April 9, 2013


విశాఖపట్నం: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో ఈనెల 12వ తేదీ నుంచి చేపట్టనున్న పాదయాత్రను 27న గాజువాకతో ముగించనున్నారు. గాజువాక-షీలానగర్ మధ్య జాతీయ రహదారికి ఆనుకుని పైలాన్ నిర్మించనున్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 130 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగుతుంది. చివరిరోజు రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి అనంతరం పైలాన్ ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంలో నగరంలో ఏర్పాటుచేసే భారీ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

సోమవారం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం టి.తిమ్మాపురంలో విశాఖ జిల్లా నేతలతో సమీక్ష జరిపారు. పాదయాత్ర ముగింపు, పైలాన్ నిర్మాణం, బహిరంగ సభపై చర్చించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌కు భిన్నంగా ఒక రోజు ఆలస్యంగా 12న చంద్రబాబు విశాఖ జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఆదివారాలు విశ్రాంతికి కేటాయించారు. అందువల్ల ఆయన పాదయాత్ర నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి పెందుర్తి నియోజకవర్గాల మీదుగా గాజువాక వరకే సాగుతుంది.

సమయం లేనందున విశాఖ నగరంలో పాదయాత్రను రద్దు చేశారు. గాజువాక పట్టణం వరకు మాత్రమే ఆయన పర్యటిస్తారు. ఈ నెల 26తో యాత్ర ముగించాల్సి వున్నా పైలాన్ ఆవిష్కరణ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో యాత్రను నిలిపివేసి 27న తిరిగి కొనసాగిస్తారు. బహిరంగ సభ విషయంలో ఇంకా వేదిక ఖరారు కాలేదు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానమా లేదా మున్సిపల్ స్టేడియమా అన్నది ఒకటి,రెండు రోజుల్లో ఖరారు చేస్తారు. బహిరంగ సభ చారిత్రాత్మకం కావాలని చంద్రబాబు ఈ సందర్భంగా నాయకులకు ఉద్బోధించారు. పార్టీ శ్రేణులంతా బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు రోజునకు 207 రోజులు అవుతుందన్నారు. బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పేలా జన సమీకరణ చేయాలని ఆయన సూచించారు. బహిరంగ సభ ఒక్క జిల్లాకే కాక రాష్ట్ర స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు.

బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమించనున్నట్టు తెలిపారు. పైలాన్ నిర్మాణానికి స్థలం ఖరారు చేసి పనులు చేపడతామని పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు, యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గవిరెడ్డి రామానాయుడు, రూరల్, నగర అధ్యక్షులు దాడి రత్నాకర్, వాసుపల్లి గణేష్‌కుమార్, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, గుడివాడ నాగమణి, లాలం భాస్కరరావు, పెతకంశెట్టి గణబాబు, భరణికాన రామారావు, పప్పు రాజారావు, హర్షవర్ధన్ ప్రసాద్, పల్లా శ్రీనివాసరావు, గుడివాడ అమర్, పాశర్ల ప్రసాద్, ముత్యాలనాయుడు, సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు.

పైలాన్‌కు స్థల పరిశీలన

గాజువాక: పైలాన్ నిర్మాణానికి సోమవారం ఆ పార్టీ నాయకులు గాజువాక ప్రాంతంలో స్థల పరిశీలన జరిపారు. జాతీయ రహదారికి ఆనుకొని వున్న అగనంపూడి, కూర్మన్నపాలెం, బీహెచ్‌పీవీ ప్రాంతాల్లో నాలుగైదు స్థలాలను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావులు స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు. వీటిలో అనువైన స్థలాన్ని మంగళవారం నాటికి ఖరారు చేయనున్నారు. పైలాన్ ఏర్పాటు స్థల పరిశీలనలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నియోజకవర్గ టీడీపీ ఫైవ్‌మెన్ కమిటీ ప్రతినిధులు హర్షవర్దన్‌ప్రసాద్, పల్లా శ్రీనివాసరావు, పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాస్, లేళ్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బాబు యాత్ర గాజువాకతో ముగింపు

నరసన్నపేట:విద్యుత్‌చార్జీలు తగ్గిం చే వరకూ టీడీపీ నిరసనగా పోరా టం చేస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశారు. సోమవారం నరసన్నపేట ప్రజాసదన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ వి ద్యుత్‌చార్జీల విషయంలో ప్రజలకు అండగా టీడీపీ ధర్నాలు,సంతకాలు సేకరణ చేసి గవర్నర్‌కు నివేదిస్తుందన్నారు.

ప్రజలపై ఆరు వేల కోట్లు భా రం మోపి కంటితూడుపుగా 200 యూనిట్లు లోపల వినియోగించేవారిపై భారం తగ్గించినట్లు చెప్పి కేవలం రూ.800కోట్లు మాత్రం తగ్గించారని ఆరోపించారు.ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరించాలన్నారు.మంగళవారం నిర్వహించే బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జామి కామేశ్వరరావు,బలగ నాగేశ్వరరావు,పొట్నూరు జగన్,గొద్దు చిట్టిబాబు,చింతు పాపారావు,బెవర రాము,చలపాక మల్లేషు,లక్కోజి క్రిష్ణ,బైరి భాస్కరరావు,పీస కృష్ణ పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీలు తగ్గించే వరకూ ఆందోళన

అనంతగిరి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రంగారెడ్డి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జి.సుభాష్‌యాదవ్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని గంగారం, ఎన్నెపల్లి, కొత్రేపల్లి గ్రామాలలో పల్లె పల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాలను ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సుభాష్ యాదవ్ మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న సమస్యలు మంత్రికి పట్టడం లేదన్నారు. మంత్రి వికారాబాద్‌కు వచ్చినప్పుడు సమస్యలపై నిలదీయాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తారని అన్నారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. చంద్రబాబు హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ప్రస్తుతం ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు హెచ్.సురేష్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తే వైఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాను మొత్తం దోచుకున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కొండల్‌రెడ్డి, కొత్తగడి పీఏసీఎస్ చైర్మన్ అనంత్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్, ప్రభుగౌడ్, ఉమాశంకర్ , మల్లికార్జున్, ఎంవీ రమణ, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్, డి.రవికుమార్ పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే అభివృద్ధి సాద్యం

నల్లగొండ టౌన్ : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ పట్టణంలో కొనసాగుతూనే ఉంది. సోమవారం మిర్యాలగూడ రోడ్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విద్యుత్ కోతలతో వ్యవసాయం, పారిశ్రామిక, చేనేత రంగాలు సంక్షోభానికి గురవుతున్నాయన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల అనేక గ్రామాల లో నీటి సదుపాయం ఉన్నప్పటికీ సరై న సమయానికి కరెంట్ రాక పంటలు ఎండిపోయి చేసిన అప్పులు తీర్చలేమన్నా బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం 9గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి బోయపల్లి కృష్ణారెడ్డి, బొర్ర సుధాకర్, ఎల్‌వీ యాదవ్, కంచనపల్లి రవీందర్‌రావు, ఈరటి బాలరాజు, కంచి మధుసూదన్, కౌకూరి వీరచారి, గుండు వెంకటేశ్వర్లు, ఎంఏ రషీద్, ఎండీ సయ్యద్, మేడి సురేందర్, పోలే జయకుమార్, తొలకొప్పుల గిరి, అయితరాజు మల్లేష్, పోలే వెంకట్, నల్లగొండ అశోక్, టి.సత్యం పాల్గొన్నారు.

కొనసాగుతున్న టీడీపీ సంతకాల సేకరణ

చిన్నకోడూరు: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే కారణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. సోమవారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, విఠలాపూర్ గ్రామాల్లో పల్లెపల్లెకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆ విష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ సమస్య తీవ్రరూపం దాల్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్య లు చేపట్టలేదన్నారు.

ప్రజలపై విద్యుత్ రూపంలో రూ.32 వేల కోట్ల భారం మోపిందన్నారు. అది చాలదన్నట్టు స ర్‌చార్జీల పేరిట రూ.6.5 వేల కోట్ల భా రాన్ని ప్రజల నెత్తిమీద మోపిందన్నా రు. ఈ విషయమై ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే వేల కోట్ల భారాన్ని వందల కో ట్ల రూపాయలకు తగ్గించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. రైతులకు 7 గంటల పాటు నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరా చేస్తానన్న ప్రభుత్వం 3 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. నేడు పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున ప డ్డాయన్నారు.

చిన్నచిన్న పరిశ్రమలు మూత పడ్డాయన్నారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలిం చే నైతిక హక్కు లేదన్నారు. విద్యుత్ కోతలతో పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. వెంటనే ప్రభుత్వం విద్యుత్ స మస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేటి బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బంద్‌ను పార్టీ కార్యకర్త లు విజయవంతం చేయాలన్నారు. చి రంజీవి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమన్నారు. చిరంజీవి పదవీకాంక్షతో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎ మ్మెల్యే, ఎంపీల టిక్కెట్లు అమ్ముకొన్న ఘనత ఆయనకే దక్కిందన్నారు.

తీరా డబ్బులు చేతికి వచ్చాక పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారని విమర్శించారు. ఇపు డు కాంగ్రెస్ అధిష్టానం మెప్పు కోసం చంద్రబాబును విమర్శించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు. ఇది చూసి ఓర్వలేకనే అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. చిరంజీవి నోరు అదుపులో పెట్టుకుని ప్రవర్తించాలన్నారు. ఎన్టీఆర్ అందరివాడే కాని కాంగ్రెస్, వైసీపీ పార్టీలకు చెందిన వాడు మాత్రం కాదన్నారు. ఎ న్టీఆర్ పేదలకోసం ఎన్నో పథకాలు ప్ర వేశపెట్టి ఆదుకున్నారన్నారు. కొందరు స్వార్థ పరులైన కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్‌ను తమవాడేనని చెప్పుకుని ప బ్బం గడుపుతున్నారన్నారు. వేరే పార్టీలకు చెందిన నాయకులు కొందరు ఎ న్టీఆర్ పేరు చెబితేగాని గెలువలేని పరిస్థితి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ టీడీపీ సమన్వయ కర్తలు కోమండ్ల రామచంద్రారెడ్డి, గుండు భూపేశ్, తె లుగు రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి నర్ర జయపాల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మొసర్ల మధుసూదన్‌రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు తిరుమల మారుతి, నాయకులు ఆరె రాజెల్లం, చెలికాని మల్లేశం, శ్రీనివాస్, రవికాంత్, చంద్రం, భారత్, కొ ట్టాల రాంరెడ్డి, దేవిరెడ్డి, శంకర్, స త్యం, గుడుమల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ వైఖరితోనే విద్యుత్ సమస్యలు

జిన్నారం: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రజలకు పిలుపునిచ్చారు. 'పల్లెపల్లెకు తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి మాదారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలన అన్ని రంగాలకు నష్టం కల్గించిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా భ్రుష్టుపట్టాయని ఆరోపించారు.

చంద్రబాబు హయాంలో కరువు పరిస్థితులు నెలకొన్నా విద్యుత్, ఇతర రంగాలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. మరోసారి టీడీపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మండలంలోని అన్ని సర్పంచ్ స్థానాలను గెలుచుకునేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. కాంగ్రెస్ అసమర్థ విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సఫాన్‌దేవ్, శశికళాయాదవరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, మద్దుల బాల్‌రెడ్డి, మహిరాజ్, ఎంపీ.అశోక్, రాజిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, సూర్యనారాయణ, సురేందర్‌గౌడ్, విశ్వనాథం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ను గద్దెదించాలి

పామర్రు : ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శనివారం తన అమ్మమ్మ స్వగ్రామమైన కొమరవోలు, స్వగ్రామమైన నిమ్మకూరులలో హల్‌చల్ చేశారు. కొమరవోలులో విద్యుత్‌పై పెంచిన చార్జీలను నిరసిస్తూ దేశం పార్టీ ఆధ్వర్యంలో సేకరిస్తున్న సంతకాల ఉద్యమానికి మద్దతు పలుకుతూ సంతకం చేశారు. విద్యుత్ సంక్షోభంపై దేశం పార్టీ నాయకులతో కలసి బ్లాక్ పేపర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ కోతలు, చార్జీలు పెంపుతో ప్రజలు కష్టాలను గ్రహించి వారి కష్టాలలో పాలు పంచుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అంధకారమలముకుందన్నారు.

పలువురు దేశం నాయకుల కొమరవోలులో బాలకృష్ణను కలిశారు. గన్నవరం ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు తెచ్చిన వాటర్ ట్యాంకర్లను ఆయన ప్రారంభించారు. అనంతరం స్వగ్రామమైన నిమ్మకూరు వెళ్ళి అక్కడ తన తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవరామతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలతో కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వర్లరామయ్య, జిల్లా దేశం ఉపాధ్యక్షుడు గొట్టిపాటి లక్ష్మీదాసు, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షుడు పొట్లూరి వెంకటకృష్ణబాబు, మండల అధ్యక్షుడు మండపాక శంకరబాబు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కొనకళ్ళ బుల్లయ్య. జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, నందమూరి మన్మధరావు, కుదరవల్లి ప్రవీణ్, అనగాని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

స్వగ్రామంలో బాలకృష్ణ హల్‌చల్

ఆగిరిపల్లి: నిస్వార్ధంగా, అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని టీడీపీ నాయకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. నెక్కలంగొల్లగూడెం, ఆగిరిపల్లి గ్రామాల్లో ఆదివారం జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ అడ్రస్‌లేని వ్యక్తికి నూజివీడు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గౌరవిస్తే అమ్ముడుపోయి ఆ వ్యక్తి పార్టీకి ద్రోహం చేశాడని కార్యకర్తలు మాత్రం పార్టీని ఎన్నడూ మోసం చేయలేదన్నారు. ప్రాణ త్యాగాలకైనా వెనుదీయని కార్యకర్తలను అన్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని వరంగా ఇచ్చారని సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు. ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో పట్వారి వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను అమల్లోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు.

ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు, ఎస్సీ,బీసీలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించిన మహోన్నతమైన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనన్నారు. రాబోయే ఎన్నికల్లో చరిత్ర పునరావృతం అవుతుందని తెలుగుదేశం పార్టీకి అధికారం తథ్యమన్నారు. దీనికి ముందుగా నెక్కలం గొల్లగూడెంలో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆగిరిపల్లిలో పార్టీ స్తూపం వద్ద పార్టీ ప
తాకాన్ని ఆవిష్కరించారు. వడ్లమానులో ఆంజనేయస్వామి ఆలయంలో బాలయ్య కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. నెక్కలం గొల్లగూడెంలో జిల్లా టీడీపీ కార్యవర్గ సభ్యుడు మాదల నరేంద్ర ఆధ్వర్యంలో బాలకృష్ణ ను గజమాలలతో సత్కరించారు.

ఆగిరిపల్లి సభలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చిట్నేనివెంకట శివరామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు పలగాని వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు దేవినేని ఉమ, బొండా ఉమ, కేశినేని నాని, బచ్చుల అర్జునుడు, వర్ల రామయ్య, దేవినేని చంద్రశేఖర్, మాదల సత్యకుమార్, నక్కనబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు. జనసంద్రమైన ఆగిరిపల్లి సినీనటుడు బాలకృష్ణ పర్యటన సందర్భంగా ఆదివారం ఆగిరిపల్లి జనసంద్రమైంది. బాలకృష్ణను చూసేందుకు పెద్దఎత్తున జనం తరలిరావడంతో వీధులు కిక్కిరిసిపోయాయి. అరగంట పాటు సాగిన కార్యక్రమం విజయవంతమై పార్టీ కార్యకర్తలు, ప్రజలు బాలకృష్ణకు అపూర్వ స్వాగతం పలికారు.

కార్యకర్తలే పార్టీకి బలం

( విజయవాడ) 'ప్రజా సేవ చేయాలన్నదే నా అభిలాష.. అందుకే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చా.. నన్ను ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీకి అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు. వారితో కలిసి.. నాన్నగారి ఆశయాల సాధన కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటు పడతా.. రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా ఉన్న నిరుద్యోగ సమస్యను అధిగమించి, దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు నా 'విజన్'ను అమలు చేస్తా.. అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆదివారం మండుటెండలో, ఓపెన్ టాప్ జీపుపైనే రోజంతా జిల్లాలో రోడ్ షో నిర్వహించిన బాలయ్యను చూసేందుకు జనం ఎగబడ్డారు. మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఓవరాల్‌గా బాలయ్య రోడ్ షో అదుర్స్ అనిపించింది.

జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ బూస్ట్ నిచ్చారు. ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ, చంద్రబాబును స్థుతిస్తూ.. నాటి నందమూరి తారక 'రామ'రాజ్య పాలనను.. నేటి కాంగ్రెస్ పార్టీ పాలనతో బేరీజు వేస్తూ ప్రసంగాలు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో ఆదివారం 85 కిలోమీటర్లకు పైగా రోడ్డు షో నిర్వహించిన బాలయ్య మొత్తం 10 చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. విజయవాడలోని తాజ్ గేట్‌వే హోటల్ నుంచి ఓపెన్ టాప్ జీపుపై ర్యాలీగా బయలుదేరిన బాలయ్య విస్సన్నపేటలో రోడ్డు షో నిర్వహించారు. మండుటెండలో.. చెమటలు కక్కుతున్నా.. ఆయాసం తోడైనా రోజంతా పర్యటన జరిపారు. బాలయ్య పర్యటనకు అభిమాన

గేట్‌వే హోటల్ నుంచి ఓపెన్ టాప్ జీపులో కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులతో కలిసి బయలు దేరిన బాలయ్య నున్న, సూరంపల్లి, అడవి నెక్కలం, ఆగిరిపల్లి, నూజివీడు, విస్సన్నపేట తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, మండే ఎండలో ఓపెన్ టాప్ జీపుపై నిలబడి ప్రసం గం చేయటం ప్రజలను ఆకట్టుకుంది.చంద్రబాబును పొగుడుతూ ...చంద్రబాబును గొప్ప పరిపాలనా దక్షుడని బాలకృష్ణ అభివర్ణించారు. బాబు పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలలో చక్కటి మార్పు ను తీసుకు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్ర బాబు చేస్తున్న కృషిని కొనియాడారు.

కాంగ్రెస్‌పై చండ్ర నిప్పులు కాంగ్రెస్ పార్టీపై బాలయ్య చండ్ర నిప్పులు కురిపించారు. టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకు వివరిస్తూ... కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంధకారప్రదేశ్‌గా మారిపోయిందన్నారు. అవినీతి ప్రదేశ్, అధికధరల ప్రదేశ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. నూజివీడులో మామిడి పరిశోధనా కేంద్రానికి తాళాలు వేసి ఉండటాన్ని చూసి.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మామిడి కొనుగోళ్ళ వ్యవహారంలో ఢిల్లీ సేట్‌ల గుప్పిట్లో ప్రభుత్వం నడుస్తున్న తీరును విమర్శించారు. లంచం కొట్టనిదే ఏ పనీ జరగదన్నారు. చెరువులలో నీళ్ళే కరువయ్యాయని చెప్పారు. ఇందిర జల ప్రభ కాస్తా.. వ్యర్థ ప్రభగా మారిపోయిందన్నారు. మైనారిటీల సంక్షేమం పడకేసిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన తప్పిదాల వల్లనే రాష్ట్ర ప్రజలు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రాభివృద్ధికి బాలయ్య విజన్ : రాష్ట్రాభివృద్ధికి బాలయ్య తన విజన్ ఏమిటో తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని చెబుతూనే.. రాష్ట్రాభివృద్ధికి తన విజన్ ఏమిటో చెప్పారు. యువత నిరుద్యోగంతో కొట్టు మిట్టాడుతుండటంవల్లనే ఈ గతి పట్టిందని, ఇలాం టి యువతకు చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టుకోవటానికి మైక్రో ఫైనాన్స్ రుణాలు, విద్యుత్ సబ్సిడీలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగులను కార్యోన్ముఖులను చేసేలా ఓ విప్లవం తీసుకు వచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే సగర్వంగా నిలబెట్టేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తానన్నారు.
సంద్రంతో పాటు, పల్లెల నుంచి జనం కదిలి వచ్చారు. బాలయ్య వచ్చాడంటూ మహిళలు ఆనందంతో.. బహిరంగ సభలకు పరుగు, పరుగున వచ్చారు. మొత్తంమీద జిల్లా పార్టీ నాయకుల్లో బాలకృష్ణ ఒక రోజు పర్యటన సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

ప్రజల కోసం పాటుపడతా


నూజివీడు: 'నూజివీడు నియోజకవర్గం జిల్లాలో టీడీపీకి పెట్టనికోట. ఇలాంటి కోటలో ముక్కూ మొహం తెలియని అభ్యర్ధిని పార్టీ పంపినా పార్టీ నాయకత్వం మీద విశ్వాసంతో ప్రజలు గెలిపించారు. ఈ సారి కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని బాలకృష్ణ టీడీపీ అభిమానులకు స్పష్టం చేశారు. నూజివీడు నియోజక వర్గ పరిధిలోని అడవినెక్కలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన బాలకృష్ణ అక్కడ అభిమానులు, టీడీపీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక, స్వార్ధ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వీడినా, పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

బీసీలను బలపరిచి, వారిని సమాజంలో రాజకీయ చైతన్యవంతులుగా తీర్చిదిద్ది, వారి అభివృద్ధికి పాటుపడిన ఏకైక వ్యక్తి టీడీపీవ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని ఆయన శ్లాఘించారు. సమాజంలో అణగారిన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందనే దానికి నిదర్శనం, ఇటు బీసీలకు, అటు మాదిగలకు టీడీపీ మద్దతుగా నిలవటమేనన్నారు. మారిన బాలకృష్ణ తీరు బాలకృష్ణ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. అలాంటిది రెండు రోజులుగా జిల్లాలో జరుపుతున్న పర్యటనలో తన శైలి మార్చుకుని, ప్రజలతో మమేకమవుతూ ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతోంది.

విజయవాడ నుంచి ఆదివారం బయలుదేరిన బాలకృష్ణ తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చేరేవరకూ ప్రతి గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రజలు బాలకృష్ణ కోసం గంటలకొద్దీ సమయం వేచి ఉన్నారు. ఆగిన ప్రతిచోట, బాలకృష్ణ ప్రజలకు అభివాదం చేస్తూ, కరచాలనం చేస్తూ వారితో ఫొటోలు దిగుతూ ఆటో గ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేశారు. నూజివీడు, తిరువూరు నియోజక వర్గాలలో ఆదివారం బాలకృష్ణ జరిపిన పర్యటన పూపర్ హిట్ అయింది.

ఎవరికివారే యమునా తీరే నూజివీడు నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటన సందర్భంగా టీడీపీ ముఖ్యనాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నచందాన వ్యవహరించారు.

నూజివీడు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నా అట్లూరి ట్రస్ట్ బ్రదర్స్ ,కాపా శ్రీనివాసరావు, నూతక్కి వేణుగోపాలరావు, ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా వ్యవహరించారు. విజయవాడ, నున్న నుంచి అడవినెక్కలం మీదుగా నూజివీడు నియోజకవర్గంలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఎదుట ఈ ముగ్గురు నాయకులు తమ సొంత బలాలను ప్రదర్శించుకున్నారు. రావిచర్ల అడ్డరోడ్డువద్ద కాపా, నూజివీడు అట్లూరిచారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద అట్లూరి వెంకట నరేంద్ర తమ బలాలను ప్రదర్శించారు.

లక్ష్మినరసింహ చిత్రపటంపై బాలకృష్ణ ఆసక్తి నూజివీడు పట్టణంలోకి ప్రవేశించగానే ప్రధాన రహదారి పక్కనే ఉన్న అట్లూరి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద అట్లూరి నరేంద్ర బాలకృష్ణకు ఘనస్వాగతం పలికారు. బాలకృష్ణకు అత్యంత ఇష్టదైవమైన లక్ష్మీనరసింహస్వామి ఉన్న పెద్ద చిత్రపటాన్ని ఆయనకు బహూకరించటానికి సిద్ధమై ఆయన రాకకోసం వేచి చూశారు. ట్రస్ట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు ఉన్నప్పటికీ నరేంద్ర ఇవ్వచూపిన లక్ష్మినరసింహస్వామి చిత్రపటాన్ని అందుకోవడానికి బాలకృష్ణ ప్రత్యేక ఆసక్తి చూపారు.

కార్యకర్తల అభీష్టం మేరకే నూజివీడు అభ్యర్థి ఎంపిక

గుంటూరు : ఎన్టీఆర్ ఫోటో వివాదంపై నందమూరి హరికృష్ణ చే సిన వ్యాఖ్యలు అర్ధరహితం అని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఏనాడూ ఎన్టీఆర్ ఫోటోను పక్కనపెట్టలేదని తెలిపారు.

ఎన్టీఆర్ కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కోడెల పేర్కొన్నారు. అక్కమాస్తుల కేసులో హోంమంత్రి సబితను నిందితురాలుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీీటుపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర కేబినేట్ దొంగలమయం అని ఆరోపించారు. చేవెళ్ల చెళ్లెమ్మ జైలుకు వెళ్లబోతోందన్నారు.

ప్రభుత్వ కార్యాక్రమాలతో పాటు చేవెళ్ల నుంచి వైఎస్ అవినీతి కార్యక్రమాలను ప్రారంభించారని విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు సిగ్గులేకుండా పదవులలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. తమ్ముళ్ల అవినీతి చూస్తే సీఎం ఎంత నీతిమంతుడో తెలుస్తుందని కోడెల శివప్రసాద్ ఎద్దేవా చేశారు.

హరికృష్ణ వ్యాఖ్యలు అర్ధరహితం : కోడెల

హైదరాబాద్ : కరెంట్ సమస్యలపై టీడీపీ తెలుగు మహిళా విభాగం మంగళవారం ఉదయం మినిస్టర్స్ క్వాటర్స్ వద్ద ఆందోళనకు దిగింది. క్వార్టర్స్ లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు.

టీడీపీ తెలుగు మహిళా విభాగం ఆందోళన..అరెస్ట్

రాష్ట్రంలో నెలకొన్న నిరాశాపూరిత వాతావరణాన్ని ఆశాపూరితంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని పలువురు యువతీ, యువకులు భావిస్తున్నారు. ఈమేరకు ఎఝ్కడికక్కడ చంద్రబాబు ప్రసంగాలు వినడం, ఆయనతో మాట్లాడడానికి యువతీ, యువకులే ఎక్కువగా ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ధైన్యాన్ని కుండబద్దలుకొట్టి చంద్రబాబుకు వివరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు యువత సమావేశాలలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగెస్,టీడీపీ పాలనలో ఉన్న తేడాలను ఈ సదస్సులో యువత వివరించారు.

సోమవారం జరిగిన యువజన సదస్సులో పలువురు యువతీ, యువకులు ఉత్సాహంగాపాల్గొన్నారు. చంద్రబాబును అనేక ప్రశ్నలు అడిగి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు తుని మండలం తిమ్మాపురంలో జరిగిన యువసదస్సులో పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. అవినీతిపై యువత పోరాడాలన్న చంద్రబాబు పిలుపునకు విద్యార్ధినీ, విద్యార్థులు స్పందించారు. జగన్, వైఎస్ అక్రమాలవల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు జైలుకెళ్లారని, ఈ పరిస్థితులు పోవాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని చంద్రబాబుతోపాటు.. పలువురు యువతీ, యువకులు ఆకాంక్షించారు.

విద్యుత్‌సంక్షోభంతో వేల పరిశ్రమలు మూతపడ
టంతోపాటు.. ఇతర రాష్ట్రాలకుతరలిపోతున్నాయని. ఉద్యోగాలు లేవని బోర్డులు పెట్టేశారని యువత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.

బాబు అడుగులో అడుగువేసి చంద్రబాబు పాదయాత్రలో యువత పాలుపంచుకున్నారు. కొంత మేర నడిచి ఆయనతో అనేక సమస్యలపై చర్చించారు. సదస్సులో అ.భిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశంలేని యువతీ, యువకులను పాదయాత్రలో వచ్చి తమ అహాప్రాయాలు చెప్పాలని చంద్రబాబు సూచించారు. దీంతో కొంతమంది యువకులు పాదయాత్రలో చంద్రబాబు వెంట నడిచి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

యువజనోత్సాహం

అనంతపురం అర్బన్: తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై ఉద్యమానికి సిద్ధమైంది. ఉద్యమ కార్యాచరణపై ఆదివారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అత్యవసర సమావేశమై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ ఎ మ్మెల్యే బీకే పార్థసారథి, పొలిట్‌బ్యూ రో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, ఎ మ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శమంతకమణి, అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మహాలక్ష్మి శ్రీనివాస్, ఉన్నం హనుమంతరాయచౌదరి, పేరం నాగిరెడ్డి, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి బీ వీ వెంకటరాముడు తదితరులు సమావేశమై చర్చించారు.

ముఖ్యంగా జిల్లా లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, విద్యుత్ కోతలు, విద్యు త్ చార్జీల పెంపు, ఉపాధి హామీ పను లు, పంటనష్ట పరిహారం, బీమాలో జరుగుతున్న అన్యాయం తదితర అంశాలపై ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 15,16 తేదీ ల్లో అన్ని మండల కేంద్రాల్లో భారీ ధ ర్నాలు నిర్వహించాలని నిర్ణయించా రు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 22న చలో కలెక్టరేట్ ని ర్వహించి కలెక్టరేట్‌ను దిగ్బంధించాల ని నిర్ణయించారు. అనంతరం ఆ పార్టీ నాయకుల సమక్షంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విలేఖరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.

మంత్రులు, అధికారులు కేవలం మా టలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్ర యత్నం చేస్తున్నారన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కరెంట్ కోతలు ఇష్టారాజ్యంగా విధిస్తున్నారని దీనివల్ల పంటలు ఎ ండిపోతున్నాయన్నారు. పంట నష్టపరిహారం, బీమా జాబితా తయారీలో అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జాబితా త యారీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే అనేక గ్రామాల నుంచి ఫిర్యాదులందాయన్నారు. వా తావరణ బీమా పేరుతో జిల్లా రైతుల ను దగా చేశారని మండిపడ్డారు. నా ణ్యమైన విత్తన వేరుశనగ సేకరణ ఇ ప్పటికే జరగాల్సి ఉన్నా ఎలాంటి చ ర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నా రు. విత్తన సేకరణలో కూడా కాంగ్రెస్ వర్గీయులు చేరి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

రైతులు అడిగే విత్తనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పట్ల ప్ర జలు విశ్వాసం కోల్పోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 9న వామపక్షాలు చేపట్టిన బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. బంద్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై టీడీపీ పోరు

అనంతపురం అర్బన్: విద్యుత్ చా ర్జీల పెంపు, కోతలను నిరసిస్తూ మం గళవారం నిర్వహించ తలపెట్టిన జిల్లాబంద్‌ను జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్‌రంగం తీవ్ర సంక్షోభానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కారణమన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో ప్రత్యేక సంస్కరణలు చేపట్టి అభివృద్ధి చేశారన్నారు. వాటిని కాంగ్రెస్ నాయకులు భూస్థాపితం చేశారని ఆరోపించారు. 2004లో రాష్ట్రంలో విద్యుత్ మిగులులో ఉండేదన్నారు. ఇపుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు సెంట్రల్ డిస్కౌంట్లతో రూ.1.80పైసలకు కొంటుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.12కు కొంటున్నాదన్నారు. ఆ భారాన్ని ప్రజలనెత్తిన వేసి, దోపిడీ చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో పూర్తిగా విఫలమైందన్నా రు. వీటిని నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిందన్నారు. వామపక్షాలు చేపట్టిన రాష్ట్రబంద్‌కు టీ డీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, బంద్ ను విజయవంతం చేసి, ప్రభుత్వం క ళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. స మావేశంలో అనంతపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహాలక్ష్మిశ్రీనివాస్, నగ ర అధ్యక్షుడు కృష్ణకుమార్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ పాల్గొన్నారు.

బంద్‌ను జయప్రదం చేయండి

కూడేరు: విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా మంగళవారం చే పట్టనున్న బంద్‌కు భారీగా తరలిరావాలని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. సోమవా రం శివరాంపేట గ్రామంలో విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా పల్లెలో విద్యుత్ కోతలు ఎత్తివేయాల నీ, వ్యవసాయానికి సక్రమంగా కరెం టు ఇవ్వాలని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో ఎమ్మె ల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పా లనలో రాష్ట్రం అంధకారంలోకి వె ళ్ళిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు పాలించే హక్కు లేదనీ, ప్రజలు ఏక మై బంద్‌లో పాల్గొనాలన్నారు. ఉరవకొండలో చేపట్టే బంద్‌కు భారీగా తరలిరావాలన్నారు. కార్యక్రమంలో టీడీ పీ జిల్లా ఉపా«ధ్యక్షుడు శ్రీధర్‌చౌదరి, మాజీ ఎంపీపీ బ్రహ్మయ్య, కూచె నాగరాజు, మురళీ, మండల కన్వీనర్ దేవేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు పాలించే హక్కు లేదు


కూడేరు: కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు, రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఉరవకొండ ఎమ్మె ల్యే పయ్యావుల కేశవ్ పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రాత్రి కూడేరుకు చెందిన రైతు శ్రీధర్ తోటలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్ చౌదరి, ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు,, సింగిల్ విండో అధ్యక్షుడు గుడిపూటి సురేష్, రైతులు పల్లె నిద్ర లో పాల్గొన్నారు. కరెంటు కోతలతో తాము పడుతున్న కష్టాలను రైతులు శ్రీధర్, బాట వెంకటేశులు, ఎమ్మెల్యేకు వివరించారు. కరెంటు ఎప్పుడోస్తుందో ఎప్పుడు పోతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందా రు. జనరేటర్‌తో నీరు పెట్టుకుంటున్నామనీ, ఇందుకు రోజుకు రూ.రెండు వేలు ఖర్చు వస్తుందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కేశవ్ విలేకర్లతో మా ట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలకు 3 గంటల కరెంటు వదలడం లేదన్నారు. కరెంటు రాక పంటలు తొలి దశలోనే ఎండిపోతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు పంటలు ఎండలేదని చెబుతున్నారనీ, క్షేత్రస్థాయిలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయన్నారు. సీఎం, మంత్రులు రావాలని సవాల్ విసిరారు. పంటల కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతుంటే ఎక్కడ పంటలు ఎండిపోలేదని మంత్రి పోన్నాల లక్ష్మయ్య చెప్పడం దారుణమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సక్రమంగా ఇవ్వలేని ఈ ప్రభుత్వం తక్షణం దిగిపోవాల్సిందేనన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి స్వయంగా పల్లె నిద్రలో రైతులతో మాట్లాడుతూ.. కష్టాల గూర్చి తెలుసుకొని ముఖ్యమంత్రి మంత్రుల భరతం పడుతానన్నారు. రాత్రికి తోటలోనే బసచేసి కరెంటు ఎప్పుడొస్తుంది? ఎప్పుడు పోతుందని స్వయంగా తెలుసుకునేందుకు వచ్చానన్నారు. తోటలో కరెంటు లేని సమయంలో పంటకు నీరు పెట్టడానికి జనరేటర్, మోటర్ పంపులు వినియోగిస్తున్నారన్నారు.

ఎండిన పంటను చూసి చలించిన ఎమ్మెల్యే కేశవ్... వేరుశనగ, వరి పంటలు విద్యుత్ కోతతో ఎండిపోయిన ప్రదేశాలను చూసిన ఎమ్మెల్యే చలించిపోయారు. ప్రభుత్వం విద్యుత్ సక్రమంగా సరఫరా చేయక రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులతో విద్యుత్ గూర్చి తోటల్లో పరిశీలిస్తే ఎండిన పంటలు, జనరేటర్లు కనిపిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వారితోపాటు కూచె నాగరాజు, మురళి, విజయభాస్కర్ గౌడ్, కన్వీనర్ దేవేంద్ర, శివయ్య, ఎస్పీ వెంకటనాయుడు, అంకె ఎర్రిస్వామి, సింగిల్ విండో సభ్యులు బాషా, బొమ్మయ్య, ఈశ్వరయ్య, ఆదెన్న, ఓబులేసు, కుసాల నాగరాజు, పరంధామ, నారాయణ, అక్కులప్ప, ఇప్పేరు శివ, శివశంకర్ నాయుడు, మలోబులు, జయప్రకాష్, రాఘవ, వెంకటనాయుడు, ఎర్రిస్వామి పాల్గొన్నారు.

కరెంటు కోతలపై ఎమ్మెల్యే కేశవ్ ఆగ్రహం