April 1, 2013

కాకినాడ రూరల్
టీడీపీ అధినేత చంద్రబాబు మీ కోసం వస్తున్నా పాదయాత్రకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. కొవ్వాడ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో ఉరకలేశారు. పాదయాత్రకు ముందుగా కొవ్వాడలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ పిల్లి సత్తిబాబు, అనంతలక్ష్మి దంపతలతోపాటు, వీవై దాసు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కొవ్వాడలో నాలుగు గంటలకు ప్రారంభమైన పాదయాత్రలో ముందుగా నాయకులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన మహిళలతో స్థానిక సమస్యలపై ఆరా తీశారు. మండలంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని మహిళలు ఏకరువు పెట్టారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దొంగలు ఉన్న ప్రభుత్వంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే తప్ప ప్రజాసమస్యలు తీర్చేవారు లేరన్నారు. కరెంటు ఉండదు కానీ కరెంటు బిల్లులు మాత్రం వేలకు వేలు చెల్లించే పరిస్థితి దాపురించిందని దుయ్యపట్టారు. అనంతరం చీడిగలోని నాగం సీతామహాలక్ష్మి కల్యాణమండపంలో రూరల్ మండల పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రైస్తవ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

చీడిగ వంతెన వద్ద మాజీ సర్పంచ్ పితాని అప్పన్న ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. అక్కడ కూడా స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం లేక, సొంత ఇళ్లు లేక పేదలు ఇంటి అద్ది చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అప్పన్న బాబు దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పేద వారికి సొంతింటి కల సాకారం చేసేందుకు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఇంద్రపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి పూలమాలలు వేశారు. అగ్రహారానికి చెందిన బ్రహ్మణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

కాకినాడలో చంద్రబాబుకు నీరా'జనం'

కాకినాడ సిటీ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆదివారం కాకినాడ వచ్చారు. 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రలో భాగంగా కాకినాడ ఆనందభారతి మైదానంలో బాబు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. లోకేష్, బ్రహ్మణి దంపతులు ఉదయం 11 గంటలకు బస వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకుని అక్కడి నుంచి కారులో కాకినాడ వచ్చారు. టీడీపీ కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగర శాఖ అధ్యక్షుడు నున్న దొరబాబు లోకేష్ దంపతులను స్వాగతించి ఆత్మీయంగా పలకరించారు.

ఆదివారం యువత సమావేశం జరపాలని నిర్ణయించామని, విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండడంతో బాబు ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యుత్ ధర్నా చేయాలని కోరారని లోకేష్‌కు కొండ బాబు వివరించారు. అందుకే యువత సభ రద్దు చేశామని చెప్పగా 'విద్యుత్ సంక్షోభంపై నాన్నగారు దీక్ష చేపట్టడం' రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి మేలు చేకూరుతుంది కదా అని కొండబాబుకు బదులిచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న పలువురికి అభివాదం చేసి బస్సులోకి వెళ్లారు. మధ్యాహ్నం 2.45 గంటలకు బస్సు నుంచి బయటకు వచ్చారు. ఇంతలో యువ నేత ముత్తా శశిధర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు లోకేష్ రాక కోసం కొద్దిసేపు ఎదురు చూశారు. బస్సులోంచి బయటకొచ్చిన లోకేష్‌కు శశిధర్ పుష్పగుచ్ఛం అందజేశారు. వాసిరెడ్డి ఏసుదాసు టీడీపీ కండువా కప్పారు.

ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకుని అక్కడ ఉన్న సన్నిహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను పలకరించారు. అనంతరం లోకేష్‌ను విలేఖరులు మాట్లాడమని కోరగా.. ఇప్పుడు మాట్లాడడం సరికాదు... నాన్నగారి పాదయాత్ర ముగిశాక మాట్లాడతాను అంటూ కారు ఎక్కి అభివాదం చేశారు. బాలకృష్ణ మిత్రుడు జిలానీ బ్రాహ్మణిని ఆత్మీయంగా పలకరించిన అనంతరం వారు విశాఖపట్నం వెళ్లారు.

కాకినాడలో మెరిసిన లోకేష్ దంపతులు

కాకినాడ సిటీ:ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నా.. మీకోసం అంటూ పాదయాత్రలో చంద్రబాబు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజల ముందు ఉంచి ఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యవంతులుగా మారుస్తున్నారు. పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ప్రవేశించడంతో ప్రజల్లో ఉత్సాహం వచ్చినట్లయింది. చంద్రబాబు 181 రోజుల పాదయాత్రలో రెండు ఆదివారాల్లో మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు. కాకినాడలో ఆనంద భారతి గ్రౌండ్‌లో తీసుకున్న విశ్రాంతి రెండోది.

పాదయాత్ర ప్రారంభం దగ్గర నుంచి ముగింపు వరకు అలుపెరగని బాటసారిలా నడుస్తూ పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు కాకినాడ ఆనందభారతి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బస్సులో ఆయన బస చేశారు. ఆదివారం విరామం కావడంతో బస్సులో చంద్రబాబు ఏం చేస్తారు అనే దానిపై ఆయన్ను చూసేందుకు వచ్చిన జనం ఆసక్తిగా చర్చించుకున్నారు. బాబు చేసిన బస వద్ద సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు బస్సులో బాబు దినచర్య ఇలా సాగింది.

బాబు సాధారణ రోజుల్లో ఆరు గంటలకు లేస్తారు. ఆదివారం మాత్రం ఉదయం 7.30 గంటలకు నిద్రలేస్తారు. కాలకృత్యాలు తీర్చుకుంటారు. వ్యాయామం, యోగా చేస్తారు. 9 గంటలకు పాదయాత్రకు సంబంధించిన వార్తల విషయాలతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను, దేశ రాజకీయాలను పత్రికల ద్వారా నిశితంగా పరిశీలిస్తారు. 10.30 గంటలకు టీవీ చూస్తారు. వాటి ద్వారా వచ్చే విషయాలను పరిశీలించి జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటారు. ఈ మేరకు జాతీయస్థాయి నాయకులతో మాట్లాడతారు.

అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నిశితంగా పరిశీలించి పార్టీ విధానాలను పార్టీ శ్రేణులకు టెలీకాన్ఫెరెన్స్ ద్వారా నేతలకు వివరిస్తారు. రెండుగంటలపాటు ఈ అంశాలు సాగుతాయి. 12.30 గంటల నుంచి 2 గంటల వరకు కుటుంబ సభ్యులతో గడుపుతారు. రెండు గంటలకు భోజనం చేస్తారు. గంట విరామం అనంతరం మళ్లీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. అనంతరం పాదయాత్రలో కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నాయకులకు సూచనలు, ఏర్పాట్లపై సమీక్ష చేస్తారు.

కేంద్ర, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మరొకసారి టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుంటారు. దినచర్య ఇలా ఉంటే ఇటీవల జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పెదపూడిలో టీడీపీ 32 ఆవిర్భావ దినోత్సవంలో మాజీ ఎంపీ, గుంటూరుకు చెందిన సీనియర్ నేత లాల్‌జాన్ భాష తన ప్రసంగంలో మళ్లీ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. 33వ ఆవిర్భావ దినోత్సవం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో బాబు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా జాతీయస్థాయి నేతలతో టచ్‌లో ఉంటున్నారని తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం పెదపూడిలో నిర్వహించడం ఒక చరిత్రగా మిగిలిపోతుందని పార్టీ శ్రేణలు చెబుతుంటే కాకినాడలో సోమవారం నిర్వహిస్తున్న విద్యుత్ దీక్ష ద్వారా ఈ ప్రాంతం టీడీపీ ఉద్యమాల్లో కీలకమైనదిగా గుర్తుండిపోతుందని నేతలు పేర్కొంటున్నారు.

బస్సులో చంద్రబాబు ప్రపంచాన్ని చూస్తారు

జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన 11 రోజుల పాదయాత్రలో రోజురోజుకీ పెరుగుతున్న జనాదరణను చూసి అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ నేతలు ఆలోచనలో పడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు జిల్లాలో చేపట్టిన 'మీకోసం' యాత్ర కంటే ఇప్పటి పాదయాత్రకు వచ్చిన స్పందనను ప్రత్యర్థి పార్టీ నేతలు పోల్చుకుంటున్నారు. 'చిరంజీవి వచ్చినా జనం ఇలాగే వచ్చేవారు. జగన్ వచ్చినా ఇంతకన్నా ఎక్కువ హడావుడే వుండేది..' అని కొంతమంది నేతలు సర్దిచెప్పుకుంటున్నా.. మరికొంతమంది నేతలు.. బాబు పాదయాత్ర స్పందనపై లోతుగా విశ్లేషణ చేసుకుంటున్నారు.

గతంలో చిరంజీవిలాంటి నేతలు వచ్చినపుడు చూసి వెళ్లిపోయే జనం ఇపుడు చంద్రబాబు పాదయాత్ర వెంట కొంతదూరం నడవడం, రాత్రి 11 గంటల తర్వాత కూడా అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొనడం వంటి పరిణామాలపైనా ప్రత్యర్థి పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

బాబు యాత్రకు మహిళల్లో అనూహ్య స్పందన విద్యుత్ కోతలు ప్రత్యక్షంగా అనుభవించేది మహిళలే. పిల్లలు, మగవారు ఇళ్లలో వుండేది తక్కువ సమయం. వీరితో పోలిస్తే గృహిణులే విద్యుత్ కోతలతో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర సభల్లోనూ ఎక్కువగా విద్యుత్ సమస్యపైనే మాట్లాడుతున్నారు. డ్వాక్రా సంఘాలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని, గ్యాస్‌కు పరిమితి విధించడం వంటివాటిపైనా బాబు తన ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ మహిళలు చంద్రబాబు యాత్రకు బ్రహ్మరథం పడుతూ వీధుల్లోకి వస్తున్నారు.

పెదపూడి 'దేశం'లో పెరుగుతున్న ఐక్యత పెదపూడి మండల టీడీపీ నేతలు ఏకమవుతున్నారు. ఇతర పార్టీల్లో వున్న నేతల్ని సైతం తమ పార్టీలోకి ఆహ్వానించి బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముప్పయ్యేళ్లపాటు పదవులు అనుభవించి పార్టీకి దూరమైన బొడ్డు భాస్కరరామారావుకు వ్యతిరేకంగా అక్కడ ఆయన సామాజిక వర్గంలో కీలక నేతలు ఇప్పటికే సమావేశమై ఐక్యంగా వుండాలని నిర్ణయించుకున్నారు. ఇతర సామాజిక వర్గాల వారిని కూడా కలుపుకుని టీడీపీ బలం మరింత పెంచుకునే ప్రయత్నాలకు ఇప్పటి నుంచీ శ్రీకారం చుడుతున్నామని అక్కడి నేతలు చంద్రబాబును కలిసి వివరించారు. చంద్రబాబు కూడా ఆయా నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పెదపూడి సభలో స్థానికంగా పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న అనేకమంది నేతల పేర్లు చెప్పి మరీ అభినందించారు.

బాబు యాత్ర జోరు

తూ.గో నల్లబ్యాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తున్నారు. ఆనందభారతి నుంచి 2.7 కి.మీ మేర పాదయాత్ర చేసి 11:30 గంటలకు నాగమల్లితోటకు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్ద ఒక్క రోజు దీక్ష చేయనున్నారు.
: విద్యుత్ సమస్యలకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక్క రోజు దీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం కాకినాడలోని ఆనందభారతి నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. భారీగా కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలపై బాబు పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. విద్యుత్ చార్జీలపెంపుపై గవర్నర్‌కు నేతలు మెమోరాండంను అందజేశారు. పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలపై భారాన్ని తొలగించాలని, దీనిపై ప్రజలకు దిశానిర్దేశం చేయాలని గవర్నర్‌ను కోరారు.

గవర్నర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

తూ.గో: వస్తున్నా..మీకోసం పాదయాత్ర సందర్భంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విద్యుత్ సమస్యలు, కోతలకు నిరసనగా కాకినాడలోని నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్ద ఒక్క దీక్షను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు వరకు దీక్ష చేయనున్నారు. బాబు దీక్షకు భారీగా కార్యకర్తలు, స్థానికులు తరలివచ్చారు.

చంద్రబాబు ఒక్కరోజు దీక్ష ప్రారంభం

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై టీడీపీ మహిళా విభాగం నిరసనకు దిగింది. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ వద్ద తెలుగు మహిళా నేతలు దీక్ష చేపట్టారు. ఎడాపెడా కోతలు విధిస్తూ కూడా ప్రజలపై విద్యుత్ బిల్లులను భారీగా మోపుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు.

విద్యుత్ సమస్యలపై టీడీపీ మహిళా విభాగం నిరసన

తూ.గో  ఇది గుడ్డి ప్రభుత్వమని, రాష్ట్రాన్ని చీకటి రాజ్యంగా చేసిందని ఆరోపించారు. టీడీపీ హాయంలో నాలుగేళ్లు కరువు ఉన్నా రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చామని గుర్తు చేశారు. సీఎం కిరణ్‌కు విద్యుత్‌పై అవగాహన లేదన్నారు. కరెంట్‌ను ముందే కొని వుంటే ఇబ్బందులు వచ్చేవి కాదని ఆయన తెలిపారు.

కరెంట్ కొనుగోలు, బొగ్గు దిగుమతుల్లో సీఎం కిరణ్ అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డబ్బు తీసుకుని ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు కరెంట్‌ను అమ్ముకుంటున్నారని, ఇందులో మనకు మిగిలింది మాత్రం కాలుష్యం, బూడిదే అని విమర్శించారు.

యూనిట్‌కు రూ.12 చెప్పున కరెంట్ కొంటున్నామని సీఎం కిరణ్ చెబుతున్నారు...అందులో ఆయన వాటా ఎంత అని ప్రశ్నించారు. సమర్థవంతమైన విద్యుత్ వ్యవస్థను అప్పగిస్తే వైఎస్ నుంచి కిరణ్ వరకు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తపరిచారు. విద్యుత్ రంగాన్ని రూ.40 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు పనికిరాని వాళ్లని వ్యాఖ్యానించారు.

కిరణ్‌కు ధైర్యం ఉంటే 1994 నుంచి 2013 వరకు విద్యుత్‌పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎరవు ఏం చేశారో తెలుస్తుందన్నారు. తాము విడుదల చేసిన బ్లాక్‌పేపర్‌పై కట్టుబడి ఉన్నట్లు బాబు తెలిపారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల చిన్న పరివ్రమలను కోలుకోలేని దెబ్బతీశారని చంద్రబాబునాయుడు మండిపడ్డారు.

చంద్రబాబు చేపట్టిన ఒక్కరోజు దీక్షకు భారీగా కార్యకర్తలు, స్థానికులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
: విద్యుత్ చార్జీల పెంపు బాధాకరమని, ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని కాంగ్రెస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. సోమవారం ఉదయం విద్యుత్ సమస్యలకు నిరసనగా కాకినాడలోని నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్ద బాబు ఒక్క రోజు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని దుయ్యబట్టారు.

విద్యుత్ చార్జీలు పెంపు బాధాకరం : చంద్రబాబు

విద్యుత్ చార్జీలు పెంపు బాధాకరం
కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని చీకటి రాజ్యం చేశారు
టీడీపీ హయాంలో 9 గంటలు కరెంట్ ఇచ్చాం : చంద్రబాబు

తూ.గో  సోమవారం ఉదయం విద్యుత్ సమస్యలకు నిరసనగా కాకినాడలోని నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్ద చంద్రబాబు ఒక్క రోజు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్మమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది గుడ్డి ప్రభుత్వమని ఆయన విమర్శించారు. టీడీపీ హాయంలో నాలుగేళ్లు కరువు ఉన్నా రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం కిరణ్‌కు విద్యుత్‌పై అవగాహన లేదన్నారు.

కరెంట్‌ను ముందే కొని వుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదని చంద్రబాబు తెలిపారు. కరెంట్ కొనుగోలు, బొగ్గు దిగుమతుల్లో ముఖ్యమంత్రి కిరణ్ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డబ్బు తీసుకుని ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు కరెంట్‌ను అమ్ముకుంటున్నారని, ఇందులో మనకు మిగిలింది మాత్రం కాలుష్యం, బూడిదే అని ఆయన విమర్శించారు.

యూనిట్‌కు రూ.12.30 పైసలకు కరెంట్ కొంటున్నామని సీఎం కిరణ్ చెబుతున్నారని, అందులో ఆయన వాటా ఎంత అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సమర్థవంతమైన విద్యుత్ వ్యవస్థను అప్పగిస్తే వైఎస్ నుంచి కిరణ్ వరకు నాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని రూ.40 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు పనికిరాని వాళ్లని బాబు వ్యాఖ్యానించారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ధైర్యం ఉంటే 1994 నుంచి 2013 వరకు విద్యుత్‌పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. అప్పుడు ఎరవు ఏం చేశారో తెలుస్తుందని ఆయన అన్నారు. తాము విడుదల చేసిన బ్లాక్‌పేపర్‌పై కట్టుబడి ఉన్నట్లు బాబు తెలిపారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల చిన్న పరివ్రమలను కోలుకోలేని దెబ్బతీశారని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కాగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షకు భారీగా నేతలు, కార్యకర్తలు, స్థానికులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
: విద్యుత్ చార్జీల పెంపు బాధాకరమని, ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని చీకటి రాజ్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిది గుడ్డి ప్రభుత్వం