April 25, 2013

'బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సీమాం«ద్రులు కూడా మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని మేమంతా కోరుకొంటున్నాం. మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ డిమాండ్‌ను అధికారికంగా ప్రకటించారు. పార్టీని బతికించుకోవడానికి టీఆర్ఎస్ ఈ అంశంపై హడావుడి చేస్తోంది. గాలిలో కత్తి తిప్పుతోంది' అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీమాంధ్ర నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వ్యాఖ్యానించారు. "బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతి తెలుగువాడు కోరుకొంటున్నారు.

ఫ్యాక్టరీ వద్దని ఎవరైనా అంటున్నారా? విశాఖ ఉక్కుకు లంకెపెట్టి మాట్లాడటమేంటి? ఇంకా అందులో వివాదం ఏముంది? కేసీఆర్ ఎంపీ. అభివృద్ధి కావాలంటే ఆయన పార్లమెంటులో మాట్లాడాలి. ఇతర పార్టీలను కలుపుకోవాలి. బయ్యారం కోసం విశాఖను ద్వేషించాల్సిన అవసరం లేదు' అన్నారు. ఓబుళాపురం గనుల్లో ఇనుప ఖనిజం తవ్వుకోవడానికి బ్రహ్మణిస్టీల్స్‌ను తెర ముందు చూపించిన విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసునని, దానిని రద్దు చేయడానికి కిరణ్ సర్కారు ఇంత కాలం తీసుకోవడం విచిత్రమని అన్నారు.

బయ్యారం ఫ్యాక్టరీకి మేమూ ఓకే: టీడీపీ

జగన్ ఆస్తులను జప్తు చేయాలి
అలా చేస్తే భవిష్యత్తులో ఎవరూ మోసాలు చేయరు
ఇన్‌చార్జులంతా అభ్యర్థులు కారు

విశాఖపట్నం

తనను విమర్శిస్తున్న షర్మిల, బొత్స వంటి నేతలెవ్వరికీ క్యారెక్టర్లు లేవని, అలాంటివారు చేసే విమర్శలు, ఆరోపణలను పట్టించుకోనక్కర్లేదని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఇన్‌చార్జులకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేవారమని, కానీ ఈసారి ముందే ప్రకటిస్తామని చెప్పారు. గెలవలేనివారికి టిక్కెట్లిచ్చి ప్రతిపక్షంలో కూర్చోవడానికి పార్టీ సిద్ధంగా లేదన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులకే టిక్కెట్లు ఇస్తానని తానెక్కడా అనలేదని, గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినచోట్ల పార్టీ పటిష్ఠం కావడానికే ఇన్‌చార్జులను నియమించామని చెప్పారు.

వారిలో కొందరు బస్సులో సీటు కోసం తువ్వాలు వేసిన చందంగా టిక్కెట్టు తమకే అన్నట్టు ధీమాగా ఉంటున్నారని, వాళ్లు పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, కార్యకర్తల కష్టాల్లో పాలుపంచుకున్న వారే నిజమైన ఇన్‌చార్జులని, కష్టపడి పనిచేసేవారికే టిక్కెట్లిస్తానని స్పష్టం చేశారు. "రాష్ట్రంలో చట్టాలను అమలుచేయాల్సిన హోంమంత్రి సబితారెడ్డి ఓ నేరస్థురాలు.

ఓబుళాపురం గనుల కేసులో ఆమె ఏ-4 నిందితురాలు. ఇలాంటి వారు మంత్రులైతే ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. 'సిమ్స్' సంస్థ వల్ల మోసపోయిన కొందరు చంద్రబాబు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వల్ల తమకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ఈ ప్రభుత్వం గుడ్డి దున్నపోతుతో సమానమని, కాంగ్రెస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగదని అన్నారు. సిమ్స్ బాధితులకు న్యాయం జరిగేవరకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు.
: తండ్రి అధికారం చేపట్టిన తర్వాత లక్ష కోట్ల ప్రజాసంపదను జగన్ దోచుకున్నాడని, గత తొమ్మిదేళ్లలో అతను సంపాదించిన ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. అలా చేస్తే భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి అక్రమాలకు, మోసాలకు పాల్పడరని చెప్పారు. విశాఖ జిల్లాలో 'వస్తున్నా మీకోసం' యాత్ర నిర్వహిస్తున్న ఆయన గురువారం పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో బసచేసిన ప్రాంతం (సున్నపుబట్టీలు) వద్ద గురువారం సాయంత్రం ఎలమంచిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

క్యారెక్టర్ లేనివాళ్ల ఆరోపణలు పట్టించుకోకండి కార్యకర్తలకు చంద్రబాబు సూచన

ఆడపిల్ల పుట్టగానే 25 వేల డిపాజిట్
పెళ్లి నాటికి రూ.2 లక్షలు అందిస్తాం
మహిళలకు లక్షలోపు వడ్డీలేని రుణాలు
విద్యార్థినులందరికీ ఉచితంగా సైకిళ్లు
పని ప్రదేశాల్లో వేధింపులకు అడ్డుకట్ట
చంద్రబాబు మహిళా డిక్లరేషన్డ్వాక్రా రుణభారం తగ్గించే చర్యలు తీసుకుంటామని, మహిళలకు లక్ష లోపు వడ్డీలేని రుణాలు ఇస్తామని, ఏడాదికి పది సిలిండర్లు సబ్సిడీపై అందిస్తామని, బెల్టుషాపులు రద్దుచేస్తామని, విద్యార్థినులందరికీ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆడపిల్లలకు సమాన విద్యావకాశాలు, చట్టసభ ల్లో మహిళా రిజర్వేషన్లు అమలుచేస్తామన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు అడ్డుకట్టపడేలా చర్యలు తీసుకుంటామని, అత్యాచారాల నిరోధానికి, ఈవ్‌టీజింగ్ నివారణకు ప్రత్యేకదళం ఏర్పాటుచేస్తామని, భ్రూణహత్యల నివారణకు కఠిన చట్టాలు చేస్తామని, బాలికా శిశు సంరక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహిళల ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తామని, గ్రామీణ మహిళల ఆర్థికాభ్యున్నతికి డ్వాక్రా అమలును పటిష్ఠం చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి బాటలు వేస్తామని, ఎదిగిన ఆడపిల్లలకు కుట్టు, వస్త్ర పరిశ్రమల్లో శిక్షణ ఇప్పిస్తామని, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోనూ వారిని ప్రోత్సహిస్తామని వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంతో మంచినీటి సమస్యను తీరుస్తామన్నారు.చక్రం తిప్పేది మనమే కేంద్రంలో, రాష్ట్రంలో ఈసారి చక్రం తిప్పేది టీడీపీయేనని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ చెప్పినవారే ప్రధాని అవుతారని, తమపార్టీ ఎవరికి మద్దతిస్తే వారే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు. జైలుకు పోయే పార్టీ మనకు వద్దన్నారు.

తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అవినీతి ఊబిలో కూరుకుపోయాయన్నారు. మరో పార్టీ టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో గల్లంతవుతుందన్నారు. ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యమని, పనికిమాలిన ప్రభుత్వమని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాంకీ, ఫార్మాసిటీ, బ్రాండిక్స్ వంటి సంస్థల్లో లక్షలాదిమందికి ఉపాధి కల్పించాల్సి ఉండగా, కనీసం వేలల్లో కూడా కల్పించలేదన్నారు. లక్ష కోట్లు మింగినందుకు రాష్ట్రంలో వైఎస్ విగ్రహాలు లక్ష ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. తప్పుడు కంపెనీలతో లక్ష కోట్లు సేకరించి కొడుకును జైలుకు పంపిన ఘనత కూడా వైఎస్‌దేనన్నారు.

ప్రజలు దగా పడ్డారని, అవినీతి ప్రభుత్వం నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టే తాను 'మీ కోసం' పాదయాత్ర చేస్తున్నానన్నారు. ఒక కుటుంబం తప్పులకు రాష్ట్రం పరువు పోయిందన్నారు. పిల్ల కాంగ్రెస్‌లో చేరడానికి కొందరు చం చల్‌గూడ జైలుకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి వస్తున్నారని, అలాంటి నేతలకు బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ ఎప్పుడూ గాలి జనార్దన్‌రెడ్డిని తన పెద్ద కుమారుడిగా, జగన్‌ను రెండో కుమారుడిగా చెప్పుకొనేవారని, ప్రస్తుతం ఇద్దరూ జైలు ఊచలు లెక్కబెడుతున్నారన్నారు. సింహాచలం అప్పన్నస్వామికి బంగారు ఊయల లేకపోయినా.. గాలి జనార్దన్‌రెడ్డి ఒళ్లు, ఇళ్లు అన్నీ బంగారంతో నిండిపోయాయన్నారు.

వైఎస్, గాలి ఎంత సంపాదించినా తినలేని పరిస్థితి ఉందన్నారు. ఫోక్స్‌వేగన్ కుంభకోణంలో ప్రజల సొమ్ము మింగిన ఆ కంపెనీ ప్రతినిధి షూష్టర్ ప్రస్తుతం జైల్లో ఉండగా అందులో ప్రధాన పాత్రధారి, లిక్కర్ డాన్ బొత్స సత్యనారాయణ కు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ముద్దాయిగా సీబీఐ పేర్కొన్నా హోంమంత్రి ఇంకా పోలీసులకు ఆదేశాలు జారీచేయడం సిగ్గుచేటన్నారు.

చంద్రబాబు గురువారంతో 2800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. విశాఖజిల్లా సబ్బవరం మండలం అమృతపురంలో అడుగుపెట్టడంతో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భం గా పెందుర్తి పార్టీ ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తి నేతృత్వంలో నేతలు స్వాగతం పలికారు. 'చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు' అంటూ కాంతినిచ్చే బాణాసంచా కాల్చారు.
విశాఖపట్నం : పాదయాత్ర పరిసమాప్తికి రెండు రోజులముందు టీడీపీ అధినేత చంద్రబాబు అతివల ను ఆకట్టుకునేందుకు యత్నించారు. మహిళలే మహాలక్ష్ములంటూ మహిళా డిక్లరేషన్ ప్రకటించారు. విశాఖ జిల్లా సబ్బవరంలో గురువారం రాత్రి భారీ సభలో ఆయన మహిళలకు ఉద్దేశించిన పలు పథకాలను వివరించారు. పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు డిపాజిట్ చేసి, 'మహాలక్ష్మి' పథకంతో పెళ్లీడు వచ్చేసరికి రూ.2లక్షలు అందిస్తామని ప్రకటించారు.

మహిళే మహాలక్ష్మి...........భ్రూణ హత్యల నివారణకు కఠిన చట్టాలు

ఆదిలాబాద్ అర్బన్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని విమర్శించే స్థా యి కేసీఆర్‌కు లేదని జిల్లా ఎంపీ రా థోడ్ రమేష్ అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. కేసీఆర్ చంద్రబాబునాయుడిని పదే పదే విమర్శించడం మానుకోవాలన్నారు. చంద్రబాబు నా యుడు అక్టోబర్ 2న చేపట్టిన పాదయాత్ర ఏడు నెలలు కావస్తోందని, వ స్తున్నా మీకోసంలో రాష్ట్ర ప్రజల సమస్యలను, స్థితిగతులను తెలుసుకోవడానికి చేపట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజలు పడుతున్న కష్టాల ను స్వయంగా తెలుసుకొని ప్రభుత్వ వి ధి విధానాలను ఎండగట్టడానికి తమ అధినేత పాదయాత్ర చేపట్టినట్లు పే ర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబునాయుడు ఏడు నెలలు పాదయాత్ర పూర్తి చేశారని అ న్నారు. ఈనెల 27న చంద్రబాబు నా యుడి పర్యటన ముగింపు సందర్భం గా వైజాగ్‌లో జరిగే కార్యక్రమానికి జి ల్లాలోని పది నియోజక వర్గాల నుంచి ఐదు వేల మందిని జన సమీకరణ చేసి తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ప్రజలను, కార్యకర్తలను తరలించడాని కి ఈనెల 26న ప్రత్యేక రైలులో మధ్యా హ్నం 12 గంటలకు తీసుకవెళ్తున్నట్లు తెలిపారు. ఈ శుభ పరిణామాన్ని పురస్కరించుకొని జిల్లా నుంచి పెద్ద సం ఖ్యలో తరలిస్తున్నామన్నారు.

టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావుకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదని, కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్నారు. తె లంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జిల్లా నుంచి తనతో పాటు ఇతర ఎంపీలం క లిసి తెలంగాణ వాదాన్ని పార్లమెంటు లో వినిపించినప్పటికీ కేసీఆర్ మాత్రం పెదవి విప్పకపోవడం సిగ్గుచేటన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం తెలంగా ణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారన్నారు.

బయ్యారం గనులపై గతంలో టీడీపీ ఎత్తి చూపిందని, న్యాయస్థానం తీర్పు ఇచ్చిన అ నంతరం కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో టీడీపీకి ఆదరణ పె రుగుతోందని, ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ నిలిచే ఉందన్నారు. ప్ర త్యేక తెలంగాణ కోసం టీడీపీ కట్టుబడి ఉందని గుర్తు చేశారు. అవినీతి పరులకు టీడీపీ పార్టీ తగిన సమయంలో బుద్ధి చెబుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా నిర్లక్ష్యధోరణి అవలంభిస్తుందని, రాష్ట్రంలో సమస్యలతో రాజ్యమేలుతుందన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు గేడం నగేష్ మాట్లాడుతూ కాం గ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమ పదవుల ను కాపాడుకోవడానికే నాయకులు పరిమితమయ్యారన్నారు. రైతాంగ సమస్యలను పూర్తిగా విస్మరించడంతో రైతు లు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. రా ష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ఉందని విమర్శించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రె స్ ప్రభుత్వం రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చేస్తామని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చెబుతున్నప్పటికీ గిరిజ న ప్రాంతాలను విస్మరించి కంటి తు డుపు చర్యగా చేస్తామని చెప్పడం సరికాదన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ఎస్సీ, ఎస్టీ ఉపకులాల్లో ఉన్న వారందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నియోజక వర్గ ఇన్‌చార్జి పాయల శం కర్, నాయకులు యునూస్ అక్బాని, బుచ్చి లింగం, జాదవ్ బలరాం నా యక్, ముథోల్ నియోజక వర్గ ఇన్‌చా ర్జి నగర్ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే పాటి సుభద్ర ఉన్నారు.

టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ టీడీపీ నాయకులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో నిర్వహిం చే ముగింపు కార్యక్రమానికి కార్యకర్త ల తరలింపు, సౌకర్యాలు, ఏర్పాట్లు ఎ లా ఉన్నాయని అడిగి తెలుసుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాథోడ్ రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షులు గెడం నగేష్, పార్టీ నాయకులు ఉన్నారు.

బాబు'ను విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదు

అనంతపురం అర్బన్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి జిల్లానుండి తరలివెళ్లడానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు పార్టీ జిల్లానేతలు తెలిపారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.

వస్తున్నా మీకోం పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీన విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారన్నారు. జిల్లానుంచి కూడా తరలివెళ్లడానికి పార్టీతరపున ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామన్నారు. 26న మధ్యా హ్నం 3 గంటలకు ధర్మవరం రైల్వేస్టేషన్‌లో బయల్దేరుతుందన్నారు. అనంతపురం, గుత్తి, గుంతకల్ మీదుగా వైజాగ్‌కు వెళ్తుందన్నారు. 27న ఉదయం 10 గంటలకు వైజాగ్‌కు చేరుకుంటుందన్నారు. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత అదేరోజు రాత్రి 11 గంటలకు అదేరైలు తిరిగి అనంతకు బయల్దేరుతుందన్నారు. 28న సాయంత్రం జిల్లాకు చేరుకుంటుందన్నారు. జిల్లానుంచి వేళ్లేవారికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైలులో వెళ్లేటపుడు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. అయితే యాత్రకు తరలివచ్చే ప్రతినాయకుడు, కార్యకర్త, అభిమాని విధిగా పచ్చ చొక్కాతో రావాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. జిల్లానుంచి దాదాపు 5వేల మందిదాకా వెళ్తున్నామన్నారు. ఏ నాయకుడూ చేయని సాహసం చేసి చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. జిల్లానుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి, విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో తెలుగుదేశం నేతలు, అనంతపురం ఇన్‌చార్జ్ మహలక్ష్మి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు నెట్టెం వెంకటేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

'వస్తున్నా మీకోసం'కు ప్రత్యేక రైలు

ఐ.పోలవరం : విశాఖపట్నంలో ఈ నెల 27న టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాట్ల బుచ్చిబాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి 20 బస్సులు, 30 కార్లు సిద్ధం చేశామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఐ.పోలవరం మండలం పాత ఇంజరంలో మాజీ ఎమ్మెల్యే చెల్లివివేకానంద స్వగృహం వద్ద బుధవారం నియోజకవర్గ పార్టీ సమావేశం జరిగింది.

అన్నదాతను పట్టించుకోరే వరదలు, భారీ వర్షాలతో పంటలు ముంపునకు గురై నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. నీలం తుపానుతో నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం నేటికీ రైతులకు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరిచేలు మునిగిపోయి రైతు లు అవస్థలు పడుతున్న సమయంలో రైతు చైతన్యయాత్రలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.

సమావేశంలో గొలకోటి దొరబాబు, గాదిరాజు రామకృష్ణంరాజు, నడింపల్లి సుబ్బరాజు, టేకుమూడి లక్ష్మణరావు, కాశి పరివాజ్‌కుమార్, జనిపెల్ల సోమన్న, దాట్ల పృధ్వీ, దాట్ల వర్మ, బొంతు శ్రీరాములు, ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, చింతా కృష్ణారావు, మాగాపు వీరబాబు, భూపతిరాజు సత్తిబాబురాజు, సుంకర కొండలరావు, జి.సాగర్, ఈతకోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

బాబు సభకు తరలిరండి

తిప్పర్తి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయం అయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర బుధవారం మండలంలోని ఇండ్లూరు, పజ్జూరు, ఎర్రగడ్లగూడెం, వెంకటాద్రిపాలెం, ఖాజీరామారం గ్రామాల్లో సైకిల్‌యాత్ర సాగింది.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలను రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలని శ్రీనివాస్‌గౌడ్ పిలపునిచ్చారు. విద్యుత్‌ఛార్జీల పెంపు, విద్యుత్‌కోతలను నియంత్రించలేక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్న, ఎస్సీలందరూ బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని కోరుతున్న బీసీలు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. పాలన దక్షత చంద్రబాబుకే సొంతమన్నారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, ఎల్‌వీ యాదవ్, గుంటూరి వెంకన్న, గుర్రం వెంకట్‌రెడ్డి, రాంబాబు, లక్ష్మయ్య, జానయ్య, మల్లయ్య, నర్సింహ, సైదులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయం

నల్లగొండ రూరల్: అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఐదు రోజులుగా నల్లగొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న టీడీపీ సైకిల్ యాత్ర బుధవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా గడియారం సెంటర్‌లో జరిగిన సభలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ నేరగాళ్ల మయమైందని, ఆ ముఠాకు నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలారన్నారు. పాలకులు కోర్టులు, జైళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, ఎప్పుడు ఎవరు జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని వణుకుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.

విద్యుత్, పెట్రో ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి పోవాలంటే ప్రజల్లో ప్రశ్నించే చైతన్యం రావాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోతలు, లో ఓల్టేజీలతో పంటలు ఎండిపోయిన పరిస్థితి దాపురించిందని, తాగునీటి కోసం జాగారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిమారాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా స్థానిక భాస్కర్ థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన సైకిల్ యాత్ర బృందానికి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, ఎమ్మెల్యే చందర్‌రావు, బొర్రా సుధాకర్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆవుల రాములు, తుమ్మల మధుసూదన్‌రెడ్డి, ఎల్‌వీ యాదవ్, బోదనం వెంకట్‌రెడ్డి, కొత్తపల్లి శ్రీను, తోట శ్రీనివాసాచారి, కూరెళ్ల విజయ్‌కుమార్, ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం


నల్లగొండ : చంద్రబాబునాయుడు సీఎం కావడం ఖాయమని తెలుగుదేశంపార్టీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి ఉచితంగా 9 గంటల విద్యుత్ ఇవ్వటమే కాకుండా రుణాలన్నింటినీ రద్దు చేయటానికి కృషిచేస్తామని ఆయన అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని, రాష్ట్రం ఛిన్నాభిన్నమైందన్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబునాయుడు 64 సంవత్సరాల వయసులో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేశాడన్నారు. ఈ నెల 28న పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్‌కు వస్తున్న చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం పలి కేం దుకు పెద్దఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని కోరారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ అమ్ముకుంటున్నాడని, కోట్ల కొద్ది ధనా న్ని దోచుకుని జగన్ జైలులో ఉన్నాడని, వీరిద్దరినీ రాష్ట్రంలో ముందుకు సాగనిచ్చే ప్రసక్తి లేదన్నారు.

తెలంగాణా ద్రోహి అయిన కేసీఆర్ ఏనాడూ కూడా పార్లమెంటులో మాట్లాడలేదన్నారు. సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ల ఎదుట మాట్లాడని కేసీఆర్ తెలంగాణను తీ

సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే చందర్‌రావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు వంగాల స్వామిగౌడ్, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు తేర చిన్నపరెడ్డి, పాల్వాయి రజనీకుమారి, పటేల్ రమేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహ క కార్యదర్శి బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శులు నెల్లూరి దుర్గాప్రసాద్, బోయపల్లి కృష్ణారెడ్డి, జక్కల అయిలయ్యయాదవ్, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చావా కిరణ్మయి, కంచర్ల భూపాల్‌రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, రియాజ్అలీ, బొర్రా సుధాకర్, గార్లపాటి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
సుకువస్తాడంటే నమ్మే ప్రసక్తిలో ఎవరూ లేరన్నారు. కేసీఆర్ తో తెలంగాణా రాష్ట్రం ఏర్పడద ని స్పష్టంచేశారు. సమావేశంలో పాద యాత్ర ముగించుకొని హైదరాబాద్ కు వస్తున్న చంద్రబాబుక ఘనస్వాగ తం పలికేందుకు ప్రజలు, పార్టీ అభిమానులను పెద్దఎత్తున తరలించేందు కు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం:మోత్కుపల్లి

నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసేలా సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేతలు కృషి చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచే పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని సూచించారు.

ప్రతీ మండల కేంద్రాలలోనూ మే నెల 31వ తేదీ లోపు పార్టీ కార్యాలయాలకు ఏర్పాటు చేయాలని తెలియచేశారు. ప్రతీ నెల 6వ తేదీన ఆయా కార్యాలయాలలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పటిష్ఠతపై చర్చించాలని తెలిపారు. విద్యుత్ విధానాలపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంతకాల సేకరణకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి చేర్చాలన్నారు. చంద్రబాబుపాదయాత్ర ముగింపు సందర్భంగా వైజాగ్‌లో నిర్వహించే భారీ సదస్సుకు జిల్లా నుంచి రెండు ప్రత్యేక రైళ్లు వేశామని, వీటితో పాటు కార్లు, బస్సుల్లోనూ కార్యకర్తలు వచ్చేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను టీడీపీ వ్యతిరేకిస్తుందన్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంరెడ్డి గోవర్దన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చేవూరి విజయమోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మండలస్థాయి అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

అభ్యర్థుల గెలుపే లక్ష్యం

దర్శి: దర్శి నియోజకవర్గ ప్రజలు తనకు ఒక్కసారి అవకాశమిస్తే అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తాన ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ద ర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. దర్శి పట్ట ణంలోని పొట్టిశ్రీరాములు వీధి, ఎస్సీ కాలనీలో బుధవారం మాజీ ఎమ్మె ల్యే నారపుశెట్టి పాపారావుతో కలిసి ఇంటింటికి టీడీపీ యాత్ర నిర్వహిం చారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవ రావు మాట్లాడుతూ అట్టడుగువర్గా ల అభివృద్ధికి తెలుగుదేశంపార్టీ మా త్రమే కట్టుబడి ఉందని చెప్పారు.

చం ద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వ యంగా తెలుసుకునేందుకే సుదీర్ఘ పా దయాత్ర చేస్తున్నారని చెప్పారు. సమ ర్ధవంతమైన పాలనతో రాష్ట్రాన్ని గాడి లో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజ లు టీడీపీని ఆదరించి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్య క్రమంలో టీడీపీ దర్శి, ముండ్లమూరు మండలాల అధ్యక్షులు బల్లగిర శీన య్య, దిరిశాల రామా రావు, దర్శి ప ట్టణ అధ్యక్షుడు యాద గిరవాసు, స్థా నిక నాయకులు సూరె సుబ్బారావు, బొట్ల కోటేశ్వరరావు, మునగా శ్రీని వాసరావు, శోభారాణి, పి.వెంకటేశ్వ రరెడ్డి, నారపుశెట్టి పిచ్చయ్య, జీసీ.గుర ువయ్య, రాచపూడి మోషే, గర్నెపూడి జోసఫ్, తదితరులు పాల్గొన్నారు.

అవకాశం ఇవ్వండి- అభివృద్ధి చూపిస్తా!

పాతపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాణాలు పణంగా పెట్టి పాదయాత్ర నిర్వహిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర పరిశీలకుడు, మచిలీపట్నం ఎంపీ కె.నారాయణరావు తెలిపారు. పాతపట్నంలోని జిల్లా పరిషత్ విశ్రాంత భవన ప్రాంగణంలో బుధవారం జరిగిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల అభీ ష్ట్టం మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రబాబు పాదయా త్ర ముగిసిన అనంతరం నియమించనున్నట్లు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీను ప్రజలు విశ్వసించే స్థితిలో ప్రజలు లేరన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రా మ్మోహన్‌నాయుడు,పాతపట్నం నియోజకవర్గంలోని మం డలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ప్రాణాలు పణంగా పెట్టి పాదయాత్ర

విశాఖపట్నం: జిల్లాలో అధికసంఖ్యలో వున్న కాపులు ఇతర వెనుకబడిన కులాల వారి దృష్టిని ఆకర్షించేందుకు చంద్రబాబు తన పాదయాత్రలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వస్తున్నా... మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు అనకాపల్లి మండలంలోని శంకరం నుంచి బుధవారం బయలుదేరి సబ్బవరం మండలంలోని అసకపల్లి సున్నంబట్టీల వద్దకు చేరే సరికి అర్ధరాత్రి దాటింది. జాతీయ, రాష్ట్ర, స్థానిక సమస్యలను తన ప్రసంగాల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తున్న చంద్రబాబునాయుడు విశాఖజిల్లాలో అధికసంఖ్యలో వున్న కాపులను ఆకట్టుకునేందుకు వారి సంక్షేమం కోసం తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.

గత ఎన్నికల్లో కాపులు పార్టీకి దూరమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికి పలు పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈసారి అధికారంలోకి వస్తే కాపులకు అన్నింటా పెద్దపీట వేస్తామనే అభిప్రాయాన్ని కలిగించారు. ఇది మంచి ఫలితాలను ఇస్తుందని ఆపార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేయడం విశేషం. అనకాపల్లి నియోజకవర్గంలో బుధవారం చంద్రబాబు తన పాదయాత్రను పూర్తిచేశారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రవేశించిన ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది.

చల్లని వర్షపు వాతావరణం ఆహ్లాదకరంగా మారి చంద్రబాబు సభలకు అనుకూలంగా త
యారైంది. అనకాపల్లి ఎంపీకి అయారం... గయారంలా తయారయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు ప్రజల నుంచి పెద్ద హర్షధ్వానాలు వెలువడ్డాయి. కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించినప్పుడు ప్రజల అనుకూల స్పందన వస్తుండడంతో చంద్రబాబు ప్రసన్నంగా వున్నారు. విశాఖజిల్లాతో, ఇక్కడ నాయకులతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు పదే పదే గుర్తు చేసుకోవడం ఈ ప్రాంత వాసులను మెచ్చుకొనడం స్థానికులకు ఆనందాన్నిచ్చింది. చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంతో ఆపార్టీనాయకులు దాడి రత్నాకర్, బండారు సత్యనారాయణమూర్తిలు ఆనందం వ్యక్తం చేశారు.

కాపులను ఆకట్టుకున్న చంద్రబాబు

అనకాపల్లి

అప్పటివరకూ మీ పనులు, వ్యాపకాలను మీ కుటుంబంలో మరొకరికి అప్పజెప్పండంటూ కర్తవ్యబోధ చేశారు. కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు మరికొందరు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు అయినా నీతి నిజాయితీలతో బతికారని అదే తెలుగుదేశంపార్టీ క్రమశిక్షణ అని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నాయకులు ధృడసంకల్పంతో ఉండాలి తెలుగుదేశంపార్టీ కార్యకర్తల్లో ఎటువంటి తప్పిదం లేదని నాయకులే ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నాయకుడైన వాడు ధృడసంకల్పంతో కార్యకర్తలను క్రమశిక్షణతో నడపాల్సి వుందన్నారు. స్వాతంత్రం వచ్చాక అనేకపార్టీలు పుట్టుకొచ్చి తెరమరుగయ్యాయన్నారు. తెలుగుదేశంపార్టీ మా త్రం 17 సంవత్సరాలు పాలన చేసి, తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో వున్నప్పటికీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నదన్నారు.

జిల్లాలో పటిష్టమైన కుటుంబ వ్యవస్థ విశాఖ జిల్లాలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉందన్నారు.

ఇక్కడి వారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా రెండు, మూడురోజుల్లో సర్దుకొని యథావిధిగా కలిసిపోతారన్నారు. అమెరికా వంటి దేశాల్లో వివాహ వ్యవస్థకు విలువలేదని చెప్పారు. దాడి వీరభద్రరావు కుటుంబంలో 25 మంది ఒకే ఇంట్లో ఉండడం అభినందనీయమన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా ఒకే కుటుంబంగా ఏకతాటిపై నడుచుకోవాలని పిలుపునిచ్చారు.

బెల్టుషాపులతో ఇబ్బందులు మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ముఖ్యంగా బెల్టుషాపుల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని బెల్టుషాపులను తొలగిస్తేనే కుటుంబంలో ఇబ్బందులు తొలగిపోతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

పాదయాత్రకు స్పందన బాగుంది అనకాపల్లి నియోజకవర్గంలో వస్తున్నా మీకోసం పాదయాత్రకు స్పందన బాగుందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నాకర్ ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించగలిగానని చంద్రబాబు అన్నారు. 19వతేదీన అనకాపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమై 24వతేదీ వరకూ నిర్విఘ్నంగా కొనసాగిందని అందుకు రత్నాకర్ నాయకత్వ పటిమను కొనియాడారు.

కార్యకర్తలతో మాటామంతి కార్యకర్తలతో కూలంకషంగా మాట్లాడడం వల్ల పార్టీలో వున్న లోటుపాట్లు, సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. కార్యకర్తల మాటలనుబట్టీ అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చునని పేర్కొన్నారు. అనంతరం పలువురు కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడి వారి నుంచి సమాచారాన్ని సేకరించారు.
: ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉందని, అప్పటివరకూ నాయకులు, కార్యకర్తలకు సెలవు లేదని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం బుధవారం శంకరం వద్ద మీ కోసం పాదయాత్ర క్యాంప్ వద్ద జరిగింది. టీడీపీ రూరల్ అధ్యక్షుడు రత్నాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏడాది వరకూ ప్రతి నాయకుడు, కార్యకర్త 24 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

గెలుపే ముఖ్యం

 విశాఖపట్నం : పార్టీ వేరు...రాజకీయం వేరు...కుటుంబం వేరు...అన్న పద్ధతికి స్వస్తి పలికేందుకు చంద్రబాబు కొత్తప్రయోగం చేస్తున్నారు. ఏడు నెలలుగా ఆయన కుటుంబానికి, ఇంటికి దూరంగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు క్యాంపు వద్దకు వచ్చే కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. ఇదే రకమైన బాంధవ్యాలు, మమకారాన్ని కార్యకర్తలు, నాయకులు కూడా కొనసాగించాలని ఆయన కోరుకుంటున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌పై ఆయన తరచూ మాట్లాడుతుండడమే ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా కార్యకర్తల సమావేశాల్లో పార్టీని వేరుగా చూడకుండా మనమంతా ఒక కుటుంబం అంటూ పదే పదే ఉద్బోధిస్తున్నారు. అందుకు తగినట్లుగానే కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

తెలుగుదేశంపార్టీలో పని చేసే అధినాయకుడి నుంచి కార్యకర్త వరకూ ఒకే కుటుంబం అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. పార్టీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరూ వెన్నెంటే ఉండాలని చెబుతున్న చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి చోటా అక్కడి ముఖ్యనాయకుల కుటుంబాలను ప్రత్యేకంగా కలుసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఇన్‌చార్జి, ఇతర ముఖ్య నాయకుల కుటుంబాలను క్యాంపువద్దకు పిలుపించుకొని వారితో కొద్దిసేపు ముచ్చటిస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటు

వారితోకలిసి ఫొటోలు దిగుతున్నారు. జిల్లాలో తొలుత నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులను శృంగవరం క్యాంపులో కలుసుకున్నారు. వారితో అరగంటకుపైగా మాట్లాడి ఉల్లాసంగా కనిపించారు. అనకాపల్లి నియోజకవర్గం వచ్చేసరికి మంగళవారం కశింకోటలో దాడి వీరభద్రరావు కుటుంబసభ్యులతో కలిసి ముచ్చటించారు. ఇంకా పలువురు ముఖ్యనాయకుల కుటుంబసభ్యులను బాబు క్యాంపు వద్ద కలిశారు. సమావేశాల్లో కూడా చంద్రబాబు మాట్లాడుతూ కుటుంబాన్ని, పార్టీని వేరుగా చూడకూడదన్న అభిప్రాయాన్ని పదేపదే వెల్లడిస్తున్నారు. కుటుంబ బాంధవ్యాలు మనదగ్గరే ఎక్కువంటూ ఆయన చెప్పడం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

పలువురు తమ మనసులో భావాలను, బాధను అధినేతతో పంచుకుంటున్నారు. కొందరికైతే ఆయన కొద్దో గొప్పో నగదు రూపేనా సాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థపై కార్యకర్తలకు వివరణిస్తూ భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శమంటూ విశ్లేషించారు. అటువంటి సాంప్రదాయం తెలుగుదేశంపార్టీలో కొనసాగుతుందని చెప్పడం చంద్రబాబులో 'ఫ్యామిలీ సెంట్‌మెంట్ ' స్పష్టమవుతున్నది.
న్నారు. వారు ఏ ఏ వృత్తుల్లో వున్నారు...వారి చదువులు, ఉద్యోగాలు, అలవాట్లు...ఇంటి వద్ద ఏ విధంగా ఒకరికొకరు సాయపడతారు...అన్నది తెలుసుకొని వారిని అభినందిస్తున్నారు.

దేశం' వసుధైక కుటంబం

గరుగుబిల్లి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొనేందుకు టీడీపీ మండల ప్రతినిధులు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బుధవారం ఉపా ధి పనులు జరిగే ప్రాం తాల్లో వేతనదారుల సమస్యలను కురుపాం ఇన్‌చార్జి నిమ్మక జయరాజ్, పార్టీ మండలాధ్యక్షుడు ద్వారపురెడ్డి ధ నుంజయరావు, జిల్లా కార్యదర్శి ముదిలిబాబు విజయవాంకుశంతో పాటు పలువురు అడిగి తెలుసుకున్నారు.

ప్ర భుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ కల లు కార్యక్రమంలో అధికారులు సమస్యలపై అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారన్నారు. అమ్మహస్తం పథకం లో 9 వస్తువులను రూ. 185కే అందిస్తామని చెపుతున్న ప్రభుత్వం అరకొరగా అందిస్తుందన్నారు. 27న నిర్వహించనున్న చంద్రబాబు పాదయాత్ర ము గింపు సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు దాసరి రాధాకృష్ణ, అక్కేన మధు, పలువురు పాల్గొన్నారు.

టీడీపీ నాయకుల సుడిగాలి పర్యటన


ఏలూరు:తమ పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని ఆయనకు సంఘీభావంగా ఈ నెల 27వ తేదీన విశాఖలో జరగనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్ళేందుకు కార్యకర్తలు, నాయకులు ఏర్పాట్లలో ఉన్నారు. మండలాల వారీగా ఇప్పటికే ఎవరెవరు, ఏ సంఖ్యలో కార్యకర్తలను వెంట పెట్టుకుని విశాఖపట్టణం వెళుతున్నారో రాష్ట్ర పార్టీ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా, 64 ఏళ్ళ వయస్సులో తమ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించడం సహజంగానే పార్టీ కార్యకర్తలో కూడా పూర్తి ఉత్సాహాన్ని నింపింది. గడిచిన రెండేళ్ళుగా పార్టీలో ఉన్న స్తబ్దత స్థానంలో ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తున్నది. చడీచప్పుడు లేకుం డా ఉన్న నియోజకవర్గాల్లో కూడా మ ండల,గ్రామ స్థాయి నేతలే నేరుగా వి శాఖకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. తమతోపాటు కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలోనే తోడ్కొని వెళ్ళేందుకు సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాల్లో ఇక్కడి నుంచి బయలుదేరి వె ళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేందుకు వీ లు గా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా రు.పార్టీ అధినేత చంద్రబాబు అత్య ంత ధైర్యంగా వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి పార్టీకి ప్రాణం పోసిన నేప«థ్యంలో కార్యకర్తలు,నాయకులు జి ల్లా నుంచి లక్ష మంది తక్కువ కాకుం డా విశాఖకు రావాల్సిందిగా పార్టీ పెద్దలు పదేపదే కోరుతున్నారు. ఈ మే రకు ముఖ్యనేతలందరికి తగిన మార్గదర్శకాల జారీ చేశారు. విశాఖలో జరిగే భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి రికార్డు స్థాయిలో తరలివెళ్ళేలా పార్టీ జి ల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు,ఎమ్మెల్యేలు ప్రభాకర్, రామారావు,శివరామరాజు,శేషారా వు , ఇన్‌ఛార్జిలు ముత్తారెడ్డి, అంబికాకృ ష్ణ,డాక్టర్ బాబ్జి, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, రాధాకృష్ణారెడ్డి, వైటి రా జా,మొడియం శ్రీను, ముళ్ళపూడి బాపిరాజు,గన్ని వీరాంజనేయులు, గా దిరాజు బాబు, ఎమ్మెల్సీ అంగర రా మ్మోహనరావుతో సహా మిగతా నేతలంతా ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో విశాఖ బహిరంగ సభను విజయవంతంగా జరిగేలా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ స మావేశాలకు హాజరైన కార్యకర్తలు వి శాఖకు వెళ్ళేందుకు ఉత్సాహం చూ పడం స
హజంగా పార్టీలోనే కొత్త పం డగ వాతావరణం సృష్టించింది.చంద్రబాబుపాల్గొనే బహిరంగ సభకు 3 గంటలు ముందుగానే ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు చేరుకునేలా నియోజకవర్గ నేతలు నేరుగా పర్యవేక్షకులకు బాధ్యతలు అప్పగించారు.పరిస్థితిని బ ట్టి ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా కూడా తగినన్ని ఫోన్ నెం బర్లను సిద్ధం చేసుకున్నారు. చంద్రబా బు పాదయాత్ర ముగింపు అద్భుత ం గా సాగాలని సీతారామలక్ష్ష్మి, మా గం టి బాబులు ఇప్పటికే ఆకాక్షించా రు. పార్టీ సమావేశాల్లోనూ వీరు ఈ మే ర కు నాయకులకు స్పష్టమైన సంకేతా లు ఇచ్చారు.ఛలో..విశాఖ పేరిట జరుగుతున్న ఏర్పాట్లు కార్యకర్తల్లోను కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వచ్చే ఎన్నికలకు ఈ సభే నాందికాబోతుందని భా విస్తున్న ఆశావహులు కూడా విశాఖ తరలి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు.

సైకిల్ సవారీ

హైదరాబాద్

ఇప్పటికే కరెంటు చార్జీలు విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం మళ్లీ సర్‌చార్జ్‌ల పెంపుతో ప్రజలపై మోయలేని భారం పడుతుందని, ఈ బిల్లులను పేద ప్రజలు ఎలా కడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోత సమస్యలు, చార్జీల పెరుగుదల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు.
: ప్రభుత్వ విధానాల వల్లే ప్రజలపై మోయలేని భారం పడుతుందని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయడు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు కోతల సమస్యను అధిగమిస్తున్నామని చెబుతున్న కిరణ్ సర్కారు కరెంటు కొనుగోలులో అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ విధానాల వల్లే ప్రజలపై భారం: గాలి ముద్దుకృష్ణమ

విశాఖపట్నం

గురువారం విశాఖ జిల్లా సబ్బవరం సమీపంలో జరిగిన ఎలమంచిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్రంలో జరిగిన వనరుల దోపిడీ దేశంలో మరెక్కడ జరగలేదన్నారు. అక్రమాస్తుల కేసుల్లో జైలులో వున్న జగన్ అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులను జప్తు చేస్తే భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి అక్రమాలకు, మోసాలకు పాల్పడరని ఆయన అభిప్రాయపడ్డారు.
: పిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ 2004 తరువాత లక్ష కోట్ల రూపాయల ప్రజా సంపదను దోచుకున్నాడని, గత తొమ్మిదేళ్ల కాలంలో అతను సంపాదించిన ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

జగన్ ఆస్తులను జప్తు చేయాలి: చంద్రబాబు