April 23, 2013

విశాఖపట్నం/కశింకోట/ఎలమంచిలి
: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు సుమారు ఏడు నెలల నుంచి అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఆయనలో ఎటువంటి అలసట కనిపించడం లేదు. పైగా ఆయనో కొత్త ఉత్సాహం ఉరకలేస్తున్నది. కాళ్లు నొప్పులు పెడుతున్నండడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఆరోగ్యపరమైన ఇబ్బందులను సైతం లెక్కచేయడం లేదు. చంద్రబాబు పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన తరువాత చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఆయన వర్షంలో తడుస్తూనే పాదయాత్రను కొనసాగిస్తున్నారు. దీంతో గొంతు కొంచెం బొంగురుపోయింది.

అయినప్పటికీ ఆయన ప్రజా సమస్యలపైనా, కాంగ్రెస్ పాలకుల అవినీతిపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూనే వున్నారు. ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. పాదయాత్ర చేస్తున్న రహదారికి ఇరుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. మహిళలు హారతులు ఇచ్చి నుదుట తిలకం దిద్దుతున్నారు. చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తాళ్లపాలెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అంతకు గంటన్నర ముందు వర్షం పడడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

దీంతో వేలాది మంది ప్రజలు ఆయన వెంట నడుస్తూ ముందుకు సాగారు. ఉగ్గినపాలెం, పరవాడపాలెం, జమాదులపాలెం, బయ్యవరం మీదుగా రాత్రి 11.30 గంటలకు కశింకోట ఆర్ఈసీఎస్‌కు చేరుకుని రాత్రి బసచేశారు. అంతకు ఉగ్గినపాలెం జంక్షన్ వద్ద ఆయన ప్రసంగించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో ఆయన ఇక్కడ అర్ధగంటకుపైగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైసీపీ అవినీతి దోపిడీని ఎండగడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తరచూ దగ్గు వస్తున్నప్పటికీ ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. 'వర్షంలో తడవడం వల్ల గొంతు బొంగురు పోయింది. అయినా నా గొంతుకు ఏమీ కాదులే'' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.

తాళ్లపాలెం నుంచి ఉగ్గినపాలెం జంక్షన్ వరకు పాదయాత్ర చేయడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. ఎటువంటి అలసట లేకుండా చురుగ్గా అడుగులో అడుగేసుకుంటూ ముందుకు సాగారు. దారిలో తనను కలవడానికి వేచి వున్న చేతివృత్తి కార్మికులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సాధకబాధలను తెలుసుకున్నారు. పసిపిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. ఉగ్గినపాలెం వద్ద బాబు ట్రాక్టర్ నడిపారు. కొద్దిసేపు ఒక ఆటోలో కూర్చొని ్రడైవింగ్ చేస్తూ అభివాదం చేశారు. జాతీయ రహదారిపై ఆగివున్న లారీలోకి ఉత్సాహంగా ఎక్కి, కొద్దిసేపు ్రడైవర్ సీటులో కూర్చుని స్టీరింగ్ పట్టుకున్నారు.

ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌తోపాటు టీఆర్ఎస్‌పైనా విమర్శలు గుప్పించారు. అదే విధంగా స్థానిక సమస్యలను ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో తన హయాంలో జరిగిన అభివృద్ధితో ప్రస్తుత అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వారి మాయ మాటలను నమ్మి మోసపోవద్దని, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చాలని కోరారు. వైసీపీకి కేరాఫ్ అడ్రస్ చంచల్‌గుడ జైలు కాగా, కాంగ్రెస్ నాయకులు, మంత్రులంతా సీబీఐ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. వైఎస్ పాలన్ల, కేసీఆర్ వైఖరి వల్ల రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీని మహిళలు, యువత బాగా ఆదరిస్తున్నారని అన్నారు.

ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి, తదితర నాయకురాళ్లు చంద్రబాబు వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. దారిలో చెరకు రైతులు, కల్లు గీత కార్మికులు తమ సమస్యలను చెప్పుకున్నారు. గమేళాలు తయారు చేసే చోటుకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, కొణతాల మురళీకృష్ణ, మళ్ల సురేంద్ర, గుత్తా ప్రభాకరచౌదరి, నిమ్మదల త్రినాథరావు, పొన్నగంటి నూకరాజు, గొంతిన లోవ అప్పారావు, వేగి గోపీకృష్ణ, మజ్జి నిరంజన్‌కుమార్, కూండ్రపు అక్కునాయుడు, వేగి దొరబాబు, కె. ఈశ్వర అప్పారావు, షేక్ బాదర్, పెంటకోట రాము, దొడ్డి బుద్ద సత్యనారాయణ, బొబ్బిలి సీతారాం, కొంతం ఆదినారాయణ, అందే రమణ, మళ్ల సూర్యారావు పాదయత్రలో పాల్గొన్నారు.

అలుపెరుగని బాటసారి


విశాఖపట్నం, (కశింకోట) : విశాఖపట్నమంటే తనకు ఎనలేని అభిమానం, ఇష్టమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ఒకపక్క సముద్రం, మూడు పక్కల కొండలతో విశాఖ అందాలు అద్భుతమన్నారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా తాళ్లపాలెంలో విశాఖ దక్షిణం, పశ్చిమ నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో ఉండేందుకు తానెంతో ఇష్టపడతానన్నారు. తన హయాంలోనే విశాఖ బాగా అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి చేయాలని ప్రణాళిక చేశామని, కొన్ని అడ్డంకుల వల్ల అది సాధ్యం కాలేదన్నారు.

హైదరాబాద్ ర్రాష్టానికి రాజధాని అయితే విశాఖ ఆర్థిక రాజధానిగా చేయాలని నిర్ణయించామన్నారు. విశాఖలోని సింహాచలం కొండను అభివృద్ధి చేసేందుకు ఎరుపు, పసుపు, పచ్చని పూలనిచ్చే తోటలను పెంచితే ఎంతో బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కైలాసగిరి కొండపై రోప్‌వే, కంబాలకొండకు మరో రోప్‌వే ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. ఇక్కడికి వస్తే ఎంతో ఆనందం, ఉత్సాహం కలుగుతాయన్నారు. ఇక్కడ హెచ్ఎస్‌బీసీని తానే తీసుకొచ్చానని, దీనివల్ల అనేకమందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. కొన్ని పరిశ్రమలు ఏర్పాటైనప్పటికీ ఉపాధి కరువైందన్నారు. విశాఖలో కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉందని, దానిని లేకుండా చేస్తే ప్రపంచంలోనే మంచి నగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు.

ఇక్కడి భూములను పిల్లకాంగ్రెస్ తండ్రి అమ్మేసి దోచుకుందని ఆరోపించారు. టీడీపీకి విశాఖపట్నం కంచుకోట అని, ఇక్కడ పార్టీకి మంచి పట్టు ఉందని అభిమానించే కార్యకర్తలున్నారన్నారు. ఇక్కడ తటస్థు ఓటర్లు ఎక్కువగా వున్నారని, బూత్‌లవారీగా ఓటర్లను కలుసుకొని తటస్థ ఓటర్లను గుర్తిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చునన్నారు. పట్టణ ఓటర్లు ప్రభుత్వ వ్యతిరేకతపై మొగ్గు చూపుతారని, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను వారికి చెప్పి తమ వైపు తిప్పుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, పశ్చిమ ఇన్‌చార్జి గణబాబు, రూరల్‌జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, టీడీపీ నాయకులు వానపల్లి రఘకుమార్, కె.విజయలక్ష్మి, బి.వరలక్ష్మి, పెంటకోట వీరలక్ష్మి, పెంటకోట త్రినాథ్, సరిపల్లి సీతారామరాజు, శీరం పైడిరాజు, వర్మ, జయరాజ్, మళ్ల శంకరరావు, వియ్యపు శ్రీనివాసరావు, బొట్టా పరదేశి, ఐతా మాణిక్యం, సూర్యనారాయణ, అన్నంరెడ్డిరాణి, వాసుదేవరావు, నర్గీష్, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నమంటే తనకు ఎనలేని అభిమానం

విశాఖపట్నం

తర్వాత పిలుపు రాగానే వారంతా బాబును కలుస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ సందడి ఉన్నప్పటికీ ప్రస్తుతం పాదయాత్ర చివరి రోజుకు రావడంతో క్యాంప్ వద్ద మరింత సందడి ఎక్కువయ్యింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వచ్చి బాబును కలిసేందుకు బారులు తీరుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితులను తెలియజేయడం, లేదా ఇన్‌చార్జిల నియామకం, ఇతరతరా సమస్యలు బాబుకు ఏకరువు పెడుతున్నారు. కొన్నింటిపై ఆయనే వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రతి రోజు ఉదయం 10, 11 గంటలకు ప్రారంభమవుతున్న నాయకుల హడావిడి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతున్నది. అనంతరం ఒకటి, రెండు నియోజకవర్గాల సమీక్షలు వుంటున్నాయి. ఇదిలా వుండగా క్యాంప్ నిర్వహించేచోట స్థానికంగా వున్న కొందరు బాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు పోటీ పడుతూ, ఫొటోలు దిగేందుకు సరదా పడుతున్నారు. కొందరు ముఖ్య నాయకులు కుటుంబ సభ్యులతో వచ్చి బాబును కలిసి యోగక్షేమాలు అడుతున్నారు. ఆయన కూడా వారితో ఓపికగా వారు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు.
: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఏడు నెలల నుంచి పాదయాత్ర చేసిన చంద్రబాబు అదే జోరు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి సమీక్షలు.. సమావేశాలు.. సాయంత్రం పాదయాత్ర ఇలా ఆయన రోజువారి కార్యక్రమం కొనసాగుతోంది. బాబు బస చేసే బస్సు వద్ద ఓ జాతరే. ఉదయం పూట వచ్చీపోయే జనం, వారి వాహనాలు, పోలీస్ బందోబస్తు, మీడియా హడావుడి. సాయంత్రం బాబు పాదయాత్ర ప్రారంభంతో వచ్చీ పోయే నాయకులతో కోలాహలంగా మారుతోంది. వచ్చిన నాయకులకు క్యాంప్ నిర్వాహకులు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకుల కోసం ప్రత్యేకంగా టెంట్‌లు వేసి లోపల ఎయిర్ కూలర్లు పెట్టారు. సీనియర్లంతా అక్కడ కొద్దిసేపు వేచి వుంటున్నారు.

బాబు బస ఓ జాతర

నర్సీపట్నం: వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకర్గం నుంచి టీడీపీ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చేసింది. టీడీపీ అభ్యర్థిగా అయ్యన్నపాత్రుడు తిరిగి పోటీ చేస్తారా? లేక ఆయన తనయుడు విజయ్‌ను రంగంలోకి దించుతారా? అనే ఊగిసలాట ప్రచారానికి తెర దిగింది. సోమవారం చంద్రబాబు తెరదించినట్టయింది. అయ్యన్నపాత్రుడు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సమీక్షలో అయ్యన్ననను ఎంత మెజార్టీతో గెలిపిస్తారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నర్సీపట్నం నియోజకవర్గ ముఖ్య నేతలను ప్రశ్నంచడం ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది. కశింకోట మండలం తాళ్లపాలెంలో నర్సీపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకులతో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు సోమవారం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి హాజరైన కొందరు టీడీపీ నాయకులు 'ఆంధ్రజ్యోతి'కి అందజేసిన వివరాలిలా ఉన్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సవివరంగా సమీక్ష జరిపారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజవకర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని, అయితే వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడికి ఎంత మెజార్టీ తేగలరో చెప్పాలని పార్టీ మండల శాఖల అధ్యక్షులను చంద్రబాబు ప్రశ్నించారు.

విశాఖ జిల్లాలో తొలుతగా నర్సీపట్నం నియోజకవర్గంలో వారం రోజులకుపైగా జరిగిన వస్తున్నా... మీకోసం పాదయాత్రను దిగ్విజయం చేసినందులకు పార్టీ నాలుగు మండలాలు, అర్బన్ శాఖ అధ్యక్షులను, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడును, అతని తనయుడు విజయ్‌ను చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 27న విశాఖలో జరగనున్న ముగింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని నర్సీపట్నం నియోజవకర్గ నేతలను బాబు కోరారు.

కోర్ కమిటీలదే కీలకపాత్ర నియోజకవర్గాల్లో పార్టీ కోర్ కమిటీలు భవిష్యత్‌లో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని, పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానంగా ఉంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామంలో పార్టీ పరిస్థితిని, పరిణామాలను తెలియజేయాల్సి ఉంటుందని చంద్రబాబునాయుడు నర్సీపట్నం నియోజకవర్గ నేతలకు సూచించారు. కేవలం ఎమ్మెల్యే ఎన్నికలపైనే కాకుండా ఎంపీ ఎన్నికలపై కూడా శ్రద్ద వహించాలని, అత్యధిక ఎంపీ స్థానాలను పార్టీ గెలుచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాబు కోరారు.

ఎంపీ అభ్యర్థుల ఎంపికలో శ్రద్ధ అవసరం టీడీపీ తరపున రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీ అధినేతను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేసేవారికే ఎంపీ అభ్యర్థులుగా టిక్కెట్లు ఇవ్వాలని ఆయన సూచించారు. తగిన గుణగణాలు, మంచిపేరు ఉన్న వ్యక్తులు దొరకాలి కదా! అంటూ చంద్రబాబు బదులిస్తూ, విజయావకాశాలు గల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల వడపోత ప్రారంభించామంటూ సూచనప్రాయంగా తెలిపారు.

విజయ్‌కు కితాబు యువకుడైన విజయ్ మంచి వాగ్ధాటి అని చంద్రబాబు కితాబు ఇచ్చారు. అతడిని నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠతకు, ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాల్సిందిగా సూచించారు. విశాఖ జిల్లాలో వస్తున్నా... మీకోసం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు వెన్నంటి ఉంటూ నడక కొనసాగస్తున్న అయ్యన్న తనయుడు విజయ్ తన ఉద్రేక ప్రసంగాలు, ఉద్విగ్న హవాభావాలు, ప్రత్యేక వ్యవహారశైలితో బాబును ఆకట్టుకున్నారు.

దీంతో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా కాకుండా ఇతరత్రా విజయ్ సేవలను ఉపయోగించుకోవాలనే యోచన అధినేత చంద్రబాబునాయుడులో ఉన్నట్టుగా విశిదమవుతుందని పార్టీవర్గాలు తెలిపాయి.

బాబు సమీక్షలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, నర్సీపట్నం మండల శాఖ అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి, గొలుగొండ మండలశాఖ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, నాతవరం మండలశాఖ అధ్యక్షుడు లాలం అచ్చిరాజు, మాకవరపాలెం మండలశాఖ అధ్యక్షుడు రుత్తల శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నం అభ్యర్థిత్వంపై ఊగిసలాటకు తెర


బొబ్బిలి: కాంగ్రెస్ హయాంలో మ హిళలకు ఇంటా, బయటా రక్షణ లేకుం డా పోయిందని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తూముల అచ్యుతవల్లి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కా ర్యాలయంలో ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ఢిల్లీలోని నిర్భ య సంఘటన దేశ ప్రజలు మరువక ముందే, ఐదేళ్ల చిన్నారిపై అతి దారుణంగా మానవమృగం పైచాచికంగా ప్రవర్తించిన తీరు ఈ ప్రభుత్వాల చేతకాని తనానికి నిదర్శనమని అన్నారు.

అట్టహాసంగా నిర్భ య చట్టాన్ని రూపొందిచామని, బాధితులను శిక్షిస్తామని చెబుతున్న ఈ
ప్ర భుత్వం ఢిల్లీలో చిన్నారిపై జరిగిన సంఘటనపై నిరసన వ్యక్తం చేసిన మహిళలపై పోలీసుల దాడిని ఏమనాలని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం నేరస్థులను పట్టుకొని కఠినంగా శిక్షించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. ఇలాంటి పాలకులను దేశం నుంచి తరిమివేయాలన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, తెలుగు యువత అధ్యక్షుడు వెంకట్, తెలుగు మహిళా నాయకురాలు శ్రీదేవి పాల్గొన్నారు.

కాంగ్రెస్ హయాంలో మహిళలకు రక్షణ కరువు

దత్తిరాజేరు:టీడీపీ అధ్యక్షుడు చం ద్రబాబునాయుడు చేసిన పాదయాత్ర కాంగ్రెస్‌కు ముచ్చమటలు పట్టాయని టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి పడాల అరుణ అన్నారు. సోమవారం దత్తిరాజేరులో పర్యటించిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ఒక్కరూ చేయని విధంగా చంద్రబాబు పాదయాత్ర చేసి ప్రజలకు చేరువ కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.

ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష మద్దతు రావడంతో కాంగ్రెస్ జీర్ణించుకోలేక అమ్మహస్తం, ఇందిరమ్మ కలలు వంటి పథకాలు పెట్టి అభాసుపాలవుతున్నారన్నారు. ఈ నెల 27న చంద్రబాబు నాయుడు పాదయాత్ర విశాఖతో ముగుస్తుండడంతో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసభను విజయవంతం చేయడానికి గజపతినగరం నియోజకవర్గం నుంచి పది వేలు మంది కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మండలాల ప్రజ లు పెద్దఎత్తున తరలిరావాలని ఆమె కోరారు. సమావేశంలో మండల పార్టీ అద్యక్షుడు బెజవాడ రామునాయుడు, నాయకులు ఎన్.రామునాయుడు, గాడి కృష్ణ, మురపాక బాస్కరరావు, బి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బాబు పాదయాత్రతో కాంగ్రెస్‌కు దడ


జంగారెడ్డిగూడెం: రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబునాయుడని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు అన్నా రు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సోమవారం ఆయన స్థానిక నాయకుడు నందిన హరిశ్చంద్రరావు నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి దశ దిశ నిర్ధేశం చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడే అని కాంగ్రెస్ అవినీతి పాలనతో ప్రజలకు అర్థమైందన్నారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి అవినీతి ప్రభుత్వానికి, కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ ప్రభుత్వానికి ప్రజలలో రోజురోజుకు తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయని వాటన్నింటిని చక్కదిద్దడానికి సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమన్నారు. అటువంటి సమర్థమవంతమైన నాయకుడే చంద్రబాబు అన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలు వైయస్ కుటుంబం అవినీతి ప్రజలకు వివరిస్తూ చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందన్నా రు. బాబు పాదయాత్ర ప్రజల్లో చైతన్యం కలిగించిందన్నారు. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందన్నారు. క్రమశిక్షణ కు, నిజాయితీకి మారుపేరైన టీడీపీకి ప్రజలు పట్టం కట్టడం తథ్యమన్నారు. పార్టీలో చిన్న చిన్న విబేధాలుంటే సర్దుబాటు చేసుకుని ప్రజల్లోకి వెళతామన్నారు. డబ్బు కోసం ఏనాడు తాను ఆశించలేదని తరతరాలుగా తమ వంశం నీతిగానే రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసిందన్నారు. ఈనెల 27వ తేదీతో చంద్రబాబు నాయుడి వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగుస్తుందని ఈ సందర్భం గా విశాఖలో ఏర్పాటు చేసిన సభకు కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో వెళ్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ కో ఆర్డినేటర్ మండవ లక్ష్మణరావు, పోలవరం నియోజకవర్గ నాయకులు మొడియం శ్రీనివాసరావు, జయవరపు శ్రీరామమూర్తి, టీడీపీ జిల్లా అధికార ప్రతిని«ధి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, జంగారెడ్డిగూడెం పట్టణ, మండల అధ్యక్షులు షేక్ ముస్తఫా, దల్లికృష్ణారెడ్డి, బుట్టాయగూడెం, కా మవరపుకోట, మండల టీడీపీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, కోనేరు వెంకట సుబ్బారావు, మందలపు కృష్ణారావు, పరిమి రాంబాబు, మద్దిపాటి నాగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, పెసరగంటి జయరాజు, తూటికుంట దుర్గారావు, వందనపు హరికృష్ణ, పాతూరి అంబేద్కర్, ధూళిపాళ ప్రభాకరరావు, యర్రమళ్ళ సుబ్బారావు, ఆరుగొల్లు బజారు, మిడతా పెంటయ్య, ముళ్ళపూడి శ్రీనివాసరావు, గంధం అప్పాజీ, పిన్నమనేని మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగేది చంద్రబాబే

అది బ్లాక్‌మెయిల్,సూట్‌కేసుల పార్టీ

అవినీతిపై మాట్లాడే హక్కు టీఆర్ఎస్‌కు లేదని చంద్రబాబు ుండిపడ్డారు. అవినీతిపై మాట్లాడలేనిస్థితిలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా నిద్రలేచి రంకెలేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ వల్లే రాష్ట్రం భ్రష్టుపట్టిందని ఉగ్గినవానిపాలెంలో జరిగిన సభలోమండిపడ్డారు. ఇప్పటివరకూ ఆ పార్టీ పేరు చెప్పకుండా సాదాసీదాగా మాట్లాడానని, అందుకే తనపై విరుచుకుపడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

వారికి ఎప్పుడో ఒకసారి ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయన్నారు. వైఎస్ హయాంలో ఎప్పుడూ అవినీతి గురించి మాట్లాడలేదని విమర్శించారు. బయ్యారంలో వైఎస్ అల్లుడికి గనులు ధారాదత్తం చేస్తే అప్పుడు టీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆరోపించారు. టీడీపీ ఈ విషయాన్ని అప్పుడే వెల్లడించిందని, ఎక్కడ గనులుంటే అక్కడే కర్మాగారాలు పెట్టాలని డిమాండ్ చేసిందన్నారు. గిరిజనులకు పూర్తిగా ఉపాధి కల్పించాలని బయ్యారంలో తాము ఆందోళన కూడా చేపట్టామని గుర్తుచేశారు.

అప్పుడు నిద్రపోయిన టీఆర్ఎస్, ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. "అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చెబుతున్నాం అది పూర్తిగా బ్లాక్‌మెయిల్ పార్టీ.. సూట్‌కేసుల పార్టీ'' అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 2009లో ఎన్నికల పొత్తు అంటూ తన దగ్గరకు వస్తే టీడీపీ సీట్లు ఇచ్చామని, అయినా ఆ పార్టీ గెలవలేకపోయిందని చెప్పారు. సూట్‌కేసులు తీసుకొని రాజకీయాలు చేస్తున్నది టీఆర్ఎస్ తప్ప తెలుగుదేశం కాదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తాము కృషిచేస్తుంటే, ఆ పార్టీ సూట్‌కేసులతో రాజకీయం చేస్తోందని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ వల్లే రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది: బాబు ఫైర్

ఉద్యమ ద్రోహివి,గల్ఫ్ బ్రోకర్‌వి,పొలిటికల్ లోఫర్‌వి
ఆధారాలతో నిరూపిస్తాం: టీడీపీ

(న్యూస్ నెట్‌వర్క్) టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై టీడీపీ విరుచుకుపడింది. తమ పార్టీ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ను దుయ్యబట్టింది. "నీది తాగుబోతుల పార్టీ. వసూళ్ల పార్టీ. ఫాం హౌస్ పార్టీ. తాగి ఊగే పార్టీ. తాగకుండా ఉండలేని పార్టీ. తెగ తాగి ఫాం హౌస్‌లో పడుకొనే పార్టీ'' అంటూ ఎమ్మెల్సీ అరిగెల నర్సారెడ్డి ధ్వజమెత్తారు. తమది పాలు, కూరగాయలు అమ్ముకొనే పార్టీ అని కేసీఆర్ అంటున్నాడని, అది నిజం అనుకున్నా తమది స్కాములు, బ్లాక్ మెయిళ్లు, దోపిడీ వ్యవహారాల పార్టీ మాత్రం కాదని దుయ్యట్టారు. " మాది బిర్యానీ, బీర్ల పార్టీ కాదు.

కూతురు సినిమా పరిశ్రమను, కొడుకు పరిశ్రమలను, అల్లుడు విద్యా సంస్థలను పంచుకొని పిండి వసూళ్లు చేస్తుంటే తండ్రి ప్రాజెక్టులను కొల్లగొడుతున్నాడు. నాలుగు చేతులా సంపాదన. నీదొక పార్టీ...నువ్వొక నాయకుడివా?'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంపై పార్లమెంటులో చర్చ జరిగితే కేసీఆర్ ఆ ఛాయలకే పోలేదని, బ్రదర్ అనిల్‌కు బయ్యారం భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ చంద్రబాబు అక్కడకు వెళ్తే ఉద్యమం ముసుగులో ఆయనను అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్ గల్ఫ్ బ్రోకర్, పొలిటికల్ లోఫర్ అని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ధ్వజమెత్తారు.

ఫాం హౌస్‌లో గ్లాసులు ఎత్తడం కాదు... పార్లమెంట్‌లో గొంతు ఎత్తడం నేర్చుకోవాలని అని సూచించారు. 'కేసీఆర్‌ది అంతా చందాల దందా. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని పెద్ద ఎత్తున వసూళ్ళకు పాల్పడుతున్నాడ'ని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌పై ఆరోపణలు నిరూపించడడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఓబుళాపురం గనులు కేటాయించాలని, ఆ గనుల లీజు రద్దు అయినందున వాటిని విశాఖ ఉక్కుకు కేటాయించాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

బయ్యారం ఇనుప ఖనిజం దోపిడీపై ఖమ్మం జిల్లా ప్రజలకు షర్మిల క్షమాపణలు చెప్పాలని ఆ జిల్లా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేతపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మొవ్వా విజయ్‌బాబు మండిపడ్డారు. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా డిమాండ్ చేస్తున్నది. కరీంనగర్‌లో జరుగుతున్న ఫార్వర్డ్ బ్లాక్ ప్రథమ రాష్ట్ర మహాసభల సందర్భంగా రెండో రోజు సోమవారం ప్రతినిధుల సభ జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.

కేసీఆర్ ఖబడ్దార్ నీదే తాగుబోతుల పార్టీ

జంగారెడ్డిగూడెం : 'కాంగ్రెస్ నుంచి తప్పుకున్నందుకే నేను జైలు పాలుకాలేదు.. జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్క స్థానం ఓడినందుకు వైఎస్ నన్ను మంత్రివర్గం నుంచి తప్పించారు.. నేను ఆ పార్టీలో ఉంటే జైలుకెళ్లే వాడిని.. జగన్ పక్కన చంచల్‌గూడ జైల్లో నాక్కూడా ఖైదీ నెంబర్ 786 లేదా 420 ఇచ్చేవారని' టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు
అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బయ్యారం, ఓబుళాపురం గనులు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టి వైఎస్ కుటుంబం కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడిందన్నారు.

కాంగ్రెస్‌లో ఉంటే జైలుకెళ్లేవాడినే : మాగంటి బాబు

నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తన భాష మార్చుకోవాలని, ఆయన మాట్లాడుతున్న భాషను చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై కేసీఆర్ వ్యక్తిగత విమర్శలు చేశారని, ఆయన వాడిన భాషను చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. కేసీఆర్ వాడిన పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని, భాషను మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఫాం హౌజ్‌పార్టీ అని, కేసీఆర్ ఆరు నెలల పాటు ఫాంహౌజ్‌లో కుంభకర్ణుడిలా నిద్రపోయి తరువాత వచ్చి టీడీపీపై విమర్శలు చేస్తుంటారని, ఫాంహౌజ్‌లో ఉండే కేసీఆర్‌కు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.

సూట్‌కేసులు తీసుకునే ఘన చరిత్ర కేసీఆర్‌కు సొంతమని, సూట్‌కేసులు తీసుకుని సకల జనుల సమ్మెను తాకట్టుపెట్టిన చరిత్ర కేసీఆర్‌కు ఉందన్నారు. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడంతో నల్ల ముఖంతో కేసీఆర్ ఆరు నెలలు ఏం మాట్లాడలేదని, టీడీపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీతో పాటు మరో 11 ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయలేదన్నారు. తెలంగాణలోని భూములు ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడినా కేసీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. బయ్యారం గనులు ఆ ప్రాంత గిరిజనులకే చెందాలంటూ అనేక ఆందోళనలు చేపట్టామని, అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా పిట్టల దొరలా మాట్లాడే కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. 2009 ఎన్నికల్లో 46 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కేటాయిస్తే సూట్ కేసులు నిండా డబ్బులు తీసుకుని, టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. బాబ్లీ, బయ్యారం గనులపై కేసీఆర్ చేసిన పోరాటాలు ఏంటో చెప్పాలని, బహిరంగ చర్చకు రమ్మని ఎన్నిసార్లు సవాళ్లు విసిరినా తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె ఆరోపించారు.

కేసీఆర్ భాష మార్చుకో..: అన్నపూర్ణమ్మ