April 14, 2013

లబ్బీపేట: ప్రభుత్వంలోని మం త్రులందరూ అవినీతిలో కూరుకుపోవడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు పాదయాత్రను చూస్తే జాలేస్తుందని మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ హయాంలో వివాదాస్పద జీవోలు జారీ చేసి జగన్‌కు సహకరించారంటూ జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఆరోపణలెదుర్కొంటున్నారని, ఓ మంత్రి జైలు ఊచ లు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఏకంగా హోం మంత్రిపై చీటింగ్ కేసు, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పార్థసారథిపై ఏకంగా కోర్టు జైలు శిక్ష, వాక్స్ వాగన్ నుంచి సారా కుంభకోణం వరకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తదితరులపై వున్న అభియోగాల చిట్టా విప్పితే సిగ్గుతో తలదించుకుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో అధికారులు, ఐఏఎస్ అధికారులు పరిపాలనను చీదరించుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ 2700 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విమర్శించే హక్కు కాం గ్రెస్ నాయకులకు లేదన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పే సాక్ష్యాన్ని నమోదు చేసి తద్వారా మిగిలిన మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

ప్రభుత్వమే జగన్‌ను కాపాడుతోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జైలులో జగన్ సమీక్షలు, ములాఖత్‌లు నిర్వహించడం వెనుక ప్రభుత్వ సహకారం లేదా అని ప్రశ్నించారు. ఇకపై ఎదుటి వారిపై బురద చల్లడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు గొట్టిపాటి హితవు పలికారు. సమావేశంలో టీడీపీ నాయకులు చిరుమామిళ్ల సూర్యం, కోలుకొండ వెంకటేశ్వరరావు, కొత్తా నాగేంద్రకుమార్, పొనుగుమాటి శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.

అవినీతి మంత్రులను అసహ్యించుకుంటున్న ప్రజలు

నర్సీపట్నం:జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్రలో జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతల తనయులు కీలకపాత్ర పోషించారు. పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయులు రత్నాకర్, విజయ్‌బాబులు ఇరువురూ పాదయాత్ర తొలిరోజున చంద్రబాబుకు అండగా కుడిఎడమలుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరభద్రరావు తనయుడు రత్నాకర్‌కు ఇటీవలె గ్రామీణ జిల్లా పార్టీ అధ్యక్షత బాధ్యతలను అప్పగించగా, అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌బాబుకు త్వరలో తెలుగు యువత రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శుక్రవారం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసేంతవరకు విజయ్, రత్నాకర్‌లు చంద్రబాబు వెన్నంటి వున్నారు. పాదయాత్రలో సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, పప్పల చలపతిరావు రెడ్డి సత్యనారాయణ, అప్పలనర్సింహరాజు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్‌రాజు, రామానాయుడు వంటి నేతలు పాల్గొన్నా వారెవరూ చంద్రబాబు వెంట ఎక్కువగా కనిపించలేదు. అయితే ఇరువురు యువనేతలు చంద్రబాబుకు అంటిపెట్టుకొని ఉండడం గమనార్హం.

చంద్రబాబు సైతం వారిరువురితోనే ఎక్కువగా చర్చిస్తూ వారిచెప్పిన సమాచారాన్ని వింటూ బహిరంగసభల్లో వేదికపైకి ఆహ్వానిస్తూ తగు ప్రాధాన్యం కల్పించారు. రానున్న ఎన్నికల్లో యువతకు అవకాశాలు కల్పిస్తామనడానికి సూచనగానే చంద్రబాబునాయుడు జిల్లాలో ఇరువురు సీనియర్ నేతల కుమారులకు తగు ప్రాధాన్యం ఇచ్చినట్టు భావిస్తున్నారు. వీరిరువురి బాటలోనే మరికొందరు నాయకుల వారసులు కూడా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం అవుతున్నది. అయితే వీరిలో కొంతమందికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు లభించవచ్చునని పార్టీ వర్గాల సమాచారం.

ఇటీవల కాలంలో పార్టీపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చంద్రబాబునాయుడుతో జిల్లాకు చెందిన సీనియర్ నేతలు దాడి వీరభద్రరావు, అయ్యన్నపాత్రుడులకు మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ పదవి విషయంలో దాడి అసంతృప్తితో వున్నారు. శుక్రవారం ప్రారంభమైన పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు. అయితే శనివారం నాటికి కొంత మెత్తబడిన ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెందుర్తిలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పట్లో అయ్యన్నపాత్రుడు పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే జిల్లాకు సంబంధించి చంద్రబాబునాయుడుతో పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాలపై విభేదించిన ఇరువురు సీనియర్ నేతల కుమారులే శుక్రవారం చంద్రబాబు పాదయాత్రలో ప్రముఖ పాత్ర పోషించడం గమనార్హం.

యువతకు చేయూత

నర్సీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా... మీకోసం పాదయాత్రలో పరిస్థితులకనుగుణంగా అవసరమైతే మార్పులు చేపడతామని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడుతూ తీవ్రమైన కాళ్లనొప్పితో బాధపడుతున్న చంద్రబాబుకు రెండురోజుల విశ్రాంతి అవసరమని వైద్యనిపుణులు సిఫార్స్ చేయడం వల్లే పాదయాత్రను నిలుపుచేశామన్నారు. తొలిరోజున 12 కిలోమీటర్లకు బదులు కేవలం ఆరున్నర కిలోమీటర్లు నడవడంతో శృంగవరంలో రాత్రిబస ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. 15వ తేదీ రాత్రి డి.ఎర్రవరంలోనూ, 16వ తేదీన బలిఘట్టంలోనూ, 17వ తేదీన కొండలఅగ్రహారంలోనూ చంద్రబాబు రాత్రి బస ఉంటుందని, అయితే వైద్యనిపుణుల సూచనలు, ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే ప్రతీరోజూ నడిచే దూరాన్ని తగ్గించి రాత్రిబసలు పెంచుతామని చెప్పారు.

పెండింగ్ ప్రాజెక్టులపై నివేదిక


రెండున్నర దశాబ్దాలపాటు నర్సీపట్నం నియోజవకర్గ ప్రతినిధిగా కొనసాగిన తన హయాంలో ఇంకా చేపట్టవలసిన పెండింగ్ ప్రాజెక్టులపై ఒక నివేదికను రూపొందించి చంద్రబాబునాయుడుకు అందజేయనున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినవెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని, ఇదే విషయాన్ని నర్సీపట్నంలో చంద్రబాబు ద్వారా ప్రకటింపజేస్తామని అన్నారు.

16న పేటపై సమీక్ష

విశ్రాంతిలో ఉన్న చంద్రబాబు ఆదివారం కొద్దిసేపు మాత్రమే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారని, ఇందుకోసం శృంగవరంలోనే ఏర్పా ట్లు చేశామన్నారు. మంగళవారం మధ్యాహ్నం డి.ఎర్రవరంలో పాయకరావుపేట నియోజవకర్గ రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారని, బుధవారం బలిఘట్టంలో నర్సీపట్నం నియోజవకర్గంపైన, గురువారం కొండలఅగ్రహారంలో పాడేరు నియోజవకర్గ పరిస్థితులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు.

అవసరమైతే పాదయాత్రలో మార్పులు

దత్తిరాజేరు : కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే హక్కులేదని గజపతినగరం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు కరణం శివరామకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని మరడాంలో విద్యుత్ ధరలు, కోతలపై సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కన్నా తుగ్లక్ పాలన మిన్నా అని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూ డా ధరలు పెంచలేదన్నారు. అత్యంత దారుణంగా విద్యుత్ ధరలు పెంచి విద్యుత్ సంక్షోభానికి కారణం అయ్యారని, ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలోకి వెళ్తుందన్నారు.

రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు తెలుగుదేశం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులను జైలుకు పంపే రోజులు వస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. సంతకాల సేకరణకు ప్రజల నుంచి మంచి మద్ద త వస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతుందన్నారు. ప్రభు త్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ కంది తిరుపతినాయుడు, మం డల పార్టీ అధ్యక్షుడు గంటా త్రినాధరావు, నాయకులు తాడి సాంబమూర్తి, రాగోలు బంగారి, పార్టీ

రాష్టాన్ని పాలించే హక్కు కాంగ్రెస్‌కు లేదు

తాడేపల్లిగూడెంటౌన్ : రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలను నిర్మూలించి నీతివంతమైన పాలన రావాలంటే చం ద్రబాబు నాయకత్వం కావాలని ప్రజ లు కోరుకుంటున్నారని తెలుగుదేశం రాష్ట్రనాయకుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. తాడేపల్లిగూడెం న ర్సింహరావుపేటలోని శ్రీ విశ్వదురే ్గశ్వ రి ఆలయాన్ని శనివారం సందర్శించా రు. అమ్మవారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పా లనలో రాష్ట్రం అ«థోగతి పాలైందన్నా రు. అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం 12వ స్థానానికి దిగజారిందని దుయ్యబట్టారు. మంత్రులే అవినితీ కుంభకోణాల్లో కేసులు ఎదుర్కొనడం దేశంలొనే తొలిసారన్నారు. వి ద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి సా మాన్య ప్రజలు, రైతులపై పెనుభారం మోపిందని విమర్శించారు.

అన్ని రం గాల్లోనూ రాష్ట్రం వెనుక బడిందన్నా రు. రాష్ట్రంలో నీతివంతమైన పాలన నెలకుని అభివృద్ధి ప«థంలో పయనించాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా విద్యుత్ కోతలు విధించి భారీగా చార్జీ లు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల న డ్డి విరిచించన్నారు. రాష్ట్రన్ని ప్రగతి ప«థంలో నడిపించేందుకు చంద్రబాబు పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా పలువు రు మహిళలు తమ సమస్యలను మురళీమోహన్, సీతారామలక్ష్మిలకు ఏకరువు పెట్టారు.

కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి ముళ్ళపూడి బాపిరాజు, టీవీ నటుడు సాయిరామ్, రాష్ట్ర కార్యదర్శి కిల్లాడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరావు, పట్టణ అధ్యక్షుడు గొర్రెల శ్రీధర్ మం డల అధ్యక్ష కార్యదర్శులు కోరశిఖ ము నేశ్వరావు, నిరంజన్, యువత జిల్లా నాయకుడు పద్మనాభుని మురళి మో హన్‌గుప్త, పట్టణాధ్యక్షుడు కృష్ణమోహన్, నియోజకవర్గ యువనాయకు డు పసల కొండ, పసుమర్తి రాంలక్ష్మ ణ్, డీసీసీబీ డైరెకర్ట్ దాస రి అప్పన్న, సూరపురెడ్డి నాగేశ్వరావు, ఎరుబండి సతీష్, తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు కొండ్రెడ్డి హైమవతి, తదితరులు పాల్గొన్నారు.

బాబు పాలన కోరుకుంటున్న ప్రజలు

నల్లజర్ల: విద్యుత్తు సమస్యలను వెం టనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీడీపీ నాయకుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కా రం కోరుతూ నల్లజర్లలో శనివారం ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేపట్టా రు. ర్యాలీగా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఏడీఈ ఓంకార్, ఏఈ నరసయ్య ఉన్న తాధికారులతో మాట్లాడారు. మెట్ట ప్రాంత రైతులకు ఏడుగ ంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాచేయాలని అప్రకటిత కరెంట్ కోతలకు స్వస్తి చెప్పాలని, విద్యుత్త చార్జీలను వెంటనే తగ్గించాలని నాయకులు డిమాండ్ చే శారు. మురళీమోహన్ నేరుగా విద్యుత్ ఎస్ఈతో ఫోన్‌లో మాట్లాడారు. రోజుకు 7 గంటల కరెంటును రెండు దపాలుగా ఇస్తానని ఎస్ఈ హా మీ ఇవ్వడంతో ఆందోళన విరమించా రు.

కొవ్వూరు ఎమ్మెల్యే టీవి రామారావు, తాడేపల్లిగూడెం ఇన్‌చార్జ్ ముళ్లపూడి బాపిరాజు, నల్లజర్ల మండల అ ధ్యక్షులు ఎస్‌కే మీరా, కార్యదర్శి కూచిపూడి భాస్కరరావు, గోపాలపురం, ద్వారకాతిరుమల, దేవరపల్లి మండల టీడీపీ అధ్యక్షులు గద్దే హరిబాబు, వడ్లమూడి ప్రసాద్, సుంకర దుర్గారావు, కొయ్యలమూడి చినబాబు, ఏపూరి దాలయ్య, ముప్పిడి వెంకటేశ్వరరావు, సొసైటి అధ్యక్షులు ముప్పిడి వెంకటేశ్వరరావు, అల్లాడ రాజారావు, శ్రీను, మాజీ సర్పంచ్ మల్లిపూడి కృష్ణారావు, దాసిన సత్యనారాయణ, తలంశెట్టి చినవెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమలకు చెందిన 30 మందికి మురళీమోహన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

'విద్యుత్ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం'

తిరుపతి సిటీ: సొంత నియోజక వర్గంలో ఒక పంచాయతీ ప్రెసిడెంట్‌ను కూడా గెలిపించుకోలేని ఫ్లైయింగ్ ఫ్రెండ్ నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని నగరి ఎమ్మెల్యే గాలిముద్దు కృష్ణమనాయుడు
ధ్వజమెత్తారు. తిరుపతిలో శనివారం విలేకరులతో మాట్లాడారు. 63 సంవత్సరాల వయస్సులో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి 195 రోజులుగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసరడం బాధాకరమన్నారు. కలికిరి, ఢిల్లీ చుట్టూ విమానాల్లో ప్రదక్షిణ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో కిరణ్ కీలుబొమ్మగా తయారయ్యారన్నారు. అవినీతి మంత్రులను తొలగించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.

రాజ్యాంగంలోనే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక చట్టం వుండగా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, ఎన్టీఆర్ హయాంలోనే ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు విద్య, వైద్య రంగాల్లో న్యాయం జరిగిందన్నారు. నల్లబెల్లంపై ఆంక్షలు విధించి చెరకు రైతులను ప లు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కిరణ్ ప్రభుత్వం త్వరలోనే పతనం కాక తప్పదని జోస్యం చెప్పారు. జైల్లో ఉండాల్సిన టీటీడీ ఈవోకు సీఎం కిరణ్ అభయహస్తం ఇవ్వడం చూస్తుంటే దొంగల రాజుగా ఆయన్ను అభివర్ణించాల్సి వస్తోందన్నారు.

కిరణ్‌కు బాబును విమర్శించే అర్హతేదీ?

నాతవరం/గొలుగొండ: చంద్రబాబునాయుడు పాదయాత్ర సోమవారం తిరిగి ప్రారంభమవుతుందని పాదయాత్ర ఇన్‌చార్జి, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గరికపాటి రామ్మోహనరావు తెలిపారు. శనివారం శృంగవరంలోని చంద్రబాబు క్యాంప్ కార్యాలయం వద్ద విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ శనివారం విజయవాడకు చెందిన ఆర్ధోపెడిక్ శ్రీనివాసు వచ్చి చంద్రబాబునాయుడు కాళ్లనొప్పులకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు. అయితే 15వ తేదీన కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు పాదయాత్ర ఉంటుందని, సోమవారం రాత్రి డి.ఎర్రవరం మదర్ కాలేజీలో చంద్రబాబు బస చేస్తారని తెలిపారు.

రేపటి నుంచి తిరగి పాదయాత్ర

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ నేత మోత్కుపల్లి నర్శింహులు ఆరోపించారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న కోదండరామ్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు.

అంబేద్కర్ జయంతి సభలో కూడా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు తాము వ్యతిరేకం కాదని మోత్కపల్లి చెప్పారు. మాదిగ, మాలల్లో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉద్యమం పేరుతో కోట్లు దోచుకున్న కోదండరాం : మోత్కుపల్లి

తిరుపతి : చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం పర్యటిస్తున్న సందర్భంగా ఆయన కార్యక్రమాలను అడ్డుకునేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నేతలను ముందస్తుగా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్టమలను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అయితే వారు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళను దిగారు.

తిరుపతిలో టీడీపీ నేతల అరెస్టు