఎం ఎక్కడా లేరని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వల్లూరులో శుక్రవారం తెదేపా జిల్లా మినీ మహానాడు, కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి పల్లెపల్లెకు పుత్తా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కివుంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టేది కాదన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారన్నారు. సీఎం కుర్చీ కోసమే పుట్టిన అవినీతి పార్టీ వైకాపా అని విమర్శించారు. చంద్రబాబు తాము రైతుల రుణాలు మాఫీ చేస్తామని అంటుంటే ఇదేలా సాధ్యమవుతుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నారని ఆయన ప్రజలకు మేలు చేయరు, ఇతరులు మంచి చేస్తామంటే ఒప్పుకోరని ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ మాట్లాడుతూ మినీ మహానాడు తీర్మానాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వా లన్నారు. నాడు జగన్‌ను విమర్శిస్తూ పిట్ట కథలు చెప్పిన మైసూరారెడ్డి ఆయన పంచనే చేరడం సిగ్గుచేటన్నారు. అంతకుముందుగా భారీ ర్యాలీ నిర్వహించి వేదిక వద్దకు తెదేపా నేతలు తరలివచ్చి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తదితరులు పాల్గ్గొన్నారు.

వైఎస్‌లాంటి దోపిడీదారు సీఎం ఎక్కడా లేడు

వచ్చే సాధారణ ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ పిలుపునిచ్చారు. అవినీతి కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలని అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గ టిడిపి మినీ మహానాడు నాచారంలోని సీకే గార్డెన్స్‌లో జరగ్గా ఆయన హాజరై ప్రసంగించారు. మంత్రలు అవినీతిలో కూరుకుపోయారని, వారిని తొలగించేందుకు సిఎం వెనకాడుతున్నారని అన్నారు. అవినీతి మంత్రలును ఎందుకు తొలగించరని ఆయన ప్రశ్నించారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. టిడిపి మాత్రమే ప్రజలకు మేలైన పాలన అందించగలదన్నారు. నాలుగేళ్ల యూపీయే2 పాలనలో అభివృద్ధి పనుల్లో కంటే కుంభకోణాల్లో, ధరల పెరుగుదలలోనే ప్రగతి కనిపిస్తోందని ఆయన విమర్శించారు. యూపీయే1లో అవినీతికి పునాదులు వేసి యూపీయే2లో అవినీతి సౌధాలను నిర్మించారనీ, తద్వారా అంతర్జాతీయంగానూ దేశ ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు. ఆశ్రీత పెట్టుబడిదారీ విధానం పెరిగింది. పటిష్ఠ లోక్‌పాల్‌ను తీసుకురాలేకపోయారు. అవినీతి ధనాన్ని రాబడితే ప్రజలపై పన్నులు వేయాల్సిన అవసరం ఉండదన్నారు. దానికి విరుద్ధంగా అవినీతిని విస్మరించి ధరల్ని, పన్నుల్ని పెంచుతున్నారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి పేదలను విస్మరించారని దుయ్యబట్టారు. కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీయే2 రాబోయే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని, యూపీయే, ఎన్డీయేలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలతో ఆవిర్భవించే తృతీయ ఫ్రంట్‌వైపు ప్రజలు చూస్తున్నారని గౌడ్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు.

టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలంతా సమష్టిగా కృషిచేయాలి....