April 19, 2013

టీఆర్ఎస్‌కు టీడీపీ హితవు

హైదరాబాద్: "మీకు ఏయే నియోజకవర్గాల్లో నేతల అవసరముందో పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల వారికి ఎలాగూ అవకాశమిస్తారు కాబట్టి ఇప్పటికే మీ పార్టీలోని నేతలు వారి దారి వారు చూసుకుంటారు'' అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హితవు పలికారు. 'మీ పార్టీలో ఉన్న నేతలు తెలంగాణను వదులుకోరు కాబట్టి టీఆర్ఎస్‌నైనా వదులుకుంటారు' అని వ్యాఖ్యానించారు.

నేతలు కావాలంటే నోటిఫికేషన్ ఇవ్వండి

సికింద్రాబాద్: పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లను సత్వరమే పూర్తి చేయాలని టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, సీఎం రమేష్ కోరారు. ఈమేరకు వారు దక్షిణ మధ్యరైల్వే జీఎం ఎంకే పాండేను శుక్రవారం కలిసి ఓ వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

టీడీపీ ఎంపీలందరు గత ఏడాది రైల్వే జీఎంను కలిసి ఓ వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఇప్పటికైనా పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని జీఎంను కోరామన్నారు. భద్రాచలం - కొవ్వూరు రైల్వే లైనుకు నిధులు మంజూరైనా పనులు మొదలవకపోవడం విడ్డూరంగా ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి: టీడీపీ

దూరంగా వెలుగులు, ఈ దగ్గరంతా చీకట్లు. రూపాయికి బొమ్మాబొరుసు. అభివృద్ధి పథంలో తెలుపు, నలుపు. పారిశ్రామిక ప్రగతికి నేను వ్యతిరేకం కాదు. కానీ, అంధకారం తప్ప ఆశని నింపని ఆ పరిశ్రమని ఎలా సమర్థించడం? పరిశ్రమ వస్తున్నదంటే..పది చేతులకు పని దొరకాలి. పది గ్రామాలకు కొత్త ఉపాధి దారులు పడాలి. పది ప్రాంతాలు బాగుపడాలి. అప్పటిదాకా సంప్రదాయ విధానంలో సాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాలు చైతన్యం పుంజుకోవాలి.

కానీ, మాకవరపాలెం ప్రాంతంలో 'అన్‌రాక్' వచ్చి చేసిందేమిటి? ఈ బాక్సైట్ కంపెనీ పేరు వింటేనే స్థానికులు కన్నెర్ర చేయడం గమనించాను. వెనకబడిన ప్రాంతంలో ఇంత భారీ పరిశ్రమ వచ్చిందంటే..ఎవరైనా ఆహ్వానించాల్సిందే. పారిశ్రామిక మనుగడ రీత్యానే కాదు, ప్రాంతీయాభివృద్ధి దృష్ట్యా కూడా పరిశ్రమలు రావాల్సిందే. కానీ, 'అన్‌రాక్' తమ బతుకుకు గుదిబండగా మారిందని ఇక్కడి జనం మండిపడుతున్నారు. కొత్త ఉపాధి సరే, చేస్తున్న పనికే సమాధి కట్టిందట. పరిశ్రమ అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటోగానీ.. ఊళ్లోని పెద్ద రైతులు సైతం బికారులుగా మారిపోయారట. చాలామంది కూలీలుగా మారితే, పరిశ్రమ వ్యర్థాలతో కలుషితమైన నీళ్లు తాగి ఊళ్లకు ఊళ్లు మంచం పడుతున్నాయట. 'ఎందుకిలా?' ఇదే ప్రశ్నను ఇక్కడి యువకులను అడిగాను.

" పెద్ద పరిశ్రమ వస్తున్నదంటే మేమూ సంతోషించాం సార్. మా పెద్దవాళ్లకూ నచ్చజెప్పాం. కొలువులు వస్తాయని, మా ప్రాంతానికి కొత్త వెలుగులు వస్తాయని, సహజ వనరులు సద్వినియోగం అవుతాయని, రవాణా సౌకర్యాలు మెరుగుతాయని వాదించాం. 'అన్‌రాక్' రావడమైతే వచ్చిందిగానీ, మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు. మూడు వేల ఎకరాలు మింగి పట్టుమని మూడు ఉద్యోగాలైనా ఇవ్వలేదు'' అని వారు వాపోయారు. ఈ చీకటిని చీల్చితేనే వీళ్లకు వెలుగు!

ఈ చీకటిని చీల్చితేనే వెలుగు!

బాబు సభకు భారీ ఏర్పాట్లు
పైలాన్ నుంచి సభ వరకు చంద్రబాబు ఊరేగింపు
27 సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం

విశాఖపట్నం : విశాఖపట్నంలో ఈనెల 27న టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రానున్నందున అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ జిల్లాల నాయకులు, కార్యకర్తల కోసం 9 ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వాస్తవానికి 20 రైళ్లు కావాలని దక్షిణ మధ్య రైల్వేను టీడీపీ అధిష్ఠానం కోరగా ప్రస్తుతానికి తొమ్మిదింటికి అనుమతి ఇచ్చింది.

మిగతా రైళ్ల కోసం అధికారులతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు చర్చిస్తున్నారు. ఇంకా కోస్తా జిల్లాల నాయకులు, కార్యకర్తలు బస్సులు, సొంత వాహనాల్లో రానున్నారు. నగరానికి వచ్చేవారికి వసతి కల్పించేందుకు సీనియర్ నేత భరణికాన రామారావు నేతృత్వంలోని కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నగరంలోని కల్యాణ మండపాలు, లాడ్జిలు రిజర్వు చేసింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను కూడా రిజర్వు చేయాలని నిర్ణయించింది.

ఇక సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా వలంటీర్లను నియమిస్తున్నారు. వారంతా పసుపురంగు టీ షర్టులతో విధులు నిర్వహిస్తారు. వాహనాల పార్కింగ్‌కు కొన్ని స్థలాలు ఎంపిక చేశారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒకటి, రెండురోజుల్లో అగ్రనాయకులు పలువురు విశాఖ చేరుకుంటారని

పైలాన్ నుంచి చంద్రబాబు ఊరేగింపు
27వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అగనంపూడి టోల్‌గేటు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించనున్న చంద్రబాబు అక్కడి నుంచి ఓపెన్‌టాప్ వాహనంపై సభావేదిక వరకు ఊరేగింపుగా వస్తారు. సుమారు 23 కిలోమీటర్ల దూరం సాగే ఈ ఊరేగింపులో వేలాది వాహనాలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం అవుతుంది.

6 గంటలకు చంద్రబాబు మాట్లాడతారు. రాత్రి 8 గంటలకు సభ ముగిసేలా ప్రణాళిక రూపొందించారు. పైలాన్ వద్ద నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ఎన్టీఆర్, చంద్రబాబు కటౌట్లు పెడతారు. సుమారు 60 అడుగుల ఎత్తులో కటౌట్లు ఏర్పాటుచేసే బాధ్యత హైదరాబాద్‌కు చెందిన చిన్నా సినీ ఆర్ట్స్ సంస్థకు అప్పగించారు.

భారీ వేదిక
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ సభావేదికను నిర్మించనున్నారు. 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తులో ఈ వేదిక ఉంటుంది. వీలైనంత ఎక్కువమంది నాయకులు ఆశీనులయ్యేలా వేదికను నిర్మించనున్నారు. వేదిక ఏర్పాటుపై శుక్రవారం పాదయాత్ర సమన్వకర్త గరికపాటి మోహనరావు సంబంధిత వ్యక్తులతో చర్చించారు.

సభా మైదానాన్ని ఆరు కంపార్టుమెంట్లుగా విభజించనున్నట్టు చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వీ వీఐపీలు, మహిళలకు ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లు నిర్మిస్తామన్నారు. అయితే మైదానాన్ని ఈనెల 21న అప్పగించనున్నందున ఆరోజు నుంచి పనులు చేపడతామని ఆయా సంస్థల ప్రతినిధులు శంకర్, చందరరావు వివరించారు.
పార్టీ అర్బన్ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ తెలిపారు.

సీమ, తెలంగాణ జిల్లాల నుంచి ప్రత్యేకరైళ్లు వసతికి కల్యాణమండపాలు, లాడ్జీలు రిజర్వు

హైదరాబాద్

నిజానికి.. విశాఖపట్నం జిల్లా కన్నూరుపాలెంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు భారీ సన్నాహాలు చేశారు. పాదయాత్రగా బాబు ఈ గ్రామం చేరుకోగానే.. ఎదురేగి శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు అగ్రనేతలు ఇప్పటికే కన్నూరుపాలెం చేరుకున్నారు. కాగా బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో శనివారం ఉచిత నేత్ర పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ వెల్లడించారు.
: శనివారంతో 64వ పడిలో అడుగుపెడుతున్న చంద్ర బాబు..జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై దారుణం, నేపాల్ యువతిపై సామూహిక అత్యాచారం ఘటనల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.

జన్మదిన వేడుకలకు బాబు దూరం

అవినేతి వేళ్లు జగన్ ఇంట్లో!
పేద పిల్లలను చదివిస్తా: చంద్రబాబు
200 రోజుల పాదయాత్ర పూర్తి

విశాఖపట్నం, మాకవరపాలెం: ఆంధ్రా, కర్ణాటక ర్రాష్టాల్లో అక్రమ గనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా కొల్లగొట్టిన డబ్బులో కొంత కాంగ్రెస్ హైకమాండ్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి ముడుపులుగా సమర్పించేవారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అవినీతి వృక్షం వేళ్లు వైఎస్, జగన్ ఇళ్లలోనే ఉన్నాయని విమర్శించారు. పాదయాత్రలో 200 రోజులు పూర్తిచేసుకొన్న ఆయన.. శుక్రవారం సాయంత్రం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం తామరం వద్ద నడక ప్రారంభించారు.

రాచపల్లి జంక్షన్, రామన్నపాలెం, భీమబోయినపాలెం, దుంగలవానిపాలెం, శెట్టిపాలెం, రాజుపేట, పాతకన్నూరుపాలెం మీదగా యాత్ర సాగించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధిపతి గాలి జనార్దనరెడ్డి గనుల అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించిన ఆయన.. టీడీపీ పోరాటం ఫలించిందని వ్యాఖ్యానించారు. "గాలితో కలిసి వైఎస్.. కర్ణాటక, ఆంధ్రా ర్రాష్టాల్లో అక్రమ మైనింగ్ సాగించారు. ర్రాష్టాల సరిహద్దులనే చెరిపివేశారు. ఐదేళ్లలో 60 వేల కోట్ల ఖనిజ సంపదను దోచుకున్నారు. దీనిపై అప్పట్లోనే మా పార్టీ ఉద్యమాలు చేసింది. వాటి విషయమై వైఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమన్న విషయం కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంద''ని పేర్కొన్నారు.

మాకవరపాలెంలో 'అన్‌రాక్' కోసం రైతులను కూలీలుగా మార్చారన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేవరకు తమ పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, పంటలకు గిట్టుబాటు ధర లభించేలా వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వికలాంగుల పెన్షన్‌ని రూ.1500 కు పెంచుతామన్నారు. పేద పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా, పాదయాత్రకు 200 రోజులు పూర్తయిన సందర్భంగా తా మరం గ్రామంలో చంద్రబాబు.. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు.

కాంగ్రెస్ అధిష్ఠానానికీ 'గని'పాపం సోనియాకు ముడుపు గట్టిన వైఎస్ గాలితో కలిసి సరిహద్దులు మాయం

అనితరసాధ్యంగా పాదయాత్ర

హైదరాబాద్ : నాడు..
అరవై ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు చైతన్య రథంపై రాష్ట్రాన్ని చుట్టి అసామాన్యుడని అనిపించుకొన్నారు.

నేడు...
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 64 ఏళ్ల వయసులో రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు పాదయాత్రతో తిరిగి అనితరసాధ్యుడని అనిపించుకొంటున్నారు.

శుక్రవారానికి ఆయన తన ఇల్లు వదిలి సరిగ్గా 200 రోజులు. గత ఏడాది అక్టోబర్ 2న ఇల్లు వదిలిన ఆయన ఇంత వరకూ తన ఇంటి మొహం చూడలేదు. పాదయాత్రలు మన రాష్ట్రానికి కొత్త కాదు. కానీ, ఈ వయసులో ఇంత సుదీర్ఘ పాదయాత్రను రాష్ట్రం చూడలేదు. 13 ఏళ్ల కిందట పాదయాత్ర చేసిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ సుమారు 1400 కిమీ నడిచారు. పైగా అప్పుడు ఆయన వయసు ఇప్పుడు చంద్రబాబు కంటే పదేళ్లు తక్కువ. ఈ మొత్తం యాత్రలో ఆయన 16 జిల్లాలు సందర్శించారు.

82 నియోజకవర్గాలు, 1209 గ్రామాలు, 160 మండలాలు, 27 మునిసిపాలిటీలు, 4 కార్పొరేషన్ల మీదుగా ఆయన నడక సాగింది. 60 ఏళ్ల వయసులో ఎన్టీ రామారావు చైతన్య రథంపై సుడిగాలి పర్యటనలు చేసినప్పుడు ఆయనది ఉక్కు శరీరమన్న ప్రశంసలు వినిపించాయి. తాను అంతకంటే గట్టి వాడినని చంద్రబాబు ఇప్పుడు నిరూపించుకొన్నారు. 'ఆరున్నర నెలలుగా విరామం లేకుండా పాదయాత్ర చేయడం మాటలు కాదు. ఒక జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనతో పూర్తిగా కనీసం ఆ జిల్లా వరకూ అయినా పాదయాత్ర చేసిన నాయకులను వేళ్లపై లెక్కపెట్టవచ్చు.

కేవలం నడవడమే కాకుండా ప్రజలతో కలిసిపోవడం, వారితో చర్చించడం వంటి వాటితో ఆయన ప్రతిచోటా యాత్రను ఉత్సాహభరితంగా మలిచారు. అది గొప్ప విషయం'' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షునిగా అన్ని విషయాలూ చూసుకొంటూనే పాదయాత్ర చేయడం చంద్రబాబుకు పెద్ద సవాల్‌గా మారింది. అయినా దానిని అధిగమించగలిగారు. పాదయాత్ర సమయంలో అనేక సంక్షోభాలను పార్టీ చవిచూసింది.

అటు కోస్తా.. ఇటు తెలంగాణలో కొంతమంది నేతలు పార్టీ ఫిరాయించారు. ఇంకా అనేక మంది గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారని ప్రతి రోజూ వదంతులు షికార్లు చేశాయి. వివిధ కారణాలపై పార్టీలో కొందరు సీనియర్లు అలకబూనారు. ఒకపక్క యాత్ర చేస్తూనే చంద్రబాబు వీటన్నింటినీ సమన్వయపర్చుకొంటూ వచ్చారు. ఇందుకు అనేక మంది పార్టీ నేతలు ఆయనకు తమ వంతు సహకారం అందించారు.

ఆయన యాత్ర ప్రజల్లో చర్చనీయాంశం అవుతోందని గుర్తించిన నేతలు క్రమంగా దాని స్థాయిని పెంచుకొంటూ వచ్చారు. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా నుంచి యాత్ర ఊపు పెరిగిందన్నది ఆ పార్టీలో ఉన్నమాట. ఆయన యాత్ర మధ్యలో జరిగిన సహకార ఎన్నికల్లో రెండు డీసీసీబీలు గెలుచుకోవడంతోపాటు నాలుగైదు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో సొసైటీలను గెలుపొందడం ఆ పార్టీ శ్రేణులకు స్ధైర్యాన్ని పెంచింది.

ఎన్టీఆర్@ 60.. చంద్రబాబు @64 పార్టీని నడిపిస్తూ.. అడుగు ముందుకు వేస్తూ

 అన్నదాత బిడ్డలకు అన్నం పెట్టిన చంద్రన్న నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని కోరుకుంటు భాద్యత యుతమైన అభివృద్ధి, ముందు తరాల క్షేమం ఎలా ఉండాలో జాతికి తెలియ చెప్పిన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లో తెలుగు దేశం మరింత ముందుకు పోవాలి అని ఆశిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

అనకాపల్లి
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను 500 మంది వికలాంగుల మధ్య నిర్వహించనున్నట్టు టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అనకాపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకలను ఈనెల 20న కశింకోట మండలం కన్నూరుపాలెంలో నిర్వహించనున్నామన్నారు. చంద్రబాబు 64వ జన్మదినం కావడంతో 64 కేజీల కేక్ ఒకటి, 200 రోజుల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా 200 కేజీల కేక్ మరొకటి చంద్రబాబు కట్ చేస్తారన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు వస్తున్నందున వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా చిడతలు, తప్పెటగుళ్లు, నేల వేషాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే 20వతేదీ సాయంత్రం పాదయాత్ర ముందు భారీగా బాణసంచా కాల్చడానికి నిర్ణయించామన్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం, ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కమిటీలను వేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, మళ్ల సురేంద్ర, మళ్ల రాజా, డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, గుత్తా ప్రభాకర చౌదరి, కర్రి దివాకర్, కర్రి శివుడు, తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర వివరాలు

అనకాపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్ర వివరాలను టీడీపీ రూరల్‌జిల్లా అధ్యక్షుడు రత్నాకర్ వివరించారు. 19వతేదీ రాత్రికి కశింకోట మండలం కన్నూరుపాలెం చేరుకొని రాత్రికి బస చేస్తారన్నారు. 20వతేదీన కన్నూరుపాలెంలోనే చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుగుతాయని, ఆ వేడుకల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాల్గొంటారన్నారు. సాయంత్రం నాలుగుగంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారన్నారు. అక్కడి నుంచి కొత్తూరు, సుందరయ్యపేట, జి.భీమవరం, అచ్చెర్ల జంక్షన్, బంగారయ్యపేట మీదుగా తాళ్లపాలెం చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారన్నారు.

21వ తేదీన విశ్రాంతి తీసుకొని విశాఖనగరంలో వున్న నియోజకవర్గాల నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారన్నారు. 22వతేదీన తాళ్లపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించి ఉగ్గినపాలెం, పరవాడపాలెం, బయ్యవరం మీదుగా కశింకోట చేరుకుంటారన్నారు. అక్కడ రాత్రి బస చేసి 23న కశింకోటలో పాదయాత్ర ప్రారంభించి పిసినికాడ, కొత్తూరు జంక్షన్, బైపాస్‌రోడ్డు జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, నెహ్రూచౌక్ జంక్షన్‌కు చేరుకొని అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారన్నారు.

అనంతరం చిననాలుగురోడ్ల జంక్షన్ మీదుగా రింగ్‌రోడ్డు జంక్షన్‌కు చేరుకొని అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. అక్కడి నుంచి గవరపాలెం, పరమేశ్వరిపార్కు, సుంకరమెట్టజంక్షన్ మీదుగా శంకరం, రేబాక చేరుకొని అక్కడ రాత్రి బస చేస్తారన్నారు. 24వతేదీన రేబాక నుంచి ప్రారంభమై కాపుశెట్టివానిపాలెం, కోడూరు జంక్షన్ మీదుగా పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టి బాటజంగాలపాలెం, అసకపల్లి జంక్షన్ మీదుగా సబ్బవరం చేరుకుంటారని రత్నాకర్ తెలిపారు.

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

నర్సీపట్నం : 'మాగోడు పట్టించుకున్నవారెవ్వరూ లేరు...ప్రతి పనికి డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుంది...రాజకీయ అండదండలుంటేనే పనులు అవుతున్నాయి...తిరిగి మీరు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది...అందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం...'అంటూ వృద్ధులు, మహిళలు, యువతీయువకులు ఇలా అన్నివర్గాల ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు పలకడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వరుసగా ఐదవ రోజైన గురువారం కొనసాగిన చంద్రబాబు పాదయాత్రకు విశేష ప్రజాదరణ లభించింది. మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం, గంగవరం, దాలింపేట, కొండలఅగ్రహారం, మాకవరపాలెం, తామరం గ్రామాల్లో జరిగిన సభలకు ప్రజానీకం విశేషంగా హాజరయ్యారు.

దారిపొడవునా మహిళలు చంద్రబాబుకు హారతులుపట్టి తిలకం దిద్దారు. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు తమ భవిష్యత్తు గురించి చంద్రబాబు వద్ద ఆందోళన వ్యక్తం చేసి తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరడం విశేషం. తిరిగి మీరు ముఖ్యమంత్రి అయితేనే తమకు న్యాయం జరుగుతుందంటూ నిరుద్యోగ యువత, డ్వాక్రా మహిళలతోపాటు వృద్ధులు సైతం పేర్కొనడంతో చంద్రబాబు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

పాదయాత్రలో భాగంగా గురువారం తన ప్రసంగాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా వాటి పరిష్కారానికి భవిష్యత్‌లో ఏం చేయాలనేది ఒక అవగాహన వస్తుందని ఆయన పేర్కొన్నారు. గురువారంనాటి పర్యటనలో బీ
సీలకు ప్రాధాన్యం ఇస్తూ 50 వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళిక, అదేవిధంగా క్రీడాకారులకు, మహిళలకు, చేతివృత్తులవారికి తగిని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన పథకాలను చంద్రబాబు ప్రకటించారు.

ఖనిజ దోపిడీకి పాల్పడుతున్న పాలక పెద్దలు, రైతులు, ప్రజలకు అవసరమైన తాగు, సాగునీటిని కూడా దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న అన్‌రాక్‌పై తగు చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబ అవినీతిని సామాన్య ప్రజల కష్టాలతో పోలుస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది.

సీఎం నేవ్వే బాబూ..

మాకవరపాలెం/విశాఖపట్నం

తొలుత పాడేరు నియోజకవర్గానికి చెందిన మణికుమారి, ఎంవీఎస్‌ప్రసాద్, బొర్రా నాగరాజు, షేక్‌భాషా, మహేశ్, ఎం.అచ్చిరాజు, బి.చినరామ్మూర్తి, ఆర్.రాము, ఎం.రమణమ్మ, తదితరులతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు చర్చించారు. నెలరోజులపాటు నియోజకవర్గంలో పర్యటించి పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతనే సమన్వయకర్త నియామకం చేపడతామని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు కోరినట్టు మణికుమారి తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి మాజీఎంపీ పప్పల చలపతిరావు నేతృత్వంలో కాకర నూకరాజు, రెడ్డి రామకృష్ణ, లాలం కాశీనాయుడు, వేజర్ల వినోద్, కె.వెంకటేశ్వరరావు, బొల్లం బాబ్జీ, పెదవరపు శివ, తదితరులు 18మంది సభ్యులుగా గల కమిటీని ఏర్పాటు చేశారు.

వారంరోజులపాటు వీరిని నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు పరిశీలించి నివేదిక అందజేయాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వారిని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయాలని వారిని కోరారు. వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టిక్కెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు
:పాడేరు, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కన్వీనర్ల నియామక ప్రక్రియపై టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం కసరత్తు జరిపారు. చంద్రయ్యపాలెంలో రెండు నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు నేరుగా మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని పటిష్ఠపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను పార్టీ నాయకులతో చర్చించారు.

ఇన్‌చార్జీల నియామకంపై అబిప్రాయాల సేకరణ

మాకవరపాలెం
: తీవ్ర అనారోగ్యానికి గురైన తనకు చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారని గూడెంకొత్తవీధి మండలం గొందిపాకలు మాజీ సర్పంచ్ బౌడ గోపాలరావు తెలిపారు. గురువారం మండలంలోని చంద్రయ్యపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. సర్పంచ్‌గా, టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేశానని, 15 ఏళ్ల నుంచి మండలంలో పార్టీ అభివృద్ధికి పాటు పడ్డానని చెప్పారు.

తొమ్మిది సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చిందని, వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేదని వాపోయారు. దీంతో చంద్రబాబునాయుడిని కలిసి తన పరిస్థితి గురించి చెప్పానని, దీంతో స్పందించిన ఆయన చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు.

చికిత్స ఖర్చు పార్టీ భరిస్తుంది

తిరుపతి/రేణిగుంట : రాజకీయాలు నాన్న చూసుకుంటారంటూ చంద్రబాబు తనయుడు
నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పీలేరులో హెరిటేజ్ డెయిరీ తరపున పాడి రైతుల సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి గురువారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఉదయం విమానాశ్రయం వద్ద, సాయంత్రం తిరుపతిలోని హోటల్ వద్ద లోకేష్‌ను పలువురు టీడీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ వ్యవహరాల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించినా లోకేష్ ఆ అవకాశం ఇవ్వలేదు. 'నేను డెయిరీ పనిగా వచ్చాను. ఇప్పుడు రాజకీయాలు వద్దు. నాన్న (చంద్రబాబు) పాదయాత్ర కూడా ముగుస్తోంది కదా.

ఇక ఆయన ఫ్రీగా ఉంటారు. ఆయనే చూసుకుంటారు' అని నాయకులకు సర్దిచెప్పారు. ఆయన్ను కలిసిన వారిలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, పార్టీ నాయకులు నరసింహయాదవ్, సూరా సుధాకర్‌రెడ్డి, నీలం బాలాజీ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పుష్పలత, నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రవి, టీఎస్ఎన్వీ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాసచౌదరి, కోడూరు బాలసుబ్ర హ్మణ్యం తదితరు లు ఉన్నారు. కాగా, ఉదయం 8.40 గం టలకు రేణిగుంట చేరుకున్న లోకేష్.. పీలేరు పర్యటన ముగించుకుని సాయంత్రం మళ్లీ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణ మయ్యారు.

రాజకీయాలు నాన్న చూసుకుంటారు

శాన్ హొసె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించే లక్ష్య సాధనలో భాగంగా అందరూ చంద్రబాబు నాయుడుకు మద్దతు ప్రకటించాలని బే ఏరియా టి.డి.పి. కోరింది. ఆంధ్ర ప్రదేశ్ బంగారు భవితవ్యంకోసం అందరూ శనివారంనాడు కదిలిరావాలని ఈ సంస్థ కోరింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ శనివారం మధ్యాహ్నం మిల్‌పిటాస్‌లోని సత్యనారాయణ ఆలయంలో పూజ జరుగుతుందని, ఆ తర్వాత సంఘీభావ యాత్ర జరుగుతుందని సంస్థ నిర్వాహకులు వివరించారు.
: తెలుగు దేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వస్తున్నా.. మీకోసం పాదయాత్ర 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో శనివారంనాడు సంఘీభావ యాత్ర నిర్వహిస్తున్నట్టు బే ఏరియా ఎన్.ఆర్.ఐ. టి.డి.పి. వెల్లడించింది.

మిల్‌పిటాస్‌లో 20న చంద్రబాబు సంఘీభావ యాత్ర

హైదరాబాద్ : తిరుమలలో వరుసగా రెండు అగ్ని ప్రమాదాలు జరగడంపై టీడీఎల్పీ ఉపనేత
ముద్దు కృష్ణమనాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. తిరుమల రక్షణను అధికారులు, ప్రభుత్వం గాలికి వదిలేశాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలకమండలి చైౖర్మన్, సభ్యులు.. ప్రముఖులకు స్వాగతాలు పలికి, దర్శనాలు చేయించడానికే పరిమితమయ్యారని, భక్తుల అవసరాలు, శ్రేయస్సును పట్టించుకొనే నాథుడే లేకుండా పోయాడని ఆయన ఆరోపించారు.

తిరుమలలో ఏమిటీ ప్రమాదాలు: ముద్దు కృష్ణమ

హైదరాబాద్: చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 27న విశాఖలో నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లలో భాగంగా నియమించిన సాంస్కృతికకమిటీలో సినీ నటులు మురళీమోహన్, ఏవీఎస్ నియమితులయ్యారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్, పార్టీ సాంస్కృతిక విభాగం నాయకుడు సాయిబాబా కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఆరుగురు నేతలతో మీడియా కమిటీ ఏర్పాటైంది. దీనికి పార్టీ మీడియా విభాగం అధ్యక్షుడు ఎల్‌వీఎస్ఆర్‌కె ప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరి స్తారు.

టీడీపీ కమిటీలో మురళీమోహన్, ఏవీఎస్

హైదరాబాద్: గాలి జనార్దనరెడ్డి గనుల దోపిడీపై తమ ఆరోపణలన్నీ పూర్తి వాస్తవాలని సుప్రీం కోర్టు తీర్పుతో రుజువైనట్లు టీడీపీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు గురువారం ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్సీ వై.బి.రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. గాలి దోపిడీ గురించి 2006 నుంచీ ఆధారాలతో చెబుతున్నామని, మైనింగ్ మాఫియా అక్రమాలపై పుస్తకం ప్రచురించి పంపిణీ చేశామని గుర్తుచేశారు.

వైఎస్ అసలు కొడుకు...పెంపుడు కొడుకుల దోపిడీ గురించి ఇందులో సవివరంగా రాశామన్నారు. సుప్రీం తీర్పుతో అందులో ప్రతి అక్షరం నిజమని రుజువైనట్లు పేర్కొన్నారు. అలాగే జగన్‌కు, గజ్నవీకి చాలా పోలికలున్నాయని సుప్రీం కోర్టులో వివరించిన సీబీఐ న్యాయవాదికి కృతజ్ఞతలన్నారు.

'గాలి' దోపిడీపై మా ఆరోపణలన్నీ నిజమే!: టీడీపీ

ఇల్లు విడిచి నేను, ఇంట్లో చోటు లేక వాళ్లు..జనం ముంగిట నేను, జీవితం ముగింపులో వాళ్లు...ప్రజల సేవకు నేను అంకితమయినట్టే, తమ పిల్లలు, వారి పిల్లల సుఖ సంతోషాల కోసమే వారు బతుకుతారు. సామాన్యుడికి చెయ్యి అందించాలని నేను తపించినట్టే, కొడుకును ఓ ఇంటివాడ్ని చేయడానికి ఈ వృద్ధులూ ఆరాటపడతారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా రాజకీయాల్లో నేను కొనసాగగలుగుతున్నాను.

కానీ, ఈ వయసులో వీళ్లు ఎటు పోవాలి? గూడు ఉంటుంది.. కుటుంబం ఉంది.. కొడుకూకోడలు ఉన్నారు.. ముద్దులొలికే మనవలు, మనవరాళ్లూ ఉన్నారు. లేనిదల్లా కాళ్లు చాపుకునే చోటే! ఈ యాత్రలో అలాంటి వృద్ధులను ఎందరినో చూశాను. స్వయంగా కలిసి పరామర్శించాను. పింఛను పెంచుతామని, వృద్ధాశ్రమాలు కడతామని చెబుతున్నాంగానీ, అదొక్కటే చాలదు కదా! దాలింపేటలో కొందరు వృద్ధులు కలిశారు. ఎంతో దగ్గర మనిషిని చూసినట్టు చూశారు. కంటిచూపు ఆనక దగ్గరగా వచ్చి హత్తుకున్నారు. పైన చేతులు వేసి ఆప్యాయంగా తడిమారు. వారి పుత్రవాత్సల్యానికి కదలిపోయాను.

నడక మొదలుపెట్టి 200 రోజులు. ఎండయినా, వానయినా ఈ ప్రజల మధ్యే అనుభవించాను. పేదవాడిని, దళిత వాడని నా చిరునామా చేసుకున్నాను. ఒక జిల్లా అని కాదు..ఒక గ్రామం అని కాదు. ఎక్కడికి వెళ్లినా సమస్యలు పుట్టల్లా పగిలాయి. హిందూపురం నుంచి నర్సీపట్నం వరకు సంతోషంగా ఉన్న ఒక్క కుటుంబాన్నీ చూడలేదు. యాత్ర దాదాపు చివరకు వచ్చేసింది. కానీ, ఈ ప్రజల యాతనలకు మాత్రం దరి దొరకడం లేదు. ఎంతెంత దూరం అంటే..చివరి కన్నీటిబొట్టును సైతం తుడిచేంతదూరం అనేదే సమాధానం!

ఆ పుత్రవాత్సల్యం కదిలించింది!

'ఆయుష్మాన్‌భవ' ప్రకటించిన బాబు

హైదరాబాద్  అలాగే..అర్చకుల పదవీవిరమణ వయసును పెంచుతామని చంద్రయ్యపాలెంలో తనను కలిసిన రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. బ్రాహ్మణుల ఉద్యోగ,ఉపాధి అవకాశాలకు; ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బ్రాహ్మణులు సైతం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని, నాయకులుగా ఎదగాలని కోరారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టే ఆ లోచన ఉందని చెప్పారు.
: అధికారంలోకి వస్తే 60 ఏళ్లు దాటిన పేద బ్రాహ్మణులకు 'ఆయుష్మాన్‌భవ' పథకం కింద 1000 రూపాయల పింఛను ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సామాజికవర్గం సంక్షేమానికి రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

పేద బ్రాహ్మణులకు రూ.వెయ్యి పింఛను

వెయ్యి కోట్లతో చేనేత ప్రణాళిక
పేదలకు ఉచిత బియ్యం
విశాఖ పాదయాత్రలో చంద్రబాబు
రేపు వికలాంగుల మధ్య జన్మదినం

విశాఖపట్నం, మాకవరపాలెం: అధికారంలోకి వస్తే రూ.50 వేల కోట్లతో బీసీ ఉపప్రణాళిక అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏటా పది వేల కోట్లు చొప్పున ఈ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించి..బలహీన వర్గాల ఉన్నతికి దోహదం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం సుబ్బా రెడ్డిపాలెం వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చంద్రయ్యపాలెం, గంగవరం, దాలింపేట, కొండల అగ్రహారం, మాచవరం పాలెం మీదుగా 10.2 కిలోమీ టర్లు నడిచారు.

జనాభాలో 50 శాతంగా ఉన్నా..బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని ఈ సంద ర్భంగా జరిగిన పలు సభల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని సరిదిద్దేందుకు ప్రత్యేక ఉప ప్రణాళిక తీసుకువస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లు, ఎన్నికల్లో వంద సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అవకాశం ఇస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటానని ప్రజలను కోరారు. "రానున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.ప్రలోభాలకు, మాయమాటలకు లోను కావొద్దు'' అని చంద్రయ్యపాలెం- గంగవరం గ్రామాల్లో జరిగిన సభల్లో విజ్ఞప్తి చేశారు.

సీఎం కిరణ్ దోపిడీ సామ్రాజ్యం చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు విస్తరించిందని దుయ్యబట్టారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు. "ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లేని ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో జగన్ లక్ష కోట్ల ఆస్తి ఎలా సంపాదించార ు? వైఎస్, ఆయన కుమారుడి అవినీతిపై దర్యాప్తు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు..మహ్మద్ గజనీకంటే ఘోరంగా దోచుకున్నట్టుగా నిర్ధారించారు'' అని గుర్తుచేశారు.

తెలుగుదేశం పార్టీ నిప్పులాంటిదని, ముట్టుకునేందుకుగానీ, ఆరోపణలు చేసేందుకుగానీ అవకాశం ఇవ్వబోమన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఉచిత బియ్యం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కిలో రూపాయి బియ్యం పథకాన్ని ఎగవేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 'నగదు బదిలీ' తెస్తున్నదని దుయ్యబట్టారు. చేనేత కార్మికుల కోసం రూ. వెయ్యి కోట్లతో ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తామని చెప్పారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, శనివారం తన పుట్టినరోజు వేడుకలను ఆయన వికలాంగుల నడుమ జరుపుకోనున్నారు.

బీసీలకు 50వేల కోట్ల ప్రణాళిక! ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తా