April 8, 2013

హైదరాబాద్ : ప్రజల సమస్యలను దగ్గరగా పరిశీలించడం కోసం... ఎంతదూరమైనా పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో శ్రమిస్తున్న తమ అధినేత చంద్రబాబును విమర్శించే నైతికహక్కు కేంద్ర మంత్రి చిరంజీవికి లేదని టీడీపీ తెలిపింది. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు సీఎం రమేష్, కాల్వ శ్రీనివాసులు, మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు.

చిరంజీవి సినిమాల్లో మాత్రమే మెగాస్టార్ అని, రాజకీయాల్లో ఆయనో దగాస్టార్ అని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ అజ్ఞాని చిరంజీవి అని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలని అప్పట్లో ప్రజలకు పిలుపునిచ్చిన చిరంజీవి.. తర్వాత అదే పార్టీలో ఎలా, ఎందుకు విలీనమయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

చిరు.. రాజకీయాల్లో 'దగా స్టార్' : టీడీపీ

ఎన్టీఆర్ ఫొటోని ఇంటికే పరిమితం చేయండి
పురందేశ్వరికి కేఈ కృష్ణమూర్తి హితవు

కర్నూలు : ఫొటోలు, ఫ్లెక్సీల వివాదం ఏదో రూపంలో రాజకీయ రంగాన్ని తాకుతూనే ఉంది. " ఎన్టీఆర్ కుమార్తెగా..మీ ఇంట్లో ఆయన ఫొటోలు పెట్టుకోండి. పూజించుకోండి. కానీ, ఆ మహానేత ఫొటోలను కాంగ్రెస్ నేతల చేతుల్లో పెట్టకండి'' అని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, డోన్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి ..కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరికి సలహా ఇచ్చారు. కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే అప్పట్లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లని కుక్క మూతి పిందెలు అని ఎన్టీఆర్ విమర్శించేవారని, అధికారం కోసం అలాంటి పార్టీలో చేరిన పురందేశ్వరిని ఏమనాలో ఆమే చెప్పాలని కోరారు. ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకొనే హక్కు టీడీపీకి మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి లక్ష్మీపార్వతి శనిగ్రహం లాంటిదని, ఎన్టీఆర్ మరణానికి ఆమే కారణమని విమర్శించారు. ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి రాకపోయి ఉంటే ప్రధాన మంత్రో, రాష్ట్రపతో అయ్యేవారని చెప్పారు.

మీ తండ్రిని కాంగ్రెస్‌పాలు చేయొద్దు!


వాటిని తేసేయాలని చెబుతామా?
వివాదంతో జూనియర్‌కు సంబంధంలేదు
తీవ్ర పరిణామాలుంటాయంటున్నారు..
నవ్వాలో, బాధపడాలో అర్థం కావడం లేదు
హరికృష్ణ ఘాటు వ్యాఖ్యలు
బావ, తమ్ముడిపై పరోక్ష విమర్శలు

హన్మకొండ: 'ఎన్టీఆర్ అందరి వాడు' అని ఆయన తనయుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పేర్కొన్నారు. బావ చంద్రబాబుపైనా, తమ్ముడు బాలకృష్ణపైనా పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ఫొటోను వాడుకోవడం రాజకీయ వ్యభిచారమైతే... ఆయన ఫొటోను పక్కన పెట్టేయడం ఏ వ్యభిచారమవుతుందని ప్రశ్నించారు. సోమవారం హన్మకొండలోని వేయి స్తంభాలగుడిలో ప్రత్యేక పూజలు చేసిన హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. విజయవాడ, గుంటూరులలో వైసీపీ ఫ్లెక్సీలలో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు వాడటంతో మొదలైన వివాదంపై స్పందించారు.

'ఎన్టీఆర్ ఫొటోను ఏ పార్టీ వారైనా వాడుకోవచ్చని అనను' అని అంటూనే.. 'రామారావుగారు దేవుడితో సమానం. భారదేశ చరిత్రలోనే కాదు.. మానవ జాతి మనుగడ ఉన్నంతవరకు అటువంటి మనిషి పుట్టడు. పుట్టబోడు. ఆయన అందరి మనిషి' అని తేల్చేశారు. "మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర ఫొటోను ఇంటింటా పెట్టుకున్నారు. ఆ మహామనిషి ప్రజల హృదయాల్లో ఉన్నారు.

ఇప్పుడు వెళ్లి ఆ ఫొటోలను తీసేయాలని చెబుతామా? ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ఉన్నత పదవులు అలంకరించిన ఎంతో మంది ఆ తర్వాత ఆయన ఫొటోను తమ కార్యాలయాల్లో పెట్టుకోలేదు. దీనిని ఏ వ్యభిచారం అనాలి?'' అని హరికృష్ణ ప్రశ్నించారు. ఇది తమ కుటుంబ వివాదంగా మారడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదంపై వివరణ ఇవ్వకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్‌కు బాలకృష్ణ స్పష్టం చేసిన అంశంపై హరికృష్ణ స్పందించారు. "ఆరోజు గుడివాడ ఎమ్మెల్యే నాని పార్టీని వీడి వెళ్లిపోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తనకు తానుగా మీడియాను పిలిచి.. దీంతో తనకు సంబంధం లేదని చెప్పారు.

తాతగారు పెట్టిన పార్టీలోనే ఉంటాను.. ఉంటున్నాను అని చెప్పారు. రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన వారు ఉంటారు. ఇవాళ ఎవరో అభిమాని ఫ్లెక్సీ పెట్టారు. అభిమానులను మనం కాదంటామా? వద్దంటే వారు వింటారా! దీనిపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించడం సరికాదు. దీనికి నవ్వాలా బాధపడాలా నాకర్థం కావటంలేదు'' అన్నారు. తీవ్ర పరిణామాలుంటాయని అనడాన్ని సంఘం హర్షించదని, నోటికి వచ్చింది మాట్లాడటం సరికాదని అన్నారు.

"కాంగ్రెస్ పార్టీ అయినా, మా నాన్న స్థాపించిన పార్టీ టీడీపీ అయినా, వైసీపీ అయినా నేను అడగబోయే ప్రశ్నలకు బజారులోకి వచ్చి సమాధానం చెప్పాలి. ప్రజల్లో నిలబడి మాట్లాడుకుందాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల్లోనే తేల్చుకుందాం'' అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి తాను, తన కుటుంబం ఎప్పుడూ ముందుంటాయని హరికృష్ణ స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ టీడీపీ సొత్తు: కళా వెంకట్రావు

కాకినాడ: ఎన్టీఆర్ టీడీపీ సొత్తు అని ఆ పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. వైసీపీ నేతలు తమ ఫ్లెక్సీలు వాడటం సరికాదన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలపై మాత్రం స్పందించబోనన్నారు.

పూజనీయుడిగా..
మహాత్మాగాంధీ, పూలే, జయప్రకాశ్ నారాయణ్.. వీరందరూ కులాలకు, మతాలకు, వర్గాలకూ అతీతంగా యావద్దేశం పూజించుకునే మహనీయులు. వీరితో పోల్చలేకపోయినప్పటికీ ఆంధ్రదేశానికి, తెలుగు ప్రజానీకానికి రామారావుగారు కూడా అంతటి పూజ్యనీయులే. ఈనేప«థ్యంలో అందరి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న రామారావుగారి ముద్రను తెలుగు వారి హృదయాలనుంచి చెరిపివేయలేరు. కోట్లాదిమంది పూజించుకునే రామారావుగారి బిడ్డగా దానిని నేను గౌరవంగా భావిస్తాను. ఆయన బిడ్డగా పుట్టడం ఈ ఒక్క జన్మ సుకృతం కాదని జన్మజన్మల సుకృతమని గతంలో చాలా సార్లు చెప్పాను. (ఆదివారం మీడియాతో మాట్లాడుతూ...)

ఒక వివాదం...
దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమాల్లో ఎవరో ఒకరిని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేస్తారని సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే... జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'బాద్‌షా' సినిమాలో ఆయన బాబాయి, సినీ హీరో బాలకృష్ణపైనే బ్రహ్మానందం క్యారెక్టర్‌తో సెటైర్‌లు వేయించినట్లు చెబుతున్నారు. 'శ్రీమన్నారాయణ' సినిమాలో బాలయ్య 'డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ది ట్రబుల్ ట్రబుల్స్ యు' అనే డైలాగ్‌ను వాడుకున్నారు. 'ట్రబుల్' స్థానంలో 'ఫైర్' అనే పదం పెట్టి 'డోన్ట్ ఫైర్ ది ఫైర్. ఇఫ్ యు ఫైర్ ది ఫైర్, ది ఫైర్ ఫైర్స్ యు' అని బ్రహ్మానందం హెచ్చరిస్తారు.

ఒక ప్రచారం..
'బాద్‌షా' సినిమాకు హిట్‌టాక్ వచ్చింది. దాదాపు అన్ని చోట్లా హౌస్‌ఫుల్‌గా నడుస్తోంది. అయితే... సినీ అభిమానాన్ని సీరియస్‌గా తీసుకునే కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య 'ఫ్లెక్సీల వివాదం'తో దూరం పెరిగింది. దీంతో... 'బాద్‌షా' అంత బాగాలేదు, చూడొద్దు అంటూ బాలయ్య అభిమానులు 'మౌత్ టాక్' స్ప్రెడ్ చేస్తున్నారట! ఇక... 'బాద్‌షా' సినిమా సూపర్ డూపర్ బంపర్ హిట్ అనిపించేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు యథాశక్తి కృషి చేస్తున్నారట! తామే పదుల సంఖ్యలో టికెట్లుకొని క్రేజ్‌ను మరింత పెంచుతున్నారని మరో 'టాక్'!

ఎన్టీఆర్ అందరివాడు! ఇంటింటా ఆయన ఫొటోలున్నాయి

కూడేరు: అవినీతిపై తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేయడం వల్లే మంత్రుల అవినీతి బాగోతాలు బయటపడ్డాయని, మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కేసు నమోదు అందులోభాగమని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

ఓబులాపురం గనుల్లో అక్రమాలు జరిగాయని తమ పార్టీ నాయకులు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు తదితరులు అనేకసార్లు పోరాటాలు చేసి న విషయం గుర్తుచేశారు. సీబీఐ చార్జిషీట్‌లోని మంత్రులను బర్తరఫ్ చేయాని డిమాండ్ చేశారు. కేబినెట్ నుంచి తొలగించి విచారణ చేపట్టాలని సీఎం, గవర్నర్‌లను కోరారు.

సబితపై కేసు.. మా విజయమే: పయ్యావుల


తూర్పుగోదావరిలో పాల్గొంటున్న బాబు
విజయవంతం చేయాలన్న కిషన్‌రెడ్డి
సర్కారుకు ప్రణాళిక లేదు: నారాయణ
బంద్‌కు టీఆర్ఎస్, జేఏసీల మద్దతు
పారిశ్రామిక సంస్థలదీ అదే బాట..
హైదరాబాద్ ఆటో జేఏసీ కూడా..
ఓయూ, కేయూ పరీక్షలు వాయిదా
విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ
రైళ్ల రాకపోకలు యథాతథం

హైదరాబాద్ : విద్యుత్ చార్జీల పెంపు, సర్‌చార్జీల మోత, కోతలకు నిరసనగా తామిచ్చిన పిలుపు మేరకు మంగళవారం బంద్‌ను విజయవంతం చేయడానికి విపక్షాలు సర్వసన్నద్ధమయ్యాయి. బంద్‌ను జయప్రదం చేయాలని అన్ని పార్టీల అగ్రనేతలూ కోరారు. అధికార కాంగ్రెస్ మినహా దాదాపు మిగిలిన పార్టీలు, సంఘాలన్నీ బంద్‌కు సానుకూలంగా ఉండటం, విద్యుత్ సంక్షోభంపై సాధారణ ప్రజలు, కుటీర పరిశ్రమలు సహా అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో బంద్ విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

విద్యుత్ కష్టాలకు నిరసనగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిందని, బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో ఆయన బంద్‌లో పాల్గొంటారు. మంగళవారం బంద్‌లో తామూ పాల్గొంటామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. బంద్‌కు అందరూ సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. విద్యుత్ సంక్షోభం తీవ్రత దృష్ట్యా ప్రజలు స్వచ్ఛందంగానే బంద్‌లో పాల్గొంటారని వివిధ పార్టీలు భావిస్తున్నాయి. విపక్షాల బంద్ నేపథ్యంలో ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు తమ పరిధిలో మంగళవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదావేశాయి.

ఓయూలో వాయిదా పడిన పరీక్షను ఈనెల 30న నిర్వహిస్తారు. కాగా.. విపక్షాలు బంద్‌కు పారిశ్రామిక సంస్థలు మద్దతు ప్రకటించాయి. కోతల వల్ల చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూసేయాల్సి వస్తోందని తెలంగాణ పారిశ్రామికుల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి అన్నారు. బంద్‌కు మద్దతుగా చర్లపల్లి సబ్‌స్టేషన్ ముందు పారిశ్రామికవేత్తలు సోమవారం ధర్నా చేశారు. వనరులు అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్లే విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్ ఆటో జేఏసీ కూడా బంద్‌కు మద్దతు తెలిపింది.

ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను ఎత్తేయాలి: కోదండరాం
తెలంగాణలోని ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను ఎత్తేసి.. ప్రభుత్వమే విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు సరఫరా చేయాలని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్‌చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలని కోరారు. మంగళవారం చేస్తున్న బంద్‌కు జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఆంధ్రా ప్రాంత రైతులకు 7 గంటల పాటు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేస్తూ తెలంగాణ రైతులకు మాత్రం 3-4 గంటలే ఇస్తోందని ఈటెల రాజేందర్ కోరారు.

హింసకు పాల్పడితే చర్యలు: డీజీపీ
బంద్ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు పాల్పడేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని డీజీపీ దినేష్‌రెడ్డి హెచ్చరించారు. బంద్ నేపథ్యంలో సోమవారం ఆయన తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచే బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. విద్యార్థుల పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆస్తులపై ఆందోళనకారులు దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైళ్ల రాకపోకలు యథాతథం
బంద్ నేపథ్యంలో.. పోలీసు బందోబస్తుతో రైళ్లను యథాతథంగా నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు.. ఎంఎంటీఎస్ సర్వీసులన్నింటినీ ఎప్పట్లాగే నడపాలని అధికారులు నిర్ణయించారు.

నేడు రాష్ట్ర బంద్ విద్యుత్ సమస్యలపై విడివిడిగా పార్టీల పిలుపు

నాకు సంబంధంలేని వివాదాల్లోకి లాగొద్దు!

హైదరాబాద్ : "అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నాది ఒకే మాట! నా వంట్లో నందమూరి రక్తం ప్రవహిస్తోంది. తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకే కట్టుబడి ఉంటాను'' అని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీల వివాదంపై సూటిగా స్పందించకుండా... 'నాకు సంబంధంలేని వివాదాల్లోకి నన్ను లాగొద్దు' అని కోరారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన 'బాద్‌షా' విజయోత్సవ సభలో జూనియర్ పాల్గొన్నారు. తన ఫొటోలను వైసీపీ నేతలు వాడుకోవడం గురించి మీడియా ప్రస్తావించగా... "బాద్‌షా సినిమా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఇప్పుడు నన్ను వివాదాల్లోకి లాగి ఆ ఆనందాన్ని దూరం చేయకండి. నాకు సంబంధంలేని వివాదాల్లోకి నన్ను లాగొద్దు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చెప్పినా ఒక్కటే! నా అభ్యున్నతికి కారణమైన మా తాతగారు స్థాపించిన పార్టీకే అండదండగా ఉంటాను'' అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకే కట్టుబడి ఉంటాను: జూనియర్

ఒకప్పుడు వీళ్లను మంచినీళ్ల బావుల దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఊరి చెరువుపై వీళ్ల నీడ కూడా పడనిచ్చేవారు కాదు. ఆ తరువాత రాజ్యాలు పోయి.. రాజ్యాంగం వచ్చింది. కానీ, ఈ ఎస్సీ కాలనీలు అప్పుడు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడూ అక్కడే ఉన్నాయనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. అప్పుడే మెరుగేమోనని కూడా అనిపిస్తోంది. అప్పట్లో దూరం పెట్టినా.. నీళ్లయితే ఏదోలా తెచ్చుకునేవారు.. ఇప్పుడు ఎన్ని దూరాలు నడిచినా చుక్క నీరు పుట్టడం లేదు.

చెరువుల్లోకి దిగినా నీటిచెమ్మ కాలికి తగలడం లేదు. టి.తిమ్మాపురంలో రెండు రోజులుగా నేను చూసినదీ, వాళ్లతో వీళ్లతో మాట్లాడి తెలుసుకున్నదయితే ఇదే. కుక్కనుంచి తప్పించుకుంటే నక్క సిద్ధంగా ఉంటుందన్నట్టు.. కుల వివక్షను ఎంతో కొంత తప్పించుకొని ముందుకొచ్చిన ఈ జాతిని జాలిలేని పాలకులు పట్టపగలే దోచేస్తున్నారు. ఈ కాలనీవాళ్లూ నీళ్లు కొంటారు. కానీ, తాము తాగేది తక్కువ.. పసరాల గొంతు తడిపేది ఎక్కువగా ఉండటం నేను చూశాను. మూగ జీవుల మీద ఇంత జాలి గల మనుషులపై ఈ పాలకులకు మాత్రం జాలి లేదు.

మొండి గోడలు.. కప్పు లేని ఇళ్లు..కాలనీలోని చాలామంది 'గూడు' ఇదే. ఇలాంటి ఇళ్లు ఒక 15 దాకా చూశాను. ఎందుకిలా? 'ఏం చేయమంటావయ్యా..! మా దగ్గర ఉన్న

బతికినంత కాలం చాకిరీ చేస్తూనే బతికామని, సొంత కొంపలో కన్ను మూయాలన్న కోరిక కూడా తీరేటట్టు లేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మాత్రం ఇల్లు వేసుకోవడానికి కూడా అప్పు చేయాల్సి వచ్చిందని మరికొందరు చెప్పుకొచ్చారు. దానికి నెల వాయిదాలు కట్టడానికే కూలీ చాలడం లేదని ఓ ఆడపడుచు కళ్లు ఒత్తుకుంది. ఇల్లు కాల్చి చుట్ట ముట్టించుకునేవాడికీ, ఈ పాలకులకూ తేడా ఉందా?
డబ్బులతో ఇంటిని ఇంతవరకే లేపగలిగాం. ఆదుకుంటామన్న సర్కారు ముఖం చాటేసింది. ముందు కట్టుబడి మొదలుపెట్టండి.. బిల్లులు తరువాత ఇస్తాం అన్న అధికారులు కనిపించడం మానేశారు'' అని ఓ వృద్ధుడు వాపోయాడు.

ఇల్లు కాల్చి చుట్ట ముట్టించుకుంటారా?

కేబినెట్ నుంచి ఉద్వాసన పలకాలి
సెక్రటేరియట్‌లో మరికొందరు 'దొంగలు'
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం

కాకినాడ : జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలైన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అరెస్టు చేయాలని, ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వాన్‌పిక్ అవినీతిలో ప్రమేయం ఉన్న ధర్మాన ప్రసాదరావుపై కూడా వేటు వేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకూ నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం టి. తిమ్మాపురం ఎస్సీ కాలనీ నుంచి సోమవారం చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు.

తిమ్మాపురం, తేటగుంట సెంటర్, రాజుల కొత్తూరుల మీదుగా ఆయన నడక సాగించారు. వైఎస్ హయాంలో గనుల శాఖను నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును దాల్మియా సిమెంట్‌కు లబ్ధి చేకూర్చిన వ్యవహారంలో ముద్దాయిగా సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాన్ని యాత్రలో ప్రధానంగా ప్రస్తావించారు. కరెంటు సమస్యలపై తెలుగుదేశం సంతకాల సేకరణ చేపట్టగా, లక్ష కోట్లు దోచుకుని జైల్లో ఉన్న జగన్‌ను విడిపించుకోవడానికి వైసీపీ సంతకాలు సేకరిస్తున్నదని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన వాళ్లలో కొంతమంది జైల్లో ఉంటే కొందరు సెక్రటేరియట్‌లో ఉన్నారన్నారు.

అక్రమార్కులందరినీ అరెస్టుచేస్తే చంచలగూడ జైల్లోనే క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాల్సి ఉంటుందని ఎద్దేవాచేశారు. అవినీతిలో ప్రమేయం ఉన్న మంత్రులను కాపాడే పనిలో సీఎం బిజీగా ఉన్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. వచ్చే ఎన్నికలలో పిల్లకాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంటే ఢిల్లీలో తాకట్టుపెట్టి జగన్ జైలు నుంచి బయటపడటానికి ఉపయోగించుకుంటారన్నారు. తాము ప్రతిపాదించిన నగదు బదిలీ పథకానికి కేంద్రం చెబుతున్న స్కీంకూ సంబంధమే లేదని తేటగుంట సెంటర్‌లో జరిగిన సభలో అన్నారు.

తనకు ఉపాధి పథకం పని చూపించడం లేదని ఓ మహిళ చంద్రబాబుకు విన్నవించగా.. పనితో సంబంధం లేకుండా నెలకు రూ. 15 వేలు కూలీల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. దీని వల్ల ఉపాధి హామీ అవినీతిని అరికట్టవచ్చని, వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా ఉపాధికూలీలు అటు మళ్లడానికి అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ఉచిత బియ్యం పథకం ప్రారంభిస్తామని వెల్లడించారు. బుద్ధి ఉన్నవాడెవడూ ప్రాజెక్టులేకుండా కాల్వలు తవ్వరని, కానీ, జగన్‌కి దోచిపెట్టడం కోసం వైఎస్ ఆ పని చేశారని దుయ్యబట్టారు.

కాగా, పాదయాత్రకు ముందు టి. తిమ్మాపురంలో కైట్ ఇంజనీరింగ్ విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నాడు బిల్‌గేట్స్ కుదరదని చెప్పినా.. పట్టుబట్టి తాను పది నిమిషాల అపాయింట్‌మెంట్ తీసుకోవడం వల్లే హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో జగన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. "రాష్ట్రంలో చదువుకోని వారు సమర్థిస్తున్నారంటే ఏమోలే అనుకోవచ్చు. చదువుకున్న వాళ్లూ జగన్‌ను సమర్థించడాన్ని నమ్మలేకపోతున్నాను'' అని వ్యాఖ్యానించారు.

'నాయకుడన్న వాడికి విజన్ ఉండాలి. పీవీ హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశంలో అభివృద్ధికి నాందిపడింది. అయితే దాన్ని కొనసాగించడంలో నాయకులు విఫలమయ్యారు. వైఎస్ సీఎంగా ఉన్నపుడు కొడుకు జగన్‌కు లక్ష కోట్లు దోచి పెట్టాలని విజన్ పెట్టుకున్నాడు'' అని దుయ్యబట్టారు. "కుటుంబ నియంత్రణ, మహిళా అక్షరాస్యత, డ్వాక్రా తదితర ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. కుటుంబ నియంత్రణ, మహిళా అక్షరాస్యత వల్ల సంపద పెరిగింది.

ఐటీ అభివృద్ధితో నక్సలిజం వైపు వెళ్లే యువత ఉద్యోగాల వైపు మళ్లింద''ని చెప్పుకొచ్చారు. అనంతరం పాదయాత్ర ముగింపు సభ, ఇతర సన్నాహాల గురించి విశాఖ జిల్లా ముఖ్యనేతలతో టీ. తిమ్మాపురంలోని తన బసలో చంద్రబాబు సమీక్ష జరిపారు. ఇదే సమావేశంలో విశాఖలో ఆయన పాదయాత్ర రూట్‌మ్యాప్ ఖరారు చేశారు.

సబితను అరెస్టు చేయాలి!

వస్తున్నా మీ కోసం పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు దేశంలోనే అత్యంత దూరం నడిచిన రాజకీయ నేతగా చంద్రబాబు అరుదైన రికార్డు నెలకొల్పారు. 186 రోజులలో 2,642 కిలోమీటర్ల మేర నడిచిన చంద్రబాబు గతంలో ఏ నాయకుడూ చేయని కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇరవై రోజుల వ్యవధిలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన ఘనత కూడా టీడీపీ అధినేతకే దక్కుతుంది. స్వాతం త్య్రం వచ్చాకా మరే రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా కార్యకర్తల సమావేశా లు నిర్వహించిన దాఖలాలులేవని రాజకీయవేత్తలు చెప్తున్నారు. మార్చి 20వ తేదీన జిల్లాకు చేరుకున్న చంద్రబాబు 18 రోజులలో 18 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తుని మినహా జిల్లాలో అన్ని నియోజవర్గాల కార్యకర్తలతోనూ చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు.

రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2, 3 గంటల వరకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పార్టీ స్థానిక నాయకుల ప్రసంగాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడంలేదు. ముఖ్యమైన అంశాలు చంద్రబాబు మాట్లాడి.. తర్వాత పార్టీ పటిష్టతకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి కార్యకర్తలకే అవకాశం ఇస్తున్నారు.

సీరియస్‌గా సమీక్ష

సమీక్ష సమావేశాలు సాదాసీదాగా నిర్వహించడంలేదు. కార్యకర్తలు మాట్లాడేటపుడు సైతం మరే నాయకుడూ మాట్లాడటానికి అవకాశంలేదు. వేదికపై వున్న నేతలపై ఫిర్యాదు చేయడానికీ కార్యకర్తలకు అవకాశం ఇస్తున్నారు. మా నాయకుడు మెతక వైఖరి వల్ల పార్టీ బలోపేతంకావడంలేదని ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యేలపై వారి సమక్షంలోనే చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన దాఖలాలు అనేకం చోటుచేసుకున్నాయి. కొన్ని సమీక్షల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతల మొహమాటాల వల్ల పార్టీ పటిష్టతకు ఇబ్బంది ఏర్పడుతుందని కూడా చంద్రబాబుకు పలువురు కార్యకకర్తలు చెప్పడం గమనార్హం.

సూచనలు రాసుకుంటూ..

కార్యకర్తలు చెప్పే విలువైన సూచనలు, సలహాలు చంద్రబాబు స్వయంగా పుస్తకంలో రాసుకుంటున్నారు. ఆయా కార్యకర్తల ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇస్తున్నారు. సూచనలు చెప్పిన కార్యకర్తలను పేర్లతో సంభోదించి వారు చెప్పిన సలహాపైనా చంద్రబాబు సమీక్ష సమావేశంలో విశ్లేషణ చేస్తున్నారు. పాదయాత్రకు జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఈ 18 రోజులలో 18 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాలతోపాటు.. బీసీ, బ్రాహ్మణ, కాపు తదితర సామాజిక వర్గాల నేతలతోనూ, యువత సమావేశాలు నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గం నుంచీ 2 నుంచి 3 వేల మంది వరకు కార్యకర్తలు హాజరవుతున్నారు.

టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం

చంద్రబాబు పాదయాత్ర, నియోజకవర్గాల సమీక్షతో టీడీపీ కార్యకర్తలు నూతనోత్సాహంతో కదంతొక్కుతున్నారు. పాదయాత్రలో చంద్రబాబు వెంట నడవడానికి పోటీపడుతున్నారు. స్థానికులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పాదయాత్రకు హాజరవుతున్నారు. వందలాదిమంది జిల్లా స్థాయి నేతలు చంద్రబాబు వెంట సాగుతున్నారు. ఈ ఉత్సాహం , చంద్రబాబు స్ఫూర్తి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో తమకు తిరుగులేదని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు.

కార్యకర్తలతో మమేకం!

సామర్లకోట: అప్రకటిత విద్యుత్ కోతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంన్న దృష్ట్యా ప్రజా సమీకరణతో విద్యుత్ ఉద్యమం తీవ్రతరం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. పార్టీ సామర్లకోట కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో పార్టీ నాయకులు అడబాల కుమార స్వామి, మన్యం చంద్రరావు, అలమండ చినఅప్పారావు, కంటే జగదీష్ మోహన్, కమ్మిలి సుబ్బారావు, బడుగు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంపుదలను నిరసిస్తూ చేపట్టిన ప్రజల సంతకాల పత్రాలను పార్టీ జిల్లా కార్యవర్గానికి సోమవారం అందజేయనున్నట్లు చెప్పారు. రోజుకు కనీసం పది గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయకపోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఏజే చక్రవర్తి, జట్ల మో హన్, చుండ్రు బలరామ్, గొల్తి సత్యనారాయణ, చందలాడ రాంబా బు, తాతపూడి కృషవంశీ, తాతపూడి కృషబాబు, దారబాని సూరిబాబు, కరికం గోపాలం, సొసైటీ ఉపాధ్యక్షులు బావిశెట్టి చక్రం, బీబీ జాన్ పాల్గొన్నారు.

'విద్యుత్ ఉద్యమం తీవ్రతరం చేస్తాం'

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ అ ధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు వస్తున్నా మీకోసం కా ర్యక్రమంలో తుని నియోజక వర్గ పరిధిలోని తొండంగి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం నిర్వహించిన పాదయాత్రకు అనూహ్య స్పందన ల భించింది. చంద్రబాబు ఈసారి పాదయాత్రలో ప్రయోగాలు చేశారు. దారిపొడవునా ఉన్నా వివిధ వ్యాపారులు, కూలీలు, ప్రయాణీకులు, ఆటో డ్రైవ ర్లు, స్వీపర్లు, మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు, పూజారులు వంటి వర్గాలతో ఆయన సంభాషించారు. సెక్యూర్టీనీ కూడా పట్టించుకోకుండా రోడ్డు సమీపంలోని కాలనీలో, ఇళ్లలోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నా రు.

ఎ.కొత్తపల్లి గ్రామంలో ఒక ఎస్సీ కాలనీలోకి వెళ్లడంతో అక్కడ మహిళలు పిల్లలు, వృద్ధులు గబాగబావచ్చి చంద్రబాబుకు కుర్చీ వేయడం కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ ఒక కుర్చీకూడా సరిగ్గా లేకపోవ డంతో ఒక పెద్దాయన నులక మంచం రోడ్డు పై వేయడంతో చంద్రబాబు ఆమంచంమీదే కూర్చున్నారు. ఆయన తన పక్క న వృద్ధులను పిల్లలను కూర్చోబెట్టుకుని అక్కడ సమస్యల గురించి ఆరా తీశారు. ఎన్టీఆర్ హయాంలో ఇక్కడ కాలనీ నిర్మించి ఇల్లు ఇచ్చారన్నారు. కాని ఇవాళ కొత్తవారెవ్వకీ ఇల్లు ఇవ్వ డం లేదని నిత్యావసర సరుకుల ధర లు విపరీతంగా పెరిగిపోయాయని తాము బతకడమే కష్టమవుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వృద్ధురాలు చంద్రబాబును తమ బతుకులు బాగుచేయాలని కోరగా ఆయన ఆమెను ఓదార్చి ప్రజల కన్నీళ్ళు, కష్టా లు తెలుసుకోవడం కోసమే తాను ఈ పాదయాత్రకు వచ్చానని కాళ్ళు నొప్పు లు వస్తున్నా పట్టించుకోకుండా ప్రజల కష్టాలు అర్ధం చేసుకుంటున్నానన్నారు. మీరంతా అవినీతి, ప్రజావ్యతిరేక కాం గ్రెస్ ప్రభుత్వంపైనా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, అతని కొడుకు అవినీతిని తెలుసు కుని దానివల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారో అర్ధం చేసుకోవాలన్నారు.

మీ రంతా తనను ఆశీర్వదిస్తే రామరాజ్యం తీసుకువస్తానన్నారు. అంతకుముందు శారదా విద్యానికేతన్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంత రం అన్నవరం దేవస్థానం అర్చకులతోను, బ్రాహ్మణ వర్గీలతో చర్చించారు. సెజ్‌ల పేరిట భూములు కోల్పోయిన బాధితులు చంద్రబాబు వద్దకు వచ్చి తమను ఆదుకోవాలని కోరగా ఆయన స్పందించారు. అక్కడ నుంచి గోపాలపట్నం మీదుగా పాదయాత్ర నిర్వహి స్తూ ఇటుక బట్టీల కార్మీకులతోను, ఆటోడ్రైవర్లతోను, స్వీపర్లతోను మాట్లాడారు.ఎ.కొత్లపల్లి వద్ద ఉమర్అలీషా భక్తులు ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళలు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి శృంగవృక్షం గ్రామానికి చేరే స మయంలో కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ యాత్ర ప్రారంభించారు.

శనివా రం గోపాలపట్నం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం, వలసపాకల అగ్రహారం, పి.ఆ గ్రహారం మీదుగా టి.తిమ్మాపురం వర కూ 9 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వ హించారు. ఆయన వెంట టీడీపీ పొలి ట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, నియోజక వర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు, జిల్లాకు చెందిన నేతలు పాల్గొన్నారు.

రాజమండ్రి: రాజకీయ నేతలంటే యనమల రామకృష్ణుడులా ఉండాలని ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా పలు మంత్రి పదవులు చేసి నా కీలక పదవులు పోషించినా నిజాయి తీ, సచ్చీలుడుగా ఉండాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఆయనలో అవినీతి లేదని చెప్పారు. కాని వైఎస్ ఒక్కసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనే లక్ష కోట్లు దోచుకుని కొడుక్కి అప్పగించారని విమర్శించారు.

ఆశీర్వదించండి రామారాజ్యం తెస్తా..

చిత్తూరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడాన్ని నిరశిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో 9వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, అధికార ప్రతినిధి వి.సురేంద్ర కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.6,500 కోట్ల విద్యుత్ చార్జీల అదనపు భారాన్ని మోపిన ప్రభుత్వం కేవలం రూ.840 కోట్లు మాత్రమే తగ్గిస్తామని ప్రకటించడం ఎంత వరకు న్యాయమని వారు ప్రశ్నించారు.

మొక్కుబడిగా 200 యూనిట్ల వరకు ధరను పెంచలేదని, 200 యూనిట్లు దాటితేనే చార్జీలు పెంచామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదంగా వుందన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వ తీరును నిరశిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 9వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు.


రేపటి బంద్‌ను విజయవంతం చేయాలి: టీడీపీ

అనంతపురం అర్బన్: తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై ఉద్యమానికి సిద్ధమైంది. ఉద్యమ కార్యాచరణపై ఆదివారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అత్యవసర సమావేశమై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ ఎ మ్మెల్యే బీకే పార్థసారథి, పొలిట్‌బ్యూ రో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, ఎ మ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శమంతకమణి, అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మహాలక్ష్మి శ్రీనివాస్, ఉన్నం హనుమంతరాయచౌదరి, పేరం నాగిరెడ్డి, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి బీ వీ వెంకటరాముడు తదితరులు సమావేశమై చర్చించారు.

ముఖ్యంగా జిల్లా లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, విద్యుత్ కోతలు, విద్యు త్ చార్జీల పెంపు, ఉపాధి హామీ పను లు, పంటనష్ట పరిహారం, బీమాలో జరుగుతున్న అన్యాయం తదితర అంశాలపై ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 15,16 తేదీ ల్లో అన్ని మండల కేంద్రాల్లో భారీ ధ ర్నాలు నిర్వహించాలని నిర్ణయించా రు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 22న చలో కలెక్టరేట్ ని ర్వహించి కలెక్టరేట్‌ను దిగ్బంధించాల ని నిర్ణయించారు. అనంతరం ఆ పార్టీ నాయకుల సమక్షంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విలేఖరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.

మంత్రులు, అధికారులు కేవలం మా టలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్ర యత్నం చేస్తున్నారన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కరెంట్ కోతలు ఇష్టారాజ్యంగా విధిస్తున్నారని దీనివల్ల పంటలు ఎ ండిపోతున్నాయన్నారు. పంట నష్టపరిహారం, బీమా జాబితా తయారీలో అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జాబితా త యారీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే అనేక గ్రామాల నుంచి ఫిర్యాదులందాయన్నారు. వా తావరణ బీమా పేరుతో జిల్లా రైతుల ను దగా చేశారని మండిపడ్డారు. నా ణ్యమైన విత్తన వేరుశనగ సేకరణ ఇ ప్పటికే జరగాల్సి ఉన్నా ఎలాంటి చ ర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నా రు. విత్తన సేకరణలో కూడా కాంగ్రెస్ వర్గీయులు చేరి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

రైతులు అడిగే విత్తనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పట్ల ప్ర జలు విశ్వాసం కోల్పోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 9న వామపక్షాలు చేపట్టిన బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. బంద్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై టీడీపీ పోరు

బెల్లంపల్లి : విద్యుత్ చార్జిల పెంపుకు వ్యతిరేకంగా టీడీపీ కాల్‌టెక్స్ ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో నిర్వహించింది. టీడీపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాటి సుభద్ర ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పాలన అవినీతి అక్రమాలతో సాగుతుందని విమర్శించారు.

విద్యుత్ ఛార్జీలు, సర్‌ఛార్జీలు పెంచి వేలాది కోట్లాది రూపాయల భారాన్ని పేద ప్రజలపై మోపారని టీడీపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాటి సుభద్ర అన్నారు. ఆదివారం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల లచ్చన్న, గెల్లి రాజలింగుల ఆధ్వర్యంలో పట్టణంలోని కాల్‌టెక్స్‌లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను అరికట్టడంలో విఫలమైందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ చార్జీలు పెంచారని విమర్శించారు. నాడు చంద్రబాబు పాలనలో 5129 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేదని కొనియాడారు. ముఖ్యమంత్రి కిరణ్ పాలనలో రైతులకు 9 గంటలకు బదులు కేవలం 3 గంటలే విద్యుత్ సరఫరా చేయడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

ప్రజలు చీకట్లో జీవించే పరిస్థితి వచ్చిందని టీడీపీ జిల్లా ఉపాద్యక్షులు కొప్పుల లచ్చన్న, గెల్లి రాజలింగు,ముర్కూరి చంద్రయ్య, సీనియర్ నాయకులు అడప పాపయ్య, జిలకర వాసు, జిల్లెల అశోక్‌గౌడ్, కొల్లూరి కిష్టయ్య, కాంపెల్లి రాజం పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని కాల్‌టెక్స్ ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ బెల్లంపల్లి మండల అద్యక్షుడు ఇప్ప రవి, నాయకులు మ ల్లయ్య, బలరాం, భాస్కర్, వేల్పులశంకర్, రవిగౌడ్, సోగాల సాగర్, నిచ్చకో ల్ల భాగ్యలక్ష్మీ, భగవాన్‌సింగ్, గీస రా జేశం, ఎస్‌కె ఇబ్రహీం, ఎస్‌కె వాజిద్‌పాల్గొ న్నారు.

విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ రాస్తారోకో

మంచిర్యాల:తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం పోరు ప్రారంభమైంది. నియోజకవర్గ ఇన్‌చార్జీల పదవుల కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీం తో నియోజకవర్గ ఇన్‌చార్జీల ఎంపిక వ్యవహారం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇన్‌చార్జీలుగా నియమించి న వారికే శాసనసభా ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉండడంతో ప లువురు నేతలు ఇన్‌చార్జి పదవుల కో సం పోటీ పడుతున్నారు.

జిల్లాలో ఎంపీ రాథోడ్ రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావుతో ఆశావహులు మంతనాలు జ రుపుతూ ఇన్ చార్జి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి ని యోజకవర్గాలకు చెందిన పార్టీ సమన్వయ కార్యకర్తల సమావేశాన్ని మం చిర్యాలలో ఏర్పాటు చేయగా, గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. దీంతో మంచిర్యాల, చెన్నూర్, ఆసిఫాబాద్ ఇన్‌చార్జీల నియామకాన్ని వాయి దా వేశారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా ఇన్‌చార్జీ మండవ వెంకటేశ్వర్‌రావుతో పాటు ఎంపీ రాథోడ్ రమేష్, జిల్లా అ ధ్యక్షుడు నగేష్ సమావేశాన్ని నిర్వహిం చి ఇన్‌చార్జీలను నియమించేందుకు ప్రయత్నించగా, మెజార్టీ నాయకులు కొందరి పేర్ల ను వ్యతిరేకించారు. దీం తో మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జీల నియామకాన్ని వాయిదా వేశారు. కేవలం బెల్లంపల్లి ఇన్‌చార్జీగా డాక్టర్ పాటి సుభద్రను నియమించారు. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండగా, పార్టీ అధిష్టానం నియోజకవర్గాల ఇన్ చార్జీల నియామకాల్లో జా ప్యం చేస్తున్నందు వల్ల నాయకులు, కా ర్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

జిల్లాలోని తూర్పు ప్రాంతం లో తెలుగుదేశం పార్టీ గతంలో బలోపేతం గా ఉండగా, ఇటీవలి కాలంలో జరిగిన వలసల కారణంగా బలహీనపడింది. మంచిర్యాల నియోజకవర్గ ఇన్ చార్జీ పదవి కోసం టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు నల్మాస్ కాంతయ్య, ఎం వినయ్‌ప్రకాష్‌రావు, బెల్లంకొండ మురళీధర్ రావు, కేవీ ప్రతాప్, కొండేటి సత్యం, డాక్టర్ రఘునందన్, జక్కుల రాజేశం, గాజుల ముకేష్‌గౌడ్ పోటీ ప డుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గోనె హ న్మంతరావుకు సన్నిహితుడైన ముకేష్ గౌడ్‌ను ఇటీవల తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. మొదటి నుంచి మంచిర్యాల నియోజకవర్గ ఇన్ చార్జి పదవిపై ఆశలు పెట్టుకుని, రా బోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సి ద్ధపడ్డ ముకేష్‌గౌడ్‌కు తెలుగు యువత జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టి ఆయన ఆశలపై నీళ్లు చల్లారు.

చెన్నూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోసం అందుగుల శ్రీనివాస్, సంజయ్‌కుమార్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఆసిఫాబాద్‌లో ఇన్ చార్జ్జి పదవి కోసం సీనియర్ నాయకు లు అరిగెల నాగేశ్వర్‌రావు, ఆత్రం భగవంతరావు పోటీ పడుతున్నారు.

టీడీపీలో పదవుల కోసం పోటీ

హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే హక్కు చిరంజీవికి లేదని టీడీపీ నేతలు బొజ్జల, సీఎం రమేష్, కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ భయపడే చిరంజీవిని ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఎన్నికల ముందు పంచలు ఊడదీసి కొడతామని, ఇప్పుడు పంచెల చాటున దాక్కున్నారని ఘాటుగా విమర్శించారు. పీఆర్పీది ఫెయిల్యుర్ పార్టీ అని, మార్పు, మార్పు అంటూ పార్టీనే మార్చేసారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.

చంద్రబాబును విమర్శించే హక్కు చిరంజీవికి లేదు : టీడీపీ నేతలు

వరంగల్ : ఫ్లెక్సీల వివాదంపై టీడీపీ ఎంపీ
హరికృష్ణ అసహనం వ్యక్తపరిచారు. సోమవారం ఉదయం జిల్లాలోని మల్లూరు హేమచల నర్సింహస్వామిని హరికృష్ణ సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ వ్యవహారాలపై మీరు అడగాల్సింది తాను చెప్పాల్సింది చాలా ఉందని, త్వరలో మీడియాతో అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. దైవ సన్నిధిలో వివాదాలపై మాట్లాడటం సరికాదన్నారు.

ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకోవడం రాజకీయ వ్యభిచారం అనడం తప్పని, ఆనాడు ఎన్టీఆర్ ఫోటోను పెట్టనివారిని ఏమనాలని ప్రశ్నించారు. ఎవరైనా ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడం వారి వ్యక్తిగతం అని హరికృష్ణ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్లెక్సీల్లో ఫోటోతో సంబంధంలేదన్నారు, టీడీపీలోనే ఉంటానని జూ.ఎన్టీఆర్ ఏనాడో చెప్పారని గుర్తు చేశారు. ఎవరో చేసినదానికి జూ.ఎన్టీఆర్ బాధ్యుడు కాదని హరికృష్ణ స్పష్టం చేశారు.

ఫ్లెక్సీల వివాదంపై హరికృష్ణ అసహనం