April 29, 2013

హైదరాబాద్: బ్రహ్మణి స్టీల్స్, రక్షణ స్టీల్స్‌కు కేటాయించిన భూములను రద్దు చేయగానే సరిపోదని, వాటి ఆధారంగా చేసిన దోపిడీకి సంబంధించిన సొమ్మును కూడా రికవరీ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సోమవారం మీడియాతో మాట్లాడారు. "రక్షణ స్టీల్స్‌కు చేసిన కేటాయింపులను అడ్డు పెట్టుకొని బయ్యారంలో వేల టన్నుల ఇనుప ఖనిజం తవ్వి కోట్లు గడించారు. ఆ డబ్బును కూడా రికవరీ చేయాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.

భూముల రద్దు కాదు ...రికవరీ చేయాలి: టీడీపీ

వస్త్రాలపై వ్యాట్ తొలగింపునకు ఏడాదినుంచీ వ్యాపారులు, ప్రతిపక్షాలు పోరాడినా పట్టించుకోని ముఖ్యమంత్రి కిరణ్, ఆకస్మికంగా రద్దుకు నిర్ణయించడం వెనుక మతలబు ఉందని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు దీనిపై విచారణ జరిపించాలని సోమవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. వ్యాట్ తొలగించాలన్న వ్యాపారుల డిమాండ్ న్యాయమైనదేనని, తమ పార్టీ అధినేత చంద్రబాబుసహా ప్రతిపక్షాలన్నీ వారి ఆందోళనకు మద్దతు ప్రకటించాయని గుర్తుచేశారు.

అటుపైన మంత్రివర్గ సమావేశాల్లో సహచరుల విజ్ఞప్తి నేపథ్యంలో నాలుగు శాతం తగ్గించి, పూర్తిగా రద్దుచేసేది లేదని చెప్పారన్నారు. అప్పుడు కూడా రూ.50 కోట్లు చేతులు మారినట్లు సాక్షాత్తూ మంత్రి దానం నాగేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఆరోపించారంటూ పత్రికల వార్తలనూ చూపారు. తాజాగా సీఎం సోదరుడు సంతోష్‌కుమార్‌రెడ్డి వ్యాపారుల లాబీతో కుదుర్చుకొన్న ఒప్పందంలో భాగంగా పూర్తిగా రద్దు చేశారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.

దీంతోపాటు సీఎం నియోజకవర్గం పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం కుటుంబసభ్యుల సహకారం ఉండటంవల్లనే అధికారులు ఆ స్మగ్లర్ల జోలికి వెళ్లడంలేదని ఆరోపించారు. ఇక చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభ విశేషాలు పత్రికల్లో ప్రముఖంగా రాకుండా చూడటానికే సర్కారు పెద్దపెద్ద తొలిపేజీ ప్రకటనలిచ్చిందని విమర్శించారు.

యాభై పైసలు కూడా ఇవ్వలేదు: టెక్స్‌టైల్ ఫెడరేషన్ వస్త్రాలపై వ్యాట్‌ను ప్రభుత్వం రద్దు చేయడంపై ఎ.పి.ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అమ్మనబోలు ప్రకాష్, మల్లీశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం సోదరుడు రూ.50 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపణలను వారు తోసిపుచ్చారు. "రూ.50 కోట్లు కాదుకదా... యాభై పైసలు కూడా ఇవ్వలేదు'' అని స్పష్టం చేశారు. సీఎంను మే 5న సన్మానించాలని నిర్ణయించామని ప్రకటించారు.

వ్యాట్ తొలటింపులోమతలబు: టీడీపీ

హైదరాబాద్

లండన్‌లో విజయోత్సవ సభ చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా లండన్‌లో ఒక విజయోత్సవ సభ సోమవారం జరిగింది. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం యూకే, యూరప్ శాఖల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. యూకే విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవాల్లో ప్రవాసాం«ద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కె.నారాయణరావు, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శోభా హైమావతి, పీఆర్ మోహన్, పొట్లూరి హరికృష్ణ, కోటేశ్వరరావు, ఎల్‌వీఎస్ఆర్‌కేప్రసాద్ తదితరులు ఫోన్లో తమ సందేశాలు తెలిపారు.
: వెన్నునొప్పి.. కాళ్ల కండరాల నొప్పులు.. జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు వారాల పా టు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర ము గించిన బాబుకు ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి చెందిన వైద్యుడు రాకేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సోమవారం సాయంత్రం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. నొప్పులతోపాటు.. కాలి చిటికెన వేలు గాయం మూడు నెలలుగా ఆయనను వేధిస్తోంది. ఇవన్నీ పూర్తిగా తగ్గాలంటే రెండు వారాలపాటు ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు.

బాబుకు రెండు వారాలు రెస్టు

విశాఖపట్నం

రక్తనిధి ఏర్పాటుకు సింబయాసిస్ సీఈవో నరేశ్ కుమార్ రూ.10 లక్షలు, ఆయన మిత్రులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, లోకేశ్, టీడీపీ నాయకులు ఎంవీవీఎస్ మూర్తి, కోడెల శివప్రసాద్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
: ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో విశాఖ నగరంలో రక్త నిధి ఏర్పాటైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ బ్లడ్ బ్యాంకులో మూడువేల యూనిట్ల రక్తం నిల్వ చేయవచ్చు. దీనిని రూ.కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇందులో కోల్డ్‌స్టోరేజీ, బ్లడ్ సెపరేషన్, ఇతర ఆధునిక పరికరాలు సమకూర్చారు. నిల్వచేసే రక్తంలో 30 శాతాన్ని పేదలకు అందజేస్తారు.

విశాఖలో ఎన్టీఆర్ స్మారక రక్తనిధి ప్రారంభించిన చంద్రబాబు దంపతులు


మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటన

హైదరాబాద్

స్థూలంగా ఇప్పటి వరకు వచ్చిన అభిప్రాయం మేరకు.. జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్రను చేపట్టనున్నారు. పాదయాత్రలో ఆయన 16 జిల్లాల్లోని 86 నియోజక వర్గాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించలేదు. వీటిలో హైదరాబాద్ మినహా మిగిలిన ఆరు జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటన ఉంటుంది. ఈ జిల్లాల్లో పర్యటన పూర్తయిన తర్వాత మిగిలిన 16 జిల్లాల్లో మిగిలిపోయిన శాసనసభ నియోజక వర్గాల్లో కూడా పర్యటించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉన్నందున బస్సు ద్వారా అయితే అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికలకు ముందు కూడా ఆయన 'మీ కోసం' పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఈసారి యాత్ర కూడా అదే తీరులో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి సుమారు ఆరు నెలలపాటు మిగిలిన అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించాలనేది చంద్రబాబు వ్యూహం. నిరంతరాయంగా ప్రజల్లో ఉండటం ద్వారా తాము చెప్పదల్చుకున్న విషయాలను బలంగా వారికి చేరవేయవచ్చని, అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా ఉత్తేజపర్చవచ్చన్న భావనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

రెండో విడత యాత్ర చేపట్టడానికి ముందు మే నెలలో తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడానికి వినియోగించాలని భావిస్తున్నారు. అప్పటి వరకు సంస్థాగతంగా ఉన్న లోటుపాట్లు, నియోజక వర్గాల్లో నాయకత్వ సమస్య, నేతల మధ్య సమన్వయ లోపం వంటి వాటిపై ఆయన దృష్టి పెట్టబోతున్నారు. మే నెలఖరులో హైదరాబాద్‌లో పార్టీ మహానాడుని ఘనంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాతే ఆయన రెండో విడత యాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
: పాదయాత్ర ముగిసింది! బస్సు యాత్రకు శ్రీకారం చుట్టుకోనుంది! 'వస్తున్నా మీ కోసం' దిగ్విజయమైంది! 'జన యాత్ర'కు రంగం సిద్ధం అవుతోంది! ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి కొనసాగింపుగా మరో విడత ప్రజల్లోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ నుంచి మరో యాత్ర చేయాలని ఆయన సంకల్పించారు. ఏడు నెలలుగా చేస్తున్న సుదీర్ఘ పాదయాత్రని ముగించుకుని ఆదివారం ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. సోమవారం నుంచి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే కొంతమంది నాయకులతో చర్చించారు.

ఇక బాబు బస్సు యాత్ర! జూన్ నుంచి చంద్రబాబు 'జన యాత్ర'

హైదరాబాద్

మాజీ ప్రధాని చంద్రశేఖర్ 56 ఏళ్ల వయస్సులో 170 రోజులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 53 ఏళ్ల వయస్సులో 60 రోజులు మాత్రమే పాదయాత్ర చేశారని తెలిపారు. వయస్సురీత్యా వచ్చే అలసట, శారీరక బాధలను పంటి బిగువన అణచుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకోవాలన్న పట్టుదలతో బాబు తన లక్ష్యం చేరుకోగలిగారన్నారు.
: 'ఢిల్లీ నుంచి కన్యాకుమారి మధ్య దూరం 2767 కిలోమీటర్లు. అనంతపురం నుంచి విశాఖపట్నం వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్ర 2817 కిలోమీటర్లు. 63 ఏళ్ల వయస్సులో 208 రోజుల పాటు చంద్రబాబు చేసిన పాదయాత్ర ప్రపంచంలోనే రికార్డు' అని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి దశరథ జనార్దన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఢిల్లీ-కన్యాకుమారిని దాటిన చంద్రబాబు యాత్ర

సరైన సమయంలో రాజకీయ అరంగ్రేటం

విశాఖపట్నం : 'సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తాను' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్ తెలిపారు. ప్రస్తుత రాజకీయాలను ఎప్పటికప్పుడు దగ్గరగా, సునిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ఆదివారం సింహాచల వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధితో లోకేశ్ కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ శ్రేణుల్లో తనకు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించగా... "అది అంత ప్రధానం కాదు. మా అందరికీ చంద్రబాబు ముఖ్యం. ప్రజలతో ఆయన పూర్తిగా మమేకమయ్యారు. మేమంతా ఆయన వెంట సేవకుల్లా నడుస్తున్నాం'' అని తెలిపారు.

చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతమైందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని లోకేశ్ తెలిపారు. ఇందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు

రాజకీయాలను పరిశీలిస్తున్నాను 'ఆంధ్రజ్యోతి'తో లోకేశ్

అప్పన్న సన్నిధిలో చంద్రబాబు, బాలకృష్ణ

సింహాచలం(విశాఖపట్నం): చంద్రబాబు ఆదివారం సింహాచలంలో వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతోపాటు బాలకృష్ణ కూడా వున్నారు. తొలుత ఆలయ ఈవో కోడూరు రామచంద్రమోహన్, ప్రధాన పురోహితుడు మోర్తా సీతారామాచార్యులు ఆధ్వర్యంలో వేదపఠనాలు, మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మంటపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

తదుపరి గర్భాలయంలో అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆస్థాన మంటపంలో వేదపండితులు ఆశీర్వదించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ పట్టువస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.

సింహాచలేశునికి పూజలు, కప్ప స్తంభం ఆలింగనం

కిడ్నీవ్యాధితో 'నిమ్స్'లో కన్నుమూత
టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు.. ఎన్టీఆర్ వీరాభిమాని
తీరని లోటు : చంద్రబాబు నివాళి

హైదరాబాద్: అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ (73) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ 'నిమ్స్'లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రమీలాదేవి, కూతురు సత్యలక్ష్మి, కుమారులు సతీష్‌కుమార్, సంతోష్‌కుమార్ ఉన్నారు. తండ్రికి వారసుడిగా సతీష్ హైదరాబాద్ పార్టీ శాఖ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఈశ్వరయ్య, రాజమణి దంపతులకు 1944 ఫిబ్రవరి 6న జన్మించిన శ్రీపతి.. బాల్యం నుంచే ఎన్టీఆర్‌కు వీరాభిమాని. దేశంలోనే తొలిసారి 'అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘా'న్ని 1952లో నెలకొల్చారు. ఆ అభిమానంతోనే 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా, సభ్యత్వం పుచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే ఇద్దరు ముగ్గురు నేతల్లో శ్రీపతి ఒకరు. 1983లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి గెలిచి.. కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. గృహనిర్మాణం, టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు.

1989 ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత 1999లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో టీఆర్ఎస్‌తో పొత్తులో భాగంగా సనత్‌నగర్ నియోజకవర్గం ఆ పార్టీకి పోవడంతో ఆయన పోటీచేయలేకపోయారు. ఎన్టీఆర్ హయాంలో హుడా, సెట్విన్, చిన్నతరహా పరిశ్రమల సంస్థ, బీసీ వెల్ఫేర్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ తదితరుల పదవులు నిర్వహించారు. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం ఏటా ఆయన వర్ధంతి రోజున 'ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ' నిర్వహిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట శ్మశాన వాటికిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

చంద్రబాబు నివాళి
శ్రీపతి రాజేశ్వర్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో పార్టీకి, నందమూరి కుటుంబానికే కాక, వ్యక్తిగతంగా తనకూ నష్టం కలిగిందని ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువరానివన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సంస్మరణ సభలో ఆ పార్టీ నేతలు తొండపి దశరథ జనార్దన్ రావు, కంభంపాటి రామ్మోహన్ రావు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్, మోత్కుపల్లి నర్సింహులు, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శ్రీపతి మరణవార్త తెలిసిన వెంటనే వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఆయన స్వగృహానికి తరలివచ్చారు. ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే సాయన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపకుడు శ్రీపతి రాజేశ్వర్ మృతి

వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు
ఆరుగంటలకుపైగా బైక్ ర్యాలీ
208 గుమ్మడికాయలతో దిష్టిఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బైక్ ర్యాలీ ప్రారంభించారు. సుమారు మూడువేల ద్విచక్రవాహనాలలో పార్టీ జెండా పట్టుకొని తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ శంషాబాద్ బయలుదేరారు. 1.30 గంటలకే వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు, పెద్దసంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సైతం శంషాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం గతంలో ఎన్నడూలేని స్థాయిలో జనంతో కిక్కిరిసింది. చంద్రబాబును చూసేందుకు జనం తోసుకుని ముందుకు రావడంతో వారిని నియంత్రిచేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. సరిగ్గా 2.55గంటలకు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ విమానాశ్రయం నుంచి బయటికి వచ్చారు.

ఊరేగింపు వాహనం ఎక్కారు. శంషాబాద్ నుంచి ఆరాంఘర్, అత్తాపూర్, మెహదీపట్నం, మసాబ్ ట్యాంక్ మీదుగా ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి... అక్కడ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ గిరిజనులు సంప్రదాయ నృత్యంతో బాబుకు స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం కావాల్సి ఉన్నా... ఎమ్మార్పీఎస్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండడంతో దానిని చంద్రబాబు రద్దు చేసుకున్నారు. బ్రహ్మానంద రెడ్డి పార్కు వద్ద టీడీపీ అనుబంధ తెలుగు రక్షణ వేదిక, ఎస్టీ విభాగాల ప్రతినిధులు బాబుకు స్వాగతం పలికారు. దారి పొడవునా చంద్రబాబు పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బాబుకు స్వాగతం పలికేందుకు అక్కడక్కడ ప్రత్యేక వేదికలను కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు స్వాగత ర్యాలీలో బాలకృష్ణ సందడి చేశారు. వాహనంపై కూర్చుని ఆద్యంతం నవ్వుతూ, అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు.

పూలబాటపై ఇంటికి... ఏడు నెలల తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్న చంద్రబాబుకు భావోద్వేగపూరిత స్వాగతం లభించింది. తెలుగు మహిళలు ప్రధాన రహదారి నుంచి ఇంటి గుమ్మం వరకూ బంతిపూలు పరిచారు. పూలబాటపై నడుస్తూ వచ్చిన చంద్రబాబుకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. 208 గుమ్మడి కాయలపై కర్పూరం వెలిగించి దిష్టితీసి పగులగొట్టారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు బాబును ఆశీర్వదించారు. 8.39గంటలకు ఇంటి ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న బాబుకు ఆయన సతీమణి భువనేశ్వరి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. లోకేశ్ కాస్త ముందుగానే ఇంటికి రాగా బాలకృష్ణ నేరుగా తన ఇంటికి వెళ్లారు. బావ మరిది రామకృష్ణ, ఇతర బంధువులు బాబును పలకరించారు. ఆరో గ్యం ఎలా ఉంది బావా? అని రామకృష్ణ కుశల ప్రశ్నలు వేశారు. చిటికెన వేలి నొప్పి గురించి ఆరా తీశారు.

హాజరు కాలేకపోయిన నేతలు... ఆదివారం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబును స్వాగతించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రాలేకపోయారు. శనివారం విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, నాయకులకు విమానాల్లో టికెట్లు దొరక్కపోవడంతో ఆదివారం హైదరాబాద్ చేరుకోలేకపోయారు.
కొసమెరుపు: చంద్రబాబు దృష్టిలో పడేందుకు నేతలు పోటీపడ్డారు. తమ పేర్లతో భారీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బాబు నివాసం వరకు మొత్తం కటౌట్లు, బ్యానర్లతో నింపి వేశారు.
హైదరాబాద్ సుదీర్ఘ పాదయాత్రతో చరిత్ర సృష్టించి.... తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం దాకా... సుమారు 6 గంటలపాటు విజయ యాత్ర సాగించారు. ద్విచక్ర వాహనాలపై కార్యకర్తలు తరలిరాగా... భారీ వాహన శ్రేణితో చంద్రబాబు ఊరేగింపుగా బయలు దేరారు. హైదరాబాద్ నగరంతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి తరలి వచ్చారు.

అపూర్వ స్వాగతం శంషాబాద్ నుంచి ఇంటిదాకా నీరాజనం


లేదంటే సమరమే
ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం పెట్టాలి
నామినేషన్ కోటాలో చట్ట సభలకు పంపాలి
వృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి
'యుద్ధ భేరీ' వేదికపై మంద కృష్ణ గర్జన
కష్టాలు కళ్లారా చూశాను
మీ పోరాటానికి మద్దతు
చంద్రబాబు సంఘీభావం

హైదరాబాద్ : వృద్ధులు, వితంతువుల పెన్షన్లు వెయ్యి రూపాయలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దీనిపై నెలరోజుల్లోపు స్పందించకపోతే... సర్కారుపై సమరం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'వృద్ధులు, వితంతువుల యుద్ధ భేరీ' కార్యక్రమంలో మంద కృష్ణ ప్రసంగించారు. " మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లేకపోతే... ఈ సర్కారును భూస్థాపితం చేయడానికి ఉద్యమం చేపడతాం. రాష్ట్రంలో ఇంకా 40 వేల మంది వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందడంలేదు. వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలి'' అని డిమాండ్ చేశారు.

చట్ట సభల్లో వృద్ధులు, వితంతువుల తరఫున మాట్లాడేందుకు గవర్నర్ కోటాలో, రాష్ట్రపతి కోటాలో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేయాలన్నారు. పెన్షన్లు ఇచ్చినా కొంత మంది వృద్ధులు సొంతంగా జీవించే పరిస్థితి లేదని... అందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి... దానికి వృద్ధులనే మంత్రిగా నియమించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు ప్రయాణ రాయితీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణను రెండుసార్లు కలిశామని... ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినప్పటికీ, అది అమలులోకి మాత్రం రాలేదని మంద కృష్ణ తెలిపారు. "ప్రభుత్వం వెంటనే వృద్ధులకు, వితంతువులకు ప్రయాణ రాయితీ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు రూ.500లు ఫించను ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.200లు మాత్రమే ఇస్తోంది'' అని తెలిపారు.

ఆరోగ్యశ్రీ సాధించాం...
ఎమ్మార్పీఎస్ కేవలం కులం కోసమే కాకుండా... మానవతా సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తుందని మంద కృష్ణ తెలిపారు. చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం పోరాటం చేసి... ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించింది తామే అని తెలిపారు.

ఈ క్రమంలో వైఎస్ నుంచి బెదిరింపులు కూడా ఎదుర్కొన్నానని చెప్పారు. "గుండె ఆపరేషన్ కోసం ఒక బాలికను వైఎస్ వద్దకు తీసుకెళితే... పాతిక వేలకంటే ఎక్కువ సహాయం చేయలేమన్నారు. నీ ఉద్యమం సంగతి, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలియదు అని హెచ్చరించారు.
గుండె జబ్బుతో చనిపోయిన బాలుడి మృతదేహంతో నేను, కిషన్ రెడ్డి (బీజేపీ నేత) ఆందోళనకు దిగినప్పుడు ఢిల్లీ నుంచే ఫోన్ చేసి వైఎస్ హెచ్చరించారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినవే'' అంటూ ఆ వార్తల క్లిప్పింగ్స్‌ను మంద కృష్ణ చూపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వృద్ధులు, వితంతువులు ఎంతో నమ్మకంతో ఈ సమావేశానికి వచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యాన్ని సాధిస్తామని మంద కృష్ణ ప్రకటించారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెంచాలని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామని... కానీ, సర్కారు స్పందించే పరిస్థితి కనపడటం లేదని తెలిపారు. మళ్లీ ఇంకోసారి ప్రతిపక్ష నేతలతో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని... నెల రోజుల్లో స్పందన లేకపోతే సమర భేరీ మోగిస్తామని మంద కృష్ణ హెచ్చరించారు.

సంపూర్ణ మద్దతు: చంద్రబాబు మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన వృద్ధులు, వికలాంగుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. పాదయాత్ర ముగించుకుని ఏడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన ఆయన... కొద్దిసేపటికే 'యుద్ధ భేరీ' సభకు వెళ్లారు. "ఏడు నెలల పాటు ప్రజల్లో ఉన్నాను. ఎన్నో గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు పడుతున్న బాధలను స్వయంగా చూశాను. వృద్ధులు, వితంతువుల కోసం మంద కృష్ణ చేసిన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం'' అని ప్రకటించారు.

బెల్టు షాపులు తీసేయాలని మహిళలు కోరుతున్నారని, తమ ప్రభుత్వం వస్తే మొట్టమొదటి సంతకం రైతుల రుణ మాఫీ, రెండో సంతకం మద్య నియంత్రణపై పెడతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. జనాభా దామాషాన వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం జరగాల్సిన అవసరముందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసినా కొన్ని కారణాలతో ఆగిపోయిందని, దానిని కాంగ్రెస్ కొనసాగించలేకపోయిందని తెలిపారు. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సభకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

మంద కృష్ణ కాంగ్రెస్‌లోకి వస్తే: సర్వే మంద కృష్ణ మాదిగలకు జాతిపితలాంటి వాడని, అలాంటి వ్యక్తి సోనియా గాంధీతో కలిసి ప్రయాణం చేస్తే మాదిగ జాతి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. వృద్ధుల, వితంతువుల ఫించన్లు దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సోనియాను కోరతామన్నారు. యుద్ధ భేరీ కార్యక్రమం ఎంబీసీ అధ్యక్షుడు సండ్ర వెంకటయ్య అధ్యక్షతన జరిగింది.

మానవతా ఉద్యమం: కిషన్‌రెడ్డి మందకృష్ణ ఉద్యమం..కేవలం సామాజిక ఉద్యమమే కాదని, అదొక మానవతా ఉద్యమమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొనియాడారు. గుండె జబ్బు పిల్లల కోసం ఆయన చేసిన పోరాటం వల్లే 'ఆరోగ్యశ్రీ' పెట్టినట్టు వైఎస్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి పింఛను అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చనున్నట్లు వెల్లడించారు. కాగా, తమ పార్టీ ఆవిర్భావ సభలో వృద్ధులకు, వితంతువులకు రూ.1500లు పింఛను ఇవ్వాలని తీర్మానం చేసినట్లు టీఆర్ఎస్‌పక్షనేత ఈటెల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రిని పింఛను పెంచాలని కోరితే డబ్బులెక్కడున్నాయని ప్రశ్నించారని, ఆ ప్రశ్నకు 'యుద్ధభేరీ'తో మందకృష్ణ సమాధానమిచ్చారని చెప్పారు. బయ్యారం లాంటి గనులు జాతికి అంకితమైతే.. ఎన్ని సంవత్సరాలైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

నెల రోజులే గడువు వృద్ధులు, వితంతు పెన్షన్లు పెంచాలి


పదవులపై వ్యామోహం లేదు
తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దోపిడీ పార్టీలు
వైఎస్‌పై మేం పోరాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుంది?
'విజయోత్సవ సభ'లో బాబు నిప్పులు'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఆదివారం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీగా వెళ్తూ... పలుచోట్ల చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి పాలనను అంతమొందించేందుకు రాజీలేని విధంగా ధర్మ పోరాటం చేస్తానని ప్రకటించారు.

"అవినీతి, కుంభకోణాలపై పోరాడే శక్తిని మీరే అందించారు. మీ తరఫున పోరాడతాను. మంచి రోజులు వస్తాయి'' అని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన ఇచ్చేంత వరకు ఈ పోరు సాగిస్తానని తెలిపారు. "కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం సర్వనాశనమైపోయింది. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ప్రదేశ్‌గా మార్చేశారు. నాకు పదవులపై, అధికారంపై వ్యామోహం లేదు. తెలుగు వారికి, రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడమే నా లక్ష్యం. రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టి పూర్వవైభవం తీసుకురావడమే మనముందున్న కర్తవ్యం'' అని చంద్రబాబు ప్రకటించారు. "మీ ఆశీస్సులు ఉంటే మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడుపుతాను. నిద్రపోకుండా పనిచేసి ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను. టీడీపీ సత్తా మళ్లీ చాటిచెబుతాను'' అని తెలిపారు.

ఆ పార్టీలతో జాగ్రత్త... మభ్యపెడుతున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ దోపిడీ పార్టీలైతే టీఆర్ఎస్ ఫామ్‌హౌస్ పార్టీ అని పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని భూములను వైఎస్ తన వారికి ధారాదత్తం చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. "బాబ్లీపై మేం పోరాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుంది? బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడికి కట్టబెట్టినప్పుడు టీఆర్ఎస్ నేతలు ఏం చేశారు?'' అని చంద్రబాబు నిలదీశారు.

కాళ్లు మొరాయించినా... ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేసినట్లు చంద్రబాబు తెలిపారు. "శరీరం సహకరించకున్నా, ఎన్ని ఇబ్బందులెదురైనా ఏడునెలల పాటు 2,800 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశాను. 16 జిల్లాల్లోని దాదాపు 1250 గ్రామాలను తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాను'' అని శంషాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభలో చెప్పారు. "సుదీర్ఘ యాత్రలో అనేక ఇబ్బందులు, కష్టాలు, శారీరక సమస్యలు ఎదురయ్యాయి. గొంతు పోయింది. కాళ్లు మొరాయించాయి. డాక్టర్లు అడ్డుచెప్పినా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకుసాగాను. పొలాలు, పూరిగుడిసెల్లోకి వెళ్లాను. తినేందుకు తిండిలేక అస్థిపంజరంలా ఉన్న మనుషులనూ చూశాను'' అని చంద్రబాబు ఆవేదనతో చెప్పారు.
రంగారెడ్డి జిల్లా: "పాదయాత్రలో మొదటి అడుగు మాత్రమే నాది. మీ అభిమానం, ఆశీస్సులతోనే మిగిలిన అడుగులు పడ్డాయి. ఇంత దూరం నడిపించాయి'' అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఉద్ఘాటించారు. "అవినీతి పాలనపై మీ ఆశీస్సులు, సహకారంతో ధర్మపోరాటం కొనసాగిస్తాను. మరో యాత్రను ప్రారంభిస్తాను'' అని చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే చెబుతామన్నారు.

మరో యాత్ర! ధర్మ పోరాటం కొనసాగిస్తా!

రాజేంద్రనగర్: రాష్ట్రంలో దొంగలు పడ్డారని, రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని, అది తానొక్కడినే చేయలేనని, ప్రజలందరి సహకారం కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర ముగించుకొని ఆదివారం రాజేంద్రనగర్‌కు చేరుకున్న చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆరాంఘర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు.

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ చంద్రబాబుకు పుష్పగుచ్ఛాన్ని అందజేయగా, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్ గొర్రెను, గొంగడి, గొల్ల రుమాలును బహూకరించారు. గొర్రెను తీసుకున్న చంద్రబాబు ముందు కూర్చున్న నందమూరి బాలకృష్ణకు దాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆరాంఘర్ చౌరస్తాలో చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 208 రోజులు... 2817 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకొని వస్తున్న తనకు ఆత్మబంధువులు చూపిన స్వాగతం తన జన్మ సార్థకమైనట్లుగా ఉందని చంద్రబాబునాయుడు అన్నారు.

పవ్రిత భావనతో తాను వస్తున్నా మీ కోసం పాదయాత్రను చేపట్టానన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేపట్టిన ఈ యాత్ర ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఎంతో బ్రహ్మాండంగా జరిగిందని, చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ప్రజల అభిమానం అక్కడ కనిపించిందన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు తనకు ఎంతో ఉత్తేజాన్ని నింపి పాదయాత్రకు పంపించారని గుర్తుచేసుకున్నారు. 207 రోజుల పాదయాత్రలో ప్రజల బాధలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోయాయన్నారు.

తాను 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి ఫలాలు పేదవారికి చేరే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అవినీతిలోకి నెట్టివేసిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తెలుగుదేశం కృషేనన్నారు. కృష్ణా జలాలను నగరానికి తీసుకువచ్చింది తెలుగుదేశం అని, వాటిని ప్రజలకు సరైనవిధంగా సరఫరా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేదని, ఉద్యోగాలు లేవని గుర్తుచేశారు. పేదరిక నిర్మూలన జరిగేవరకు తన పోరాటం ఆగదన్నారు.

మొదటి దశ కార్యక్రమంఅయిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ముగిసిందని, మీ అందరి సహకారంతో పార్టీ శ్రేణులతో మాట్లాడి రెండవ విడత కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతానన్నారు. పాదయాత్రలో నేను బాధపడితే రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందారని, అది చూసి తనకు ఎంతో ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.

ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ముందుకు సాగుతున్న తనకు ప్రజలు మద్దతు తెలుపాలన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ నాయకత్వంలో కాటేదాన్‌లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు న్యాయం జరిగిందన్నారు. వారి పనిగంటలు తగ్గించే విషయంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. పాదయాత్రతో తనకు పట్టుదల పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు తనకు భవిష్యత్తులో కూడా ఈ మద్దతును కొనసాగించాలని ఆయన కోరారు.

ఆరాంఘర్ నుంచి శివరాంపల్లి, పీడీపీ చౌరస్తా, ఉప్పర్‌పల్లి మీదుగా హైదర్‌గూడకు చేరుకున్న చంద్రబాబునాయుడుకు హైదర్‌గూడ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.రామేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అత్తాపూర్ వద్ద చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి ప్రసంగించాలనుకోగా మైక్ సహకరించలేదు. దీంతో ఆయన తనకు స్వాగతం పలకడానికి వచ్చినవారిని పలుకరిస్తూ చేయి ఊపుతూ ముందుకు సాగారు.

కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, రాజేంద్రనగర్ సర్కిల్ టీడీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు సామ భూపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్‌తో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా ఆలేరు నుంచి వచ్చిన రేణుక ఎల్లమ్మ డోలు బృందం సభ్యులు చేసిన విన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కళాకారులు జంగిరెడ్డి తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పాటలు పాడారు. బాబు రాక సందర్భంగా రాజేంద్రనగర్ రహదారులన్నీ పసుపుమయమయ్యాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు దారి పొడవునా ఏర్పాటు చేశారు. వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి పోటీపడ్డారు.

ప్రకాశ్‌గౌడ్‌ను అభినందించిన చంద్రబాబు

కాటేదాన్‌లో పనిచేస్తున్న వేలాది మంది మహిళా కార్మికులకు 12 గంటల పనిదినాలను 9 గంటలకు తగ్గించిన ఘనత ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కే దక్కుతుందని నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశ్‌గౌడ్ నాయకత్వంలో కాటేదాన్ కార్మికులకు ఎంతో మేలు జరిగిందని గుర్తుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాటేదాన్ కార్మికులందరికీ మరింత న్యాయం జరిగేవిధంగా కృషిచేస్తానన్నారు.

బాబుకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే


రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలన్నా, పరిపాలన గాడిలో పడాలన్నా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా ఆయన ఆరాంఘర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందన్నారు. 9ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పేరు ప్రఖ్యాతలు ప్రపంచ దేశాలకు తెలిస్తే కాంగ్రెస్ 9ఏళ్ళ పాలనలో అవినీతి, అక్రమాలతో నిండిపోయిందన్నారు. తెలుగుదేశం ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు చెబుతున్న మాటలు నమ్మవద్దన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని గుర్తుచేశారు.

రాజేంద్రనగర్ తెలుగుదేశానిదే: ప్రేమ్‌దాస్


నిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ వారి కష్టసుఖాల్లో చంద్రబాబునాయుడు ఏ విధంగా పాలుపంచుకుంటున్నారో అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారని, తిరిగి రాజేంద్రనగర్‌లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని,మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ అన్నారు. చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు స్వచ్చంధంగా ప్రజలు తరలివచ్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందమూరి బాలకృష్ణ, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్‌తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హైదర్‌గూడలో చంద్రబాబునాయుడుకు బ్రహ్మరథం


ఆరాంఘర్ చౌరస్తానుంచి ఓపెన్ టాప్ జీపులో హైదర్‌గూడకు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.రామేశ్వర్‌రావు నాయకత్వంలో ఘన స్వాగతం పలికారు. అత్తాపూర్ వద్ద ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌తోపాటు కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, నాయకుడు సామ భూపాల్‌రెడ్డి తదితరులు చంద్రబాఋకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

టీడీపీకి పట్టం కట్టడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు..

పహాడిషరీఫ్: 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రను ముగించుకొని నగరానికి వస్తున్న చంద్రబాబుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద స్వాగతం పలికేందుకు టీడీపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తీగల కృష్ణారెడ్డి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఈరంకి శంకర్‌గౌడ్, సరూర్‌నగర్ మండల బీసీసెల్ అధ్యక్షుడు దూడల సుధాకర్‌గౌడ్‌ల నేతృత్వంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు. వస్తున్నా... మీకోసం యాత్రను 2012 అక్టోబర్ 2న ప్రారంభించి నేటితో ముగించుకొని నగరానికి తిరిగి వస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి జల్‌పల్లి పరిసర గ్రామాల నుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో శం
షాబాద్ విమానాశ్రయంకు బయలుదేరామన్నారు. కాంగ్రెస్ నాయకులు భూకబ్జాలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని, దీంతో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

పాతబస్తీ నుంచి టీడీపీీ ర్యాలీ..

చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రక్షాపురం నుంచి టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి నాగు నగేశ్ ఆధ్వర్యంలో పాతబస్తీ నుంచి 100 ద్విచక్ర వాహనాలలో బయలుదేరారు.

రాష్ట్ర పక్షాళనలో ప్రజల సహకారం కావాలి