May 23, 2013


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) వసూళ్ల పార్టీ అని, వైస్సార్సీపీ జైలు పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపహాస్యం చేశారు. ఒకరికీ ఎలక్షన్లు, కలెక్షన్లు లక్ష్యమైతే, మరొకరు బెయిల్‌ కోసం ఏ గడ్డి కరువడానికైన సిద్ధమేనంటూ శివాలెత్తారు. టీడీపీ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని తాము విసిరిన సవాల్‌ను ఎవరు స్వీకరించి ముందుకురాలేదని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తొలుత డిమాండ్‌ చేసిందే తెలుగుదేశం పార్టీయేనంటూ చంద్రబాబు గుర్తు చేశారు. గురువారం చంద్రబాబు సమక్షంలో ఆయన నివాసంలో ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు మురళితో పాటు వందలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణపై 2008లో ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామని అఖిలపక్ష సమావేశంలో విస్పష్టంగా చేశామన్నారు. అయినా టీఆర్‌ఎస్‌ దురుద్దేశ్యంతో టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ దుష్పప్రచారాన్ని పార్టీ శ్రేణులు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధ పార్టీ అని దుమ్మెత్తిపోశారు. ప్రజాసంపదను, ప్రకృతి వనరులను ఇష్టారీతిలో కాంగ్రెస్‌ నేతలు దోచుకుతింటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం అదోగతిపాలు చేసిందని విరుచుపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన సమయంలో అవినీతి, అసమర్ధ పాలన వల్ల భ్రష్టు పట్టిపోయిందన్నారు.

కిరణ్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకంపై ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు. అది అమ్మహస్తం కాదని మొండిహస్తమంటూ అపహాస్యం చేశారు. పశువులు తినే నాసిరకం వస్తువులను పేదలకు సరఫరా చేస్తున్నారని శివాలెత్తారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారికి సాధరంగా స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టీడీపీని ప్రజలు ఆదరిస్తున్నారని, కార్యకర్తలు మరింతగా ప్రజలకు చేరువ కావాలని సూచించారు.

టీఆర్‌ఎస్‌ వసూళ్ల పార్టీ జగన్‌ది జైలు పార్టీ

హైదరాబాద్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రక అవసరమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం అభిర్ణించారు. రానున్న స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు కాగజ్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత గణపరం మురళి తన అనుచరులతో కలిసి చంద్రబాబు నివాసంలో తెదేపాలో చేరారు. ఆ సందర్భంగా ఇంటి ఆవరణలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఇతర పార్టీలు చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ''పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది'' అని శ్రేణులకు హామీనిచ్చారు.

తెలంగాణపై స్పష్టమే

తెలంగాణపై తెలుగుదేశం వైఖరి స్పష్టంగా ఉందని బాబు చెప్పారు. గడచిన 2008లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి రాసిన లేఖకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. తమ పార్టీ హయాంలోనే తెలంగాణ ప్రాంతం, ఆదిలాబాద్‌ జిల్లా సర్వతో ముఖాభివృద్ధి సాధించాయని తెలిపారు.

తెలంగాణలో తమ హయాంలో 18లక్షల ఎకరాలకు సాగునీరును అందించామన్నారు. ఆదిలాబాద్‌లో 100 కోట్లతో ప్రారం భించిన 'వెలుగు' ప్రాజెక్టును రెండు వేల కోట్లతో రాష్ట్రమంతా విస్తరించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా, టీఆర్‌ఎస్‌ను వసూళ్ల పార్టీగా, వైఎస్సార్‌సీపీని జైలు పార్టీగా అభివర్ణించిన చంద్ర బాబు వచ్చే ఎన్నికల్లో వాటి చిరునామా గల్లంతు చేసి 'దేశం' పతాకను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు.

పత్తి ధర పెంచలేదేం?

''ఆదిలాబాద్‌ అంటే పత్తి సాగు గుర్తుకు వస్తుంది. క్రిమి సంహారక మందులు, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి పత్తికి కనీస మద్దతు ధర పెంచారా? పులిలో పుట్రలా 20వేల కోట్ల విద్యుత్‌ భారాన్ని ప్రజలపై మోపారు. రోజుకు మూడు గంటలకు మించి విద్యుత్‌ సరఫరా చేయరు. రైతాంగం పరిస్థితి ఏమిటి? అందుకే- సుస్థిర, నీతివంత పాలన కోసం తెలుగుదేశం గెలవాలి. అది చారిత్రక అవసరం'' అని చంద్రబాబు ఉద్భోధించారు.

విధానాలు నచ్చి: మురళి

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు రమేశ్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో బోధ్‌ ఎమ్మెల్యే నగేష్‌ సమక్షంలో మురళి తెదేపా సభ్యత్వం స్వీకరించారు. ఆయన గతంలో పీఆర్పీలో చురుకైన పాత్ర పోషించారు. అయితే 2009లో ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి సిర్పూరు నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం బలాలైన సమర్థ నాయకత్వం, అవినీతి రహిత విధానం, అభివృద్ధి పట్ల ఆ పార్టీ దృక్పథం నచ్చి చేరుతున్నట్లు మురళి చెప్పారు. ఆయనతో పాటు వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలు టీడీపీలో చేరారు.

వేతనాలు- గుర్తింపు కార్డులివ్వాలి

ఏళ్ల తరబడి పని చేస్తోన్న 'యానిమేటర్ల'కు కనీస వేతనాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. పదేళ్లుగా ఇందిర క్రాంతి పథంలో పని చేస్తున్న యానిమేటర్లను మాయ మాటలతో ప్రభుత్వం వంచి స్తోందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పని చేస్తున్న 40వేల మంది యానిమేటర్ల న్యాయమైన కోర్కెలను తీర్చాలని ప్రభుత్వాన్ని చంద్ర బాబు డిమాండ్‌ చేశారు.

దేశం గెలుపు చారిత్రక అవసరం


కొత్తగూడెం : 2004లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆయన తనయుడు జగన్‌ మోహన్‌రెడ్డి అనధికారికంగా రాష్ట్రాన్ని దోచుకొని లక్ష కోట్ల రూపా యలకు పైగా అక్రమ సంపాదన కూడబెట్టుకున్నారని ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు ఆరోపించారు. బుధవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన మిని మహానాడుకు ముఖ్యఅతిధిగా ఆయన హాజరై ప్రసగించారు. 2004కు ముందు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ప్రజావసరాల కోసం సక్రమంగా వినియోగించగా, అనంతరం గద్దె నెక్కిన దివంగత రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం సర్వం అవినీతిమయం అయిం దన్నారు. అక్రమ సంపాదనను కప్పిపుచ్చుకునేందుకు దినపత్రిక, ఎలక్ట్రానిక్‌ మీడియాలను ఏర్పాటు చేసుకొని ‘అబద్ధాలను వంద సార్లు చెబితే నిజాలవు తాయన్న’ చందంగా ఊదర కొడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.

కేవలం తండ్రి అధికారంలో ఉండగా లక్ష కోట్లు సంపాదించగా, స్వయంగా తాను గద్దెనెక్కితే రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవచ్చనే దురాలోచనతోనే పార్టీని స్థాపించి ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలతో పాటు విజయమ్మలు జగనన్న రాజ్యం వస్తుందని ప్రజలను భ్రమలో ఉంచుతున్నారని, జగనేమైనా ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేసి జైలుకెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సొమ్మును దోచుకొని జైలుకెళ్లిన జగన్‌ అక్కడ రాజకీయ సమావేశాలు నిర్వహించడం పట్ల ప్రభుత్వ చేతగాని తనమన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిబిఐ విచారణ ద్వారా జగన్‌ దోచుకున్న అస్తులు రూ.43వేల కోట్లుగా తేలిందని భవిష్యత్‌ విచారణలో మరిన్ని తేల నున్నాయని అన్నారు. వైఎస్‌ఆర్‌ దోపిడీ వల్లే గ్రామాల్లో అభివృద్ధి క్షీణించిందని, తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఖజానాను కాపాడి ‘‘వస్తున్నా మీకోసం’’ యాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్న చంద్రబాబు తెలుసుకొన్న హామీ లను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామన్నారు.

తెరాస నాయకుల భాగోతాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయని, పార్లమెంట్‌ సభ్యుడిగా కెసిఆర్‌ ఏనాడూ ఏఒక్క ప్రజా సమస్యపై కూడా నోరెత్తలేదని ఎద్దేవా చేశారు.
రక్షణ స్టీల్స్‌కు వ్యతి రేకంగాపోరాడింది తెదేపానేనని, పార్లమెంట్‌లో రక్షణ స్టీల్స్‌పై చర్చ జరిగిన సమయంలో కెసిఆర్‌ హాజరు కాలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని అవినీతి, అక్రమాలు తెదేపా వల్లనే బయటపడ్డా యన్నారు. పార్ల మెంట్‌లో తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెడితే మొదటి ఓటు తనదే అవుతుందన్నారు.కొత్తగూడెం నియోజకవర్గంలో విమానాశ్రయం ఏర్పాటు, కొత్త గూడెం, పాల్వంచ పురపాలక సంఘాల అభి వృద్ధి కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపిన ప్రతిపాదనల సాధనకు కృషి చేయడంతో పాటు స్థానికుల హక్కును ప్రతిభింబించే ఉక్కు కర్మాగారాన్ని బయ్యారంలోనే ఏర్పాటు చేయా లన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించేలా అధి నేత చంద్రబాబుతో చర్చిస్తామన్నారు.

రాష్ట్రాన్ని దోచుకుంది వైఎస్‌ కుటుంబమే


వై. ఎస్. రాజశేఖర రెడ్డి నిలువెత్తు అవినీతికి చిరునామాగా నిలిచిన జలయజ్ఞం శంకుస్థాపన రాళ్ళను చూసేందుకు ఆయన సతీమణి విజయలక్ష్మి వెళ్ళటం అత్యంత హేయమని తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమవతి ఎద్దేవా చేసారు. వై. ఎస్. శంకుస్థాపన చేసిన పధకాల రాళ్ళన్నిమొండిరాళ్ళు గా మిగిలాయనీ, ఆయన ప్రారంభించిన పదకాలన్నీ ఆయన కుటుంబానికి తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం
ఉపయోగపడలేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ” ప్రాణహిత- చేవెళ్ళ
పధకానికి పాలాభిషేకం చేసిన విజయమ్మ తన భర్త ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పటివరకు ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఎందుకు కోరలేదు? తన కొడుకు బెయిల్ కోసం ఇన్నిసార్లు డిల్లి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఆమె ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేయాలంటూ
కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు ? ” అని హైమవతి విరుచుకు పడ్డారు.

” విజయమ్మా…. ఇది హేయం!”