March 18, 2013

"ప్రభుత్వం ఈసారి ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ రైతులని ఊరించి మరీ ఉసూరుమనిపించింది. కొత్తగా కేటాయింపులు ఏమీ రాలేదు. వ్య వసాయం, దాని అనుబంధ రంగాలకు కలిపి గత ఏడాది కేటాయింపులు రూ. 5700 కోట్లు ఉండగా, ఈసారి కేవలం రూ. 6129 కోట్లు ఇచ్చారు. వ్యయసాయ బడ్జెట్ మొత్తం కేటాయింపుల్లో ప్రణాళిక వ్యయం, జలయజ్ఞం నిధులను తీసేస్తే నికరంగా మిగిలేది రూ. 4200 కోట్లు. ఏడు లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కనీసం ఒక్క శాతం నిధులను కూడా వ్యవసాయానికి కేటాయించడం లేదు.

టీడీపీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్ 2003-04లో వ్యవసాయానికి రూ. 1,166 కోట్లు కేటాయించింది. దాదాపు ఐదు శాతాన్ని వ్యయసాయంపై ఖర్చు చేసింది. దీని ప్రకారం చూస్తే ప్రస్తుత కే టాయింపులు కనీసం ఏడు వేల కోట్లన్నా ఉండాలి. కానీ సగం కూడా దక్కలేదు. దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం''
-టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు విజయ్‌కుమార్

వ్యవసాయంపై మళ్లీ చిన్న చూపే

 అదిగో చంద్రబాబు వస్తున్నాడు అంటూ ఉరుకులు, పరుగులు. అప్పటికే రోడ్లకిరువైపులా కిక్కిరిసిన జనం. వయసుపైబడి నాలుగు అడుగులు వేయడం కష్టంగా ఉన్న పండు ముదుసళ్లు కూడా కళ్లజోళ్లు సవరించుకుని ఆయన కోసం ఎదురుచూపులు.. బహుదూరపు బాటసారికి సంఘీభావం తెలిపేందుకు చేతిలో పూలు పట్టుకుని చిన్నారుల హడావుడి. నృత్యాలు చేస్తూ యువకులు, హారతులు ఇస్తూ మహిళలు, దీవెనలు ఇస్తూ రైతులు ఇలా ఒకరికొకరు తోడై జనప్రవాహమయ్యారు.

సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తోడుగా నిలిచారు. వస్తున్నా మీకోసం అంటూ మీరు వస్తుంటే మేము కూడా మీవెంటే నంటూ కొన్ని గ్రామాల్లో మహిళలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తామయ్యా, మా కష్టాలు మీరే తీర్చాలంటూ మరికొన్నిచోట్ల వేడుకోలు వెరసి 169వ రోజైన సోమవారం చంద్రబాబు జనం మధ్యలో నిండు చంద్రుడిలా మెరిశారు. వెలుగులు చిందించారు. జిల్లాలో ఆయన ఉప్పుటేరు నుంచి పాదయాత్ర ప్రారంభించి కాకరపర్రు వరకు వంద కిలోమీటర్ల పాదయాత్రను ఆదివారం పొద్దుపోయిన తర్వాత పూర్తి చేశారు. తిరిగి సోమవారం కాకరపర్రు నుంచి బయలుదేరి 15 కిలోమీటర్ల మేర ప్రయాణానికి మధ్యాహ్నం మూడున్నర గంటలకే ఉపక్రమించారు. ఉదయాన్నే గోపాలపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాన్ని పూర్తి చేసుకుని, ఆ వెంటనే విలేకరుల సమావేశంలో పాల్గొని వెంటనే పాదయాత్రకు సిద్ధమయ్యారు.

మునిపల్లిలో రోడ్డుపక్కన ఆయన ఆగిన వారిని పలకరించినప్పుడు అక్కడ ప్రజలు అసలు కష్టాలను ఆయన ముందుంచారు. ఏకంగా మహిళలు తమ గోడును ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్నారు. 'కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం. ఒక బుడ్డి (ఒక లైట్) ఉంటేనే ఐదొందలు వరకు బిల్లులు వేస్తున్నారు. కట్టలేకపోతున్నాం' అంటూ బావురమం ది. రూపాయి బియ్యం ఇవ్వాల్సిందే. లేకపోతే ఏదైనా తాగి చావాల్సిందే, ఎవరూ మమ్మల్ని లెక్కచేయట్లేదు. మీరే మాకు దిక్కు అంటూ తన మొరవినిపించింది. చంద్రబాబు ఆ మహిళను ఊరడించారు. నీకేం భయంలేదు. పార్టీని అధికారంలోకి తీసుకురండి మీ కష్టాలన్నీ పోతాయి. కరెంటు సమస్యలన్నీ తీరుస్తానని భరోసా ఇచ్చారు.

వంట చేసుకోవాలంటే గ్యాస్ ఇబ్బందులు, మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మరో మహిళ అన్నా రు. మీరు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు, కానీ మేము ఆర్టీసీ ఛార్జీలు తట్టుకోలేక రోజూ పాదయాత్ర చేస్తున్నామని రాజేష్ అనే మరో విద్యార్థి తన గోడు చెప్పాడు. రైతులుగా మేము నీటి ఇబ్బందుల్లో ఉన్నాం. కాలువలకు సరిగ్గా నీళ్లు రావడం లేదు. ఏం చే యాలో అర్థమే కావడం లేదని పెం డ్యాల సెంటర్‌లో మరికొందరు రైతు లు ఆవేదన వెళ్లగక్కారు.

రూపాయి బియ్యం తీసేస్తే తీసేశారుగానీ, కరెంటు బిల్లులు తగ్గించండి, మా కేమీ వద్దంటూ ఇంకో మహిళ చంద్రబాబు కు విజ్ఞప్తి చేసింది. టీడీపీకి ఓటేస్తాం. మిమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తాం. దాని కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామని మరో మహిళ బాబుకు మద్దతు ప్రకటించారు. అలాగే కలవపల్లి, ముప్పవరం గ్రామాలతో సహా అన్ని చోట్లా ఆయన సాగే మార్గంలో వందలాది మంది ఎదురేగి ఇలాంటి సమస్యలనే వినిపించారు. బాబు కూడా కాంగ్రెస్ అసమర్థత, అవినీతి కారణంగానే ఇలాంటి పరిస్థితి దాపురించిందని పార్టీ గెలుపు ఒక చారిత్రక గెలుపు అయ్యేలా మీరు సహకరించి దీవెనలు అందిస్తే ఈ కష్టాలన్నింటినీ తొలగిస్తామని భరోసా ఇచ్చా రు.

ఆయన పాదయాత్రకు సోమవారం జనం బ్రహ్మరథం పట్టారు. అన్నిచోట్లా వందలాది మంది ప్రవాహంలా ఆయన వెంట సాగారు. అన్నింటికంటే మించి పల్లెల కూడళ్లలో కూడా ఉత్సాహం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే శే షారావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీ తారామలక్ష్మి, పార్టీ కన్వీనర్లు ఆయన వెంటే ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలైతే ఉత్సాహం పట్టలేకపోయారు. మోటారు బైక్‌లతో సందడి చేశారు. ప్రతి ఊళ్లోనూ పార్టీ పతాకాలతో, ఫ్లెక్సీలతో పసుపు మయం చేశారు. సోమవారం యాత్రలో బాబు కూడా దారిపొడవునా అనేక వర్గాలను కలిశారు. లారీ ఎక్కి ఒకసారి, స్కూటర్ నడిపి ఇంకోసారి వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

మధ్యాహ్నం నుంచే యాత్ర ప్రారం భం కావడంతో ఆయన పర్యటించే ప్రాంతాలన్నీ జనంతో పొద్దుపోయేంత వరకు కిక్కిరిసి కన్పించాయి. చిన్నారులు సైతం బాబుతో షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు పోటీలు పడ్డారు. బడి పిల్లలు పువ్వులతో ఎదురేగి బాబుపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో రెండవ రోజు పాదయాత్ర జనసంద్రం మధ్య సాగింది.

బాబు వెనకే ప్రజాకెరటం

ఆ ప్రాంతాన్ని చూసిన వెంటనే 'కోనసీమ' గుర్తుకు వచ్చింది. ఆ పచ్చటి స్వర్గానికి ఇది ముఖ ద్వారమా? అని ఒక్కక్షణం అనిపించింది. విరగ్గాసిన కొబ్బరి చెట్లు, గెలలు దిగిన అరటి, అక్కడక్కడా పచ్చటి రంగేసినట్టు వరి పొలాలు.."ఏమి అందం'' అనుకుంటూ ఊళ్లోకి వెళ్లాను. తీరాచూస్తే.. దారితప్పి వచ్చానా అనిపించింది. కానూరు శివార్లలో చూసిన దృశ్యానికి, ఊళ్లో తారసపడుతున్న జనాలకు ఎక్కడా సంబంధం లేదు. ఆ విస్మయం నుంచి పూర్తిగా బయటపడకముందే, ఆ ఆడపడుచు గొంతు వినిపించింది.

'అయ్యా! ఇంత దూరం వచ్చావు. మా ఇంటికి ఒకసారి రండి'' అంటూ వేడుకుంది. చెప్పకుండానే ఆమె దయనీయ స్థితి అర్థమవుతూనే ఉంది. సరే అని వెంట వెళ్లాను. 'ఇదే సార్! మా ఇల్లు' అని ఆమె చెప్పిన చోట పూరిపాక కనిపించింది. 'రేషన్ కార్డు ఉందా' అంటే..తీసుకొచ్చి చూపించింది. "ఐనా.. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదా' అని ఆరా తీశాను. 'ఎక్కడ సార్! ఎక్కడెక్కడి ఇళ్లూ ఊళ్లో కాంగ్రెస్ నాయకులకు చాలడం లేదు. ఇక మమ్మల్ని పట్టించుకునే నాథుడు ఎవడు?'' అని కసిగా ప్రశ్నించింది. 'కోనసీమ'లో కమనీయ అందాలకే కాదు..

డుపు తరుక్కుపోయే కథలకూ కొదవ లేదు!
ఒకప్పటి అరటి రైతు.. ఇప్పుడు కూలీ. నీలం తుఫాను ముందు దాకా సొంత సాగు చేసుకున్నవాడే.. ఆ తరువాత నుంచి పని వెతుక్కుంటూ గట్టుగట్టుకూ తిరుగుతున్నాడు. రైతాంగానికి సాయం మొదలు పొలానికి బీమా దాకా.. ఏదీ మాట్లాడటానికి లేదట! "పంట పోయినా తీసుకున్నది కట్టాల్సిందేనని బ్యాంకు వాళ్లు వేధిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల బెడద తప్పిందనుకున్నాం. వీళ్లు అంతకన్నా ఘోరమయ్యారు సార్!'' అని ఆ రైతు వాపోయాడు. ఇంకెక్కడి రైతు బడ్జెట్!

ఇంకెక్కడ రైతు బడ్జెట్!

రైతు బడ్జెటా..విధాన పత్రమా!
ఐనా..ఏదీ సమర్థత
రైతుకు మళ్లీ అన్యాయమే
పశ్చిమయాత్రలో చంద్రబాబు వ్యాఖ్య

ఏలూరు: "వ్యవసాయ బడ్జెట్ ఆలోచన నాదే. దాన్ని వీళ్లు కాపీ కొట్టారు. తీరా చూస్తే అది బడ్జెట్ కాదు.. విధాన పత్రం. ఇంతకంటే వీళ్లకు ఉన్న సమర్థత ఏమిటసలు? రైతులకు మళ్లీ అన్యాయమే చేశారు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పెదవి విరిచా రు. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. కాం గ్రెస్ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా కానూరువద్ద పాదయాత్ర ప్రారంభించారు.

మునిపల్లె, పెండ్యాల ఎక్స్‌రోడ్, కలవచర్ల, బి.ముప్పవరం, పందలపర్రు, పురుషోత్తమ పల్లె, మద్దూరు మీదుగా 16.8 కిలోమీటర్లు నడిచారు. చంద్ర వరంవద్ద రాత్రి బస చేశారు. పాదయాత్రలో చాలా చోట్ల ప్రజలు ఆధార్ కార్డులు, నగదు బదిలీ పథకం "మాకు వద్దేవద్దు'' అని నినదించారు. డబ్బులు కాదు.. బియ్యమే కావాలని మునిపల్లెలో ఓ మహిళ తెగేసి చెప్పింది. పెం డ్యాల సెంటర్‌లో రైతులు కష్టాలు వెళ్లబోసుకున్నారు.

కాగా, యాత్రలో భాగంగా ప్రజలకు ఆయన 'కోతి- మొసలి' కథ వినిపించి ఆకట్టుకున్నారు. అంతకు ముందు కానూరులో విలేకరులను కలిసినప్పుడు సాధా రణ, వ్యవసాయ బడ్జెట్‌లపై తీవ్రంగా స్పందించారు. "ఇదొక తప్పుల తడక, మొక్కుబడి బడ్జెట్. కొత్త విషయమేదీ లేదు. తప్పులు సరిదిద్దుకోవడంగానీ, సంక్షోభం నుంచి బయటపడేందుకుగానీ ప్రయత్నం జరగలేదు. ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష నిదర్శనం'' అని ధ్వజమెత్తారు.

కేెటాయింపులను లెక్కల్లో చూపారు తప్ప చిత్తశుద్ధిగానీ, తగిన కసరత్తుగానీ కన్పించడం లేద న్నారు. ర్రాష్టంలో అప్పులు లక్షా 79 వేల కోట్ల రూపా యలకు చేరాయని, తమ హయాంలో ఈ మొత్తం రూ.55వేల కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ఇదేనా కాంగ్రెస్ సమర్థత? అని ఎద్దేవా చేశారు.

"ఏడు గంటలు కరెంటు ఇస్తామని కట్టుకథలు ఇప్పుడూ చెప్పారు. అయితే మూడేళ్లలో కరెంటు సరిగ్గా లేక 30 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింది. ఇది నిజం కాదా?'' అని ప్రశ్నించారు. జలయజ్ఞంలో కోట్లు ఖర్చుపెడుతున్నట్లు లెక్కలు చెబుతున్నారని, అదే నిజమైతే ఆయకట్టు పెరగాలిగానీ ఎందుకు క్షీణి స్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఇవే చివరి రోజులు అని వ్యాఖ్యానించారు.

టీడీపీ ఎమ్మెల్యేల వంటా వార్పు హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం వంటా వార్పూ కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు వారు వంట చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

అలాగే.. బియ్యం, నూనెలు, పప్పు లు, కూరగాయలు వంటి వాటితో ఒక దుకాణం ఏర్పా టు చేసి వాటి ధరలను బోర్డులతో ప్రదర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కోళ్ళ లలితకుమారి, ఉమా మాధవరెడ్డి, సుమన్ రాథోడ్, కె.ఇ.ప్రభాకర్, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కూరగాయల దండలతో అసెంబ్లీలోకి వెళ్లాలని వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

నా ఆలోచనని కాపీ కొట్టారు


విశాఖపట్నం జిల్లాలో వచ్చే నెలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 'వస్తున్నా..మీకోసం' పాదయాత్రను చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు సమాయత్తం కావాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.  తమ పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ భేటీ కావాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల తొలి వారంలో చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా నుంచి జిల్లాలోని పాయకరావుపేటలో అడుగు పెట్టనున్నారు. చంద్రబాబు పాదయాత్రపై ఆ పార్టీ నాయకులు ఇప్పటికే రూట్‌మ్యాప్ ఖరారు చేయాల్సి వుంది. దీనిపై నాయకులు కొంతజాప్యం చేశారు.

'తమ్ముళ్లు తలోదారి' అన్న శీర్షికతో శనివారం ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో నాయకుల్లో కదలిక వచ్చింది. వెంటనే అధినేత పాదయాత్రకు రూట్‌ను ఖరారు చేయాలని నిర్ణయించారు. సమన్వయ సమావేశంలో పాల్గొనాలని రూరల్, అర్బన్ అధ్యక్షులు తమ పరిధిలోని నియోజవర్గ ఇన్‌చార్జీలకు ఇప్పటికే సమాచారం పంపించారు. పాయరావుపేటలో చంద్రబాబు అడుగుపెట్టినప్పటి నుంచి చివరి వరకూ పాదయాత్రకు సంబంధించిన రూట్‌ను ఖరారు చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు.

బాబు పాదయాత్రకు సన్నాహాలు

తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చే నెల మూడో తేదీ రాత్రి తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుని అక్కడ బసచేస్తారు. మరుసటి రోజు ఉదయం పాయకరావుపేట నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తాండవ, మాకవరపాలెం, కన్నూరుపాలెం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, సోమవరం, చూచుకొండ, గణపతి, హరిపాలెం, తిమ్మరాజుపాలెం, మునగపాక, అనకాపల్లి టౌన్, సబ్బవరం, పెందుర్తి మీదుగా విశాఖ నగరంలోకి ప్రవేశిస్తారు. అనంతరం గోపాలపట్నం, ఎన్ఎడీ జంక్షన్, కంచరపాలెం, జ్ఞానాపురం, పూర్ణామార్కెట్, జగదాంబ, ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలపాలెం, హనుమంతువాక మీదుగా భీమిలి నియోజకవర్గంలోకి అడుగు పెడతారు.విశాఖపట్నం

రెండు నెలల కిందట పెందుర్తిలో జరిగిన సంఘటనను విభేదించానే తప్ప పార్టీపై ఎప్పుడూ తాను పోరాటం చేయలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీపై కానీ, వ్యక్తులపై గాని పోరాడే వ్యక్తిత్వం తనది కాదన్నారు. అయితే సంఘటనపై విభేదిస్తానని చెప్పారు. కాగా గతంలో జరిగిన సంఘటన వివాదం ముగిసిందని, ఇకనుంచి అందరం కలిసికట్టుగా జిల్లాలో పార్టీని బలోపేతం చేసి 2014 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేయాలని సూచించారు. వచ్చే నెలలో జిల్లాలో చంద్రబాబు చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యాలయానికి అయ్యన్న 'రీ ఎంట్రీ' అంటూ 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన కథనంపై ఆయన స్పందిస్తూ... 1983లో పార్టీలోకి ఎంట్రీ అయ్యానని వివరణ ఇచ్చారు.

రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ మాట్లాడుతూ, వచ్చే నెలలో చంద్రబాబు పాదయాత్రకు అందరూ సహకరించాలని కోరారు. సుమారు పది రోజుల పాటు జిల్లాలో అధినేత పాదయాత్ర చేస్తారని, మే ఒకటితో చంద్రబాబు పాదయాత్ర ముగుస్తుందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ, రెండు నెలల కిందట జరిగిన సంఘటన తర్వాత మళ్లీ కార్యకర్తలు రాకతో కార్యాలయం కళకళలాడిందని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

సమావేశంలో సీనియర్ నేతలు పప్పల చలపతిరావు, ఆర్ఎస్‌డీపీ అప్పల నరసింహరాజు, గుడివాడ నాగమణిలతో పాటు కోన తాతారావు, పీలా శ్రీనివాసరావు, లాలం భాస్కరరావు, గుడివాడ అమర్‌నాథ్, పైల ముత్యాలనాయుడు, కళ్లేపల్లి విజయలక్ష్మి, కేకే రాజు, బొట్టా వెంకటరమణ, టాక్సీరాజు, పోతన్నరెడ్డి, పాశర్ల ప్రసాద్, మళ్ల అప్పలరాజు, విజయకుమార్, అన్నంరెడ్డి వాణి, తోట రత్నం, నర్గీస్, ప్రభావతి, గొర్లె వెంకునాయుడు, కాళ్ల శంకర్, సుజాత, పులి వెంకటరమణారెడ్డి, నీలాపు వెంకటరమణ, స్వర్ణలత నక్కా కనరాజు, నడిగట్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్ర రూట్ వివరాలు

విశాఖపట్నం:తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖ జిల్లాలో నిర్వహించనున్న 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. పది రోజులపాటు పది నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల దూరం ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తారు.

అక్కడి పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల మీదుగా విశాఖ నగరంలోనికి పాదయాత్ర సాగుతుంది. నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన అనంతరం భీమిలిలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుంచి విజయనగరం జిల్లాకు వెళతారని ప్రాథమిక సమాచారం.

జిల్లాలో చంద్రబాబు పాదయాత్రపై ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి రూరల్, అర్బన్ కమిటీల అధ్యక్షులు దాడి రత్నాకర్, వాసుపల్లి గణేష్‌కుమార్, పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, నాయకులు పప్పల చలపతిరావు, ఆర్ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు, గుడివాడ నాగమణి, కోన తాతారావు, పీలా శ్రీనివాసరావు, లాలం భాస్కరరావు, ఆడారి ఆనంద్, దేవరపుశివ, వినోద్‌రావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పాశర్ల ప్రసాద్, పుచ్చా విజయ్‌కుమార్, పోతన్నరెడ్డి, ఆవుగడ్డ అప్పలనాయుడు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు సంబంధించి తాత్కాలిక రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. దీనిపై నియోజకవర్గాల వారీగా నాయకులతో మంగళవారం నుంచి సమావేశమై మరింత విపులంగా చర్చించనున్నారు.

తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలోకి ప్రవేశించే ప్రాంతం పాయకరావుపేట కాకుండా నాతవరం మండలానికి మార్చాలని కొంతమంది నాయకులు కోరుతున్నారు. తుని నుంచి కాకుండా కోటనందూరు నుంచి చంద్రబాబు జిల్లాలోకి అడుగిడేలా రూట్ మార్చితే పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎక్కువ గ్రామాలు కవర్ అవుతాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ విధంగా మార్చితే చంద్రబాబు విశాఖ జిల్లాలోకి ప్రవేశం మరో ఒక రోజు ఆలస్యమయ్యే అవకాశం వుందని భావిస్తున్నారు.

జిల్లాలో అనకాపల్లి నుంచి సబ్బవరం మీదుగా పెందుర్తి వచ్చి నగరంలోకి ప్రవేశించేలా మరో ప్రతిపాదన చేశారు. ఇది కాకుండా అనకాపల్లి నుంచి పరవాడ, ఉక్కు నగరం, గాజువాక మీదుగా మరో రూట్ పరిశీలనలో వుంది. నగరం నుంచి భీమిలి నియోజకవర్గంలోకి వెళ్లాలంటే హనుమంతువాక నుంచి బీచ్‌రోడ్‌లోకి వెళ్లాలా? లేక ఆరిలోవ మీదుగా నీళ్ల కుండీల వైపు వెళ్లాలా? అన్నది పెండింగ్‌లో పెట్టారు. పెందుర్తిలో పాదయాత్రపై ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తితో చర్చించిన తరువాత నిర్ణయిస్తారు.

ప్రస్తుతం రూపొందించిన తాత్కాలిక షెడ్యూల్‌ను పార్టీ అధినేత చంద్రబాబుకు, పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. సాధారణంగా రూట్ వివరాలను చంద్రబాబే స్వయంగా పరిశీలించి అవసరమైన చోట మార్పులు చేస్తున్నారు. అందువల్ల ఆదివారం సమన్వయ కమిటీ సమావేశంలో రూపొందించిన రూట్ మ్యాప్‌లో మార్పులు చేర్పులు వుంటాయని రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు.

బాబు యాత్ర రూట్ ఖరారు


వర్గల్: టీడీపీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలంలోని మల్లారెడ్డిపల్లి, గుంటిపల్లి గ్రామాల్లో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన తర్వాతే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమాన హోదా లభించిందన్నారు. అదేవిధంగా చంద్రబాబు హయాంలో గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు, పాఠశాల భవనాలు నిర్మించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు 9 గంటలపాటు కరెంట్, ఎరువులు అందజేశామని చెప్పారు.

దీపం పథకం ద్వారా లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామన్నారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకులు గుండాలుగా వ్వవహరిస్తున్నారని ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. వారు ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు.

అనంతరం గుంటిపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ రాజ్యలక్ష్మీ రమేష్, శ్రీనివాస్, మల్లయ్య, బొమ్మవెంకయ్య, అయిలయ్య, యాదగిరి, స్వామి, చంద్రం, అర్జున్‌గౌడ్, స్వామి, కుమార్, కరుణాకర్‌రెడ్డి, అశోక్, రాజు, కనకయ్య తదితరులు ఇరవైమంది ప్రతాప్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ వర్గల్, గజ్వేల్ మండల అధ్యక్షులు యాదగిరిగౌడ్, ఉప్పల మెట్టయ్య, నాయకులు నాగరాజు, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్, అజీస్, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరిగౌడ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ హయంలోనే గ్రామాల్లో అభివృద్ధి

తొండంగి: మండలంలో చంద్రబాబు జరపనున్న వస్తున్నా మీ కోసం పాద యాత్ర రూటును ఆదివారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పరిశీలించారు. బెండపూడి మీదుగా చంద్రబాబు మండలంలోకి ప్రవేశించనున్నారు. అవసరమైతే రాత్రి బస ఏర్పాటు నిమి త్తం పీఈ చిన్నయ్యపాలెం సెంటర్ సమీపంలోని హైవే వ ద్ద పొలాలను పరిశీలించారు. రాత్రి బస ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది ఇంకా ఖరారు కాలేదని యనమల తెలిపారు.

పీఈ చిన్నయ్యపాలెం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం, పి.అగ్రహారం మీదుగా ఒక రూటు, అన్నవరం, గోపాలపట్నం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం పి.అగ్రహారం మీదుగా మరొకరూటు పరిశీలనలో ఉంది. దీనిలో ఏదో ఒక రూటు ఖరారు కానున్నది. ఆయన వెంట యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, పాలచర్ల సత్యనారాయణ,(ఎర్రబ్బు) తదితరులున్నారు

చంద్రబాబు యాత్రరూటు పరిశీలన

సిర్పూర్(యూ) : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే....టీడీపీ రైతుల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఈ ఫైల్‌పైనే బాబు మొదటి సంతకం పెడతారని అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అసాద్యమని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుందని, టీడీపీ అధికారంలోకి రాగానే రుణాలను మాఫీ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్ర భుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు.

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం భగవంత్‌రావు, కనక తుకారాంలు మాట్లాడారు.ప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. అవినీతి ప్రభుత్వానికి బుద్ది చే ప్పే సమయం అసన్నమైందన్నారు. కా ర్యక్రమంలో రాజారాం,బోజ్జురావు, భ లిరాం, గణపత్‌నాయక్, షేక్ కలీల్, జంగు, భీంరావు, నాందేవ్, గుణవంత్‌రావు, కిషన్, హతిరాం, ఆత్రం ఓంప్రకాష్, అ ర్క నాగోరావు, మెస్రం శేకు, తదితరులు పాల్గొన్నారు.

అధికారంలోకి వస్తే.. వ్యవసాయ రుణాల మాఫీ


గతేడాది కన్న ఈ సారి విద్యుత్‌కు కేటాయింపులు తగ్గించారని టీడీపీ ఎమ్మెల్యే అశోకగజపతి రాజు తెలిపారు. గత బడ్జెట్‌లో వ్యవసాయానికి 4.1 శాతం నిధులు ఇవ్వగా ప్రస్తుతం 3 శాతమే కేటాయించడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యుత్‌కు కేటాయింపులు తగ్గించారు:టీడీపీ