April 7, 2013

టీడీపీలో 83 నాటి ఊపు
కృష్ణా జిల్లా పర్యటనలో సినీనటుడు బాలకృష్ణ

విజయవాడ : తన తండ్రి ఆశయ సాధన కోసం.. ప్రజలు, రైతులు, అభిమానుల కోసం తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, అందరూ తనను ఆశీర్వదించాలని సినీనటుడు బాలకృష్ణ కోరారు. ఎన్టీఆర్ తరువాత రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు చంద్రబాబేనని ఆయన కొనియాడారు. 1983 నాటి తెలుగుదేశం పార్టీ వైభవం మళ్లీ ఇప్పుడు సాక్షాత్కరిస్తుందని బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఆదివారం ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.

టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి విస్సన్నపేట, రెడ్డిగూడెం మండలాలోని కలగర, రేపూడి తండా, కుమ్మరికుంట్ల, హనుమల్లంక, గంపలగూడెం మండలం పరిధిలోని కొత్తపల్లి, పెదకొమర, సత్యాలపాడు, పెనుగొలను తదితర ప్రాంతాల్లో బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు.

కలగర గ్రామంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కష్టాల్లో ఉన్నప్పుడు, తెలుగుజాతి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టుకు గురైనప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిని కీలుబొమ్మలా ఆడించిన తరుణంలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేశారన్నారు. తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపజేశారని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులెవరూ పాలన వ్యవహారా ల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారు. అలా చేసిన వారు ఇప్పుడు జైలులో ఉన్నారని బాలయ్య వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పాలనపై నిప్పులు
టీడీపీ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తే, కాంగ్రెస్ హయాంలో అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరగటానికి, సర్ చార్జీల భారం మోపటానికి నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవలంబించిన విధానాలే కారణమన్నారు. ఆ తరువాత కుమ్మరికుంట్ల గ్రామంలో మాట్లాడుతూ... టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. చీమలపాడు, హనుమల్లంక గ్రామాల్లో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తానని ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశారు.

ఎన్టీఆర్ తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది చంద్రబాబే

ముగింపు రోజున భారీ సభ

ఒకే ఒక్కడు! 63 ఏళ్ల యువకుడు! 208 రోజులు! కాస్త అటూ ఇటుగా 3000 కిలోమీటర్లు! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ పాదయాత్ర 'వస్తున్నా.. మీకోసం'కు ముగింపు ఇవ్వనున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభించిన తన పాదయాత్రను ఆయన ఈనెల 27వ తేదీన విశాఖపట్నంలో ముగించనున్నారు.

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 27వ తేదీన విశాఖ జిల్లాలో ముగుస్తుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు. అప్పటికి బాబు 208 రోజుల్లో 2,900 కిలోమీటర్లు నడిచినట్టు అవుతుందని వివరించారు. ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో యనమల విలేకరులతో మాట్లాడారు. యాత్ర ముగింపు రోజున విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసున్నట్లు తెలిపారు.

నగర శివార్లలో ఏర్పాటు చేయనున్న పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తారని చెప్పారు. బహిరంగ సభ కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, మునిసిపల్ స్టేడియాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ముగింపు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని.. ఈ ఏర్పాట్లు, నిర్వహణ పర్యవేక్షణకు రాష్ట్ర కమిటీ ఇద్దరు పరిశీలకులను నియమిస్తుందని వివరించారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మార్పు కోరుతున్న రాష్ట్ర ప్రజలు.. చంద్రబాబు యాత్రకు నీరాజనం పడుతున్నారన్నారు. ప్రజా స్పందనే ఆయన దృఢ సంకల్పంతో ముందుకు సాగేలా తోడ్పడుతున్నదని తెలిపారు. చంచల్‌గూడ జైలు వైసీపీ కార్యాలయంగా మారిందని, ఆ జైలుపై జగన్ పార్టీ జండాను ఎగురవేస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. కాగా, పాదయాత్రకు ఆదివారం చంద్రబాబు విరామం ప్రకటించారు. సోమవారం యథావిధిగా ఆయన నడక కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

చివరి అడుగు విశాఖలో 27తో బాబు పాదయాత్ర పూర్తి

హైదరాబాద్

సీఎం రాజీనామా చేయాలి: బొజ్జల, మండవ
కళంకిత మంత్రులను వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం వారు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పరిటాల హత్య కేసు నుంచి వైఎస్ జగన్‌ను బయటపడేసేందుకు సహకరించానని ముఖ్యమంత్రే గతంలో చెప్పుకొన్నారని గుర్తుచేశారు. అదేవిధంగా ఇప్పుడు అవినీతి ఆరోపణలున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. అందువల్ల కిరణ్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
: విద్యుత్తు చార్జీల పెంపు, విద్యుత్తు కోతలను నిరసిస్తూ మంగళవారం (9న) నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివా రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహా రైతులు, మహిళ లు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలం తా రహదారులపైకి వచ్చి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరారు.

రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు

తుని: నాలో స్ఫూర్తి.. ధైర్యమే న న్ను నడిపిస్తున్నాయి.. ప్రతి మనిషికి కొన్ని శక్తులుంటాయి. వాటిని గుర్తించి వినియోగించుకుంటే అందరూ పైకి వ స్తారు. తెలుగు జాతికి గౌరవం తెచ్చిన పెట్టిన ఎన్టీఆర్, జాతిపిత మహత్మాగాంధీ, ఇలా తమ శక్తులను గుర్తించి వినియోగించుకున్నందునే గొప్ప వారయ్యారు.. నేనూ అంతే..! మారుమూ ల పల్లెలో జన్మించాను ఎమ్మెల్యే కావాలనుకున్నాను... ఆపై మంత్రి... ముఖ్యమంత్రి... ఇలా కొన్ని ఆశయాలను ఏ ర్పరచుకుని పని చేశాను. అన్నింటినీ సాధించాను. అని దేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన వస్తున్నా.... మీకోసం పాదయాత్రలో భాగంగా గోపాలపట్నంలో రాత్రి బసవద్ద విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈసందర్భంగా ఓ విద్యార్థి సార్... మీరు చాలా కష్టపడుతున్నారు.

పెద్దవయస్సులో దృఢసంకల్పంతో కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తున్నారు. ఇది మీకే లా సాధ్యపడుతోందని ప్రశ్నించగా త న సంకల్ప బలం గురించి, తాను ఎ లా పైకొచ్చినదీ వివరించారు. అందరి కీ విద్య అవసరమని గుర్తించి పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు భారతదేశానికి పెద్ద గా గుర్తింపు లేని సమయంలోనే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలను అభివృ ద్ధి చేసి అందుబాటులోకి తెచ్చానన్నారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను తీసుకువచ్చి రెండు నిమిషా ల్లో డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చానన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన గవర్నర్లందరికీ చెప్పడంతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట ఇనుమడించిందన్నారు.

మాతృభాష తెలుగు ను అభ్యసించాలని బతుకుదెరువుకు ఆంగ్లాన్నీ నేర్వాలని అలాగని మమ్మీ, డాడీ సంస్కృతికి అంకితమైపోరాదని అంకిత అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. విదేశాల్లో దాచిన నల్ల ధనాన్ని దేశానికి తీసుకువస్తే పేదరికం పోతుందని దీనికి తనవంతు కృషి చేస్తానని మరో విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యావ్యవస్థలో భారీ మార్పులు తెచ్చి అందరికీ చదువు, ఉపాధి కల్పిస్తామన్నారు.

నా స్ఫూర్తి, ధైర్యమే నన్ను నడిపిస్తున్నాయి

బాబు ధోరణిలో మార్పురెండు, మూడు రోజులుగా చంద్రబాబు పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ధోరణి మార్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇంకెన్నాళ్లు జెండాలు మోస్తాం.. అంటూ కార్యకర్తలకు తెగేసి చెప్తున్నారు. చావో, రేవో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్న సంకేతాలను చంద్రబాబు తన ప్రసంగాల ద్వారా కార్యకర్తలకు చేరుస్తున్నారు.

అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ.. ఆయా వర్గాల ప్రజలు చెప్తున్న సమస్యలు సావధానంగా వింటున్నారు. వాటిని రికార్డు చేయించి తర్వాత జరిగే సమావేశాల్లో వాటి గురించి చర్చిస్తున్నారు. మంచి సూచనలు చేసిన కార్యకర్తలను గుర్తించి ఎక్కడికక్కడ పేర్లతో వారిని పిలిచి అభినందిస్తున్నారు.

చావో..రేవో..

కాకినాడ 187 రోజులు, 2,632 కిలోమీటర్ల నడక. అదీ అరవై మూడేళ్ల వయసులో.. కాళ్లు నొప్పిపుడుతున్నా కార్యకర్తలు ఇస్తున్న ఉత్సాహం, తండోపతండాలుగా రోడ్లపైకి వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబు రోజురోజుకు రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర సాగిస్తున్నారు.

నెల్లిపూడి, బెండపూడి, అన్నవరంలలో శుక్రవారం బాబు పాదయాత్ర సాగింది. నెల్లిపూడి, బెండపూడి మార్గ మధ్యలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో చంద్రబాబు కొంతసేపు ఆగి కాళ్లకు ఫిజియోథెరపీ చేయించుకున్నారు.

మార్చి 20న మన జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర శనివారం నాటికి 18 రోజులు పూర్తయింది. జిల్లాలో ఇప్పటివరకు 206 కిలోమీటర్ల మేర చంద్రబాబు నడిచారు. 200 కిలోమీటర్ల మైలురాయిని దాటి మరో రికార్డు నెలకొల్పనున్నారు.

రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కార్యకర్తల సమీక్ష సమావే శం, మరో గంటసేపు వివిధ వర్గాలు, చేతివృత్తుల వారితో చర్చలు, సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పాదయాత్ర, మార్గ మధ్యలో గ్రామాల్లో బహిరంగ సభల్లో ప్రసంగాలు చేస్తూ చంద్రబాబు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. రోజూ 10 నుంచి 13 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగిస్తున్నారు. మార్గమధ్యలో తనను కలిసినవారితో సమస్యలు సావధానంగా వింటూ టీడీపీ అధికారంలో వస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తానంటూ హమీలు ఇస్తున్నారు.

పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశాల్లోను కష్టం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు నాయకులకు ఉచిత సలహాలు ఇచ్చి వారు మాత్రం పనిచేయడంలేదని అడపాదడపా చురకలు కూడా వేస్తున్నారు.

కాళ్లు మొరాయిస్తున్నా పట్టుదలతో పాదయాత్ర

తుని: రాష్ట్రంలో బ్రాహ్మణుల అభివృద్ధికి 50 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శనివారం ఆయన్ను పాదయాత్ర ఆరంభంలో గోపాలపట్నం వద్ద అన్నవరం సత్యదేవుని దేవస్థానం పురోహితులంతా కలిశారు. తాము ఉద్యోగ భద్రతలేకుండా ఎన్నో ఏళ్ళుగా దినదినగండంగా జీవిస్తున్నామని చె ప్పారు. స్వామివారికి వ్రతాల ద్వారా వస్తున్న ఆదాయంలో కమీషను మాత్రమే తమకిస్తున్నారని దీనివల్ల తాము జీవించడం కష్టంగా మారిందన్నారు
.

తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తే అండగా ఉంటామన్నారు. దీనిపై చం ద్రబాబు మాట్లాడుతూ ప్రముఖ దేవాలయాలన్నీ పురోహితుల వల్లే నడుస్తున్నాయని, పెద్ద ఎత్తున ఆ దాయం కూడా లభిస్తున్నదన్నారు. అటువంటి పురోహితులు కష్టాల పాలవడం విచారకరమన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామి ఇచ్చారు. జిల్లాకొక వసతి గృహం ఏర్పాటు చేసి ఇళ్ళు, ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేసి బాగోగులు పట్టించుకుంటామని చెప్పారు. తదుపరి పురోహితులు ఆశీర్వచనం పలికి దుశ్శాలువ కప్పారు.

బ్రాహ్మణుల అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రత్యేకనిధి

నా తెలివితేటలు మీ వద్ద పనిచేయలేదంటూ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొంతంగి టీడీపీ నాయకులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. సమీక్ష సమావేశంలో కొంతంగి గ్రామానికి చెందిన మామా అల్లుళ్లు పార్టీ కార్యక్రమాలు తమకు చేరడంలేదంటూ వేర్వేరుగా చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అ యితే వారిద్దరు మామా అల్లుళ్లనే విష యం తెలియక చంద్రబాబు కొద్దిసేపు క్లాస్‌తీసుకున్నారు. వారు మామా అల్లుళ్లు అని సభికులు చెప్పడంతో న వ్వుతూ చంద్రబాబు నన్నే క్రాస్ చేస్తూ మాట్లాడుతున్న మీ వద్ద నా తెలివితేటలు పనిచేయలేదన్న మాట అంటూ చమత్కారంగా అన్నా రు.

యువత మేల్కొంటే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. యువతను ప్రోత్సాహించేందుకు తెలుగుదేశం పార్టీ నడుం కడుతుందనిచెప్పారు. కాపులను, ఒంటర్లకు రిజర్వేషన్ కల్పించాలని కోరగా తమ పార్టీ అధికారంలోకి వచ్చా క అగ్రవర్ణాలోని పేదలకు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

నా తెలివి మీ వద్ద పనిచేయలేదు.. చంద్రబాబు

శంఖవరం/ప్రతిపాడు/తుని
: 'కలల సాధనకు కష్టపడాల్సిందే.. ఓట్లు అవే వస్తాయి, అని కూర్చుంటే కష్టాలు తప్పవు. పంచాయతీ, మున్సిపాలిటీ.. అన్ని ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. అపుడే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అందలమెక్కగలం' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ఉద్బోధించా రు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర లో భాగంగా ఆయన తూర్పు గోదావ రి జిల్లా కత్తిపూడిలో ప్రత్తిపాడు, రంపచోడవరం అసెంబ్లీ నియోజక వర్గాల కార్యకర్తల సమావేశంలో మాట్లాడా రు.

ప్రతి కార్యకర్త ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ ఓటు బ్యాంకుల్ని పక్కనబెట్టి తటస్థ ఓటర్లను రాబట్టగలగాలని చెప్పారు. అన్ని ని యోజకవర్గాల ఓటర్ల మనస్థత్వం ఎన్నికల్లో ఒకేలా ఉంటుంది. అయితే సమర్థవంతమైన కార్యకర్తలు, నాయకులున్న చోటే గెలువగలుగుతామన్నారు. 'నా పాదయా త్ర ఓచరిత్ర, ఎన్నికల్లోపు 294 నియోజక వర్గాల కార్యకర్తలతో సమావేశమై మరోచరిత్ర సృష్టించాలన్నది నా ఆశ' అని చంద్రబాబు చెప్పారు. మీరంతా తెలివైన వారని వేదిక మీద ఉన్నవారికి మంచి అవకాశాలు రావడంతోనే పైకొ చ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది పనికి మాలిన అవినీతి, అసమర్థ పాలనని దుయ్యబట్టారు.

గడచి న సహకార ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినా తల్లి, పిల్ల కాం గ్రెస్‌లు దెబ్బతినడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రతి కార్యకర్త తన నిత్య జీవితంలో భార్య, పిల్లలతో కొంతసేపైనా గడిపి ఎంతగా ఆనందిస్తారో కార్యకర్తలతో మాట్లాడ్డం తనకు అంతే సంతృప్తినిస్తుందన్నారు.

ఒకపుడు తాను హైదరాబాదులో ఉండి చెబితే తక్షణమే స్పందించేవార ని ఇపుడంతా ముదుర్లు అయ్యారని కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు అ న్నారు.

పార్టీలో సభ్యులకు కొదవ లేద ని .. అయితే వారంతా క్రియాశీలంగా వ్యవహరిస్తే విజయాలు అందుకోగలమన్నారు. ప్రత్తిపాడు, రంపచోడవరం లో మంచి కార్యకర్తలున్నారన్నారు. దేశంలో కార్యకర్తలతో పటిష్టంగా ఉన్న పార్టీల్లో టీడీపీకీ సాటివచ్చే పార్టీ మరో టి లేదన్నారు. పెద్దాపురంలో ఇటీవల ఓ నాయకుడు పార్టీని వీడి వెళితే కార్యకర్తలంతా పార్టీలోనే ఉండడాన్ని ఆయ న ప్రశంసించారు. కార్యకర్తల రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనన్నారు. తదుపరి ఆయన కార్యకర్తలను మా ట్లాడాలని కోరడంతో రాజవొమ్మంగికి చెందిన గొల్లపూడి పెద్దిరాజు మాట్లాడుతూ పార్టీలో సమన్వయం లోపించిందన్నారు.

తమకు దంతులూరి శివరామచంద్రరాజు తప్ప నియోజక వర్గ ఇన్‌చార్జులెవరూ సహకరించడం లేదని తెలిపారు. పార్టీ కార్యక్రమాలపై ఆయ న రూపొందించిన రికార్డును పరిశీలించిన చంద్రబాబు ఆయన్ను అభినందించారు. కత్తిపూడి సొసైటీ అధ్యక్షుడు గౌ తు నాగు మాట్లాడుతూ శంఖవరం మండలంలో జరిగిన ఉపాధి అవినీతి పౖ ప్రశ్నించినందుకు 36మందిపై నా న్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టారని వాపోయారు. రెడ్డి బుల్లబ్బాయి మాట్లాడు తూ తమ గ్రామాలను ఏజెన్సీ ప్రాం తాలుగా ప్రకటించాలని కోరారు. తదుపరి ఆయన మరికొన్ని సమస్యలపై మాట్లాడగా మీ సోదరుడు ఆర్.నారాయణమూర్తిలాగా విప్లవ భావాలున్నాయంటూ చమత్కరించారు.

మరో మ హిళ తన భర్త తాగుడు వ్యసనంపై మాట్లాడగా తాను అధికారంలోకి రా గానే తొలిరోజు రెండో సంతకం బెల్ట్ షాపుల రద్దుపైనే పెడతానన్నారు. ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, చిన్నం బాబూ రమేష్, నిమ్మకాయల చినరాజప్ప, వాసంశెట్టి సత్యం, శీతంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని సబ్‌ప్లాన్ గిరిజన ప్రాంతాన్ని ఏజెన్సీగా గుర్తించడానికి కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ని యోజకవర్గీయులు కోరారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మల్లంపేటకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త రెడ్డిబుల్లబ్బాయి సబ్‌ప్లాన్ గిరిజనులు ఏజెన్సీ గిరిజనులకు అందుతున్న సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారని వీరిని షెడ్యూల్డ్ ఏరియా గిరిజనులుగా గుర్తించి సౌకర్యల కల్పనకు కృషి చేయాలని కోరారు.

ప్రత్తిపాడు ని యోజకవర్గంలోని సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్, పోలవరం, పుష్క ర తదితర ప్రాజెక్టులు అభివృద్ధికి నోచక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొమ్ముల కన్నబాబు, కొప్పన వెంకటేశ్వరరావు, గోళ్ల నాగేశ్వరరావు, రామిశెట్టి మురళీకృష్ణ చంద్రబాబుకు వినతి పత్రాలు అందజేశారు.

సమావేశంలో ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, పర్వత రా జబాబు, పర్వత సురేష్, టీడీపీ నాయకులు బద్ది రామారావు, సూది బూ రయ్య, పైలా సత్యనారాయణ, పైలా బోసు, యామన సు రేష్, పైలా సాంబశివరావు, మిరియాల శ్రీను, పంచాది వీరబాబు, ఇళ్ల అప్పారావు, దేవకి రాంబాబు, దాట్లకృష్ణ, దాట్ల అప్పన్నబాబు, మదినే బాబ్జిలు పాల్గొన్నారు.

విజయం మనదే!

టీడీపీకి అంకిత భావం కలిగిన కార్యకర్తలు ఉన్నారని, కొన్ని చోట్ల నాయకులు మాత్రం ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు చికాకుపడ్డారు. శంఖవరం మండలం నెల్లిపూడిలో ప్రత్తిపాడు, రంపచోడవరం పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఒక కార్యకర్త తమ నాయకులు నమస్కారం పెట్టిన వారినే సమావేశాలకు పిలుపుస్తున్నారని, ఈ ధోరణి మారాలని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చిట్టిబాబూ.. ఇలాంటివి రాకూడదు. వీటిని సర్దుబాటు చేయాలి అని చంద్రబాబు ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబును ఆదేశించారు.

ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ నేతల వ్యవహారశైలిని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.రంపచోడవరం నియోజకవర్గంలో చిన్నం బాబూ రమేష్, శీతంశెట్టి వెంకటేశ్వరరావు మధ్య సమన్వయం లోపించిందని పలువురు కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీలో గ్రామ, మండల, నియోజకవర్గ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.

ఇక నుంచి కార్యకర్తలు, నాయకులు ఎన్నికల వరకు పూర్తిగా పార్టీ సేవకోసం కేటాయించాలన్నారు. కుటుంబ, వ్యాపార బాధ్యతల్ని భార్య, కొడుకు, కూతుళ్లకు అప్పగించి పార్టీ విజయం కోసం కష్టపడిపని చేయాలని హితవు పలికారు.

కార్యకర్తలు ఓకే.. నేతలే మారాలి


చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మందలింపులు చిత్తూ రు తెలుగు తమ్ముళ్ళపై తక్షణ ప్రభా వం చూపాయి. అధినేత ఆదేశంతో రంగంలోకి దిగిన ఎంపీ శివప్రసాద్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు చేసిన మ«ధ్యవర్తిత్వంతో వర్గ విభేదాలన్నీ అటకెక్కా యి. దారులు మార్చిన నేతలు పరస్పరం చేతులు కలిపారు. కలసికట్టు గా సంతకాల సేకరణ కార్యక్రమం లో పాల్గొని తమ మధ్య తలెత్తిన వివాదం టీ కప్పులో తుఫానంటూ తేల్చేశారు. అయితే ఇరువర్గాల మధ్య పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం నిరంతరంగా పనిచేసే సమన్వయకర్తను నియమించడం చూస్తే మాత్రం చిత్తూరు టీడీపీలో తలెత్తిన వర్గ విభేదాలు అంత త్వరగానూ, అంత సులువుగానూ సమసిపోయేవి కాదని ఇట్టే అర్థమవుతోంది.

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ప్రకటనతో చిత్తూరు నియోజకవర్గ నేతల్లో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులుకూ, నియోజకవర్గంలోని పలువురు ముఖ్యనేతలకూ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చా యి. జంగాలపల్లె శ్రీనివాసులు దాదాపు ఒంటరి కాగా, మిగిలిన ముఖ్య నేతలు దొరబాబు, మాజీ ఎంపీ దుర్గ, నానీ, బాలాజీ నాయుడు, కఠారి మోహన్, మోహన్ రాజు, కాజూరు బాలాజీ, నీరజాక్షులు నాయుడు తదితరులంతా మరోవైపు మొహరించారు. పరస్పరం అపనమ్మకంగా వుండడంతో ఎవరికి వారు దూరంగా వుంటూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించుకునే దాకా పరిస్థితి దారి తీసింది. దీని పర్యవసానంగా అధినేత ఆదేశించిన విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా పట్టణంలో ఇరు వర్గాలూ వేర్వేరుగా నిర్వహించాయి. సొంత జిల్లాలో అందునా జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా వుంటే మిగిలిన మిగిలిన చోట్ల పార్టీ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళతాయంటూ అ««ధినేత ఆగ్రహించారు. శుక్రవారం చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌కు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులుకు ఫోన్లు చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఆదేశించారు. దీంతో వారిరువురూ రంగంలోకి దిగి సాయంత్రానికల్లా చిత్తూరు చేరుకున్నారు. నగరం వెలుపలున్న ఓ ప్రముఖ హోటల్‌లో ఇరు వర్గాలనూ సమావేశపరిచారు. రాత్రి 7 నుంచి 11 గంటల వరకూ పంచాయితీ జరిపారు. ఈ సందరంగా ఎవరికి వారు తమ అభ్యంతరాలను వినిపించినట్టు సమాచారం. అదే సమయంలో చంద్రబాబు జంగాలపల్లెకు ఫోన్ చేసి సీనియర్లను, అందరినీ కలుపుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించినట్టు తెలిసింది. దీంతో మొత్తానికీ ఇరు వర్గాల మధ్య సయో«ధ్య కుదిరింది. పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు దయారామ్‌ను ఇరువర్గాల మధ్య సమన్వయకర్తగా నియమించారు. పార్టీ కార్యక్రమాల గురించి ఏ వర్గమైనా మరో వర్గానికి సమాచారమివ్వాలంటే ముందుగా దయారామ్‌కు చెపితే ఆయన ఎదుటి వర్గానికి సమాచారమందించి సమన్వయం కుదుర్చుతారు. శనివారం సాయంత్రం అంతా కలసికట్టుగా నాయుడు బిల్డింగ్స్ ప్రాంతంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

ఎట్టకేలకు చేతులు కలిపిన చిత్తూరు 'దేశం' నేతలు


శ్రీకాళహసి : విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేటలో సంతకాల సేకరణ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై విద్యుత్ భారం మోపడం వలన వారి బతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆందోళనల కారణంగా నామమాత్రంగా ఛార్జీలు తగ్గించి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెంచిన ఛార్జీలు మొత్తం తగ్గించాలని డిమండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉ«ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్యాల పార్థసార«ధి, పులి రామచం ద్ర, షాకీరాలీ, సంపత్‌కుమార్, రేణుకమ్మ, బుజ్జి, వెంకటేశ్వర్లు, సుధాకర్, నాగయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చార్జీల భారంతో బతుకు దుర్భరం


ఆత్మకూరు: పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత చేపట్టిన సంతకాల సేకరణకు మద్దతుగా మండల టీడీపీ నాయకులు విస్తృతంగా కార్యక్రమం చేపట్టారు. మండలంలో గ్రామ పంచాయతీల వారీగా నాయకులు బాధ్యతలు చేపట్టి సంతకాలు సేకరిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెంచిన చార్జీలు తగ్గించాలని సంతకాలు చేయడానికి ముందుకొస్తున్నట్టు పార్టీ మండల నాయకులు వేణుగోపాల్, మనోరంజన్, వెంకటనారాయణ, సాయినాథ్, హనుమప్పచౌదరి, హనుమంతప్పచౌదరి, చికెన్ వలి, శంకరనారాయణరెడ్డి, రవీంద్రరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నరసింహ తెలిపారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాయని, దోచుకోవడం తప్ప ప్రజలకు సేవ చేసిందేమీ లేదని విమర్శించారు.

భవిష్యత్తు టీడీపీదే అధికారమని వారు పేర్కొన్నారు. శింగనమల: రాష్ట్రంలో అలజడి రేపుతున్న విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా మండలంలోని నాయపల్లి క్రాస్ వద్ద సంతకాల సేకరణ, రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు అమ్మలదిన్నె చితంబరిదొర  ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నాయనపల్లి క్రాస్ వద్ద విద్యుత్ సమస్యలపై సంతకాల సేకరణతో పాటు రాస్తారోకో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పామిడి శమంతకమణి హాజరవుతారన్నారు. కార్యక్రమానికి రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.

విస్తృతంగా టీడీపీ సంతకాల సేకరణ

ముదిగుబ్బ: అసమర్థ కాంగ్రెస్ పా లకులను ప్రజలు గద్దె దింపుతారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి పేర్కొన్నారు. ఇలాంటి అ వినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదన్నారు. కమీషన్లతో ప్ర జాధనాన్ని దోచుకుంటున్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఎద్దే వా చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద వరదాపురం సూరి ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ నాయకులు శుక్రవారం రిలేనిరాహార దీక్షలు నిర్వహించారు. వరదాపురం సూరి మాట్లాడుతూ.. ప్రజలు విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు రెండు గంటల కన్నా ఎక్కువ ఇచ్చిన పాపానపోలేదని ఎద్దేవా చేశారు.

గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, స మస్య పరిష్కారానికి ఎంపీ నిధుల నుంచి బోర్లు వేయిస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇలాంటి వాటిని పట్టించుకోకుండా కమీషన్లు వచ్చే రోడ్డు పనులు చేయిస్తున్నాడన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎక్కడా లే నట్లు ముదిగుబ్బ మండలంలోనే ఉ పాధి పనులలో అవినీతి జరుగుతోందని అధికారులు కుమ్మక్కయ్యారన్నా రు. లక్షలాది రూపాయలు సంపాధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందన్నారు. వీటిపై లోకాయుక్త, మానవహక్కుల కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంత రం జాతీయ రహదారి 205 రోడ్డుపై బైఠాయించారు.

ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. పెంచిన వి ద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. రూ. 32వేల కోట్ల సర్‌ఛార్జీలు ప్రజలపై భా రం మోపడం దారుణమనీ, దీనికి తగి న మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఇది రైతు రక్షక ప్రభుత్వం కాదనీ, భక్షక ప్రభుత్వన్నారు. అనంతరం పలు వినతులతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ఐ బాలకృష్ణకు ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్‌బా బు, అశ్వర్థరెడ్డి, లింగా నాయుడు, పు ల్లానాయుడు, మహబూబ్‌పీరా, ఇ మాంసాబ్, పతిరెడ్డి, నారాయణస్వా మి, రాముడు, జింద్రే, తుమ్మల సూరి, తుమ్మలనాయుడు, దామోదర్‌నాయు డు, గుత్తా నాయుడు, రఘు, బీజేపీ నాయకులు మాలపాటి రామకృష్ణ, వెంకటేష్, సీపీఐ నాయకులు జింకా చలపతి, నాగరాజు, వెంకటనారాయ ణ, మార్కండేయులు, నాగభూషణ, బాబు, వెంకటేష్ పాల్గొన్నారు.

అమడగూరులో... అమడగూరు: పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఇంటి ముందు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ శుక్రవారం మండ ల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు, సీపీ ఎం నాయకులు విద్యుత్ చేపట్టిన ఆం దోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొ ని ప్రసంగించారు. బస్టాండు కూడలిలో గంటపాటు రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మా ట్లాడుతూ.. ఏ ముఖ్యమంత్రి పెంచని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ ఛార్జీలను కిరణ్‌కుమార్‌రెడ్డి పెంచారన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, దొడ్డెం హ రి, సొసైటీ అధ్యక్షుడు సుబ్బయ్య, కృష్ణారెడ్డి, కృష్ణమూర్తి, అబ్దుల్ రసూ ల్, తిరుపాలు, వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఉన్నం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో సంతకాల సేకరణ

కళ్యాణదుర్గంటౌన్: పాలకులు ముందుచూపు లేమితోనే రాష్ట్రంలో అంధకారం అలుముకుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఉన్నం హనుమంతరాయచౌదరి హెచ్చరించారు. రెండో రోజు శుక్రవారం సంతకాల సేకరణను స్థానిక గాంధీ సర్కిల్‌లో నిర్వహించారు. ఉన్నం మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ చెప్పుకునే పాలకులు విద్యుత్ కోతలతో వారిని నిలువునా ముంచారన్నారు. కరెంట్ కష్టాలన్నింటికి వైఎస్ రాజశేఖరరెడ్డి అవినీతి పాలనే కారణమన్నారు.

అనంతరం విద్యుత్ సంక్షోభంపై దాదాపు మూడువేల మంది పై బడి రైతులు, వినియోగదారులతో సంతకాలను సేకరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు బాదెన్న, ఆర్‌జీ శివశంకర్, మాజీ ఎంపీపీ మల్లికార్జున, మండల కన్వీనర్లు దొడగట్ట నారాయణ, డీకే రామాంజనేయులు, సింగిల్‌విండో అధ్యక్షుడు పిట్టి తిమ్మారెడ్డి, లోకన్న, శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ రామ్మోహన్, జీవీ ఆంజనేయులు, జీపీ నారాయణ, టీఎన్ చాంద్‌బాష, పాపంపల్లి రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు బోయ రాఘవేంద్ర, శర్మాష్, వైపీ రమేష్, కొల్లాపురప్ప, పాలవాయిరాము, బెస్తరపల్లి గోపినాథ్, మురళీ, ఇటుకల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న విద్యుత్ ఆందోళనలు

విశాఖపట్నం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర నిర్ణీత షెడ్యూల్ కంటే ఒకరోజు ఆలస్యంగా ప్రారంభం కానున్నది. ఉగాది నాడు నాతవరం మండలం గన్నవరం మెట్టవద్ద జిల్లాలోకి అడుగుపెట్టాల్సిన చంద్రబాబు 12వ తేదీన రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధికి తెలిపారు.

అయితే ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెల 27నే మధురవాడలో పాదయాత్ర ముగించనున్నారు. పాదయాత్రలో ఆదివారాలను కూడా కలిపి ఇప్పటికే షెడ్యూల్‌ను ఖరారుచేశారు. అయితే చంద్రబాబు ఆదివారం విశ్రాంతి తీసుకోనున్నారు.

దీంతో ముందు నిర్ణయించిన షెడ్యూల్ మారనుంది. మారిన షెడ్యూల్ ప్రకారం రూటులో ఎక్కడెక్కడా తగ్గించాలి? అన్నదానిపై ఆదివారం పార్టీ పెద్దలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావులు జిల్లా నేతలతో సమావేశమై ఖరారుచేస్తారు.

చంద్రబాబుతో


అయ్యన్న భేటీ


తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును శనివారం అన్నవరం వద్ద అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ కలిశారు. విశాఖ జిల్లాలో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్ల గురించి నివేదించారు. ఆరోగ్యరీత్యా ప్రస్తుతానికి పాదయాత్రను వాయిదా వేసుకోవాలని, ఉత్తరాంధ్రలో తరువాత పర్యటించవచ్చునని అయ్యన్న చెప్పగా చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ఈనెల 27 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, విశాఖలో బహిరంగ సభలో పాల్గొంటానని స్పష్టం చేశారు. అయితే పాదయాత్రలో ఆదివారాలు విశ్రాంతి తీసుకుంటానని మాత్రం చెప్పారు.

12 నుంచి విశాఖలో బాబు యాత్ర

గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్‌టీఆర్ బొమ్మ ఏర్పాటు చేసినా ఆయన మౌనం వహిస్తుండటాన్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆక్షేపించారు. ఆదివారం సాయంత్రం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్‌టీఆర్ మౌనం వహిస్తుండటం సందేహాలకు తావిస్తోందన్నారు.

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి టీడీపీ తరపున పోటీ చేసేందుకు టిక్కెట్ ఇప్పించింది జూనియర్ ఎన్‌టీఆర్. నానికి జూనియర్ మాట లక్ష్మణ రేఖ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. నాడు తన కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉంటానని చెప్పిన జూనియర్ ఎన్‌టీఆర్ నేడు పెదవి విప్పక పోతుండటం అయోమయానికి గురి చేస్తోందన్నారు. తన ప్రమేయం లేదనో లేక తనకు చెప్పే నాని వెళ్ళాడనో ఏదో ఒక వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

నాని నూటికి నూరు శాతం అసెంబ్లీలో అడుగు పెట్టలేడు అన్నం పెట్టిన చేతినే తెగనరికే ధోరణి కలిగిన గుడివాడ ఎమ్మెల్యే నాని ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టలేడని తాను సవాలు చేస్తున్నానని డాక్టర్ కోడెల అన్నారు. నాని చేసిన దుర్మార్గాలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.

వైసీపీలోకి కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది వెళ్ళారని, వాళ్లు నానిలా నీచాతి నీచంగా మాట్లాడటం లేదన్నారు. ఒక సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరమైన అభిప్రాయం లేని వైసీపీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టీఆర్ పతనానికి, మరణానికి కారణం లక్ష్మీపార్వతినేనని, ఆమె మనిషే కాదని కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూనియర్... ఏదో ఒక వైఖరి తీసుకో :కోడెల

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యేలు విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం దీక్ష చేస్తున్నారా? లేక తమపై అనర్హత వేటు వేయించుకోవడం కోసం చేస్తున్నారా? అని టీడీపీ విస్మయం వ్యక్తం చేసింది. "దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. విద్యుత్ చార్జీలు తగ్గించాలని దీక్షకు కూర్చుని.. దానిని వదిలి తమ దీక్షను చూసి అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాయడం ఏమిటి? వాళ్ల దీక్ష దేని కోసం? అనర్హత వేటు వేయించు కోవడానికే దీక్ష చేస్తున్నట్లు ఉంది'' అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు.

వైసీపీ దీక్షలు అనర్హత కోసమే!: టీడీపీ


కరెంట్ చార్జీల పెంపుపై టీడీపీ నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తాను తన తల్లి స్వగ్రామం కొమరవోలులో ప్రారంభించడం ఆనందంగా ఉందని బాలకృష్ణ చెప్పారు. సంతకాల సేకరణ పత్రాలపై బాలకృష్ణ తొలి సంతకం చేసి దేవినేని ఉమాకు అందించారు. చార్జీలు, సర్‌చార్జీల పేరిట ప్రభుత్వం ప్రజలను వేధిస్తోందని, ముందస్తు ప్రణాళికలు లేకనే కరెంటు భారం వేస్తోందని విమర్శించారు.

టీడీపీ హయాంలో పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి సమస్య లేకుండా చేశామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రాన్ని అంధకారంలో ముంచిందని ధ్వజమెత్తారు. 50 యూనిట్లలోపు బిల్లు కట్టక్కర్లేదని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.

అధికారంలో కాంగ్రెస్.. అంధకారంలో ఆంధ్రప్రదేశ్

జూనియరే ఖండించాలి
ఖండించకపోతే పరిణామాలు తప్పవు
జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను
వైసీపీ వాడుకోవడంపై బాలకృష్ణ
టీడీపీలో వైసీపీ ఫ్లెక్సీల కలకలం

గుడివాడ: పెద్ద ఎన్టీఆర్.. చిన్న ఎన్టీఆర్ బొమ్మలతో వైసీపీ నేత లు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల విజయవాడ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పర్యటనలో పాల్గొనవద్దంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చిన ఆయన బాబాయ్, నటుడు బాలకృష్ణ.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కే నేరుగా అల్టిమేటం జారీచేశారు. తన బొమ్మలతో వైసీపీ ఫ్లెక్సీల ఏర్పాటును ఆయన ఖండించాలని, లేకపోతే పరిణామాలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. అలాగే, జూనియర్ అనుచరుడైన కొడాలి నాని పార్టీని వీడడాన్ని లైట్‌గా తీసుకున్నారు. ఈ విషయంలో గుడివాడ టీడీపీ కేడరంతా సంతోషంగా ఉందన్నారు.

పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అని స్పష్టం చేసిన బాలకృష్ణ.. పార్టీకి ఆయనే తిరుగులేని నాయకుడన్నారు. సరైన సమయంలో తాను క్రియాశీల పాత్ర పోషిస్తానంటూనే.. ఆ సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తద్వారా చంద్రబాబు తర్వాత తానే నేతనని చెప్పకనే చెప్పారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా మనసు విప్పి మాట్లాడినా.. కొన్ని టిపై బాబు సూచనల మేరకే ఆయన స్పందించారని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఏ విభేదాలు లేవని బాలకృష్ణ ప్రకటించినా.. ఈ పరిణామంతో అబ్బాయ్.. బాబాయ్ మధ్య దూరం మరింత పెరిగిందని భావిస్తున్నారు.

"తన బొమ్మతో వైసీపీ ఫ్లెక్సీలు వేసుకోవడాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించాలి. ఈ మేరకు సూచిస్తా. ఏ స్థాయి నాయకులైనా పార్టీ ఆదేశాలను పాటించాల్సిందే. ఆయన ఖండించకపోతే పరిణామాలు తప్పవు'' అని బాలకృష్ణ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కొమరవోలులో శనివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో జూనియర్ చురుగ్గా ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించగా, షూటింగుల్లో బిజీగా ఉన్నారని జవాబిచ్చారు. టీడీపీలో లోకేశ్‌ను క్రియాశీలం చేసేందుకే జూనియర్‌ను పక్కన పెడుతున్నారనే వాదన ఉందని విలేకరులు ప్రస్తావించగా- "ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడి తే గుర్తింపు ఉంటుంది.

వయసుతో పనిలేకుండా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆదరణ లభిస్తోంది'' అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బొమ్మపై పూర్తి హక్కులు తెలుగుదేశానికే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ బొమ్మను ఇతర రాజకీయ పక్షాలు ఉపయోగించడం చెల్లదని, అన్నగారి బొమ్మను ఉపయోగించుకుంటున్న ఆ పార్టీలపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. "ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం. ఆయన బొమ్మను పెట్టుకునే హక్కు టీడీపీకే ఉంది'' అన్నారు.

రాజశేఖరరెడ్డితోపాటు ఎన్టీఆర్ బొమ్మను కూడా వైసీపీ నాయకులు తమ ఫ్లెక్సీల్లో పెట్టుకోవడాన్ని విలేకరులు ప్రస్తావించగా.. వైఎస్ఆర్ బొమ్మకు ఓట్లు రాలవని, ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటే ఓట్లు వేస్తారని భావించి ఆ పార్టీ నేతలు ఎన్టీఆర్ బొమ్మను వాడుకుంటున్నారని చలోక్తి విసిరారు. దేవుడి బొమ్మను ఎవరైనా పెట్టుకోవచ్చని, ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకునే హక్కు టీడీపీకి మాత్రమే ఉందని చెప్పారు. అవిశ్వాసానికి టీడీపీ ఎందుకు దూరంగా ఉందని ప్రశ్నించగా.. "అవిశ్వాసం ఎందుకు? లావాదేవీలకా, ఒప్పందాలు కుదుర్చుకోవడానికా?'' అని ప్రశ్నించారు.

కొడాలి నాని పార్టీని వీడి వెళ్లడంపై అంతా సంతోషిస్తున్నారని, ఎవరూ బాధపడటం లేదని చెప్పారు. కృష్ణా జిల్లా నుంచే మీరు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి తనను పోటీ చేయమంటున్నారని, అధిష్ఠానం నిర్ణయం మేరకే పోటీ చేస్తానని జవాబిచ్చారు. గుడివాడ నుంచి పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు బాలకృష్ణ పక్కనే ఉన్న రావి వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తే సంతోషంగా ఆహ్వానిస్తామన్నారు.

జయప్రద టీడీపీలో చేరనున్నారా? అని ప్రశ్నించగా, ఆమె తనను కలిస్తే పార్టీతో మాట్లాడతానన్నారు. అయితే, జయప్రద రోజుకో పార్టీ పేరు చెబుతోందని చమత్కరించారు. చంద్రబాబు, బాలకృష్ణ రెండు అధికార కేంద్రాలన్న అభిప్రాయం ఉందన్న ప్రశ్నకు.. "మా నాయకుడు చంద్రబాబు. పార్టీ అధినేత చంద్రబాబు. ఇందులో మరో అభిప్రాయం లేదు'' అని తేల్చి చెప్పారు.

ఎన్టీఆర్ బొమ్మను ఇతర పార్టీలు వాడుకోవడం చెల్లదన్న బాలయ్య