April 5, 2013

మేడ్చల్ : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించడంతో పాటు రైతులకు అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్ నక్క ప్రభాకర్‌గౌడ్, రాష్ట్ర నాయకులు నారెడ్డి నందారెడ్డి, మండల అధ్యక్షుడు మద్దుల శ్రీనివాస్‌ర్‌డ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం మేడ్చల్ పట్టణంలో వివేకానంద విగ్రహం వద్ద జాతీయరహదారి పక్కన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్యాంరావు, పట్టణ అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, నేతలు శేఖర్‌గౌడ్, రమేశ్‌ముదిరాజ్, శైలేందర్, రమేశ్, కాశీ, పాండు, ప్రతాప్, వెంకటేశ్, రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు పోరాటం శామీర్‌పేట : పెంచిన విద్యుత్ చార్జీలు, విద్యుత్ కోతలు తగ్గించే వరకు టీడీపీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి నక్క ప్రభాకర్‌గౌడ్ అన్నారు. గురువారం శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో విద్యుత్ కోతలు, చార్జీలకు నిరసనగా మండల అధ్యక్షుడు హరిమోహన్‌రెడ్డి అధ్వర్యంలో సంతకాల పేకరణ జరిగింది.

ఈ సందర్భంగా ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికే ఇంధన సర్‌చార్జి పేరిట వేలాది కోట్లు రూపాయలు ప్రజల నెత్తిన రుద్దిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సునీత, కోల అంజయ్య, నాలిక యాదగిరి, బోజేశ్వర్, నర్సింగ్‌రావు, అజయ్‌లక్ష్మీ, ర వీందర్‌గౌడ్, రవికిరణ్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీలను తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

ఒంగోలు కలెక్టరేట్: జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తక్షణమే సాగర్ జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీకి చెందిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆమరణ నిరాహారదీక్ష విరమించారు. కలెక్టరేట్ వద్ద కందుల చేపట్టిన దీక్ష గురువారానికి మూడో రోజుకు చేరిం ది. గురువారం మధ్యాహ్నం సాగర్ జలాలను విడుదల చేసినందున దీక్షను విరమించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.రాధాకృష్ణమూర్తి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన కందుల నారాయ ణరెడ్డి దీక్షను విరమించారు. సాగర్ నీటిని చెరువులకు నింపే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం సాగర్ జలాలు జిల్లాకు చేరిన వెంటనే నీటి చౌర్యం జరగకుం డా అధికారులు ప్రత్యేక చర్యలు తీసు కోవాలని డిఆర్వోను కోరారు. తాను చేపట్టిన దీక్షకు సహకరించిన ప్రతి ఒక్కరికి కందుల కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ యక్కల తులసీరావు, తెదేపా నాయకులు కొమ్మూరి రవిచంద్ర, యానం చిన యోగయ్య యాదవ్, పోగుల సుందరం, కమ్మ వెంకటేశ్వర్లు, లంకా దినకర్‌బాబు, బొల్లినేని వాసు కృష్ణ, కొల్లిపల్లి సురేష్‌తో పాటు పలు వురు తెదేపా నాయకులు ఉన్నారు.

తెదేపా సంబరాలు కాగా కందుల దీక్ష విరమించిన అనంతరం దీక్షా శిబిరం వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీక్షపై స్పందించి వెంటనే సాగర్ జలాలు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా దీక్షా శిబిరం వద్ద పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చారు.

దీక్ష విరమించిన ఎమ్మెల్యే 'కందుల'

ఆర్మూర్అర్బన్: పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో  సంతకాల సేకరణ కొనసాగింది. రోడ్డుగుండా వె ళ్లే ప్రజలు పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ సంతకాలు చేశారు. ప్రభు త్వం విద్యుత్ చార్జీలు, సర్‌చార్జీల వ సూళ్ల పేరిట పేద ప్రజలపై మోయలే ని భారం వేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు జివి.నర్సింహరెడ్డి, కౌన్సిలర్ గం గామోహన్‌చక్రు, స్వామియాదవవ్, మామిడి లక్ష్మీనారాయణ, పి.పద్మారా వు, నూకల ప్రభాకర్ పాల్గొన్నారు.

ఆర్మూర్‌రూరల్: మండలంలోని అంకాపూర్‌లో చేపట్టిన కార్యక్రమంలో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉ పసంహరించుకోవాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అ ధ్యక్షుడు కిశోర్‌రెడ్డి, సామ గంగారెడ్డి, మోహన్, గడ్డం లింగారెడ్డి, ఆలూరు నారాయణరెడ్డి, ఎన్.గంగారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాక్లూర్: మండల పరిధిలోని గం గరమంద గ్రామంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపాల్ నగేష్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ పంటలు ఎండిపో యి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రభుత్వం ముందుచూపుతో కరెంట్ స మస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీబీ.గోవర్దన్, రజినీష్, రాజేశ్వర్‌రావు, షేక్ హైమద్, న రేందర్ తదితరులు పాల్గొన్నారు.

భీమ్‌గల్: మండల కేంద్రంలో సం తకాల సేకరణ ప్రారంభమైంది. భిం చారు. ప్రజల నడ్డి విరిచే విధంగా ప్ర భుత్వం విద్యుత్ చార్జీలను పెంచిందని మండల కన్వీనర్ గంగాధర్‌గౌడ్ అ న్నారు. కార్యక్రమంలో గంగాధర్‌గౌడ్, పతాని లింబాద్రి, హకీం, కర్నె రాజేశ్వ ర్, పార్ధసారథి, హన్మంతు, అఫ్సర్ పా ల్గొన్నారు.

బాల్కొండ: టీడీపీ నాయకులు మండల కేంద్రంలో సంతకాల సేకరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వి లేఖరుల సమావేశంలో తెలుగు యు వత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌యాదవ్ మాట్లాడుతూ టీడీపీతో పాటు వి పక్షాలు విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆందోళనలు చేస్తుంటే ముఖ్యమంత్రి కి రణ్‌కుమార్ నియంతలా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశం లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజన్న, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాయ కులు రాజు, గంగారెడ్డి, రాజేందర్, హ రికృష్ణ, రాజుగౌడ్, మైనారిటీ నాయకు లు హమీద్, అజీం తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ సంతకాల సేకరణకు అనూహ్య స్పందన

హత్నూర : విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం పేద ప్రజలపై తీరని భారం మోపుతుందని టీడీపీ జిల్లా కార్యదర్శి ఎల్లాదాస్ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా దౌల్తాబాద్‌లో ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లాదాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని అన్నారు. నిత్యం కూలి పని చేసుకునే ప్రజలు ఈ భారాన్ని మోయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ రోజురోజుకు ధరలు పెంచడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన విద్యుత్, చమురు ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిఎడల ప్రజలను జాగృతం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎంఏ.హకీం, గుండ పురుషోత్తం, రాందాస్, అజీజ్, సజ్జత్, వాహాబ్, బాలలింగం, జనార్ధన్, శ్యామ్ పాల్గొన్నారు.

నర్సాపూర్‌లో... నర్సాపూర్ : విద్యుత్ చార్జీల పెంపు, ఎడపెడ విధిస్తున్న కోతలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం నర్సాపూర్‌లో సంతకాల సేకరణ నిర్వహించారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని, విద్యుత్ కోతల సమయపాలన పాటించాలని డిమాండ్ చేస్తూ ప్రజల సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవర వాసుదేవరావు, సీనియర్ నాయకులు గోపాల్‌రెడ్డి, పబ్బారమేష్, మాజీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్, నాయకులు రఘువీరారెడ్డి, మల్లేశ్‌యాదవ్, పిట్ల సత్యనారాయణ, అంజాగౌడ్, విఠల్, అఖిల్, శ్రీనివాస్‌గౌడ్, మాధవరెడ్డి, కొండి కుమార్, సురేష్‌గౌడ్, సంతోష్‌గుప్తా, బాల్‌రాజ్, చింతకుంట ప్రభాకర్, హైదర్‌బేగ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.

పేదల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

నర్వ: పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించేవరకు ఉద్యమం ఆగదని ఎమ్మె ల్యే దయాకర్‌రెడ్డి హెచ్చరించారు. వి ద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేం ద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల ను గురువారం ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ధరలు పెంచడమేకాని దించడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

రాబోవు ఎన్నిక ల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని హె చ్చరించారు. టీడీపీ అధికారంలోకి వ స్తే రైతులకు రుణాలు మాఫీచేసి ధ రలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీక్షలో పార్టీ మండల అ ధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డితో పాటు వెంకటేశ్వర్‌రావ్, శ్రీనివాస్‌రెడ్డి, జగన్నాథం, వెంకట్‌రెడ్డి తదితరులు కూ ర్చున్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రావ్, నాయకులు చంద్రశేఖ ర్ రెడ్డి, వెంకటయ్య, మారెప్ప, హ న్మంతు, కుర్మారెడ్డి, కృష్ణయ్య తదితరు లు పాల్గొన్నారు.

మక్తల్: స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద టీడీపీ చేపట్టిన రిలే నిరహార దీక్ష లో టీడీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు బి.చంద్రకాంత్‌గౌడ్ పాల్గొని ప్రసం గించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు. కిరణ్ ప్రభుత్వం పే దలపై భారం మోపడమే తప్పా వారికష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పెంచిన చార్జీలను తగ్గించాలని ఆయన డి మాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె.చంద్రశేఖర్‌గౌడ్, అనంత్‌రెడ్డి, బాల్‌రెడ్డి, లక్ష్మణ్, మధు, రాజశేఖర్‌రెడ్డి, రహీంపటేల్, అన్వర్, వెంకట్రాములు, విశ్వనాథ్, మనాన్, గోపాల్, భీమేష్ పాల్గొన్నారు.

మగనూర్: మండల కేంద్రలో చే పట్టిన రిలే దీక్షలను టీడీపీ మండల అ« ద్యక్షుడు శివకుమార్‌రెడ్డి ప్రారంభించ గా దీక్షలో మాజీసర్పంచ్ రవీందర్, విండో డైరెక్టర్ అశోక్‌గౌడ్, తిప్పన్నగౌడ్, తాయప్ప, ఆంజనేయులు. కృష్ణమూర్తితో పాటు పలువురు కూర్చున్నా రు. వీరికి ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి సం ఘీభావం తెలిపి ప్రసంగించారు. రైతులకు 9గంటల పాటు విద్యుత్‌ను అందిస్తామన్న ప్రభుత్వం 3గంటలు ఇ వ్వడం లేదని ఆయన మండిపడ్డారు. అనంతరం సంతకాలు సేకరించారు. దీక్షలో కూర్చున్న నాయకులకు ఎమ్మె ల్యే నిమ్మరసమిచ్చి దీక్ష విరమింప జేశా రు.

ఆత్మకూర్: మండల కేంద్రంలో చేపట్టిన దీక్షల్లో పీఏసీఎస్ ఉపాధ్యక్షు డు నారాయణ రెడ్డి, టీడీపీ నేతలు మే కల సత్యన్న, ఎస్టీడి శ్రీనివాసులు, గా లిపంపు శ్రీను, గోపన్‌పేట అంజి, కొంకని వానిపల్లి సుధాకర్‌రెడ్డి, అమరచింత ఫయాజ్, నర్సింహ, పిన్నంచర్ల వెంకటేష్ కూర్చున్నారు. దీక్షకు ఎమ్మె ల్యే దయాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అ ధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, టీడీపీ నేత లు రామలక్ష్మా రెడ్డి, శ్రీనివాస్ రావు, అ శ్విన్ కుమార్,పుట్నాల సురేష్, రమే ష్, తిరుమలేష్, సింగంపేట రాజు, పి ట్టల ధర్మయ్య, లక్ష్మయ్య, గొల్ల వల్లన్న, గడ్డం రాములు, నాగిరెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చార్జీలు తగ్గించే వరకు.. ఉద్యమం ఆగదు

నిజమైన పెదకాపు.. చంద్రబాబే

హైదరాబాద్: నిజమైన పెదకాపు చంద్రబాబునాయుడేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చందు సాంబశివరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాపు కులస్తులకు నాడు ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబునాయుడు 'మేమున్నాం' అంటూ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.

గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత రిజర్వేషన్లు దెబ్బతినకుండానే కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్లను కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించడమే కాపుల పట్ల తెలుగుదేశం పార్టీ నిబద్ధతతకు నిదర్శనమని సాంబశివరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నాడు ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబునాయుడు 'మేమున్నాం' అంటూ భరోసా

వినుకొండటౌన్: విద్యుత్ చార్జీలకు నిరసనగా పట్టణంలోని ఆర్‌టీసీ డీపో ఎదుట టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంకు ఆరవ రోజుకు చే రుకున్నాయి. ఆరవ రోజు దీక్షల్లో పట్టణానికి చెందిన పలువురు వికలాంగు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ విద్యుత్ కోతల వల న తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే ఈ సమస్యను ప రిష్కరించాలని కోరారు.

ఈ రిలేనిరాహార దీక్షల్లో పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు మాట్లాడు తూ పెంచిన చార్జీలు, అప్రకటిత కోత ల వలన ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారని ప్రభుత్వం ఈ సమస్య పై నిర్లక్ష్య దోరణి వీడనాడాలన్నారు. దీక్షలో కె.రాజుయాదవ్, ఉట్లూరి మేరి, నంబూరి ఎలియ్య, జొన్నల గడ్డ వెంకయ్య పలువురు వికలాంగులు, డాక్టర్ గోగినేని సాంబశివరావు, తుపాకుల కొండలరెడ్డి, పత్తి పూర్ణచంద్రావు, జివి.రమణ, కరీంసెట్, పల్లమీసాల దాసయ్య, నక్కా వీరారెడ్డి, నలబోతుల శ్రీను పాల్గొన్నారు.

శావల్యాపురంలో...

శావల్యాపురం: విద్యుత్ చార్జీల పెంపుదల, అనధికార కోతలకు నిరసనగా మండల కేంద్రమైన శావల్యాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గురువారం చేపట్టారు. శిబిరాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు గడిపూడి విశ్వనాధం ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి ముండ్రు హనుమంతరావు మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేనిపోరాటం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పిచికలపాలెం, ముండ్రువారిపాలెం, చినకంచర్ల గ్రామాలకు చెందిన చెరుకూరి చౌదరి, పారా హైమారావు, శావల్యాపురం సొసైటీ అధ్యక్షులు దివ్యకోలు వెంకయ్య, గోరంట్ల హనుమంతరావు, బోడెపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈపూరులో ...

ఈపూరు: విద్యుత్ చార్జీలు పెంచినందుకు నిరసనగా మండల కేంద్రమైన ఈపూరులో టీడీపీ ఆద్వర్యంలో రిలే నిరహార దీక్షలు గురువారం ప్రారంభించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రజలపైన ధరల భారాలను మోపుతూ రక్తం పీల్చే జలగల్లా కిరణ్ ప్రభుత్వం తయారైందన్నారు.

దీక్షలో గన్నమనేని వెంకయ్య, అయినాల కోటేశ్వరరావు, సిహెచ్ శేషగిరిరావు, నందిగం అక్కారావు, బోడపాటి రామాంజి మాచర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

బొల్లాపల్లిలో...

బొల్లాపల్లి:విద్యుత్ సమస్యలకు వ్యతిరేఖంగా బొల్లాపల్లిలో ఎన్‌టీఆర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి. పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, కరెంటు కోతలను ఎత్తివేయాలని, రైతులకు నిరంతరాయంగా ఏడు గంటలు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు ముందుగా దీక్షను ప్రారంభించారు.

ప్రభుత్వం ప్రజలపై విధించిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీక్షలో పట్రా పెద్దగాలెయ్య, గుద్దేటి శాంతయ్య,ఎనబర్ల కోటేశ్వరరావు,చిన్న కోటేశ్వరరావు, చెన్నూరు గురవయ్య, పెద్దేటి నాగరాజు, మేడేపల్లి రామయ్య, రాంబాబు,రెడ్డిబోయిన ప్రభుదాసు, దాసారి రాజేష్,ఈ కార్యక్రమంలో షేక్ సుభాని, యాగంటి చంద్రయ్య,గోనుగుంట్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి:టీడీపీ

కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ముందు నుంచీ టీడీపీకి కంచుకోట అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిజాయితీగా ఉన్నారని స్పష్టం చేశారు.

తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా, నిజాయితీపరులు సమాజంలో శాశ్వతంగా ఉండిపోతారన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా గురువారం పిఠాపురం మండలం గొల్లప్రోలు సమీపంలో తాటిపర్తి సెంటర్ వద్ద జరిగిన సమావేశంలో చంద్రబాబు కార్యకర్తలతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా అనపర్తికి చెందిన ఒక కార్యకర్త మూలారెడ్డి ఆర్థికంగా చితికిపోయారని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక్క మూలారెడ్డే కాదు.. టీడీపీ నాయకులంతా నిజాయితీగా పనిచేశారని, చిక్కాల రామచంద్రరావు వంటి అనేకమంది ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తుచేశారు.

కాకినాడ ఎమ్మెల్యే వందల, వేల కోట్ల రూపాయలకు బినామీగా ఉన్నారన్నారు. 2009 ఎన్నికల్లో గెలిచి కాకినాడనూ దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా పెదపూడి మండలానికి చెందిన పలువురు కార్యకర్తలు బొడ్డు భాస్కరరామారావుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన పెదపూడి మండలానికి ఆయన ఏమీ చేయలేదని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేత మళ్లీ మన పార్టీలోకి రావాలని చూస్తున్నారు.. ఆయన వస్తే మేం వెళ్లిపోతాం.. అని పలువురు కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఈ సమయంలో పిఠాపురం ఇన్‌ఛార్జి వర్మ చంద్రబాబు చెవిలో ఏదో చెప్పారు. చంద్రబాబు రాజప్ప వెను తిరిగి.. ఔనా రాజప్పా.. (బొడ్డు మళ్లీ మన పార్టీకి వస్తానంటున్నాడా?) అని ప్రశ్నించారు. రాజప్ప మాత్రం చంద్రబాబుకు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా పెదపూడి మండలం నుంచి వచ్చిన పలువురు కార్యకర్తలు లేచి ఆయన వస్తే మేం వెళ్లిపోతాం.. నమ్మక ద్రోహి బొడ్డు వద్దు.. అంటూ నినాదాలు చేశారు. అతడ్ని మన పార్టీలోకి తీసుకోవడంలేదు తమ్ముళ్లూ? అని చంద్రబాబు అనడంతో కార్యకర్తలు శాంతించారు.

జెండాలు ఎన్నాళ్లు మోయాలి? టీడీపీ కార్యకర్తలు కసితో పనిచేసి టీడీపీ అభివృద్ధి, కాంగ్రెస్ తప్పుల్ని ఎక్కడికక్కడ ప్రచారం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ్ముళ్లూ వచ్చే ఎన్నికల్లో మనం గెలిచితీరాలి? లేకపోతే ఇంకా ఎన్నాళ్లు జెండాలు మోయాలి? అని చంద్రబాబు ప్రశ్నించారు.

చిరంజీవి దెబ్బకొట్టాడు: తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని.. గత ఎన్నికలలో మాత్రం పీఆర్పీ పెట్టి చిరంజీవి మోసగించడం వల్ల టీడీపీ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్‌ని గెలిపించడానికే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

టీడీపీకి.. తూర్పు కంచుకోట

గొల్లప్రోలు: తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను దీటుగా ఎదుర్కొని మరింత బలపడిందని, నాయకులు వెళ్లినా కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గొల్లప్రోలు పట్టణ శివారు తాటిపర్తి రోడ్డు వద్ద గురువారం జరిగిన పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు తమ ఆలోచనలను కసిగా మార్చుకుని గట్టి నిర్ణయం తీసుకుంటే టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. టీడీపీలో అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని, ఏ కులానికి ఎప్పుడూ పెద్దపీట వేయలేదని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, అదే సమయంలో బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

రాజకీయంలో కులం పనిచేయతని స్పష్టం చేశారు. కొంతమంది స్వార్థపరులు కులరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.ఎన్టీఆర్‌కు, తనకు కార్యకర్తల వల్లే ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని చెప్పారు. ఆస్తులు తెగనమ్ముకుని సైతం సేవలు అందించారని కొనియాడారు. అమెరికాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పెదపూడికి చెందిన గుణ్ణం వీర్రాజు చౌదరికి అక్కడి నుంచే పార్టీకి సేవలు అందిస్తున్నారని అభినందించారు. కార్యకర్తలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. కార్యకర్తలపై కేసులు బనాయిస్తే పార్టీయే అన్ని ఖర్చులు భరించి వారికి అండగా పోరాటం చేస్తుందని తెలిపారు. టీడీపీ ఒక కుటుంబం లాంటిదని, అందులో సభ్యులంతా తన కుటుంబ సభ్యులాంటివారన్నారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కంచుకోట అన్నారు.

గత ఎన్నికల్లో చిరంజీవి లేకుంటే మనకే అధికారం దక్కేదని తెలిపారు. ఆయన కాంగ్రెస్ సహాయ పడటానికే వచ్చినట్టుందన్నారు. రాష్ట్ర చరిత్రలో పార్టీలు పెట్టిన చెన్నారెడ్డి, బ్రహ్మనందరెడ్డి, ఎన్జీరంగా కొంతకాలం తర్వాత వాటిని కాంగ్రెస్‌లో కలిపివేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జైలు పార్టీ పిల్ల కాంగ్రెస్ ఎప్పటికైనా తల్లి కాంగ్రెస్‌లో కలవాల్సిందేనని చెప్పారు.

ఈ ఏడాది కీలకం ఏడాదిలోగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని, అంతకంటే ముందుగా స్థానిక సంస్థలు, సాగునీటి సంఘాల ఎన్నికలు జరగనున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాదంతా ఎంతో కీలకమని ప్రతి ఎన్నికను గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారం వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలమని చెప్పారు. పార్టీ పటిష్టత కోసం కార్యకర్తల నుంచి సూచనలు స్వీకరిస్తున్నానని, దీనికి మంచి స్పందన వస్తోందని తెలిపారు. అందరూ మనస్ఫూర్తిగా సూచనలు ఇవ్వాలన్నారు. ఎస్ఎమ్ఎస్‌ల ద్వారా సమాచారం అందిస్తున్నామని చెప్పా రు. తిరిగి ఎస్ఎమ్ఎస్‌ల రూపం లో సమాచారం పంపడం అందరూ నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మంది కార్యకర్తల వివరాలను కంప్యూటరీకరించామని, మరో రూ.7-8లక్షల మంది వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉందన్నారు.

ఈ సందర్భంగా పలు చలోక్తులు విసిరారు. జిందాబాద్‌లు ఇప్పించడం నేర్పించిన నేతలు ఎస్ఎమ్ఎస్‌లు పంపడం మాత్రం నేర్పలేదని సరదాగా వ్యాఖ్యానించారు.

వెన్నా, చిక్కాల నిజాయితీపరులు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు నీతి నిజాయితీలకు మారుపేరని, మూడుసార్లు పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్గీయ వెన్నా నాగేశ్వరరావు నిజాయితీగా పనిచేశారని చంద్రబాబు ప్రశంసించారు. సాధారణ కుటుంబాల్లో పుట్టిన వ్యక్తులను ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత టీడీపీదేనన్నారు. అనపర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి మూలారెడ్డి అదే రీతిలో సేవలందించారని తెలిపారు. నీతి నిజాయితీలతో మచ్చలేకుండా పనిచేసిన వీరందరి పేర్లు చిరకాలం అందరి మనస్సుల్లో ఉండిపోయిందని చెప్పారు.

మీ చిట్టా ఇది సమీక్షలో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు తెలపాలని కోరగా పలువురు తాము చేపట్టిన కార్యక్రమాలు గురించి ఏకరవుపెట్టారు. ఆ సమయంలో నియోజకవర్గాల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికను చంద్రబాబు బయటపెట్టారు. సొసైటీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో చదివి వినిపించారు.

సమర్థులకే టిక్కెట్లు పార్టీ పరంగా సమర్థంగా పనిచేసినవారికే రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తాను ఆశించిన రీతిలో పనిచేయని వారికి నాలుగైదు సార్లు చెబుతానని, అప్పటికి మారకుంటే సదరు నాయకులనే మార్చివేస్తానని స్పష్టం చేశారు. మొహమాటంతో పార్టీని ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. ఏదో ఆవేశంలో పార్టీ నుంచి బయటకు వెళ్లినవారిని తిరిగి పార్టీలోకి తీసుకోవడంలో తప్పులేదన్నారు. సమావేశంలో పిఠాపురం, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు.

పార్టీకి యువతను అనుసందానించాం సకుమళ్ల గంగాధర్ పిఠాపురం మండల తెలుగు యువత అధ్యక్షుడు

నియోజకవర్గంలో గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా యువతను సమీకరించి ఐదువేలమందితో యువశక్తిని తయారు చేశాం. వీరందరినీ పార్టీకి అనుసంధానించి టీడీపీ పటిష్టత కోసం పనిచేస్తాం.

టీడీపీ అభివృద్దిని ప్రచారం చేయాలి పిల్లి రవికుమార్, జిల్లా టీడీపీ కార్యదర్శి, పిఠాపురం తెలుగుదేశం హయాంలో జరిగిన ప్రగతిని ప్రచారం చేయాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి పార్టీ ఇన్‌చార్జి వర్మ పలు కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేయడమే గాక ప్రజా సమస్యలపై పోరాటం సాగించారు.

కొత్త వ్యక్తుల రాకకు అడ్డంకులు కొండేపూడి ప్రకాష్, జిల్లా టీడీపీ కార్యదర్శి పార్టీలోకి కొత్త వ్యక్తులు వస్తుంటే మన నాయకులే అడ్డుకొంటున్నారు. మా ప్రాతినిధ్యం తగ్గిపోతుందని భయపడుతున్నారు.

సంక్షోభాలు ఎదుర్కోని బలపడ్డాం

అమలాపురం: గతంలో మరే రాజకీయ పార్టీ ప్రకటించని రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రూ.ఐదు వేలకోట్ల ప్యాకేజీని రాష్ట్రంలో కాపుల సంక్షేమం కోసం ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి, టీడీపీకి చెందిన నాయకుడు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు అన్నారు. గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వమే కాపుల్లో వెనుకపడిన వారి కోసం నిధులను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఏటా వెయ్యి కోట్ల వంతున ఐదేళ్ల కాలపరిమితిలో రూ.అయిదు వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి ఆర్థికంగా వెనుక బడిన కాపు సామాజిక వర్గానికి అండగా నిలవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నానికి ప్రతి కాపు కులస్థుడు అండగా నిలవాలని మెట్ల పిలుపునిచ్చారు.

జిల్లాలో చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం.. పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి చంద్రబాబు కాపులకు జిల్లాలో ప్యాకేజీని ప్రకటించడం పట్ల ఆయన హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అమలాపురంలోని ఆయన స్వగృహంలో ఈ సందర్భంగా కార్యకర్తల నడుమ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాపులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇతర అగ్రవర్ణాల్లోని నిరుపేదల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల ఒకటవ తేదీన జిల్లాలో చంద్రబాబును కలిసి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందసామన్నారు. ఆ వినతిపత్రంలోని డిమాండ్లను పరిశీలించిన చంద్రబాబు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కాపు కులస్తులను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీని ప్రకటించడం ద్వారా జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గాన్ని ఆకర్షించగలిగారన్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతికి చెందిన కాపు విద్యార్థులకు ఎల్‌కేజీ నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత విద్య, ఇతర అగ్రవర్ణ పేదలకు హాస్టల్ సౌకర్యం, జిల్లాకు ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలని, ఉపాధి లేని కాపు యువతకు బ్యాంకు రుణాల ద్వారా స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని, ఫీజు రీఎంబర్స్‌మెంటు నిధులు విడుదల చేయాలని కాపులకు కూడా సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీల రిజర్వేషన్లకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కాపులకు ఎఫ్ కేటగిరీలో రిజర్వేషన్లు వర్తింప చేయాలని కోరుతూ చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు.

కాపు, అగ్రవర్ణ పేదలను ఆదుకునే లక్ష్యంతో చంద్రబాబునాయుడు రూ.ఐదువేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు పార్టీ తరపున, సామాజిక వర్గీయుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు మెట్ల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరు
పేదలకు కనీసం ఇళ్ల స్థల పట్టాలు కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పేరూరు, బండారులంకల్లో భూములు కొనుగోలు చేసినప్పటికీ నాటి నుంచి నేటివరకు పేదలకు పట్టాలు ఇవ్వలేకపోయారన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర పాలన తిరిగి గాడిలో పడుతుందని ముఖ్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశానికి అండగా ఉండాలని అవినీతి రహిత పాలనకు సహకరించాలని కోరారు. సమావేశంలో నాయకులు యాళ్ల మల్లేశ్వరరావు, సలాది బాబూరావు, మెట్ల రమణబాబు, చిక్కాల గణేష్, పిండి సాయిబాబు, తిక్కిరెడ్డి నేతాజీ, భాస్కర్ల రామకృష్ణ, జంగా అబ్బాయి వెంకన్న, బొర్రా ఈశ్వరరావు, ఆశెట్టి ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.

కాపుల సంక్షేమానికి టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం

తుని: ఆయన వయస్సు 62 ఏళ్లు... ఓ పక్క ఆరోగ్యం సహకరించడం లేదు... అయినా ముందున్న లక్ష్యాన్ని చూసి వెరవడం లేదు. వేల కిలోమీట ర్లు అలవోకగా నడిచేస్తున్నారు. ముది మి మీద పడుతున్న వయస్సులో మితిమీరిన నడకతో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. వీటిని అధిగమించేందు కు వైద్యుల సూచనలు, సలహాలు పా టిస్తున్నారు. అందులో భాగంగానే ఆ యన పక్కనే నిక్షేపంలాంటి రోడ్లున్నా వాటిని కాదని పక్కనున్న మట్టి బెర్మ్ మీద నడవాల్సి వస్తున్నది. ఆయనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు పాదయాత్రతో రాష్ట్రాన్ని ప్ర జా సమస్యలను తెలుసుకుని అధికారంలోకొచ్చాక వాటి పరిష్కరించాలన్న ఆశయంతో 'వస్తున్నా.. మీకోసం' యాత్ర కు శ్రీకారం చుట్టారు.

సగం యాత్ర పూర్తి చేశాక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కాలినొప్పి, మోకాళ్ళు పట్టేయ డం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన్ను పరీక్షించిన వైద్యు లు వేలకిలోమీటర్ల దూరం సిమెంట్, తారు రోడ్లపై నడిస్తే మురుకులు అరిగిపోయే ప్రమాదముందని చెప్పారు. రోడ్డును వదలి పక్కనే ఎర్ర మట్టిదారి (బెర్మ్)మీదే నడవాలని సూచించారు. దాన్ని ఆయన అక్షరాలా పాటిస్తున్నా రు. ఇది నియోజకవర్గాల్లోని నాయకులకు కొత్త ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోం ది. ఆయన యాత్ర ఆపాదమస్తకం రోడ్ల కు ఎడమవైపు తుప్పలు తొలగించి గ్రా వెల్ వేసి బెర్మ్‌లు తయారు చేస్తున్నారు. దీనికే లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని నాయకులు లబోదిబోమంటున్నారు. ఇది బహుదూరపు 'బెర్మ్' చారి వెనకున్న ఆసక్తికర ఇతివృత్తం.

బహుదూరపు బాటసారి కోసం ఎర్రమట్టి దారి

రామగిరి: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించి, కోతలు ఎత్తివేసే వరకు ఉద్యమం ఆగదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్పష్టంచేశారు. గురువారం రామగిరిలో విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ.. విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించి, కాంగ్రెస్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లేక పంటలు ఎండుతున్నాయన్నారు. రాత్రిళ్లు ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు.

ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి పరంధామయాదవ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాములునాయక్, నాయకులు నర్రా శ్రీరాములు, నాగరాజు, అక్కులప్ప, గుర్రం శీనా, బాలరాజు, పేపర్ శీనా, మనోహర్, ఆవులముత్యాలు, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

ఇంటి పట్టాలపై తహసీల్దార్‌తో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష: మండల కేంద్రమైన రామగిరిలో ఇంటి పట్టాల జాబితాపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తహసీల్దార్ వసంత్‌కుమార్‌తో సమీక్షించారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని సూచించారు. తయారైన జాబితాను పరిశీలించారు. వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు

విద్యుత్ సమస్యపై నిరసనలుజన్నారం: కరెంట్ చార్జీలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు రెండవ రోజు గురువారం కొనసాగాయి. ఎంపీ తనయుడు రితేష్ రాథోడ్ దీక్షా శిభిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలకు న్యాయమైన పాలన అందించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు.

దీక్షా శిభిరంలో నాయకులు కొంతం శంకరయ్య, తాళ్లపల్లి రాజేశ్వర్, దుర్గం గంగాధర్, ఎండి యూసూఫ్, దత్తు, నర్సింహులు మజూరోద్దిన్, రమేష్, జాడి వెంకట్, లక్ష్మణ్, సంజీవ్, శంకరయ్య, వాసాల శ్రీనివాస్, మంత్రి లచ్చన్న, జక్కుల సురేష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం

హైదరాబాద్ : సినీ నటుడు నాగార్జున భూ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. "రాజధాని నడిబొడ్డున హైటెక్ సిటీకి కూతవేటు దూరం లో ఉన్న గురుకుల ట్రస్టు భూముల్లో నాగార్జున ఆక్రమణకు పాల్పడ్డారు. అ క్కడ తన భూమికి ఆనుకొని ఉన్న చెరువును పూడ్చి పధ్నాలుగు ఎకరాలు ఆక్రమించారు. వైఎస్‌ను పట్టుకొని దాన్ని రెగ్యులరైజ్ చేయించుకొన్నారు.

సినిమాల నిర్మాణం కోసం అన్నపూర్ణ స్టూడియోకు భూమిని తీసుకుని అందులో వాణిజ్య కార్యకలాపా లు నిర్వహిస్తున్నారు. అందులో పెట్టిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో పేదలకు రాయితీఇస్తారా అని అడిగితే.. నాణ్యత పడిపోతుందని నాగార్జున అన్నా రు. ఆక్రమించుకొన్న భూముల

సన్నాసి అనే కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు
కేసీఆర్ సన్నాసి అనే ఆయనకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ సన్నాసుల పార్టీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఈ వ్యాఖ్య చేశారు. సన్నాసుల మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ను క్రమబద్ధీకరించుకొంటే న్యా యం...పేదల పిల్లలకు రాయితీ ఇస్తే అన్యాయమా?'' అని మండిపడ్డారు.

నాగార్జున భూ వ్యవహారాలపై విచారణ చేయాలి: రేవంత్

హైదరాబాద్ : "జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించి రాజ ప్రాసాదాలు కట్టుకొన్నారు. బెంగళూరులో ఏకంగా 35 ఎకరాల్లో భవనం కట్టుకొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో లక్షా ఇరవై వేల చదరపు అడుగుల మహా భవంతి నిర్మించారు. ఇప్పుడు వాటిలో ఉండేవారు లేక దెయ్యాలు కాపురం ఉంటున్నాయి. జగన్ జైల్లో ఉంటే షర్మిల రోడ్లపై తిరుగుతున్నారు. విజయలక్ష్మి దీక్షల్లో కాలం గడుపుతున్నారు'' అని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నేత ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు.

గురువారం ఆయ న టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కోట్లు సంపాదించినా జగన్‌కు చివరకు జైలు కాపురమే మిగిలిందని... వైఎస్ హయాంలో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న 22 వేల మంది రైతులు, 5వేల మంది చేనేత కార్మికుల ఆత్మలు జగన్ కట్టుకొన్న ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నారు.

జగన్ రాజ ప్రాసాదాల్లో దెయ్యాలు: ముద్దు

వైసీపీకి ఇడీ అమీన్, ముషారఫ్
ఫోటోలు సరిపోతాయి: రేవంత్

హైదరాబాద్: జగన్, వైఎస్సార్ ఫొటోలు పెట్టుకొంటే జనానికి దొంగలు, దోపిడీదారులు గుర్తుకువస్తారని జడిసి, గతిలేక ఎన్టీఆర్ ఫోటోలను వైసీపీ నేతలు వినియోగిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ షర్మిల పాదయాత్ర సందర్భంగా ఫ్లెక్సీలపై ఎన్టీఆర్, జూ. ఎన్టీఆర్ ఫొటోలు దర్శనమివ్వడంపౖౖె ఆయన మండిపడ్డారు.

ప్రతి రాజకీయ పక్షం తమ సొంత పార్టీ నేతల ఫోటోలను పెట్టుకొంటుందని, రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు పెట్టుకొనే కొత్త బిచ్చగాళ్లు, పగ టి వేషగాళ్ల పార్టీలను ఇప్పుడే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. 'ఎన్టీఆర్ నిజాయతీకి మారుపేరు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని దశదిశలా చాటిన నాయకుడు. ఆయన ఫొ టోను అవినీతి పార్టీ ఫ్లెక్సీలపై చేర్చి మలినపరుస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడుతనం మరొకటి లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనపై పోరాటాలు చేశారు. ఆయన ఇంటిపై దాడికి వెళ్లి, కారుకు అడ్డం పడి గొడవ చేశారు.

ఎన్టీఆర్ తన జీవితంలో ఏనాడూ వైఎస్‌తో రాజీపడలేదు. వైఎస్ పేరు చెప్పుకొని ఓట్లు సంపాదించే రోజులు గతించాయన్న భయంతోనే ఎన్టీఆర్ ఫొటోలు అరువు తెచ్చుకొంటున్నా రు' అని విమర్శించారు. దావూద్ ఇబ్రహీం, ఇడీ అమీన్, ముషారఫ్ వంటి వారి ఫొటోలను వైసీపీ నేతలు ఫ్లెక్సీలపై వాడుకొంటే సముచితంగా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్లలో దొంగల ఫొటోలుంటాయని, వాటిని తెచ్చి పెట్టుకొంటే దొంగల పార్టీ అన్న పేరు సార్థకమవుతుందని అన్నారు. ఫ్లెక్సీలతో సంబంధం లేకుంటే ఖండించాలని కోరారు.

గతిలేకే ఎన్టీఆర్ ఫోటోలు

హైదరాబాద్: ప్రజలపై ఎఫ్ఎస్ఏ భారాన్ని మోపడం మొదలు పెట్టింది వైఎస్సే నని నారా లోకేశ్
వ్యాఖ్యానించారు. ట్విటర్‌లో ఈ వ్యాఖ్య చేశారు. తన వ్యాఖ్యకు మద్దతుగా ప్రభుత్వ ఉత్తర్వు ప్రతి ని జత చేశారు. ఎఫ్ఎస్ఏ చార్జీల వసూలుకు అనుమతిస్తూ వైఎస్ సర్కారు 2009లో ఆదేశాలిచ్చిందని, ఈ మేరకు ఈఆర్‌సీ ముందు ప్రతిపాదనలు ఉంచాలని డిస్కంలను ఆదేశించిందని ఈ ఉత్తర్వుల్లో ఉంది. "2004- 09 మధ్యలో వైఎస్ ఒక్క మెగావాట్ ఉత్పత్తి కొత్తగా సాధించలేదు. పైగా 29-6-09 నుంచి ఎఫ్ఎస్ఏ వసూలుకు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీకి ఇవి తెలుసుకోవాలని ఉందా'' అని లోకేశ్ ప్రశ్నించారు.

సర్‌చార్జీలు వైఎస్ చలవే: లోకేశ్

హైదరాబాద్ : "200 యూనిట్ల వరకూ విద్యుత్ చార్జీల భారం తగ్గించామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ, ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పడం లేదు. ప్రభుత్వం భరించకుండా డిస్కంలకు వదిలి వేస్తే అవి మళ్లీ నాలుగు రోజుల తర్వాత ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట జనాన్ని బాదుతాయి. తగ్గింపు భారం ఎవరు భరిస్తారో.. ఎలా భరిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి'' అని టీడీపీ అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు.

50 యూనిట్లలోపు గతంలో కూడా పెంచలేదని, ఆపైన 200 యూనిట్లలోపు వారికి ఇచ్చిన ఉపశమనం కూడా స్వల్పమని, ఆ కేటగిరీల్లో లబ్దిదారులు తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. "గ్రామ పంచాయితీల మంచినీటి పథకాలకు, రైతుల ఎత్తిపోతల పథకాలకు, మునిసిపాలిటీల్లో వీధి లైట్లకు, చిన్న తరహా పరిశ్రమలకు పెంచారు. వాటికి చార్జీల తగ్గింపు గురించి మాట్లాడటం లేదు. వీటిపై ప్రభుత్వం స్పందించే వరకూ మా పోరాటం ఆగదు'' అని ఆయన స్పష్టం చేశారు.

భారం ఎవరు భరిస్తారు!?: ముద్దు

డబుల్ ధమాకా!
కొందరికి చాన్స్.. క్యూలో మరికొందరు
రంగంలోకి వారసులు.. తమ్ముళ్లు

హైదరాబాద్ : టీడీపీలో కొందరు నేతల కుటుంబాలను డబుల్‌ధమాకా అదృష్టం వరిస్తోంది. ఈ అదృష్టం ఇప్పటికే కొందరికి దక్కగా.. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నాల్లో మరికొందరు ఉన్నారు. కొంతమంది సీనియర్లు ఈసారి తమకు తోడు వారసులను కూడా రంగంలోకి తెచ్చే వ్యూహాల్లో ఉండటంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కేఈ సోదరులుగా ప్రసిద్ధి పొందిన కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకొని గెలిచారు. ఈసారి కూడా వారికే టికెట్లు ఖాయంగా కనిపిస్తోంది.

కాకపోతే కృష్ణమూర్తిని ఈసారి ఎంపీగా నిలబెట్టాలని పార్టీ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. ఇక, మహబూబ్‌నగర్ జిల్లాలో భార్యాభర్తలు కొత్తకోట దయాకర రెడ్డి, కొత్తకోట సీత ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈసారి కూడా ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడమో లేదా సీత ఎంపీగా పోటీ చేయడమో జరిగే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్నదమ్ములు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరికీ టికెట్లు వచ్చాయి. కానీ, ఇద్దరూ గెలవలేదు. ఎర్రన్నాయుడు ఆకస్మిక మృతితో ఆయన కుమారుడు రామ్మోహన నాయుడు ఈసారి ఎంపీగా పోటీ చేయనున్నారు.

అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భార్యాభర్తలు రమేశ్ రాథోడ్, సుమన్ రాథోడ్ ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, సుమన్ 'గిరిజన' వివాదంలో కోర్టు కేసుల్లో చిక్కుకొన్నారు. ఈసారి ఆమె బదులు కుమారుడు రితీష్ రాథోడ్ రంగంలోకి రాబోతున్నారు. ఆ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా రితీష్ చురుకుగా పాల్గొన్నాడు. ఇక, కొత్తగా ఈసారి రెండో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ప్రముఖంగా కనిపిస్తోంది.

ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి తన కుమారుడు జగదీష్‌ను నగరి నుంచి రంగంలోకి దించి తాను చంద్రగిరి, పలమనేరు, మదనపల్లిల్లో ఒకదాని నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఒకటే టికెట్ ఇస్తే తాను తప్పుకొని తన కొడుకును నిలుపుతానని, రెండోచోట అవకాశం ఇస్తే తానూ నిలబడతానని సన్నిహితులకు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ ఈసారి తనతోపాటు తన కొడుకు మల్లికార్జున రెడ్డికి కూడా సీటు సాధించాలని పట్టుదలతో ఉన్నారు.

అక్కడ ఇతరత్రా సీనియర్లు లేకపోవడం ఆమె ప్రయత్నాలకు కొంత సానుకూలంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి ఈసారి మరో టికెట్ వస్తోంది. ఆయన తమ్ముడు నరేందర్ రెడ్డి ఇప్పటికే పరిగి సీటుకు ఇన్‌చార్జిగా ఉన్నారు. మహేందర్ రెడ్డి భార్య సునీత పేరు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి పరిశీలనలో ఉంది. అదే జిల్లాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న దేవేందర్ గౌడ్ ఈసారి తన కుమారుడు వీరేశ్‌ను ఉప్పల్ అసెంబ్లీ సీటు నుంచి పోటీకి నిలపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదే జిల్లాలో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తన స్థానంలో తన సోదరుడు తిరుపతి రెడ్డిని ఇప్పటికే నియోజక వర్గంలో పూర్తి స్థాయిలో తిప్పుతున్నారు. శాసన మండలిలో ఇటీవలి వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న దాడి వీరభద్రరావు కుటుంబానికి కూడా ఈసారి రెండు సీట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన కొడుకు రత్నాకర్ ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు.

దాడి వీరభద్రరావు అనకాపల్లి పార్లమెంటు సీటుకు పోటీ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. దాడి స్థానంలో మండలిలో టీడీపీ పక్ష నేత కాబోతున్న యనమల రామకృష్ణుడు కుటుంబానికి కూడా ఈసారి రెండో టికెట్ వచ్చింది. యనమల స్థానంలో ఈసారి తుని నుంచి ఆయన సోదరుడు పోటీ చేయబోతున్నారు. "ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయడానికి రాజకీయ, ఆర్థిక శక్తి ఉండాలి. నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు కలిసి రావాలి. గెలిచే అవకాశం ఉందనుకొంటే ఇవ్వడం తప్పు కాదు. కానీ, పలుకుబడి ఉందని ఇస్తే మాత్రం నష్టం జరుగుతుంది'' అని పార్టీలో సీనియర్ ఒకరు వ్యాఖ్యానించారు.

టీడీపీలో ఒక కుటుంబం.. రెండు టికెట్లు

గొల్లప్రోలు: సిగ్గు, శరం, న్యాయం, ధర్మం వదిలివేసి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కొడుకు జగన్ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పర్యటించిన ఆయన బుధవారం రాత్రి సీతారామస్వామి దేవస్థానం సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రాన్ని కొందరు వ్యక్తులకు దోచిపెట్టి, వారి ద్వారా జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారని విమర్శించారు. లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన దొంగలందరూ నేడు చంచల్‌గూడా జైలులో ఉన్నారని తెలిపారు.

ఇంకా కొంతమంది దొంగలు సెక్రటేరియేట్‌లో మిగిలారని చెప్పారు. వారిని ఇంటికి పంపించాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో గజదొంగలు పడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనికిమాలిన, అవినీతి దద్దమ్మ ప్రభుత్వం ఉందని తెలిపారు. దీన్ని సముద్రంలో కలపాలని ఆయన పిలుపునిచ్చారు.

ధరల అదుపులో విఫలం నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాం కంటే ప్రస్తుతం 300 శాతం పైగా ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటి గురించి ప్రభుత్వాధినేతలకు పట్టడం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో కిలో రూ.15 ఉన్న బియ్యం ధర నేడు రూ.45-50కు చేరిందని, పప్పుల ధరలు రూ.35 నుంచి రూ.80కి, చక్కెర రూ.12నుంచి రూ. 45కి, ఉప్పు రూ.2నుంచి 12, ఎరువుల్లో డీఏపీ బస్తా ధర రూ.425 నుంచి 1750కి, పొటాష్ బస్తా ధర 225 నుంచి 900కి పెరిగిందని వివరించారు. వ్యవసాయ ఖర్చులు 300 శాతం పైగా పెరగగా ధాన్యానికి మాత్రం కేవలం 30శాతం మాత్రమే ధర పెరిగిందన్నారు.

సాక్షి దినపత్రిక విషకన్య లాంటిదన్నారు. దున్నపోతుకు గడ్డి వేసి మేపితే పాలు ఇ స్తుందా.. తిరిగి మనల్నే తన్నుతుంది అని చంద్రబాబు అన్నారు. మహిళలు తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఏకరవు పెట్టారు. రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి లేదని తెలిపారు. ప్రజలు తమ జీవితాల్లో ఇన్ని కష్టాలు ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బెల్టుషాపులను రద్దుచేయడంతోపాటు నిర్వాహకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు తాను వచ్చినట్లు చెప్పారు.

హామీల వర్షం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు అంతటికి సాగునీరు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే అసంపూర్తిగా ఉన్న ఈ పథకానికి నిధులు కేటాయిస్తానని చెప్పారు. ఏలేరు ఆధునికీకరణ చేపట్టడంతోపాటు చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందేలా చూస్తామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ఉల్లి, పత్తి తదితర పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పించి గిట్టుబాటు ధర లభించేలా చూ స్తామని తెలిపారు.

లారీలు, ఆటోలు, ట్యాక్సీలు ఇతర వాహనాల డ్రైవర్లు, క్లీనర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వారు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసేందుకు రాయితీపై రుణాలు అం దచేస్తామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుకు విద్యార్హత నిబంధనను తొలగిస్తామని చెప్పారు. నేను చెప్పింది వాస్తవమైతే ఓటు వేయాలని కోరారు. ప్రజల్లో మార్పు, చైతన్యం రావాలని, ఎన్నికల రోజున ఓటు తనకు వేస్తే ఐదేళ్ల సేవకుడిగా సేవలందిస్తానని తెలిపారు.

బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, నాయకులు పోతుల విశ్వం, బవిరిశెట్టి రాంబాబు, ఉలవకాయల దేవేంద్రుడు, మాదేపల్లి రంగబాబు తదితరులు పాల్గొన్నారు.

తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు

వినుకొండటౌన్: విద్యుత్ చార్జీలకు నిరసనగా పట్టణంలోని ఆర్‌టీసీ డీపో ఎదుట టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంకు ఆరవ రోజుకు చే రుకున్నాయి. ఆరవ రోజు దీక్షల్లో పట్టణానికి చెందిన పలువురు వికలాంగు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ విద్యుత్ కోతల వల న తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే ఈ సమస్యను ప రిష్కరించాలని కోరారు.

ఈ రిలేనిరాహార దీక్షల్లో పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు మాట్లాడు తూ పెంచిన చార్జీలు, అప్రకటిత కోత ల వలన ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారని ప్రభుత్వం ఈ సమస్య పై నిర్లక్ష్య దోరణి వీడనాడాలన్నారు. దీక్షలో కె.రాజుయాదవ్, ఉట్లూరి మేరి, నంబూరి ఎలియ్య, జొన్నల గడ్డ వెంకయ్య పలువురు వికలాంగులు, డాక్టర్ గోగినేని సాంబశివరావు, తుపాకుల కొండలరెడ్డి, పత్తి పూర్ణచంద్రావు, జివి.రమణ, కరీంసెట్, పల్లమీసాల దాసయ్య, నక్కా వీరారెడ్డి, నలబోతుల శ్రీను పాల్గొన్నారు.

శావల్యాపురంలో...

శావల్యాపురం: విద్యుత్ చార్జీల పెంపుదల, అనధికార కోతలకు నిరసనగా మండల కేంద్రమైన శావల్యాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు గురువారం చేపట్టారు. శిబిరాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు గడిపూడి విశ్వనాధం ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి ముండ్రు హనుమంతరావు మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీ లేనిపోరాటం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పిచికలపాలెం, ముండ్రువారిపాలెం, చినకంచర్ల గ్రామాలకు చెందిన చెరుకూరి చౌదరి, పారా హైమారావు, శావల్యాపురం సొసైటీ అధ్యక్షులు దివ్యకోలు వెంకయ్య, గోరంట్ల హనుమంతరావు, బోడెపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈపూరులో ...

ఈపూరు: విద్యుత్ చార్జీలు పెంచినందుకు నిరసనగా మండల కేంద్రమైన ఈపూరులో టీడీపీ ఆద్వర్యంలో రిలే నిరహార దీక్షలు గురువారం ప్రారంభించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రజలపైన ధరల భారాలను మోపుతూ రక్తం పీల్చే జలగల్లా కిరణ్ ప్రభుత్వం తయారైందన్నారు.

దీక్షలో గన్నమనేని వెంకయ్య, అయినాల కోటేశ్వరరావు, సిహెచ్ శేషగిరిరావు, నందిగం అక్కారావు, బోడపాటి రామాంజి మాచర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

బొల్లాపల్లిలో...

బొల్లాపల్లి:విద్యుత్ సమస్యలకు వ్యతిరేఖంగా బొల్లాపల్లిలో ఎన్‌టీఆర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి. పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, కరెంటు కోతలను ఎత్తివేయాలని, రైతులకు నిరంతరాయంగా ఏడు గంటలు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు ముందుగా దీక్షను ప్రారంభించారు.

ప్రభుత్వం ప్రజలపై విధించిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీక్షలో పట్రా పెద్దగాలెయ్య, గుద్దేటి శాంతయ్య,ఎనబర్ల కోటేశ్వరరావు,చిన్న కోటేశ్వరరావు, చెన్నూరు గురవయ్య, పెద్దేటి నాగరాజు, మేడేపల్లి రామయ్య, రాంబాబు,రెడ్డిబోయిన ప్రభుదాసు, దాసారి రాజేష్,ఈ కార్యక్రమంలో షేక్ సుభాని, యాగంటి చంద్రయ్య,గోనుగుంట్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి:టీడీపీ

పిఠాపురం దాటిన తర్వాత కళ తప్పిన భవనం ఒకటి కనిపించింది. చేనేత సహకార భవనం అని తెలిసి లోపలికి వెళ్లాను. అక్కడంతా శ్మశాన వాతావరణం కనిపించింది. మగ్గాలన్నీ శిథిలావస్థకు చేరాయి. కార్మికుల శరీరాలు ఎముకల గూళ్లలా ఉన్నాయి. కుటుంబ పోషణ కోసం వారంతా ఆ మగ్గాలనే నమ్ముకున్నారు. వారి బాధలు ఎన్నని చెప్పను? వాళ్లేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఆప్కోను ఆదుకోవాలని, అన్నగారి జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరించాలని మాత్రమే కోరుతున్నారు.

సమయానికి విద్యుత్ ఇవ్వాలని, మగ్గాలు మళ్లీ కళకళలాడాలని, చేనేత సొసైటీలకు పూర్వ వైభవం రావాలని ఆశిస్తున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ వైపు ఆశగా చూస్తున్నామని, ప్రభుత్వం ఎంతోకొంత విదిలించినా.. ఆ నిధులు చేతిదాకా రావేమని ఆ చేనేత కార్మికులంతా నాతో మొరపెట్టుకున్నారు. ఏడాది ముగిసే సరికి ఆశలు ఆవిరైపోవడం అలవాటైపోయిందని తమ ఆవేదన వెళ్లగక్కారు. త్వరలోనే వారి కష్టాలను తీరుస్తానని భరోసా ఇచ్చి.. మరొక్క ఏడాది ఓపిక పట్టాల్సిందిగా ఓదార్చి ముందుకు కదిలాను.

చేబ్రోలులో క్రైస్తవ సోదరులు వాళ్ల సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. సంక్షేమంలో తమకు న్యాయమైన వాటా రావాలని, చర్చిల ఆస్తులు కర్పూరంలా కరిగిపోకుండా చూడాలని నాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇక చేబ్రోలు పట్టణంలో పేదల చేతిలో పట్టాలున్నాయి గానీ, కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలను మాత్రం చూపించలేదు. అసలు తమకు భూమి ఇచ్చారో లేదో కూడా వారికి తెలియదు. వారికే కాదు.. ఆ విషయం నేతలకే తెలియదు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి వింతలు ఎన్నో!

కాంగ్రెస్ పాలనలో వింతలెన్నో..?

విశాఖపట్నం: చంద్రబాబు 'మీకోసం' పాదయాత్ర ముగింపు సభ విశాఖలోనే జరగనుంది. ఈ నెల 27న జరగనున్న ఈ సభకు మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. శివార్లలో కంటే విశాఖలోనే సభ ఏర్పాటు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. జిల్లాలో పాదయాత్ర, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జులతో శనివారం చంద్రబాబు భేటీ కానున్నారు.

విశాఖలోనే బాబు సభ


టీడీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి పార్టీల నేతలు అట్రాసిటీ కేసులు పెట్టించి వేధిస్తున్నారని సత్యనారాయణరెడ్డి అనే కార్యకర్త చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన బాబు.. కార్యకర్తలపై కేసులు, కోర్టు వ్యవహారాల వంటి అంశాల్లో పార్టీ వారికి అండగా ఉంటుందని, ఎంత ఖర్చయినా భరిస్తుందని భరోసా ఇచ్చారు.

కార్యకర్తలకు అండగా ఉంటా


"విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి.. వైఎస్, కాంగ్రెస్ బృందం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. వైఎస్, జగన్ అక్రమాలవల్ల రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. 'నీకది.. నాకిది' పద్ధతిలో వెనకేసిన సొమ్ముతో జగన్ పత్రిక, టీవీలను పెట్టారు. వాళ్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారు'' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ ఇంత దోచుకున్నా కొంతమంది ఆయనకే మద్దతు ఇస్తున్నారని.. అలాంటివారికి ఓటేస్తే మొత్తం రాష్ట్రాన్నే ఊడ్చేస్తాడని చేబ్రోలు సభలో ఓ కార్యకర్త బాబు దృష్టికి తీసుకువచ్చారు.

దానికి స్పందించిన బాబు.. "ఔను తమ్ముడూ.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తండ్రీ, కొడుకూ దారుణంగా.. సిగ్గులేకుండా దోచుకున్నారు. జగన్ తనకు రూ.10 కోట్లిస్తే.. రూ.100 కోట్ల లబ్ధి చేకూరుస్తానంటూ.. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకు రూ.10 లక్షల కోట్లు చిల్లు పెట్టారు'' అని మండిపడ్డారు. కాశీకి వెళ్లినవాళ్లు తమకు ఇష్టమైనవి వదిలేస్తారని, వైఎస్ సిగ్గు, శరం వదిలేశారని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

సిగ్గూ శరం వదిలేశారు..