May 3, 2013

అధికారంలోకి రాగానే 2.50 లక్షల ఉద్యోగాలనిస్తామని, 70 వేల బీసీ, 50 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని, ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు తొమ్మిదేళ్ళు గడుస్తున్నప్పటికీ వాటిని అమలు చేయకపోవడం దారుణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం గొప్పలు చెప్పడమే కానీ ఏదీ ఆచరణలోకి రావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులను ఆశలపల్లకీల్లో ఉంచి తాము మాత్రం అధికార పల్లకిలో ఊరేగాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

గొప్పల సీఎం..పోస్టులు భర్తీ చేయని వైనం: నర్సిరెడ్డి

హైదరాబాద్: ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్(గండిపేట)లో మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి పది వేల మంది ప్రతినిధులను ఆహ్వానించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

పాదయాత్ర విజయవంతమైన నేపథ్యంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు కృతఙ్ఞతలు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు పూర్తి విశ్రాంతి తీసుకున్న అనంతరం పాదయాత్ర చేయని ఆరు జిల్లాల్లో బస్సు యాత్ర చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక ఎన్నికల సంవత్సరం మొత్తం ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. బస్సు యాత్ర అనంతరం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలని సమావేశంలో నిర్ణయం జరిగింది.

27,28 తేదీల్లో గండిపేటలో మహానాడు

న్యూఢిల్లీ
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం లేఖ రాశారు. ఈనెల 7వ తేదీన పార్లమెంట్ ఆవరణలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని స్పీకర్ ఈ లేఖలో చంద్రబాబును కోరారు.

పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు బాబుకు ఆహ్వానం

హైదరాబాద్

అలాగే ఈనెల 17న తన కుమార్తె, కుమారుడు వివాహాలు జరుగనున్న సందర్భంగా రావాలిసిందిగా ఆహ్వానించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ తాము ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోలేదని చెప్పారు.
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం ఉదయం పరామర్శించారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఏడు నెలల తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన బాబును ఆయన నివాసంలో నారాయణ కలుసుకుని మాట్లాడారు.

చంద్రబాబును పరామర్శించిన నారాయణ

హైదరాబాద్
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పాదయాత్ర ముగించుకుని ఏడు నెలల తర్వాత నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, దాడి వీరభద్రరావు రాజీనామా, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఈనెల 27న మహానాడు ఏర్పాట్లు తదితర వాటిపై చర్చించినట్లు సమాచారం.

ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్ : ఎన్టీఆర్ జాతీయ లిట్రసీ అవార్డును శనివారంనాడు ప్రకటించనున్నట్లు ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి వెల్లడించారు. ఈ ఏడాది ఒరియా భాషకు సంబంధించి ఈ అవార్డును ప్రకటిస్తున్నామని చెప్పారు. అవార్డుకు సంబంధించిన జ్యూరీ శనివారంనాడు సమావేశమై అవార్డు గ్రహీతను నిర్ణయిస్తుందని, అనంతరం ఏర్పాటు చేయనున్న విలేఖరుల సమావేశంలో ప్రకటిస్తుందని వెల్లడించారు.

రేపు ఎన్టీఆర్ జాతీయ లిట్రసీ అవార్డు ప్రకటన