May 10, 2013

తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించడం లేదు
టీడీపీలో సమన్వయం లేదు : కడియం

: సీనియర్ నేత కడియం శ్రీహరి టీడీపీకి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న కడియం పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉన్నారు. గత రెండు రోజులుగా అనుచరులతో సమావేశమైన ఆయన వారి సలహా మేరకు పార్టీకి రాజీనామా చేసినట్లు శనివారం ఉదయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను టీడీపీ గుర్తించడం లేదని ఆరోపించారు.

ఈ అంశంపై అనుచరులతో చర్చించాకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కడియం తెలిపారు. పార్టీలు మారేవారికి, పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు రెండు సార్లు పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. టీడీపీలో సమన్వయం లేదని, ఎవరికి వారే అనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పార్టీలో నలుగురు కలిసి పనిచేసే పరిస్థితి లేదని వాపోయారు. ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో పాల్గొనని ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ విషయంపై లేఖ ఇచ్చినా అనుకూలమని ఎక్కడా చెప్పలేదని దుయ్యబట్టారు. అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్‌ను వెనుకేసుకొచ్చిందని ఆరోపించారు.

రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ కన్నా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని కడియం స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, అయితే ఏ పార్టీలో చేరేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.

టీడీపీకి కడియం శ్రీహరి రాజీనామా

తిరుపతి

ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమనాయుడు, హేమలత, మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, లలితకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయంలో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రారంభ సమయంలో చంద్రబాబు దంపతులతో పాటు నారా లోకేష్, భద్రతా సిబ్బంది దాదాపు 10 మంది స్వామివారిని దర్శించుకోనున్నారు.
: సుదీర్ఘ పాదయాత్ర అనంతరం శ్రీవారి దర్శనంకోసం తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రేణిగుంట విమానాశ్రయంనుంచి వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు చంద్రబాబుకు దిష్టితీసి స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రత్యేక విమానంలో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

కుటుంబ సమేతంగా తిరుమలకు బాబు

వెయ్యి, ఐదొందల నోట్లను నిషేధించాలి
ప్రింటర్ - ఈవీఎంలపై అఖిలపక్షంలో చంద్రబాబు
మళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలన్న సీపీఐ

న్యూఢిల్లీ : ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ నేతృత్వంలో ప్రింటర్ ఈవీఎంలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఆర్థిక సంస్కరణలను పెద్దఎత్తున ప్రవేశపెట్టాలని, అందుకు సంబంధించిన ముసాయిదా పత్రాన్ని టీడీపీ త్వరలో ప్రవేశపెడుతుందని అనంతరం చెప్పారు. నల్లధనంతో ఓటర్లను గుంపగత్తగా కొనుగోలు చేస్తున్నారని, ఈ అక్రమాలకు అడ్డుకట్టవేయాలని అన్నారు.

వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను నిషేధించాలన్నారు. ఇక నగదు రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ కార్డుల రూపంలోనే ఆర్థిక లావాదేవీలు జరగాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోందని, పెయిడ్‌న్యూస్‌ను కూడా కట్టడి చేయాలని తెలిపారు. అందరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి, లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరిగేలా సంస్కరణలు తీసుకురావాలని, అవినీతి రహిత భారతదేశం, నల్లధనం లేని సమాజం ఏర్పాటుకు టీడీపీ నిర్విరామంగా కృషిచేస్తుందన్నారు.

ప్రతి ఒక్కరి ఆదాయ వ్యయాల వివరాలను ట్రాక్ చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం వల్ల కొంత అవినీతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అన్నారు. నల్లధనం, ఆర్థిక నేరాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు అనేక చర్యలు తీసుకుంటున్నా అవి సరిపోవని, పార్టీలు కూడా ఆర్థిక సంస్కరణలపై దృష్టి పెట్టాలన్నారు.

వచ్చే ఎన్నికల్లోనే ప్రింటర్ ఈవీఎంలను ప్రవేశపెట్టాలి
ప్రింటర్ ఈవీఎంలకు టీడీపీ సానుకూలంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈసీ కొత్తగా ఏర్పాటు చేసిన ప్రింటర్ ఈవీఎంలు చాలా బాగున్నాయని, అందులో కొన్ని చిన్న చిన్న మార్పులను మాత్రమే తాము సూచించామని అన్నారు. తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటరు నిర్ధారించుకోగలిగితేనే ప్రజాస్వామ్యంపై నమ్మకం కలుగుతుందని ఆయన చెప్పారు. ఓటుకు రసీదు ఉంటే వివాదాలను తేలిగ్గా పరిష్కరించవచ్చని అన్నారు.

అన్ని పోలింగ్ కేంద్రాలను వెబ్ కెమెరాలతో అనుసంధానం చేయాలని కూడా తాను సూచించినట్లు తెలిపారు. రానున్న కాలంలో ఆధార్‌కార్డు ఆధారంగా ఓటరును గుర్తించడమే కాకుండా ఐరిస్ పరిజ్ఞానంతో ఎవరి ఓటును వారే వేసుకోగలిగే విధానాన్ని అభివృద్ధి చేయాలని కూడా సూచించినట్లు చంద్రబాబు చెప్పారు. ప్రింటయిన ఓటు కేవలం ఐదు సెకన్లు మాత్రమే కనిపిస్తుందని, ఈ సమయాన్ని పది సెకన్లకు పెంచాలని, రెండు డిస్‌ప్లేలకు బదులుగా ఒక డిస్‌ప్లేనే ఉంచాలని కూడా సూచించినట్లు తెలిపారు.

కాగా.. ప్రింటర్ ఈవీఎం విధానాన్ని కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్వాగతించాయి. పలు దేశాలు ఈవీఎంలను వదిలిపెడుతున్నందున మన దేశంలోనూ వాటిని వదిలిపెట్టి, బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలని సీపీఐ జాతీయసమితి కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ కోరారు. అయితే, దీనివల్ల కౌంటింగ్ ఆలస్యమవుతుందని, ఈవీఎంలే మేలని ఈసీ ప్రతినిధులు అన్నారు. బీజేపీ, సమాజ్‌వాదీ, సీపీఐ, జేడీఎస్, బీఎస్పీ తదితర పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నల్లడబ్బును అడ్డుకోండి దాంతో ఓటర్లను కొంటున్నారు

మహానాడుకు ముందు నియోజకవర్గ, జిల్లా మహానాడులను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 18, 20, 21, 22 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 294 శాసనసభా నియోజకవర్గాల్లో, ఆ తర్వాత 24, 25 తేదీల్లో జిల్లాల్లో మహానాడులను నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో గురువారం జరిగిన మహానాడు సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. నియోజకవర్గాల మహానాడులకు పక్క జిల్లాల నేతలు, జిల్లా మహానాడులకు రాష్ట్ర నాయకులు పరిశీలకులుగా హాజరవుతారని పార్టీ రాష్ట్ర నాయకుడు ఎల్వీఎస్సార్కే ప్రసాద్ వెల్లడించారు.

18 నుంచి మినీ మహానాడు!

జగన్‌కు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం అనంతపురం, నరసరావుపేటలలో వారు విలేకరులతో మాట్లాడారు. జగన్‌పై కేసుల తీవ్రతనుబట్టే ఆయనకు బెయిల్ రాలేదని పయ్యావుల స్పష్టం చేశారు. వ్యక్తికన్నా సమాజ శ్రేయస్సే ప్రధానమన్న ధర్మాసనం వ్యాఖ్య ఇందుకు నిదర్శమన్నారు.

జగన్‌ను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటున్న వైసీపీ నేతలు, శ్రేణులకు ఈ వ్యాఖ్యలు చెంపపెట్టులాంటివన్నారు. వైసీపీ ఇప్పటికే తిరోగమనం బాటపట్టిందని, చుక్కాని లేని నావలా తయారైందని పేర్కొన్నారు. వర్గపోరు, కుమ్ములాటలు పెచ్చుమీరడంతో నిస్పృహ చెందిన ఆ పార్టీ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారన్నారు.

అవినీతిలో జగన్ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచాడని కోడెల విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరంలో ఆయన నిందితుడని, విచారణ పూర్తయ్యేవరకు బెయిల్‌కు రావద్దని సుప్రీం కోర్టు చెప్పటం హద్దుల్లేని జగన్ అవినీతికి నిదర్శనమన్నారు. బెయిల్ రాకుండా బాబు కుట్ర చేశారనడం వైసీపీ నేతల నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు.

నేర తీవ్రతవల్లే బెయిల్ రాలేదు: టీడీపీ

ఢిల్లీలో వైద్యం చేయించుకొని వచ్చా : చంద్రబాబు

హైదరాబాద్

తొమ్మిదేళ్ల నుంచి తాను ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పారు. " పైగా మాది రాష్ట్ర స్థాయి పార్టీ. మేం సుప్రీం కోర్టును ఎలా ప్రభావితం చేయగలుగుతాం? సుప్రీం కోర్టు నిన్నే ప్రధాని, న్యాయ శాఖ బొగ్గు శాఖల మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేసి దులిపేసింది. అంతటి స్థాయి వారిని కూడా లక్ష్య పెట్టని కోర్టును మేం ప్రభావితం చేయడం సాధ్యమేనా? తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాపై పడితే ఎలా? వారికి అనుకూలంగా లేకపోతే న్యాయమూర్తులు సహా ప్రతివారిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దేశంలో ఏ వ్యక్తి ఇలా కోర్టులను, న్యాయమూర్తులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేయలేదు.

నాంపల్లి కోర్టు నుంచి న్యూ ఢిల్లీ కోర్టు వరకూ ఎందరో న్యాయమూర్తులు ఉంటారు. వారంతా జగన్‌కు విరోధులేనా? పత్రికలు, పార్టీలు, కోర్టులు ప్రతివారినీ బెదిరిస్తున్నారు. చివరకు ఫేస్‌బుక్‌లో ఎవరైనా ఏదైనా రాస్తే వారికి కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఎల్లకాలం ఇవి సాగవని గుర్తుంచుకోవాలి' అని హెచ్చరించారు. వారి ఆరోపణలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంపై ఆలోచిస్తామని చెప్పారు. వైసీపీ అడ్రస్ కూడా ఉండదని, చివరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అనుమానమేనన్నారు. దేశంలో కోర్టుల వల్లే ఎంతో కొంత న్యాయం బతుకుతోందని వ్యాఖ్యానించారు.

"కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో మైనింగ్ మాఫియా విశ్వరూపంపై మేం ఆరేళ్ల కిందట ఒక పుస్తకం వేసి కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ప్రధాని ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే కోల్‌గేట్, కామన్‌వెల్త్ గేట్ జరిగేవి కావు. దేశంలో ప్రతి కుంభకోణంపైనా కోర్టులు పట్టించుకొనేవరకూ ప్రభుత్వం తనకుతానుగా తీసుకొన్న చర్యే లేదు. కోర్టుల వల్లే అవినీతిపరుల్లో కొంతైనా భయం నెలకొంది'' అని పేర్కొన్నారు. కళంకిత మంత్రులను చంకలో పెట్టుకొని కర్ణాటక ఫలితాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చంకలు కొట్టుకొంటే లాభం లేదని ఎద్దేవా చేశారు.

దేశం ఎటుపోతోందోనని ప్రధాని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారని, దేశాన్ని ఎటు తీసుకువెళ్తున్నారో...ఎటువంటి దిశా నిర్దేశం చేస్తున్నారో ముందు చెప్పాలన్నారు. పార్లమెంటులో మైనింగ్ మాఫియాపై చర్చ జరపాలని చూస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కుమ్మక్కై రానివ్వలేదని విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు పథకాలు ప్రకటిస్తే ఉపయోగం ఏమిటని కిరణ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. "రాజీవ్ యువ కిరణాలు పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కరెంటు కోతలు ఎత్తివేయగలిగారా? మేం చెప్పామని బెల్టు షాపులు తీసేస్తామంటున్నారు. ఆడపిల్లల పేరు మీద డిపాజిట్లు వేస్తామని చెబుతున్నారు. కనీసం మంత్రివర్గంలో చర్చించని ఈ ప«థకాలకు ఉన్న పవిత్రత ఏమిటి' అని ఆయన ప్రశ్నించారు.
: సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రినే దులిపేస్తున్న సుప్రీం కోర్టును తాను ప్రభావితం చేయడం సాధ్యమేనా అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో ఉండి జగన్‌కు బెయిల్ రాకుండా చేశారని వైసీపీ పార్టీ నేతలు చేసిన ఆరోపణపై విస్మయం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఈ అంశాన్ని మీడియా ప్రస్తావించగా ఆయన తీవ్రంగా స్పందించారు. "ప్రజలను మభ్యపెట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లాను. అక్కడ వర్ధన్ ఆస్పత్రిలో ఫిజియో థెరపీ చేయించుకొని వచ్చాను. దానికే ఇన్ని కల్పిస్తారా?'' అని మండిపడ్డారు.

నేను చెబితే వింటుందా? ప్రధానినే దులిపేస్తున్నారు..అలాంటిది నేను సుప్రీంను ప్రభవితం చేయడమా?

హైదరాబాద్ : ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్‌తో ఈ నెల 13న ఖమ్మం జిల్లా బయ్యారంలో భారీ ధర్నా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు గురువారమిక్కడ ఈమేరకు ప్రకటించా రు. ధర్నాలో తెలంగాణలోని పార్టీ ప్రజా ప్రతినిధులంతా పాల్గొనాలని ఫోరం
నిర్ణయించిందన్నారు. ఈ నెల 13న ఉదయం హైదరాబాద్‌నుంచి బస్సులో బయ్యా రం వెళ్తామని చెప్పారు.

'బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు మొట్టమొదట డిమాండ్ చేసింది మేమే. మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా అక్కడకు వెళ్ళి ధర్నా నిర్వహించి బయ్యారంలోనే ఫ్యాక్టరీ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. బయ్యారంలో విలువైన ఇనుప ఖనిజం ఉంది. అక్కడే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి.

అక్కడి ఖనిజాన్ని మరెక్కడికో తరలించే ఆలోచన చేయవద్దు. దానిని మేం సహించం. అక్కడ ఫ్యాక్టరీ పెట్టేవరకూ మా పోరాటం కొనసాగుతుంది' అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించిన ఏ ప్రభుత్వమూ మనలేదని హెచ్చరించారు.

టీడీపీ 'ఉక్కు' ఉద్యమం! 13న బయ్యారంలో ధర్నా: ఎర్రబెల్లి

తిరుపతి

బాబు కుటుంబానికి విశ్వంజీ ఆశీర్వచనం హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వంజీ గురు మహారాజ్ ఆశీర్వదించారు. గురువారం ఆయన చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నుంచి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఆశీస్సులు పొందారు.
: టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు వస్తున్నారు. పాదయాత్ర విజయవంతం అయిన సందర్భంగా కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. పాదయాత్ర ముగిసిన వెంటనే తిరుమలకు రావాల్సి ఉన్నా, కాలినొప్పి కారణంగా పర్యటన వాయిదా పడింది. పాదయాత్ర అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న తమ నాయకునికి ఘన స్వాగతం పలకడానికి తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.

నేడు తిరుమలకు చంద్రబాబు

చెన్నూరు: మీరు చూపే ఆదరణ అపూర్వం. మీ అభిమానా న్ని మరచిపోలేను. మీలో ఒకనిగా ఆదరిస్తున్నారు. ఆహ్వా నిస్తున్నారు. మీ ఆదరణతోనే తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన హామీలన్ని తప్పక నెరవేరుతాయి. బ్యాంకుల్లో రైతులు ఎలాంటి అప్పు తీసుకున్నా ఒక్క నయాపైసా కట్టొద్దు. డ్వా క్రా రుణాలు, బంగారుపై తీసుకున్న అప్పు చెల్లించవద్దు. అధికారంలోకి రాగానే మీ అప్పు రద్దు చేస్తాం అంటూ కమ లాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి చెబుతున్న మాటలకు ప్రజల్లో బాగా హత్తు కుంటున్నాయి. దేశం నేత మాటలకు ఆసక్తిగా వింటున్న మహిళలు వ్యవసాయంలో ఏమి రాకపోయినా అప్పులు పెరిగాయి. వడ్డీలు పెరిగాయి.

మా అప్పులు తీరుతాయంటే మీకే ఓటు వేస్తామంటూ చెబుతున్నారు. పల్లెపల్లెకు పుత్తా కార్యక్రమంలో చంద్రబాబు చెప్పిన హామీలపై మండలం లో మంచి స్పందన కనిపిస్తోంది. గురువారం దౌలతాపు రం, ఎస్టీ రామాపురంకాలని, కనుపర్తి, బలసింగాయపల్లె, కైలాసగిరికోన, కొండపేట గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమా ల్లో మండల తెలుగుదేశం పార్టీలు హామీలు వివరిస్తూ కరపత్రాలు పంచారు. దేశం పార్టీ అధికారంలోకి వస్తే రుణ మాఫిపై తొలి సంతకం చేసి బ్యాంకుల్లో అప్పులను తీరు స్తామన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు, గృహోపక రణాలకు 24 గంటలు కరెంట్ సరఫరా వుంటుందన్నారు. మైనారిటీ మహిళలు కోసం ఇవ్వబోతున్న పథకాలను ఆ పార్టీ కడప నగరనేత సుభాన్‌బాష వివరించడం జరిగింది.

తెలుగుదేశం హయాంలోనే ముస్లీంల అభివృద్ధి పెరిగింద న్నారు. కొండపేటలో దేశం నేత వెంట స్థానిక ప్రజలు అత్యధిక సంఖ్యలో గ్రామమంతా తిరిగారు. కార్యక్రమం లో దేశం నేతలు విజయభాస్క ర్‌రెడ్డి, శివారెడ్డి, కొండపేట సుధాకర్‌రెడ్డి, ప్రసాద్, ముండ్లపల్లె రాజ, ఖాసీంపీరా, ము క్తియార్, మన్నూరు రాజగోపాలుడు, కటారి వీరన్న, చలప తి, కమలాపురం నేతలు పాల్గొన్నారు.

ప్రజాదరణతోనే అధికారంలోకి తెలుగుదేశం: పుత్తా

గుంటూరు : జిల్లాలోని రెంటచింతల మండలం మంచికల్లులో టీడీపీ కార్యకర్త సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని దుండగులు సుబ్రహ్మణ్యాన్ని కత్తులతో పొడిచి చంపారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ బంధువు సుబ్రహ్మణ్యం. మృతుడు దుర్గి మండలం ధర్మవరంకు చెందిన వ్యక్తి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గుంటూరులో టీడీపీ కార్యకర్త దారుణహత్య

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని టీడీపీ మహానాడు వేడులకు ఈనెల 27, 28 తేదీల్లో గండిపేటలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎనమనల రామకృష్ణుడు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడులో పది తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు.

ఈనెల 27, 28న గండిపేటలో టీడీపీ మహానాడు

ఎన్నికల్లో సంస్కరణలు అవసరం
దేశంలో అవినీతి, నల్లధనం పెరిగిపోయింది

న్యూఢిల్లీ

శుక్రవారం ఉదయం రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం జరిగింది. భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ట్యాపరింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి ఓటరుకి తన ఓటును ఎవరికి వేస్తున్నానో తెలియాలన్నారు. పోలింగ్ బూత్‌లలో వెబ్ కెమెరాలు పెట్టిలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈవీఎంలకు అదనపు ప్రింటర్లను జత పర్చాలని గతంలో ఈసీకి చెప్పినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఈసీ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చిందన్నారు. ఈసీ నిర్ణయానికి ఒకటి,రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు అంగీకారం తెలిపినట్లు బాబు చెప్పారు. ఈవీఎంలకు ప్రింటర్లు అమర్చే నిర్ణయాన్ని ఈసీ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమలు జరిగితేనే తనకు సంతృప్తి అని బాబు పేర్కొన్నారు.

అలాగే ఎన్నికలు జరిగే అన్ని కేంద్రాల్లో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈసీకి తెలిపామని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో పెయిడ్ వార్తలు, మద్యం పంపిణీ నియంత్రించాలన్నారు. రౌడీలకు ఎన్నికల్లో అనుమతివ్వకుండా ఈసి తగుచర్యలు తీసుకోవాలన్నారు. వీటిపై పార్టీలతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఈసీని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవినీతిని ప్రజలు వ్యతిరేకించారన్నారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింద న్నారు. సుప్రీం కోర్టు కుంభకోణాలను వెలికి తీసున్నాయని, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవ ట్లేదని చంద్రబాబు మండిపడ్డారు.

ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత పారదర్శకత కోసం ఓటింగులో ఐరిష్ పద్ధతిని ప్రవేశపెట్టాలని చంద్రబాబు అన్నారు. అయితే, ఎన్నికల్లో ధనప్రవాహాన్ని నియంత్రించలేకపోతున్నారని ఆయన అన్నారు. ఓటర్లను కొంటున్నారని, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని అన్నారు. మద్యం ఏరులై పారుతోందని చంద్రబాబు విమర్శించారు. నేరగాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని, నేరగాళ్లు రాజకీయాల్లోకి రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలు అవినీతిపరులను తిరస్కరించే స్థితికి వచ్చారని చంద్రబాబు అన్నారు. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతామని తాము గత ఎన్నికల్లో ప్రకటించామని, నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటోందని, దాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై కేంద్రం అందరి అభిప్రాయాలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు.
: ఎన్నికల్లో సంస్కరణలు అవసరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దేశంలో అవినీతి. నల్లధనం బాగా పెరిగిపోయాయన్నారు. నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలిస్తే దేశంలో పేదరికాన్ని అంతం చేయవచ్చునని ఆయన అన్నారు. వేయి రూపాయల నోట్లు వచ్చిన తర్వాత కోటి రూపాయలు కూడా జేబుల్లో పెట్టుకుని వెళ్లడానికి వీలవుతుందని, ఈ పద్ధతి మారాలని, లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలని చంద్రబాబు అన్నారు.

ఓటింగ్‌లో ఐరిష్ పద్ధతిని పెట్టాలి : చంద్రబాబు