May 18, 2013

ఆర్ధిక వ్యవస్థ అనారోగ్యం ఆర్ధిక
ఆర్ధిక సంస్కరణల ఫలితాలు పేదలకు
అందడం లేదు : టీడీపీ అధినేత చంద్రబాబు


హైదరాబాద్‌ అవినీతి తీవ్రవాదం కంటే ప్రమాదకరమయిందని, దేశంలో ఎవరు అవినీతికి పాల్పడకపోతే పేదరికమే ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అనారోగ్యం పాలయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. శనివారం చంద్రబాబును ఆయన నివాసంలో వాకర్స్‌ అసోసియేషన్‌, విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన ఆర్ధిక విధానాల వల్లే దేశ ఆర్ధిక వ్యవస్థలో పెనుమార్పులకు దారితీసిందన్నారు.అయితే ఆర్ధిక సంస్కరణల ఫలితాలు సామాన్యులకు చేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అన్ని రంగాల్లో అవినీతి గుర్రపు డెక్కల మాదిరిగా అల్లుకుపోవడమే ప్రధాన కారణమని చంద్రబాబు విశ్లేషించారు. దేశంలో 500, 1000 నోట్ల రూపాయలను రద్దు చేస్తే అవినీతి అడ్డుకట్ట వేయవచ్చునని అభిప్రాయపడ్డారు. ఆర్ధిక నేరస్థులను శిక్షించేందుకు కఠిన చట్టాలు రావాలన్నారు. 2030 నాటికి భారత్‌, చైనాలు శక్తివంతమైన దేశాలుగా అవతరిస్తాయన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ప్రజలు తీర్పునిచ్చారని, అదే తీర్పు రాష్ట్రంలో పునారవృత్తం కాబోతోందన్నారు. వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులందరూ ప్రజా ఆరోగ్యం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి 2817 కిమీ పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని విపక్ష పార్టీల నేతలు ఎస్‌ఎం కృష్ణ, దిగ్విజయ్‌సింగ్‌లాంటి వారు పరిపాలనా చేశారని ఫారెస్ట్‌ మాజీ అధికారి భూపాల్‌రావు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 18 గంటలు పనిచేసి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారన్నారు.

ఇంచార్జిలను నియమించే బస్సుయాత్ర చేస్తాః చంద్రబాబు
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జిలను నియమించిన తరువాతే బస్సుయాత్ర చేపడుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పార్టీ నేతలతో ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలో సీనియర్‌, జూనియర్‌ అన్న ప్రతిష్టకు పోకుండా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలంతా కష్టపడి పనిచేయాలని ముఖ్యనాయకులకు ఆయన హితవు పలికారు. రానున్న ఎన్నికలు కీలకమని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.

అవినీతి తీవ్రవాదం కంటే ప్రమాదకరం

విజయవాడ:వైయస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌ బయటకు రాడు, మూడు నెలల్లో వైయస్‌ఆర్‌ పార్టీ దుకాణం మూతపడం ఖాయమని, దుకాణ్‌బంద్‌ అవుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పామర్రు ఇన్‌చార్జి వర్ల రామయ్య జోస్యం చెప్పారు. బందరు రోడ్డులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అన్న వస్తాడు-రాజన్న రాజ్యం తెస్తాడు’ అని జగన్‌ చెల్లి షర్మిల చెబుతుందని, అమ్మా చెల్లి అన్న రాడు, రాజన్న రాజ్యం తేలేడని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ చాలా స్పష్టంగా జగన్‌ కేసులో సాక్ష్యాలను నమ్ముతోందని, బెయిల్‌ నిరాకరించటం జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు.
చుక్కాని లేని నావ వైయస్‌ఆర్‌ పార్టీ, పైలెట్‌ లేని విమానం వైకాపా అని ఆ పార్టీ డ్రైవర్‌ లేని బస్సులా తయారు కానుందన్నారు. ఆ పార్టీ పైలెట్‌ లక్ష కోట్లు దోచుకుని జైలులో ఉన్నాడని విమర్శించారు. ఓ చెల్లీ నీ అన్న వల్లనే కదమ్మా ఐఎఎస్‌ అధికారి జైలులో ఉండి పక్షవాతానికి గురయ్యాడని గుర్తు చేశారు. బీసీ మంత్రి మోపిదేవి జైలు పాలవ్వడానికి, నిమ్మగడ్డ ప్రసాద్‌, కోనేరు ప్రసాద్‌, బి.పి.ఆచార్య, రాజగోపాల్‌ తదితరులందరూ జైలులో మగ్గడానికి జగనే కారణమని ఆరోపించారు. మంత్రులు ధర్మాన, సబితా ఇందిరారెడ్డి కూడా జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ రాజన్న రాజ్యం వల్లే కదా పైన పేర్కొన్న వారందరూ జైలు పాలయ్యింది, రాజన్న రాజ్యం వల్లే కదా జగన్‌ లక్ష కోట్లు దోచుకుంది, ఇంకా రాజన్న రాజ్యం తెస్తానంటున్నావు ఈ మాత్రం కూడు కూడా రాష్ట్ర ప్రజలకు ఉంచవా అని షర్మిలను నిలదీశారు.

అన్న రాడు, చెల్లి యాత్రకు ముగింపు ఉండదు, ఇక నుండి ఏ పార్టీ నుండైన ఒక ఎమ్మెల్యే మీ పార్టీలోకి వస్తాడా అని సవాల్‌ విసిరారు. దోచుకున్న డబ్బును రక్షించుకునేందుకే కవచంగా వైయస్‌ఆర్‌ పార్టీని, టీవీ ఛానల్‌ను, పత్రికను ఏర్పాటు చేసుకున్నారని వర్ల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తాండవిస్తుంది, వైయస్‌.బతికుంటే ప్రతి కేసులో ముద్దాయి అయి పైనాయకుల కంటే ముందే జైలులో ఉండేవారని వర్ల జోస్యం చెప్పారు. చనిపోయి రాజశేఖర్‌రెడ్డి బతికిపోయారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దని చెల్లి షర్మిలకు వర్ల హితవు పలికారు.

మూడు నెలల్లో వైకాపా దుకాణం మూత


బట్టలు విప్పి తిరిగితే ఏమి చేస్తాం చూడడం మానేస్తాం................హైదరాబాద్ : సీబీఐవి చిలక పలుకులు అయితే వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నాయకులవి కాకి అరుపులని టీడీపీ నేత రెవంత్‌రెడ్డి అన్నారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ క్లీన్‌చీట్ ఇచ్చినప్పుడు సీబీఐ మంచిదైందని, ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ చేస్తున్న విచారణ కుట్రపూరితమైందని అనడం సరికాదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, రాజకీయ కక్షతోనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న వాదనల్లో నిజం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అయినా ఆ పార్టీకి కనువిప్పు కలగడం లేదని ఆయన అన్నారు. ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు పోరాటం చేయడం లేదని, వైయస్సార్ కాంగ్రెసు అవినీతిని సమర్థిస్తుందా అని ఆయన అన్నారు. అవినీతి మంత్రులపై తాము పోరాటం చేస్తున్నామని, వారిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తాము ఈ నెలాఖరులో రాష్ట్రపతిని కలుస్తామని, కళంకిత మంత్రులను తొలగించాలని కోరుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వీధుల్లో రాష్ట్రం పరువు తీస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.

వైసీపీ నేతలవి కాకి అరుపులు : రేవంత్‌రెడ్డి


చింతకాని: టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారమవుతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు పేర్కొన్నారు. మండలం పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మధిర నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తే.. షర్మిల మాత్రం తమ అక్రమ ఆస్తులు చూసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడినవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన జంప్ జిలానీల నుద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ఆయన తనయుడు జగన్ అప్పనంగా ప్రజాధనాన్ని దోచుకోవడానికి కారకులైన కళంకిత మంత్రులను పదవుల నుంచి తొలగించకుండా సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. పాలకుల విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ,విద్యుత్ రంగాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయన్నారు. తాము అధికారంలోకి వస్తే తొలుత రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. మినీ మహానాడులో వ్యవసాయ రంగం,పాదయాత్రతో గ్రామాలలో గుర్తించిన సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై పోరాటం, స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గ స్థాయి సమస్యలపై తీర్మానాలు చేశారు. ఈ మినీ మహానాడుకు నియోజకవర్గ పార్టీ శ్రేణులు కదిలిరావడంతో గ్రామంలో సందడి కనిపించింది. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు మందడపు సుధాకర్, గుత్తా వెంకటేశ్వరావు, బీరెడ్డి నాగచంద్రరెడ్డి,బ్రహ్మం, శివరాంప్రసాద్, చావా రామకృష్ణ, స్థానిక నాయకులు పెంట్యాల పుల్లయ్య, చల్లా అచ్చయ్య, వంకాయలపాటి లచ్చయ్య, రత్నాకర్, బడేసాహెబ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే ప్రజాసమస్యల పరిష్కారం


హైదరాబాద్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇద్దరూ ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర పరువు తీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పిల్ల కాంగ్రెస్ పార్టీ టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని చెబుతోందని మండిపడ్డారు. వైసీపీ తప్పుడు వాదనలు, పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు. సీబీఐవి చిలక పలుకులైతే వైసీపీ వారివి కాకి అరుపులు అని విమర్శించారు. కళంకిత మంత్రులపై కొత్తగా పోరాడుతున్నట్లు వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు.

ఢిల్లీవీధుల్లో రాష్ట్ర పరువుతీస్తున్నారు:రేవంత్

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కళంకిత మంత్రులను తొలగించాలన్న డిమాండ్‌పై ఈనెల 20న తలపెట్టిన ధర్నాలపై చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఏదో ఒక చోట ధర్నాలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.

గ్రేటర్‌ నేతలతో చంద్రబాబు భేటీ


తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన దొమ్మేటి సాంబయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో ప్రవేశించారు.సాంబయ్య గత లోక్ సభ ఎన్నికలలో సాంబయ్య టిడిపి తరపునే ఎన్నికలలో పోటీచేశారు.అప్పట్లో టిఆర్ఎస్ తో పొత్తుతో టిడిపి పోటీచేసింది.కాగా రెండువేల తొమ్మిది పరిణామాల తర్వాత సాంబయ్య టిఆర్ఎస్ లోకి వెళ్లారు. కాగా కడియం శ్రీహరి టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు వరంగల్ ఎమ్.పి సీటు కేటాయించవచ్చన్న సంకేతం రావడంతో సాంబయ్య టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తిరిగి టిడిపిలో చేరడం విశేషం.

తెలుగుదేశం గెలవాలి ..చంద్రబాబు పాలన రావాలి ...తెలుగుదేశం పార్టీ లోకి దొమ్మేటి సాంబయ్య!


హైదరాబాద్‌: తెలుగుదేశం నుండి ఒక్క నేత వెళ్లిపోతే 50 మంది నాయకులను తయారు చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకరిద్దరూ పార్టీని వీడినంత మాత్రనా పెద్దగా వచ్చే నష్టమేమి లేదన్నారు. 1983 నుండి ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా టీడీపీనిలబడిందన్నారు. టీడీపీని వీడితే నాయకులకు భవిష్యత్తు లేదనేది అందరికీ తెలుసిందేనన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైన వారు పార్టీని వీడడం లేదని గుర్తు చేశారు. కానీ కొంతమంది నాయకులు పార్టీని వీడిన తరువాత అవాకులు, చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు.శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో వరంగల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ బహిష్ర్కృతనేత దొమ్మాటి సాంబయ్య చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పదవిలో కొనసాగినంత కాలం ఏనాడు కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. టీడీపీ హయాంలో తెలంగాణఅభివృద్ధి జరిగిందన్నారు. ఈ ప్రాంతంలోని 18 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామని గుర్తు చేశారు. బాబ్లీపై అక్రమ నిర్మాణాలు జరిగితే తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముందని గ్రహించి, బాబ్లీపై అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకే టీడీపీ ఎన్నో పోరాటాలు చేసిందని, జైలుకు వెళ్లడం జరిగిందన్నారు. వైఎస్‌ హయాంలో నగరంలోని, శివారు ప్రాంతాలలోని విలువైన భూముల విక్రయాన్ని అడ్డుకున్నది టీడీపీయేనని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీలో చేరిన దొమ్మాటి సాంబయ్య మాట్లాడుతూ ఓట్లు, సీట్లు మాత్రమే కేసీఆర్‌ నైజమని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఉద్యమపార్టీగా చెప్పుకున్న టీఆర్‌ఎస్‌ వసూళ్లపార్టీగా మారిందని ధ్వజమెత్తారు.

తన రాజకీయపబ్బాన్ని గడుపుకోవడానికే కేసీఆర్‌ తెలంగాణవాదాన్ని అడ్డం పెట్టుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌లో డబ్బున్నవారికే పెద్దపీట వేస్తున్నారని, దళితులకు స్థానం లేదన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పుకునే కేసీఆర్‌ పది జిల్లాల్లో ఒక్క దళితునికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. పదవుల కోసం కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారన్నారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని తెలంగాణకు టీడీపీ అనుకూలంగా ఉందని చెప్పిన శ్రీహరి పార్టీని వీడడం పదవి కోసం కాకపోతే మరేందుకని ప్రశ్నించారు. తెలంగాణకు టీడీపీ సానుకూలమని చంద్రబాబు విస్పష్టం చేశారన్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ ఇంచార్జిగా దొమ్మాటి సాంబయ్యను నియమిస్తున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.

ఒక్కరు వెళితే 50 మంది ఉద్భవిస్తారు:చంద్రబాబు


హైదరాబాద్: టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఎమ్మెల్యేలను విచారించారు. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌ రెడ్డి, ఆదిలాబాడ్‌ జిల్లాకు చెందిన ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి తమ న్యాయవాదులతో కలిసి వచ్చి తమ వాదనలు వినిపించారు. తెలుగుదేశం పార్టీ తరపున విప్ ధూళిపాళ్ల నరేంద్ర హాజరై తమ వాదనలు వినిపించారు

తిరుగుబాటు ఎమ్మెల్యేల విచారణ 28కి వాయిదా


హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో వాకర్స్‌ అసోసియేషన్‌ ఘనంగా సత్కరించింది. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేసినందుకు ఆయన్ను సత్కరించినట్లు సంఘాల సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల ఫలితాలు సామాన్యులకు చేరటం లేదన్నారు. గుర్రపు డెక్క మాదిరిగా అక్రమార్జన అల్లుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు సత్కారం


గుంటూరు: స్పాట్ ఫిక్సింగ్‌లో అరెస్టయిన క్రికెటర్ శ్రీశాంత్‌తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతను అరెస్టు చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అరెస్టయిన నేత చిన్నపరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సేవాదళ్ కన్వీనర్‌గా ఉన్నారు.

శ్రీశాంత్‌తో బాబు పోలిక: జగన్ పార్టీ నేత అరెస్టు!

హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులవి కాకి అరుపులని, ఆ అరుపుల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, రాజకీయ కక్షతోనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ ఆరోపణలు చేస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న వాదనల్లో నిజం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అయినా ఆ పార్టీకి కనువిప్పు కలగడం లేదని ఆయన అన్నారు. ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు పోరాటం చేయడం లేదని, వైయస్సార్ కాంగ్రెసు అవినీతిని సమర్థిస్తుందా అని ఆయన అన్నారు.

అవినీతి మంత్రులపై తాము పోరాటం చేస్తున్నామని, వారిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. తాము ఈ నెలాఖరులో రాష్ట్రపతిని కలుస్తామని, కళంకిత మంత్రులను తొలగించాలని కోరుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వీధుల్లో రాష్ట్రం పరువు తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

సిబిఐవి చిలుక పలుకులైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీవి కాకి అరుపులని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.

వైయస్ జగన్ పార్టీవి కాకి అరుపులు: రేవంత్ రెడ్డి