April 3, 2013

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దమ్ముంటే.. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో తనతో పోటీ చేసి గెలవాలని టీడీపీ నేత తలసాని శ్రీనివాసయాదవ్ సవాల్ విసిరారు. తాను ఓడితే రాజకీయ సన్యాసం

విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన దీక్షలను... ఎన్నికల కోసమేనంటూ కేసీఆర్ ఎద్దేవా చేయడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఆదరణ లేదని.. కేసీఆర్‌కు దమ్ముంటే తనతో పోటీకి దిగాలన్నారు. బాబు పాదయాత్రతో ప్రజల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ అధినేత ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
తీసుకుంటానని... కేసీఆర్ ఓడితే రాజకీయ సన్యాసానికి సిద్ధమేనా? అని బుధవారం ప్రశ్నించారు. తెలంగాణలోని 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామంటూ కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు.

దమ్ముంటే నాతో పోటీ చెయ్! కేసీఆర్‌కు తలసాని సవాల్

బాబుకు ప్రజల బ్రహ్మరథం

హైదరాబాద్: పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు అవినీతి అంశాలపై చంద్రబాబు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని ప్రశంసించారు. బుధవారం ఆయన సికింద్రాబాద్‌లోని విఠలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే.. మరోసారి విద్యుత్ చార్జీలు పెంచడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. మ రోవైపు.. పాదయాత్రలో చంద్రబాబుకు జిల్లాల ప్రజలు బ్రహ్మరథం ప డుతున్నారని శంకర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అవీనితితో పాటు పలు అంశాలపై చంద్రబాబు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారన్నారు.

అవినీతిపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు: శంకర్‌రావు

గోడలు బీటలు వారాయి. ఇంట్లో సామానంతా చెల్లాచెదరైంది. కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. అంతకన్నా ముందే పశువుల కొట్టంలో కట్టేసిన జీవాలు కట్టు తెంచుకొని ప్రాణభీతితో ఎటుపడితే అటు పోయాయి.. భూకంపం వచ్చినప్పుడు కనిపించే ఈ దృశ్యం.. ఈ రోజు పాదయాత్రలో నన్ను కలవరపెట్టింది. భూమి పోయాక ఏమున్నా లేనట్టే! భూమి తలకిందులైతే ఏదీ మిగలదు. కాకినాడ సెజ్ నిర్వాసితులను కలిసి మాట్లాడినప్పుడు ఇదే భావం కలిగింది.

'సెజ్' ప్రభావిత గ్రామాలన్నీ భయం గుప్పిట్లో ఉన్నాయట! ఎప్పుడు రెవెన్యూ అధికారులు, పోలీసులు తమ పల్లెలపై దాడులు చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని.. నిన్నటిదాకా రైతుతనంతో తలెత్తుకు తిరిగిన వారు వాపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు..దాదాపు ఆరేళ్లుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. నిజమే.. వీళ్ల ఆందోళనతో నాకూ పరిచయం ఉంది. కాకినాడ సెజ్ రూపంలో తమ పంటపొలాలకు ప్రమాదం దాపురించిందని ఏడాది క్రితం వీళ్లంతా నన్ను కలిశారు.

వారి విజ్ఞప్తి మేరకు 'సెజ్' ఆందోళనలో అప్పట్లో నేనూ పాల్గొన్నాను. కొల్లపల్లి, తొండంగిలో జరిగిన ఆ సంగతులు మరోసారి గుర్తుకొచ్చాయి. వీళ్లు చెబుతుంటే మరింత బాగా ఆ విషయాలు కళ్లముందు నిలుస్తున్నాయి. "సార్! అప్పట్లో మా కోసం వచ్చారు. 'సెజ్'కింద పోయే పొలాల్లో కాలినడకన తిరిగారు. అరక పట్టి మాకు ధైర్యం చెప్పారు'' అని చెబుతుంటే.. ఇప్పటికీ గట్టిగా నిలబడి కలబడుతున్న వాళ్ల పట్టుదలను అభినందించకుండా ఉండలేకపోయాను.

పిఠాపురంలో యువకుల కదలిక ఉత్సాహాన్నిచ్చింది. వీళ్లమీదే నా ఆశా, శ్వాసా..! వారంతా అవినీతిపై పదునైన మాటలతో దండెత్తడం బాగా అనిపించింది. నా పోరాటం ఒక కుటుంబంపైనో, ఒక వ్యక్తిపైనో కాదు.. అవినీతి భూతాన్ని రాష్ట్రం పొలిమేరల అవతలకు పారదోలడమే నా జీవితాశయం. పదవిలో ఉన్నప్పుడూ, ప్రతిపక్ష నేతగానూ నేను పోరాడుతున్నది అభివృద్ధి కోసమే.. అవినీతిని చంపకుండా అది సాధ్యం కాదు. కాబట్టే.. ప్రజలకు తెలిసిన మనుషులు, వాళ్ల చీకటి పనులను చెబుతూ ముందుకు కదులుతున్నాను. ఈ తరం యువతకు అది అర్ధమైతే నా కష్టం ఫలించినట్టే!

ఆరేళ్ల తరువాత ఆ ఉద్యమ క్షేత్రంలోకి..

కోటాపైనా త్వరలో మంచి నిర్ణయం
చిరంజీవి వల్ల కొంత దూరమైనా.. మళ్లీ చేరువ
.తూర్పు'పాదయాత్రలో చంద్రబాబు హామీకాకినాడ : టీడీపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని కాపుల సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రిజర్వేషన్ కల్పనపైనా సర్వే జరుగుతున్నదని, త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చర్చిసెంటర్, ఉప్పాడ సెంటర్‌ల మీదుగా గొల్లప్రోలు వరకు ఆయన నడిచారు. పిఠాపురం చర్చి సెంటర్‌లో ఓ భవన నిర్మాణ కార్మికుడు తన కష్టాలు చెప్పుకోగా..సానుభూతితో విన్నారు.

అనంతరం సెలూన్ షాపు, చర్మకారులు, తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి క్షేమ సమాచారం విచారించారు. పాదయాత్రలో భాగంగా జరిగిన పలు వివిధ సభల్లో ఆయన కాపులపై వరాలు కురిపించారు. "అగ్రవర్ణాల్లో కాపుల్లోనే పేదలు ఎక్కువ ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఈ సామాజిక వర్గానికి ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు వెచ్చిస్తాం. కాపులకు రిజర్వేషన్ అంశంపైనా సర్వే చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం'' అని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీల రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

"ముందు నుంచీ కాపులు మా పార్టీకి అండగాఉన్నారు. చిరంజీవి మాయమాటలు నమ్మి వారు కొంత దూరం కావడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయాం'' అని వివరించారు. కాపు సోదరులంతా తిరిగి టీడీపీకి రావాలని ఆహ్వానించారు. కాపుల పిల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. అంతకుముందు.. పిఠాపురంలో మండపేట నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే కార్యకర్తలకు అవార్డులు ఇచ్చి సత్కరిస్తామని చెప్పారు.

"సార్! మన పార్టీ అధికారంలో ఉండగా గ్రామాల్లో నోడల్ వ్యవస్థని ప్రోత్సహించి.. అభివృద్ధి పనుల్లో కార్యకర్తల ప్రమేయం లేకుండా చేశాం. దానివల్ల మాకు గుర్తింపు తగ్గింద''ని ఒక కార్యకర్త అనగా, "ఆ తప్పులు మళ్లీ జరగవ్. కార్యకర్తలకు అన్నింట్లోనూ ప్రాధాన్యం ఉంటుంది.'' అని పేర్కొన్నారు. వైఎస్ తనపై గ్లోబెల్ ప్రచారం చేసి కొంతవరకు నమ్మించగలిగారని, వ్యవసాయం దండగని తాను అనకపోయినా అన్నట్టు దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు.

అప్పట్లో కాంగ్రెస్ వాళ్లు ద్రోణంరాజు సత్యనారాయణతో ఎన్టీఆర్‌పై 101 ఆరోపణలతో కేసు వేయించినా, వైఎస్ హయాంలో తనపై 25 విచారణ కమిటీలు వేసినా ఏ తప్పు చేయలేదు కాబట్టే తమకు కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చాయని చెప్పారు. కొడుకు ఆడుకోవడానికి టీవీ చానల్, రాసుకోవడానికి పేపరును వైఎస్ ఇచ్చారని చెప్పారు. కానీ, తమ పార్టీకి కార్యకర్తలే పేపర్లు, టీవీలుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలంతా టీడీపీ వైపు ఉన్నారని, వారికి సరిగా చెప్తే విజయం తథ్యమని అన్నారు. ఆ తరువాత ఆయన పిఠాపురంలో జరిగిన తెలుగు యువత సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడితే..చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రయత్నిస్తామన్నారు. ఈ సందర్భంగా పిఠాపురంలో 32 అడుగుల పైలాన్‌ను బాబు ఆవిష్కరించారు.

కాపులకు 5 వేల కోట్లు

జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన  రోజురోజుకీ పెరుగుతున్న జనాదరణను చూసి అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ నేతలు ఆలోచనలో పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు జిల్లాలో చేపట్టిన 'మీకోసం' యాత్ర కంటే ఇప్పటి పాదయాత్రకు వచ్చిన స్పందనను ప్రత్యర్థి పార్టీ నేతలు పోల్చుకుంటున్నారు. 'చిరంజీవి వచ్చినా జనం ఇలాగే వచ్చేవారు. జగన్ వచ్చినా ఇంతకన్నా ఎక్కువ హడావుడే వుండేది..' అని కొంతమంది నేతలు సర్దిచెప్పుకుంటున్నా.. మరికొంతమంది నేతలు.. బాబు పాదయాత్ర స్పందనపై లోతుగా విశ్లేషణ చేసుకుంటున్నారు.

గతంలో చిరంజీవిలాంటి నేతలు వచ్చినపుడు చూసి వెళ్లిపోయే జనం ఇపుడు చంద్రబాబు పాదయాత్ర వెంట కొంతదూరం నడవడం, రాత్రి 11 గంటల తర్వాత కూడా అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనడం వంటి పరిణామాలపైనా ప్రత్యర్థి పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

బాబు యాత్రకు మహిళల్లో అనూహ్య స్పందన విద్యుత్ కోతలు ప్రత్యక్షంగా అనుభవించేది మహిళలే. పిల్లలు, మగవారు ఇళ్లలో వుండేది తక్కువ సమయం. వీరితో పోలిస్తే గృహిణులే విద్యుత్ కోతలతో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర సభల్లోనూ ఎక్కువగా విద్యుత్ సమస్యపైనే మాట్లాడుతున్నారు. డ్వాక్రా సంఘాలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని, గ్యాస్‌కు పరిమితి విధించడం వంటివాటిపైనా బాబు తన ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ మహిళలు చంద్రబాబు యాత్రకు బ్రహ్మరథం పడుతూ వీధుల్లోకి వస్తున్నారు.

పెదపూడి 'దేశం'లో పెరుగుతున్న ఐక్యత పెదపూడి మండల టీడీపీ నేతలు ఏక
మవుతున్నారు. ఇతర పార్టీల్లో వున్న నేతల్ని సైతం తమ పార్టీలోకి ఆహ్వానించి బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముప్పయ్యేళ్లపాటు పదవులు అనుభవించి పార్టీకి దూరమైన బొడ్డు భాస్కరరామారావుకు వ్యతిరేకంగా అక్కడ ఆయన సామాజిక వర్గంలో కీలక నేతలు ఇప్పటికే సమావేశమై ఐక్యంగా వుండాలని నిర్ణయించుకున్నారు. ఇతర సామాజిక వర్గాల వారిని కూడా కలుపుకుని టీడీపీ బలం మరింత పెంచుకునే ప్రయత్నాలకు ఇప్పటి నుంచీ శ్రీకారం చుడుతున్నామని అక్కడి నేతలు చంద్రబాబును కలిసి వివరించారు. చంద్రబాబు కూడా ఆయా నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పెదపూడి సభలో స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న అనేకమంది నేతల పేర్లు చెప్పి మరీ అభినందించారు.

బాబు యాత్ర జోరు

భానుగుడి(కాకినాడ): ఎన్నో ఏళ్లుగా ఉభయగోదావరి జిల్లాల రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందక ఇబ్బందు లు పడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి టీడీపీ ఉద్యమించాలని సమాచారహక్కు చట్టం జిల్లా స భ్యుడు జి.శ్రీనివాస్  చంద్రబాబును కలిసి వినతిపత్రం అందచేశాడు. ప్రాజెక్టు పూర్తయితే సాగు, తాగునీరుకు కొరత ఉండదని ఇందుకు కృషిచేయాలని విజ్ఞప్తిలో శ్రీనివాస్ పేర్కొన్నా

పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబుకు వినతి

కాకినాడ 'యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తాం. ఎగుమతులు, దిగుమతులు పెంచి ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం.''

'కాకినాడలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు రింగ్ రోడ్డు నిర్మిస్తాం.''

'ఇక్కడ నుంచి వైజాగ్ వరకు తీరం వెంబడి ప్రత్యేక రోడ్డు, అన్నవరం నుంచి కాకినాడ నాలగుఉ వరుసల రహదారి వేస్తాం..''

'కాకినాడలో డంపింగ్ యార్డు, క్త్రెస్తవ శ్మశానవాటికలకు స్థలాలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం..''

'కాకినాడను ఐటీ పరంగా బాగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఐటీ పార్కు నిర్మిస్తాం.. ఆటోమోబైల్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..''


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెడతానని హామీ ఇచ్చారు. త మ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు. మాదిగలతో పాటు.. మాలలకూ న్యాయం చేస్తామన్నారు. కాకినాడ ఎంపీగా ఎన్నుకున్న వ్యక్తి ఏడాదికొకసారి కూడా కన్పించరని, అలాంటి ఎంపీ, అవినీతిపరుడైన ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

వైఎస్ నమ్మకద్రోహి

వైఎస్ ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి మోసగించిన నమ్మక ద్రోహి అని చంద్రబాబు తీవ్రంగా ఆరోపించా రు. ఊరుకో రౌడీ, మండలానికో దొం గ, జిల్లాకో దోపిడీదారుడ్ని తయారు చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడని విమర్శించారు.

వైఎస్ హయాంలో దోచుకున్నది కాపాడుకునేందుకే జగన్ పార్టీ పెట్టాడన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు రౌడీలు, దోపిడీదారులు రాష్ట్రం వదిలిపారిపోయారని చంద్రబాబు గుర్తుచేశారు.

అందరం పోరాడితేనే

అవినీతి అంతం


వైఎస్, కాంగ్రెస్ దొంగల అవినీతిపై అందరం కలసిపోరాడాలని చంద్రబా బు కోరారు. పేదల కోసం తాను పాదయాత్ర చేస్తున్నానని, కొంతమంది ఇం ట్లో కూర్చునే మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్తున్నారని.. అలా కాకుండా అందరూ తనలా పోరాడి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. 'వాళ్ల అవినీతిపై మెసేజ్‌లు, పది మందికీ చెప్పడం ద్వారా కూడా ఉద్యమంలో పాల్గొనవచ్చన్నారు.

ఆకట్టుకున్న పేరాశ రాజు కథ:

పాదయాత్ర సందర్భంగా చంద్రబా బు కథలు, సామెతలు చెప్పి జనాన్ని ఆకట్టుకుంటున్నారు. సోమవారం జరిగిన పాదయాత్రలో సర్పవరం జంక్షన్‌లో తన ప్రసంగంలో వైఎస్ అవినీతిపై విమర్శలు చేస్తున్న సందర్భంగా చంద్రబాబు ఓ కథ చెప్పారు.

'ఒక రాజ్యంలో రాజు అందరినీ పీడించి తన కుమార్తెకు భారీగా బం గారం పోగు చేసేవాడు. ఎంత బం గారం ఉన్నా ఆ రాజుకు ఆశ తీరక... భగవంతుడి అనుగ్రహం కోసం యజ్ఞం చేస్తాడు. భగవంతుడు ప్రత్యక్షమై.. రాజుని ఏం కావాలి నీకు? అని అడుగుతాడు. నేను ఏది తాకితే అది బంగారం అయ్యే వరం కావాలి.. అని రాజు దేవుణ్ని కోరతాడు. రాజూ ఆలోచించుకో. నీ కోరిక సమంజసంగా లే దు. ఆ తర్వాత నువ్వే ఇబ్బందిపడతా వ్. అని దేవుడు అంటాడు. లేదు స్వా మీ.. నేను అన్నీ ఆలోచించుకునే నిన్ను ఈ కోరిక కోరాను? అంటాడు రాజు. 'నీ ఖర్మ' అని దేవుడు ఆ రాజుపై జాలిగా చూసి వరం ఇస్తాడు.

రాజు ఏది తాకితే అది బంగారం అవుతుంది. రాజు ఆనందానికి అవధు లు ఉండవ్. అన్నం తాకినా బంగారమవుతుంది. కూతురు వచ్చి తండ్రిని కౌగిలించుకుంటుంది. వెంటనే బంగా రు విగ్రహంగా మారిపోతుంది? ఏ కూతురి కోసం అయితే తాను ఈ కో రిక కోరానో.. ఆ కూతురే లేకపోతే ఇవ న్నీ నేనేం చేసుకోవాలి? తర్వాత నేను తినే తిండీ, నీరు కూడా బంగారమైపోతుంటే.. నేనెలా బతకగలను? అని రాజు కుమిలిపోతాడు? ఇదీ చంద్రబా బు చెప్పిన కథ. ఈ కథలో రాజు లాగే వైఎస్ తన కొడుక్కి భారీగా దోచిపెట్టాడని చమత్కరించారు.

కరేజ్ పోర్టు అభివృద్ధి

కాకినాడ విద్యుత్ కోతలు, ఛార్జీలకు వ్యతిరేఖంగా మనం చేపట్టిన ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సబ్‌స్టేషన్ ఎదుట చంద్రబాబు ఒక రోజు ఉపవాస నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భం గా ఆయన తనకు సంఘీభావం తెలిపిన పలు సంఘాల నేతలు, యువకులు, విద్యార్థులతో విద్యుత్ సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతే ప్రధాన కారణమన్నారు.

కేజీ బేసిన్ గ్యాస్ ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు పోతున్నా.. మన ఎంపీలు, కేంద్ర మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరించి రాష్ట్ర ్ఞప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చా కా.. కేజీ బేసిన్ గ్యాస్‌తో స్థానిక అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. లో వోల్టేజీతో వ్యవసాయ పంపుసెట్లు కాలిపోతున్నాయని, ఏటా ఒక్కో మోటార్‌కి రూ.15 వేల వరకు రైతుకు ఖర్చవుతోందన్నారు.

వేళాపాళాలేని విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రం గా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మూతపడుతున్న పరిశ్రమలు వేళాపాళాలేని విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడి లక్షలాది మం ది ఉపాధి కోల్పోతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, యువకులు విద్యుత్ కోతలపై ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

లోక్‌సత్తా పార్టీ నేతలు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బృందం, పారిశ్రామికవేత్తల సం ఘం ప్రతినిధులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఛాంబర్ ప్రతినిధులు, వినియోగదారుల మండలి ప్రతినిధులు, బ్రాహ్మణ సంఘం, పురోహిత సంఘం ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు చంద్రబాబు దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉంటామని వారంతా చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

ఆ చీకటి ప్రభుత్వం నుంచి, వెలుగు రేఖల వైపు.. పయనిద్దాం!

కాకినాడ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో రాష్ట్రం కారు చీకట్లోకి పోయిందని, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర  తిమ్మాపురం, పండూరు జంక్షన్‌లమీదుగా సాగి సామర్లకోట మండ లం నవర అనంతరం పిఠాపురంలో ప్ర వేశించింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు తిమ్మాపురం, పండూరు జంక్షన్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పిల్లి సత్తిబాబు, అనంతలక్ష్మి, వీవైదాస్‌తోపాటు మండలపార్టీ అధ్యక్షుడు ఆర్.సీతయ్యదొర ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భం గా చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో గ్రామానికి ఒక దొంగను తయారుచేసి దోచుకోవడమే ప్రజాప్రతినిధు లు పనిగా పెట్టుకున్నారని ఆరోపించా రు. రూరల్‌లో తాగునీటి ఎద్దడి నివారణకు అప్పట్లో పండూరులో రక్షిత మంచినీటి పధకం రూపొందించామని, పూర్తిస్థాయిలో రూపొందించకపోవడంతో పథకం అమల్లోకి రాక ప్ర జల తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. ఇటువంటి ప్రాంతా ల్లో ఎన్టీఆర్ సుజల పధకం ద్వారా రక్షిత మంచినీరు అందించనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో చనిపోతే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు.

ప్రసు ్తతం రాష్ట్రంలో తుగ్లక్‌పాలన కొనసాగుతుందన్నారు. టీడీపీ హాయాంలోనే 35లక్షల గ్యాస్‌కనెక్షన్లు అందించామన్నారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు 300 శాతం పెరిగితే ధాన్యం ధర 30 శాతం
మాత్రమే పెరిగిందన్నారు. వి ద్యుత్‌కోతలు పెరగడంతోపాటు చార్జీల మోతలు పెరిగాయన్నారు. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కాలంటే టీడీపీతోనే సాధ్యమని ఆయన స్పష్టంచేశారు.ఈ పాదయాత్రలో నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మెట్లసత్యనారాయణ, వాసంశెట్టి సత్య, మాకినీడి శేషుకుమారి, కలగా శివరాణి, కౌజు నెహ్రూ, సరిదే నాగహరినాధ్, దామన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ హయంలో రాష్ట్రం కారుచీకట్లో

తొమ్మిదేళ్లు సీఎంగా నిజాయితీగా పాలన చేశా. ఏ తప్పూ చేయకుండా నిప్పులా బతికాను. మన కార్యకర్తలూ కాంగ్రెస్ దొంగల్లా ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. చాలామంది ఆస్తులు అమ్ముకుని ఆదర్శంగా నిలిచారు. 2014లో అధికారంలోకి వచ్చాకా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని ఆదుకుంటాం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వస్తున్నా మీ కోసం 183వ రోజు పాదయాత్ర    సామర్లకోట మండలం అచ్చంపేట నుంచి పిఠాపురం వరకు సాగింది.

అంతకు ముందు అచ్చంపేటలో కాకినాడ అర్భన్, కాకినాడ రూరల్ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ విజయానికి కార్యకర్తల నుంచి సూచనలు స్వీకరించారు.

వైఎస్, కాంగ్రెస్ దొంగల వల్ల రాష్ట్రంలో పేదరికం విలయతాండవం చేస్తుందన్నారు. ఆ దుష్టుల పాలన నుంచి విముక్తి కలగాలంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్, కాంగ్రెస్‌ల అవినీతి అక్రమాలను ఊరూరా, ఇంటింటా ప్రచారం చేయాలన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లు అందరికీ ఇళ్లు నిర్మించే కార్
మికులకు ఇళ్లులేవని.. భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.ఐదు లక్షలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్మికుల కోసం నేక్ తన హయాంలోనే ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.

వైఎస్ పుత్రోత్సాహమే ఈ దుస్థితికి కారణం


ఒక వ్యక్తి తన కుటుంబం కోసం, పుత్రవాత్సల్యంవల్ల రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని చంద్రబాబు తిమ్మాపురం సభలో ఆక్షేపించారు. కొడుక్కి లక్ష కోట్లు దోచిపెట్టిన వైఎస్ పేదలకు మాత్రం పప్పుబెల్లాలు విదిల్చారన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీపై తొలి సంతకం చేస్తానన్నారు.

మాలల కోసం ప్రత్యేక ప్యాకేజీ

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు. వర్గీకరణ ద్వారా అణగారిన మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేస్తామన్నారు. మాలలకు అన్యా యం చేయబోమన్నారు. మాల సామాజికవర్గంలోను ఎక్కువమంది పేదలు ఉన్నారని.. వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

బొడ్డు చరిత్ర హీనుడు


30 ఏళ్లు టీడీపీలో అనేక పదవులు అనుభవించి పిల్ల కాంగ్రెస్‌లో చేరిన నాయకుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని బొడ్డు భాస్కరరామారావును ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంచల్‌గూడ జైలుకెళ్లిన జగన్‌పార్టీలో చేరడం బొడ్డుకు ఆత్మగౌరమా అని ప్రశ్నించారు. సామర్లకోట మండలం పవర్ సెంటర్‌లో చంద్రబాబు ప్రజల నుద్దేశించి మాట్లాడారు.

నిజాయితీగా పాలించి ... నిప్పులా బతికా!


నగరి/నాగలాపురం/సత్యవేడు/పిచ్చాటూరు/విజయపురం: కేంద్రరాష్ట్రాల్లోని కాంగ్రెస్ అసమ ర్థ విధానాలతో డిస్కంలు అప్పుల్లో కూరుకుపో యి, ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం పడుతోం దని ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు.  విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా నగరి, నాగలాపురం, సత్యవేడు, పిచ్చా టూరు, విజయపురంలో టీడీపీ, వామపక్ష నేతలు ఆందోళనకు పూనుకున్నారు.

నగరి టవర్‌క్లాక్ సెంటర్ వద్ద జరిగిన మహాధర్నాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలో బాబు ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలతో ఉచిత విద్యుత్ అమలు సాధ్యమైందన్నారు. అయితే ఏ సీఎం పెంచని రీతిలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా రూ.32 వేలకోట్ల భారాన్ని విద్యుత్తు చార్జీల రూపంలో మోపారని వాపోయారు. సోనియా దయాదాక్షి ణ్యాలతో దొడ్డి దారిన సీఎం అయిన ఆయన ని యంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం, ఆయన తమ్ముడు రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడుతూ, తన పదవిని కాపాడుకునేందు కు సోనియాకు ముడుపులు చెల్లిస్తున్నారని ఆరో పించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాకారాజ, కృష్ణమూర్తి నాయుడు, పొన్నుస్వామి, సుబ్రహ్మణ్యంరాజు, హరి, గణేష్, బాలాజీ, రమే ష్, వసంత హరినాయుడు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దుచేయాలని కోరు తూ నాగలాపురంలో అఖిల పక్షాలు ఆందోళన జ రిపాయి.

కార్యక్రమంలో నాయకులు ప్రసాద్ రా జు, ప్రభాకర్ నాయుడు, మురళి, నమశివాయ, దేశయ్య, బాబు, నరసరాజు పాల్గొన్నారు. విద్యుత్తు చార్జీల భారం తగదంటూ సత్యవేడులో వామపక్ష నాయకులు ఆందోళనకు పూనుకున్నారు. సీపీఎం మండల కార్యదర్శి అరుణాచలం అధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. సీపీఐ మండల నాయకులు చిన్నిరాజ్, మురళి తదితరులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ప్రభుత్వం అసమర్థ విధానాలే విద్యుత్తు చార్జీల భారంనకు కారణమని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. పిచ్చాటూరులో జరిగిన దీక్షల్లో సీపీఐ మండల కార్యదర్శి కుమార్, సీపీఎం మండల కార్యదర్శి రామచంద్రారెడ్డి, నాయకులు ఉమాపతి, గోవిందరాజులు, రమేష్ పాల్గొన్నారు. పెంచిన విద్యుత్తు బిల్లులు తగ్గించాలని విజయపు రం టీడీపీ నాయకులు పన్నూరు విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. సర్‌చార్జి పేరి ట సామాన్య రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని నాయకులు బాలసుబ్రమణ్యంరాజు, రమణరాజు, దశరథ వాపోయారు.

కాంగ్రెస్ అసమర్థతతోనే డిస్కంలకు నష్టాలు


పలమనేరు రూరల్ : పెంచిన విద్యుత్‌ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలమనేరు విద్యుత్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పట్నం సుబ్బయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులు, రైతుల జీవితాలతో చెలగాటమాడుతోం దన్నారు.రైతులకు 7గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చి 2గంటలు కూడా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. దీనికి తోడు విద్యుత్‌చార్జీలు అమాంతం పెంచివేస్తుండడంతో బడుగు జీవులు విద్యు త్ ఛార్జీలు కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో పరీక్షల సమయంలో వి ద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, చిన్నతరహా పరిశ్రమలు మూసివేతకు గురవుతున్నాయన్నారు.

విద్యుత్ కోతతో కార్మికుల జీవితాలు రోడ్డున పడుతున్నాయన్నారు. దాదాపు అరగంటకు పైగా ధర్నా, రాస్తారోకో చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసుల జోక్యంతో రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం టీడీపీ నాయకులు విద్యుత్ అధికారులకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులు ఆర్వీఎస్‌బోస్, ఆర్వీఎస్ బాలాజీ, డాక్టర్ కదిరప్ప, శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, ఆర్బీసి కుట్టి, అములు, సుబ్రమణ్యం నాయుడు , జగదీష్ నాయుడు తదితరులుపాల్గొన్నారు.

బంగారుపాళ్యంలో నిరాహార దీక్ష

బంగారుపాళ్యం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని విద్యుత్ సమస్య పరిష్కారం కోసం కాకినాడలోని నిరాహారదీక్షకుపూనుకోవడంతో ఆయనకు మద్దతుగా మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు సింగిల్ విండో చైర్మన్ హేమచంద్రనాయుడు ఆధ్వర్యంలో బస్టాండు ప్రాంతంలో నిరాహారదీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ నాగరాజు నాయుడు డైరెక్టర్లు మునిరత్నం రమేష్, నాయకులు లోకనాధం నాయుడు, సూరి, ధామస్, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, హరినాయుడు, మునిరత్నంలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యుత్ ఛార్జీలు తగ్గించాల్సిందే : టీడీపీ


పుత్తూరు: జిల్లాను, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి కేవలం సొంత ప్రయోజనాల కోసమే కలికిరి, పీలేరును ముఖ్యమంత్రి అభివృద్ధి చేసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమ నాయుడు ధ్వజమెత్తారు. పుత్తూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలికిరి మండలంలో సైనిక్ పాఠశాల, పోలీసు బెటాలియన్, వంద పడకల ఆస్పత్రి తదితర వాటిని ఏర్పాటు చేయడం సీఎం తన తమ్ముడు కిషోర్‌కుమార్‌రెడ్డి ఆస్తులను పెంపు చేసేందుకేనని ఆరోపించారు.

అయితే సొంత నియోజకవర్గానికే నిధులన్నీ కేటాయించడం చూస్తే, కిరణ్ పీలేరుకు సీఎంలా పనిచేస్తున్నారే తప్ప రాష్ట్రానికి కాదని ఎద్దేవా చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సొంత పనులు చూసుకు వెళ్లారే తప్ప, విద్యుత్ కోతలతో నష్టపోతున్న జిల్లా రైతులు, పవర్‌లూమ్స్ కార్మికుల గోడు పట్టించుకోలేదని విమర్శించారు. రెగ్యులేటరీ కమిషన్ వద్దంటున్నా ప్రజలను దోపిడీ చేసేందుకే ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచారని పేర్కొన్నారు. సీఎం తన బూటక హామీలు పక్కనుంచి జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి మండలం, మున్సిపాలిటీలకు రూ.కోటి వంతున నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీడీపీ జిల్లా, మండల నాయకులు హరి, సి.ఎస్.బాబు, రాజశేఖర్‌వర్మ, భాస్కర్, రాజశేఖర్‌వర్మ, షణ్ముగరెడ్డి పాల్గొన్నారు.

సొంత ప్రయోజనాలకోసమే పీలేరు అభివృద్ధి : ముద్దుకృష్ణమ నాయుడు

నాలుగు నెలలుగా నానుతూ వచ్చిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు మొత్తం 149 మందికి జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించారు. పార్టీ అనుబంధ కమిటీలనూ ప్రకటించారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీధర్‌వర్మ, తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వి.పుష్పావతి, టీఎన్ఎస్ఎఫ్ అ«ధ్యక్షుడిగా ఎ.రవినాయుడు రెండోసారి నియమితులయ్యారు. కోశాధికారిగా పూల చందుకుమార్, అధికార ప్రతినిధిగా వి.సురేంద్ర కుమార్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కె.మల్లికార్జుననాయుడు, తెలుగురైతు అధ్యక్షుడిగా సి.పాపిరెడ్డి నియమితులయ్యారు.

చిత్తూరు టౌన్: నాలుగు నెలలుగా నానుతూ వచ్చిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గాన్ని సోమవారం సాయంత్రం ప్రక టించారు.టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు మొత్తం 149 మందికి జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పించారు. పార్టీ అనుబంధ కమిటీలను సైతం ఆయన ప్రకటించారు.

టీడీపీ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా జంగాలపల్లె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా గౌనివారి శ్రీనివాసులు (శాంతిపురం), కోశాధికారిగా పూల చందుకుమార్ (చిత్తూరు), అధికార ప్రతినిధిగా వి.సురేంద్ర కుమార్ (చిత్తూరు) ఎన్నికయ్యారు.

జిల్లా ఉపాధ్యక్షులు: పి.వెంకటమణిప్రసాద్ అలియాస్ నాని, ఓ.ఎం.రామదాసు,పి.అశోక్ ఆనంద్ యాదవ్,కఠారి మోహన్,ఎస్.చంద్రప్రకాష్ (చిత్తూరు), మందలపు మోహన రావు,సూరా సుధాకర రెడ్డి,ఎస్.ఖాదర్ బాషా,ఆర్.సి.ముని కృష్ణ, బి.జి.కృష్ణ యాదవ్,మునిశేఖర్ యాదవ్, వి.కృష్ణమూర్తి రెడ్డి,ఎస్.కృష్ణమూర్తి నాయుడు,డాక్టర్ కోడూరు బాలసుబ్రమ ణ్యం(తిరుపతి), పేట రాధా రెడ్డి (శ్రీకాళహస్తి),సప్తగిరి ప్రసాద్ (తవణంపల్లె), ఎస్.ఎన్ మాధవ (పుత్తూరు), పీఎస్ మనోహర్ నాయుడు (గంగాధర నెల్లూరు), పాకా రాజా (నగరి), వై.సాంబయ్య (సోమల), సి.రెడ్డెప్ప రెడ్డి (నిమ్మనపల్లె), ఎన్.పి.జయప్రకాష్ (బంగారుపాళ్యం), కె.భాస్కర్ నాయుడు (కె.వి.పల్లె), ఆర్.వి.బాలాజి (పలమనేరు), వి.గిరిధర్ బాబు (ఐరాల), డాక్టర్ కదిరప్ప (బైరెడ్డిపల్లె), డాక్టర్ వి.వెంకటేష్ (కుప్పం),ఎం.మురుగయ్య (ఎస్ఆర్ పురం).

జిల్లా పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి:

-ఎ.బాలాజి (చిత్తూరు)

డివిజన్ అ«ధికార ప్రతినిధులు:

- పులి మోహన్ (మదనపల్లె), బుల్లెట్ రమణ (తిరుపతి)

ప్రచార కార్యదర్శి: ఎన్.రాజా (గుడిపాల)

కార్యనిర్వాహక కార్యదర్శులు: కె.రాజమాణిక్యం (యాద మరి), ఎ.మదన్ మోహన్ (ఎర్రావారిపాళెం), జి.మురళి నాయుడు (సోమల), ఆర్.నీలకంఠ (మదనపల్లె), వల్లిగట్ల వెంకట రమణ (వాల్మీకిపురం), జి.ఎ.షౌకత్ ఆలి (బైరెడ్డిపల్లె), సి.విజయలక్ష్మి (పాకాల), వి.హరిబాబు నాయుడు (పెను మూరు), సి.రెడ్డెప్ప (తంబళ్ళపల్లె), సాధన మునిరాజ,ఎ. ఈశ్వర రెడ్డి, కె.ఇందుశేఖర్ అలియాస్ చిన్న,ఆర్.పి.శ్రీనివాసు లు, జి.వెంకటేశ్ యాదవ్ (తిరుపతి), అబ్దుల్లా (రామ కుప్పం), జి.మస్తాన్ నాయుడు,డి.ప్రసాద్ నాయుడు (గుర్రం కొండ), వెంకటేష్ (కుప్పం), కె.సతీష్ నాయుడు (పిచ్చాటూ రు), పి.మహేంద్ర (బంగారుపాళ్యం), కె.హరిప్రసాద్ (రామ చంద్రాపురం),ఆర్.దాము నాయుడు(నగరి), పి.ధనంజ యులు నాయుడు(ఏర్పేడు), పి.వేణు గోపాల్ (పూతలపట్టు), ఆర్.ఎస్ వెంకటేశులు నాయుడు (నిండ్ర), వి.హేమాంబరధర రావు (చంద్రగిరి), సదాశివ రెడ్డి (పుత్తూరు), ఎ.వెంకట రమణా రెడ్డి (గంగవరం), ఆర్.వెంకటేష్ అలియాస్ అమ్ములు(పలమనేరు), ఎస్.మున స్వామి (చిత్తూరు).

జిల్లా కార్యదర్శులు: ఎ.సోమనాధ రెడ్డి (ఐరాల), వి.బ్రహ్మయ్య,ఎన్.పి.దొరస్వామి నాయుడు (పలమనేరు), వి.దాము,శ్రీనివాసులు(కుప్పం), జి.ఇనాయతుల్లా (రొంపిచెర్ల), జి.కె.వెంకటరమణ,ఇస్మాయిల్ (మదనపల్లె), టి.సుధాకర్ అలియాస్ సుకుమార్ (బి.కొత్తకోట), ఎస్.మోహన్ రెడ్డి (చిన్నగొట్టిగల్లు), సి.జయగోపాల్ (శ్రీకాళహస్తి), ఎస్.సుబ్రమణ్యం రాజు (నాగలాపురం), ఇ.శివలింగం,రమణ రాజు (విజయపురం), కె.వాసుదేవ రెడ్డి (కార్వేటినగరం), ఇ.బాలాజి,కె.మురళి,సి.విశ్వనాధ రెడ్డి,చిట్టి బాబు, జి.కిషోర్,ఆర్.జయచంద్ర నాయుడు,ఆర్.ప్రసాద్ (చిత్తూరు), టి.హిమగిరి అలియాస్ చిట్టి, వి.భాస్కర్ నాయుడు (యాదమరి),టి.ఓబులేసు (పెద్దతిప్పసముద్రం), సురేంద్ర నాయుడు,అహ్మద్ హుస్సేన్,ఎన్.మహేష్ యాదవ్,ఎన్.చంద్ర శేఖర్ నాయుడు ,వసంతమ్మ,ఎం.లేపాక్షి (తిరుపతి), ఎం.శంకర్ రెడ్డి (రేణిగుంట), పి.బాలసుందరం (వరదయ్యపాళెం), పి.లోకనా«ధం నాయుడు (నిండ్ర), జి.డి.నాయుడు (పెనుమూరు), ఎ.హిమగిరి నాయుడు, బాబూ రావు,ఎన్.మురళీ మోహన్ (పూతలపట్టు), వై.జి.రమణ (కురబలకోట), కె.నరసింహా రెడ్డి (రామచంద్రా పురం), అమరనాధ రెడ్డి (బైరెడ్డిపల్లె), హరిహరన్, భజంగం నాయుడు (నగరి),విజయశేఖర్ నాయుడు (పుత్తూరు), పి.బాలాజి నాయుడు (ఎస్ఆర్ పురం),చిట్టిమిరెడ్డి సిద్దమల రెడ్డి (ములకలచెరువు), బి.సి. రెడ్డెప్ప (తంబళ్ళపల్లె), ఎ.మోహన్ రెడ్డి (పలమనేరు).

జిల్లా కార్యవర్గ సభ్యులు: పి.ఎం.వెంకట రామప్ప (వి.కోట), ఆర్.శ్రీనివాసులు (గుడుపల్లె), ఎన్.జయవేలు రెడ్డి (ఎస్ఆర్ పురం), ముల్లంగి వెంకటరమణ (పులిచెర్ల), ఎం.లవకుమార్ నాయుడు (తవణంపల్లె), సైఫుల్లా (రామకుప్పం), జె.రాజేంద్ర రెడ్డి (వి.కోట), జి.శ్రీనివాసులు (కురబల కోట), ఇ.బి.రవి (తిరుపతి), కృష్ణమూర్తి (గుడిపాల), జి.అమరనాధ నాయుడు (తవణంపల్లె), బి.శివరాజన్ (బంగారుపాళ్యం), పి.కుమారి (తిరుపతి), రాధాకృష్ణ (చిత్తూరు).

ప్రత్యేక ఆహ్వానితులు: డి.రమేష్ (చిత్తూరు), ధనశేఖర్ (సత్యవేడు),ఎం.ఆసిఫ్ మస్తాన్ (బి.కొత్తకోట), దుబాసి రామ మూర్తి (చంద్రగిరి), ఎం.వెంకటేష్ బాబు(పాకాల), తోట వెంకటేశ్వర్లు (తిరుపతి), జంగా రాఘవ రెడ్డి (కురబ ల కోట), ఆర్.ఆనంద చౌదరి (పాకాల).

కో ఆప్షన్ సభ్యులు:ఎస్ ప్రసాద్ నాయుడు (గంగవరం), ఎం.డి రహ్మ తుల్లా (పుంగనూరు), డి.చంద్రశేఖర్ (మదనపల్లె), గోవింద స్వామి (నారా యణవనం), కె.రాజప్ప (వి.కోట), సోమశేఖర్ రెడ్డి (వడమాల పేట), ఎస్.రియాజ్ ఆలీ (గంగాధర నెల్లూరు), కె.రాజశేఖర్ యాదవ్ (ఏర్పేడు), ఎన్.త్యాగరాజు (శాంతిపురం), మంజులమ్మ (రామ సముద్రం), నాగరాజు (సత్యవేడు), రాటకొండ సోమశేఖర్ (మదనపల్లె), జె.చంద్రశేఖర్ నాయుడు (తిరుపతి).

అనుబంధ విభాగాల రథసారథులు వీరే

తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా బి. శ్రీధర్ వర్మ (తిరుపతి) రెండవ సారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా అనిల్ చౌదరి (గుడిపాల)ఎన్నికయ్యారు.తెలుగు మహిళ అధ్యక్షురా లిగా వి.పుష్పావతి (తిరుపతి)రెండవ సారి ఎన్నికయ్యారు. టీఎన్ఎస్ఎఫ్ అ«ధ్యక్షుడిగా ఎ.రవి నాయుడు (చంద్రగిరి),బీసీ సెల్ అ«ధ్యక్షుడిగా కె.శివప్రసాద్ (మదనపల్లె), ప్రధాన కార్యదర్శిగా సంతపేట శరవణ (చిత్తూరు), వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కె.మల్లికార్జున నాయుడు (మదనపల్లె), ప్రధాన కార్యదర్శిగా ఆర్.మోహన్ రెడ్డి (పుత్తూరు), లీగల్ సెల్ అధ్య క్షుడిగా వి.చంద్రమౌళి (పూతలపట్టు), ప్రధాన కార్యదర్శి గా కె.జగదీష్ కుమార్ (పలమనేరు) ఎన్నికయ్యారు. తెలుగు రైతు అధ్యక్షుడిగా సి.పాపిరెడ్డి (శ్రీకాళహస్తి), ఎస్సీ సెల్ అధ్య క్షుడిగా వి.తంగరాజు (నిండ్ర), సాంస్కృతిక విభాగ అధ్యక్షుడి గా పి.ఎస్.రామారావు (చంద్రగిరి), చేనేత విభాగ అధ్యక్షుడి గా ఆర్.చంద్రశేఖర్ (మదనపల్లె), మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎస్.ఎం.రఫీ (మదనపల్లె), ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.బాలాజి నాయక్ (కుప్పం), ఉపాధ్యాయ విభాగ అధ్యక్షు డిగా ఎం.రజనీబాబు నాయుడు (చిత్తూరు), క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడిగా వి.పాల్‌రాజ్ (గుడిపాల),సాంకేతిక నిపుణుల విభాగం(టీఎస్ఎన్‌వీ) అధ్యక్షుడిగా ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి(తిరుపతి) ఎన్నికయ్యారు.

149 మంది సభ్యులతో టీడీపీ జంబో కమిటీ

మడకశిర టౌన్: సామాన్యులు, రైతులపై మో యలేని విద్యుత్ భారాన్ని మోపిందని, ప్రభు త్వం దిగివచ్చేంత వరకు రైతుల పక్షాన నిలబడి తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తుందని నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఈరన్న అన్నారు.మడకశిర విద్యుత్ ఏడీ కార్యాలయం ఎదుట విద్యుత్‌కోతలు, పెంచిన చార్జీలను నిరిసిస్తూ ధ ర్నా చేపట్టారు. ఏడీ కార్యాలయాన్ని ముట్టడిం చి కార్యాలయానికి తాళాలువేసి నిరసన తెలిపా రు. విద్యుత్‌కోతలను ఎత్తివేయాలని, పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, సర్‌చార్జీలను ప్రభుత్వమే భరించాలని, రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని డిమాండు చేశారు.

ప్రభుత్వం దిగివచ్చేంత వ రకు పోరాటాలు ఆగవని, రైతులకు అండగా తె లుగు దేశం పార్టీ ఉంటుందన్నారు. కార్యక్రమం లో జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసమూర్తి, జి ల్లా ఉపాధ్యక్షులు వీ.ఎం.నారాయణరెడ్డి, జిల్లానాయకులు రంగేగౌడు, యువత ఉపాధ్యక్షులు రామక్రిష్ణయాదవ్, సీనియర్ నాయకులు ఆదినారాయణ, శంకర్‌నారాయణరెడ్డి, కరుణాకర్‌రె డ్డి, జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, మండల కన్వీనర్ రామక్రిష్ణ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ప్రకాష్, నాయకులు పుల్లయ్యచౌదరి, చిన్నచెన్నయ్య, రాజగోపాల్,కిష్టప్ప, బొజ్జప్ప, హైదర్, ఫయా జ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లజెండా ఎగరేసిన సీపీఎం

మడకశిర టౌన్: విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా సోమవారం సీపీఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లజెండా ఎగురవేసి నిరసన తెలిపారు. డివిజన్ కార్యదర్శి మనోహర్, నాయకులు ముస్తాక్,రామాంజనేయులు, మీరాన్‌సాబ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెంచిన వి ద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అంత వరకు పోరాటాలు చేపడతామన్నా రు. ఈనెల 9న జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం తెలుగుదేశం ధర్నాకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు.

అమరాపురం : విద్యుత్ చార్జీల పెంపు, అప్రకటిత విద్యుత్ కోతను నిరసిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ జిల్లా క మిటీ సభ్యుడు శివకుమార్, మండల సీపీఐ కార్యదర్శి ప్రకాష్ నిరసన తెలిపారు. విద్యుత్‌చార్జీలు పెంచడం నిరుపేదల జీవితాలతో ఆడుకోవడమేనన్నారు. రైతులకు సక్రమంగా విద్యుత్ అందించకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయన్నారు.

విద్యుత్ అంతరాయం కారణంగా గ్రామాలలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కి ష్టప్ప, ఏఐఎస్ఎఫ్ నాయకుడు శంకర్, కరియప్ప, మహిళలు పాల్గొన్నారు.

కరెంటు కష్టాలపై ప్రభుత్వం దిగి రావాలి

అనంతపురం అర్బన్: కరెంట్ చార్జీల పెంపు, కోతలపై తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. విద్యుత్ సంక్షోభంపై ప్రజా ఉద్యమానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాల ఉద్యమానికి నడుంబిగించారు. అందులో భాగంగా రాప్తాడు ఎమ్మె ల్యే పరిటాల సునీత సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కేం ద్రంలోని ఆమె స్వగృహంలో ఈ ఉ ద్యమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా టీడీపీ విద్యు త్ సంక్షోభంపై ప్రత్యేకంగా బ్లాక్ పేపర్‌లో ముద్రించిన పుస్తకాల బ్రోచర్‌ను విడుదల చేశారు. ఆ తరువాత రాప్తా డు, అనంతపురంరూరల్, ఆత్మకూరు మండలాల టీడీపీ నాయకులతో స మావేశమై సంతకాల ఉద్యమంపై స మాలోచనలు జరిపారు.

అనంతరం ఆయా మండలాల నేతలకు ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలు, సంతకాల సేకరణకు ముద్రించిన పేపర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెం పు చాలా దారుణమన్నారు. 2014 వ రకు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి న పాలకులు ఇప్పటికి మూడు సార్లు పెంచి ప్రజల నెత్తిన భారం వేశారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ను 9 గంటల పాటు నిరంతరాయం గా అందిస్తామని గంట కూడా సక్రమంగా అందించడంలేదని ఆరోపించారు. ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. పోతుందో తెలియక రైతులు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. కోతల వల్ల బోర్లు కింద సాగు చేసిన పంట లు ఎండిపోతున్నాయన్నారు. కొంద రు రైతులు చేసిన అప్పులు కట్టలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీనివల్ల ఆ రైతుల కుటుంబాలవారు అనాథలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పరిశ్రమల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరెంట్ కోతల వల్ల చిన్న చిన్న పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది బతకలేని స్థితిలో ఉండిపోయారన్నారు. చేతగాని అసమర్థత ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఎకరా పొలం ఎండకుండా చూసిన ఘనత చంద్రబాబునాయుడుదేనని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానలను అవలంభిస్తుందన్నారు. ఇలాగే వదిలేస్తే రాష్ట్రం మరింత దిగజారిపోతుందన్నారు. అందుకే రాష్ట్ట్రాన్ని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు మా ఉద్యమానికి అండగా నిలిచి పాలకులు కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. సంతకాల సేకరణ ఉద్యమంలో రాప్తాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని సూచించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బుధవారం ఎన్ఎస్ గేట్ వద్ద హైవేపై భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సునీత విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీడీపీ నేతలు రామ్మూర్తి నాయుడు, రామ్మోహన్ చౌదరి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిప్పేస్వామి, పరిటాల మహేంద్ర, అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండలాల నాయకులు పామురాయి వెంకటేష్, మరూరు గోపాల్, హనుమంతప్పచౌదరి, వేణు, మనోరంజనిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్‌పై టీడీపీ సమర భేరి

ధర్మవరంరూరల్: అధికార కాంగ్రెస్ పార్టీ స్వార్థప్రయోజనాల కోసం విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభానికి నిరసనగా రెండో రోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. రెండవ రోజు దీక్షలను వరదాపురం సూరి ప్రారంభించడమే కాక బ్లాక్ పేపర్‌తో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరదాపురం సూరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ముందు చూపు లేకపోవడం వల్లే నేడు విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపందాల్చుతోందన్నారు.

కిరణ్ సర్కార్‌కు విద్యుత్ వినియోగంపై అవగాహన లేకపోవడం వల్లనే ప్రజలు, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు కరెంట్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో సైతం ప్రజలు తాగునీరు కావాలని అడుగుతున్నారంటే ఎంత దమనీయ పరిస్థితి ఉందో అర్థమవుతోందన్నారు. టీడీపీ హయాంలో ఏనాడు కూడా కరెంట్ కోసం ఎదురుచూసిన పాపానా పోలేదన్నారు. నిరంతరాయంగా తొమ్మిది గంటలు వ్యవసాయానికి విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు ఏకకాలంలో విద్యుత్‌ను సరఫరా చేయడం వల్ల రైతులు పంటలు సాగుచేసుకోవడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, బీరేగోపాలకృష్ణ, మద్దిలేటి, బోయరవి, చిప్పలమల్లికార్జున, ఇనయ్‌తుల్లా, కేహెచ్‌ప్రకాశ్, ఉడుములరాము, రాయపాటి రామకృష్ణ, బెస్తశివ, బోడెగల గిరిదర్, బోడెగల ప్రభాకర్, రాళ్ళపల్లి బాబు, మద్దక మల్లికార్జున, బీమనేని విజయసారధి చౌదరి, ముల్లాషెక్షావలి, బోడెగల గిరిదర్, రేగాటిపల్లి నాగేంద్రరెడ్డి, ముచ్చరామి కిష్ట, జంగంనరసింహులు, శ్రీశైలంపురుషోత్తంగౌడ్, డిష్‌లచ్చి, కనుముక్కలనారాయణ, మల్లాకాల్వరాముడు, మహిళా నాయకురాలుసాహెబ్బీ, బీబీ, మద్దకరమాదేవి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు దీక్షలో చారుగుండ్ల ఓబులేసు, రహంతుల్లా, నజీర్‌ఖాన్, పామిశెట్టి శివశంకర్, మునుస్వామి, అన్నంశీన, శీలామూర్తి తదితరులు పాల్గొన్నారు.

దీక్షలకు హనుమంతరాయచౌదరి మద్దతు

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవిధానాలను విపక్షాలతో పాటు అధికార పక్షంలోని వారు కూడా విమర్శిస్తు న్నా ముఖ్యమంత్రికి మాత్రం దున్నపోతుమీద వర్షం కురిసిట్టు ఉందని టీ డీపీ రైతు సంఘం నాయకుడు హనుమంతరాయచౌదరి విమర్శించారు. వి ద్యుత్ సంక్షోభంతో పాటు పెరుగుతు న్న విద్యుత్ చార్జీలను నిరసిస్తూ ధర్మవరంలో వరదాపురంసూరి ఆధ్వర్యం లో చేపడుతున్న దీక్షలు మంగళవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు హనుమంతరాయచౌదరి సం పూర్ణమద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యు త్ సంక్షోభంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆ యన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం కళ్లు తెరచి రాష్ట్ర ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2014లో చంద్రబాబునాయడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు.

విద్యుత్ వ్యస్థను నాశనం చేసిన కాంగ్రెస్

చోడవరంటౌన్ ఈ పాదయాత్రలో తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ఈనెల 27వ తేదీన మధురవాడలో పాదయాత్ర ముగింపు సందర్భంగా స్తూపం ఏర్పాటు చేస్తామన్నారు. 200రోజులు పూర్తిచేసి 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్టవుతుందన్నారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర 180కిలోమీటర్లు వరకూ ఉంటుందని ఆయన తెలిపారు. విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు కారకులన్నారు. రాష్ట్రానికి రావలసిన గ్యాస్, బొగ్గు వాటాలను తీసుకురావడంలో వీరు విఫలమయ్యారన్నారు. చిన్న పరిశ్రమలకు కరెంటు హాలీడే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, దీంతో 25లక్షల నుంచి 30లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరెంటు సమస్య పరిష్కారానికి ప్రతిరోజు అధికారులతో చర్చించి అనుకున్న కరెంటు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకొన్నారన్నారు. విద్యుత్ సమస్యపై ఎమ్మెల్యేలు దీక్ష చేస్తే ఎటువంటి పరిష్కారం చూపకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. విద్యుత్ సమస్యపై నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల వారీగా సంతకాలు సేకరించి నెలాఖరున గవర్నర్‌కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్.రాజు, విశాఖ డెయిరీ డైరెక్టర్ దాడి గంగరాజు, మాజీసర్పంచ్ గూనూరు మల్లునాయుడు, వెల్లంకి మోదినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా పాదయాత్ర ఈనెల 11 సాయంత్రం నాలుగు గంటలకు జిల్లాలో ప్రవేశిస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే రాజు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, చంద్రబాబు పాదయాత్ర గన్నవరం మెట్టవద్ద ప్రవేశిస్తారన్నారు. ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో మూడు రాత్రుళ్లు, నాలుగు పగళ్లు పర్యటిస్తారని, 14వ తేదీ రాత్రి అనకాపల్లి నియోజకవర్గంలో కన్నూరుపాలెంలో ప్రవేశిస్తారన్నారు.

11న జిల్లాకు 'వస్తున్నా.. మీకోసం'

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే! జన్మభూమికి సేవ చేయడం ప్రతి కుమారుడి కర్తవ్యం! కానీ, వీళ్లేం చేస్తున్నారు? పుట్టింది ఇక్కడే.. కానీ పురిటిగడ్డను మరిచిపోతున్నారు. తల్లి కన్నా ఢిల్లీయే ఎక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కళ్లు తెరిచిన పల్లెలను, నడయాడిన ప్రాంతాలను, రాజకీయం చేసిన రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీలో తిష్ట వేస్తున్నారు. ఎన్నుకున్న ప్రజల కోసం కాక, ఎవరి మెప్పు కోసమో పాలన చేస్తున్నారు. ఇక్కడి గాయానికి అక్కడి మందు రాస్తున్నారు. 'తగ్గలేదు' అంటే 'మీ కర్మం' అంటున్నారు.

ప్లాంటు ఇక్కడ పెడతారు.. కరెంటు బయట అమ్ముకుంటారు. మన సముద్ర గర్భాన్ని తవ్వి గ్యాస్ బయటకు తీస్తారు. వాసన రాకముందే రాష్ట్రం తరలించేస్తారు. ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మాత్రం.. బొమ్మల్లా ఆడుతుంటారు. ఎంత ఘోరం? వీళ్లే సరిగా ఉంటే ఇంత చార్జీల భారం పడేదా? ఇంత కష్టకాలంలోనూ చూసిపోవడానికి రాని కొడుకు అయినా.. ప్రజాప్రతినిధి అయినా ఒక్కటే!

తూర్పుగోదావరిలో నడుస్తున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిన విషయం తెలిసింది. నిజానికి.. ఈ జిల్లా నుంచే దేశమంతటికీ 'గ్యాస్' పోతోంది. ఇక్కడి సముద్రంలోంచి తీసిన సహజ వాయువే పొరుగు రాష్ట్రాల

కానీ, దాని కడుపులో అపార చమురు నిక్షేపాలు ఉన్న విషయం మన ప్రభుత్వం కన్నా కార్పొరేట్ కంపెనీలకే ముందు తెలుస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు రాష్ట్రానికి చెందాల్సిన ఇంత విలువైన ఆస్తిని గుజరాత్‌కు తరలించేస్తారు. అదే ఈ సహజ వనరు మన నియంత్రణలో ఉంటే! ఈ జిల్లాలోని పల్లెలే కాదు..రాష్ట్రం కూడా చీకట్లో ఉండేవి కావు. ఊరి పొలిమేరల్లో గుడ్డి దీపాలు వెక్కిరించేవి కావు. కరెంటు సమస్యపై దీక్షా, నా పాదయాత్రా ఈ సర్కారుకు శవయాత్ర కావాల్సిందే!
ను ప్రగతి రథం ఎక్కిస్తోంది. కానీ, దాని గర్భస్థానంలో చూస్తే గాఢాంధకారం! ఈ జిల్లా పేరు చెబితే ఎవరికైనా కనుచూపు మేరలో పచ్చటి పొలాలు గుర్తొస్తాయి.

సర్కారుకిది శవయాత్రే!

చార్జీలు తగ్గిస్తా!
నిత్యావసర ధరలూ దించుతూ
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు

కాకినాడ : తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గిస్తామ ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కొండెక్కిన నిత్యావసర ధరలను కూడా కిందకు దించుతామని భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దోచుకున్న లక్ష కోట్ల రూపాయలు ఉండి ఉంటే.. ఇప్పుడీ చార్జీల భారం తప్పేదని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా సా మర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద మంగళవా రం ఆయన పాదయాత్ర నిర్వహించారు.

తిమ్మాపురం, పండూరు జంక్షన్, డీ వెంకటాపురం, తండ్రవాడ, పవరా జంక్షన్..చిత్రాడ, పిఠాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ వరకు నడక సాగించారు. దారిలో కలిసిన మత్స్యకారులు, కూ లీలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారి కష్టాలు ఆరాతీస్తూ ముందుకు సాగారు. "ఒక పేదవాడు నాలుగు మామిడిపళ్లు దొంగతనం చేస్తేనే సమాజం నిందిస్తుంది. అలాంటిది లక్ష కోట్లు దోచుకున్న వైఎస్, ఆయన కుమారుడిని మీరు క్షమిస్తారా? వారికి ఏ శిక్ష వేస్తే మీకు న్యా యం జరుగుతుంది?'' అని చిత్రాడ వద్ద ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

శ్రీలక్ష్మి మంచి అధికారిణి అని, ఆమె తన హయాంలో బాగా పనిచేసిందని చంద్రబాబు గుర్తుచేశారు. వైఎస్ ధన దాహానికి ఆమె జైలు పాలు కావాల్సి వచ్చిందన్నారు. ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా ఉండాల్సిన వారే దొంగలుగా మారుతున్నారని సీఎం కిరణ్‌పై ధ్వజమెత్తారు. "రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాటు రాక్షస పాలన సాగింది. ఇప్పటివరకు నలభై వేల కోట్ల మేర వివిధ రూ పాల్లో విద్యుత్ సర్‌చార్జీ విధించారు'' అని ధ్వజమెత్తారు. అంతకుముందు.. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచే ్చ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంచివారికీ, సమర్థులకీ అవకాశం కల్పిస్తామన్నారు.

జగన్ తప్పు చేయకపోతే 9 నెలలుగా బెయిల్ ఎందుకు రాదో?