March 31, 2013

హైదరాబాద్ : వెస్ట్‌లండన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పార్టీ యూకే/యూరప్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు ఎన్ఆర్ఐ విభాగం కోర్ టీం సభ్యులు సహా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నేతలు ఎల్వీఎస్సార్కే ప్రసాద్, పంచుమర్తి అనురాధ, మోత్కుపల్లి నర్సింహులు, కోడెల శివప్రసాద్, వర్ల రామయ్య, గరికపాటి మోహన్‌రావు, కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎల్ ప్రసాద్ తదితరులు టెలికాన్ఫరెన్స్ ద్వారా తమ సందేశాలను వినిపించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ యూకే/యూరప్ విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆకాంక్షించారు. టీడీపీ యువత విభాగం పగ్గాలను నారా లోకేష్ చేపట్టాలని వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అభిమానులు నినాదాలు చేశారు.

లండన్‌లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కదనరంగంలోకి దూ కింది. సర్కారుపై సమరం ప్రకటించింది. విద్యుత్తు చార్జీలను తగ్గించేంతవరకు పోరాడతామని ఆ పార్టీ నేతలు దేవేందర్ గౌడ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, పరిటాల సునీత, సండ్ర వెంకటవీరయ్య, శమంతకమణి ప్రకటించారు. ధర్నాలు, నిరసనలు, బంద్‌లతో ప్రభుత్వం మెడలు వంచుతామని వారు హెచ్చరించారు.

కొత్త విద్యుత్తు ధరల ప్రతులను టీడీఎల్పీ కార్యాలయం వద్ద దహనం చేశారు. ఏప్రిల్ 2 నుంచి 7 వ తేదీ వరకు గ్రామాల్లో సంతకాల సేకరణను నిర్వహిస్తామని నేతలు వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రం చీకటిమయమైందని, రోశయ్య, కిరణ్ అదే పరిస్థితిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇంత అడ్డగోలుగా చార్జీలు పెంచలేదని ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు.

కాగా, తెలుగు మహిళలు సోమవారం నిరాహార దీక్షకు సిద్ధమవు తున్నారు. తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద పలువురు మహిళా నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొంటారని ఆ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రతి పక్షాల పిలుపు మేరకు వచ్చేనెల తొమ్మిదో తేదీన జరగనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పీఎల్ శ్రీనివాస్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

చార్జీలపై సమరమే: టీడీపీ


పాదయాత్రగా కాకినాడ సబ్‌స్టేషన్ వద్దకు
సాయంత్రం వరకు రోడ్డుపై బైఠాయింపు
'విద్యుత్' ఉద్యమానికి ఊపు తెచ్చే యత్నం

కాకినాడ : పాదయాత్ర.. పోరుయాత్రగా మారనుంది. ఇప్పటిదాకా జనంలోకి నడిచిన పాదాలు సర్కారుపై కదం తొక్కనున్నాయి. సమస్యలు వింటూ ముందుకు సాగిన ప్రయాణం.. నిలబడి కలబడే రణంలోకి మళ్లనుంది. వాతలు పెడుతున్న కోతలు, వీపు వాయగొడుతున్న చార్జీల మోతలకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ఒక రోజు దీక్షకు సిద్ధమవుతున్నారు. గ్యాస్‌బండ నుంచి వంటింటి సరుకుల దాకా కొండెక్కి కూర్చున్న వేళ సామాన్యుడిపై ఆరు వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడంపై ఆయన నిరాహారంగా నిరసన తెలపనున్నారు. కోతలతో మూతపడుతున్న పరిశ్రమలు; సాగర్ నీళ్లూ, మోటార్ నీళ్లూ లేక నోళ్లు వెళ్లబెడుతున్న పంట పొలాల పరిస్థితిపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు సన్నద్ధమవుతున్నారు.

పాదయాత్రకు ఆదివారం విరామం కావడంతో ఆయన ఆనందభారతి గ్రౌండ్స్‌లో బస చేశారు. సోమవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తన బస నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరతారు. అక్కడకు 2.7 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ జేఎన్‌టీయూ వద్ద గల నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్దకు 11 గంటలకు చేరుకుంటారు. విద్యుత్ చార్జీల పెంపు-కోతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయిస్తారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేసి.. ఆ తర్వాత పాదయాత్రను కొనసాగిస్తారు.

విద్యుత్ సమస్యపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతటా ఉద్యమాన్ని రాజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగనున్న చంద్రబాబు దీక్ష.. కరెంటు ఉద్యమానికి మరింత ఊపునిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి.. చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేసిన సమయంలో బాబు పాదయాత్రలో ఉన్నారని.. ఆ క్షణానే 'దీక్ష'కు నిర్ణయం తీసుకున్నారని ఈ వర్గాలు చెబుతున్నాయి.

బాబును కలిసిన కుటుంబ సభ్యులు
పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి బసలో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబును ఆదివారం ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కలిశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు వారు చంద్రబాబుతో గడిపారు. అంతకుముందు..లోకేశ్, బ్రాహ్మణిలు హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో వచ్చారు. చంద్రబాబు కుటుంబానికి సన్నిహితులైన కొందరు లోకేశ్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులు ఆయనను కలవగా మాట్లాడేందుకు నిరాకరించారు. అనంతరం కారులో చంద్రబాబు వద్దకు వెళ్లారు.

బాబు దీక్ష నిరాహారంగా ఒకరోజు నిరసన

తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించి ప్రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకు ఆశపడి పిల్ల కాంగ్రెస్‌లో చేరిన నేతలకు బుద్ధి చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలకు పిలపునిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడలో శనివారం పెద్దాపురం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముప్పయ్యేళ్లు పార్టీలో ఉండి పదవులు అనుభవించి విలువల్లేకుండా జైలుకెళ్లి మరీ పిల్ల కాంగ్రెస్‌లో చేరారని బొడ్డు భాస్కరరామారావుపై దుమ్మెత్తిపోశారు. నీతి, నియమాలు లేని నాయకులు ఎక్కడా రాణించలేరన్నారు.

ప్రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకోసం ఆశపడి వెళ్లిన వారికి బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు వెళ్లిపోతున్నా కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా అండదండలు అందించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. 'ఆ నేత చెంచలగూడ జైలుకెళ్లి కొబ్బరికాయ కొట్టి జైలు పార్టీలో చేరాకా.. మీ అందరికీ స్వేచ్ఛ వచ్చినట్లు కన్పిస్తున్నారు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చి ఉత్సాహంగా ఉన్నారు' అని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

టీడీపీని వదిలి బయటకు వెళ్లిన వాళ్లెవరైనా రాణించారా? తమ్ముళ్లూ? అన్న చంద్రబాబు ప్రశ్నకు.. లేదు.. లేదు.. వీళ్లకూ జైలే గతి.. అని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎండుకొమ్మల్ని తీసేస్తేనే కొత్త చిగుళ్లు వస్తాయని ఒక కార్యకర్త చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఔను తమ్ముడూ.. ఎండుకొమ్మల్ని మనం తీయకుండానే పోతున్నాయి. కలుపుమొక్కల్ని పీకిపడేస్తేనే పంట బాగా పండుతుంది.. అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.వీళ్లంతా టీడీపీలో ఉంటేనే హీరోలు.. బయటకు పోతే జీరోలే. మీరంతా పార్టీ వెంటే ఉన్నారు. ఇపుడు ఆ నాయకులకు తమ వెంట వస్తారన్న భ్రమలు కూడా తొలగిపోయాయి.. అని చంద్రబాబు బొడ్డును ఉద్దేశించి ఆక్షేపించారు.

పెద్దాపురం నియోజకవర్గం చరిత్ర సృష్టించాలి వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరైనా అఖండ మెజార్టీతో గెలిపించి కా ర్యకర్తలు చరిత్ర సృష్టించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఇపుడే ఎన్నికలు వచ్చినట్లు కన్పిస్తోంది.. అన్నారు.

వెకిలి చేష్టలు ఎందుకు?

పిల్ల కాంగ్రెస్‌లో చేరిన ఆ నేత నేను పాదయాత్ర చేస్తున్న దారిలో ఉగాది శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఉగాది ఎప్పుడు తమ్ముళ్లూ? తొందరపడి ముందే కూసింది ఓ కోడి.. అన్నట్లు తయారయ్యారు ఈ నేత. మ న కార్యకర్తల్ని తన వెంట జైలు పార్టీలోకి రమ్మంటున్నా వెళ్లడంలేదని దౌర్జన్యాలు చేస్తున్నారట.. అని చంద్రబా బు అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయాలని చూసినా బెదిరించినా ఖబడ్తార్.. అని హెచ్చరించారు.

ఐదు వందల అనపర్తి ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగకుండా నీతి, ని జాయితీలతో కూడిన టీడీపీని గెలిపించాలన్నారు. ఏదైనా పని కోసం వెళ్తే అ నపర్తి ఎమ్మెల్యే డబ్బిచ్చి ఓట్లేయించుకున్నానని పని ఎలా చేస్తానని చెప్తున్నార ట. ప్రలోభాలకు లొంగితే అలాగే ఉం టుంది.. ఈ కాంగ్రెస్ వాళ్లు దోచుకోవ డం మళ్లీ ఆ సొమ్ముతో ప్రలోభాలకు గురిచేయడం వైఎస్ నుంచి నేర్చుకున్నారు.. అని అనపర్తి ఎమ్మెల్యేని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనపర్తి నియోజకవర్గంలో పాదయా త్ర ప్రారంభమైనప్పటి నుంచీ చాలా సభల్లో చంద్రబాబు ఈ ఐదు వందల విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.

కార్యకర్తల సూచనలు విన్న బాబు శనివారం జరిగిన పెద్దాపురం ని యోజకవర్గ సమీక్షలో చంద్రబాబు కా ర్యకర్తల ప్రసంగాలను ఆసక్తిగా విన్నా రు. పలువురు కార్యకర్తలు చేసిన సూచనలను బాబు రాసుకున్నారు. జట్ల మో హన్ అనే కార్యర్త మాట్లాడుతూ.. 1995లో మీరు సీఎంగా ఉన్నపుడు పు ట్టిన పిల్లలకు ఇపుడు ఓటు హక్కు వచ్చింది. వాళ్లలో చాలామందికి మీ పాలన గురించి, పరిపాలనా దక్షత గురించి తెలియదు. డాక్యుమెంటరీలు రూపొందించి అలాంటివారికి అవగాహన కల్పించాలి.. అని చంద్రబాబుకు సూచించారు. ఆర్‌బీ పట్నానికి చెందిన చిన్న, రవికుమార్ (వేట్లపాలెం), గోలి సత్తిరాజు (సామర్లకోట), నున్న రాంబాబు, సిద్ధా త్రిమూర్తులు, జిలా నీ, రెడ్డి లక్ష్మి పెద్దాపురం ఇన్‌ఛార్జిగా సమర్ధుడైన నేతను ఎంపిక చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకోసం ఆశపడి వెళ్లిన వారికి బుద్ధి చెప్పాలి.........

కొవ్వొత్తులు ఆత్మశాంతికి ప్రతీకలు. గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖాన్ని కొవ్వొత్తి వెలుగు కొంతైనా తగ్గించి ఓదారుస్తుంది. కానీ, ఈ పల్లెల ఆవేదన తీరాలంటే, ఎన్ని కొవ్వొత్తులు వెలిగించాలో! ఈ చీకటి చింత తొలగాలంటే ఎంత వెలుగు ప్రసరించాలో! చీకట్లోనే కాకినాడలో అడుగుపెట్టాను.ఆడపడుచులకు విలువనిచ్చిన పార్టీ, ప్రభుత్వం మాది. ఇప్పుడు వాళ్లు అన్నివిధాల చీకట్లోనే మగ్గుతున్నారు. రూపాయిని పొదుపు చేయడం నేర్పి వారిని మహాలక్ష్ములను చేద్దామని నాడు నేను చూస్తే, లక్షాధికారులను చేస్తామంటూ ఆ పెద్ద మనిషి వాళ్లను భిక్షాధికారులను చేసి పోయాడు. ఇంద్రపాలెంలో జరిగిన ఆత్మీయ సమా వేశంలో మహిళల గోడు ఇదే. డ్వాక్రా మహిళలుగా..ఇప్పుడు ఆర్థిక లబ్ధినే కాదు,

కనీసం ఆత్మగౌరవాన్ని కూడా నిలుపుకోలేకపోతున్నామని వాపోయారు. ఆడపిల్ల మైనస్ కాదు, ప్లస్ అని చాటాలన్న తాపత్రయం వారి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకునేలా చేసింది. కానీ, ఇప్పుడు ఆ కార్యక్రమాలూ లేవు.. ఆ కళా లేదు. చాలీచాలని కూలీ, మొగుడి తాగుడు కోసం తాకట్టుకు పోయే తాళి.. గ్యాస్‌బండ నుంచి ధరలకొండ వరకు వాళ్ల జీవితమే ఒక ఎగతాళి..!
ఎప్పుడో పోయిందో తెలియదు.. ఏ గడపలో చూసినా కొవ్వొత్తులూ..కిరోసిన్ బుడ్లే! దుకాణాల్లోనూ వాటి వెలుగులోనే బేరాలు చేస్తున్నారు. ఉక్కపోసి గుక్కపెట్టిన చిన్నారులను భుజాన వేసుకొని ఆడపడుచులు వాకిట కునికిపాట్లు పడుతున్నారు. సందడిగా ఉండాల్సిన వీధులు రాత్రి తొమ్మిదయ్యేసరికి దుప్పటి తన్నేసినట్టు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏ ఇంట్లోనూ మగమనిషి లేడు. అడిగితే.. మోటార్ వేయడానికి పొలం పోయాడనేదే జవాబు! ఈ పాపం ఎవరిది?

చీకటి చింతల్లో పల్లెలు!

గాలికీ పన్నేస్తారేమో!
సీఎం ఆరిపోయిన అవినీతి కిరణం
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తాం: చంద్రబాబుకాకినాడ, మార్చి 30 : "ఇదో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. మనం పీల్చుకునే గాలికి కూడా పన్ను వేసేలా ఉంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లోని కొవ్వాడలో శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. గంగన్నపల్లి, చీడిగ, ఇంద్రపాలెం మీదుగా నడక సాగించారు. ఈస్టర్‌ను పురస్కరించుకొని చీడిగలో జరిగిన క్రైస్తవ సదస్సులో పాల్గొన్నారు. "పేదల సొమ్ము దోచుకోవడం పాపమని బైబిల్ చెప్పింది. వైఎస్ కుటుంబం మాత్రం మతాన్ని అడ్డంపెట్టుకుని దోపిడీకి పాల్పడింది'' అని ఆక్షేపించారు.

అధికారంలోకి వస్తే క్రైస్తవ దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని క్రైస్తవ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు.. విద్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కొవ్వాడ సభలో తీవ్రంగా గర్హించారు. " వైఎస్, కాంగ్రెస్ దొంగలు కమీషన్లకు ఆశపడి ప్రైవేటు విద్యుత్ కంపెనీల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొన్నారు. ఇప్పుడా భారాన్నంతా సర్‌చార్జీల రూపంలో పేదలపై వేస్తున్నార''ని విమర్శించారు. సీఎం యువ కిరణం కాదు..ఆరిపోయిన అవినీతి కిరణం అని, ఆయన పాలన ప్రజల పాలిట శాపమని తూర్పారబట్టారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ఘనత వైఎస్‌దేనని దుయ్యబట్టారు.

"రాజశేఖరరెడ్డి ఓ మేకవన్నె పులి. ఎమ్మెల్యేలను పాడుచేశారు. అధికారులను జైలుకు పంపారు. బతికుండగా వైఎస్ ప్రతిసారీ విశ్వసనీయత గురించి మాట్లాడేవారు. విశ్వసనీయత అంటే దోచుకోవడమా?' అన్నారు. ఆయన హ యాంలో టీడీపీ కార్యకర్తలు 200 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. చివరకు వైఎస్ పత్రికల్నీ వదిలిపెట్టలేదని, కొడుకు పత్రిక, టీవీ కోసం ఇతర పత్రికల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. తాత రాజారెడ్డి హత్యా రాజకీయ వారసత్వాన్ని జగన్ పుణికిపుచ్చుకున్నారని ధ్వజమెత్తారు. "జగన్ నన్నూ బెదిరించారు.

'మీ నాన్నే నన్నేమీ చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావ్' అని అడిగాను'' అని చెప్పుకొన్నారు. కాగా, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ఎన్ని కుయుక్తులు పన్నినా అంతిమ విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రకు ముందుగా కొవ్వాడలో పెద్దాపురం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1984 సంక్షోభాన్ని గుర్తు చేశారు. "కొంతమందికి కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. 1984 ఆగస్టు సంక్షోభం గురించి నా మనసు ఎందుకో శంకించింది. నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తున్నారని ముందే అనిపించింది. సంకల్పాన్ని బట్టి బుద్ధి పనిచేస్తుంది'' అని చెప్పుకొచ్చారు.

గతంలో పెళ్లి చేయాలంటే రెండు తరాలు చూసేవారని, అభ్యర్థుల్ని ఎంపిక చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడు తరాలు చూడాలేమోనని చమత్కరించారు. ఈ సమయంలో జిలానీ అనే కార్యకర్త వైఎస్ సమాధి అంశం లేవనెత్తడంతో చర్చ ఆసక్తిదాయకంగా మారింది. "సార్! ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి సమాధి చాలా పెద్దదిగా కట్టారు. చుట్టూ కరెంటు పెట్టారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సమాధులు కూడా ఇంత పెద్దగా లేవు. అసలు ఆ సమాధిలో వైఎస్ శవం ఉందో.. మరేముందో?' అని అనగా "బంగారం దాచిపెట్టారేమో?'' అని చంద్రబాబు సరదాగా అన్నారు.

వైఎస్ పాపాల వల్లే మనకీ 'షాక్‌లు'