April 12, 2013

కాళ్లు నొప్పి పుట్టినా పాదయాత్రను కొనసాగిస్తానని చంద్రబాబు తేల్చి చెప్పారు. పంటి బిగువున బాధను తొక్కిపట్టి ఆ యన ముందుకు సాగుతున్నారు. కాళ్ల నొప్పులు, చిటికెన వేలు వాపుతో రోజుకు పది కిలోమీటర్లు నడవడం మంచిది కాదని డాక్టర్లు స్పష్టం చేశారు. వారి సూచనను కూడా చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారు. "సమున్నత లక్ష్యానికి చిన్న చిన్న సమస్యలు ఆటంకాలు కారాదు. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే రాజీ పడలేను. కాళ్లు నొప్పి పుట్టినా పాదయాత్ర ఆపను. చిటికెన వేలు బాగా ఇబ్బంది పెడుతోంది. అయినా మీ సమస్యల ముందు నాది పెద్ద సమస్య కాదు'' అని బాబు అన్నారు

పాదయాత్ర కొనసాగిస్తా:బాబు

ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావుపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ చక్రపాణికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటా నుంచి టీడీపీ తరఫున గెలిచిన బొడ్డు.. ఇటీవల వైసీపీలో చేరారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయనను శాసన మండలి సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీలు అరిగెల నర్సారెడ్డి, గంగాధర్ గౌడ్, అంగర రామ్మోహనరావు తదితరులు శుక్రవారం మండలి చైర్మన్‌కు ఒక లేఖ అందచేశారు.

బొడ్డు'పై అనర్హత వేటుకు టీడీపీ ఫిర్యాదు

కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

"2014 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలి. సీట్లే కాదు.. నియోజక వర్గాల్లో ఓట్లు కూడా భారీగా వచ్చేలా కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రయత్నించాలి. కాంగ్రెస్ చేతకాని పాలన, అవినీతిపైనా, వైసీపీ అక్రమాలు, అరాచకాలపైనా పుస్తకాలు ప్రచురించి విస్తృత ప్రచారం చేస్తాం. కార్యకర్తలు కూడా పత్రికల్లో వచ్చే కథనాలు, ఎస్ఎంఎస్‌ల ద్వారా తల్లి, పిల్ల కాంగ్రెస్ ఆగడాలపై ప్రజలకు అవగాహన కల్పించండి'' అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా డిక్లరేషన్‌ను వెల్లడించారు. తూర్పు గోదావరిలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో.. కాపుల్లో పేదల కోసం ఏటా రూ.1000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5000 కోట్ల ప్యాకేజీ ఇస్తామని కీలక ప్రకటన చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. తాను అ«ధికారంలోకి వస్తే విలేకరులకు ఇంటి స్థలాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంచల్‌గూడలో కేబినెట్ మీటింగ్
"కిరణ్ కిరికిరి సీఎం. దొంగ మంత్రుల కేబినెట్‌కి అధ్యక్షుడు. విద్యుత్తు భారం రూ.6,500 కోట్లు వేసి, అందులో రూ.800 కోట్లు తగ్గించి కిరికిరి చేస్తున్నాడు. నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు'' అని చంద్రబాబు దుయ్యబట్టారు. శుక్రవారం సాయంత్రం బాబుకు విశాఖ జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. ఇక్కడ వివిధ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ, "టీడీపీని స్థాపించి ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. కాంగ్రెస్, వైసీపీ నేతలు అవినీతితో ర్రాష్టానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఈ కేబినెట్‌ను చూసి అంతా నవ్వుకుంటున్నారు.

ఒకరి తర్వాత ఒకరుగా అందరిపైనా సీబీఐ కేసులు పెడుతోంది. మాజీ సీఎం కుమారుడు జగన్‌పై 420 కేసు నమోదైంది. ఓ పెద్ద మనిషి వల్ల వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ విశాఖకు రాకుండాపోయింది. చీటింగ్ చేసిన పెద్ద మనిషి పీసీసీ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్నాడు. మరో మంత్రి హైదరాబాద్‌లో కోట్ల రూపాయ ల భూములు కబ్జా చేసి అడిగిన వారిపై తిరగబడుతున్నాడు. రౌడీలతో కొట్టిస్తున్నాడు'' అంటూ పరోక్షంగా దానంపై ధ్వజమెత్తారు. పైలాన్ నిర్మాణణనికి బ్రేక్: పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా విశాఖ నగర శివారు వడ్లపూడిలో నిర్మిస్తున్న పైలాన్ పనులకు శుక్రవారం ఉక్కు భూ సేకరణ విభాగం బ్రేక్ వేసింది.

పైలాన్ నిర్మించతలపెట్టిన స్థలం ఉక్కు భూ సేకరణ విభాగానికి చెందినదని, పైలాన్ నిర్మాణ పనులను నిలిపి వేయాలని ఉక్కు భూ సేకరణ విభాగం డిప్యూటీ తహసిల్దార్ సిద్ధయ్య, గాజువాక తహసిల్దార్ సింహాద్రిరావు స్పష్టం చేశారు. అయితే, ఎస్సీ కోటాలో పెట్రోల్ బంక్ నిర్మాణం నిమిత్తం ఉక్కు భూ సేకరణ విభాగం నుంచి 1.68 ఎకరాల భూమిని మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేశానని, పైలాన్ నిర్మిస్తున్న స్థలం తనదేనని స్థల యజమాని చక్రవర్తి స్పష్టం చేశారు.
"కార్యకర్తలంతా జెండాలు మోసీ మోసీ అలిసిపోయి ఉన్నారు. ఇంకెన్నాళ్లని మోస్తారు. 2014 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందే. సర్వ శక్తులూ ఒడ్డి పోరాడాల్సిన ఎన్నికలు రాబోతున్నాయ్. ఇది ఫైనల్ ఎలక్షన్. అవసరమైతే పార్టీ కోసం కొంత సొమ్ము ఖర్చు చేయాలి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది ఆఖరి పోరాటమన్న సంకేతాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో 24 రోజుల్లో 243.5 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబు.. శుక్రవారం విశాఖలో అడుగుపెట్టారు.

ఆఖరి పోరాటం! 2014లో చావో రేవో..సర్వశక్తులూ ఒడ్డి పోరాడదాం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం ప్రారంభమవుతోంది. ఆయన తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లిలో యాత్ర ముగించుకొని సాయంత్రం విశాఖ జిల్లా నాతవరం మండలం గన్నవరం మెట్టలో అడుగుపెడతారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో బాబు యాత్ర 12వ తేదీన మొదలై 27వ తేదీన ముగుస్తుంది.

ఈ 15 రోజుల్లో 112 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటారు. పాదయాత్ర ముగింపు చిహ్నంగా పైలాన్ ఆవిష్కరణకు పార్టీ నిర్ణయించింది. గాజువాక సమీపానున్న వడ్లపూడిలో 1000 గజాల స్థలంలో 70 అడుగుల ఎత్తైన పైలాన్ నిర్మాణానికి గురువారం ఉదయం శంకుస్థాపన జరిగింది.

చంద్రబాబు విశాఖపట్నం జిల్లా యాత్రలో అన్నీ విశేషాలే చోటుచేసుకోనున్నాయి. ఆయన పుట్టిన రోజు ఇక్కడే జరగనుంది. అలాగే 200వ రోజు యాత్ర కూడా ఈ జిల్లాలోనే జరుగుతుంది. శ్రీరామనవమి వేడుకలు కూబా బాబు విశాఖ జిల్లా వాసుల మధ్యే జరుపుకొంటారు. వస్తున్నా మీకోసం యాత్రను జిల్లాలోనే ముగించి, అందుకు చిహ్నంగా గాజువాకలో పైలాన్ ఆవిష్కరిస్తారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వేదిక కానుంది.

వర్గ విభేదాలు...నాయకత్వ సమస్యలు

బాబు యాత్ర కోసం పార్టీ నాయకులు, శ్రేణులు చాలా ఉత్సాహంగా వేచిచూస్తున్నాయి. ఈ యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు గత పదిహేను రోజుల నుంచి ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. జిల్లా ప్రధాన నాయకుల మధ్య సమన్వయం లేకపోయినా అటు జిల్లా కన్వీనర్ దాడి రత్నాకర్, ఇటు నగర కన్వీనర్ వాసుపల్లి గణేశ్‌కుమార్‌లు ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకొంటూ యాత్రకు ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా పార్టీ అధినేత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను సమీక్షించి తగిన చికిత్స చేయాల్సి ఉంది. ముఖ్యంగా కీలకమైన ఎలమంచిలి, గాజువాక, భీమిలి, పాడేరు నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చి కలుపుకొని వెళ్లేలా సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలమంచిలిలో లాలం భాస్కరరావు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే అక్కడ సుందరపు విజయకుమార్ కూడా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నాయకులతో పాటు జిల్లా పార్టీ పెద్దలు కూడా సుందరపునే ప్రోత్సహిస్తున్నారు. ఇది సహించలేదని లాలం తాను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పుకుంటానని గొడవ చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంది. పాడేరులో పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదంటున్నారు. మాజీ మంత్రి మణికుమారి ఒంటరి కావడంతో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా సాగడం లేదు. బొర్రా నాగరాజు, మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ తనయుడు ప్రసాద్ ఆమెకు పోటీగా తయారయ్యారు. దాంతో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు ఎవరీకి కట్టబెట్టలేదు. ఈ ముగ్గురితో కమిటీ వేసి కాలక్షేపం చేస్తున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇక నగరంలో కీలకమైంది గాజువాక. ఇక్కడ ఐదుగురు సభ్యుల కమిటీతోనే ఏళ్లుగా పార్టీ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా గుడివాడ నాగమణి, కోన తాతారావు, హర్షవర్దన్, కాకి గోవింద్‌రెడ్డి, పల్లా శ్రీను, లేళ్ల కోటేశ్వరరావులు పోటీ పడుతున్నారు. వీరు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేపడుతున్నారు.

కొన్నిసార్లు వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ మధ్యేమార్గంగా ఏదో ఒకటి చేసి పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఇక భీమిలి నియోజకవర్గం అనాధగా మారింది. ఎప్పటి నుంచో ఉన్న మాజీ ఎమ్మెల్యే అప్పలనరసింహరాజును కాదని గత ఎన్నికల్లో ఆంజనేయరాజుకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆయన ఇటీవల వైఎస్ఆర్ పార్టీలోకి మారిపోయారు. దాంతో పార్టీకి ఇన్‌చార్జి లేకుండా పోయారు. తక్షణమే ఈ ఖాళీని భర్తీ చేసి ఇతర పార్టీలకు ధీటుగా కార్యక్రమాలు చేపట్టి భీమిలి తెదేపాకు కంచుకోట అని మరోసారి నిరూపించాల్సిన సమయం వచ్చింది.

ఇదిలావుంటే జిల్లాలో ప్రధాన నాయకుల మధ్య సఖ్యత లేదు. వీరంతా ఒకే కార్యక్రమానికి హాజరు కావడం చాలా అరుదు. ఈ నాయకుల్ని ఓ తాటి మీదకు తెచ్చి సభలు, సమావేశాలు నిర్వహించడం అటు జిల్లా కన్వీనర్‌కు, ఇటు నగర కన్వీనర్‌కు తలకు మించిన భారమవుతోంది. దీన్ని కూడా సరిదిద్దాల్సి ఉంది.

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర


నాతవరం: 'వస్తున్నా మీకోసం' అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు శుక్రవారం సాయంత్రం నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా భారీఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం సాయంత్రం గన్నవరం వచ్చిన ఆయన చంద్రబాబు కోసం చేపట్టిన స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చేసరికి చంద్రబాబు పాదయాత్ర 2,750 కిలోమీటర్లు పూర్తవుతుందని, విశాఖ జిల్లాలో 130 కిలోమీటర్ల మేద పాదయాత్ర ఉంటుందని తెలిపారు.

శుక్రవారం సాయంత్రం గన్నవరంమెట్ట, ఎ.శరభవరం, శృంగవరం, గాంధీనగరం మీదుగా డి.ఎర్రవరం చేరుకొని రాత్రికి అక్కడ బసచేస్తారన్నారు. 13వ తేదీ ఉదయం పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన నాయకులతో చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విశాఖడెయిరీ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. 13వ తేదీ సాయంత్రం డి.ఎర్రవరం నుంచి బయలుదేరి ములగపూడి, ఎం.బెన్నవరం, బయపురెడ్డిపాలెం మీదుగా బలిఘట్టం చేరుకుని అక్కడ బసచేస్తారన్నారు. 14వ తేదీ ఆదివారం పాదయాత్ర వుండదని, అయితే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 600 మంది దళితుల సమక్షంలో చంద్రబాబు ఉత్సవాలను నిర్వహిస్తారన్నారు. 15వ తేదీ ఉదయం బలిఘట్టంలో పాడేరు నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని, సాయంత్రం నర్సీపట్నం మీదుగా కొండలఅగ్రహారం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారని చెప్పారు. 16వ తేదీ ఉదయం చోడవరం నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని, సాయంత్రం అక్కడ నుంచి మాకవరపాలెం మీదుగా కన్నూరిపాలెం వరకు పాదయాత్ర చేస్తారని చెప్పారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర 27వ తేదీన ముగుస్తుందని, ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మూడు లక్షల మందితో బహిరంగ సభను నిర్వహిస్తామని అయ్యన్న చెప్పారు. ఈ కార్యక్రమంలో పరుచూరి కృష్ణ, లాలం అబ్బారావు, నందిపల్లి వెంకటరమణ, లగుడు హరిప్రసాద్, ఎన్.విజయ్‌కుమార్, పారుపల్లి కొండబాబు, సింగంపల్లి బాబు పాల్గొన్నారు.

స్వాగతానికి ఉప్పర్ల ఏర్పాట్లు

చంద్రబాబునాయుడుకు మన్యపురట్ల సెంటర్‌లో భారీఎత్తున స్వాగతం పలకానికి ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖ జిల్లా ఉప్పర్ల సంఘం అధ్యక్షుడ ఎస్.చినఅప్పారావు, కార్యదర్శి నక్కా సింహాచలం తెలిపారు. జిల్లాలో ఉప్పర్లు అందరూ శుక్రవారం మధ్యాహ్నానికి మన్యపురట్ల సెంటర్‌కు చేరుకోవాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప్పర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.ఏడుకొండలు వస్తున్నారని, ఈ సందర్భంగా తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని వారు చెప్పారు.

భారీ ఎత్తున స్వాగతానికి ఏర్పాట్లు

గుంటూరు : ఫిరంగిపురం పర్యటనకు నేడు(శుక్రవారం) ఉదయం రానున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ నిరసన సెగ తగలనుంది. హైకోర్టుకు సీబీఐ సమర్పించిన ఛార్జీషీట్లలో నిందితులుగా ఉన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డిని తక్షణం కేబినెట్ నుంచి తొలగించాలన్నదే టీడీపీ ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్‌గా ఉన్నది. ఇప్పటికే సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని టీడీపీ రాష్ట్ర నాయకులు గాలి ముద్దుమకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఫిరంగిపురంలో సీఎంను అడ్డుకొని అవినీతి మంత్రులను తొలగించాలని డిమాండ్ చేసేందుకు ఎమ్మెల్యేలు సన్నద్ధమయ్యారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు. అలానే ఇతర ఎమ్మెల్యేలతో ఫోన్‌లో సంభాషించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించకుండా సీఎం తాత్సారం చేస్తుండటంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు కిరణ్ కేబినెట్‌లో బందిపోటు దొంగలున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అలానే ఎమ్మెల్యేలు పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పలుమార్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో సీఎం తీరును ఆక్షేపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆరుగురిని తొలగించాలని డిమాండ్ చేశారు. అలానే వారికి ప్రభుత్వం తరుపున అందజేస్తోన్న న్యాయసాయం పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఫిరంగిపురంలో సీఎం పాల్గొనే కార్యక్రమాల వద్దకు వెళ్లి అవినీతి మంత్రులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ అడ్డుకోవాలని పుల్లారావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు నిర్ణయించారు. దీంతో ఫిరంగిపురంలో ఉత్కంఠ నెలకొన్నది. సీఎం పర్యటనను అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు వ్యూహం రచిస్తున్నారన్న విషయం తెలుసుకొన్న పోలీసు, అధికారవర్గాలు ఎలాగైనా వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

ముఖ్యమంత్రికి టీడీపీ ఎమ్మెల్యేల సెగ


కాకినాడ: విజయనామసంవత్సరం. విజయాల వైపు దూసుకుపోదాం. ఇదే ఉత్సాహం, హుషారుతో ప్రజల్లోకి వెళ్తుంటే గెలుపు మనదే.. నంటూ టీడీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఏటా ఎవరి ఇళ్ల వద్ద వారు చేసుకునే ఉగాది పండుగను ఈసారి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కలసి చేసుకున్నామని సంబరపడుతున్నారు. ఈసందర్భంగా రాజమండ్రికి చెందిన ప్రముఖ పండితులు ప్రభల సుబ్రహ్మణ్య శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని చంద్రబాబు ఆసక్తిగా విన్నారు. బాబుతోపాటు పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు, చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణ, యనమల కృష్ణుడు, కొండబాబు, వర్మ, అప్పలరాజు, కొండయ్యదొర, పలువురు మహిళా నేతలు, యువకులు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పం చాంగ శ్రవణం ఆసక్తిగా ఆలకించారు.

అందరూ బాగుండాలి: చంద్రబాబు ఆకాంక్ష

ఆరుగాలం కష్టపడినా రైతులకు గిట్టుబాటురావడంలేదు. బడుగు, బలహీనవర్గాల జీవితాలు ఎఝ్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు వుండిపోతున్నారు. శ్రామికులు, రైతులు, వృత్తిపనివారు, చిరువ్యాపారులు, చేనేత, కమ్మ రి, కుమ్మరి, అందరి జీవితాలలోనూ ఈ విజయనామ సంవత్సరం వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.. అని చంద్రబాబు అన్నారు.

గెలిచి తీరాలి! తెలుగు తమ్ముళ్ల ఆకాంక్ష

చంద్రబాబు సమక్షంలో ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలలో ఉత్సాహం ఉకలేసింది. విజయనామ సంవత్సరంలో విజయం సా ధించాలని వాళ్లంతా ప్రతినబూనారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు పోతాయని పలువురు నేతలు ఆకాంక్షించారు.

సహజసిద్ధ జీవితాలకు వెనక్కిరావాలి: డాక్టర్ ప్రభల

ఆధునిక మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడని, పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలకు మళ్లీ మనం వెనక్కిరావాలని డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. ఉగాది పచ్చడిలో ఉండే ఔషధ గుణాలను ఆయన వివరించారు. వేప వంటివాటికి అమెరికావాళ్లు పేటెంట్ పొందడానికి ప్రయత్నించారని, భారతీయులు వేల సంవత్సరాల క్రితంచెప్పిన వాటిని అమెరికా వాళ్లు కనిపెట్టినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని పలు ఉదాహరణలతో డాక్టర్ ప్రభల వివరించారు.

ప్రభల సుబ్రహ్మణ్యం నిర్మొహమాటంగా పంచాంగ శ్రవణం చేశారని చంద్రబాబు కొనియాడారు.

చంద్రబాబు సీఎం కావాలి

- అజ్మీర్‌లో మొక్కిన గన్ని


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్నికృష్ణ మొక్కుకున్నారు. రాజస్థాన్ రాష్ట్ర అజ్మీర్ దర్గాకు వెళ్లిన ఆయన అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. అజ్మీరు నుంచి తీసుకువచ్చిన తలపాగాను ఉగాది వేడుకల్లో చంద్రబాబుకు బహుకరించారు. ముఖ్యమంత్రిపీఠం అధిరోహించాకా..మీరు అజ్మీర్ వస్తారని మొక్కుకున్నాను.. సార్ మొక్కుతీర్చాలి.. అని చంద్రబాబుకు గన్నికృష్ణ విజ్ఞప్తి చేశారు.

విజయీభవ..

రాజమండ్రి: విజయనామ ఉగాదికి ఓ ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చేదంతా ఎన్నికల సీజనే కావడంతో ఇది ఓ రాజకీయ ఉగాదిగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈసారి జిల్లా లో ఉగాది వేడుకలు నిర్వహించి పం చాంగ శ్రవణం చేయించుకున్నారు. ఇక పార్టీ నేతలు వేర్వేరుగా తమ జాతకాలు చూపించుకున్నారు. జ్యోతిష్య పండితులు తయారు చేసిన పంచాంగాలు చదువుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పంచాయతీ, ఎంపీటీసీలు, మండల పరిషత్, జెడ్పీటీసీలు, జడ్పీ, మున్సిపాల్టీల ఎన్నికలు ఈఏడాది ప్రా రంభం కావచ్చనే సంకేతాలు అందుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు వచ్చేడి ఏడాది అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి.

కొందరైతే ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం కూడా మొదలెట్టారు. దీంతో ఆయా పదవులు ఆశిస్తున్న రాజకీయనేతలంతా తమ నక్షత్ర, జాతకబలాలు చూసు
కుని రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. అవమానాలు, గౌరవాలు, ఆదాయా లు, వ్యయాల అంచనాలు తెలుసుకోవడంతో పాటు తమ భవష్యత్ కోసం తహతహలాడుతున్నారు.సుమారుగా ఆదివారం నుండి ఇదే పరిస్థితి. అందరిలోనూ ఒకవిధమైన ఆనందం.. జా తక బలంలో తమకు రాజకీయయో గం వుందని, అందువల్ల వచ్చే ఎన్నికలలో ఏదో పదవి లభిస్తుందనే మనోబలంతో చాలామంది నేతలు జ్యోతిష్య పండితులను ఆశ్రయిస్తున్నారు. ము ఖ్యంగా విజయనామ ఉగాది ఖచ్చితంగా తమ జీవితాలలో విజయాలు తెస్తుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యే పదవులు ఆశించేవాళ్లూ, ఇతర రాజకీయపార్టీలు ఆశించే వాళ్లు కూడా ఇదే ఆనందంతో ఉన్నారు. అంతేకాక ప్రత్యుర్థుల జాతకాలు తెసుసుకోవడానికి కూడా ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు. మొత్తానికి నేతలంతా ఈ ఉగాదిని రాజకీయ ఉగాది చేసేశారు.

రాజకీయ ఉగాది

ఆంధ్రజ్యోతి - కాకినాడ: కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను తరిమికొట్టి టీడీపీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా గురువారం తునిరూరల్ మండలం ఎన్. సూరవరం, ఎన్ఎస్ వెంకటనగరం, కాకరాపాల్లిలలో చంద్రబాబు నడిచారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ వెంకటనగరం సభలో చంద్రబాబు ప్రసంగించారు. కాంగ్రెస్ దొంగలకు ఎన్నికల ముందు వాగ్ధానాలు చేసి తర్వాత మోసగించడం ఆనవాయితీ అని చంద్రబాబు అన్నారు.

'అమ్మ హస్తం' పథకంలో తొమ్మిది వస్తువులు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి దానకర్ణుడిలా ఫోజుకొడుతున్నారని, పేదలకు ఉపయోగపడే పనులు చేయలేని ముఖ్యమంత్రి ప్రజలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

టీడీపీని గెలిపిస్తే తునిరూరల్ మండలంలో పలు గ్రామాలకు తాండ వ నుంచి తాగు, సాగునీరు వచ్చే ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

శెట్టిబలిజ నేతలతో సమావేశం

గురువారం చంద్రబాబు నాయుడు జిల్లా శెట్టబలిజ నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదని కొంతమంది నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. గత ఎన్నికలలో కాకినాడ పార్లమెంటు, కొత్తపేట, కాకినాడ రూరల్ అసెంబ్లీ సీట్లిచ్చినా వాళ్లను ఎందుకు గెలిపించుకోలేకోయారని చం ద్రబాబు ప్రశ్నించారు. టికెట్ల ఎంపిక జాప్యం కావడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని పలువురు నాయకులు చంద్రబాబుకు చెప్పారు. సమావేశంలో వాసంశెట్టి సత్య, రెడ్డి సుబ్రహ్మ ణ్యం, పిల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీని గెలిపించండి

గుంటూరు : కళంకిత మంత్రులను కేబినెట్ నుంచి భర్త్‌రఫ్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీసేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం సీఎం గుంటూరులోని ఫిరంగిపురంలో ఇందిరమ్మ కలలు బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలుసుకొన్న టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ విషయం ముందుగానే తెలుసుకొన్న పోలీసులు టీడీపీ కార్యాలయంలో మకాం వేసి ఎవరినీ ముందుకు కదలనివ్వలేదు.

సీఎం పర్యటనలో పాల్గొనేందుకు తమకు ఆహ్వానం ఉందని ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వాదించినప్పటికీ పోలీసులు ఆలకించలేదు. తమకు అర్బన్, రూరల్ ఎస్‌పీల నుంచి ఆదేశాలు ఉన్నాయని, టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం సభ వద్దకు వెళితే గొడవ జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అడ్డుకొంటున్నామని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్యన తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు ముందుకెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లో పోలీసుస్టేషన్‌కు తరలించారు.

సుమారు నాలుగు గంటల పాటు పోలీసుస్టేషన్‌లో నిర్బంధించి సీఎం హెలికాఫ్టర్ గుంటూరును వీడిన తర్వాత ఎమ్మెల్యేలను స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్‌విప్, ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ నిందితులైన మంత్రులను కాపాడుతూ సీఎం ప్రథమ నిందితుడిగా మారుతున్నారని ఆరోపించారు. గవర్నర్ కళంకిత మంత్రుల విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పోలీసుల అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, మంత్రులను కేబినెట్ నుంచి తొలగించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

గుంటూరులో టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టులు

సర్వశక్తులూ ఒడ్డిపోరాడదాం
కాంగ్రెస్, వైసీపీల అవినీతి, అరాచకాలపై పుస్తకాలు
కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఉద్భోద

కాకినాడ:రాజీపడే మనస్తత్వం కాదు నాది.. పాదయాత్ర కొనసాగిస్తా:
చిత్తశుద్దితో చేపట్టిన పనుల్లో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయి. సమున్నత లక్ష్యం కోసం చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు ఆటంకాలుకాకూడదు. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే రాజీపడలేను. కాళ్లు నొప్పిపుట్టినా పాదయాత్ర ఆపను. డాక్టర్లు వద్దని సలహా ఇస్తున్నారు. చిటికెనవేలు బాగా ఇబ్బందిపెడుతోంది.క్రానిక్ అవుతుందని డాక్టర్లు చెప్పారు. అయినా మీ సమస్యల ముందు నాది పెద్ద సమస్యకాదు.. అని చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు. తాను అధికారంలోకి వస్తే విలేకరులకు ఇంటి స్థలాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసందర్భంగా తూర్పుగోదావరి జిల్లా డిక్లరేషన్‌ను చంద్రబాబు వివరించారు. పోలవరం, పుష్కర, ఏలేరు, గోదావరి ఆధునికీకరణ, కాకినాడ, రాజమండ్రి ఐ.టి. అభివృద్ధి తదితర హామీలను చంద్రబాబు ప్రకటించారు.

కాంగ్రెస్, వైసీపీల అవినీతి, అరాచకాలపై పుస్తకాలు
కాంగ్రెస్ చేతకాని పాలన, అవినీతిపైనా, వైసీపీ అక్రమాలు, అరాచకాలపైనా పుస్తకాలు ప్రచురించి విస్తృత ప్రచారం చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కార్యకర్తలు కూడా పత్రికలలో వచ్చే కథనాలు, ఎస్ఎంఎస్‌ల ద్వారా కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఆగడాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

తూర్పులో ముగిసిన బాబు పాదయాత్ర
అక్టోబరు రెండున హిందూపూర్‌లో ప్రారంభమైన చంద్రబాబు నాయుడు పాదయాత్ర శుక్రవారం నాటికి 193 రోజులయింది. మార్చి 20న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు 24 రోజులు ఇక్కడ యాత్ర సాగించారు. 11 నియోజకవర్గాలు, 16 మండలాలు, 78 గ్రామాలలో చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా 19 నియోజకవర్గాల సమీక్షతోపాటు.. కాపు, శెట్టిబలిజ, బ్రాహ్మణ తదితర సామాజిక వర్గాల సమావేశాలలోనూ చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు 24 రోజులలో తూర్పుగోదావరి జిల్లాలో 243.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

కాపులకు రూ.5 వేల కోట్ల ప్యాకేజీ
తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు కీలకమైన హామీ ఇచ్చారు. కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండటంతో.. కాపులలో పేదల కోసం ఏటా రూ వెయ్యికోట్ల చొప్పున ఐదేళ్లలో ఐదువేల కోట్ల ప్యాకేజీని పిఠాపురం సభలో ప్రకటించారు. కాపుల ప్యాకేజీకి అనూహ్యస్పందన వచ్చింది.

యాత్ర కొనసాగిస్తే బాబుకు శాశ్వత ఇబ్బందులు తప్పవు: డాక్టర్ రాకేష్
చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర వల్ల కాళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తాయని ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాకేష్ తెలిపారు. శుక్రవారం ఉదయం రెండుగంటలపాటు చంద్రబాబుకు వైద్యపరీక్షలు నిర్వహించిన రాకేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర కొనసాగిస్తే కాలుకు సంబంధించి శాశ్వతంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబుకు చెప్పామన్నారు. కనీసం రెండు రోజులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చామన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చించి యాత్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చంద్రబాబు మాత్రం మొండిగా నడుస్తానంటున్నారని తెలిపారు.
: కార్యకర్తలంతా జెండాలు మోసీ మోసీ అసిపోయి ఉన్నారు. ఇంకెన్నాళ్లని మోస్తారు. 2014 ఎన్నికలలో ఎట్టిపరిస్థితులలోనూ గెలిచి తీరాల్సిందే. సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన ఎన్నికలు రాబోతున్నాయ్. ఇది ఫైనల్ ఎలక్షన్.. అని చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒక విధంగా ఇది ఆఖరిపోరాటం అన్న సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే పార్టీ కోసం కొంత సొమ్ము ఖర్చుచేయాలని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగం చేశారు. 2014 ఎన్నికలలో అతి పెద్ద మెజార్టీ సాధించాలని .. సీట్లే కాకుండా..నియోజకవర్గాలలో ఓట్లూ భారీగా వచ్చేలా ఇప్పటి నుంచీ ప్రయత్నం చేయాలన్నారు.

2014 చావో..రేవో.. ఆఖరిపోరాటం

హైదరాబాద్ ఐఏఎస్ అధికారులను పావులుగా వాడుకొన్నారు. శ్రీలక్ష్మి వంటి అధికారి పక్షవాతానికి గురై జీవచ్ఛవంలా బతకడానికి వైఎస్ కుటుంబ అవినీతే కారణం. ఇటువంటి అవినీతిపరులపై ఐఏఎస్ అధికారులు పోరాడాలి' అని ఈ సందర్భంగా మోత్కుపల్లి పిలుపునిచ్చారు. అవినీతిపరులు, దోపిడీదారుల నుం చి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని, రాష్ట్రంలోని పేద వర్గాలు బాబును ఆశీర్వదించి, అధికారంలోకి తెస్తేనే వారి జీవితాల్లో నిజమైన మార్పు వస్తుందని అన్నారు.
: 'సమాజంలో పేదరికం, అసమానతలు పోవాలని జ్యోతిరావు ఫూలే వంటి మహనీయులు ఆశించారు. కానీ, ఒకే కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకొంటే పేదరికం ఎలా పోతుంది?' అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమం గురువారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగింది. 'వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చారు. వేల కోట్లు దోచుకొన్నారు.

వేల కోట్లు దోచుకొంటే పేదరికం ఎలా పోతుంది?: మోత్కుపల్లి

రాష్ట్ర మంత్రి వర్గం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 420
సమతా బ్లాక్‌కు జైలు హోదా ఇస్తే సరిపోతుంది
టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా
అంటువ్యాధిలా వ్యాపిస్తున్న అత్యాచారాలు: సన్నపనేని

హైదరాబాద్ : 'తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ శాఖను సంప్రదించడానికి '100' సంఖ్యను టోల్ ఫ్రీ నెంబర్‌గా కేటాయించింది. తర్వాత వైద్య అవసరాల కోసం ఆయా శాఖలకు 108, 104 నెంబర్లు ఇచ్చారు. కిరణ్ సర్కారు ఇప్పుడు తన మంత్రివర్గానికి టోల్ ఫ్రీ నెంబర్‌గా 420 ని పెట్టుకొన్నట్లు కనిపిస్తోంది' అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారం ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

420 సెక్షన్ కింద కేసులు నమోదైన మంత్రులను మంత్రివర్గంలో పెట్టుకొని తిరగడం ఈ ముఖ్యమంత్రికే చెల్లిందని, దానం, ధర్మాన, పొన్నాల, కన్నా, గీత, సబిత, పార్దసారధి వంటివారు ఇంతకు తక్కువ కాదన్నారు. మంత్రివర్గ సమావేశాలు చంచల్‌గూడ జైలులో పెట్టుకొనే పరిస్థితి రాకుండా సచివాలయంలో సమతా బ్లాక్‌కు జైలు హోదా కల్పించి అక్కడే మంత్రులను ఉంచితే సరిపోతుందని ఎద్దేవా చేశారు. 'చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పోచారం శ్రీనివాసరెడ్డిపై పత్రికల్లో వార్తలు వస్తేనే ఆయనతో రాజీనామా చేయించారు. గతంలో మంత్రులపై అనుమానం వస్తే రాజీనామా చేయించేవారు.

తర్వాత కేసులు నమోదు అయితే రాజీనామా చేయించేవారు. ఇప్పుడు ఏకంగా ఛార్జిషీట్లు దాఖలు చేసి 420 సెక్షన్ల కింద కేసులు పెట్టినా పదవుల నుంచి తప్పుకోవడం లేదు' అని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత అధ్వాన్న మంత్రివర్గాన్ని పెట్టుకున్న ముఖ్యమంత్రి మరొకరు లేరని, ఘనత వహించిన మంత్రులకు ఉగాది సందర్భంగా 420 పురస్కారాలు కూడా అందచేస్తే ప్రజలు మరింత సంతోషించేవారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళంకిత మంత్రులను తప్పించాలని, లేకుంటే తామే పోరాటం చేసి తీరుతామని రేవంత్ హెచ్చరించారు.

తాము మంత్రులపై ఆరోపణలు చేయడం లేదని, వారిపై దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్లు కూడా దాఖలు అయినందువల్లే రాజీనామాలు కోరుతున్నామని రేవంత్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరోవైపు పార్టీ శాసనసభాపక్ష ఉప నేతలు ముద్దు కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్రంలో మహిళలపై సాగుతున్న అరాచకాలపై ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ అధ్వాన్న పాలనతో రాష్ట్రాన్ని మానభంగాలు.. హత్యల ప్రదేశ్‌గా మార్చిందంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. తెనాలిలో ఓ మహిళను యువకులు లారీ కింద తోసి చంపిన ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లాలో ఓ విద్యార్థినిని కాల్చి చంపేసిన ఘటన.. రాష్ట్రంలో పరాకాష్టకు చేరిన అరాచకాలకు నిదర్శనమన్నారు.

ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పక్షవాతం వచ్చినట్టు ప్రవర్తిస్తోందని విమర్శించారు. 'ఉగాది పండగ రోజు కూడా మహిళలపై ఘోరాలు ఆగలేదు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. వైఎస్ గుండా రాజ్‌ను నెలకొల్పి వెళ్తే కిరణ్ చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తున్నారు' అని ముద్దు విమర్శించారు. ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నవారు దోచుకొని తింటుంటే కింద వారి అనుచరులు రేపులు, రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మోత్కుపల్లి విమర్శించారు.

సీబీఐ కేసులు పెట్టిన మంత్రులను కూడా అరెస్టు చేయకపోవడంతో రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ఎవరికీ భయం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా ప్రజలకు అన్యాయమే జరుగుతోందన్నారు. పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఆడవాళ్లపై అత్యాచారాలు ఓ అంటువ్యాధిగా వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'మహిళలపై అత్యాచారాల నిరోధానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను, ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది. అలాంటి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించాలి' అని నన్నపనేని డిమాండ్ చేశారు.

మానభంగాలు.. హత్యల ప్రదేశ్‌గా రాష్ట్రం: ముద్దు, మోత్కుపల్లి


జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణకు కేంద్ర మంత్రి యోగం ఉందని జ్యోతిష పండితుడు, టీడీపీ నేత ఏలూరి కోటేశ్వరరావు చెప్పారు. ఉగాది సందర్భంగా ఆయన గురువారం ఇక్కడ హరికృష్ణ చేయి చూసి జోస్యం చెప్పారు. 2014 సంవత్సరంలో ఇతర పార్టీల మద్దతుతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని, ఆయన ముఖ్యమంత్రి కావడంలో హరికృష్ణ ప్రముఖ పాత్ర పోషిస్తారని కోటేశ్వరరావు పేర్కొన్నారు.

హరికృష్ణకు కేంద్రమంత్రి యోగం!

పార్టీ కోరితే ఎన్నికల్లో ప్రచారం!

హైదరాబాద్ : పార్టీ అధినాయకత్వం కోరితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల వ్యవహారం ఇటీవల టీడీపీలో కలకలం సృష్టించిన నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు కొద్ది రోజుల క్రితం ఆయనను కలిసి తాజా పరిణామాలపై మాట్లాడారు.

"పార్టీకి నేను దూరమయ్యే పరిస్థితే లేదు. ఆ విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ కోరితే ఎన్నికల్లో ప్రచారానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను'' అని ఆయన వారితో అన్నారు.వైసీపీకి చెందినవారు ఇటీవల కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా వారి ఫ్లెక్సీలపై తన ఫొటోను వాడుకోవడం కేవలం ప్రచారం కోసం చేసిన వ్యవహారం అని తాను అనుకొంటున్నానని, దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదల్చుకోలేదని ఆయన చెప్పారు.తాను రోజువారీ రాజకీయాల్లో లేనని, ఎక్కడో, ఎవరో ఫ్లెక్సీలు పెడితే ఖండనలు ఇస్తూ ఎలా కూర్చోగలనని ఆయన ప్రశ్నించారు.

గుడివాడ ఎమ్మెల్యే నాని తన అనుమతితోనే పార్టీ మారాడన్న ప్రచారం నిజం కాదని ఎన్టీఆర్ చెప్పారు. "టీడీపీ నాయకత్వంపై నాని విమర్శలు చేసినప్పుడు నేను ఖండించి ఉండాల్సిందని కొందరు అంటున్నారు. పార్టీ మారిన వారిలో చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. అవన్నీ నేను ఎక్కడ పట్టించుకోగలను? వారి విమర్శలకు పార్టీ నేతలు సమాధానం ఇచ్చారు. నేను అందులో తలదూర్చదల్చుకోలేదు'' అని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో తనకు ఏ సమస్యలు లేవని, ఎన్టీఆర్ కుటుంబంలోని పెద్దల మధ్య అభిప్రాయ భేదాలకు కారణం అవుతున్న అంశాల జోలికి తాను వెళ్ళదల్చుకోలేదని ఆయన చెప్పారు. ఫ్లెక్సీల వ్యవహారంలో తన బాబాయి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఆయన కొంత నొచ్చుకొన్నట్లు కనిపించిందన్నది టీడీపీ నేతల కథనం. టీడీపీ నేతల విజ్ఞప్తి తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ ఓ కార్యక్రమంలో తాను ఎప్పటికీ టీడీపీ వాడినేనని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

టీడీపీకి దూరమయ్యే ప్రశ్నే లేదు: జూనియర్ ఎన్టీఆర్

తూ.గో: వస్తున్నా..మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు శుక్రవారం ఉదయం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులు జిల్లాకు చేరుకున్నారు. చంద్రబాబుకు ఈసీజీ, డిజిటల్ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించనున్నారు.

చంద్రబాబుకు వైద్య పరీక్షలు

హైదరాబాద్ : కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కార్యాలయ ముట్టడికి టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం బయలుదేరారు. విషయం తెలిసిన పోలీసులు ఎన్టీఆర్ ట్రస్ట్ వద్దే వారిని అడ్డుకున్నారు. గాలిముద్దుకృష్ణమ, మోత్కుపల్లి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి గోల్కోండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాసరావుతో టీడీపీ నేత దాడి వీరభద్రరావు రహస్యంగా భేటీ అయ్యారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ భేటీపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో తెలుసుకోవాలని విశాఖ టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి గంటాతో టీడీపీ నేత దాడి రహస్య భేటీ

తూ.గో : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ కాలు వేలు గాయంతో బాధపడుతున్నారు. ఆయనకు శుక్రవారం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కనీసం రెండు రోజులైన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో టీడీపీ నేత గరికపాటి రామ్మోహన్‌తో పాటు మరికొంత మంది నేతలు బాబును కలుసుకున్నారు.

అనంతరం గరికపాటి మీడియాతో మాట్లాడుతూ విశ్రాంతి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడంలేదని, పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారన్నారు. విశ్రాంతి తీసుకోకపోతే కాలిగాయం ఎక్కువై ఇబ్బంది పడవలసి వస్తుందని డాక్టర్లు చెప్పారని ఆయన అన్నారు. అయితే పాదయాత్ర ఈరోజు కుదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

చంద్రబాబుకు విశ్రాంతి అవసరం : గరికపాటి

ఉగాది పండగను గురువారం ప్రజల మధ్యే చేసుకున్నాను. ఈ ఒక్క పండగే కాదు.. ఈ ఏడాది తెలుగు వారి ప్రధాన పండగలు అన్నిటినీ ప్రజల మధ్యే చేసుకున్నాను. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్.. ఇలా ప్రతి పండగను పేదలతోనే పంచుకున్నాను. ఏడాదంతా కష్టపడే శ్రమజీవులు కనీసం ఒక్క రోజైనా సంతోషంగా గడపాలన్న ఉద్దేశంతోనే మన పెద్దలు పండగలను పెట్టారు. కానీ, ఇప్పుడు ఒక్క రోజు పండగ చేసుకునే పరిస్థితిలో కూడా ఆ కష్టజీవులు లేరు. పెరిగిన ధరలు.. పెరగని ఆదాయాలు.. చితికిపోయిన కుటుంబాలు.. ఇదీ ప్రజల పరిస్థితి! ఉగాది పచ్చడిలో తీపి ఉంటుంది.

కానీ, ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో తీపి తప్ప మిగిలిన రుచులన్నిటినీ చవిచూస్తున్నారు. నిత్యావసరాల పేరు చెప్పగానే చేదు.. కూరగాయల పేరు వినగానే వగరు వారికి గుర్తుకొస్తోంది. బియ్యం ధర వినగానే పులుపు పలకమారుతోంది. ఇక, పండగకి కొత్త బట్టలు కొనుక్కోవడం, సరదాగా ఓ సినిమాకో షి

ఈ రోజు నా యాత్రంతా తాండవ నది పరీవాహక ప్రాంతంలో సాగింది. నదీ పరీవాహక ప్రాంతంలో ఉండి కూడా ఈ గ్రామాలను మంచినీటి కరువు వెంటాడుతోంది. నదిపై ఒక్క లిఫ్ట్ ఏర్పాటు చేస్తే, చుట్టుపక్కల గ్రామాలు అన్నిటిలో జల కళ సంతరించుకుంటుంది. ప్రభుత్వం వద్ద ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. కానీ, దానికి మోక్షం ఎప్పుడన్నది అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని శెట్టిబలిజ సోదరులు కొంతమంది ఈరోజు నన్ను కలిశారు. సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేసే పార్టీ తెలుగుదేశమేనని, ఆ నమ్మకం తమకు ఉందని, పార్టీలో తమకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయను.
కారుకో వెళ్లడం వంటివన్నీ ఉప్పగా మారిపోయాయి. దీంతో, పేదల బతుకంతా కారం కారంగానే మారిపోయింది. కనీసం ఈ ఉగాది నుంచి అయినా వారి జీవితాల్లో కొత్త చివుళ్లు తొడగాలని ఆశిస్తున్నా.

ఈ ఒక్క పండగే కాదు.. ఈ ఏడాది తెలుగు వారి ప్రధాన పండగలు అన్నిటినీ ప్రజల మధ్యే చేసుకున్నాను

గాజువాక: చంద్రబాబు 'వస్తున్నా మీకోసం..' పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా.. విశాఖ నగర శివార్లలోని వడ్లపూడి వద్ద నిర్మించనున్న పైలాన్‌కు గురువారం భూమి పూజ చేశారు. సుమారు వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో, 70 అడుగుల ఎత్తున ఈ పైలాన్‌ను నిర్మించనున్నారు. 27వ తేదీ సాయంత్రం ఈ పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరించాలని నిర్ణయించినందున 24లోగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.

వడ్లమూడిలో పైలాన్

కాళ్లు, కండరాల నొప్పులు తీవ్రం
హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం
నేడు చంద్రబాబుకు పరీక్షలు.. విశాంత్రికి సూచన!
మూడు నెలలుగా కాలునొప్పి తీవ్రంగా బాధిస్తోంది
విశ్రాంతి తప్పనిసరని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు
లేకపోతే నొప్పి శాశ్వతమవుతుందని హెచ్చరిస్తున్నారు

కాకినాడ ఈ పరిస్థితుల్లో ఆయన కాళ్లు, కండరాల నొప్పి తీవ్రస్థాయికి చేరింది. తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని, లేకపోతే ఈ నొప్పి శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా, ఆయన మొండిగా కొనసాగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం కాళ్లు, కండరాల నొప్పి భరించరాని స్థితికి చేరడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల బృందం తూర్పు గోదావరికి బయలుదేరింది. శుక్రవారం చంద్రబాబును పరీక్షించనుంది. ఇప్పటి వరకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా పాదయాత్రను ముందుకు కొనసాగించానని, కానీ, మూడు నెలలుగా కాలు నొప్పి తీవ్రంగా బాధిస్తోందని చంద్రబాబు చెప్పారు.

హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రత్యేక వైద్యుల బృందం శుక్రవారం తన ఆరోగ్యాన్ని పరీక్షిస్తుందని, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలో సూచిస్తుందని తెలిపారు. నొప్పి తగ్గాలంటే హైదరాబాద్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని, ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనే విషయాన్ని డాక్టర్లు చెబుతారని వివరించారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోకపోతే కండరాల నొప్పి మరింత తీవ్రం కావడమే కాకుండా ఈ నొప్పి శాశ్వతంగా ఉండిపోతుందని డాక్టర్లు పదే పదే హెచ్చరిస్తున్నారని తెలిపారు. "మీ సమస్యలను పరిష్కరించగలిగితే చాలు.. ఈ నొప్పులు జీవితాంతం కొనసాగినా మీ కోసం భరిస్తా'' అని పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
: 'వస్తున్నా.. మీకోసం' అంటూ సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాళ్లు, కండరాల నొప్పులు మరింత తీవ్రమయ్యాయి. దీంతో, హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఆర్థోపెడిక్ వైద్య నిపుణుల బృందం వచ్చి ఆయనను పరీక్షించనుంది. కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్యులు పలుమార్లు బాబును హెచ్చరించినా ఆయన మొండి ధైర్యంతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు.. ఆ తర్వాత విశాఖ జిల్లాలో ప్రవేశిస్తారు. ఇంకా మరో 16 రోజులపాటు ఆయన పాదయాత్ర కొనసాగాల్సి ఉంది.

నొప్పి జీవితాంతం కొనసాగినా మీ కోసం భరిస్తా: చంద్రబాబు

పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి ఉగాది వేడుకలను తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎన్ సూరవరంలో.. పల్లె జనం, పార్టీ కార్యకర్తల మధ్య జరుపుకొన్నారు. ఉగాది పచ్చడి ఆరగించి, పంచాంగ శ్రవణం అనంతరం చంద్రబాబు మాట్లాడారు. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, ఉద్యోగులు అందరికీ మంచి జరగాలని.. ఈ విజయనామ సంవత్సరం మనందరికీ విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. బతికున్నన్నాళ్లు ధర్మబద్ధ జీవితం గడుపుదామని కార్యకర్తలు, ప్రజలకు ఉద్బోధించారు. తెలుగువారు ఏ దేశంలో ఉన్నా.. ఏ ప్రాంతంలో ఉన్నా జన్మభూమిని మర్చిపోవద్దని.. తమ ప్రాంతాలకు సేవలు అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

జనం మధ్యే బాబు ఉగాది

బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన మహనీయుడు జ్యోతిబా పూలే అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. 187వ జయంతి సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, తాను ఫూలేను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అందులో భాగంగానే యనమలకు ఎన్టీఆర్ తొలిసారిగా ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

మహనీయుడు ఫూలే

బాబు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారంతో ముగుస్తుంది. మార్చి 20న రాజమండ్రిలో ప్రారంభమైన యాత్ర.. కోటనందూరు మండలం కాకరాపల్లి తర్వాత విశాఖ జిల్లాలో ప్రవేశించనుంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో.. నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖజిల్లాలోకి చంద్రబాబు అడుగుపెడతారు. మొత్తంగా ఈ జిల్లాలో చంద్రబాబు సుమారు 112 కిలోమీటర్లు నడవనున్నారు. పాదయాత్ర విశాఖపట్నంలో 27వ తేదీన నిర్వహించే బహిరంగ సభతో ముగించనున్నారు.

నేడు విశాఖ జిల్లాలో ప్రవేశం..

కాకినాడ : 'అమ్మ హస్తం' పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మోసగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పన్నుల రూపంలో పేదలపై నెలకు రూ.3 వేల భారం వేసి.. ఆ తొమ్మిది సరుకులను మాత్రం రూ.185కు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనని ఆరోపించారు. బాబు చేపట్టిన 'వస్తున్నా మీ కోసం..' పాదయాత్ర 190వ రోజు గురువారం తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎన్ సూరవరం, ఎన్ఎస్ వెంకట నగరం, కూటయ్యపాలెం గ్రామాల్లో సాగింది.

ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో.. ఎన్నికల ఏడాది కాంగ్రె

"ఇది అమ్మ హస్తం కాదు.. మొండి హస్తం'' అని వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. రూ.5 వేల వైద్యానికి రూ.50 వేలు బిల్లు వేస్తున్నారని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ ముక్కుకూ మీటరు పెట్టి పీల్చుకునే గాలికీ పన్నేసేలా ఉన్నాడని మండిపడ్డారు.
స్ చేసే జిమ్మిక్కుల్లో భాగంగానే 'అమ్మ హస్తం' పథకాన్ని ప్రారంభించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ పథకంలో ఇచ్చే సరుకులు కాకుండా ప్రతీ పేద కుటుంబానికి అవసరమయ్యే... 20 కిలోల బియ్యానికి రూ. 800, 2 కిలోల పప్పు రూ.150, చక్కెర రూ.84, కూరగాయలు, పాలు రూ.వెయ్యి, వంటనూనె రూ.100, పెరిగిన విద్యుత్ బిల్లులకు రూ.వెయ్యి.. మొత్తంగా నెలకు 3 వేల రూపాయలకుపైగా భారం పడుతుందని వివరించారు.

అమ్మ హస్తం' కాదు.. మొండి హస్తం! అది కాంగ్రెస్ ఎన్నికల జిమ్మిక్కు..