May 13, 2013

గవర్నర్‌ను కలిసి చంద్రబాబు విజ్ఞప్తి
పెదవి విప్పని గవర్నర్ నరసింహన్

హైదరాబాద్, మే 13 : రాష్ట్ర మంత్రివర్గంలోని కళంకిత మంత్రులను తక్షణం తొలగించాలని గవర్నర్ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. తమపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కలిసి సోమవారం సాయంత్రం ఆయన ఇక్కడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 'ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. వారిలో ముగ్గురిపై సీబీఐ ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేసింది. ఒక మంత్రికి ఫెరా నేరారోపణల కింద కోర్టు జరిమానాతో పాటు శిక్ష విధించింది. ఈ మంత్రులను ఇంకా పదవుల్లో కొనసాగించడం ప్రజాస్వామ్యానికే అవమానం. తక్షణం వారిని తొలగించేలా ముఖ్యమంత్రిని ఆదేశించండి.
ఆయన ఆ పని చేయకపోతే రాజ్యాంగ పరిరక్షకునిగా మీరు వారిని డిస్మిస్ చేయండి. ప్రజలకు ప్రజాస్వామ్యవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లకుండా చూడండి' అని ఆయన గవర్నర్‌ను కోరారు. సుప్రీం నోటీసులందుకున్న ఆరుగురు మంత్రులతో పాటు ఫెరా కేసులో శిక్ష పడిన మంత్రి పార్థసారథి పేరును వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు రాజ్‌భవన్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 'జగన్ కేసులో రూ. 43 వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ ఇప్పటివరకు వేసిన చార్జిషీట్లలో పేర్కొంది. ఈ అవినీతికి అవకాశం ఇచ్చిన జీవోలను జారీ చేసిన మంత్రులు రాజీనామా చేయక్కర్లేదని సీఎం కిరణ్ అభయం ఇచ్చి వెంటపెట్టుకొని తిరుగుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టం.
రాష్ట్రపతిని కలవడం సహా అన్ని మార్గాలు అన్వేషిస్తాం. గవర్నర్ ప్రతిస్పందనను బట్టి మేమంతా మరోసారి భేటీ అయ్యి తదుపరి కార్యాచరణను నిర్ణయించుకొంటాం' అని ఆయన వివరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో యనమల రామకృష్ణుడు, నామా నాగేశ్వరరావు, ఎన్.శివప్రసాద్, కె. ķ

సీబీఐ చార్జిషీట్లు వేసినా తొలగించకపోవడం దారుణం

హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను నరసింహన్‌కు కలిసారు. కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలంటూ బాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు టీడీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. తీవ్రవాదం సమస్యకన్నా ప్రమాదకరమైనది అవినీతి అని బాబు అన్నారు. ధర్మాన రాజీనామా చేసినా సీఎం ఆమోదించలేదన్నారు. అవినీతి జరిగిన విషయం తెలిసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.

గవర్నర్‌ కలిసిన చంద్రబాబు

వరంగల్: రాజకీయ వ్యభిచారమంటే ఏమిటో చెప్పాలని తనకు సవాల్ విసిరిన కడియం శ్రీహరి వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టిడిపిలో పదవులు అన్నీ అనుభవించి ఇప్పుడు అదే పార్టీని విమర్శిస్తే రాజకీయ వ్యభిచారం అనకుంటే ఏమనాలని రేవూరి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఫాం హౌస్‌లో కడియం రాజకీయ బేరసారాలు జరుపుతున్నారని ఆరోపించారు. మహానాడులో తెలంగాణపై స్పష్టత వస్తుందని రేవూరి చెప్పారు. పార్టీని విడిచిన ఆయన టిడిపిని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.

ఫాం హౌస్‌లో కడియం రాజకీయ బేరసారాలు

ఒంగోలు, మే 12: జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకేఒక్క స్థానానికి పరిమితమైన తెలుగుదేశం పార్టీ నేడు నాలుగైదు నియోజకవర్గాల్లో బలంగా ఉంది. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఒక్క మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సిపి తరపున ఒంగోలు, దర్శి, అద్దంకి నియోజకవర్గాల శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ప్రధానంగా సంతనూతలపాడు, కొండెపి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం సానుకూల పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటినుంచే ప్రచారంలో మునిగి తేలుతున్నారు. దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శిద్దా రాఘవరావు సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. దర్శి పట్టణంలో శిద్దా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇక సిట్టింగ్ శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా తన సొంత నిధులతో మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ప్రజాసేవలో ముందున్నారు. అద్దంకి నియోజకవర్గంలో సిట్టింగ్ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమర్, మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్యల మధ్య వార్ కొనసాగుతోంది. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్యనేతలు వైఎస్‌ఆర్‌సిపి పంచన చేరారు. దీంతో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది. కనిగిరి నియోజకవర్గంలో కూడా వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనే చెప్పవచ్చు. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారిని సమన్వయకర్తలుగా నియమించకపోవడం, మరొకపక్క పారిశ్రామికవేత్తల వైపు పార్టీ అధిష్ఠానవర్గం చూస్తుండటంతో వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో నిరుత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌సిపి నేతల్లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరితే కాంగ్రెస్‌కంటే తెలుగుదేశం పార్టీకే లాభిస్తుందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లు ఏమాత్రం చీలలేదు. కాని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్లను మాత్రం వైఎస్‌ఆర్‌సిపి భారీగా చీల్చిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పక్షాన ఉన్న కొంతమంది నేతలు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏ క్షణంలోనైనా జెండా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినవస్తున్నాయి. మొత్తంమీద జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలుస్తోంది.

couretesy : Andhrabhoomi

ప్రకాశం జిల్లాలో పుంజుకుంటున్న టిడిపి