May 7, 2013హైదరాబాద్/గల్ఫ్ ప్రతినిధి : ఆస్ట్రేలియాలో తెలుగుదేశం పార్టీ శాఖ ఏర్పాటైంది. సిడ్నీ నగరంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నూతన శాఖకు కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. అధ్యక్షునిగా కోడూరి శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షునిగా కొండబోలు నవీన్, కార్యదర్శిగా ముత్తవరపు హిమబిందు, సహాయ కార్యదర్శిగా చింతమనేని రవీంద్ర, కోశాధికారిగా చెన్నుపాటి విజయ్ ఎన్నికయ్యారు.జూన్ రెండో తేదీన ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరపనున్నట్టు చెప్పారు.మరోవైపు, పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో కువైట్‌లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు, సభ్యులు వేడుకలు జరుపుకున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ నేత ములకల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో టీడీపీ శాఖ! కువైట్‌లో పాదయాత్ర విజయోత్సవాలు


సమసిన వివాదం

న్యూఢిల్లీ, హైదరాబాద్ : ఆంధ్రుల అభిమాన కథానాయకుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంగళవారం పార్లమెంట్‌లో ఆవిష్కరించనున్నారు. పార్లమెంట్‌లోని గేట్ నంబర్ 12 సమీపంలో రాజ్యసభకు వెళ్లే లాబీలో ఉదయం 10:30 గంటలకు అన్నగారి విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పీకర్ ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయించారు.

స్పీకర్ కార్యాలయం అధికారులు చంద్రబాబుకు ఫోన్‌చేసి చెప్పడమే కాక, లేఖ కూడా రాయడంతో ఆయన మంగళవారం విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రావాలని నిర్ణయించారు. దీంతో ఆహ్వానం విషయంలో టీడీపీ- కేంద్రమంత్రి పురందేశ్వరి మధ్య ఏర్పడిన వివాదం సమసిపోయింది. పార్లమెంట్‌కు విగ్రహాన్ని విరాళంగా ఇచ్చేందుకు పురందేశ్వరికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, కొందరు సినీ ప్రముఖులను పురందేశ్వరి ఈ విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు. చంద్రబాబు కార్యాలయానికి కూడా తాను లేఖ పంపానని ఆమె చెప్పారు.

కానీ చంద్రబాబుకు అధికారికంగా ఆహ్వానం పంపనందుకు ఆగ్రహించిన టీడీపీ ఎంపీలు సోమవారం స్పీకర్ మీరాకుమార్‌ను మూడుసార్లు కలుసుకున్నారు. టీడీపీపీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకులు కొనకళ్ల నారాయణరావు, రమేశ్ రాథోడ్, ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు ఒకసారి స్పీకర్‌ను కలిసి తమ నేతకు ఆహ్వానం పంపలేదని చెప్పారు. స్పీకర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందాల్సిందేనన్నారు.

పురందేశ్వరి నుంచి కూడా తమకు సరిగా ఆహ్వానం అందలేదని, ఇది ప్రైవేట్ కార్యక్రమం కాదని టీడీపీ ఎంపీలు ఆమెకు స్పష్టంచేశారు. తాను మళ్లీ పిలిపించి మాట్లాడతానని స్పీకర్ వారికి నచ్చజెప్పారు. అనంతరం ఆమె పురందేశ్వరిని పిలిచి చంద్రబాబుకు ఆహ్వానంపై ప్రశ్నించారు. తాను చంద్రబాబుకూ లేఖ పంపానని ఆమె ఆధారాలు సమర్పించారు. ఆమె వెళ్లిన తర్వాత మ«ధ్యాహ్నం 12 గంటలకు మరోసారి స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు అధికారిక ఆహ్వానం పంపాలని పట్టుబట్టారు. తాను ఆలోచిస్తానని చెప్పి టీడీపీ సభ్యులను కొద్దిసేపు వేచి ఉండమన్న స్పీకర్ కార్యాలయం అధికారులతో మాట్లాడారు.

తర్వాత మళ్లీ టీడీపీ ఎంపీలను పిలిచి తన కార్యాలయం చంద్రబాబుతో మాట్లాడి ఆహ్వానం పంపిందని చెప్పడంతో వారు శాంతించారు. మంగళవారం ఉదయం 10:30కి జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించారు. అనంతరం టీడీపీ ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయటంపై తామంతా సంతోషిస్తున్నామని, ఈ శుభ సందర్భంలో 13 ఏళ్లుగా విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన చంద్రబాబుకు అధికారిక ఆహ్వానం లేకపోవడం తమను బాధపెట్టిందని తెలిపారు.

విగ్రహావిష్కరణ స్పీకర్ చేతులమీదుగా జరుగుతున్నప్పుడు అధికారిక ఆహ్వానం లేదని తాము బాధపడ్డామే తప్ప, తమకు ఇందులో ఎలాంటి అహాలూ లేవని నామా స్పష్టంచేశారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి పార్లమెంటుకు వస్తున్నప్పుడు అందుకు తగిన ఏర్పాట్లు ముందుగానే చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తాము ఎలాంటి రాజకీయాలకు పాల్పడట్లేదని, చంద్రబాబుకు ఆహ్వానం రాకపోవటంతో ప్రజలందరికీ రాజకీయాలు అర్థమయ్యాయని చెప్పారు.

కథ సుఖాంతం: దగ్గుబాటి దంపతులు

విగ్రహావిష్కరణకు చంద్రబాబు రావాలని నిర్ణయించుకోవడం పట్ల కేంద్రమంత్రి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంతోషం ప్రకటించారు. 'కథ సుఖాంతమైంది.. అంతా వస్తున్నారు.. ఇప్పుడు వివాదానికి తావు లేదు' అని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. తాము చంద్రబాబుకు ఆహ్వానం పంపామని, పార్టీ కార్యాలయంలో ఆయన అధికారి ఒకరు ఆ లేఖ తీసుకున్నారని పురందేశ్వరి చెప్పారు.

కాంగ్రెస్ కుట్ర విఫలం: కోడెల

ఎన్టీఆర్, చంద్రబాబును వేరుచేసి చూపించాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం విఫలమైందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

వైఎస్ విగ్రహం కూడా పెట్టాలి: భూమన
ఎన్టీఆర్ విగ్రహంలాగే దివంగత సీఎం వైఎస్ విగ్రహం కూడా పార్లమెంటులో పెట్టాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పురందేశ్వరిపై కేసు పెడతా: లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తనను అహ్వానించలేదని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి చెప్పారు. తనకు అలాంటిదేమీ అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో పార్లమెంటరీ కమిటీని పురందేశ్వరి తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఇప్పటికీ స్పందన లేకపోతే పురందేశ్వరి, మీరాకుమార్‌లపై కేసు పెడతానన్నారు.

అన్నగారి విగ్రహావిష్కరణ నేడే చంద్రబాబుకు మీరా ఆహ్వానం..


సుభాష్‌నగర్: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా రానున్న ఎన్నిక ల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. పదవుల కోసం పార్టీని వీడాల్సిన అవసరం లే దని, కష్టపడి పనిచేసే వారికి తగిన గు ర్తింపు ఉంటుందని హామి ఇచ్చారు. పా ర్టీని వీడిన వారు వారంలోగా తిరిగి వ స్తే సముచిత స్థానం లభిస్తుందని అవకాశం ఇచ్చారు. సోమవారం కరీంనగర్‌లోని కెమిస్ట్ భవన్‌లో కరీంనగర్ అసెం బ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కా ర్యకర్తల సమావేశం జరిగింది. ఈ స మావేశానికి జిల్లా అద్యక్షుడు విజయరమణారావు, ఎమ్మెల్యేలు ఎల్. రమణ, సుద్దాల దేవయ్య, మాజీ మంత్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి సహా పలువురు నేతలు హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు..

పెద్దిరెడ్డి మా ట్లాడుతూ నిజమైన టీడీపీ కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారని తెలిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన గంగుల కమలాకర్ వెంట ఒక్కఎంపీటీసీ తప్ప ఎవరూ వెళ్లలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 12 సంవత్సరాలైనా సరైన నాయకులు లేరని, అందుకే టీడీపీ నాయకులను ఆ హ్వానిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజ లు పార్టీ వెంట ఉంటే ఎవరినైనా గెలిపిస్తారని తెలిపారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 63 సంవత్సరాల వయసులో దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు రెండు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు.

టీఆర్ఎస్ నాయకులు మైండ్‌గేమ్ ఆడుతున్నారని,ఎవరెన్ని చెప్పినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దానిని ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. పార్టీ వీడిన వారికి వారం రోజులు సమయమిస్తున్నామని వారు తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ పార్టీ కొరకు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే ఎమ్మెల్యే కమలాకర్ పార్టీకి తీరని ద్రో హం చేశారని, వెన్నుపోటు పొడిచారన్నారు. రాబోయే సంస్థాగత, మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ నాయకులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. సంతకాల సేకరణ కార్యక్రమా న్ని కూడా కొనసాగించాలన్నారు. జగిత్యా ల ఎమ్మెల్యే రమణ మాట్లాడుతూ కష్టపడే వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావించిన నాటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కో సం పనిచేస్తున్న మల్కాపూర్ గ్రామాని కి చెంది తెలుగుదేశం కార్యకర్త పురమాండ్ల నారాయణకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోనాల రాజేశం టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని బహుకరించారు..

ఈ సందర్భంగా పలువురు యు వకులు టీడీపీలో చేరారు. ఈ సమావేశంలో మంథని ఇన్‌చార్జి కర్రు నాగ య్య, హుస్నాబాద్ ఇన్‌చార్జీ రవీందర్‌రావు, హుజురాబాద్ ఇన్‌చార్జీ ఎం క శ్య ప్ రెడ్డి, వేముల వాడ ఇన్‌చార్జీ గండ్ర న ళిని, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రా జేశం, పోలాస నరేందర్, ఎండి తాజోద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య, జిల్లా అధికార ప్రతినిధి దామెర సత్యం, నగర అధ్యక్షుడు డిండిగాల మహేశ్, జిల్లా తెలుగు యువ అధ్యక్షుడు సుద్దాల గౌతంక్రిష్ణ, జిల్లా రైతు అధ్యక్షుడు వెల్ముల రాంరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, తెలుగు యువత నగర అధ్యక్షుడు గాజ రమేశ్, భాగ్యనగర్ రాజేందర్, అమీనాబేగ ం, మహిళా అధ్యక్షురాలు తీట్ల ఈశ్వరి, అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీని ఆపేశక్తి ఎవరికీ లేదు..

న్యూఢిల్లీ

బీజేపీ నేతలు అద్వానీ, రవిశంకర్‌ప్రసాద్, మురళీమనోహర్‌జోషి, అరుణ్‌జైట్లీ, ఎంపీలు లగడపాటి, పొన్నం, గుత్తా సుఖేందర్, మాగుంట, రాపోలు ఆనందభాస్కర్, సురేష్ షెట్కర్, ములాయం, సురవరం, శరద్‌యాదవ్,మోహన్‌బాబు, జయప్రద తదితరులు హాజరయ్యారు.
: పార్లమెంటులో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ జరిగింది. మంగళవారం ఉదయం స్పీకర్ మీరాకుమార్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రులు షిండే, ఆజాద్, చిరంజీవి, పల్లంరాజు, కిల్లీకృపారాణి, జైరాంరమేష్, జైపాల్‌రెడ్డి, జ్యోతిరాధిత్య సింధియా, ఫరూక్ అబ్దుల్లా,

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

న్యూఢిల్లీ
: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ జీవిత విశేషాలపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి దంపతులు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, ప్రముఖ హీరో బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రాసిన 'యుగపురుషుడు' పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ జీవితంపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకావిష్కరణ

న్యూఢిల్లీ
: తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాలింది ఎన్టీఆరే అని ప్రముఖ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలుగు జాతికే గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు, వాటినే దేశ వ్యాప్తంగా అమలుచేశారని బాలకృష్ణ గుర్తుచేశారు.

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటింది ఎన్టీఆరే : బాలకృష్ణ

విశాఖపట్నం : అనకాపల్లిలో టీడీపీ నేతలు మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, వాసుపల్లి గణేష్, ఎమ్మెల్యేలు రామానాయుడు, కేఎస్ఎన్ రాజు, మాజీ మంత్రి మణికుమారి, శోభాహైమావతి, తులసీరావు, అయ్యన్న కుమారుడు విజయ్, నాగమణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

విశాఖ : అనకాపల్లిలో టీడీపీ సమావేశం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు విగ్రహావిష్కరణ సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు అక్కడే బస చేయనున్నారు. పలువురు జాతీయ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

నేడు ఢిల్లీలోనే చంద్రబాబు బస

న్యూఢిల్లీ

సంక్షేమం, అభివృద్ధికి నాంది పలికిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. విగ్రహావిష్కరణ అంశాన్ని రాజకీయం చేయటం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.
: జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దని, ఆయనకు 'భారతరత్న' ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం పార్లమెంట్‌లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు తన చిరకాల వాంఛ, టీడీపీ ఆకాంక్ష అని చంద్రబాబునాయుడు తెలిపారు.

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి : చంద్రబాబు

ఎన్టీఆర్ జీవితంపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకావిష్కరణ
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటింది ఎన్టీఆరే : బాలకృష్ణ

న్యూఢిల్లీమంగళవారం ఉదయం పార్లమెంట్‌లో విగ్రహావిష్కరణ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు తన చిరకాల కోరిక అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని ఎన్టీఆర్ అహర్నిషలు శ్రమించారన్నారు. ఎన్టీఆర్‌తో రాజకీయంగా, కుటుంబపరంగా ఎన్నో అనుభూతులను పొందానని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ తనయుడు, సినీహీరో, టీడీపీ నేత బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుజాతి మర్చిపోలేని మహావ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పార్లమెంటులో ఆయన విగ్రహం ఏర్పాటు తెలుగు జాతికే గర్వకారణమని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది మహోన్నత చరిత్ర అన్నారు. ప్రాంతీయ పార్టీలను జాతీయస్థాయిలో ఏకం చేసిన గొప్ప నేత అని, పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు టిడిపి ఎంతో కృషి చేసిందన్నారు. ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు, వాటినే దేశ వ్యాప్తంగా అమలుచేశారని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేశారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ జీవిత విశేషాలపై 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టు ఫేం' పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి దంపతులు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రాసిన 'యుగపురుషుడు' పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అవినీతి మకిలి అంటని నేత ఎన్టీఆర్ మాత్రమే అన్నారు.

: తెలుగు జాతి మరిచిపోలేని మహావ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివ ర్ణించారు. ఎన్టీఆర్ దగ్గర పనిచేయడం తన అదృష్టం అని ఆయన తెలిపారు. ప్రజాసేవ ఎలా చేయాలో ఎన్టీఆర్ దగ్గరే నేర్చుకున్నానని బాబు చెప్పారు. ఎన్టీఆర్ స్పూర్తి, సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు జాతి మరిచిపోలేని మహావ్యక్తి ఎన్టీఆర్ : చంద్రబాబు

తరలి వచ్చిన అన్న కుటుంబం

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ పార్లమెంటులో జరిగింది. మంగళవారం ఉదయం స్పీకర్ మీరాకుమార్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి పురంధేశ్వరి దంపతులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఇంకా ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, చిరంజీవి, పల్లంరాజు, కిల్లి కృపారాణి, జైరాంరమేష్, జైపాల్‌రెడ్డి, జ్యోతిరాదిత్య సింధియా, ఫరూక్ అబ్దుల్లా, బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, రవిశంకర్‌ప్రసాద్, మురళీమనోహర్‌జోషి, అరుణ్‌జైట్లీ, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు, రాపోలు ఆనందభాస్కర్, సురేష్ షెట్కర్, జయప్రద, కనుమూరి బాపిరాజు, సర్వే సత్యనారాయణ, మంద జగన్నాథం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌యాదవ్,సినీ నటుడు మోహన్‌బాబు, టిడిపి ఎంపీలు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్ళకు ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరగడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్ మీరాకుమార్